ఐఐటీ, ఐఐఎమ్ల్లో డ్రాపవుట్లకు కారణాలు అవే
ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ల్లో సీటు రావడమే కష్టమంటే.. వాటిల్లో కూడా మధ్యలోనే సీటును వదిలేసి వెళ్లేవారి సంఖ్య ఏమంత తక్కువగా లేదంట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీస్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎమ్స్) ల్లో డ్రాపవుట్ రేట్ పెరుగుతుందని వెల్లడైంది.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్. మహేంద్ర నాథ్ పాండే సమర్పించిన గణాంకాల్లో 201-16మధ్యకాలంలో మొత్తం 16 ఐఐటీల్లో 1,782 మంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్ నుంచి..13 ఐఐఎంల్లో 104 మంది విద్యార్థులు కోర్సును మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు. ఐఐఎం-బీలో 2015-16 ఏడాదిలో నలుగురు విద్యార్థులు డ్రాపవుట్ అయ్యారని తెలిసింది.
ఈ డ్రాపవుట్లు పెరగడానికి అనేక పరిమాణాలు దోహదం చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఒక ఇన్స్టిట్యూట్ నుంచి మరొక ఇన్స్టిట్యూట్కు మారే క్రమంలో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతుందని ఐఐటీ బెంగళూరు డైరెక్టర్, ప్రొఫెసర్ ఎస్ సదాగోపాన్ తెలిపారు. బెటర్ ఆప్షన్కు, బెటర్ ఇన్స్టిట్యూట్కు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల కంటే ముంబై, న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ల్లో స్టడీస్కే నేటి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో సీటు పొందిన వారు, ఈ ఇన్స్టిట్యూట్లకు తరలి వెళ్తుంటారని వెల్లడించారు.
విద్యార్థుల డ్రాపవుట్కు మరో కారణంగా బెటర్ బ్రాంచ్ పొందలేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఐఐటీలో ఆర్కిటెక్చర్ బ్రాంచ్ను, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్సు బ్రాంచ్ను విద్యార్థులు పొందినప్పుడు, ఎన్ఐటీ కోసం విద్యార్థులు ఐఐటీని పరిత్యజిస్తున్నారని వివరించారు. విద్యార్థులు ఐఐటీలో సీటును వదులుకునేటప్పుడు రూ.1000 కంటే ఎక్కువ లెవీ విధించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలతో, తరచూ ఇలా జంపింగ్లకు పాల్పడుతుంటారని వెల్లడిస్తున్నారు.
అకాడమిక్ ఒత్తిడి కూడా విద్యార్థులు సీటును వదులుకోవడానికి కారణంగా ఐఐటీ బెంగళూరు విద్యార్థి శ్రీకాంత్ శ్రీధర్ స్పష్టంచేశారు. ఫైనాన్సియల్ స్టెప్ కూడా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు వదులుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇన్స్టిట్యూట్లు ఫైనాన్సియల్ సహకారం కల్పిస్తాయని, కానీ అప్పటికీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేని విద్యార్థులు సీటు కోల్పోతున్నారని వెల్లడించారు.