గురువు కరువు! | Shortage of teachers in higher educational institutions: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గురువు కరువు!

Apr 7 2025 3:58 AM | Updated on Apr 7 2025 3:58 AM

Shortage of teachers in higher educational institutions: Andhra Pradesh

జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత  

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎంలలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరు  

స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ  

కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనూ బోధన, బోధనేతర పోస్టుల భర్తీపై ఆందోళన 

విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్న

ఇకపై శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సిఫార్సు  

56.18% దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులు  

38.28% అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు కూడా..

28.56% కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌ పోస్టులు  

సాక్షి, అమరావతి: దేశంలోని ప్రతిష్టాత్మక జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధించేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌­ఈ­ఆర్‌లు, సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు వివిధ రకాల ఉన్నత విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున ఆచా­ర్యుల పోస్టులు ఖాళీగా ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం... ఈ విద్యాసంస్థల్లో మొత్తం 18,940 టీచింగ్‌ పోస్టులు మంజూరు కాగా, 28.56 శాతం ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఐఐటీలు, ఎన్‌ఐ­టీలు, ఐఐఎంలలో 2,540 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా, 56.18% ఖాళీగా ఉన్నా­యని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ వెల్లడించింది.

బడ్జెట్‌లో 90శాతం జీతాలకే..
జాతీయ స్థాయి ఉన్నత విద్యాసంస్థలతో­పాటు సెంట్రల్‌ యూనివర్సిటీల్లో టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండటం అధ్యాపక–­విద్యార్థి నిష్పత్తిని ప్రభావితం చేస్తోందని పార్ల­మెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభిప్రాయపడింది. ఇది బోధన నాణ్యతను దెబ్బతీస్తోందని హెచ్చరించింది.

 కాంట్రాక్టు ఉద్యోగాలను దశలవారీగా తొల­గించి, అర్హత కలిగిన అధ్యాపకులను శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వా­లని, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలను ఇచ్చేలా విద్యా మంత్రిత్వశాఖ నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించింది.

విద్యార్థుల నమోదు నిష్పత్తికి తగ్గట్టుగా బోధ­న సౌకర్యాలు కల్పించాలని తెలియజేసింది.

ముఖ్యంగా ఉన్నత విద్యకు కేటాయించిన బడ్జెట్‌లో 90శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే ఖర్చవుతుండటంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రభుత్వాలు ఖర్చులను తగ్గించుకునేందుకు శాశ్వత ప్రాతిపది­కన పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధ­తులను అవలంబించడంతో వ్యవస్థలు దెబ్బతింటాయని హెచ్చరించింది. విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్యను ఎలా అందిస్తారని ప్రశ్నించింది.

శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియ­మిం­చాలని సూచించింది.  మెరిట్‌ ఆధారంగా, పారదర్శకంగా అధ్యాపక నియామక ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం నియామక ప్రక్రియలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు, స్క్రీనింగ్, సమాచార మార్పిడి కోసం సాంకేతికతను పెంపొందించాలని, తద్వారా ఇతరుల జోక్యాలను తగ్గించవ్చని స్పష్టంచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement