Leave
-
నేను లీవ్ అడిగితే ఇవ్వరా? ప్రభుత్వ ఉద్యోగి ఏం చేశాడో చూడండి!
కోల్‌కతా : అత్యవసర పని పడింది. నేను అడిగింది లీవే కదా. లీవ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి సహనం కోల్పోయాడు. తాను సెలవు అడిగితే ఉన్నతాధికారి కాదనడంతో కోపం కట్టలు తెంచుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉన్నతాధికారితో పాటు సహచర ఉద్యోగులపై దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో తిరుగుతూ కనిపించారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన కరిగరి భవన్‌లోని సాంకేతిక విద్యా విభాగంలో అమిత్ కుమార్ సర్కార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలాగే ఆఫీస్‌కు వచ్చిన కుమార్ లీవ్ కావాలని ఉన్నతాధికారిని అడిగారు. ఆ విషయంలో తన సహోద్యోగులతో గొడవ జరిగింది. ఈ గొడవలో అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో సహచర ఉద్యోగులపై దాడి చేశారు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లి పోయారు. వీపున బ్యాగు, రక్తంతో తడిసిన కత్తితో వెళ్తున్న అమిత్‌ను స్థానికులు వీడియోలు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్‌లో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు తన సహోద్యోగులతో సెలవు విషయంలో గొడవ పడ్డాడు. సెలవు నిరాకరించడానికి గల కారణం, సహోద్యోగులపై కత్తితో ఎందుకు దాడి చేశారో తెలియాల్సి ఉంది. నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్నాం. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తాం. కాగా, అమిత్ కత్తిదాడిలో జయదేబ్ చక్రవర్తి, శాంతను సాహా, సర్తా లేట్, షేక్ సతాబుల్ గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. -
స్విచాఫ్ ది ఫోన్! ఓపెన్ ది మైండ్!
ప్రస్తుత కాలంలో ఫోన్‌తోనే ప్రతి ఒక్కరికీ పని. స్మార్ట్ ఫోనే ఫ్రెండ్. ఫోనే పార్ట్నర్. సెల్లే సర్వస్వం. అయితే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఫోన్‌కి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తే..? వారాంతంలో ఓ రోజు పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్‌కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన ఊహించడానికే ఏదోలా ఉంది కదా... అదేం కాదు.. ఫోన్ లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం.చేతిలో ఫోన్ లేకపోతే మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం ఆరంభం అవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలుపెట్టే ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం. సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది.కానీ సమాధానమే తట్టదు. గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్కరోజైనా చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపుకు వచ్చేది.అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్‌తో ఎంగేజ్ అయి ఉంటాయి. అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది.ఒక గంటతో మొదలు పెట్టండి!వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే ‘ఫోన్ ఆఫ్‌లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్‌కు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి. -
మనం సెలవులు తీసుకోవడానికి కుదరదా చంద్ర!?
-
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్‌లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్‌గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్‌లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్‌గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్‌ఘర్‌కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్‌కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్‌లో పెళ్లి చేశారు. -
‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!
కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న జెన్ జీ(1995-2010 మధ్య జన్మించిన వారు) పంపిన లీవ్ లెటర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో లీవ్ లెటర్ అంటే ‘శ్రీయుత గౌరవనీయులైన..’ అని మొదలుపెట్టేవారు. కానీ పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టు ఆలోచనలు మారుతున్నాయి. అతిశయోక్తులకు తావు లేకుండా చెప్పాలనుకునే విషయాన్ని సూటిగా చెప్పే మనస్తత్వాన్ని జెన్‌జీ అలవరుచుకుంటోంది. ఏ విషయాన్ని వెల్లడించాలన్నా ఈ విధానాన్ని వీరు పాటిస్తున్నారు.ఇటీవల ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్న జెన్‌జీ లీవ్ కోసం తన పైఅధికారికి లీవ్ లెటర్ సబ్మిట్ చేశాడు. ఆ మెయిల్ చూసిన అధికారి దాన్ని స్కీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. దాంతో ఇది వైరల్‌గా మారింది. తనకు లీవ్ కావాలంటూ ‘Respected Sir..’ అంటూ సంప్రదాయ పద్ధతితో లెటర్ రాయడం మొదలు పెట్టకుండా నేరుగా ‘హాయ్ సిద్దార్థ్. నేను 8 నవంబర్ 2024న సెలవులో ఉంటాను. బై’ అని మెయిల్ చేశాడు. ఇదీ చదవండి: ట్యాక్సీ మాఫియానే ప్రధాన ఓటు బ్యాంకు!ఈ మెయిల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో చర్చసాగుతోంది. చాలా మంది నెటిజన్లు ఆ జెన్‌జీ ధైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మెయిల్ చూసి ఇంకొందరు రానున్న రోజుల్లో కార్యాలయ పనితీరు మారుబోతుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జెన్‌జీ కమ్యునికేషన్ శైలి ఎలా ఉండబోతుందో ఈ మెయిల్ ద్వారా తెలుస్తుందని ఇంకొందరు కామెంట్ చేశారు. ‘నేను ఈ లీవ్ లెటర్‌ను నా మేనేజర్‌కు పంపితే వెంటనే అతను నా ప్రవర్తనపై చర్చించడానికి హెచ్ఆర్తో సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు’ అని ఒక వ్యక్తి కామెంట్ చేశారు. -
సద్దుమణగని ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్లోని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్కుమార్జైన్కు లేఖ రాశారు. సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. సివిల్ డ్రెస్‌తో ధర్నా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్‌ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్‌తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. -
టీఎస్ఎస్పీ లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో నవంబరు ఒకటో తేదీ నుంచి అమలు కానున్న కొత్త లీవ్ మాన్యువల్ దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధానసంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై హరీశ్‌రావు ‘ఎక్స్’వేదికగా ఘాటుగా స్పందించారు. నెలరోజుపాటు కుటుంబాలకు దూరంగా ఉంచడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. పాత విధానంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి పంపే విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందన్నారు. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు.రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని, సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానిస్టేబుళ్ల సంక్షేమం గురించి మాట్లాడి, అధికారమొచ్చాక శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌కు యజమాని తాళం వేసే పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరుకుందన్నారు. రోజురోజుకు దిగజారిపోతున్న విద్యారంగంపై సీఎం దృష్టి సారించాలని చెప్పారు. లీవుల్లో ఎలాంటి షరతుల్లేవు: ఎస్కే జైన్, ఏడీజీ (టీఎస్ఎస్పీ) టీఎస్ఎస్పీ సిబ్బందికి సెలవుల జారీలో ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని టీఎస్ఎస్పీ ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్ ఒక ప్రకటన విడుదలలో తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న కథనంపై ఆయన స్పందించారు. అందరిలాగే వారికి కూడా సీఎల్స్, ఈఎల్స్ అన్నీ అడిగిన వెంటనే ఎలాంటి ఆంక్షల్లేకుండా ఇస్తున్నామన్నారు. మిగిలిన డిపార్ట్మెంట్లలా ఆదివారం వారాంతపు సెలవు కుదరని నేపథ్యంలో వారికి ఒకేసారి నాలుగురోజులపాటు రికార్డెడ్ పరి్మషన్ (ఆర్పీ) కింద సెలవు అనుమతిస్తున్నామని వివరించారు. ఈ సదుపాయం సివిల్, ఏఆర్, ఇతర ఏ పారా మిలటరీలోనూ లేదని గుర్తు చేశారు. సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
నెలకు ఒకసారే ఇంటికి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో లీవ్ (సెలవు) మాన్యువల్ మరోసారి చర్చనీయాంశం కానుంది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటమే ఇందుకు కారణం. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త మాన్యువల్ అమలు కానుండగా, తాజా నిబంధనలపై కానిస్టేబుళ్లలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారి కుటుంబాలు ప్రభుత్వం, అధికార వర్గా లపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ శ్రమ దోపి డీయేనని, బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాల్సిందిపోయి, ఒత్తిడి మరింత పెంచేలా కొత్త విధానా లకు శ్రీకారం చుట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పాత విధానం!హైదరాబాద్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్ఎస్పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్‌క్వార్టర్‌కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబుల్‌కు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకు తుందన్నమాట. అంటే ప్రతి కానిస్టే బుల్ 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళతారన్నమాట. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆల స్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్ బెటాలియన్ ఎదుట కానిస్టే బుళ్ల భార్యాపిల్లలు భారీయెత్తున ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్‌లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకా శం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం కానిస్టేబుళ్లకు దక్కేది.అగచాట్లు తప్పవా?⇒ దాదాపుగా పాత పద్ధతి తరహాలోనే ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటంతో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వారాలకు వారాలు భర్తలు తమకు, పిల్లలకు దూరంగా ఉండేలా చేస్తు న్న నిబంధనలపై భార్యలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కాపురాల్లో కలహాలకు కారణమై విడాకుల వరకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కుటుంబసభ్యులు అనా రోగ్యంతో బాధ పడుతున్నా ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటున్నామని కానిస్టే బుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజా ఆదేశాలు అమలైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు వీరికి స్థిరంగా విధులు ఎక్కడా ఉండక పోవడం కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రతి వారానికి లేదా 15 రోజులకు అప్పుడప్పుడూ ప్రతి రోజూ మారతాయి. ఇక సాధారణ ఎన్నికలు, విపత్తులు, అల్లర్లు చెలరేగినపుడు వీరంతా సెలవులు రద్దు చేసుకుని మరీ బందోబస్తు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మాన్యువల్‌పై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్చాలంటూ మరోసారి కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోవాలి⇒ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ బాధల్ని అసెంబ్లీ వేదికంగా లోకానికి చాటిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం సీఎం, హోంమంత్రిగా ఉన్నారని, ఆయన గతాన్ని గుర్తుచేసుకుని తమ విషయంలో పెద్దమనసు చేసుకో వాలని వారు కోరుతున్నారు. 26 రోజులకు ఒకసారి లీవు విధానం అమలు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, టీఎస్ఎస్పీ, సివిల్, ఏఆర్ బెటాలియన్లను కలిపి తమిళనాడు, కర్ణాటక తరహాలో ‘ఏక్ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలని, కుటుంబాలతో ఒకేచోట 3 నుంచి ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘సిక్‌లీవ్’ పెడుతున్నారా..?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులకు సిక్ లీవ్ (ఎస్ఎల్) అనేది ఒక హక్కు అన్నది తెలిసిందే. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా, సెలవు తీసుకోవాలంటే ‘ఎస్ఎల్’ అనేది ఓ తిరుగులేని ఆయుధంగా మారిన సందర్భాలు కూడా అనేకం. ఎంతటి కఠిన హృదయుడైన కంపెనీ యజమాని లేదా ఉన్నతస్థానంలో ఉన్న మేనేజర్లయినా.. ఉద్యోగుల ‘సిక్‌లీవ్’ను తోసిపుచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇక ముందు సిక్‌లీవ్ పెట్టాలంటే.. ఉద్యోగులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఎదుర్కొన్న అనుభవాన్ని చూశాక.. ఇతర ఉద్యోగులు సైతం సిక్‌లీవ్ పెట్టాలంటే ఆలోచించాల్సిందే. ఇక్కడ ఎదురైన అనుభవాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ సెలవు పెట్టేందుకు తప్పకుండా ఆలోచించ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు భారత్‌లో కూడా వస్తుందా? అనే విషయం మాత్రం.. వివిధ కార్పొరేట్ కంపెనీల తీరును బట్టి ఉంటుందనే అంచనాలకు ఇక్కడి ఉద్యోగులు వస్తున్నారు. అసలేం జరిగిందంటే..జర్మనీలోని బెర్లిన్‌లో టెస్లా కంపెనీ గిగా ఫ్యాక్టరీలో సిక్‌లీవ్ పెట్టిన ఉద్యోగుల ఇళ్లకు ఆ సంస్థ మేనేజర్లు వెళ్లి.. అసలు వారు నిజంగానే అనారోగ్యంతో ఉన్నారా? లేక ఎస్ఎల్ పెట్టేందుకు ఆ విధంగా అబద్ధం ఆడుతున్నారా? అని పరిశీలించారట.. దీంతో ఈ సంస్థ మేనేజ్మెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తమకు పనిఒత్తిళ్లు పెరగడంతో పాటు అధిక పని గంటలతో తరచూ అనారోగ్యం బారిన పడడంతో సిక్ లీవ్‌లు పెట్టక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని కార్మిక సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి.సిక్‌లీవ్‌లు తీసుకున్న ఉద్యోగులను తనిఖీ చేసేందుకు మేనేజర్లు వారి ఇళ్ల తలుపులు తట్టినపుడు, అధికారుల మొహాలపైనే తలుపులు మూసేయడమో, తిట్ల దండకం అందుకోవడమో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడమో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎల్లు తీసుకుంటున్నవారి సంఖ్య ఏకంగా 17 శాతానికి చేరుకోవడంతో.. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగుల ఇళ్లకు మేనేజర్లు వెళ్లడాన్ని తప్పుపట్టనవసరం లేదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. మరింత మెరుగైన పని సంస్కృతిని, ఉత్పాదకతను పెంచేందుకు సిక్‌లీవ్‌లు పెట్టే విషయంలో ఉద్యోగుల్లో తగిన మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.లీవు తీసుకోకుంటే వెయ్యి యూరోల బోనస్లీవ్లు తీసుకోని వారికి వెయ్యి యూరోలు బోనస్‌గా చెల్లించేందుకు కూడా టెస్లా సంసిద్ధత వ్యక్తం చేసింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం.. సిక్లీవ్లతో తలెత్తిన పరిస్థితిని, అందుకు దారితీసిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా స్పష్టం చేయడం గమనార్హం. ఉద్యోగులు అత్యంత కఠినమైన పని సంస్కృతిని అలవరుచుకోవాలని, డెడ్లైన్లు, ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు పనిచేసే చోటే కొంతసేపు కునుకేసినా పరవాలేదని మస్క్ గతంలో పేర్కొనడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఐతే సిక్లీవ్లకు సంబంధించి టెస్లా వివాదాస్పద విధానాలను అవలంబిస్తోందనే విమర్శలు మరోవైపు ఉండనే ఉన్నాయి. జర్మన్ కార్ల ప్లాంట్‌లో ఏటా పదిలక్షల కార్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ సప్లయ్ చెయిన్ సమస్యలు, ఉత్పత్తి నిలిచిపోవడం, డిమాండ్ తగ్గుదల వంటి కారణాలతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడం అక్కడ సమస్యగా మారింది. ఐతే టెస్లా తన విధానాలను గట్టిగా సమర్థిస్తూనే.. సెలవు తీసుకున్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడం అనేది జవాబుదారీతనం పెంపుదలకు అవసరమని నొక్కి చెబుతోంది. కానీ ఇలాంటి విధానాల వల్ల ఇప్పటికే అధిక పనివత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను మరింత ఆందోళనకు, చిరాకుకు గురిచేయడమే అవుతుందని యూనియన్లు, వర్కర్లు వాదిస్తున్నారు. -
సెలవుల విషయంలో కొత్త రూల్: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్
సిక్ లీవ్, పేరెంటల్ లీవ్ వంటి లీవ్స్ అన్నీ కూడా కంపెనీ విధివిధానాలు లేదా నియమాల మీద ఆధారపడి ఉంటాయి. లీవ్స్ విషయంలో కొన్ని కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తే.. మరికొన్ని కంపెనీలు ఉదారంగా ఉంటాయి. ఇటీవల ఓ కంపెనీ లీవ్స్ విషయంలో ఓ కొత్త రూల్ పాస్ చేస్తూ మెమో రూపొందించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన మెమోలో ''పిల్లల అనారోగ్యం'' ఉద్యోగి సెలవు తీసుకోవడానికి సరైన కారణం కాదని పేర్కొన్నారు. మీ పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాల్ చేసి లీవ్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే మేము మీ పిల్లలను పనిలో పెట్టుకోవడం లేదు. మీరే పనిచేయాలి. కాబట్టి ఈ కారణంతో లీవ్ తీసుకోవడానికి అవకాశం లేదు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఉద్యోగుల విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఆఫీసుకు తీసుకురావాలా? అంటూ కొందరు ప్రశ్నించారు. ఈ రూల్ ఏ కంపెనీ పెట్టిందో చెప్పండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీఉద్యోగులను పనిలో పెట్టుకునే ముందు.. వారికి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోండి. ముందు వెనుక ఎవరూ లేని అనాథలను మీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వండి. అప్పుడు సరిపోతుంది అంటూ ఓ యూజర్ తీవ్రంగా విమర్శించారు. -
104 రోజుల డ్యూటీ.. ఒక్క రోజే లీవు!
బీజింగ్: ఏకంగా 104 రోజులపాటు డ్యూటీ చేసిన చైనా వాసి, మధ్యలో ఒక్కటంటే ఒక్క రోజే సెలవు తీసుకున్నాడు. ఆపై, తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పరిహారంగా రూ.48 లక్షలు చెల్లించాలంటూ సంస్థ యజమానిని కోర్టు ఆదేశించింది. జెఝియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ ప్రాంతానికి చెందిన ఎబావో (30) వృత్తిరీత్యా పెయింటర్. గతేడాది ఓ కంపెనీతో ఆయన కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఆ మేరకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కడా విరామం లేకుండా పనిచేశాడు. మధ్యలో ఏప్రిల్ 6వ తేదీన మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25వ తేదీ నుంచి ఎబావో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మే 28వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ ఒకటో తేదీన మృతి చెందాడు. కుటుంబసభ్యులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. రోజుకు గరిష్టంగా 8 గంటల చొప్పున వారానికి 44 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఇందుకుగాను రూ.47.46 లక్షలు, ఎబావో కుటుంబానికి మానసిక వేదన కలిగించినందుకు అదనంగా మరో రూ.1.17 లక్షలివ్వాలని కంపెనీని ఆదేశించింది. -
విద్యార్థినులకు ‘ప్రత్యేక’ సెలవు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్ఎల్యూ) విద్యార్థినులకు నెలలో ఒక రోజు నెలసరి సెలవును ప్రకటించింది. కేవలం మెయిల్ ద్వారా ఈ ప్రత్యేక సెలవు తీసుకునే అవకాశం విద్యార్థినులకు కల్పించింది. ప్రస్తుత (2024–25) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నెలసరి సమయాల్లో మహిళల్లో వచ్చే కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.నెలసరి సమయాల్లో ఆరోగ్య సమస్యలతో విద్యార్థినులు కాలేజీకి వెళ్లడంలేదు. ప్రత్యేకంగా సెలవు కావాలంటే మెడికల్ సరి్టఫికెట్ సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక సెలవు కోరుతూ యూనివర్సిటీ విద్యార్థినులు గత విద్యా సంవత్సరంలోనే రిజి్రస్టార్ ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. జనవరిలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దేశంలో 8 యూనివర్సిటీల్లో అమలు ఇప్పటికే దేశంలోని 7 యూనివర్సిటీల్లో ఈ విధానం అమల్లో ఉంది. రాయిపూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ, ముంబై, ఔరంగాబాద్‌ల్లో ఉన్న మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీలు, భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ, జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని నల్సార్, అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడిíÙయల్ అకాడమీల్లో ఈ వి«ధానం అమలవుతోంది. దామోదరం సంజీవయ్య నేషనల్ లా వర్సిటీ ఎనిమిదోది. -
Chhattisgarh: నెలసరి సెలవు విధానం అమలు
ఛత్తీస్‌గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.హెచ్ఎన్ఎల్యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేయడం మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి. -
నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మహిళలకు ఉద్యోగ ప్రదేశాల్లో పీరియడ్ లీవ్స్(నెలసరి సెలవులు) ఇవ్వడం తప్పనిసరిగా చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ చేపట్టింది. నెలసరి సెలవులకు సంబంధించిన విధానాలను రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలకు పీరియడ్ సెలవులు తప్పనిసరి చేయడం వాళ్ల వారికి ఉద్యోగ అవకాశాలు దూరం చేసే ప్రమాదం ఉందని. ఈ విధానం ఇది వారికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇది కోర్టులు తేల్చాల్సిన విషయం కాదని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది.‘మహిళలకు నెలసరి సెలవులు మంచి నిర్ణయమే. కానీ నెలసరి సెలవులను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చు. కొన్నిసార్లు మనం చేసే మంచి ప్రయత్నాలు వారికి ప్రతికూలంగా మారవచ్చు.’ అని డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.ఈ సమస్య అనేక విధానపరమైన అంశాలతో ముడిపడి ఉందని, కోర్టు జోక్యం చేసుకోవల్సినది కాదని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృత చర్చలు జరిపి ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ‘ఈ పిటిషన్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖలోని కార్యదర్శి, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వద్దకు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతిస్తుంది. విధాన స్థాయిలో ఈ విషయాన్ని పరిశీలించి, అన్ని సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కార్యదర్శిని అభ్యర్థిస్తున్నాం.’ అని పేర్కొంది. అంతేగాక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తమ తీర్పు అడ్డు రాదని కోర్టు స్పష్టం చేసింది. చివరగా ఇది వాస్తవానికి ప్రభుత్వ విధానపరమైన అంశమని, ఈ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ.. ఈ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.కాగా గత ఫిబ్రవరిలోనూ మహిళా విద్యార్ధినిలకు, ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై కూడా విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది.ఇక ప్రస్తుతం బిహార్, కేరళ రాష్ట్రాలు మాత్రమే నెలసరి సెలవులు ఇస్తున్నాయి. బిహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజుల సెలవుల విధానం ఉండగా, కేరళలో మహిళా విద్యార్థులకు మూడు రోజుల సెలవులు ఇస్తోంది. -
లీవ్ అడిగిన పాపానికి..
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది. అలాగే హాస్పిటల్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ గౌస్‌పీర్‌ను వివరణ కోరగా పీహెచ్సీ డాక్టర్‌పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సాప్
న్యూఢిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ను సవాల్ చేస్తూ వాట్సాప్, మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.ఈ సందర్భంగా వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్లాట్‌ఫాంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని ఆదేశాలిస్తే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది.ఎన్క్రిప్షన్ తొలగించడమనేది వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని వాట్సాప్,మెటా ఆరోపించాయి.ముఖ్యంగా మెసేజ్ సెండర్ వివరాలను ట్రేస్ చేసే నిబంధనను సవరించాలని కోరాయి. విచారణ సందర్భంగా వాట్సాప్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘మెసేజ్‌ల గోప్యత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని మేం అమలు చేస్తున్నాం.సీక్రెసీ(రహస్యభద్రత) ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనల్లోని 4(2) సెక్షన్‌తో మేం ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు గనుక చెబితే మేం ఇండియా నుంచి వెళ్లిపోతాం’అని కోర్టుకు స్పష్టం చేశారు. -
సంతోషంగా ఉంటేనే విధులు.. లేకుంటే 10 రోజులు సెలవులు!
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రాముఖ్యత గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. పనితోపాటు కుటుంబంతో గడపడం, అభిరుచులు మొదలైనవాటికి ఒక రోజులో కొంత సమయం కేటాయించడం మధ్య సమతౌల్యాన్ని ఈ పదం సూచిస్తుంది. దీని గురించి బాగా ఆలోచించిన ఒక చైనీస్ రిటైల్ వ్యాపారవేత్త తన సంస్థలో "అన్హ్యపీ లీవ్" అనే భావనను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకుంటే విధులకు రాకుండా సెలవు తీసుకోవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. చైనాలోని రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యూ డాంగ్లాయ్ ఈ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇది సిబ్బంది తమ అభీష్టానుసారం 10 రోజుల అదనపు సెలవులు తీసుకుకోవడానికి అనుమతిస్తుంది. "ప్రతి సిబ్బందికి స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ వారు సంతోషంగా లేని సమయాలు ఉంటాయి, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే, పనికి రావద్దు" అని ఆయన చెప్పారు. సెలవులు తీసుకోవాలనుకునే ఏ ఉద్యోగికీ యాజమాన్యం నో చెప్పదని డోంగ్లాయ్ స్పష్టం చేశారు. "ఈ సెలవును యాజమాన్యం తిరస్కరించలేదు. తిరస్కరణ అనేది ఉల్లంఘన" అని ఆయన స్పష్టం చేశారు. -
ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ
దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్‌లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది. -
పెళ్లి సెలవును ఎగతాళి చేసిన బాస్.. ఉద్యోగి షాకింగ్ నిర్ణయం!
ఉద్యోగ జీవితం ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. దీనికి విఘాతం కలిగినప్పుడు కొంత మంది ఉద్యోగులు ధైర్యంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి ఓ ఉద్యోగి తన సోదరుడి పెళ్లి కోసం సెలవు అడిగితే ఇవ్వకపోగా ఎగతాళి చేసిన బాస్‌కు గట్టి షాక్ ఇచ్చాడు. ఇంతకీ అతను తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.. ఆస్ట్రేలియాలో నోయెల్ అనే ఉద్యోగి బాలీలో సోదరుడి పెళ్లి కోసం సెలవుకు దరఖాస్తు పెట్టకున్నాడు. అయితే అతని బాస్ సెలవును రద్దు చేయడంతోపాటు ఎగతాళి చేస్తూ పంపిన సందేశం చూసిన తర్వాత నోయెల్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి పెళ్లికి వెళ్లకపోవడం కంటే ఉద్యోగం వదిలేయడమే మేలని నిశ్చయానికి వచ్చాడు. ఆ బాస్ అంతలా ఏమి ఎగతాళి చేశాడు.. ఉద్యోగికి బాస్‌కి మధ్య జరిగిన సంభాషణపై మైఖేల్ సాంజ్ బిజినెస్‌మన్, ఔట్సోర్సింగ్ ఎక్స్పర్ట్ టిక్‌టాక్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. "ఈ వ్యక్తి పనిముట్టులా ఉన్నాడు. ఎటువంటి సంభాషణ లేకుండా ఆటోమేటిక్‌గా సెలవును రద్దు చేస్తున్నాడు" అంటూ జోడించారు. నిక్ అనే బాస్, అతని ఉద్యోగి నోయెల్ మధ్య సంభాషణ ఇలా ఉంది.. మరొక ఉద్యోగి రాజీనామా చేస్తున్నందున నోయెల్ సెలవు రద్దు చేస్తున్నట్లు బాస్ తెలియజేశాడు. ఇప్పటికే బాలీకి విమానాలకు టికెట్ల బుకింగ్ అయిపోయిందని, తన పిల్లలు వివాహ పార్టీలో ఉన్నారని తన సెలవులను రద్దు చేయొద్దని నోయెల్ బాస్‌ని వేడుకున్నాడు.ఏడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేశానని కాబట్టి రద్దు చేయడం వీలు కాదని అభ్యర్థించాడు. అయినప్పటికీ, బాలిని గమ్యస్థానంగా ఎగతాళి చేస్తూ సెలవును మూడు వారాల నుంచి మూడు రోజులకు తగ్గించుకోవాలని నోయెల్‌కు సూచించాడు. దీంతో కలత చెందిన నోయెల్.. ఇతర దేశాలను ఎగతాళి చేసే ఇలాంటి కంపెనీలోనా తాను పనిచేస్తున్నది అంటూ తాను ఈ రోజు నుంచే సెలవు తీసుకుంటున్నాని అంటే జాబ్ మానేస్తున్నానని బదులిచ్చాడు. బాస్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా ప్రతిస్పందించారు. నోయెల్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. -
‘అక్కడి నుంచి బయటపడండి’ మయన్మార్‌లోని భారతీయులకు హెచ్చరిక!
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్లైన్లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. 2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. -
ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్ చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్‌వాలిడిటేషన్ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. -
‘బాస్ తిక్క కుదుర్చిన ఉద్యోగి’.. ఇంతకీ ఏం చేసినట్లు!
చలిలో చమటలపడుతున్నాయ్. డాక్టర్‌కి చూపించుకుంటాను. ఒక్కరోజు లీవ్ కావాలి అంటూ ఉద్యోగి అడిగిన పాపానికి.. సదరు యజమాని అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దంటూ మొహం మీదే చెప్పాడు. ఆపై సంస్థకు రాజీనామా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగికి.. ఆయన టీంలో పనిచేసే ఉద్యోగికి మధ్య వాట్సప్ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి వాతావారణం ఎంత చల్లగా ఉన్న చెమటలు పడుతుంటాయి. ట్రీట్మెంట్ కోసం డాక్టర్‌కి దగ్గరికి వెళ్దామంటే చేతిలో చిల్లిగవ్వలేదు. చేసేది లేక మూడేళ్లు కాలం వెళ్ల దీశాడు. చివిరికి అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఇందుకోసం ఆఫీస్ బాస్‌కి మెసేజ్ చేశాడు సదరు ఉద్యోగి. అనారోగ్యంగా ఉంది. వీపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. మీరు ఒక్క రోజు లీవ్ ఇస్తే డాక్టర్‌కి చూయించుకుంటాను. డాక్టర్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు ఆఫీస్ బరిస్తుందా? అంటూ బాస్‌ను అడిగాడు. అందుకు ఆ బాస్.. మీరు అనారోగ్యంగా ఉన్నారని డాక్టర్ రాసిన లెటర్ ఇవ్వండి అని రిప్లయి ఇచ్చాడు. అందుకు ఉద్యోగి సార్ నాకున్న ఆర్ధిక ఇబ్బందుల వల్ల 3ఏళ్లగా డాక్టర్ దగ్గరికి వెళ్లలేకపోయాను. కానీ నిన్ననే కొంతమొత్తాన్ని చెల్లించి నేను డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నాను అని రాశాడు. ఉద్యోగి చేసిన వాట్సప్ మెసేజ్ దెబ్బకు బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్నాచితకా వాటికే లీవ్ పెడితే ఎలా? లీవ్ పెట్టుకో కాని నాకు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కావాలని అడిగాడు. దీంతో బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగి తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక, ఈ సంభాషణపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఉద్యోగికి అనారోగ్యం బాగలేనప్పుడు బాస్ తీసుకునే నిర్ణయాలు అసంతృప్తిగా ఉంటున్నాయి. మొత్తానికి ఉద్యోగి రాజీనామా చేసి బాస్ తిక్కకుదిర్చాడంటూ నెటిజన్లు రిప్లయి ఇస్తున్నాయి. -
టీమిండియా ఓటమికి ఉద్యోగులకు సెలవు
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని ఆశించిన భారతీయుల కల, కలగానే మిగిలిపోయింది. టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. గురుగ్రామ్‌కు చెందిన ఓ సంస్థ తన ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టీమిండియా ఓటమి వల్ల తమ ఉద్యోగులు బాధలో ఉంటారని భావించిన గురుగ్రామ్‌లోని 'మార్కెటింగ్ మూవ్స్ ఏజెన్సీ' సోమవారం సెలవు ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా ఆఫీసులకు రప్పించడం ఇష్టం లేకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంస్థలో పనిచేసే ఉద్యోగి దీక్షా గుప్తా లింక్డ్ఇన్లో పోస్ట్ చేసింది. ముందుగానే పరిస్థితిని అర్ధం చేసుకున్న కంపెనీ తమ ఉద్యోగులు టీమిండియా ఓటమి షాక్ నుంచి తేరుకునేందుకు సమయం ఇచ్చింది. నిన్నటి బాధ నుంచి కోలుకోవడానికి సెలవు తీసుకోండి, అని బాస్ పంపిన మెసేజ్ స్క్రిన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇదీ చదవండి: సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ నిజానికి ఎవరైనా మ్యాచ్ చూడటానికి సెలవు ఇస్తారు, కానీ ఓటమి నుంచి కోలుకోవడానికి కూడా సెలవు ప్రకటించడం అనేది హర్శించదగ్గ విషయమని పలువు నెటిజన్లు ఆ కంపెనీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీమిండియా ఓటమిని జీరించుకోలేక పలు చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. Boss ne sach me leave de di aaj😭 Healing Monday 🥹@iMarketingMoves #marketingmoves #INDvsAUS pic.twitter.com/Jc6M20Sia3 — Diksha Gupta (@thedikshagupta) November 20, 2023 -
36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్ ‘కడారి’
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఉద్యోగమంటే ఏడాదిలో చాలా సెలవులుంటాయి. అతి తక్కువ మంది ఈ సెలవుల వినియోగంలో పొదుపుగా వ్యవహరిస్తారు. అత్యవసరానికి తప్ప మరే పనికీ సెలవు పెట్టారు. కానీ కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే ఆశ్చర్యమే మరి. కాకినాడ జిల్లా విద్యాశాఖలో కడారి సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గొల్లప్రోలుకు చెందిన ఈయన 1987లో గ్రూప్–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల కాలంలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఈ నెల 30న రిటైర్ కానున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా, 2009లో తెలుగు అకాడమీ పురస్కారం సాధించారు. -
రామోజీ పైశాచికత్వం
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి? చంద్రబాబుతో, పవన్ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది. భార్య అనారోగ్యం అని చెప్పినా.... వాస్తవానికి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్ పేషెంట్‌గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది. అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు. కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్ ఇంటర్వ్యూలు... స్కిల్‌డెవలప్‌మెంట్‌పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి. దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్ పెద్ద సంస్థకాదా? సీమెన్స్ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్‌కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది. అవి షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్ పోరాట యోధురాలు ఇరోమ్ షర్మిల ద్వారా కూడా ట్వీట్ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది. అసలు ఇరోమ్ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్ మెసేజ్‌లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ 40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ భార్య కిరణ్మయి మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్ చెప్పారు. సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్‌ను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయన్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆమెను చూసుకునేందుకు రాహుల్ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. -
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
భారతీయులు నైగర్‌ను వీడాలని కేంద్రం ఆదేశం..
తిరుగుబాటుతో నైగర్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. నైగర్‌లో నెలకొన్న పరిస్థితులను కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోందని విదేశాంక శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం నుంచి ఎయిర్‌లైన్స్ వ్యవస్థను నిలిపివేసినట్లు అరిందమ్ బాగ్చి తెలిపారు. భూభాగం గుండా ప్రయాణిస్తున్నవారు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. నైగర్ వెళ్లదలచినవారు కూడా అక్కడ సాధారణ పరిస్థితుల నెలకొనేవరకు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. నైగర్‌లో దాదాపు 250 మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. #WATCH | MEA spokesperson Arindam Bagchi says, "Government of India is closely monitoring ongoing developments in Niger. In light of the prevailing situation, Indian nationals whose presence is not essential are advised to leave the country as soon as possible. They may bear in… pic.twitter.com/vjqzqxdyY2 — ANI (@ANI) August 11, 2023 నైగర్‌లో ఉన్న భారతీయులు మన దేశం చేపట్టిన ఇండియన్ మిషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, వారందరి బాధ్యతలను ఎంబసీ చూసుకుంటుందని అరిందమ్ బాగ్చి తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న భారతీయుల ప్రయాణానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భూభాగం ద్వారానే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నైగర్ ప్రెసిడెంట్ బజౌమ్‌ను తొలగించినట్లు ఆ దేశ ప్రెసిడెన్షియల్ గార్డ్ సభ్యులు జాతీయ టెలివిజన్‌లో జూలై 26న ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెన్షియల్ గార్డ్‌కు అధిపతిగా పనిచేసిన జనరల్ అబ్దురహమనే ట్చియాని నైజర్కు కొత్త సైనిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో తిరుగుబాటు మొదలైంది. ఇదీ చదవండి: Flying Kiss Row: 'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. -
కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పాటిల్ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. #WATCH | Maharashtra NCP (Sharad Pawar faction) President Jayant Patil on reports that he met Union Home Minister Amit Shah yesterday; says, "Who told you this? (that I met Amit Shah) You should ask those who are saying all this. Last evening I was there at the residence of… pic.twitter.com/CkJHnEFZIR — ANI (@ANI) August 6, 2023 ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్‌తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్‌పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్‌లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్‌లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్‌లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..!
యూపీలోని యోగీ సర్కారు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు శనివారం(ఈరోజు) సెలవును రద్దుచేసింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో ప్రారంభమయ్యే అఖిల భారత విద్యా సదస్సు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని యోగీ సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలలు తెరుచుకున్నాయి. జాతీయ విద్యావిధానం మూడో వార్షికోత్సవం సందర్భంగా 29న న్యూఢిల్లీలో నిర్వహించే అఖిల భారత విద్యా సమాఖ్య కార్యక్రమాన్ని యూపీలోని పాఠశాలలో ప్రసారం చేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూపీ డైరెక్టర్ జనరల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ప్రధానమంత్రి అఖిల భారత విద్యా సమాగమం ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌ను పాఠశాల స్థాయి వరకు వెబ్‌కాస్ట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సెషన్లో పాల్గొనే వారి వివరాలను నేటి సాయంత్రంలోగా విద్యా మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే అంతకుముందు యూపీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. తరువాత దానిని రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
ఆ వందేళ్ల అనకొండకు సెలవులిచ్చి, ఎందుకు పంపిస్తున్నారంటే..
అనకొండ.. ఈ పేరు వినగానే మన మదిలో మనుషులను మింగివేసే అత్యంత భారీకాయం కలిగిన పాము కనిపిస్తుంది. దీనిని మనం తొలిసారి హాలీవుడ్ సినిమా ‘అనకొండ’లో చూసివుంటాం. అయితే మనం ఆ సినిమాలో చూసినది యానిమేషన్ అనకొండ. అయితే ఇప్పుడు మనం అలాంటి నిజమైన అనకొండ గురించి తెలుసుకోబోతున్నాం. వందేళ్ల వయసుగల ఆ అనకొండకు ఇప్పుడు సెలవులిచ్చి వేరే ప్రాంతానికి పంపిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనకొండ ఎక్కడుందంటే.. ఈ అతిపెద్ద అనకొండ జర్మనీకి చెందిన ఫ్రాంక్‌ఫర్ట్‌లోని సెన్కెన్బర్గ్స్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ మ్యూజియంలో ఒక అనకొండ కాపిబారా(జంతువు)ను మింగేస్తూ కనిపిస్తుంది. దానిని చూడగానే అది నిజమేనని అనిపిస్తుంది. మ్యూజియంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈ అనకొండకు కొంతకాలం సెలవులిచ్చారు. దానిని వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. An exhibit of an anaconda devouring a capybara at the Senckenberg Natural History Museum in Frankfurt is undergoing restoration. Taxidermists say climate change is one of the reasons why it needs a makeover pic.twitter.com/KM1LataPZL — Reuters (@Reuters) July 6, 2023 ఈ మ్యూజియంలో ఇంకా ఏమి ఉన్నాయంటే.. ఈ మ్యూజియంలో ఈ అనకొండ మాత్రమే కాదు, వివిధ రకాల జీవుల శిలాజాలు కనిపిస్తాయి. అలాగే ఈ మ్యూజియంలో రకరకాల డైనోసార్లు కూడా ఉన్నాయి. We will be next. #ExtinctionRebellion #DieIn under dinosaurs at the @Senckenberg Natural History Museum in #Frankfurt, during the #MuseumsNight #ndmffm. @ExtinctionR @ExtinctionR_DE pic.twitter.com/jIlP4MOzJ8 — JuliaKrohmer (@JuliaKrohmer) May 12, 2019 అనకొండలో రకాలివే.. అనకొండ ప్రధానంగా నాలుగు రకాలు. ఇందులో గ్రీన్ అనకొండ, బొలీవియన్ అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ ఎల్లో అనకొండ ప్రముఖమైనవి. వీటిలో గ్రీన్ అనకొండలు అతిపెద్దవి. పరిమాణంలో ఎంతో బరువైనవి. గ్రీన్ అనకొండలు ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్, ఈక్వెడార్, పెరూ, కొలంబియా, వెనిజులా, సురినామ్, గయానా దేశాలలో కనిపిస్తాయి. మగ, ఆడ అనకొండల పొడవు విషయానికి వస్తే ఆడ అనకొండ.. మగ అనకొండ కంటే పొడవుగా ఉంటుంది. @jsnell @imyke my thought when you spoke of the snail and the pig on Upgrade. My favorite exhibit as a kid in the natural history museum in Frankfurt pic.twitter.com/TkhOGYLGJZ — Jenni Brehm (@Pfenya) May 13, 2018 ఇది కూడా చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. -
పని ఒత్తిడిలో పోలీసులు.. మున్నాళ్ల ముచ్చటగానే కేసీఆర్ ప్రకటన!
సాక్షి, నిజామాబాద్: పోలీసులు 24 గంటల పాటు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలు కా పాడుతుంటారు. ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరిగిన నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతుంటారు. పరిస్థితులను పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. విధి నిర్వహణలో వారికి విరామం లేకపోవ డంతో పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు. సిబ్బందికి సెలవులు ఇలా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత పోలీసులకు పని ఒత్తిడి కాకుండా వ్యక్తిగత పనులు చూసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు సెలవు విధానం ప్రవేశపెట్టి మురిపించింది. 2014 నవంబర్‌లో సీఎం కేసీఆర్ స్వయంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని ప్రకటించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను బట్టి వారంలో ఇద్దరు లేదా ముగ్గరికి సెలవు ఉండేవి. పోలీస్‌స్టేషన్‌లో ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు ఉంటే వారంలో ప్రతి ఒకరు ఒక రోజు సెలవు తీసుకునే అవకాశం ఉండేది. మిగిలిన పోలీసులు విధులకు ఉండేవారు. కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో ఎక్కువగా వారంతరపు సెలవులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు నెలలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ పాత విధానంలోనే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రకటన మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. పోస్టులు భర్తీ చేస్తేనే.. నిజామాబాద్ పోలీస్‌కమిషనరేట్ పరిధిలో సిబ్బంది కొరత ఉంది. కొత్త సిబ్బంది వస్తే వారంతరపు సెలవులకు అవకాశం ఉంటుందనే చర్చ పోలీస్‌శాఖలో జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో గడపాలని కోరుకుంటారు. విధి నిర్వహణలో పోలీసులకు టైమ్‌కు భోజనం దొరకని పరిస్థితి ఉంటుంది. దీంతో అనారోగ్యం బారిన పడిన సందర్బాలు ఉన్నాయి. సెలవులు ఉంటే పోలీసులకు విరామంతోపాటు పని ఒత్తిడిని సైతం తగ్గించినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నెలంతా విధుల్లోనే.. పోలీసు ఉద్యోగంలో 24గంటలు అందుబాటులో ఉ న్నా.. నెలలో నాలుగు రోజుల సెలవులు కూడా ఉండటం లేదు. అయినా ఉద్యోగులకు నెలకు నాలుగు రోజుల జీతం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. దీంతో ఆర్థికంగా శారీరకంగా, మానసికంగా, నష్టపోతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వం సెలవులకు అదనంగా చెల్లిస్తే బాగుంటుందని కొందరు పోలీసులు అంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి.. పోలీస్ కమిషనర్ డీసీపీలు – 3 జిల్లాలో పోలీస్స్టేషన్లు – 32 సివిల్ పోలీసులు ఏఆర్ పోలీసులు(ఆర్ముడ్ ) ఏసీపీలు 7 ఏసీపీలు 2 సీఐలు 26 ఆర్‌సీఐలు 5 ఎస్సైలు 81 ఆర్ఎస్సైలు 12 ఏఎస్సైలు 85 ఆర్‌ఏఎస్సైలు 34 హెడ్‌కానిస్టేబుల్స్ 200 ఆర్‌హెడ్‌కానిస్టేబుల్స్ 100 కానిస్టేబుల్స్ 679 ఆర్ముడ్ కానిస్టేబుల్స్ 283 ఓ పోలీసు సిబ్బంది మనోగతం.. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు ప్రతిరోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు వేరే చోట ఉండటం వారిని వారంలో ఒకసారి కలవడానికి వీలులేకుండా పో తుంది. అలాగే పిల్లల చదువు విషయంలో పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. సెలవులు ఇచ్చినప్పుడు వారానికి ఒకసారి వెళ్లి తల్లిదండ్రులను చూసేవాడిని ఇప్పు డు ఆ పరిస్థితి లేదు. విరామం లేని విధి నిర్వహణతో బంధువుల శుభకార్యాలకు సైతం వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. -
రిజిస్ట్రార్ కుర్చీ కోసం ఎత్తుకుపైఎత్తులు
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్ నియామకంలో బుధవారం హై డ్రామా నెలకొంది. వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ హైకోర్టు మధ్యంతర రద్దు ఉత్తర్వుల ఆధారంగా ఈసీ నియమించిన ప్రొఫెసర్ యాదగిరి స్థానంలో వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవిని నియమించారు. ఆమె బుధవారం ఉదయం ఓయూ నుంచి ఏడాది కాలానికి లీన్ తీసుకుని తెయూ రిజిస్ట్రార్‌గా సా యంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే పాలనాపరమైన కారణాల వల్ల లీన్‌ను రద్దు చేస్తూ బు ధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఆమెను యథాస్థానంలో తిరిగి చేరాలని కోరుతూ ఉత్తర్వులు జారీచేయడం కలకలం రేపింది. రిజిస్ట్రార్‌గా నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించక ముందే ఆమె లీన్ రద్దు చేస్తున్నట్లు ఓయూ జారీ చేసిన ఉత్తర్వులు అందినప్పటికీ వీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. నిర్మల రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించగానే వీసీ కార్యాలయం ద్వారా ఆగమేఘాలపై రిజిస్ట్రార్ సిగ్నేచర్‌ను బ్యాంక్ ఆథరైజేషన్ కోసం పంపించడం గమనార్హం. అయితే అప్పటికే బ్యాంకు పని వేళలు ముగియడంతో బ్యాంక్ అధికారులు సిగ్నేచర్ అథరైజేషన్ చేయలేకపోవడం కొసమెరుపు. వీసీ వర్సెస్ నవీన్ మిట్టల్ వ్యవహారం తెలంగాణ యూనివర్సిటీని మరింత వివాదంలోకి నెట్టేసింది. గత నెల 19న హైదరాబాద్‌లో జరిగిన 55వ తెయూ పాలకమండలి సమావేశాన్ని వీసీ వాకౌట్ చేయడం సంచనలం రేపింది. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటీ కరుణ, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, పాలకమండలి సభ్యులు రెండేళ్ల కాలానికి తెయూ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగిస్తూ, పాలకమండలి ప్రమేయం లేకుండా వీసీ రవీందర్ హయాంలో జరిగిన అక్రమ నియామకాలు, పదోన్నతులు, విచ్చలవిడి కొనుగోళ్తు, చెల్లింపులు, నిధుల దుబారా తదితర అంశాలపై విచారణ జరపాలని తీర్మానం చేశారు. వీసీ అధికారాలకు కత్తెర వేసి రిజిస్ట్రార్‌కు హక్కులు కట్టబెట్టారు. దీంతో ఈసీ నిర్ణయాలను వీసీ హైకోర్టులో సవాల్ చేశారు. తుది తీర్పు వచ్చే వరకు ఈసీ నిర్ణయాలను రద్దు చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం వీసీ రవీందర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏకంగా నవీన్ మిట్టల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం చెల్లదని, వారం రోజుల్లో ఓయూ నుంచి ఒకరిని రిజిస్ట్రార్‌గా నియమిస్తామని పేర్కొన్నారు. చెప్పినట్టే బుధవారం ఓయూ ఈసీఈ హెచ్‌వోడీ ప్రొఫెసర్ నిర్మల దేవిని తెయూ రిజిస్ట్రార్‌గా నియమించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఓయూ నుంచి లీన్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్మల దేవిని వెనక్కు తిరిగి రావాని కొత్త ఉత్తర్వులు జారీ కావడం సంచనలం కలిగించింది. రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ నిర్మల దేవి తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ ఎల్.నిర్మల దేవి నియామకమయ్యా రు. ఈ మేరకు బుధవారం సాయంత్రం వీసీ డి.రవీందర్ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. వెంటనే ఆమె రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నిర్మ ల దేవి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. నిర్మలదేవి 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. రిజిస్ట్రార్‌గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీచింగ్, నాన్–టీచింగ్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థ ముఖ్యమన్నారు. మీడియా నిజమైన వార్తలు ప్రచురించాలని వర్సిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వీసీ రవీందర్ మాట్లాడుతూ.. త్వరలోనే తెయూలో ఇంజినీరింగ్ కోర్సులు ప్రారంభిస్తామన్నారు. పరిశోధనలకు ప్రాధాన్యత నిచ్చే నిర్మల దేవిని రిజిస్ట్రార్‌గా నియమించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం వీసీ రవీందర్, రిజిస్ట్రార్ నిర్మలదేవిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ విషయమై నిర్మల దేవిని సంప్రదించగా ఓయూ నుంచి లీన్ అనుమతి ఇస్తేనే తాను తెయూ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించానని, రద్దు ఉత్తర్వులు తనకు తెలియవన్నారు. తెయూ రిజిస్ట్రార్‌గా కంటిన్యూ అవుతానని స్పష్టం చేశారు. అయితే లీన్ రద్దు చేసినా నిర్మల దేవి తిరిగి వెళ్లకపోతే ఓయూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. నేడు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం.. ఈసీ నిర్ణయాలను రద్దుచేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. వీసీ తెచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేస్తే (స్టే వెకేట్) మళ్లీ అప్పుడు రిజిస్ట్రార్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారనుంది. దీనికి తోడు శుక్రవారం తెయూ ఈసీ సమావేశం నిర్వహించనున్నారు. ముందు గా ఆన్లైన్లో వర్చువల్‌గా ఈసీ సమావేశం ని ర్వహించాలని భావించినా వర్సిటీలో జరుగుతు న్న పరిణామాలపై ఆగ్రహంగా ఉన్న ఈసీ స భ్యులు ప్రత్యక్షంగా సమావేశం జరపాలని భావి స్తున్నట్లు తెలుస్తోంది. వీసీ దుందుడుకు చర్య లు, నవీన్ మిట్టల్‌పై ఆరోపణలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. వీసీపై మరి న్ని చర్యలకు తీర్మానం చేసే అవకాశాలున్నాయి. రెండేళ్ల పదవీ కాలంలో వీసీ రవీందర్ ఆరుగురు రిజిస్ట్రార్లను మార్చారు. దీంతో వర్సిటీలో పాలన, టీచింగ్, పరిశోధన అటకెక్కాయి. తెయూ పాలకమండలి సభ్యుడు గంగాధర్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వీసీ రవీందర్ తన చర్యలతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఆమోదం లేకుండా నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన నిర్మల దేవి వర్సిటీ నిధుల్లో నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసక్తికర పరిణామాల మధ్య తెలంగాణ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్ నిర్మల దేవి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ పాలకమండలి నిర్ణయాన్ని కాదని యాదగిరి స్థానంలో ఆమెను వీసీ రవీందర్ నియమించారు. నిర్మల లీన్‌ను రద్దు చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ తెయూ వర్సిటీగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కొసమెరుపు. ఈ పరిణామాలతో పాలక మండలి, వీసీ మధ్య పోరు తారాస్థాయికి చేరినట్లయ్యింది. -
సెలవులపై ఇంటికొచ్చి మృత్యు ఒడికి.. విద్యుత్ షాక్‌తో జవాన్ మృతి..
సాక్షి, ములుగు: సెలవుపై ఇంటికి వచ్చిన ఐటీబీపీ జవాన్ విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని శ్రీరామ్‌నగర్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తాటి మహేంద్ర కుమార్ (29) ఐటీబీపీ 53 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఛత్తీ›స్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా సోంపూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది హనుమకొండ జిల్లాకు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. ఈ మధ్యనే వారికి పాప పుట్టింది. భార్యాబిడ్డలతో గడపాలని నెల రోజులపాటు సెలవు పెట్టి మార్చి 30న సొంత ఊరైన శ్రీరామ్‌నగర్ వచ్చాడు. శనివారం కూలర్‌లోని నీటిపంపు పనిచేయకపోవడంతో దానిని పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కుగురై మహేంద్ర కింద పడి పోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు మహేంద్రను మొదట వాజేడు, అక్కడినుంచి ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. మహేంద్ర కుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందిననట్లు తెలిపారు. బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చదవండి: తండ్రిని చంపిన కిరాతకుడు -
ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల ఆందోళన నేపథ్యంలో ఉద్యోగుల మెడపై ఉద్వాసనల కత్తి వేలాడుతోంది. తాజాగా చిప్‌మేకర్ ఇంటెల్ ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల జీతం లేని సెలవులతో వేలాదిమంది పారిశ్రామిక కార్మికులను ఇంటికి పంపిస్తోంది. క్లిక్ చేయండి: పాన్-ఆధార్ లింక్ చేశారా? లేదంటే భారీ షాక్ తప్పదు! డెడ్‌లైన్ ఎపుడో తెలుసా? తాజా మీడియా నివేదికల ప్రకారం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇంటెల్ కాలిఫోర్నియాలో 201 మంది ఉద్యోగులపై వేటు వేసింది. "వర్కర్ అడ్జస్ట్మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ల" ప్రకారం 111 మంది ఉద్యోగులను తొలగించగా, 90 మంది ఉద్యోగులను కంపెనీ హెడ్ క్వార్టర్ శాంటా క్లారా లొకేషన్ నుంచి బయటికి పంపింది. 2023 జనవరి 31 నుండి తొలగింపులు ప్రారంభం కానున్నాయి. 2025 చివరి నాటికి, ఇంటెల్ సంవత్సరానికి 8-10 బిలియన్ల డాలర్లమేర ఆదా చేయాలని భావిస్తోందట. (మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు: ఆలస్యం చేస్తే..!) ప్రస్తుత వాతావరణానికి తగినట్టుగా ఖర్చులను తగ్గించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అక్టోబరులో కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాల కాల్ సందర్భంగా, ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ వెల్లడించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీ విక్రయాలు పడిపోవడంతో ఇంటెల్ వేలాదిమందిని తొలగించనుందని గతంలోనే నివేదికలు వెలువడిన సంగతి తెలిసిందే. (5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదరిపోయే ఆఫర్లు) కాగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కనీసం 853 కంప్యూటర్ వ్యాపార సంస్థలు దాదాపు 137,492 మంది కార్మికులను తొలగించాయి. రానున్న ఆర్థిక మాంద్యం ఆందోళనల మధ్య ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెటా, ట్విటర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సహా అనేక ఇతర కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపులో ముందంజలో ఉన్నాయి. -
COP27: వేదికను వీడిన రిషి సునాక్.. అంతా షాక్
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాప్27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్స్ పార్ట్నర్షిప్ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్ అలాగే స్టేజ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్ తెలిపారు. UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX — Leo Hickman (@LeoHickman) November 7, 2022 సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్‌కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్‌లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్–ఎల్–షేక్‌లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్‌కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిషి సునాక్‌పై విమర్శల పర్వం! -
పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు
కరోనా మహమ్మారి దెబ్బకి డీలా పడ్డ రంగాల్లో ప్రధానంగా ఏవియేషన్ రంగం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విమానయాన సంస్థలకు తీరని నష్టాలు తీసుకొచ్చాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన సంస్థలకు.. ఆపై ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆర్థికంగా మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందు స్పైస్ జెట్ సంస్థ నిలిచింది. అకస్మాత్తుగా తన కంపెనీలోని 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి సాలరీ కూడా ఇవ్వరంటూ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనిపై ఓ పైలెట్ స్పందిస్తూ.. స్పైస్‌జెట్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు, కానీ సంస్థ 3 నెలల పాటు పైలట్లని ఇంటికి పంపాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మాలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మూడు నెలల తర్వాత కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుందని అనుకోవడంలేదు. ఇది ప్రస్తుతం తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతున్నప్పటికీ, తిరిగి పైలట్లను విధుల్లోకి తీసుకోవడం కష్టమేనన్నాడు. చదవండి: AirAsia: బంపర్ ఆఫర్, ఏకంగా 50 లక్షల టికెట్లు ఫ్రీ -
ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్
US Embassy in Kyiv, warning: రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు మరిన్ని దాడులకు తెగబడనున్నట్లు సమాచారం. దీంతో యూఎస్ ఎంబసీ మరోసారి తమ దేశ పౌరులకు హెచరికలు జారీ చేసింది. ఆగస్టు 24 బుధవారం ఉక్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అంతేగాదు మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం పౌరులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్ నుంచి బయలుదేరమని యూఎస్ పౌరులని కోరుతోంది. అదీగాక బుధవారం సోవియట్ పాలన నుంచి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన రోజు కూడా కావడంతో రాజధాని కీవ్ బహిరంగ వేడుకలను నిషేధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కి ముప్పు మరింత తీవ్ర స్థాయిలో ఉందని అధ్యక్షడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. (చదవండి: మృతి చెందిన పుతిన్ సన్నిహితుడి కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డు) -
వాట్సాప్ గ్రూప్.. ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఎగ్జిట్ అవ్వొచ్చు
ఫ్రెండ్స్.. ఫ్యామిలీస్.. ఆఫీస్.. అపార్ట్మెంట్స్.. ఇలా ఒకటో, రెండో.. కాదు పదుల కొద్దీ వాట్సాప్ గ్రూప్స్.. వందల కొద్దీ మెసేజీలు.. ఒక్కోసారి ఫొటోలు, వీడియోలతో మెమరీ నిండిపోతుంది. గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ అవుదామనుకున్నా.. ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో బలవంతంగా అయినాకొనసాగుతుంటారు. మరెలా..? ఏముందీ ఎవరికీ తెలియకుండా, గ్రూప్‌లో ఎగ్జిట్ నోటిఫికేషన్ రాకుండానే బయటపడొచ్చు. వాట్సాప్ త్వరలోనే ఈ వెసులుబాటును అందుబాటులోకి తేనుంది. ప్రస్తుతం బీటా వెర్షన్లలో కొందరికి ఈ ఆప్షన్ ఉన్నట్టు ‘డబ్ల్యూఏ బీటా ఇన్ఫో’ అనే టెక్ నిపుణుల బృందం గుర్తించింది. అయితే.. ఇలా ఎగ్జిట్ అయినట్టు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రం తెలుస్తుందట. గ్రూప్‌లో నోటిఫికేషన్ రాదని.. మెంబర్లకు తెలియదని నిపుణులు చెప్తున్నారు. బలవంతంగా గ్రూపుల్లో కొనసాగుతూ ఇబ్బందిపడుతున్నవారికి ఈ ఆప్షన్ బాగా తోడ్పడుతుందని అంటున్నారు. చదవండి: పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే అడ్మిన్లు డిలీట్ చేసేయవచ్చు వాట్సాప్ గ్రూప్‌లలో ఎవరు పెట్టిన పోస్టులను వారు మాత్రమే డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వివాదాస్పద, ఇబ్బందికర పోస్టులను పెడితే.. అవి గ్రూప్‌లో అందరికీ కనిపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరు పెట్టిన పోస్టులను అయినా అడ్మిన్లు డిలీట్ చేయగలిగే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ►వాట్సాప్‌లో 2 గిగాబైట్ల వరకు పరిమాణం ఉన్న పెద్ద ఫైల్స్‌ను పంపుకోవడానికి అవకాశం రానుంది. ►ఒకేసారి ఏకంగా 32 మందితో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్నీ వాట్సాప్ అందుబాటులోకి తెస్తోంది. ఏమిటీ బీటా వెర్షన్లు? వాట్సాప్ త్వరలో విడుదల చేసే వెర్షన్లను ముందుగా కొందరికి ప్రయోగాత్మకంగా అందిస్తుంది. వాటిలోని కొత్త ఆప్షన్లను వాడినప్పుడు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా మార్పులు చేయాలా అన్నది పరిశీలిస్తుంది. వీటినే బీటా వెర్షన్లు అంటారు. అన్నీ సరిదిద్దాక చివరగా మెయిన్ వెర్షన్‌ను వినియోగదారులందరికీ విడుదల చేస్తుంది. త్వరలో రాబోయే సదుపాయాలు ఇలా బీటా వెర్షన్లలో తెలిసిపోతుంటాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట -
సెలవు కావాలని వైరల్ లేఖ
యశవంతపుర: సినిమా చూడడానికి సెలవు ఇవ్వాలని సీసీబీ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాయగా సెలవు మంజూరైంది. జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆనంద భార్యతో కలిసి సినిమా చూడాలని అనుకున్నాడు. ఇందుకోసం లేఖ రాసి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో అది వైరల్ అయ్యింది. ఆరుగురికి గౌరవ డాక్టరేట్లు బుధవారం జరిగిన గుల్బర్గా వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ గెహ్లాట్ ఆరుమందికి గౌరవ డాక్టరేట్లను అందజేశారు. సిద్ధరామ శరణ, డాక్టర్ బసవరాజ పాటిల్ అట్టూర, వేణుగోపాల హేరూరు, గురమ్మ, అబ్దుల్లా కున్హి, రాధాకృష్ణ దేసిరాజులకు బహూకరించారు. ఈ సందర్భంగా పీజీ పట్టభద్రులకు పట్టాలు, ప్రతిభావంతులకు బంగారు పతకాలను అందజేశారు. చారిత్రక కోటను గవర్నర్ సందర్శించారు. (చదవండి: రోడ్డుపై అంకుల్ స్టెప్పులు.. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి..) -
సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్
Assam Govt Employees To Get Half-Day Leave To Watch The Movie: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సీనీ, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ సినిమాని ప్రశంసించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కశ్మీర్ ఫైల్స్’పై వినోదపు పన్నును తొలగించింది. ఇదిలా ఉంటే తాజాగా..ఈ సినిమా చూడడం కోసం అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఆశ్చరపరిచింది. ఈ సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్ చూపించి, లీవ్ అప్లై చేస్తే హాప్డే లీవ్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. 1980-90లలో కశ్మీర్లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వికేక్ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. -
నా కుక్కపిల్ల లేకుండా ఉక్రెయిన్ విడిచి రాను!: భారతీయ విద్యార్థి
Please Help Indian Student Stranded With Pet Dog: యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి తన పెంపుడు కుక్క లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించాడు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రేడియో ఎలక్ట్రానిక్స్‌లో చదువుతున్న రిషబ్ కౌశిక్ విమానంలో తనతోపాటు కుక్కపిల్ల కూడా వచ్చేలా అన్ని అర్హత పత్రాలను సంపాదించేందుకు ప్రయత్నించానని చెప్పాడు. మరిన్ని పత్రాల కోసం అధికారులను సంప్రదిస్తే వాళ్లు తనను కొట్టారని చెబుతున్నాడు. పైగా విమాన టికెట్టు అడుగుతున్నారని అన్నాడు. అయినా ఉక్రెయిన్ గగనతలం మూసివేసినపుడు తాను విమాన టిక్కెట్ ఎలా పొందగలను అని ప్రశ్నిస్తున్నాడు. కౌశిక్ ఢిల్లీలోని భారత ప్రభుత్వ యానిమల్ క్వారంటైన్ సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్)ని, ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించానని కానీ ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయానని చెప్పాడు. ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ఒకరికి కాల్ చేస్తే వారు తనని దుర్భాషలాడారని చెబుతున్నాడు. గత ఫిబ్రవరిలో ఖార్కివ్‌లో తనకు 'మాలిబు' అనే రెస్క్యూ కుక్కపిల్ల లభించిందని చెప్పాడు. కౌశిక్ రాజధాని కైవ్‌లోని ఒక బంకర్లో దాక్కున్నానని బాంబుల మోత, తుపాకుల మోతతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నానని అన్నాడు. "మీకు వీలైతే, దయచేసి మాకు సహాయం చేయండి. కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా మాకు సహాయం చేయడం లేదు. నాకు ఎవరి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు " అని అతను భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. (చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడి నాటి డ్యాన్సింగ్ వీడియో!) -
మెడికల్ లీవ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డీజీపీ మహేందర్‌రెడ్డి ఈనెల 18 నుంచి వచ్చే నెల 4 వరకు మెడికల్ లీవ్‌లో వెళ్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డీజీపీగా ఏసీబీ డీజీ అంజనీకుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సెలవు నుంచి వచ్చిన తర్వాత మహేందర్‌రెడ్డి డీజీపీగా తిరిగి బాధత్యలు స్వీకరిస్తారని అందులో వివరించారు. -
కరోనా బారినపడితే 7 రోజుల సెలవులు
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడిన సింగరేణి ఉద్యోగులకు వారం రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తున్నట్లు సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ వెల్లడించారు. కరోనా తొలి రెండో దశల్లో వైరస్ సోకిన ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా 14 రోజుల ప్రత్యేక సెలవును ఇచ్చామని, మూడో దశలో కరోనా మార్గదర్శకాలను కేంద్రం సడలించిందని పేర్కొన్నారు. ఏడు రోజుల ఐసోలేషన్ తర్వాత కోలుకున్న ఉద్యోగులు విధుల్లోకి రావొచ్చని, కరోనా పరీక్షలు అవసరం లేదన్నారు. సింగరేణిలో కరోనా పరిస్థితులపై సోమవారం కొత్తగూడెం నుంచి అన్ని ఏరియాల జీఎంలతో వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 913 యాక్టివ్ కేసులుండగా, అందులో 382 మంది ఉద్యోగులు, 415 మంది కుటుంబ సభ్యులు, 116 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. అన్ని ఏరియాలకు కావాల్సిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, మందులు, హోం ఐసోలేషన్ కిట్లు, శానిటైజర్లను సమకూర్చుతున్నామని జనరల్ మేనేజర్ కె.సూర్యనారాయణ వివరించారు. సమావేశంలో సింగరేణి భవన్ నుంచి జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాలకోటయ్య, కొత్తగూడెం నుంచి జీఎం (పర్సనల్), వెల్ఫేర్, సీఎస్ఆర్ కె.బసవయ్య, జీఎం(పర్సనల్), ఐఆర్, పీఎం అండ్ ఆర్సీ ఎ.ఆనందరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంథా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పంజాబ్‌లో టీకా తీసుకోకుంటే లీవ్‌పై వెళ్లాల్సిందే
చండీగఢ్: కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోకుండా తప్పించుకుంటు న్న వారిని, కనీసం ఒక్క డోసైనా తీసుకునే వరకు లీవ్‌పై పంపిస్తామని తెలిపారు. రాష్ట్రం లో కోవిడ్ వ్యాప్తిని నివారిం చేందుకు అమల్లో ఉన్న ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల సభలు, సమా వేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
పని తప్పించుకోవడం కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు..
సాధారణంగా మనం వారంలో ఆరు రోజులు కష్టపడి ఒకరోజు మాత్రం సెలవు తీసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకోవడమో లేక సరదాగా ఎంజాయ్ చేయడమో చేస్తుంటాం. కానీ కొందరికి మాత్రం కనీసం ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఉదాహరణకు ఒక ఉద్యోగి యజమాని పనిరాక్షసుడు అయితే మాత్రం ఆ ఉద్యోగులకు ఇక చుక్కలే.అయితే రోజులో ఎనిమిది గంటలే పనిచేయాలనే నిబంధనను కొందరు యజమానులు తుంగలో తొక్కి తమ ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుంటారు. ఆ సమయంలో తమకు కడుపునొప్పో.. జ్వరమో అని అబద్ధం చెప్పి పని నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అచ్చం అదే తరహాలో తాజాగా ఒక వ్యక్తి పని నుంచి తప్పించుకోవడానికి పెద్ద మాప్టర్ ప్లాన్ వేశాడు. సదరు వ్యక్తి ఒక సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అతని బాస్ ఎక్కువ పని చేయిస్తుండడంతో ఆ వ్యక్తి లీవ్ అడిగితే ఇవ్వడని.. బాస్‌ను ఫూల్ చేసి సెలవు దక్కించుకోవాలన్ని చూశాడు. అందుకోసం ఒక కస్టమర్ బిల్లు చెల్లించేందుకు రాగా.. ఆమె బిల్లును రెడీ చేస్తూ తలపట్టుకున్నాడు. కస్టమర్ క్రెడిట్ కార్డు ఇచ్చేలోపే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో షాకైన మహిళ కస్టమర్ ఓనర్‌ను పిలిచింది. ఓనర్ వచ్చి అతన్ని పక్కన కూర్చోబెట్టి కాసేపటి తర్వాత రెస్ట్ తీసుకోమని ఇంటికి పంపించేశాడు. అలా ఓనర్‌ను ఫూల్ చేసి సెలవు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా తాను చేసిన పనిని గొప్పగా చెప్పుకుంటూ రాసుకొచ్చాడు. ఒకవేళ మీరు కూడా పనినుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి పని చేయండి.. రిప్లై తొందరగా వస్తుంది. ఇక నా విషయం ఏంటంటే.. పనికి వచ్చే ముందు రోజు నాకు కాస్త మందు ఎక్కువైంది. ఆ హ్యాంగోవర్ పనికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. మా ఓనర్ సెలవు అడిగినా ఇవ్వడని తెలసి.. ఈ ప్లాన్ వేశాను అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 1 మిలియన్‌కు పైగా వీడియోనూ వీక్షించారు. చదవండి: గప్‌చుప్‌లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే What’s the best way you’ve ever blagged getting off work sick this is mine it was Boxing Day I was hungover and 18 and wanted to go out later so decided to pull this off 😭 made sure the manager was there as well pic.twitter.com/wIBuu2KWGL — elpedro ⭐️⭐️ (@ElpedroThe2nd) June 3, 2021 -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగులకు శుభవార్త..
ముంబై: కరోనా ఉదృతి నేపథ్యంలో మెజారిటీ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచి పని)కు వెసులుబాటు కల్పించాయి. కాగా ప్రస్తుతం వర్క్ ప్రమ్ హోమ్ ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఆఫిస్లో పనిచేసేటప్పుడు సహ ఉద్యోగులతో కలిసి కాసేపు రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉండేది. ప్రాజెక్ట్ ఒత్తిడి సమయంలో ఆఫీస్‌లో టీ, కాఫీలు సేవించేవారు. ఏదయినా ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమస్య ఉంటే సహ ఉద్యోగులతో చర్చించి పరిష్కారాన్ని కనుగొనే వారు. ఈ సమస్యలను గుర్తించిన ఐటీ కంపెనీల యాజమాన్యాలు ఆన్లైన్లో ఉద్యోగులకు పండగల (దీపావళి) టైయ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వచ్చే సమస్యలను చర్చించి, ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని తెలిపారు. ఉద్యోగులకు పండగ వేళ రిలాక్స్ కోసం ఐటీ యాజమాన్యాలు ఒత్తిడి నియంత్రణ ప్రోగ్రామ్స్‌ను ప్లాన్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నెలకు రెండు లీవ్‌లను కంపెనీలు అనుమతిస్తున్నాయి. గతంలో ఉద్యోగులు ప్రతి నెల లభించే లీవ్‌లను ఉపయోగించుకోకుండా ఏడాది చివరిలో ఒకేసారి భారీగా లీవ్‌లు తీసుకునే వారు. కానీ ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఉద్యోగులు ఒంటరిగా తమ డ్యూటీలు చేస్తున్నారు. అందువల్ల ఉద్యోగులు రిలాక్స్ కావడానికి యాజమాన్యాలు ప్రతి నెల లీవ్‌లు పెట్టుకోవడానికి అనుమతిస్తున్నాయి. (చదవండి: వర్క్ ఫ్రం హోమ్ ఎప్పటికీ కొనసాగుతుంది) -
పోలీసులకు మ్యారేజ్ డే సెలవు
సాక్షి, చెన్నై: విల్లుపురం జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా మ్యారేజ్ డే సెలవు మంజూరు కానుంది. బుధవారం ఎస్పీ రాధాకృష్ణన్ ఈ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సుమారు లక్షన్నర మంది విధుల్ని నిర్వర్తిస్తున్నారు. ఇందులో లక్ష మంది మేరకు పోలీసులు ఉన్నారు. వీరికి సెలవులు దొరకడం అరుదే. ఈ కరోనా కాలంలో అయితే, రేయింబవళ్లు శ్రమించక తప్పడం లేదు. సెలవుల కరువు, పనిభారం వెరసి అనేక మంది పోలీసులు మానసిక వేదనకు గురవుతున్నట్టుగతంలో వెలుగు చూసింది. ఇందుకు తగ్గట్టుగానే పలువురు బలన్మరణాలకు సైతం పాల్పడ్డారు. దీంతో పోలీసుల్లో మానసిక వేదనను తగ్గించే రీతిలో అప్పుడుప్పుడు ప్రత్యేకంగా యోగా క్లాస్‌లను సైతం నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో విల్లుపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణన్, కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇక, జిల్లా పరిధిలో ఉన్న పై స్థాయి అధికారి మొదలు, కింది స్థాయి పోలీసు వరకు వారి పెళ్లిరోజున సెలవు తీసుకునే అవకాశం కల్పించారు. జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అందరూ తమ మ్యారెజ్ డే రోజు వివరాలను జిల్లా కేంద్రానికి సమర్పించాలని ఎస్పీ రాధాకృష్ణన్ ఆదేశించారు. ఆయా సిబ్బంది మ్యారేజ్ డే రోజున శుభాకాంక్షలతో కూడిన కార్డును పంపించడమే కాదు, ఆ రోజు సెలవు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ బుధవారం ఐదు మంది సిబ్బందికి శుభాకాంక్షలతో కూడిన కార్డు, సెలవు మంజూరు చేశారు. కుటుంబాలతో గడిపేందుకు పోలీసులకు సమయం అన్నది అరుదేనని, అందుకే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని, ఈ ఒక్క రోజైనా కుటుంబీకులతో ప్రతి పోలీసు ఆనందంగా గడపాలని కాంక్షిస్తున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొనడం విశేషం. -
లీవ్ కోసం బాస్‌కు ఫేక్ ఫోటో.. పడిపడి నవ్వాల్సిందే
ఉద్యోగస్థులు అర్జెంట్‌గా సెలవులు కావాల్సినప్పుడు ఏ కడుపు నొప్పో అని, కాలు నొప్పో అని అబద్దాలు చెప్పి తప్పించుకోవడం సహజమే. కానీ ఓ యువతి మాత్రం ఆఫీసుకు డుమ్మా కొట్టడం కోసం వెరైటీ అబద్దం చెప్పి.. నెటిజన్లను తెగ నవ్వించింది. అంతలా నవ్వుకునే పని ఏం చేసిందని అనుకుంటున్నారా?.. ఆఫీసుకు వస్తుంటే టైరు పంక్చర్ అయిందని బాస్‌కు చెప్పింది. అక్కడితో ఆగకుండా ప్రూఫ్ కోసం టైరుకు మేకు గుచ్చుకున్న ఫొటోను తీసి బాస్‌కు పంపించింది. దీంట్లో నవ్వాల్సింది ఏముందని అంటారా.. ఆమె పంపింది నిజమైన ఫోటో కాదు.. ఫేక్ ఫోటో. దీనిని ఆమె కొలీక్ పసిగట్టి ట్వీట్ చేసింది. ‘అర్జెంటుగా అందరూ తమ పనులని కట్టిపెట్టి ఈ ఫోటోను చూడండి. ఇదీ నా సహోద్యోగి చేసిన నిర్వాకం. కారు టైరు పంక్చరైందని ఆమె మా బాస్‌కు ఓ ఫోటో పంపించింది. ఆ ఫోటోను కాస్త పెద్దదిగా చేసి చూడండి. టైర్లో దిగిన మేకును జాగ్రత్తగా గమనించండి. విషయం మీకే అర్థమవుతుంది’ అని ట్వీట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన నెటిజన్లు ఆ బొమ్మ నిజంకాదని పట్టేశారు. ఫోటోషాప్ ద్వారా ఆమె ఈ ఫేక్ చిత్రాన్ని సృష్టించదని తెలిసి.. ఆమె పడిన పాట్లకు పడపడి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు వేల్లల్లో లైకులు షేర్లు వచ్చిపడ్డాయి. ‘ఫేక్ ఫోటో పంపించేటప్పుడు ఇంకాస్త వెరైటీగా ఏమన్నా చేయొచ్చు కదా!’ అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. పంక్చర్ అతికించాను ఇక ఆపీస్‌కు రమ్మనండి అంటూ వెరైటీ ఫోటోలతో కామెంట్లు చేస్తున్నారు. my coworker called in (yet again) and said she had a nail on her tire that caused her to have a flat. i need everyone to stop what they’re doing and ZOOM IN TO THE NAIL IN THE PICTURE SHE SENT MY BOSS pic.twitter.com/4NcJGuvF4F — syd the kid (@sydneyywhitson) January 8, 2020 -
ఢిల్లీని వదిలేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి మరో నగరానికి తరలివెళ్లేందుకు 40%మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. 16% మంది ప్రజలు మాత్రం ఈ కాలంలోనే ఢిల్లీని విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ 17వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈమేరకు వెల్లడైంది. 31%మంది మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే ఉండి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్‌లు వినియోగించడం, మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 13%మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండాల్సి వస్తోందని, అయితే పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడం తప్ప తమకు మరోమార్గం లేదని తెలిపారు. గతవారం వాయుకాలుష్యాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నకు..13%మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యుల్ని కలిసినట్లు తెలిపారు. అయితే అప్పటికే వైద్యుల్ని కలిసిన వారిలో 29%మంది ఉన్నారు. వాయుకాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారెవరూ ఆస్పత్రికి గాని, వైద్యుల వద్దకు వెళ్లలేదని 44%మంది తెలిపారు. 14%మంది మాత్రమే వాయుకాలుష్యం వల్ల తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వర్షం పడినప్పటికీ కాలుష్యం తారాస్థాయిలోనే ఉంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ ప్రజారోగ్యంపై అత్యవసరస్థితిని ప్రకటించడంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. అదేవిధంగా ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్యకలాపాల్ని ఈపీసీఏ నిషేధించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత మళ్లీ... కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం మేరకు ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 494గా నమోదైంది. నవంబర్ 6, 2016న ఇది 497గా ఉండగా, మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సూచీ నమోదైంది. ఈ సూచీ అధికస్థాయిలో పూసా ప్రాంతంలో 495, ఐటోలో 494, మండ్కా, పంజాబీ భాగ్ ప్రాంతాల్లో 493గా ఉంది. నిర్ధారిత ఏక్యూఐ ప్రామాణికాలివీ.. సూచీ 0–50 మధ్య ఉంటే మంచిగా ఉన్నట్లు, 51–100 సంతృప్తికర స్థాయి, 101–200 మోస్తర్లు, 201–300 బాగోలేదని, 301–400 అస్సలు బాగోలేదని, 401–500 అథమస్థాయి, 500 కంటే పైన తీవ్రమైన అథమస్థాయిగా పరిగణిస్తారు. -
అధికారి అమెరికాలో.. విచారణ చిత్తూరులో..
చిత్తూరు, బి.కొత్తకోట: ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కోసారి వింతగా ఉంటాయి. అందులో గురువారం గృహ నిర్మాణశాఖ జారీ చేసిన ఉత్తర్వు ఒకటి. అవినీతికి పాల్పడిన శాఖ అధికారులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా విచారణ అధికారిని, ప్రజెంటింగ్ అధికారిని నియమించారు. అయితే ప్రజెంటింగ్ అధికారిగా గృహ నిర్మాణశాఖ చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌ను నియమించారు. నగేష్ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతితో రెండునెలల సెలవు తీసుకున్నారు. ఆయన స్థానికంగా లేనప్పటికీ ఆయనను నియమించడం గమనార్హం! దీంతో ఆయన తిరిగి విధుల్లో చేరేదాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. నగేష్ జనవరి 15 నుంచి మార్చి 15 వరకు సెలవు మంజూరైనట్టు తెలుస్తోంది. సెలవుపై ఆయన అమెరికా వెళ్లి అక్కడే ఉన్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అంటే ఆయన సెలవు ముగించుకున్నాక విధుల్లో చేరనున్నారు. అప్పటి వరకు ఆరోపణలున్న అధికారులపై విచారణ, చర్యల నిర్ధారణ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అధికారులు వీరే ఇందిరమ్మ పథకం అమలు సమయంలో జిల్లాలో పనిచేసిన, ప్రస్తుతం ఉద్యోగోన్నతి పొందిన అధికారులపై అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో అప్పటి ఆర్సీపురం ఏఈ టీ.ఈశ్వరప్రసాద్ (ప్రస్తుతం పుత్తూరు), శ్రీకాళహస్తి ఏఈ ఆర్.జానకిరామిరెడ్డి (ప్రస్తుతం శ్రీకాళహస్తీ డీఈ), తొట్టంబేడు ఏఈ ఏసీ.సుబ్బారెడ్డి (ప్రస్తుతం కర్నూలు జిల్లాలో డీఈ), నాగలాపురం ఏఈ బి.శ్రీనివాసులు (ప్రస్తుతం నిండ్ర), బీఎన్‌కండ్రిగ ఎంఐసీ జీవీఎస్.మురళి (ప్రస్తుతం తిరుపతి ప్రాజెక్టులు), నగరి ఏఈ ఎన్.భాస్కర్ (ప్రస్తుతం బైరెడ్డిపల్లె), విజలాపురం ఏఈ పి.వెంకటేశ్వర్లు (ప్రస్తుతం జీడీనెల్లూరు డీఈ), నిండ్ర ఎంఐసీ ఏఎం.సురేంద్రనా«థ్ (ప్రస్తుతం పాకాల), నిండ్ర ఎంఐసీ టీకేఎస్ఎస్.కుమార్ (ప్రస్తుతం నాగలాపురం), వడమాలపేట ఎంఐసీ ఏ.దామోదర్ (ప్రస్తుతం పుత్తూరు) ఉన్నారు. వీరు పనిచేసిన మండలాల్లో ఇందిరమ్మ పథకం అమలులో అక్రమాలు చోటుచేసుకొన్నట్టు విచారణలో తేల్చారు. వీరిపై శాఖాపరంగా తదుపరి చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గురువారం గృహ నిర్మాణశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరిపై నివేదించిన ఆరోపణలపై శాఖ ఎస్ఈ కే.వెంకటరెడ్డిని విచారణ అధికారిగా నియమించగా అవినీతి ఆరోపణలపై ఏఏ చర్యలు చేపట్టాలో తేల్చి నివేదించే బాధ్యతను చిత్తూరు ఈఈ బీవీ.నగేష్‌కు అప్పగించారు. -
ఏటా 20 ఈఎల్స్ వాడాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఏడాదిలో 20 ఎర్న్›్డ లీవులు(ఈఎల్స్–ఆర్జిత సెలవులు) తప్పనిసరిగా వాడుకోవలసి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో అదనపు భత్యం కింద వీటిని దాచుకోవడానికి ఇకపై వీలుండదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 30 ఈఎల్‌లు ఉంటాయి. ఇకపై ఏడాదికి పది ఈఎల్స్ మాత్రమే తర్వాతి సంవత్సరం సెలవుల్లో కలుస్తాయని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయనుంది. అంటే మిగతా 20 సెలవులను వాడుకోకుంటే వృథా అవుతాయి. ప్రభుత్వ బ్యాంకులు గత ఏడాది చివరి నుంచే ఈ పద్ధతిని అమలు చేస్తున్నాయి. తమ సిబ్బందిని కచ్చితంగా పది రోజులు సెలవుపై పంపుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 3.5 కోట్ల ప్రభుత్వ ఉద్యోగుల భత్యాల చెల్లింపు కోసం దాదాపు రూ.63,232 కోట్లు కేటాయించింది. -
సెలవు ఇవ్వలేదని ఇంజినీర్ ఆత్మహత్య
అన్నానగర్: పళణిలో అధికారి సెలవు ఇవ్వలేదనే మనస్తాపంతో శనివారం విద్యుత్‌శాఖ సహాయ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని అపార్టుమెంట్‌కి చెందిన ధనపాలన్ (57). ఇతను దిండుక్కల్ జిల్లా పళణి సమీపం ఆయక్కుడి విద్యుత్‌శాఖ కార్యాలయంలో సహాయ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం పళణి రైల్వేపీటర్ రోడ్డు వద్ద ఉన్న పెరియాత్తా కాలనీలో ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం ధనపాలన్ ఎప్పటిలాగే పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తరువాత అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ధనఫాలన్‌ను చూడడానికి అక్కడికి వచ్చాడు. అప్పుడు లోపలి భాగం తలుపులు మూసి కనిపించాయి. అతను చాలాసేపు తలుపులు తట్టినా ధనపాలన్ తెరవలేదు. అనుమానంతో ఆ వ్యక్తి కిటికీలో నుంచి లోపలికి చూడగా.. ధనపాలన్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో పళణినగర్ పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పళణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ధనపాలన్ నివసిస్తున్న ఇంటిని పరిశీలించగా అతను రాసిన లేఖ లభించింది. అందులో ‘ప్రియమైన అమ్మ. నేను మీ దుఃఖ కార్యక్రమానికి రాలేకపోతున్నాను. నా పై అధికారి సెలవు ఇవ్వడంలేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసి ఉంది. పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నారు. -
అధికారులే.. టార్గెట్
బి.కొత్తకోట: ములకలచెరువు తహసీల్దార్ కార్యాలయాన్ని ఈనెల 8న స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముట్టడించి తాళాలు వేసిన ఘటనలో అధికారులే బలి పశువులు అవుతున్నారు. తహసీల్దార్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదు నమోదైతే మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తామని మండల నేతలు మంత్రి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు అల్టిమేటమ్ ఇవ్వడమే ఈ పరిస్థితి కారణంగా తెలుస్తోంది. శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని ఉన్నతాధికారులు చిత్తూరుకు బదిలీ చేయగా తహసీల్దార్ అమరేంద్రబాబు సోమవారం నుంచి 15 రోజులు సెలవులో వెళ్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. వివరాల్లోకి వెళితే.. తహసీల్దార్ అమరేంద్రబాబు సమస్యలను పరిష్కరించడం లేదంటూ 8వ తేదీన మండలానికి చెందిన టీడీపీ నాయకులు, తహసీల్దార్ కార్యాలయానికి తాళంవేశారు. దీంతో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సిబ్బంది కార్యాలయంలోనే సాయంత్రం ఉండిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ ఆందోళన నిర్వహించారు. దీంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేయడం కోసం నాయకులు ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి చిత్తూరు వెళ్లి కలెక్టర్‌ను కలిసినా సానుకూల స్పందనరాలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన నాయకులు కేసు నమోదు చేస్తే మూకుమ్మడిగా పార్టీకి రాజీనా మాలు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి అమరనా«థ్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌కు తేల్చిచెప్పడంతో కేసు నమోదు పెండింగ్‌లో పడిందని తెలిసింది. ఇంతలో జిల్లా అధికారులు శనివారం డిప్యూటీ తహసీల్దార్ నిర్మలాదేవిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఆమె బదిలీ అయిన మరుసటి రోజు ఆదివారం తహసీల్దార్ అమరేంద్రబాబు సుదీర్ఘ సెలవులోకి వెళ్లడం చర్చ నీయాశమైంది. కాగా గురువారం రోజే అమరేంద్రబాబును జిల్లా అధికారులు చిత్తూరుకు పిలి పించుకొని వివరాలు సేకరించారు. దీంతో ఆయన ఈనెల 15 నుంచి వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని భావిస్తున్నారు. పంతం నెగ్గుతుందా? మండలానికి చెందిన కొందరు టీడీపీ నేతలు తహసీల్దార్‌ను బదిలీ చేయించి ఆయన స్థానంలో ఇటీవల డీటీగా వచ్చిన నిర్మలాదేవిని ఇన్చార్జిగా నియమించుకోవాలని యత్నించినట్టు తెలిసింది. అది సాధ్యం కాకపోవడంతో ఆందోళనకు దిగారు. అయితే కేసు నమోదు వరకు పరిస్థితి వెళ్లడంతో రాజకీయ వివాదం నెలకొంది. ఇదిలా ఉండగా బదిలీ అయిన నిర్మలాదేవి స్థానంలో కొత్త డీటీగా వచ్చిన వెంకటరెడ్డి సెలవురోజైనా.. ఆదివారమే ఆVýæమేఘాలపై బాధ్యతలు చేపట్టడం కొసమెరుపు. -
కొచర్ సెలవుపై రగడ.. వివరణ ఇచ్చిన బ్యాంక్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) చందా కొచర్‌ను స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యేవరకు సెలవు మీద వెళ్లాల్సిందిగా బ్యాంక్ బోర్డు ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ కథనాలను బ్యాంక్ బోర్డు తోసిపుచ్చింది. ‘ఇండిపెండెంట్ బోర్డు విచారణ పూర్తయ్యేంతవరకు కొచర్‌ను సెలవు మీద వెళ్లాల్సిందిగా మేం కోరినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. ఆమె వార్షిక సెలవులో ఉన్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే కొచర్ సెలవు తీసుకున్నారు. అంతేకానీ ఇందులో ఎలాంటి బలవంతం లేదు’ అని బ్యాంక్ బోర్డు పేర్కొంది. చందా కొచర్ వారసులను ఎంపిక చేసేందుకు ఎలాంటి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయలేదని కూడా స్పష్టం చేసింది. కాగా వీడియోకాన్ గ్రూప్‌నకు రుణ మంజూరీ విషయంలో చందా కొచర్ క్విడ్ ప్రో కో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచర్‌పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బ్యాంకు బోర్డు ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. -
అలసిపోతున్న నాలుగో సింహం
సెలవు.. ప్రభుత్వ ఉద్యోగి హక్కు. అత్యవసర సేవల్లాంటి పోలీసు విభాగంలో సెలవు పేరెత్తే అర్హత ఏ ఒక్కరికీ ఉండదు. ఎండలో నిలబడి ట్రాఫిక్ విధులు, అడవుల్లో కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వేట, ఆర్ఐల వద్ద ఆర్డర్లీ డ్యూటీలు.. ఇన్నింటి నుంచి కాస్త ఉపశమనం ఇచ్చే వారాంతపు సెలవుజిల్లాలోని ఏ ఒక్క కానిస్టేబుల్‌కు అమలుకావడం లేదు. ఇదే సెలవు మంజూరుకాక చిత్తూరులో పనిచేసే కానిస్టేబుల్ రాజశేఖర్ గత సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అధికారుల ఆలోచనా విధానాన్ని మార్చాలని పోలీసులు బయటకు చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నారు. చిత్తూరు అర్బన్: వేళాపాళాలేని విధుల్లో నలిగిపోతున్న పోలీసులు వ్యక్తిగత జీవితానికి ఎప్పుడో దూరమైపోయారు. ఇంట్లో తల్లిదండ్రులు, భార్య పిల్లలకు ప్రేమను పంచడం, వాళ్ల ప్రేమను పొందడం అసాధ్యం అనే స్థితిలో ఉండిపోయారు. ఆదివారం వస్తే కుటుంబ సభ్యులతో సరదాగా ఓ సినిమా, పార్కుకు వెళదామంటే కుదరని పరిస్థితి. పిల్లలు ఏం చదువుతున్నారు..? ఎవరితో తిరుగుతున్నారు.? వారి ఇష్టాఇష్టాలు తెలుసుకునే పరిస్థితి కూడా చాలా మందికి ఉండడం లేదు. కొన్నిసార్లు పనిలో అధికారుల నుంచి ఎదురయ్యే చీవాట్లు, ఛీత్కారాలను ఇంట్లో భార్యాపిల్లలపై చూపించేవాళ్లు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. తండ్రి కుటుంబంపై దృష్టి పెట్టకపోవడంతో చెడుదారిని ఎంచుకునే పిల్లలూ ఉన్నారు. చిత్తూరులో ఓ ఏఎస్ఐ కొడుకు తొమ్మిదో తరగతిలోనే తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి జువైనెల్‌హోమ్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం. ఏఆర్ ప్రక్షాళన ఎప్పుడో? సివిల్ పోలీసులతో పోలిస్తే ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగంలోని కానిస్టేబుళ్లకు కాస్త తీరిక ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ వాస్తవంగా చూస్తే ఎక్కువ మంది సిబ్బంది అణిచివేత కు గురయ్యేది ఏఆర్ విభాగంలోనే. అంతర్ జిల్లా ల నుంచి ఇక్కడ విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు పండగలకు, పబ్బాలకు నాలుగు రోజులు సెలవు అడిగితే డీఎస్పీ నుంచి ఆర్ఐ వరకు అగ్గిమీద గు గ్గిలమవుతారు. ప్రముఖుల వద్ద గన్‌మాన్ డ్యూటీలు కావాలంటే ఇక్కడ పనిచేసే అధికారులకు నెలసరి మామూళ్లు ఇవ్వాల్సిందే. ఏదైనా పనిష్‌మెం ట్లు ఉన్న కానిస్టేబుళ్లు వాటిని క్లియర్ చేసుకో వాలన్నా పైసలు ముట్టజెప్పాల్సిందే. ఇన్ని అభియోగాలు, ఆరోపణలు వస్తున్నా ఏఆర్ విభాగంలో ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయిన అధికారులను బదిలీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒత్తిడితో విధులు.. చిత్తూరు, తిరుపతి పోలీస్ జిల్లాల్లో రెండు వేర్వేరు సమయాల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. చిత్తూరు నగరంలోని స్టేషన్లలో ఓ కానిస్టేబుల్ ఉదయం ఏడు గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వెళతాడు. ఇదే వ్యక్తి రాత్రి 9 గంటలకు డ్యూటీ ఎక్కి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు స్టేషన్లలో పనులు చేయాలి. 24 గంటల్లో 16 గంటల పాటు స్టేషన్లో ఉండాల్సిందే. మిగిలిన ఎనిమిది గంటల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం, తినడం, స్టేషన్‌కు వెళ్లే సమయం రెండు గంటలవుతుంది. ఉన్న ఆరు గంటలు నిద్రపో వాలి. ఇంతలో మళ్లీ స్టేషన్ నుంచి కబురొస్తే వెళ్లాలి. ఇలాంటి టైమ్ టేబుల్లో సగటు కానిస్టేబుల్ కుటుంబంతో గంట కూడా గడపలేని పరిస్థితి. ఏఆర్ విభాగంలో ఇదే పరిస్థితి. 24 గంటల్లో మూడు గంటలు చొప్పున రెండుమార్లు విశ్రాంతి తీసుకుని విధులు ఉన్నా, లేకున్నా హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన దుస్థితి. డీజీ దృష్టికి తీసుకెళ్తాం మాకూ తప్పనిసరిగా వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాల్సిందే. అ త్యవసరం అంటే చెప్పం డి.. చేస్తాం. కానీ వీక్లీ ఆఫ్ ఇవ్వడం వల్ల కుటుంబం తో కొద్దిసేపు గడిపే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఈ విషయం ఎస్పీల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై డీజీని కలిసి వినతి ఇస్తున్నాం. మా సెలవులు మాకు తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం. అధికారులు కూడా ఓసారి మావైపు నుంచి ఆలోచిస్తే అర్థమవుతుంది. – టి.గోపాల్,తిరుపతి అర్బన్ పోలీసు సంఘ అధ్యక్షులు -
పెళ్లి సెలవులో అమ్రపాలి..
సాక్షి, హన్మకొండ : వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట ఈనెల 15 నుంచి మార్చి 7 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్తున్నారు. ఈ మేరకు 21 రోజులు సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17న కలెక్టర్ అమ్రపాలి కాటకు 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మతో వివాహం నిశ్చమైన నేపథ్యంలో సెలవులో వెళ్లనున్నారు. 21 రోజుల సెలవు కాలంలో.. ఈ నెల 16 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్ రాష్ట్ర సందర్శన, 22 నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్‌లలో, 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో సమీర్‌శర్మతో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు సమాచారం. జేసీలకు ఇన్చార్జి బాధ్యతలు ఇలా ఉండగా ప్రస్తుతం అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి రూరల్ జిల్లాకు ఇన్చార్జ్ కలెక్టర్‌గా ఉన్నారు. ఆమె సెలవులో వెళ్తుండడంతో అర్బన్ కలెక్టర్‌గా జేసీ ఎస్.దయానంద్, రూరల్ కలెక్టర్‌గా జేసీ హరితకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. సెలవుల అనంతరం కలెక్టర్ అమ్రపాలి అర్బన్ కలెక్టర్‌గా, రూరల్ ఇన్చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ధనిక ఎంపీలు జీతాలు వదులుకోవాలి
న్యూఢిల్లీ: ధనిక పార్లమెంట్ సభ్యులు తమ జీతభత్యాలను వదులుకొని సరికొత్త ఉద్యమానికి నాంది పలకాలని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు వరుణ్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని కోరారు. తద్వారా ప్రజాప్రతినిధులపై ప్రజలకు మరింత విశ్వాసం కలుగుతుందని, దేశవ్యాప్తంగా సానుకూల సంకేతం పంపినట్లవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని.. ప్రజాస్వామ్యానికి ఇది హానికర పరిణామమని హెచ్చరించారు. దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలన్న వరుణ్.. ఇలాంటి నిర్ణయాలు కొంతమంది ఎంపీలకు ఇబ్బంది కలిగించవచ్చన్నారు. రూ.కోటి కన్నా ఎక్కువ ఆస్తులున్న ఎంపీలు ప్రస్తుతం 449 మంది ఉన్నారని, 132 మంది ఎంపీలు తమ ఆదాయం రూ.10 కోట్లకుపైగా ఉన్నట్లు ప్రకటించారన్నారు. -
సెలవు ఇవ్వలేదని ఎస్ఐ రాజీనామా
సాక్షి, తిరుపతి: భార్య ఆనారోగ్యంతో ఉన్నా, సెలవు ఇవ్వలేదనే కారణంతో ఓ ఎస్ఐ ఆదివారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నై రాజా కీల్పాక్కం ప్రాంతానికి చెందిన భాస్కర్ (53) చిట్లపాక్కం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మనలి పోలీస్‌స్టేషన్ నుంచి ఆయన మూడు నెలల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆయన తరచూ సెలవులు తీసుకుంటున్నట్లు తెలిసింది. భార్యకు ఆరోగ్యం సరిగా లేదని ఆదివారం సాయంత్రం భాస్కర్ సెలవు అడిగారని సమాచారం. ఇందుకు పోలీసు ఇన్స్పెక్టర్ రమేష్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ ఇచ్చిన భాస్కర్‌ను అధికారులు పిలిపించి చర్చించారు. -
సెలవు తీసుకుంటున్నారా...?
విదేశాల్లోనయితే ఉద్యోగులు ఏటా కొన్ని రోజులు సెలవు పెట్టి వెళ్లడం సర్వ సాధారణం. కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉద్యోగులకు సెలవు కాలంలో అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ హెరాల్డ్‌లో నిబంధనల ప్రకారం ఉద్యోగులు ఏటా 40 రోజులు సెలవుపై వెళ్లడం తప్పనిసరి. ఈ కాలంలో వారికి సాధారణ వేతనం కంటే 50 శాతం అదనంగా చెల్లిస్తారు. కానీ, మనదేశంలో పరిస్థితులు భిన్నం. నిత్య జీవితపు ఒత్తిళ్లను పక్కన పెట్టి కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్లొద్దామన్నా... సెలవు దొరకడం కష్టం. ఒకవేళ సెలవు దొరికినా... ఏదైనా టూర్‌కు వెళ్లి వద్దామనుకుంటే అందుకు సరిపడా నిధులుండవు. ఎక్కువ మందికి ఎదురయ్యేవి ఈ పరిస్థితులే. మన దేశంలో ఉద్యోగంలో పని ఒత్తిడి కూడా ఎక్కువే. ఇక ఈ ప్రపంచంలో సెలవుల భాగ్యం నోచుకుని వారిలో భారతీయులు నాలుగో స్థానంలో ఉన్నట్టు ‘ఎక్స్పీడియా వెకేషన్ డిప్రీవియేషన్ రిపోర్ట్ 2016’ చెబుతోంది. ఇటీవలే ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన సర్వేలోనూ మూడింట రెండొంతులు తమకు తగినంత విరామందొరకడం లేదనే చెప్పారు.మన దేశంలో ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారు ఎక్కువగా సెలవులకు దూరమవుతున్నారు. 30 ఏళ్లలోపు వారిలో ఇది 64 శాతం ఉంటే 41–50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇది 71 శాతంగా ఉంది. ఒకవేళ వీలు దొరికి సెలవు చిక్కి ఎటైనా వెళ్లినా గానీ, వారు కార్యాలయానికి సంబంధించిన మెయిల్స్‌ను తరచూ చెక్ చేసుకోవడంతోపాటు, తమ ఫోన్‌కు వచ్చే ఆఫీసు సంబంధిత కాల్స్‌ను రిసీవ్ చేసుకుని సమాధానం చెప్పాల్సి వస్తుందట. కానీ, మనస్తత్వ శాస్త్రవేతల విశ్లేషణ ప్రకారం కేవలం ఉద్యోగం, పనే కాదు!! విరామం, విశ్రాంతి కూడా అవసరమే. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఉద్యోగికి తగినంత విశ్రాంతి లభిస్తే పని మీద ఎక్కువ దృష్టి సారించగలరనేది వారి మాట. ఎందుకని...? మన దేశంలో ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు సెలవు తీసుకునే సాహసం దాదాపు చేయరు. అన్నేసి రోజులు సెలవు పెట్టి యాజమాన్యం ఆగ్రహానికి గురి కావడం ఎందుకన్న ధోరణే అందుకు కారణమన్నది నిపుణుల మాట. కొన్ని కంపెనీల్లో ఉద్యోగులు సెలవు తీసుకోవడాన్ని నిరుత్సాహపరిచే విధానాలు కూడా అమలవుతుంటాయి. అయితే, మరింత మంది యువత ఉద్యోగాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ధోరణి మారాల్సి ఉందని పీపుల్ స్ట్రాంగ్‌కు చెందిన దేవాశిష్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతలు, ప్రణాళిక సెలవు సంపాదించారనుకోండి... ఆ తర్వాత దృష్టి సారించాల్సింది ప్రణాళికపైనే. తగిన ప్రణాళిక, షెడ్యూల్‌తో సెలవులను పూర్తిగా ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌కు చెందిన స్వాతి, కిరణ్ దంపతులు ఏటా ఓ పది రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లడం తప్పనిసరిగా చేస్తుంటారు. అందుకోసం వారు టికెట్లు, హోటల్ రూమ్‌ను చాలా ముందుగానే బుక్ చేసుకుంటారు. దీంతో తక్కువ చార్జీలకే బుకింగ్ పూర్తి చేయడం ద్వారా వారు తగినంత ఆదా చేసుకుంటున్నారు. వీరి టూర్ బడ్జెట్ రూ.60,000. దీంతో ఎక్కడికి వెళ్లాలి, ఏ మార్గంలో వెళ్లాలి. అక్కడ ఏమేం చూడాలి, స్థానికంగా విడిది, భోజనం, ప్రయాణం ఇవన్నీ కూడా కచ్చితమైన ప్రణాళిక మేరకు ప్లాన్ చేసుకుని బడ్జెట్‌లోపే వెకేషన్ పూర్తి చేస్తామని వారు తెలియజేశారు. బడ్జెట్ కీలకం ప్రయాణానికి కావాల్సింది బడ్జెటే. వాస్తవానికి మన దేశంలో ఎక్కువ మంది పొదుపరులే. కానీ ఎటైనా వెళ్లాలనుకుంటే మాత్రం డబ్బులకు కటకట కనిపిస్తుంది. 34 శాతం మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం సెలవు పెట్టి ఎటైనా వెళ్లి రావడం అన్నది వారి దృష్టిలో ముఖ్యం కాకపోవడం ఒకటైతే, రెండోది పొదుపు చేయకపోవడం. అందుకే వెకేషన్‌కు బడ్జెట్ నిర్ణయించుకుని ప్రతీ నెలా కొంత మొత్తం పక్కన పెడుతూ వెళ్లడమే దీనికి పరిష్కారం. ఇందుకోసం సిప్ మంచి మార్గం అంటున్నారు ఆర్థిక సలహాదారులు. బడ్జెట్‌కు అనుగుణంగా నెలకు రూ.2,000 నుంచి వీలైనంత షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీటిని నగదుగా మార్చుకోవచ్చు. పైగా ఆటుపోట్లు లేకుండా స్థిరమైన రాబడులు ఇస్తాయి ఇవి. ఏడాది, ఆలోపు అవసరాల కోసం స్టాక్స్‌లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ కారణంగా అసలు లక్ష్యం నెరవేరకపోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మీ స్వల్ప కాలిక అవసరం కోసం పొదుపు చేస్తున్నారే గానీ, రాబడుల కోసం ఇన్వెస్ట్ చేయడం లేదు. అందుకే రిస్క్ సాధనాలను ఎంచుకోవడం తగదు. ఒకవేళ హాలిడే ప్లాన్‌కు మూడు, నాలుగేళ్ల సమయం ఉంటే అప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఎక్కువ వ్యవధి ఉంటుంది కనుక, రిస్క్ ఉన్నప్పటికీ పొదుపుతోపాటు మెరుగైన రాబడులూ అందుకోవచ్చు. -
బ్రెగ్జిట్‌కు ముహూర్తం 2019, మార్చి 29
లండన్: ఐరోపా సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ముహూర్తం ఖరారైంది. 2019, మార్చి 29, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఈయూ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తామని ప్రధాని థెరిసా మే శుక్రవారం ప్రకటించారు. బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని చేరుస్తూ సవరణలు చేసిన తరువాత ఈయూ నిష్క్రమణ చట్టాన్ని వచ్చే వారంలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడం ఖాయమని, ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధత, నిజాయతీపై సందేహం అక్కర్లేదని ‘ది డైలీ టెలిగ్రాఫ్’కు రాసిన వ్యాసంలో ఆమె తెలిపారు. చారిత్రక ఈయూ నిష్క్రమణ చట్టం ముందరి పేజీలోనే బ్రెగ్జిట్ తేదీ, సమయాన్ని స్పష్టంగా ప్రచురిస్తామని వెల్లడించారు. -
అర్ధ వేతనపు సెలవును నగదుగా మార్చుకోవచ్చు
వైఎస్ఆర్ జిల్లా , ప్రొద్దుటూరు : త్వరలో అర్ధ వేతనపు సెలవును నగదుగా మార్చుకునే ఉత్తర్వు 148పై మార్గదర్శకాలు విడుదల కానున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉత్తర్వుల సాధనకే పరిమితం కాక, సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. అలాగే 10 నెలల పీఆర్సీ బకాయిలు, రెండు విడుతల డీఏ, పీఆర్సీ జీఓతోపాటు 11వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరింప చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.రఘునాథరెడ్డి, రాష్ట్ర బా«ధ్యుడు రషీద్‌ఖాన్, జిల్లా నాయకులు కొత్తపల్లె శ్రీను, బాలగంగిరెడ్డి, మునెయ్య, జయరామయ్య, కేవీ రమణ, ఎ.సుకుమార్, ఎ.శ్రీనివాసులు, కె.నరసింహారెడ్డి, సలీం, మండల బాధ్యులు మోజెస్ రవి, శ్రీనివాసులు, సంజీవరెడ్డి, తిరుమలకొండయ్య పాల్గొన్నారు. -
ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
బెంగళూరు : దేశీయంగా టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. కానీ ఇటీవల కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయి. ఈ సాప్ట్ వేర్ దిగ్గజం నుంచి గతేడాది దాదాపు 38 వేల మంది ఉద్యోగాలు వదిలివేసినట్టు వెళ్లినట్టు వెల్లడైంది. అంతేకాక 2016-17లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా 65 శాతం పడిపోయినట్టు తెలిసింది. దీనికంతటికీ ప్రధానకారణం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాగ, మరోవైపు ప్రాజెక్టులకు కూడా దెబ్బపడుతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఎంప్లాయీ మెట్రిక్స్ వివరాలు వెల్లడించిన ఇన్ఫోసిస్, తన కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుబంధ కంపెనీల నుంచి 37,915 మంది ఉద్యోగులు వదిలివెళ్లినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 34,688 మందే రాజీనామా చేశారు. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 44,235 టెక్కీలను నియమించుకున్నప్పటికీ, నికరంగా కంపెనీలోకి వచ్చింది 6320 మంది మాత్రమేనని ఇన్ఫోసిస్ తెలిపింది. అంటే ఇది కూడా 65 శాతం పడిపోయినట్టు వెల్లడించింది. అదేవిధంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడా 2016 నియమించుకున్న సంఖ్యకంటే తక్కువగా 18,797 మందినే నియమించుకుందని తెలిపింది. మొత్తంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6320కి పెంచి, 2,00,364కు చేర్చుకుంది. దీనిఫలితంగా పేరెంట్ కంపెనీలో అట్రిక్షన్ లెవల్స్(ఉద్యోగులను తగ్గించుకోవడం) 15 శాతానికి పెరిగినట్టు వార్షిక సమీక్షలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. గతేడాది ఈ శాతం 13.6 శాతంగానే ఉందని తెలిపింది. -
పోలియో ఉందని బిడ్డను వదిలేశారు
-
అందరూ ఉన్న అనాథ తండ్రి
-
ట్విట్టర్‌కు మరో అధికారి షాక్
ట్విట్టర్‌కు మరో అధికారి షాకివ్వబోతున్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆడమ్ మెసింజర్ కంపెనీ నుంచి వైదొలగనున్నట్టు మంగళవారం ట్వీట్ చేశారు. అయితే సంస్థ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. సంస్థ భవిష్యత్తుపై పెరుగుతున్న అనిశ్చితకు అద్దం పడుతూ వరుసగా హై ప్రొఫైల్ ఎగ్గజిక్యూటివ్లు రాజీనామాల పరంపర కొనసాగుతోంది. మెసింజర్ గత ఐదేళ్లుగా ట్విట్టర్లో తన సేవలందిస్తున్నారు. 2013 మార్చిలో ఆయన ట్విట్టర్‌కు సీటీవోగా ఎంపికయ్యారు. 2011లో ట్విట్టర్లో చేరకముందు ఆయన ఒరాకిల్ కార్పొరేషన్‌కు డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎడ్ హోకు అన్ని ప్రొడక్ట్, ఇంజనీరింగ్ బాధ్యతలను అప్పగించబోతున్నారని రీకోడ్ రిపోర్టు చేసింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా మెసింజర్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డిజైన్‌కు సంబంధించిన సేవలను పర్యవేక్షిస్తుండేవారు. శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ట్విట్టర్ ఇటీవల హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌ల రాజీనామాతో తీవ్ర సతమతమవుతోంది. ఏడాది కంటే తక్కువ సమయంలోనే ముగ్గురు అధినేతలు దీనికి గుడ్ బై చెప్పారు. యూజర్ గ్రోత్ పెరుగుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగుల తొలగింపు, సంస్థ కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోపాటు తన వీడియో ప్లాట్ ఫాం వైన్ ఉపసంహరించుకోవడం తదితర అంశాలు తెలిసిన విషయాలే. -
సెలవులో డీసీ గాయత్రి దేవి
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉపకమిషనర్ బి.గాయత్రి దేవి శుక్రవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు సెలవుపై వెళ్లారు. కర్నూలు సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు ఇన్చార్జిగా ఉంటారు. ఈ మేరకు కమిషనర్ వై.వి.అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలంలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇన్చార్జి ఈఓగా గంజి మల్లికార్జున ప్రసాద్‌ను నియమించారు. -
సెలవుల్లో వెళ్లిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ 8, 9 తేదీల్లో వ్యక్తిగత పనులపై సెలవు పెట్టి సోమవారం సాయంత్రమే హైదరబాదు వెళ్లారు. తిరిగి 10వ తేదీ విధులకు హాజరవుతారు. రెండు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
రెండు రోజుల సెలవులో కలెక్టర్
హన్మకొండ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి రెండు రోజుల సెలవులో వెళ్తున్నారు. వ్యక్తిగత కారణాలతో శని, ఆదివారం సెలవుపెట్టారు. శనివారం జరిగే మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు హాజరుకానున్నందున ఆ కార్యక్రమాలు చూడాలని జాయింట్ కలెక్టర్ దేవానంద్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆమె తిరిగి సోమవారం విధుల్లో చేరనున్నట్లు సమాచారం. -
సెలవులో జాయింట్ కలెక్టర్
అనంతపురం అర్బన్ : జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వ్యక్తిగత పనులపై గురువారం నుంచి సెలవులో వెళ్లారు. ఆయన తిరిగి ఈ నెల 13 లేదా 14 తేదీల్లో విధులకు హాజరవుతారని అధికారులు తెలిపారు. అప్పటి వరకు జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ ఇన్చార్జి జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు. -
అనంతపల్లి హెచ్ఎం సస్పెండ్
ఏలూరు సిటీ/నల్లజర్ల : నల్లజర్ల మండలం అనంతపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.గంగరాజును డీఈవో డి.మధుసూదనరావు సస్పెండ్ చేశారు. మంగళవారం పాఠశాలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ఎం గంగరాజు ఎంఈవో అనుమతి లేకుండా అనధికారికంగా సెలవు పెట్టడాన్ని గుర్తించారు. ఖాళీ కాగితంపై సంతకం చేసిన గంగరాజు సెలవుపై వెళ్లారు. అయితే డీఈవో రావటాన్ని గమనించిన ఉపాధ్యాయులు సెలవు దరఖాస్తు చేసినట్టుగా చూపించారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యం నిల్వలు, రిజిష్టర్‌లో పేర్కొన్న రికార్డులు వేర్వేరుగా ఉండడాన్ని గుర్తించి సస్పెండ్ చేశారు. డైరీ రాయడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల నోట్స్‌ను సరిచూడలేదన్న కారణాలతో ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు ఇచ్చారు. -
ఐఐటీ, ఐఐఎమ్‌ల్లో డ్రాపవుట్లకు కారణాలు అవే
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ల్లో సీటు రావడమే కష్టమంటే.. వాటిల్లో కూడా మధ్యలోనే సీటును వదిలేసి వెళ్లేవారి సంఖ్య ఏమంత తక్కువగా లేదంట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్స్) ల్లో డ్రాపవుట్ రేట్ పెరుగుతుందని వెల్లడైంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్. మహేంద్ర నాథ్ పాండే సమర్పించిన గణాంకాల్లో 201-16మధ్యకాలంలో మొత్తం 16 ఐఐటీల్లో 1,782 మంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్ నుంచి..13 ఐఐఎంల్లో 104 మంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు. ఐఐఎం-బీలో 2015-16 ఏడాదిలో నలుగురు విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారని తెలిసింది. ఈ డ్రాపవుట్లు పెరగడానికి అనేక పరిమాణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మరొక ఇన్స్టిట్యూట్కు మారే క్రమంలో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతుందని ఐఐటీ బెంగళూరు డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్ సదాగోపాన్ తెలిపారు. బెటర్ ఆప్షన్‌కు, బెటర్ ఇన్స్టిట్యూట్కు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల కంటే ముంబై, న్యూఢిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ల్లో స్టడీస్‌కే నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో సీటు పొందిన వారు, ఈ ఇన్స్టిట్యూట్లకు తరలి వెళ్తుంటారని వెల్లడించారు. విద్యార్థుల డ్రాపవుట్‌కు మరో కారణంగా బెటర్ బ్రాంచ్ పొందలేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఐఐటీలో ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ను, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్సు బ్రాంచ్‌ను విద్యార్థులు పొందినప్పుడు, ఎన్ఐటీ కోసం విద్యార్థులు ఐఐటీని పరిత్యజిస్తున్నారని వివరించారు. విద్యార్థులు ఐఐటీలో సీటును వదులుకునేటప్పుడు రూ.1000 కంటే ఎక్కువ లెవీ విధించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలతో, తరచూ ఇలా జంపింగ్‌లకు పాల్పడుతుంటారని వెల్లడిస్తున్నారు. అకాడమిక్ ఒత్తిడి కూడా విద్యార్థులు సీటును వదులుకోవడానికి కారణంగా ఐఐటీ బెంగళూరు విద్యార్థి శ్రీకాంత్ శ్రీధర్ స్పష్టంచేశారు. ఫైనాన్సియల్ స్టెప్ కూడా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు వదులుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇన్స్టిట్యూట్లు ఫైనాన్సియల్ సహకారం కల్పిస్తాయని, కానీ అప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని విద్యార్థులు సీటు కోల్పోతున్నారని వెల్లడించారు. -
బతికుండగానే తల్లిని శ్మశానానికి...
* కన్నతల్లిని శ్మశానంలో వదిలేసి పరారైన ఓ తనయుడు * ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు, కొడుకుపై కేసు నమోదు అమలాపురం టౌన్: కొడుకు తనని నిర్దయగా శ్మశానంలో వదిలి వెళ్తున్నా ఆగ్రహించని ఆ మాతృహృదయం ‘‘ సరే.. వదిలేస్తే వదిలేశావ్, కనీసం ఏదైనా గుడి దగ్గరైనా వదిలేయ్రా..’’ అంటూ ప్రాధేయపడింది. అయినా కనికరించని ఆ పాషాణ హృదయం ఆ పండుటాకును మరుభూమిలోనే నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయింది.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఉప్పు సత్యవతి (75) దుస్థితి ఇది. ఆమె పట్టణానికి సమీపంలోని పేరూరు పేటలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె ఏకైక కుమారుడు హనుమంతరావు బతుకుదెరువు కోసం రాజమహేంద్రవరం వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అతను తల్లికి డబ్బులు పంపిస్తుండగా స్థానికులు కొంత సాయపడుతున్నారు. ఇంతలో సత్యవతి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కొత్త ఇల్లు కట్టుకునే యత్నంలో ఆమెను ఖాళీ చేయమన్నాడు. విషయం తెలిసీ హనుమంతరావు బుధవారం పేరూరుపేట వచ్చి తల్లిని రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అరుుతే తన ఇంటికి కాకుండా ఏదైనా ఆశ్రమంలో చేర్చాలని ప్రయత్నించాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాత్రి 9 గంటలకు అమలాపురంలోని ఏఎంజీ కాలనీకి ఆనుకుని ఉన్న శ్మశానానికి తీసుకెళ్లి అక్కడ ఉంచి ఆమెచేతిలో రూ.300 పెట్టి ఆటోలో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ గురువారం ఆమెకు ఆహారం అందించి వైద్యం కోసం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సీనియర్ సిటిజన్స్ యాక్టు ప్రకారం ఆమె కొడుకుపై కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆమెను ప్రభుత్వ షెల్టర్ హోమ్‌కు తరలిస్తామన్నారు. -
సామూహిక సెలవులో కాంట్రాక్ట్ అధ్యాపకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో వారందరూ సామూహిక సెలవుల్లో వెళ్లారు. దీంతో జిల్లాలో విద్యా బోధన నిలిచిపోయింది. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 303 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 28వ తేదీతో వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినా రెన్యువల్ అవుతుందనే ఆశతో అప్పటి నుంచి కళాశాలలకు వచ్చి పని చేస్తున్నారు. అయితే వారి పోస్టులను ప్రభుత్వం ఇప్పటి వరకు రెన్యువల్ చేయలేదు. ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో సోమవారం సామూహిక సెలవుల్లో వెళ్లిపోయారు. పత్తికొండ, కోడుమూరు, హŸళగుంద, కేవీఆర్ కళాశాలల్లో అందరూ సెలవులో వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 15 కళాశాలల్లో 46 మంది సెలవులో ఉన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మంగళవారం మరిన్ని కళాశాలల అధ్యాపకులు సెలవులో వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆర్జేడీకి నివేదిక పంపాం: సీడీ కబీరు, డీవీఈఓ -
బ్రెగ్జిట్ పై ప్రజా నిర్ణయాన్నిగౌరవిస్తాంః ఒబామా
వాషింగ్టన్ః యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అన్నారు. బ్రెగ్జిట్ పై స్పందించిన ఒబామా.. ఈ పరిస్థితుల్లో అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. బ్రిటన్ తో ఎప్పట్లాగే సంబంధాలు కొనసాగిస్తామని వివరించారు. బ్రిటన్ ప్రజలు తమ గళాన్ని వినిపించారని, వారి నిర్ణయాన్ని తాము తప్పక గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ తో బ్రిటన్ విడిపోయినా, ఆ రెండింటితో అమెరికా సంబంధాలు విడివిడిగా కొనసాగుతాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు పెట్టిన ఓటింగ్ లో ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మద్దతు పలకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ ఈయూతో విడిపోవడం ఖాయమైంది. -
విడిపోవడానికే బ్రిటన్ వాసి పట్టం
లండన్: బ్రిగ్జిట్ ఫలితాలలో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. బ్రిటన్ వాసులు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవడానికే మొగ్గుచూపారు. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్‌లో రెండు శాతం ఓట్లు స్వల్ప తేడాతో 'బ్రెగ్జిట్' వాదన గెలుపొందింది. దీంతో రెండో ప్రపంచ యుద్దం అనంతర కాలం నుంచి యూరప్ ఐక్యతలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఐరోపా సమాఖ్య(ఈయూ)కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మొత్తానికి 52 శాతం ఓటర్లు విడిపోవాలని, 48 శాతం ఓటర్లు కలిసుండాలని తీర్పుఇచ్చారు. బ్రెగ్జిట్ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పౌండ్ విలువ భారీగా నష్టపోయింది. భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 900 పాయింట్ల వరకూ కోల్పోయింది. రూపాయి విలువ పతనమైంది. ఈ ఫలితాలతో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజీనామా చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
సెలవు ఇవ్వలేదని కాల్చేశాడు
కేరళ: బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్పై హెడ్ కానిస్టేబుల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇన్స్పెక్టర్ రాంగోపాల్ మీనా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. కేరళ కాజికోడ్ జిల్లా వటకరలో గత రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించేందుకు బీఎస్ఎఫ్ సిబ్బంది వటకరలోని ఇస్లామిక్ అకాడమీ స్కూల్ వద్ద బస చేశారు. అయితే సెలవు మంజూరు చేసే విషయంలో రాంగోపాల్ మీనాకు, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ ప్రసాద్ సింగ్ కు మధ్య వాగ్వివాదం జరిగినట్లు సమాచారం. సెలవు మంజూరు చేసేందుకు ఇన్స్పెక్టర్ అంగీకరించకపోవటంతో ఆగ్రహించిన ఉమేష్ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్‌తో ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వడకర పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఉమేష్ ప్రసాద్ సింగ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. -
వృత్తి విద్యకోసం ఉద్యోగాలొదిలేస్తున్నారు!
ఇప్పటిదాకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలకోసం పోటీపడ్డ యువత... ఇటీవల కార్యాలయాల్లో కూర్చొని చేసే మూస ఉద్యోగాలను వదిలేసి మరీ... వృత్తి విద్యను నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. దాదాపు పదిలో ఎనిమిది మంది వృత్తి విద్యను నేర్చుకుంటున్నారని తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. డబ్బు ముఖ్యం కాదని, యువత వృత్తి విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారని బాల్వెనీ విస్కీ అందించిన నివేదికల్లో వెల్లడైంది. ఉద్యోగాలను వదిలేసి మరీ వృత్తి విద్యను నేర్చుకునేందుకు నేటి యువత ఇష్టం చూపిస్తున్నారని బాల్వెనీ విస్కీ తాజా అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీ చదువులను, ఉద్యోగాలను వదిలిపెట్టి 77శాతం మంది ప్రజలు ప్రాచీన కళలు, వృత్తి విద్యా కోర్సుల్లో తర్ఫీదు పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. అభివృద్ధి విషయంలో క్రాఫ్ట్ భారీ సమయం తీసుకుంటుందన్న అపోహలను వదిలి, నిజానిజాలను నిర్థారించుకొంటున్నారు. పదివేలమందిపై చేసిన సర్వేలో ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, కుండల తయారీ వంటి వృత్తులు అగ్రస్థానంలో ఉన్నట్లు గుర్తించారు. అయితే వృత్తి విద్యను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలపాలని ప్రశ్నించినపుడు మాత్రం... అదో ప్రతిభావంతమైన విద్య అని, చికిత్సా పద్ధతిగా కూడ పని చేస్తుందని, కార్యాలయాల్లో కూర్చొని పనిచేసే సాధారణ ఉద్యోగాల కంటే.. వృత్తి విద్య ఒత్తిడిని సైతం నివారిస్తుందని కనుగొన్నట్లు తెలిపారు. దీనికి తోడు చెఫ్, జ్యువెలరీ డిజైన్, తోటపని వంటి ఇతర కళాత్మక విద్యలు కూడ జాబితాలో అత్యధికంగా నిలుస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కళాత్మక వృత్తుల్లోకి అడుగిడిన యువత... వారి జీవితంలో పూర్తిశాతం గాని, కనీసం సగభాగమైనా వృత్తి కళలు నేర్చుకునేందుకు సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో ఫొటోగ్రఫి 12 శాతం, ఛెఫ్, బేకింగ్ 7 శాతం, సంగీతం 6 శాతం, గార్డెనింగ్ కు 3 శాతం, ప్రాధాన్యత పెరిగిందని అధ్యయనకారులు చెప్తున్నారు. ఎక్కువశాతం సెక్యూరిటీ అటెండెంట్స్, ఐటి కన్సల్టెంట్స్, అకౌంటెంట్లు తమ ఉద్యోగాలను వదిలి వృత్తి విద్యల్లో చేరుతున్నట్లు అధ్యయనకారులు చెప్తున్నారు. .బాల్వెనీ విస్కీ సిరీస్ లో భాగంగా కళాకారుడు డిన్నర్ రూపొందించిన లఘు చిత్రం ప్రారంభం సందర్భంగా ఈ కొత్త విషయాలను వెల్లడించారు. -
మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారు?
ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్యా దేశం విడిచి వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టిన లిక్కర్ కింగ్... విదేశాలకు వెళ్ళకూడదంటూ ఆదేశాలు ఉన్నా... ఆయన రహస్యంగా లండన్ చెక్కేయడంపై ప్రస్తుతం రాజకీయ రచ్చగా మారింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను దేశం విడిచి ఎలా వెళ్ళనిచ్చారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు. సమస్యల వలయంలో చిక్కుకున్న విజయ్ మాల్యాను దేశం విడిచి వెళ్ళేందుకు ఎలా అనుమతించారంటూ కేజ్రీవాల్...మోదీని సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి నేరుగా ప్రధానికి నివేదికలు పంపినా మాల్యాను ఎలా వెళ్ళనిచ్చారో తెలపాలంటూ కేజ్రీవాల్ ట్వీట్ లో కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు ఎగవేసిన కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాల్యాను దేశం వదిలి వెళ్ళేందుకు అనుమతించరాదంటూ సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మాల్యా మార్చి 2వ తేదీ దేశం విడిచి వెళ్ళారంటే.. ఎవరి అనుమతితో వెళ్ళారని కేజ్రీవాల్ అన్నారు.