Central University
-
విద్యార్థినిల గోడు పట్టించుకోని బాబు సర్కార్
-
అనంతపురం: యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్రూమ్లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. -
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్థరాత్రి ఉద్రిక్తత
-
అరుంధతి రాయ్‌పై ఉపా కేసు
న్యూఢిల్లీ: 2010లో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే అభియోగాలపై అత్యంత కఠినమైన ‘చట్టవిరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా)’ కింద రచయిత్రి అరుంధతి రాయ్‌పై విచారణ జరపడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. ఢిల్లీలో 2010 అక్టోబరు 21న ‘ఆజాదీ.. ది ఓన్లీ వే’ పేరిట జరిగిన సదస్సులో అరుంధతి రాయ్, కశీ్మర్ సెంట్రల్ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌లు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అభియోగం. -
హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ
-
పార్లమెంట్లో ప్రసంగించనున్న అనంత విద్యార్థి
అనంతపురం కల్చరల్: యువతలో దేశభక్తి, నైతికతను పెంపొందించే దిశగా పార్లమెంటు ఆఫ్ ఇండియా, నెహ్రూ యువకేంద్ర సంయుక్తంగా ఏటా నిర్వహించే వేడుకలకు దేశవ్యాప్తంగా 25 మంది యువతీ యువకులను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఈనెల 14న పార్లమెంటు ప్రాంగణంలో ప్రసంగించే అరుదైన అవకాశం జిల్లాకు చెందిన మెగాజోష్కి దక్కింది. ఈ మేరకు నెహ్రూ యువకేంద్ర జిల్లా సమన్వయకర్త సందీప్‌కుమార్, డీడీవో శ్రీనివాసులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీలో చదువుకుంటున్న ఆమె గతంలో అనేక వక్తృత్వ పోటీల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. (చదవండి: జేసీ మనుషులమంటూ దౌర్జన్యం) -
CUCET 2022: ఇంటర్ వెయిటేజీ రద్దు మంచిదే
దేశవ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల (సీయూల) ప్రవేశాల కోసం 2022–23 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలో ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజీ రద్దు చేయడం సరైన నిర్ణయం. ఇంటర్మీడియట్ మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా అమలవుతున్నది. కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల విద్యార్థులకు మేలు చేసే విధంగా ప్రయోగాలకు ఎక్కువ మార్కులు వేస్తూ ఉండటాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గమనించి ఈ నిర్ణయం తీసుకోవటం అభినందనీయం. సీయూ సెట్‌ని దేశవ్యాప్తంగా 13 భాషల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించడం కూడా అభినందించదగ్గదే. ఈ క్రమంలో రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూ సెట్‌ను అనుసరించి ప్రవేశాలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించటం మంచి పరిణామం. సీయూ సెట్లో వచ్చిన మార్కులు, డిగ్రీ మార్కులను పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రాలలో అమలులో ఉండే రిజర్వేషన్ ఆధారంగా 45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించడానికి యూజీసీ నిర్ణయించడం వల్ల... దొడ్డిదారిన సీట్లు పొందే వాళ్లకి చెక్ పెట్టినట్లు అవుతున్నది. (క్లిక్: కేంద్రీయ వర్సిటీల యూజీ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష) ఇక మల్టిపుల్ ఛాయిస్‌లో ప్రశ్నలు, తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండటం అనేవి పరీక్షార్థులకు కొంచెం ఇబ్బందికరమే అయిన ప్పటికీ... జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష కనుక వడపోత జరగాలంటే ఇటువంటి మార్పులు తప్పవు. అయితే ప్రవేశాలకు సంబంధించిన మెరుగైన సంస్కరణలు చేపట్టే యూజీసీ తదనుగుణంగా విశ్వవిద్యాలయాలకు నిధులు మంజూరు చేయడం; ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలలో ప్రవేశాల సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీలు వేయడం సీయూ సెట్‌ని బలోపేతం చేస్తుంది. ఇంగ్లీష్‌తో పాటు, మన తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో, టెస్ట్ ఉండటం మాతృభాషలో చదువుకున్న వారికి ప్రయోజనకరం. – డాక్టర్ నూకతోటి రవికుమార్, ఒంగోలు -
సెంట్రల్ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య
గచ్చిబౌలి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రోజంతా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేష్, హెచ్‌సీయూ విద్యార్థులు తెలిపిన ప్రకారం..పెద్దపల్లి జిల్లా తారేపల్లికి చెందిన ఆర్.మౌనిక (27) హెచ్‌సీయూలో నానో సైన్స్ ఎంఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. చదవండి: కార్వీ స్కామ్‌లో వెలుగులోకి కొత్త విషయాలు లేడీస్ హాస్టల్ ఎల్‌హెచ్–7లోని రూమ్ నెంబర్ 24లో ఉంటోంది. ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన ఆమె సోమవారం ఉదయం నుంచి డోర్ తెరవలేదు. స్నేహితులు ఫోన్ చేసినా స్పందించ లేదు. దీంతో తోటి విద్యార్థులు రాత్రి 7.55 గంటలకు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు డోర్ పగులగొట్టి చూడగా కిటికీకి ఉరివేసుకొని కన్పించింది. చదవండి: మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేష్, ఎస్ఐలు శ్రీశైలం, వెంకట్‌రెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు మౌనికకు ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పినట్లుగా తోటి విద్యార్థినుల ద్వారా తెలిసింది. కాగా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసి క్యాంపస్‌లోని వందలాది మంది హాస్టల్ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను అదుపు చేసి మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం -
రూ.750 కోట్లతో లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈ రోజు(జూలై 22) ఆమోదం తెలిపినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కేంద్ర విశ్వవిద్యాలయాన్ని రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని అని అన్నారు. లడఖ్ ప్రాంత అభివృద్ది కోసం లడఖ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎల్ఐడీసీఓ) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గం ప్రకటించినట్లు మంత్రి క్యాబినెట్ నిర్ణయాలను ప్రకటిస్తూ తెలిపారు. లడఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా సెంట్రల్ యూనివర్సిటీస్ యాక్ట్ 2009ను సవరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. "ఈ విశ్వ విద్యాలయాన్ని స్థాపించడం వల్ల ఉన్నత విద్యా రంగంలో ప్రాంతీయ అసమతుల్యతలను తొలగిస్తుంది. అలాగే, ఈ ప్రాంతంలో మేధో వృద్ధికి సహాయపడుతుంది, ఉన్నత విద్య వ్యాప్తికి సహాయపడుతుంది. ఈ ప్రాంతంలోని ఇతర విద్యా సంస్థలకు కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒక నమూనాగా నిలుస్తుంది" అని ఠాకూర్ తెలిపారు. రాబోయే సెంట్రల్ యూనివర్సిటీ అధికార పరిధి లేహ్, కార్గిల్ తో సహా మొత్తం లడఖ్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఎల్ఐడీసీఓ కార్పొరేషన్ "లడఖ్‌లో పరిశ్రమలు, పర్యాటకం, రవాణా సేవలు, స్థానిక ఉత్పత్తులు, హస్తకళల మార్కెటింగ్ అభివృద్ధిని చూసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు" మంత్రి తెలియజేశారు. 25 కోట్ల అధీకృత వాటా మూలధనంతో కంపెనీల చట్టం కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. కార్పొరేషన్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడటంతో పాటు స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే ఉక్కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,322 కోట్లను కేటాయించారు. ఎండ్ టూ ఎండ్ తయారీకి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. -
‘ఇస్లాం’ పరీక్షలో ముస్లిమేతరుడికి ఫస్ట్ ర్యాంక్
జైపూర్: కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థి నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. రాజస్తాన్‌కు చెందిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ గత రికార్డుల్ని చెరిపేస్తూ టాప్ ర్యాంకు సాధించాడు. హిందూ ముస్లింలు పరస్పరం ఇతర మతాల గురించి తెలుసుకోవాలని శుభమ్ అన్నారు. ‘‘ఇస్లాం మతంపై అతివాద ముద్ర పడింది. ఆ మతం గురించి సమాజంలో ఎన్నో దురభిప్రాయాలు ఉన్నాయి. దీంతో సమాజంలో చీలికలు వచ్చాయి. అవన్నీ పోవాలంటే రెండు మతాల వారు పరస్పరం అవగాహన పెంచుకోవాలి’’అని శుభమ్ అభిప్రాయపడ్డారు. 2015లో ఏర్పాటైన కశ్మీర్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. అల్వార్ ప్రాంతానికి చెందిన యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు. రెండేళ్ల క్రితం తమ ప్రాంతంలో మైనార్టీలను కొట్టి చంపిన ఘటనలు వెలుగు చూడడంతో ఇస్లాం మతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగిందని శుభమ్ యాదవ్ తెలిపారు. చదవండి: ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్ ? -
సెంట్రల్ వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తిరువారూర్‌లోని సెంట్రల్ వర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో ఆ వర్సిటీ విద్యార్థినుల్లో ఆందోళన మొదలైంది. కాగా కృష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన ఇంజినీరు మురళి, లలిత ప్రియదంపతుల కుమార్తె మైథిలి(19) తిరువారూర్ నీలకుడిలోని తమిళనాడు సెంట్రల్ వర్సిటీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడి హాస్టల్లో బస చేస్తూ, చదువుకుంటున్న మైథిల్ ఆత్మహత్య కలకలం రేపింది. మైథిలితో పాటు హాస్టల్లో నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కళాశాలకు సెలవు కావడంతో ఇద్దరు విద్యార్థినులు వారి స్వస్థలాలకు వెళ్లారు. మైథిలితో పాటు రాజశ్రీ అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉన్నారు. శనివారం రాత్రి టిఫిన్ తినేందుకు రాజశ్రీ మెస్‌కు వెళ్లింది. మైథిలిని పిలవగా, తాను కాసేపటి తర్వాత వస్తానని సమాధానం ఇవ్వడంతో ఆమె మాత్రమే వెళ్లింది. టిఫిన్ ముగించుకుని తొమ్మిదిన్నర గంటలసమయంలో తన గది వద్దకు రాజశ్రీ వచ్చింది. చదవండి: చదువు చావుకొస్తోంది! అయితే, తలుపు లోపల గడియ పెట్టి ఉండడం, ఎంతకు తెరచుకోకపోవడంతో అనుమానం వచ్చి అక్కడి సిబ్బందికి సమాచారం అందించింది. తలుపు పగులగొట్టి చూడగా, ఆ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మైథిలి వేళాడుతుండడంతో అక్కడ కలకలం బయలు దేరింది. హాస్టళ్లో› ఉన్న విద్యార్థినులు అందరూ భయంతో వణికి పోయారు. సమాచారం అందుకున్న నన్నిలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజశ్రీ వద్ద విచారించారు. ఆ గదిలో ఏదైనా లేఖ ఉందా అని తనిఖీ చేశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం తిరువారూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మైథిలీ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. అయితే, ఆమె ఆత్మహత్య కారణాలు తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఉన్నారు. కాగా, ఇదే వర్సిటీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన కరణ్ పటేల్(21) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా, రెండో సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కల్గిస్తున్నది. ఇక, చెన్నై ఐఐటీలో ఫాతిమా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే, సెంట్రల్ వర్సిటీలో మైథిలి బలన్మరణానికి పాల్పడడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. -
కర్నూలులో మరో కేంద్రీయ విశ్వవిద్యాలయం
-
ఏపీ సెంట్రల్ వర్సిటీకి రూ.450 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి మొదటి విడతగా రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20కి రూ.13 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఆరు కోర్సులు ప్రారంభించినట్టు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారుల కేటగిరీలో చేర్చి, త్వరితగతిన అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ కాకినాడ ఎంపీ వంగా గీత కేంద్రాన్ని కోరారు. సోమవారం లోక్‌సభలో జాతీయ రహదారుల శాఖ బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. రహదారుల నిర్మాణం విషయంలో ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం తెలపాలని విన్నవించారు. 400 కి.మీ. పొడవైన అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే మంజూరైనా.. ఇంకా డీపీఆర్ పూర్తవలేదన్నారు. భూసేకరణ కూడా జరగలేదని, పనులు మొదలుపెట్టలేదని సభ దృష్టికి తెచ్చారు. గుంటూరు–వినుకొండ, కడప–గిద్దలూరు, అనంతపురం–బుగ్గ, కర్నూలు–ఆత్మకూరు, ఆత్మకూరు–దోర్నాల తదితర ఆరు రహదారులను అత్యంత ప్రాధాన్యత గల రహదారులుగా గుర్తించాలని కోరారు. అలాగే జాతీయ రహదారులకు అనుబంధ రహదారులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఎన్‌హెచ్–16కు అనుబంధంగా కాకినాడ–యాంకరేజ్ పోర్టు–ఉప్పాడ బీచ్ రహదారి, కుంభాభిషేకం ఆలయం–ఫిషింగ్ హార్బర్ మధ్య ఫ్లైఓవర్, తదితర రహదారులను నిర్మించి స్థానికుల ఇక్కట్లను తొలగించాలని విన్నవించారు. డ్రైవర్ల సంక్షేమం దృష్ట్యా హైవేల్లో ఆస్పత్రులు ఏర్పాటుచేయాలన్నారు. కాకినాడ–రాజమండ్రి మధ్య ఆరు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని కోరారు. ఎన్ఐఏను మరింత బలోపేతం చేయండి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో సిబ్బందిని పెంచి మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. లోక్‌సభలో ఎన్ఐఏ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలో మానవ అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు పూర్తి స్థాయిలో దీన్ని సమగ్ర దర్యాప్తు చేయలేకపోతున్నాయని వివరించారు. అలాగే.. బేడ, బుడగ, జంగం కులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలని కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రికి ఒక వినతిపత్రం ఇచ్చారు. -
ప్రకాశం సిగలో మరో మణిహారం..
సాక్షి, కందుకూరు: ప్రకాశం జిల్లా సిగలో కేంద్రీయ విద్యాలయం మరో మణిహారంగా నిలవనుంది. కందుకూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయాల అడిషనల్ కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కందుకూరులో విద్యాలయం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఆసియాలోనే అతి పెద్ద రెండో రెవెన్యూ డివిజన్ కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. దీని కోసం రెండేళ్ల క్రితమే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఎంపీ చొరవతో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలోని మాగుంట సుబ్బరామరెడ్డి జూనియర్ కాలేజీలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ స్వయంగా అదనపు తరగతి గదులు నిర్మించడంతో పాటు విద్యాలయం ప్రారంభానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రీయ విద్యాలయాల అధికారులు పలుమార్లు తాత్కాలిక భవనాలు, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదే కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవుతుందని అంతా భావించారు. పలు సాంకేతిక కారణాలతో కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడంతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కందుకూరుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు రావడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కందుకూరు పట్టణంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. నాణ్యమైన విద్యకు ప్రామాణికం అత్యుత్తమ విద్యాబోధనకు కేంద్రీయ విద్యాలయాలు నిలయాలుగా ఉంటున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ విద్యాలయాల్లో సీబీఎస్సీ సిలబస్‌తో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగుతుంది. ఫస్టుక్లాస్ నుంచి 5వ తరగతి వరకు ప్రస్తుతం క్లాసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అదనపు తరగతులు పెంచుకుంటూ ఉంటారు. ఇలా ఇంటర్ వరకు కేంద్రీయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. కందుకూరు ప్రాంతంలో గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సంస్థ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విద్యాలయం మంజూరైనా బోధన, బోధనేత సిబ్బంది నియామకం జరగాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత భవనాలు టీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో.. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీలో తాత్కాలిక భవనాలు, తరగతి గదులు ఏర్పాటు చేసినా శాశ్వత భవనాలు మాత్రం స్థానిక టీఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్మించనున్నారు. ఇప్పటికే కేంద్రీయ విద్యాలయ అధికారులు ఆ స్థలాలను పరిశీలించి వెళ్లారు. రెవన్యూ అధికారులు సైతం టీఆర్ఆర్ కాలేజీ ఆవరణలో స్థలాన్ని సరిహద్దులు నిర్ణయించి కేంద్రీయ విద్యాలయాలకు అందించారు. -
అభివృద్ధికి విఘాతమైన రాజకీయం తగదు
జేఎన్టీయూ(అనంతపురం): స్వాతంత్య్రం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ను ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించే రాజకీయం తగదన్నారు. ఆయన ఆదివారం జేఎన్టీయూ–అనంతపురంలోని ఇంక్యుబేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తాత్కాలిక క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ యూనివర్సిటీలో పదేళ్లలో 5,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతలూరు వద్ద 460 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం భవన నిర్మాణాలకు రూ.460 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. మూడేళ్ల తర్వాత మరో రూ.500 కోట్లు మంజూరు చేస్తామన్నారు. నూతన విద్యాసంస్థలకు 100% గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉన్నత విద్యాసంస్థలను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంఉదారంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు. అయినప్పటికీ టీడీపీ మంత్రులు, ఎంపీలు రాజకీయాలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. విద్య పురోగతికి సంబంధించిన అంశాల పట్ల రాజకీయాలు చేయొద్దని చెప్పారు. నాణ్యనమైన ఉన్నత విద్య మాత్రమే మోదీ ప్రభుత్వానికి జాతీయ ఎజెండా అని, ఇంకే రకమైన ఎజెండాలు లేవని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. నూతనంగా ఏర్పడే విద్యాసంస్థలకు 100 శాతం గ్రాంట్లు తప్పనిసరిగా మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యకు రూ.3,600 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. 2015 జూన్‌లో తిరుపతిలో ఐఐటీని ప్రారంభించామని, ఇందుకోసం రూ.1,074 కోట్లు జారీ చేశామని గుర్తుచేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, విశాఖపట్నంలో ఐఐఎంను ప్రారంభించామన్నారు. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి: మంత్రి గంటా అనంతపురంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వెంటనే రాష్ట్ర మంత్రితో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నీ అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. ఏపీలో విద్యాసంస్థల నిర్మాణానికి రూ.వేల కోట్లు మంజూరు చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్తామన్న నిధుల్లో 10 శాతం నిధులు కూడా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. బహిరంగ సభ వేదికపై కేంద్ర మంత్రి గణాంకాలతో వివరాలు చెబుతుంటే మీరు ఎందుకు నిలదీయలేదని విలేకరులు అడగ్గా.. ‘‘ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి చివర్లో మాట్లాడుతారు. మా ప్రసంగం తర్వాత ఆయన మాట్లాడారు. కాబట్టి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు తెలియజేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. -
మానవతా దృక్పథంతో ఏపీని ఆదుకోవాలి
అనంతపురం జిల్లా: జేఎన్టీయూలో సెంట్రల్ యూనివర్సిటీ తాత్కాలిక భవనాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుతో కలిసి ప్రారంభించారు. రాష్ర్ట విభజన హామీల్లో భాగంగా అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ మంజూరైంది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరు గ్రామంలో 600 ఎకరాల భూమి కేటాయించినా ఇప్పటిదాకా ఎలాంటి కట్టడాలు ప్రారంభించలేదు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు వెలువెత్తిన నేపథ్యంలో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం జేఎన్టీయూలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఏపీని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ర్ట విభజన హామీల కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నాం..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఏపీ హక్కుల కోసం వైఎస్సార్సీపీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తోందని, ఏపీ న్యాయం చేయాలని విన్నవించారు. -
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదముద్ర
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనిర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 5 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ఏపీలో విద్యావకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. గత సంప్రదాయానికి భిన్నంగా సొసైటీ ఏర్పాటు చేసి క్లాసులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. -
కేరళ సెంట్రల్ వర్సిటీ చాన్స్‌లర్‌గా శేషగిరిరావు
సాక్షి, హైదరాబాద్: కేరళ సెంట్రల్ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్.వి.శేషగిరిరావును నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ సీనియర్ నాయకుడైన శేషగిరిరావు తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. బీజేపీకి అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. -
సెంట్రల్ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా ఓయూ ప్రొఫెసర్!
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావుకు కీలక పదవి లభించింది. ఆయనను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ చాన్స్‌లర్‌గా నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, డీన్‌గా అనేక సంవత్సరాలు ఎస్వీ శేషగిరిరావు సేవలు అందించారు. ఆయనకు బీజేపీతో అనుబంధముంది. బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన వ్యవహరించారు. -
కరువు సీమకు కల్పతరువు..
సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు. గత విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వహణకు సరైన స్థలాన్ని గుర్తించాలని కమీషనర్ పాండాదాస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. -
ఏపీలో కేంద్రీయ వర్సిటీకి కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు కేంద్రం రాష్ట్రంలో అనంతపురం జిల్లా జంతులూరు గ్రామంలో ఈ కేంద్రీయ విశ్వ విద్యాలయాన్ని స్థాపించనుంది. ‘సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఈ వర్సిటీని పిలుస్తారు. నిర్మాణానికి తొలి విడత వ్యయానికి రూ.450 కోట్లు కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం (2018-19) నుంచే తాత్కాలిక ప్రాంగణంలో పని చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. -
ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ వర్సిటీకి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశ్వవిద్యాలయానికి ‘ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ’గా నామకరణం చేశారు. అనంతపురం జిల్లా జంతులూరులో రూ. 902.07 కోట్లతో వర్సిటీ ఏర్పాటు కానుంది. పూర్తిస్థాయిలో భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆదేశాలతో తన కుమారుడు రోహిత్ వేముల మృతికి పరిహారంగా సెంట్రల్ వర్సిటీ అందజేసిన రూ.8 లక్షలను తాను స్వీకరించినట్లు రోహిత్ తల్లి రాధిక వేముల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమకు పరిహారంగా ఇచ్చిన డబ్బులు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ పొదిలి అప్పారావు సొత్తు కాదని అన్నారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేవరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులపై తాము చేపట్టిన న్యాయపోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
సెంట్రల్ వర్సిటీ విద్యార్థిపై లైంగిక దాడి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో హోమో సెక్సువల్ వేధింపుల కేసు నమోదయింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సు చదువుతున్న సగ్ నిక్ అనే విద్యార్థిపై ఎంబీఏ చదువుతున్న మరో విద్యార్థి మహ్మద్ రినీష్ తన హాస్టల్ రూంలో లైంగిక దాడి చేశాడు. దీంతో బాధితుడు సగ్ నిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థిని లైంగికంగా వేధించిన మహ్మద్ రినీష్ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. -
భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆమోదం తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సోమవారం అంగీకరిం చింది. ఈ విద్యాసంవత్సరం (2017–18) నుంచే భువనగిరిలోని ఏఎల్‌ఎన్‌రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కేంద్రీయ విద్యాలయం కార్యకలాపాలు కొనసాగుతాయని, ఒక్కో తరగతికి ఒక్కో సెక్షన్ చొప్పున ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపింది. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ఇప్పటికి కేంద్రం స్పందించి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
ఎంపీ ఆశయానికి మోకాలడ్డు..
► కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎంపీ మిథున్‌రెడ్డి తపన ► భూ సేకరణ, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అడ్డంకులు చిత్తూరు, సాక్షి: మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం మోకా లొడ్డుతోంది. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయం నెలకొల్పాలనే ఎంపీ మిథున్‌రెడ్డి సంకల్పానికి ప్రభుత్వపెద్దలు, అధికారులు అడుగడుగునా అడ్డం పడుతున్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని అవలంబి స్తోంది. మదనపల్లె ప్రాంతంలో పెద్ద ఎత్తున కేంద్రప్రభుత్వ ఉద్యోగులున్నారు. కరువు ప్రాంతం కావడంతో పిల్లల చదువుపై ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో పేదలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. పిల్లలు పెద్ద సంఖ్య లో కార్మికులుగా మారుతున్నారు. దీన్ని గుర్తించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాయలం నెలకొల్పితే మంచి ప్రయోజనం ఉంటుందని ఆశించారు. ఇందు కోసం ఆయన ఎంపీ అయిన తొలినాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భూకేటాయింపులు జరి పితే వెంటనే కేంద్రీయ విద్యాలయం నెలకొల్పోందుకు నిధులు కూడా విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరేట్‌కు 2014 డిసెంబర్లోనే ఉత్తర్వులు పంపింది. సిద్ధార్థజైన్ నిర్లక్ష్యం.. భూకేటాయింపులు జరిపితే పేద పిల్లలకు మంచి విద్య అందే అవకాశం ఉన్నా.. బదిలీ అయిన జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ మోకాలడ్డారు. భూకేటాయింపులు, పాఠశాల నెలకొల్పడానికి ఇతర సౌకర్యాల వివరాలు కేం ద్రానికి పంపాలని ఎంపీ మిథున్‌రెడ్డి ఎన్నోసార్లు విన్నవిం చినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీనివల్ల అతి తక్కువ వ్యయంతో అత్యున్నత ప్రమాణాల విద్య చదువుకునే అవకాశం పేద పిల్లలు కోల్పోనున్నారు. సిద్ధార్థజైన్ బదిలీ కావడంతో మరో సారి ఎంపీ మిథున్‌రెడ్డి కొత్త కలెక్టర్ ప్రద్యుమ్నకు లేఖ రాశారు. కేంద్రీయ విద్యాలయానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. భూకేటాయింపులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే కేంద్రీయ విద్యాలయం మదనపల్లెలో త్వరితగతిన నెలకొల్పేం దుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎంపీ మిథున్‌రెడ్డి అంటున్నారు. -
క్యాంపస్ టాక్
-
హెచ్‌సీయూలో కొనసాగుతున్న వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివక్షకు నిలయంగా మారుతోంది. అధికారుల వైఖరి కారణంగా ఉన్నత విద్యావంతులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. మొన్న మాదారి వెంకటేశం, నిన్న వాసు, నేడు మోజెస్ అబ్రహం. పేర్లు వేరైనా దళితులపై వివక్ష కారణంగానే వారు అన్యాయానికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరి కొందరు పారిపోతున్నారు, మరికొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారుల వైఖరిలో మార్పురావడం లేదు. శుక్రవారం రాత్రి మోజెస్ అబ్రహం అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో వర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రోహిత్ వేముల ఆత్మహత్యతో వివక్షపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినా హెచ్‌సీయూలో ఎలాంటి మార్పు రాకపోగా దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతూనే ఉది. కొందరు విద్యార్థులు దీనిని తట్టుకోలేక, బానిసలుగా బతకలేక చావుకు సిద్ధపడుతుండగా మరి కొందరు కష్టపడి సంపాదించుకున్న సీట్లను వదిలేసి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మరికొందరు కూలిచేసి చదివిస్తున్న తల్లిదండ్రులకు ముఖం చూపలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2013 నవంబర్ 24న మాదారి వెంకటేశం అనే దళిత పీహెచ్‌డి స్కాలర్ ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీం పట్నానికి చెందిన వెంకటేశం 2011లో అడ్వాన్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హై ఎనర్జీ లో పీహెచ్డీ కోర్సులో చేరాడు. వర్సిటీ నిబంధనల మేరకు అతనికి పీహెచ్‌డీలో చేరిన రోజే గైడ్‌ను కేటాయించాల్సి ఉంది. అయితే అతడికి మూడేళ్ల పాటు గైడ్‌ను ఇవ్వకపోవడంతో మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మోజెస్ అబ్రహం కూడా అదే డిపార్ట్మెంట్, అదే అంశం (ఫిజిక్స్ )పై పరిశోధన చేస్తుండటం గమనార్హం. మాదారికి ఎదురైన వేధింపులే అబ్రహంకు ఎదురయ్యాయి. దళిత క్రిస్టియనైన మోజెస్ అబ్రహం 17న హెచ్‌సియులో జరిగిన ఓ సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేశాడు. అప్పటికే ప్రతి చిన్న విషయానికీ వేధిస్తున్న సూపర్వైజర్ ప్రొఫెసర్ జి.ఎస్. వైతీశ్వరన్ అబ్రహంకి గైడ్ గా ఉండనని, తక్షణమే గైడ్‌ను మార్చుకోవాలని చెప్పడంతో అతడి ఎదురుగానే బ్లేడ్‌తో ముంజేతి నరం కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడికి యూనివర్సిటీలో డాక్టర్ అనుపమ కుట్లువేసి బంజారా హిల్స్‌లోని ఆశా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తన కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్తూ కూడా సూపర్వైజర్ జిఎస్.వైతీశ్వరన్ దుర్భాషలాడినట్లు తెలిసింది. దీనికితోడు గైడ్‌గా కొనసాగేందుకు ప్రొఫెసర్ తిరస్కరించడం, ‘మీకెందుకు చదువ’ంటూ ఎద్దేవా చేయడం ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాయని ఎఎస్ఎ నాయకుడు దొంత ప్రశాంత్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రొ వీసీగా ఉన్న బిపిన్ శ్రీవాస్తవ్ అవమానించినందునే తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి సంఘం నాయకులు సన్నంకి మున్నా, వెంకటేశ్ చౌహాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ల్యాబ్ పరికరాలు, మెటీరియల్ ఇవ్వకుండా వేధించడం సైన్స్ డిపార్ట్మెంట్లో సర్వసాధారణమని ఆరోపించారు. ఇదిలా ఉండగా 2013లోనే వాసు అనే మరో విద్యార్థి గైడ్ వేధింపులకు తాళలేక పిహెచ్డి మూడవ సంవత్సరంలో వదిలేసి తఇతర కోర్సులకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
సెంట్రల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
-
సెంట్రల్ వర్సిటీలో దళిత విద్యార్థి ఆత్మహత్యాయత్నం
► గైడ్ వేధింపుల కారణంగానే అంటున్న విద్యార్థులు! ► ల్యాబ్‌లో చేతి మణికట్టు వద్ద కోసుకున్న మోజెస్ అబ్రహం ► వెంటనే ఆస్పత్రికి తరలించిన విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది ► పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. మోజెస్ అబ్రహం అనే మరో దళిత పరిశోధక విద్యార్థి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన ఆయన... వర్సిటీలో ఏసీఆర్ఈహెచ్ఎం విభాగంలో పీహెచ్డీ రెండో సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ల్యాబ్‌లో చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆశా ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం అబ్రహం పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివక్ష చూపడం వల్లే..?: అబ్రహం ఆత్మహత్యాయత్నానికి ఆయన గైడ్ వేధింపులే కారణమని వర్సిటీలోని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందిన విద్యార్థులు ఆరోపించారు. అబ్రహం తాను చేపట్టిన అంశానికి సంబంధించి రెండు పరిశోధన పత్రాలు సమర్పించారని, అవి రెండు ప్రముఖ జర్నల్స్‌లో అచ్చు అయ్యాయని వారు తెలిపారు. అరుునప్పటికీ పరిశోధన అంశాన్ని మార్చుకోవాలంటూ అబ్రహంను గైడ్ వేధించారని పేర్కొన్నారు. ఇటీవల అబ్రహం పరిశోధిస్తున్న అంశంపై జరిగిన సెమినార్‌కు హాజరుకానీయకుండా ఆయనను అడ్డుకుని, వివక్ష చూపడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. ఇదే పరిశోధన విభాగంలో 2004లో పరిశోధక విద్యార్థి మాదారి వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష కారణంగానే ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘సింబాయాసిస్’లో మూట్‌కోర్టు పోటీలు
కొత్తూరు: మండలంలోని మామిడిపల్లిలో ఉన్న సింబాయాసిస్ అంతర్జాతీయ యూనివర్సిటీలో శనివారం మూట్‌కోర్టు పోటీలు నిర్వహించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు, ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. మూట్‌కోర్టు పోటీలు న్యాయవాద విద్యార్థులకు నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ఈ రోజుల్లో న్యాయవాద విద్యార్థులు డబ్బు సంపాదన కోసం వివిధ రంగాలను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. లా చదివిన విద్యార్థులు న్యాయవాద వత్తిని చేపట్టి సమాజశ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. అనంతరం పలువురు విద్యార్థులు చరణ్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ఉరిశిక్షకు సంబంధించిన లాహోర్‌కుట్ర కేసు లఘునాటికను ప్రదర్శించారు. ఈనెల 23న ప్రారంభమైన పోటీలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. కార్యక్రమంలో సింబాయాసిస్ న్యాయ కళాశాల మూట్‌కోర్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ అభిజిత్ వస్మత్కర్, కళాశాల డైరెక్టర్ భేగ్, డిప్యూటీ డైరెక్టర్ సుఖ్వీందర్సింగ్, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు -
సెంట్రల్ వర్సిటీకి కేంద్రం ఆమోదం
అనంతపురం అర్బన్ : బుక్కరాయసముద్రం మం డలం జంతులూరు వద్ద కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్ యూనివర్సిటీ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాల భూమిని అధికారులు ఇప్పటికే సేకరించారు. ప్రహరీ నిర్మాణానికి అంచనాలు కూడా సిద్ధం చేసి.. నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు అంటున్నారు. -
రోహిత్ వేముల దళితుడే: పునియా
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిన కమిషన్... అతడిది ఏ కులం అనే దానిపై నివేదిక ఇవ్వడం దురదృష్టకరమన్నారు. రోహిత్ దళితుడేనని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ నిర్థారించారని, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్న విషయాన్ని పునియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏకసభ్య కమిషన్ వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. -
రోహిత్ దళితుడు కాదు..!
-ఏకసభ్య కమిషన్ నిర్ధారణ -అప్పారావు నిర్దోషి అంటూ కితాబు సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ దళితుడు కాదని, కాబట్టి అక్కడ వివక్షకి ఆస్కారం లేదంటూ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఆగస్టు మొదటి వారంలో తన నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన వైస్ ఛాన్సలర్ పొదలి అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్లపై విద్యార్థులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైన నేపధ్యంలో రోహిత్ కులం పై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు బిజెపి చర్చ లేవనెత్తాయి. రోహిత్ దళితుడు కాదని తేల్చే ప్రయత్నం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అశోక్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. అయితే ఈ కమిషన్ యూనివర్సిటీ లో వివక్ష జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, బిజెపి మంత్రులను కాపాడే లక్ష్యంతో ఈ రిపోర్టు తయారయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ దళితుడు కాదని, కనుక వివక్షకి తావులేదని, అలాగే వీసీ పొదిలె అప్పారావుకి రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదని, అతను నిర్దోషి అంటూ కితాబివ్వడం గమనార్హం. ఈ విషయమై రోహిత్ తల్లి రాధిక స్పందిస్తూ ‘‘నేను ఎస్సి మాల అని, నా కొడుకు కూడా అదే కులానికి చెందిన వాడని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ లు చెప్పారు. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నా కొడుకు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారిస్తారు’’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి బిజెపి మంత్రులను కాపాడేందుకేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసునించి మంత్రులను, తమ అనుచరులను తప్పించేందుకు బిజెపి కుట్రగా దీన్ని అభివర్ణించారు. రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి వేముల సాక్షితో మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఎదుట తమ గోడు వినిపించే అవకాశం కూడా రూపన్వల్ ఇవ్వలేదని, అలాగే కులం గురించి ఒక్క ప్రశ్నకూడా తన తల్లి రాధికని గానీ, తనను గానీ అడగలేదని, అలాంటిది రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారణకు వస్తారన్నారు. ఏకసభ్య కమిషన్, విచారణ సందర్భంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని, తాము చెప్పేదేదీ వినకుండా ‘‘అవన్నీ మాకు తెలుసు, కొత్త విషయాలు చెప్పండి’’ అంటూ తమ వాదాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కమిషన్ ఇవ్వలేదని రాజా తెలిపారు. నిజానికి రోహిత్ ఆత్మహత్యకు కారణమే వివక్ష అయినప్పుడు వివక్ష గురించి చెపుతుంటే చెప్పనివ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తమకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా పూర్తి రిపోర్టు బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు. -
రోహిత్ చట్టం తేవాలి: కన్హయ్య కుమార్
- మోదీ క్రసీ నడుస్తోంది - విద్యావిధానంలో సమూల మార్పులు రావాలి - లౌకిక విద్య కోసం రోహిత్ చట్టం తేవాలి - బీఫ్ తినొద్దని పశువుల కోసం మనుషులను చంపుతున్నారు - మీడియా సమావేశంలో జెఎన్‌ఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ సాక్షి, హైదరాబాద్ ప్రజాస్వామ్యం పతనమై(డెమోక్రాష్) మోడీక్రసీ నడుస్తోందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ, ఢిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ధ్వజమెత్తారు. దేశంలో మహిళ, దళిత, ముస్లిం అణిచివేత విధానాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఒక సెమినార్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఖాద్రీ, రాష్ట్ర అధ్యక్షుడు వేణు, ఇతర విద్యార్థి నాయకులు శంకర్, రాజారాంలతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న జాతి, మనువాద విధానాలు దేశంలోని ప్రధాన యూనివర్సిటీల్లో ఉన్నాయని, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రోహిత్ చట్టం తీసుకురావడం ద్వారా అందరికీ విద్య, సమసమాజ స్థాపనకు కషి చే యాలన్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోకి మీడియాను కూడా అడ్డుకుంటున్నారని, రోహిత్ మరణం తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. ప్రధానమంత్రి, విద్యా మంత్రుల డిగ్రీల విషయంలో ప్రశ్నలు తలెత్తే పరిస్థితి దేశంలో నెలకొందన్నారు. విద్యావ్యవస్థ పునాదుల నుంచే బలంగా ఉంటే ఎంసెట్ లీకేజీ వంటి దుష్పరిణామాలు పునరావతం కావన్నారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత..!
గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ విద్యార్థి సంఘం షాపింగ్ కాప్లెక్స్ వద్ద సమావేశమైంది. ప్రతిగా మరో విద్యార్థి సంఘం సౌత్ క్యాంపస్ నుంచి ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్ హాస్టల్ వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు సంఘాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం మాయం కావడంతో మరో విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున ఏఎస్ఏ ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది విగ్రహాన్ని లోపలికి తీసుకురావద్దని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులకు ఫిర్యాదు హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మియాపూర్ ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన మేరకు.. హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలో కైలాసం అనే విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఆ తర్వాత మరోవిద్యార్థి అన్‌మోల్‌సింగ్‌ను సైతం అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆ సమయంలో ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఆస్పత్రి వద్ద ఉన్నాడు. అన్‌మోల్‌సింగ్‌ను చూపిస్తూ తనపై ఇతనే దాడి చేశాడని కైలాసం..సుశీల్‌కు చెప్పాడు. దీంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మేరకు సుశీల్‌కుమార్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేయగా...అన్మోల్సింగ్పై ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా ఈ అంశంపై హెచ్‌సీయూ జేఏసీ నాయకుడు ప్రశాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ విద్యార్థిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. అన్‌మోల్‌సింగ్ కూడా తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన.. పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ బలవన్మరణానికి పాల్పడి ఆరునెలలు పూర్తికావడంతోపాటు, కారంచేడు ఘటన జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్సిటీ విద్యార్థులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ చట్టం తీసుకురావాలని నినాదాలుచేశారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రోహిత్ చిత్రపటంతో ఊరేగింపు జరిపారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
తెలంగాణ చరిత్రకు అరుదైన అవకాశం
సెంట్రల్ యూనివర్సిటీలో చేర్చేందుకు కోదండరాం హామీ భీమదేవరపల్లి: భీమదేవరపల్లి తెలంగాణ చరిత్రకు అరుదైన అవకాశం దక్కింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఈ చరిత్ర పుస్తకా న్ని భద్రపర్చేందుకు అవకాశం కల్పించేందుకు కృషిచేస్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీఇచ్చారు. భీమదేవరపల్లి తెలంగాణ చరిత్రను స్థానిక జేఏసీ నాయకులు 350 పేజీలతో ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. దానికి ముందు మాట రాయడానికి మండల జేఏసీ చైర్మన్ డ్యాగల సారయ్య, జిల్లా కో చైర్మన్ చెప్యాల ప్రభాకర్, పుస్తక రచయిత ఏరుకొండ నర్సింహాస్వామి తదితరులు ప్రొఫెసర్ కోదండరాం, పిట్ట ల రవీందర్, దేశపతి శ్రీనివాస్‌ను కలిశారు. ఈ పుస్తకాన్ని పరిశీలించిన కోదండరాం ఆశ్చర్యానికి గురయ్యూరు. ఈ చరిత్రను సెంట్రల్ యూనివర్సిటీలో భద్రపర్చుతామన్నారు. జూన్ 3న జరగనున్న యూనివర్సిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. -
సెంట్రల్ వర్సిటీల్లో 6 వేల పోస్టులు ఖాళీ
► తెలంగాణలో 300 పోస్టులు ఖాళీ ► ఎంపీ మేకపాటి ప్రశ్నకు స్మృతీ ఇరానీ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతీ ఇరానీ సోమవారం సమాధానం ఇచ్చారు. మొత్తం పోస్టులు 16,600 ఉండగా అందులో ఏకంగా 5,928 ఖాళీగా ఉన్నాయన్నారు. ఇందులో ప్రొఫెసర్ పోస్టులు 1277, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 2,173, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,478 పోస్టులున్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పరిధిలో 680 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇతర ప్రాంతాల్లోని పాత సెంట్రల్ వర్సిటీల్లో 3,943 పోస్టులు, కొత్త వర్సిటీల్లో 1,305 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటి భర్తీ ఆయా వర్సిటీలే చేపట్టాల్సి ఉందని వివరించారు. గతేడాది ఫిబ్రవరిలో వీసీల సదస్సులో ఈ అంశంపై చర్చించామని తెలిపారు. అలాగే రాష్ట్రపతి అధ్యక్షతన గతేడాది నవంబరులో జరిగిన విజిటర్స్ సదస్సులో కూడా చర్చించామని తెలిపారు. ఇక తెలంగాణలోని మూడు సెంట్రల్ వర్సిటీల్లో 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో 77 పోస్టులు, హైదరాబాద్ వర్సిటీలో 164 పోస్టులు, ఇఫ్లూలో 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
కృష్ణాజలాల వాటాలో పాలమూరుకు అన్యాయం
ఉద్యమ హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం {పొఫెసర్ హరగోపాల్ ధ్వజం మహబూబ్‌నగర్ అర్బన్ : సొంత రాష్ట్రంలో కృష్ణానదీ జలాల వాటా కోసం పోరాడాల్సి రావడం దురదృష్టకరమని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళ న వ్యక్తం చేశారు. పాలమూరు అధ్యయన వేదిక అధ్వర్యంలో ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో కృష్ణానది ‘నీళ్లు.. మహబూబ్‌నగర్ విషాదగాథ’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన ప్రధానవక్తగా ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధానాంశాలుగా చేసుకుని తెలంగాణ ఉద్యమం చేశామని, కానీ 18 నెలల కాలంలోనే వాటికోసం మళ్లీ ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఉద్యమపార్టీ టీఆర్ ఎస్ కృష్ణాజలాల విషయంలో మహబూబ్‌నగర్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. -
రోహిత్ తల్లికి గుంటూరులో ఇల్లు ఇవ్వండి
- ముఖ్యమంత్రికి ఎంపీ వీహెచ్ లేఖ న్యూఢిల్లీ ఆత్మహత్య చేసుకున్న సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధికకు గుంటూరులో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడికి మంగళవారం ఒక లేఖ రాశారు. దళితులపై వివక్ష కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంత పరిహారం ఇచ్చినా ఆ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని భర్తీచేయలేమని తెలియజేశారు. అందువల్ల మానవీయ కోణంలో ఆమెకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. -
సబ్ కమిటీ నిర్ణయం మేరకే చర్యలు
♦ విచారణ కమిషన్ ఎదుట ♦ హెచ్‌సీయూ వీసీ అప్పారావు హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటనపై మూడు రోజులుగా జరుగుతున్న ఏకసభ్య కమిటీ విచారణ గురువారంతో ముగిసింది. ఈ ఘటనలో వర్సిటీ యాజమాన్యం తప్పేమీ లేదని హెచ్‌సీయూ అధికారులు అశోక్ రూపన్‌వాలా నేతృత్వంలోని కమిషన్‌కు నివేదించారు. అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఉన్నతాధికారులు, విద్యార్థులను కమిషన్ ఈ సందర్భంగా విచారించింది. చివరి రోజు విచారణకు హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్ పొదిలె అప్పారావు హాజరయ్యారు. అంబేడ్కర్ స్టూడెం ట్స్ అసోసియేషన్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన గొడవ సమయంలో తాను వీసీగా బాధ్యతలు చేపట్టలేదని అప్పారావు కమిషన్‌కు తెలిపారు. అప్పటి వీసీ తొలుత యూనివర్సిటీ క్రమశిక్షణ సంఘంతో విచారణ జరిపారని, తదనంతరం నిపుణులతో సబ్ కమిటీని నియమించారని చెప్పారు. సబ్ కమిటీ నిర్ణయం మేరకే విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు విన్నవించారు. శిక్ష పరిమితిని తగ్గించేలా తాను కృషి చేశానని, విద్యార్థులతో స్నేహపూర్వక ధోరణి ప్రదర్శించానన్నారు. రోహిత్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని, తప్పేమి లేనప్పటికీ తనపై నిందలు మోపడం తీవ్రంగా బాధిం చిందన్నారు. అనంతరం ప్రస్తుత ఇన్చార్జి వీసీ పెరియసామి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను కమిషన్‌కు నివేదించారు. కమిషన్‌ను కలసిన వారిలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఎం.సుధాకర్, ఫైనాన్స్ ఆఫీసర్ పాండురెడ్డి ఉన్నారు. విరాచణ కమిటీ ఈ నివేదికను త్వరలో కేంద్రానికి సమర్పిస్తుంది. -
విద్యార్థులు ఢిల్లీకి వెళ్లిన రోజే విచారణా?
యూనివర్సిటీలో ఉన్నప్పుడే కమిటీని పంపాలి : ప్రొ. కోదండరాం విద్యారణ్యపురి: సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ మృతి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 23న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అరుుతే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విచారణ కమిటీని హైదరాబాద్‌కు పంపించడం ఏమిటని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. విద్యార్థులు లేనప్పుడు విచారణ ఎలా జరుపుతారని అన్నారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ అమరుడు పిల్లి గిరిబాబు వర్ధంతి సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 23న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారని, ఆ రోజు విచారణకు వచ్చి గోడలు, కిటికీలను విచారిస్తారా? అని ఎద్దేవా చేశారు. రోహిత్ మృతిపై వాస్తవాలు మరుగనపడేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 23న కాకుండా.. విద్యార్థులు యూనివర్సిటీలో ఉండే.. మరో రోజు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
హెచ్‌సీయూ ఘటనకు కేంద్రానిదే బాధ్యత
రోహిత్ వేములది ఆత్మహత్యకాదని, ముమ్మాటికీ కేంద్రప్రభుత్వం చేసిన హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు. సెంట్రల్‌యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులకు సోమవారం సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటిం చారు. రోహిత్ వేముల తల్లి రాధికకు లక్ష రూపాయాల చెక్కును అందజేశారు. రిలే దీక్షల్లో ఉన్న ప్రజాసంఘాల నాయకులతో సీపీఐ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. వీసీ అప్పారావు కేంద్రమంత్రి ఒత్తిడితోనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. వీసీ, దత్తాత్రేయ, స్మతి ఇరానీ లను తొలగించి విచారణ చేపడితే ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి విశ్వజీత్కుమార్ మాట్లాడుతూ.. రోహిత్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐఎస్ఎఫ్ పూనుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, వేణు పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
హెచ్‌సీయూలో ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
హైదరాబాద్: రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హెచ్‌సీయూ మరోసారి వేడెక్కింది. విద్యార్థి ఆత్మహత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నాడని ఆరోపిస్తూ.. ఏబీవీపీ విద్యార్థులు రాహుల్ గో బ్యాక్ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీలు జులిపించారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు యూనివర్సిటీలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్ నిర్వహిస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
-
సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్: హెచ్ సీయూలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్‌కు న్యాయం జరగాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటి వ్యక్తులను యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు మాజీ మంత్రులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ నుండి పలువురు విద్యార్థులు హెచ్సీయూకు చేరుకున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కాగా ఐడీ కార్డు లేనివారిని పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది విద్యార్థులు హెచ్సీయూకు రానున్నట్లు విద్యార్థి జేఏసీ నేతలు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఇవాళ నిర్వహించే సభలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బాలచంద్ర ముంగేకర్, జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీనా కందస్వామి, హరగోపాల్, కాకి మాధవరావు సహా పలువురు పాల్గొననున్నారు. -
రోహిత్ కుటుంబానికి రూ.8లక్షల ఆర్థిక సాయం
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శుక్రవారం రూ.8లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రోహిత్ ఆత్మహత్య, వర్సిటీలోని పరిణామాలు తదితర అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఇవాళ ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమిటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనుంది. -
రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణ
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ మంత్రి స్మృతీ ఇరానీ శుక్రవారం ప్రకటించారు. ఈ అంశంపై జ్యుడిషియల్ కమటీ విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కుమారుడిని కోల్పోయిన రోహిత్ తల్లితో ఫోన్ లో మాట్లాడిన స్మృతీ ఇరానీ.. తన సంతాపాన్ని తెలిపారు. అలాగే విద్యా రంగంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మానవ వనరుల శాఖ ప్రకటించింది. దళిత విద్యార్థుల పట్ల వివక్ష మూలంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని విమర్శలు వస్తున్న నేపథ్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
నేడు హైదరాబాద్ జేఎన్టీయూ బంద్
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం బంద్ పాటించాలని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. యూనివర్సిటీతోపాటు అనుబంధ కళాశాలల్లోనూ తరగతులు బహిష్కరించాలని కోరాయి. బంద్‌లో భాగంగా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ధర్నాలో పాల్గొనాలని కోరాయి. -
‘పైరవీ’ వీసీ!
► హెచ్‌సీయూ వీసీగా అప్పారావు నియామకానికి చక్రం తిప్పిన కేంద్రమంత్రి ► అనేక మంది సీనియర్లను కాదని అప్పారావుకు బాధ్యతలు ► సెర్చ్ కమిటీ తుది జాబితాలో ప్రస్తుత వీసీ పేరు చూసి ఆశ్చర్యపోయిన సీనియర్లు.. ► అతను చీఫ్ వార్డెన్‌గా ఉన్నప్పటికే ప్రొఫెసర్లుగా ఉన్నవారికి కూడా రాని అవకాశం ► తుది జాబితాలో సీసీఎంబీ మాజీ డెరైక్టర్ మోహన్‌రావు, జేఎన్టీయూ మాజీ వీసీ డీఎన్ రెడ్డి.. వారిని కాదని అప్పారావుకు చాన్స్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ నియామకంలో కేంద్ర మంత్రి ఒకరు చక్రం తిప్పిన విషయం బయటపడింది. ఈ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 16 మంది సీనియర్ ప్రొఫెసర్లను పక్కనబెట్టి వారందరికంటే జూనియర్ అయిన పి.అప్పారావు వైస్ చాన్స్‌లర్ అయ్యేలా ఆ మంత్రి తన పలుకుబడిని ఉపయోగించారు. ఆఖరుకు సెర్చ్ కమిటీ సిఫారసు చేసిన ఐదుగురిలో ఏరకంగా చూసినా అప్పారావు అర్హతలు తక్కువేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయినా ఆయనకు వీసీగా ‘అవకాశం’ వచ్చింది. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉండడం వల్లే తాను వీసీ అయ్యానని అప్పారావు పలుమార్లు తన సన్నిహితులతోను, సహచర ప్రొఫెసర్లతోనూ చెప్పుకొన్నారు కూడా. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్ నియామకంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఉదంతం అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ద్విసభ్య కమిటీ సైతం వైస్ చాన్స్‌లర్ నియామక ప్రకియకు సంబంధించిన ఫైల్‌ను పరిశీలించింది. హెచ్‌సీయూలో బోధనా సిబ్బంది కొందరు ఇచ్చిన సమాచారం మేరకు.. కమిటీ ఆ ఫైల్‌ను పరిశీలించినట్లు అత్యున్నత అధికార వర్గాలు ధ్రువీకరించాయి. మొత్తంగా వైస్ చాన్స్‌లర్ వ్యవహారశైలి బాగా లేకపోవడం వల్లే వర్సిటీలో విపరీత పోకడలు చోటు చేసుకున్నాయని ద్విసభ్య కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ కమిటీ సభ్యులు గురువారం ఢిల్లీలో మానవ వనరుల శాఖ కార్యదర్శికి తమ నివేదికను అందజేశారు. జూనియర్ అయినా.. హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం కేంద్ర మానవ వనరుల శాఖ గతేడాది జూలైలో సెర్చ్ కమిటీని నియమించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వగా 190 దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ వడపోసిన కమిటీ 21 మందిని జాబితాలో పెట్టింది. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 17 మంది హెచ్‌సీయూలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు. వారందరిలోనూ ప్రస్తుత వీసీ అప్పారావు జూనియర్ అని విశ్వవిద్యాలయ బోధనా సిబ్బంది పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాలో చోటు దక్కని మరో 17 మంది కూడా అప్పారావు కంటే సీనియర్లని ఓ ప్రొఫెసర్ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. సెర్చ్ కమిటీ ఈ వర్సిటీకి చెందిన 17 మందితో పాటు బయటి వ్యక్తులు నలుగురిని ఇంటర్వ్యూ చేసింది. చివరగా ఎవరి పేర్లు సిఫారసు చేయాలన్న విషయంలోనూ మానవ వనరుల శాఖ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ నడుచుకున్నదని పేరు చెప్పేందుకు ఇష్టపడని సీనియర్ ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. ‘‘మా పేరు లేకపోయినా ఫరవాలేదు. కానీ తుది జాబితాలో అప్పారావు పేరు చూసి మేం షాకయ్యాం. మాలో చాలా మంది కంటే ఆయన జూనియర్. ఆయన చీఫ్ వార్డెన్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే మేం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాం. ఆయన పేరు జాబితాలో ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. ఆ తరువాత తెలిసిందేమంటే కేంద్ర మంత్రి ఒకరు ఆయనకు సన్నిహిత బంధువు..’’ అని ఆయన తెలిపారు. చక్రం తిప్పిన కేంద్ర మంత్రి హెచ్‌సీయూ వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీ ఐదుగురి పేర్లను మానవ వనరుల శాఖకు సిఫారసు చేసింది. ఇందులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ‘సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ (సీసీఎంబీ)’ డెరైక్టర్‌గా పనిచేసిన మోహన్‌రావు, ‘జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)’ మాజీ వీసీ డీఎన్ రెడ్డి ఉన్నారు. ఏరకంగా చూసినా అప్పారావు కంటే వారిద్దరూ సీనియర్లు. కానీ వారిని కాదని అప్పారావుకు వీసీ పదవి వచ్చేలా కేంద్ర మంత్రి చక్రం తిప్పారు. ఆ కేంద్ర మంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పారావు నియామకానికి తన వంతు సహకారం అందించినట్లు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు బహిరంగంగానే చెప్పుకొంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అండదండలు ఉన్నందువల్లే అప్పారావు విశ్వవిద్యాలయంలో గొడవలను పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ అంటే వీసీకి ప్రత్యేకమైన అభిమానం లేనప్పటికీ, తన సామాజికవర్గం వారికి అన్ని రకాల అండదండలు ఇవ్వడంలో అర్హులైన ఇతరులకు అన్యాయం చేశారని ఓ సీనియర్ ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి మానవ వనరుల శాఖకు లేఖ రాసినా ఇప్పటివరకూ వారి నుంచి ఏ రకమైన సమాచారం రాలేదన్నారు. -
నగర శివారులో జింకమాంసం కలకలం
-
నగర శివారులో జింకమాంసం కలకలం
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకను వేటాడి చంపిన దుండగులు దాని మాంసాన్ని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉన్నట్లు భావించిన పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో జింకలను వేటాడిన ఘటనలు ఆరుకు పైగా నమోదైనప్పటికీ.. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
పరిశోధనల్లో మేటి.. సెంట్రల్ వర్సిటీ
17 అంశాలకు పేటెంట్లు.. త్వరలో మరికొన్నింటికి.. వందల కోట్ల నిధులతో కొత్త పరిశోధనలు సెంట్రల్ యూనివర్సిటీ: ‘వర్సిటీలు విద్యార్థులను తయారు చేసే కార్ఖానాలు కాదు.. దేశ కీర్తిని చాటే ప్రగతి కిరణాలు’ అని ఓ రచయిత చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం చేస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కేంద్రీయ విశ్వ విద్యాలయమైన హెచ్‌సీయూ పరిశోధనల్లో సత్తా చాటుతోంది. హెచ్‌సీయూలో చేపట్టిన 42 పరిశోధనా అంశాలపై దరఖాస్తు చేయగా ఇప్పటికి 17 పేటెంట్లు లభించాయి. వీటిలో 12 విదేశీ, ఐదు స్వదేశీ పేటెంట్లు కావడం గమనార్హం. వీటిలో అమెరికా, యూరోప్, కెనడా వంటి దేశాలు కూడా ఉన్నాయంటే వర్సిటీ ప్రగతి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. సైన్స్, ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యధికంగా పేటెంట్లు దక్కాయి. హెచ్‌సీయూలో ప్రస్తుతం రూ. 230 కోట్ల విలువ చేసే 240 ప్రాజెక్టులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ యూనివర్సిటీ పరిశోధనల్లో చేస్తున్న కృషికి గాను అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్) సంస్థ అంతర్జాతీయ ఉత్తమ పరిశోధనా సంస్థ గౌరవాన్ని ఇచ్చింది. పేటెంట్లు పొందిన ప్రొఫెసర్లు వీరే.. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేపడుతున్న పరిశోధనలకు కేంద్ర జీవ సాంకేతిక విభాగం, డీఎస్టీ, కేంద్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ ఆర్థిక సహకారం అందించాయి. పొందిన 17 పేటెంట్లలో స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అశ్విని నాంగియాకు 5, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎ.కె. కొండపికి మూడు దక్కాయి. కెమిస్ట్రీ ప్రొఫెసర్ టి.పి. రాధాకృష్ణన్, ఫిజిక్స్ ప్రొఫెసర్ నిర్మల్ కుమార్ విశ్వనాథన్ రెండేసి పేటెంట్లు పొందారు. లైఫ్ సైన్స్ ప్రొఫెసర్లు పి.రెడ్డన్న, దయానంద, ఫిజిక్స్ ప్రొఫెసర్లు ఎస్. దత్తగుప్త, ఘనశ్యాం కృష్ణ, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సెన్సైస్ ప్రొఫెసర్లు కె.ఎ. పద్మనాభన్ ఒక్కో పేటెంట్‌ను సాధించారు. మరి కొన్ని పరిశోధనలకు పేటెంట్లు రావాల్సి ఉంది. పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతున్న ఈ వర్సిటీకి తాజాగా రాష్ట్రపతి అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీల సాయం నిల్ కొత్తగా చేపట్టే పరిశోధనలకు సాయం అందించేందుకు భారతీయ కంపెనీలు ముందుకు రావడంలేదు. ముఖ్యంగా ఔషధ పరిశోధనల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. సరైన నిధులు, ప్రోత్సాహం ఉంటే దేశ ప్రతిష్టతను చాటే నూతన ఆవిష్కరణలను హెచ్‌సీయూ నుంచి అందించగలం. - ప్రొఫెసర్ ఆనంద్ కె. కొండపి, (బయోటెక్నాలజీ విభాగం) కేంద్రం సహకరిస్తే.. హెచ్‌సీయూలో పరిశోధక వాతావరణం, ప్రోత్సాహం బాగా ఉంటుంది. విదేశాలకు దీటుగా భారత్‌ను నిలపాలంటే యూనివర్సిటీలు నిరంతర పరిశోధనలు చేపట్టాలి. విద్యార్థులకు పరిశోధనలపై ప్రోత్సాహం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మరికొన్ని పేటెంట్లు సాధిస్తాం. - ప్రొఫెసర్ అశ్విని నాంగియా, ఫిజిక్స్ విభాగం -
సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు
స్థలాన్ని పరిశీలించిన కేంద్ర కమిటీ సభ్యులు బుక్కరాయసముద్రం : జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు న్యూఢిల్లీ కేంద్ర మంత్రిత్వ శాఖ హెఆర్డీ జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ తెలిపారు. జిల్లాలో సెంట్రల్ యూనివ ర్సిటీ నిర్మాణం కోసం మండల పరిధిలోని జంతులూరు గ్రామంలో స్థల పరిశీలన కోసం సెంట్రల్ కమిటీ సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్ఆర్డీ జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ సాధు నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ అజయ్‌కుమార్ ఖండూరీ, రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రాదారా, హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ హరిబాబు ఈ కమిటీలో ఉన్నారు. రాష్ట్ర సమాచార శాఖ, ఐటీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, కలెక్టర్ కోన శశిధర్ హాజరయ్యారు. ముందుగా జంతులూరు గ్రామంలోని ఓపన్ ఎయిర్ జైలుకు సంబంధించిన 500 ఎకరాల పొలాన్ని తొలుత ఈ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ పొలం చుట్టూ ఉన్న వనరులను మంత్రి, ప్రభుత్వ విప్, కలెక్టర్ వారికి వివరించారు. అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరం ఉందని, అనంతపురం-తాడిపత్రి నాలుగు లైన్ల రహదారి పక్కనే ఈ భూమి ఉందని తెలిపారు. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 160 కిలోమీటర్ల దూరం, జంతులూరు గ్రామానికి 10 కిలోమీటర్లు దూరంలో నేషనల్ హైవే-44 ఉందని కమిటీ సభ్యులకు వివరించారు. గ్రామ సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువ , పీఏబీఆర్, మిడ్ పెన్నార్ డ్యాంలు ఉన్నాయన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి మొదటి దశ పూర్తి చేసుకుని రెండో దశ నిర్మాణం పూరోగతిలో ఉందని, వీటి ద్వారా నీటి కొరత ఉండదని అన్నారు. జిల్లా కేంద్రం 6 కిలోమీటర్ల దూరంలో యూనివర్సిటీలు, సర్వ జన వైద్యశాల, ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, ఎస్కే యూనివర్సిటీ, అనేక ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయని వారు కమిటీకి వివరించారు. భవిష్యత్తులో అనంతపురంలో విమానాశ్రమం కూడా ఏర్పాటు కానుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జంతులూరు అన్ని విధాలా ఎంతో అనుకూలమని వారు తెలిపారు. కమిటీ వెంట ఆర్డీఓ హుసేన్ సాహెబ్, జెడ్పీటీసీ రామలింగారెడ్డి, తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలించిన అనంతపురం కలెక్టర్
అనంతపురం: పెనుగొండ మండలంలోని గొర్రెల పెంపకం క్షేత్రం వద్ద సెంట్రల్ యూనివర్సిటీని నిర్మించడానికి అనువైన భూములను అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ గురువారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు స్థానిక అధికారులు కూడా భూముల పరిశీలనలో పాల్గొన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే. (పెనుగొండ) -
స్వైన్ ఫ్లూతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని మృతి
సెంట్రల్ యూనివర్సిటీ(హైదరాబాద్): సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న సుధా నిర్మల అనే విద్యార్థిని స్వైన్ ఫ్లూతో మృతిచెందింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెను శేరిలింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం చేర్చారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం మృతి చెందింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సుధా నిర్మల సెంట్రల్ యూనివర్సిటీలో పీడీఎఫ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. -
హెచ్‌సీయూ విద్యార్థులకు భారీ వేతనాలు
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 47 మందికి ఉద్యోగాలు ఇద్దరికి 7.20 లక్షల వార్షిక వేతనం సెంట్రల్ యూనివర్సిటీ: క్యాంపస్ ప్లేస్మెంట్లలో హెచ్‌సీయూ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబర్చి రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. 12 ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా వివిధ విభాగాలకు చెందిన 490 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెచ్‌సీయూ క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ సహకారం అందించింది. రూ.3.50 లక్షల వార్షిక వేతనం నుండి మొదలుకుని గరిష్టంగా రూ.7.20 లక్షల వార్షిక వేతనాలిచ్చే ఉద్యోగాలను విద్యార్థులు సాధించారు. సత్తా చాటిన భావన, ప్రత్యూష క్యావియం సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఎంటెక్ విద్యార్థినిలు ఏ.భావన, జి.ప్రత్యూషలు రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. ఎంటెక్, ఎంసీఏ విభాగంలో టెరేడాటా, క్యావియం నెట్వర్క్స్, మ్యూ సిగ్నా, వన్ కన్వర్వజెన్స్, టీసీఎస్, ఐబీఎం సంస్థలు 25 మంది హెచ్‌సీయూ విద్యార్థులకు ఉద్యోగాల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎంబీఏ విభాగంలో లావా మొబైల్స్, టీసీఎస్, డెలాయిట్, ప్రొకర్నా సంస్థలు 13 మందిని ఎంపిక చేశాయి. ఎంటెక్, ఎకనామిక్స్, మ్యాథమ్యాటిక్స్ విభాగంలో హెచ్ఎస్బీసీ 81 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి 8 మందిని ఎంపిక చేసింది. ఎంసీఏ విభాగంలో వర్చుసా కంపెనీ ఒకరిని ఎంపిక చేసింది. -
సర్కారు విద్యను ధ్వంసం చేశారు
{పయివేటు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగింది చంద్రబాబు వచ్చాక అది పరాకాష్టకు చేరింది మానవీయ విలువలనూ దెబ్బ తీశారు శాస్త్రీయ, సమాన విద్యే సరైన మందు పోరాడి హక్కులను సాధించుకోవాలి చైతన్యవంతం చేయడానికే దేశవ్యాప్త యాత్ర ‘సాక్షి’తో ప్రొఫెసర్ జి.హరగోపాల్ ‘‘మధ్యయుగంలోనూ, స్వాతంత్య్ర పో రాట కాలంలోనూ, ఆ తరువాత కూడా పౌర సమాజమే విద్యను అందించేది. 1984 ప్రాం తంలో విద్య ప్రయివేటీకరణబాట పట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరాకాష్టకు చే రింది. ప్రయివేటు, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగిపోయి ప్రభుత్వ విద్య పూర్తిగా వి ధ్వంసానికి గురైంది’’ అని కేంద్రీయ విశ్వవి ద్యాలయం ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నా రు. అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పోరాట యాత్రలో భాగంగా గురువారం ఆయన కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది. - కామారెడ్డి :విద్య ఏరకంగా ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది, విలువలు ఏ విధంగా దిగజారాయి, ఏం చేస్తే ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం వస్తుందన్న విషయాలను ప్రొఫెసర్ హరగోపాల్ ‘సాక్షి’కి ఇలా వివరించారు. మొదట ఇంటర్ విద్యను దెబ్బతీశారు మన రాష్ట్రంలో ఎంసెట్‌ను ప్రవేశపెట్టి కార్పొరేట్ శక్తుల చేతులలోకి ఇంటర విద్యను తీసుకెళ్లారు. బడా విద్యాసంస్థలు ప్రవేశించి ఎంసెట్ ప్రత్యేక తరగతుల పేరుతో విద్యను వ్యాపారం చేశాయి. విద్యకు బదులు కోచింగుకు ప్రాధాన్యతనిచ్చాయి. కోట్లాది రూపాయలు ఆ సంస్థలు మూటగట్టుకుని, ఆ మూటలతో ఇప్పుడు కొందరు మ ంత్రులయ్యారు. డబ్బులు పెట్టి చదివిన పిల్లల దృష్టంతా ఇంజనీరింగు చదవాలని, తద్వారా డబ్బు సంపాదించాలనే ధోరణి పెంచారు. ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో 374 ఇంజనీరింగు కళాశాలలుంటే అందులో కేవలం నాలుగు కళాశాలలు మాత్రమే ప్రభుత్వానివి. 370 కాలేజీలు ప్రయివేటు యాజమాన్యాలకు చెందినవే. వాటికి ఫీజు రీయింబర్స్‌మెంటు కింద యేడాదికి రూ. మూడు వేల కోట్లు కట్టబెడుతున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వమే ఎన్నో కాలేజీలు స్థాపించొచ్చు. ఎందరికో ఉచితంగా విద్యనం దించవచ్చు. ఎంతోమందికి ఉద్యోగాలు చూపవచ్చు. ఇవన్ని మరిచిపోయి ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు ఒకప్పుడు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. ప్రపంచంలోనే గొప్పదైన ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేసిన డీఎస్రెడ్డికి, అప్పటి సీఎం బ్రహ్మానందరెడ్డికి విభేదాలతో వీసీని మార్చితే విశ్వవిద్యాలయం భగ్గుమన్నది. అప్పటి సీఎంలు కూడా వీసీలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. తరువాత అదే ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా దెబ్బతీశారు. ఖాళీలను భర్తీ చేయకుండా, కావలసినన్ని నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. ఓయూలో 80 నుంచి 90 డిపార్టుమెంటులలో లక్ష మంది పిల్లలు చదువుతున్నారు. ఫ్యాకల్టీ ఒక్కో దానికి నలుగురే ఉన్నారు. అందులో ఇద్దరు కాంట్రాక్టువారే. ఇక్కడ అన్ని కలిపితే రూ. 170 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే మా సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క సబ్జెక్టుకే 20 మంది అద్యాపకులున్నారు. రూ. ఆరు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు. సింగపూర్ ఆదర్శమైతే అక్కడి విద్య విధానాన్ని చూడాలి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రులు మాటిమాటికీ సింగపూర్‌లా చేస్తామంటున్నారు. అక్కడి రోడ్లు, బంగ్లాలను చూసి ఇక్కడా నిర్మిస్తామంటున్నారు. అవే కాదు అక్క డి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాన్ని కూడా చూసి అమలు చేస్తే బాగుంటుంది. సింగపూర్‌లో ప్రభుత్వరంగ విద్యనే అమలులో ఉంది. ప్రపంచంలో పేరున్న స్టాన్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీలకు అక్కడి ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేయడమే కాదు వేలాది మంది ప్రొఫెసర్లతో పాఠాలు చెప్పిస్తుంది. జర్మనీలోనైతే విద్య పూ ర్తిగా ఉచితం. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. మన దేశంలో పేరున్న బాంబే యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, డిల్లీ యూనివర్సిటీలకు మన ప్రభుత్వాలు నిధులను తగ్గించడంతో అవి దెబ్బతినిపోయాయి. ప్రపంచబ్యాంకు చెప్పింది చెవికెక్కించుకోవడమే తప్ప మేధావులు, ప్రజా సంఘాలు చెప్పింది వినే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. మానవీయ విలువలను దెబ్బతీశారు విశ్వ విద్యాలయాలు మేధోసంపత్తిని తయారు చేసేవి. విద్య ప్రయివేటీకరణతో విద్యార్థులు డబ్బులు పెట్టి చదువుతూ డబ్బు కోసం వెంపర్లాడే పరిస్థితులు తీసుకువచ్చారు. లక్షలు పెట్టి సివిల్స్‌కు ప్రిపేర్ అవడం, లక్షలు పెట్టి ఇంజనీరింగు, మెడిసిన్ చదవవడంతో వారు మానవీయతను మరిచిపోతున్నారు. ఉద్యోగంలో చేరాక డబ్బు సంపాదించాలన్న ధ్యాస పెరిగి మానవ సంబంధాలు, మానవత్వం అనేవి మరిచిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యా వ్యాపారంగా మారడం వల్లే ఈ పరి స్థితి వచ్చింది. రాజ్యాంగంలో పొందుపర్చిన విదంగా విద్య అనేది ప్రభుత్వమే అందించాలి. అది కూడా శాస్త్రీయమైన విద్యా విధానం, అందరికీ సమానమైనది అయినపుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. ప్రపంచబ్యాంకు దుర్మార్గంతోనే ప్రభుత్వ విద్య దెబ్బతినడానికి ప్రపంచ బ్యాంకు దుర్మార్గమైన విధానాలు, వాటిని అమలు చేసిన పాలకవర్గాలే కారణం. ఉన్నత విద్యను నాన్ మెరిట్ గూడ్స్‌గా పే ర్కొంటూ ఉన్నత చదువులు చదువుకున్నవారితో సమాజానికి నష్టమనే సూత్రాన్ని ప్రపంచబ్యాంక్ రూపొందించి ఉన్నత విద్యకు పెట్టే ఖర్చును తగ్గించమని సలహా ఇ చ్చింది. దాన్ని పాలకులు అమలు చేయడంతోనే ఈ రోజు యూనివర్సిటీలు దెబ్బతిన్నాయి. 80 శాతం ఉన్నత విద్య ఇప్పుడు ప్రయివేటు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లింది. పోరాడి తె చ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగు కాలేజీలకు ఫీ రీయింబర్స్ మెంటు కింద రూ. 300 కోట్లు విడుదల చేసిం ది. శాతవాహన యూనివర్సిటీకి రూ. 12 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీకి రూ. 10 కోట్లు, పాలమూరు యూనివర్సిటీకి రూ. 10 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులు పుకుంది. ప్రయివేటు ఇంజనీరింగు కళాశాలలకు ఏటా ఇస్తున్న సొమ్ముతో ఎన్నో కాలేజీలు పెట్టొచ్చు. అలాంటి ఆలోచనలు చేయకుండా ప్రయివేటును ప్రోత్సహిస్తున్నారు. ఇది ప్రమాదకరం. పోరాడి సాధించుకోవలసిందే విధ్వంసానికి గురైన విద్యకు పూర్వవైభవం తీసుకురావడానికి అందరూ పోరాడాల్సిన అవసరం ఉంది. విద్యను రక్షించుకునేందుకు, విశ్వ విద్యాలయాలను కాపాడుకునేందుకుగాను దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వారందరూ కలిసి నవంబర్ రెండున దేశంలోని ఐదు ప్రాంతాలు జమ్ము, కన్యాకుమారి, గోవా, భువనేశ్వర్, మణి పూ ర్ నుంచి దేశవ్యాప్త పోరాటయాత్రలు ప్రారంభించారు. 18 రాష్ట్రాల మీదుగాఈ యాత్ర కొనసాగుతూ డిసెంబర్ 4న భోపాల్‌కు చేరుకుంటాయి. ఆ రోజు అక్కడ జరి గే బహిరంగ సభలో డిక్లరేషన్ ప్రకటిస్తారు. పోరాటం ద్వారానే సాధించుకోవచ్చనే లక్ష్యంతో చేపట్టిన ఈ యాత్రలకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు, ప్రజాసంఘా లు, మేదావుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పోరాడి హక్కులను సాధించుకోవడంలో చివరకు ప్రజలే విజయం సాధిస్తారు. -
సెంట్రల్ వర్సిటీలను నెలకొల్పాలి
లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాలని, అవి ఆయా రాష్ట్రాలకు పూర్తి న్యాయం చేసేలా పరిధి విధించాలని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లును మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రవేశపెట్టిన సందర్భంగా సుమన్ మాట్లాడారు. వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో సెంట్రల్ వర్సిటీని ఏర్పాటుచేయాలని తీసుకువచ్చిన ఈ సవరణ బిల్లును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు కావాల్సి ఉందని, వాటిని కూడా ఈ బిల్లులో పొందుపరిస్తే బాగుండేదని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతు పలుకుతోందని సుమన్ తెలిపారు. -
‘ముద్దుల’ రగడ
వివాదాస్పదంగా కిస్ ఆఫ్ లవ్ ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐలు బాహాబాహీ క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ‘కిస్ ఆఫ్ లవ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమం విద్యార్థి సంఘాల గొడవతో ఉద్రిక్తతంగా మారింది. తాజాగా కేరళలోని కాలికట్ డౌన్‌టౌన్ రెస్టారెంట్లో ఓ ప్రేమజంట బహిరంగ చుంబనం చేసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ బజరంగ్ దళ్, హిందుత్వ సంఘాలు ఆ రెస్టారెంట్‌ను ధ్వంసం చేశాయి. దీన్ని నిరసిస్తూ కేరళలోని పలువురు కిస్ ఆఫ్ లవ్ పేరిట జంటలకు బహిరంగ చుంబన కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. కేరళలో బజరంగ్దళ్, ఏబీవీపీ, హిందుత్వ సంఘాల దాడిని ఖండిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం ఆరుగంటలకు ప్రత్యేక కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ మద్దతు పలికింది. విద్యార్థులు పెదాలకు లిప్‌స్టిక్ పూసుకొని ముద్దులు పెట్టుసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ర్యాలీగా వచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. దేశ సంస్కృతిని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల మధ్య గొడవ... భారతీయ సంస్కృతిని కించపరిచేలా బహిరంగ చుంబన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీం బీజేవైఎం నాయకులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కార్యక్రమం జరుగుతున్న చోటుకు చేరుకుని నినాదాలు చేశారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, కేరళ, ఇతర రాష్ట్రాల విద్యార్థి సంఘాలు నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం నగర నాయకులు నినాదాలు చేస్తూ ముందుకు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాలకు బయటి వ్యక్తులను ఏ విధంగా అనుమతించారని కేరళ విద్యార్థులు బైఠాయించారు. సంఘటన స్థలికి రిజిస్ట్రార్ రామబ్రహ్మం, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రకాశ్ బాబు చేరుకొని ఆందోళన విరమింపజేసేందుకు యత్నించారు. చందానగర్, గచ్చిబౌలి పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడమే.. కిస్ ఆఫ్ లవ్ పేరిట కేరళలో జరిగిన కార్యక్రమాన్ని హిందుత్వ సంఘాలు నిరసన తెలపడం అవివేకం. వ్యక్తులకు స్వేచ్ఛ ఉంది. వారి హక్కును హరించేలా అడ్డుకోవాలని ఏబీవీపీ నాయకులు హెచ్‌సీయూలో ప్రయత్నించడం గర్హనీయం. -అభిరామీ, ఎంఫిల్ విద్యార్థిని చీరలు కడితేనే భారతీయులమా? జీన్స్ టీ షర్ట్ వంటి ఆధునీకత ప్రతిబింబించే దుస్తులను మహిళలు ధరించడాన్ని ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి సంఘాలు వ్యతిరేకించడం శోచనీయం. చీరలు, సంప్రదాయ దుస్తులు వేసుకుంటేనే భారతీయులమా? ఎవరి స్వేచ్ఛ వారిది. - వైఖరి, పీహెచ్డీ, పొలిటికల్ సైన్స్ విద్యార్థిని అధికారుల అండతోనే కార్యక్రమం వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ ఇతర అధికారుల అండతోనే ఇలాంటి బహిరంగ ముద్దుల కార్యక్రమం నిర్వహించారు. భారతీయ సంస్కృతిని కించపరిచే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. - సుశీల్ కుమార్, ఏబీవీపీ, అధ్యక్షుడు హెచ్‌సీయూ భారతీయ సంస్కృతి కాదు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం భారతీయ సంస్కృతి కాదు. ప్రైవేటు వ్యవహారాలను పబ్లిక్‌గా చేసుకుంటామంటే ఎవరూ హర్షించరు. క్యాంపస్‌లో విద్యార్థినులు ఇలా ముద్దులు పెట్టుకుంటే సమాజంపై చెడు ప్రభావం ఉంటుంది. - ప్రియదర్శి జోషీ, పీహెచ్డీ ఎకనామిక్స్ విద్యార్థి -
'పబ్లిక్ కిస్సింగ్‌లో తప్పేముంది ?!'
-
ప్రేమను వ్యక్తపరచడం కూడా నేరమేనా ?!
-
'కిస్ ఆఫ్ లవ్' ఎందుకంటే..!
-
రసాభాసగా మారిన 'కిస్ ఆఫ్ లవ్'
-
కూలిన శ్లాబ్
హెచ్‌సీయూలో ఘటన త్రుటిలో తప్పిన ప్రమాదం నాలుగేళ్లలో రెండో ఘటన సెంట్రల్ యూనివర్సిటీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ.13.80 కోట్లతో నిర్మిస్తున్న జాకీర్ హుస్సేన్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్ శ్లాబ్ బుధ వారం కుప్ప కూలింది. నాలుగేళ్ల క్రితం లైఫ్ సైన్స్ భవనం కూలిన ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తక్కువ సామర్థ్యం గల ఇనుపరాడ్లు ఉపయోగించడం, శ్లాబ్ భీంను ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో భవన నిర్మాణం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ పనులు చేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2014 జనవరి నుంచి సీపీడ బ్ల్యూ పర్యవేక్షణలో బెంగుళూరుకు చెందిన ప్రైవేటు సంస్థ ఈ ఈ భవన నిర్మాణ పనులు చేస్తోంది. ఏప్రిల్ 2015 కల్లా పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భవనంలో లెక్చర్ హాల్ కాంప్లెక్స్‌తో పాటు అకడమిక్ సపోర్ట్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూంలు, సెమినార్ హాల్ వంటి 15 హాళ్లు నిర్మిస్తున్నారు. ఘటన స్థలాన్ని హెచ్‌సీయూ రిజిస్టార్ రామబ్రహ్మం, సీపీడబ్ల్యూ అధికారులు, మాదాపూర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఖురేషీ, విద్యార్థి, ఉద్యోగ సంఘ నాయకులు పరిశీలించారు. ఉన్నత స్థాయి విచారణ కోరతాం... శ్లాబ్ కూలిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కోరతాం. ఇన్చార్జి యూఈ ఏసీ నారాయణ హయాంలో చేపట్టిన అన్ని నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలి. నాసిరకంగా చేపట్టిన ఈ భవనం నిర్మాణం పూర్తయ్యాక కూలి ఉంటే భారీ ప్రాణ, ఆస్తినష్టం జరిగి ఉండేది. - బండి డానియల్, యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాసిరకంగా నిర్మిస్తున్నారు... యూనివర్సిటీ భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. విద్యార్థుల భవిష్యత్‌ను కాల రాసేలా నాసిరకంగా భవనాలు నిర్మిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. - వెంకటేష్ చౌహాన్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు, హెచ్‌సీయూ -
‘మాతృభాష’ను మురిపిస్తాం
సెంట్రల్ యూనివర్సిటీ: సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఇంగ్లిష్ వ్యవహారంతో కూడిన చదువులు గుర్తొస్తుంటాయి. ఉద్యోగ అవకాశాలుంటాయని నేటి యువత కూడా వాటివైపే ఆసక్తి చూపిస్తుంటారు. మాతృభాషపై మమకారం చంపుకొక మరికొందరు లింగ్విస్టిక్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇదే కోవలో మన సిటీ విద్యార్థులు కనుమరుగవుతున్న తెలుగు, ఉర్దూ భాషలకు జీవం పోసేందుకు పీహెచ్‌డీలు చేస్తున్నారు. మరికొందరు పీజీలో తెలుగు, ఉర్దూ భాషలను ఎంచుకొని కన్వకేషన్ పొందుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి ప్రభుత్వాలు తెలుగు, ఉర్దూకు ప్రాధాన్యమిచ్చి మన భాషను భావితరాలకు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉద్యోగవకాశాలు లేకున్నా మాతృభాష కోర్సులను ఎంచుకున్నామంటున్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన 16వ స్నాతకోత్సవంలో తెలుగు, ఉర్దూ భాషల్లో పట్టాలు అందుకున్న విద్యార్థులతో ‘సాక్షి’ ముచ్చటించింది. మీడియా చొరవ చూపాలి ‘మాది మహబూబ్‌నగర్. నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచే తెలుగంటే ఇష్టం. అనేక కష్టనష్టాలు ఒర్చుకొని ఎంఏ తెలుగు చేశా. ఈ రోజు పీహెచ్‌డీలో హెచ్‌సీయూ నుంచి పట్టా అందుకున్నా. ‘పాలమూరు జిల్లా క్షేత్ర మహత్య పద్య కావ్యాలు అనుశీలన’పై చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. హెచ్‌సీయూలోనే తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృధ్ధి కోసం కృషి చేస్తా. కనమరుగువుతున్న తెలుగును బతికించాలంటే ప్రభుత్వంతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవల్సిన అవసరముందని వికలాంగుడైన శ్యామ్ సుందర్ తెలిపారు. తెలుగంటే ప్రాణం ‘మాది తూర్పుగోదావరి జిల్లా. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అమ్మనాన్నల మద్దతుతో ఈ రోజు పీహెచ్డీ పట్టా సాధించగలిగా. తెలుగు నిఘంటువుల ఆరోపాల అధ్యయనం చేశా. బాసర ఐఐఐటీలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృద్ధి కోసం కృషి చేస్తా. తెలుగును బతికించేందుకు అందరం కృషి చేయాలని దోమలగూడలో ఉంటున్న కొమండూరి విజయభాను తెలిపారు. ఉర్దూ భాష గొప్పతనం చెబుతా రోజు ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందానంటే అందుకు మా కుటుంబసభ్యుల సహకారం ఉంది. రోజురోజుకు కనమరుగువుతన్న ఈ భాషను మళ్లీ గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా. పిల్లలకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరిస్తా. ఇందుకోసం ప్రతి పాఠశాలలో సెమినార్లు నిర్వహిస్తానని ఎల్బీ నగర్లో ఉంటున్న గృహిణి జరీన్‌ఖాన్ తెలిపారు. సిటీలో ఆదరణ ఉంది ‘సిటీలో ఉర్దూకు మంచి ఆదరణ ఉంది. భారీ సంఖ్యలో మైనారిటీలున్నా ఆ భాషకు తగిన ప్రాచుర్యం లేదు. ఉద్యోగవకాశాలు తక్కువగా ఉండడం కూడా ఈ భాషపై యువతకు నిరాసక్తత కలిగించేలా చేస్తోంది. అయితే యువతకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం నా వంతుగా చేస్తా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంద’ని ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందిన సిటీకి చెందిన గౌసియా భాను తెలిపారు. -
హెచ్‌సీయూలో ఎన్నికలు ప్రశాంతం
నేడు ఓట్ల లెక్కింపు సెంట్రల్ యూనివర్సిటీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. వర్సిటీలోని పలు విభాగాల్లోని 20 పోలింగ్ బూతుల్లో పోలింగ్ నిర్వహించగా 80 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 60 మంది ఉద్యోగులు, 50 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు. భవితవ్యం తేలేది నేడే.. హెచ్‌సీయూ ఎన్నికల్లో నాలుగు ప్రధాన విద్యార్థి సంఘాలు పోటీపడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) ఏర్పడిన 13 రోజులకే ఆరు పదవులకు పోటీ చేసింది. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, బహుజన స్టూడెంట్ ఫ్రంట్, ఎన్ఎస్యూఐ, ట్రైబల్ స్టూడెంట్ ఫోరాలు యునెటైడ్ డెమోక్రటిక్ అలయన్స్ (యూడీఏ) గా ఏర్పడ్డాయి. అధికార సంఘ లోపాలను ఎత్తి చూపుతూ ఏబీవీపీ రంగంలోకి దిగింది. గత రెండు పర్యాయాలు వరుస విజయాలు దక్కించుకున్న ఎస్ఎఫ్ఐ మరోమారు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బాగా జరిగిందని విద్యార్థి సంఘాలు వాపోయాయి. అధ్యక్ష పదవికి దీపక్ కుమార్ సింగ్ (ఎస్ఎఫ్ఐ), రాం అభినవ్ తేజ్ (టీఆర్ఎస్వీ), విన్సెంట్ (యూడీఏ), కీర్తన (ఏబీవీపీ) పోటీ చేశారు. -
సెంట్రల్ యూనివర్సిటీలకు ఉమ్మడి విధానాలు..
దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, పర్యవేక్షణ ఇతర అంశాలపై.. యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ.ఎం. పఠాన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ గత ఏడాది అందించిన నివేదికను, అందులోని సిఫార్సులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెంట్రల్ యూనివర్సిటీలను ఆదేశించింది. దీంతో దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల పర్యవేక్షణకు ఒకే విధానం అమలు కానుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 45 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. కమిటీ చేసిన సిఫారసులు.. ప్రస్తుతం ఉన్న ఛాన్సలర్ విధానాన్ని రద్దు చేయాలి. కొత్తగా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కూడిన కౌన్సిల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ను ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించాలి. ఈ కౌన్సిల్ అన్ని యూనివర్సిటీల పరిపాలన, విద్యా విధానాలు, అకడమిక్ క్యాలెండర్ వంటి అంశాలను పర్యవేక్షించాలి. వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. వైస్ ఛాన్సలర్లు యూజీసీ చైర్మన్‌కు బాధ్యులుగా ఉండాలి. మూల్యాంకనంలో మార్పులు చేసి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌కు రూపకల్పన చేయాలి. అన్ని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను కేంద్రీకృత విధానంలో భర్తీ చేయాలి. -
దాడులు దారుణం
సెంట్రల్ యూనివర్సిటీ: మణిపూర్ ఉదంతంపై నగరంలో నిరసన వెల్లువెత్తింది. విద్యార్థి లోకం తీవ్రంగా స్పందించింది. మనమంతా ఒక్కటేననే సమైక్యతా భావాన్ని చాటింది. ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులూ దాడిని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ నిట్‌లో బీటెక్ చదివే తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు దాడికి పాల్పడ డాన్ని తాము ఎంతమాత్రం సహించబోమంటూ నిరసన వ్యక్తం చేశారు. దాడి హేయమని పేర్కొన్నారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులపై గత గురువారం నుంచి అక్కడి సీనియర్లు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై హైదరాబాద్‌లో చదువుకుంటున్న మణిపూర్ విద్యార్థులు స్పందించారు. ఇఫ్లూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన వారంతా తమ రాష్ర్టంలో తెలుగు విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ ఎంతో మంచి నగరం. ఇక్కడి వాళ్లు మమ్మల్ని ఆప్యాయంగా పలుకరిస్తారు. మేం ఇతర రాష్ట్రంలో ఉంటున్నామనే భావన ఏమాత్రం కలుగదు. ఎంతోమంది తెలుగు మిత్రులను ఇక్కడ సంపాదించుకున్నామ’ని వారు తెలిపారు.తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు చేసిన దాడిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే దాదాపు 200 మంది మణిపూర్ రాష్ట్ర విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. మణిపూర్ ‘నిట్’ ఘటనపై కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలను ‘సాక్షి’ తెలుసుకుంది. వారేమంటున్నారంటే... నాకు తెలుగు స్నేహితులే ఎక్కువ హెచ్‌సీయూలో 2012 నుంచి చదువుకుంటున్నాను. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు. నాకు ఎక్కువ మంది స్నేహితులు తెలుగు విద్యార్థులే. తెలుగు వారు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మణిపురిల తరువాత నా ఓటు తెలుగు వారికే. అక్కడ జరిగిన దాడి, విద్యా సంస్థల్లో మణిపురిల సంక్షేమంపై త్వరలో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర విద్యార్థులం అనుకుంటున్నాం. - ఆర్డీ కిమో, ఎంఏ (సోషియాలజీ) ఫిర్యాదు చేస్తాం తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిపై మణిపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల్లో మణిపూర్ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఘటన వల్ల మా రాష్ట్ర విద్యార్థులపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటివి జరగడం ఏ మాత్రం మంచిది కాదు. దాడులు పునరావృతం కాకుండా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తాం. - డుటో కె.తేరి, ఎంఏ, హెచ్‌సీయూ కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు ఏ రాష్ట్రంలోనైనా అక్కడక్కడాఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. ఎక్కడైనా ఆకతాయిలు ఉంటారు. కొంతమంది మణిపూర్ విద్యార్థులు చేసిన దాడి వల్ల అందరికీ చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. విజ్ఞానవంతులుగా వ్యవహరించాలే తప్ప రౌడీల్లా కాదు. - జూలియట్ ఫనాయి, ఎకనామిక్స్ (పీహెచ్డీ) పరిస్థితిని మెరుగుపరచాలి మణిపూర్ విద్యార్థులు, తెలుగు వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిస్థితిని మెరుగుపరచాలి. హెచ్‌సీయూలో నా స్నేహితుడు కూడా తెలుగు విద్యార్థే. అతడు నాకు తెలుగు నేర్పిస్తున్నాడు. మా రాష్ట్ర విద్యార్థులు సైతం పలుచోట్ల అవమానాలకు గురవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో మణిపురిలకు రక్షణ కల్పించాలి. - సారీ లూయికాం, ఎంఏ సోషియాలజీ -
ఐవైఎఫ్ సమ్మేళనం..
-
మాటలకు చేతలకు.. పొంతనకుదిరేనా?
సీఎం ప్రకటనపై నిపుణుల సందేహం తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని తొలుత చెప్పి, ఇప్పడు మాట మార్చిన బాబు రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం శ్రీకారం తిరుపతిలో ఐటీఐఆర్‌నూ ఏర్పాటుచేస్తామని ఒకసారి.. ఐటీ హబ్‌గా మార్చుతామని మరోసారి భిన్నమైన ప్రకటనలు కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటు చేస్తామన్న ఐఐఏ చైర్మన్ అలోక్ సిన్హా.. కాదు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్న బాబు శాసనసభలో హామీలకు నిధులేవి? సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా అభివృద్ధికి సీఎం చంద్రబాబు శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల అమలుపై నిపుణులు, రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నా రు. సీఎం చంద్రబాబు జిల్లా ప్రగతిపై గతంలో ఒకలా.. గురువారం మరోలా భిన్నమైన ప్రకటనలు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. శాసనసభలో గురువారం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అమలుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్న అంశాన్ని నిపుణులు గుర్తు చేస్తుండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక జూన్ 16న విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్శిటీలను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. జూన్ 24న తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని.. కుప్పంలో విమానాశ్రయం, తిరుపతిలో ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. గురువారం శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో మాత్రం సెంట్రల్ వర్శిటీని అనంతపురంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. తిరుపతిలో ఐటీఐఆర్ కాదు.. ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తామని చెప్పుకొచ్చారు. ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) ఛైర్మన్ అలోక్ సిన్హా కుప్పంలో పర్యటించి.. ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనుకూలమని తేల్చారు. ఆగస్టు 20న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ.. గురువారం చంద్రబాబు చేసిన ప్రకటన తద్భిన్నంగా ఉంది. కుప్పంలో ఎయిర్‌పోర్టును ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనకూ.. శాసనసభలో ఇచ్చిన హామీలకు పొంతన కుదరకపోవడంతో వాటి అమలుపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా తమ గొప్పగా చెప్పుకునే యత్నం..: తిరుపతికి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయానికి రూ.వంద కోట్లతో అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు సెప్టెంబరు 26, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆ పనులు ఇప్పటికే చేపట్టారు. ఇటీవ ల రేణిగుంట విమానాశ్రయాన్ని పరిశీలించిన ఐఐఏ ఛైర్మన్ అలోక్‌సిన్హా అంతర్జాతీయ విమానాశ్రయంగా రేణిగుంట ఎయిర్‌పోర్టును మార్చలేమని స్పష్టీకరించారు. కేవలం అంతర్జాతీయహోదా కల్పించే పనులే చేయవచ్చునని చెప్పారు. కానీ.. చం ద్రబాబు మాత్రం రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలంటే కనీసం 4,500 ఎకరాల భూమి అవసరం. కానీ.. అక్కడ ఆ మేరకు భూమి అందుబాటులో లేకపోవడం గమనార్హం. చిత్తూరులో అపో లో హెల్త్‌సెంటర్ ఏర్పాటుకు తొమ్మిదేళ్లక్రితమే ఆ సంస్థకు ప్రభుత్వం భూ మి కేటాయించింది. ఆ సంస్థ అక్కడ హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఆ సంస్థ ను తామే ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. కేం ద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఐఐటీని మంజూరు చేసింది. ఆ ఐఐటీ నే తిరుపతిలో ఏర్పాటుచేస్తామనిబాబు చెప్పారు. కేంద్రం ఐఐఎస్ఈ ఆర్‌ను రాష్ట్రానికి మంజూరు చేయలేదు. కానీ.. అవేమీ పట్టకుండా తిరుపతిలో ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటుచేస్తామని ప్రకటిచండం గమనార్హం. ఏ ర్పేడులో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(ఎన్ఐఎమ్జెడ్) ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ.. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన శ్రీకాళహస్తి స్పైన్‌పై మాత్రం చంద్రబాబు స్పందించలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక మేరకు రూ.1,500 కోట్లతో శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని పూర్తిచేస్తేనే ఏర్పేడులో ఎన్ఐఎమ్జెడ్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. బడ్జెట్లో నిధులేవీ? తిరుపతిని మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని గురువారం శాసనసభలో సీఎం ప్రకటించారు. మెట్రోరైల్‌ను కూడా తి రుపతికి తీసుకొస్తామని చెప్పారు. కానీ.. ఇటీవల విశాఖపట్నం, విజయవాడ-తెనాలి-గుంటూరులకు మాత్రమే మె ట్రోరైల్ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పడు తిరుపతిలో మెట్రో రైల్‌ను ఏర్పాటుచేసే అంశంపై చంద్రబాబు స్పందించలేదు. మెగా సిటీకి కేంద్రం నిధులు ఇస్తుందని చెప్పిన చంద్రబాబు.. మెట్రో రైల్‌కు రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించాలని చెప్పకనే చెప్పా రు. కానీ.. మెట్రో రైల్ ప్రాజెక్టుకు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఇక జిల్లాలో హార్టికల్చర్ జోన్.. ఫుడ్ పార్క్‌లను ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్ర కటించారు. మామిడి తోటలు విస్తారంగా ఉన్న జిల్లాలో హార్టికల్చర్ జోన్ ఏర్పాటుచేయడం ఆహ్వానించదగ్గదే. ఫుడ్ పార్క్దీ అదే పరిస్థితి. కానీ.. తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఇప్పటికే ఆధ్మాత్మిక కారిడార్‌గా అనధికారిగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ కారిడార్‌నే అధికారికంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చే హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగుగంగ, స్వరముఖి-సోమశిల లింక్ కెనాల్ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. వీటిని పరిశీలించిన నిపుణులు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా చంద్రబాబు వ్యహరిస్తోన్న తీరును చూస్తే మాటలకు చేతలకు పొంతన కుదిరేట్టు లేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని కోసం నేతలు నోరు విప్పాలి
కడప సెవెన్ రోడ్స్: అన్ని రంగాల్లో వెనుకబడిన రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ నేతలు నోరు విప్పి డిమాండ్ చేయాలని పలువురు వక్తలు కోరారు. రాయలసీమ రాజధాని సాధన సమితి ఆధ్వర్యంలో సమితి ప్రతినిధి డాక్టర్ ఓబుళ రెడ్డి అధ్యక్షతన కడపలో బుధవారం ఏర్పాటు చేసిన రౌంట్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో నవ్యాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ జరగాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్ పాండ్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, రాయలసీమకు నికర జలాలు అందించాలని కోరారు. పునర్విభజన బిల్లులో ఇచ్చిన హామీ మేరకు కడపలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంద్యాలలో వ్యవసాయ విశ్వ విద్యాలయం, కడపలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో సమితి నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి, జిల్లా పర్యాటక రంగ నిపుణుడు సిద్ధవటం సీతారామయ్య, చరిత్ర, భాషా పరిశోధకుడు విద్వాన్ కట్టా నరసింహులు, దళిత మహాజన ఫ్రంట్ కన్వీనర్ సంగటి మనోహర్, జనతాదళ్(యు) నాయకుడు యుగంధర్‌రెడ్డి, ఆర్ఎస్ఎఫ్ కన్వీనర్ భాస్కర్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచురెడ్డి, జర్నలిస్ట్ జేఏసీ నాయకుడు రమణయ్య, కాంగ్రెస్ నాయకుడు అజయ్‌కుమార్ వీణా, బెరైడ్డి రామకృష్ణారెడ్డి, డి.సాల్మన్ పాల్గొన్నారు. సమావేశంలో నేతలు ఎవరెవరు ఏం మాట్లాడారో వారి మాటల్లోనే... కర్నూలులో రాజధాని కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి. దీని వల్ల వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీమలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవే. నికర జలాలు అందాలంటే గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మల్లించాలి. పోలవరం ఒక్కటే సరిపోదు. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను నిర్మించాలి. దుమ్ముగూడెం నుంచి 70 వేల క్యూసెక్కులు నీరు వృథాగా వెళ్తున్నాయి. అందులో 24 వేల క్యూసెక్కులు కృష్ణా నదిలోకి మల్లిస్తే సీమకు నికర జలాలు అందుతాయి. రాష్ట్రాన్ని విభజించింది కేంద్రమే గనుక కేంద్రమే ప్రాజెక్టులకు నికర జలాలు, నిధులు ఇవ్వాలి. - వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మంత్రి రెండో రాజధాని అవసరం ప్రజల ఐక్యతకు ఉపయోగపడే ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. రాష్ట్రం కోస్తా, ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాలుగా కలసి ఉన్నాయి గనుక ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే, మిగిలిన ప్రాంతాల్లో రెండో రాజధాని ఏర్పాటు చేయాలి. రాజధానిని అభివృద్ధి చేయకుండా మిగిలిన అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో నిట్, కడపలో ఎయిమ్స్, ఇడుపులపాయలో త్రిపుల్ ఐటీ కేంద్రం ఏర్పాటు చేయాలి. - డాక్టర్ గేయానంద్, ఎమ్మెల్సీ భావితరాలు క్షమించవు కోస్తా నాయకుల మాటలు నమ్మి ఇప్పటికే పలుసార్లు రాయలసీమ వాసులు మోసపోయారు. ఇప్పటికైనా అలసత్వం వీడి రాజధాని కోసం పోరాడకపోతే భావితరాలు క్షమించవు. ఆంధ్ర రాష్ట్రోద్యమంలో కోస్తా నాయకుల మాటలు నమ్మి కృష్ణా, పెన్నా ప్రాజెక్టులను కోల్పోయాం. వాటి స్థానంలో నాగార్జున సాగర్ వచ్చింది. ఆ తర్వాత రాజధాని కర్నూలును కోల్పోయాం. ఇప్పుడు రాజధానినైనా సాధించుకుంటే జరిగిన అన్యాయం కొంతైనా తీరుతుంది. - మధుసూదన్‌రెడ్డి, సీమ రాజధాని సాధన సమితి నాయకుడు జాతీయ ప్రాజెక్టుగా దుమ్ముగూడెం దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలి. లేదంటే రాయలసీమకు చుక్కనీరు అందదు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులకు చేరుకుంటే ఎస్ఆర్బీసీకి తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీటి విడుదల సాధ్యం కాదు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డులో అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర పునర్వ్వవస్థీకరణ బిల్లులో కోస్తా నాయకులు పోలవరం ప్రాజెక్టును చేర్పించారే తప్ప, దుమ్ముగూడెం, టెయిల్‌పాండ్‌ను చేర్పించలేదు. దుమ్ముగూడెం వల్ల ఎవరి ప్రయోజనాలు దెబ్బతినవు. రాజధాని ఏర్పాటు అంశంపై శివరామకృష్ణన్ కమిటీ అసరమే లేదు. కోస్తా నాయకులు తెలివిగా రాష్ట్రం విడిపోతే రాజధానిపై కమిటీ ఏర్పాటు అంశాన్ని బిల్లులో చొప్పించగలిగారు. ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి. రాజధాని, నికర జలాల అంశంపై సీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించాలి. - సి.హెచ్. చంద్రశేఖర్‌రెడ్డి, సీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు రాజధానితో పాటు అభివృద్ధి సీమకు రాజధానిని తీసుకురావడానికి ఓ వైపు కృషి చేస్తూనే, జిల్లాల అభివృద్ధిపైనా దృష్టి సారించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాయలసీమకు నికర జలాలను సాధించుకోవాలి. అఖిలపక్షంగా ఏర్పాటై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లాలి. సీమ హక్కుల కోసం నేనూ మీతో కలసి వస్తా. - శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నేత కడపపై శీతకన్ను కడపపై ప్రభుత్వ పెద్దలు శీతకన్ను పెట్టారు. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కావడంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ జిల్లా అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. స్టీల్ ప్లాంట్‌కు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేకపోయారో స్పష్టం చేయాలి. ముఖ్యమంత్రి బాబు రాయలసీమ ప్రాంత వాసే కావడంతో ఇక్కడి సమస్యలన్నీ ఆయనకు తెలుసు. మరో ఆలోచనకు తావు లేకుండా రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు సీఎం ముందుకు రావాలి. - రవిశంకర్‌రెడ్డి, సీపీఎం నాయకుడు -
ఆధ్యాత్మిక నగరం.. ఇక విద్యాకేంద్రం
తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం మూడు జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు కనీసం వెయ్యి ఎకరాల భూమి అవసరం భూమిని అన్వేషించాలని కలెక్టర్‌ను ఆదేశించిన విద్యాశాఖ మంత్రి గంటా! ప్రపంచ చిత్రపటంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకాశిస్తున్న తిరుపతి ఇక విద్యా కేంద్రంగానూ విరాజిల్లనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరుపతిలో జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుంది. తిరుపతి పరిసర ప్రాంతా ల్లో ప్రతిష్టాత్మక ఐఐటీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ వ ర్సిటీ(కేంద్రీయ విశ్వవిద్యాలయం), ఐఐఎస్ఈఆర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) సంస్థలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: సమైక్యాంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు తెలంగాణలోనే నెలకొల్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ విద్య, పరిశోధన కేంద్రాలను సీమాంధ్రలోనూ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత అప్పటి కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఆ మేరకు విభజన బిల్లులో కూడా పొందుపరిచారు. హైదరాబాద్‌లో సెంట్రల్ వర్సిటీ, ఐఐటీని మెదక్ జిల్లా దోమ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో అప్పట్లో ఏర్పాటు చేశారు. ఐఐఎస్ఈఆర్ను ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకుంది. తిరుపతిలో ఐఐటీ, సెంట్రల్ వర్సిటీ, ఐఐఎస్ఈఆర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఆ మూడు జాతీయ విద్య, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని అన్వేషించి.. ఈనెల 20లోగా నివేదిక పంపాలని కలెక్టర్ రాంగోపాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. భూ సేకరణలో అధికార యంత్రాంగం దేవదేవుడు వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతికి ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుంది. శ్రీవారు వెలసిన జిల్లాలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీ, కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం నెలకొల్పారు. తిరుపతిలో చీనీ, నిమ్మ, వరి, చెరకు పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక కొత్తగా మూడు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అయితే వీటి ఏర్పాటుకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు లేవు. తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, చంద్రగిరి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ భూములు లేవు. ఆ ప్రాంతాల్లో డీకేటీ భూములు మాత్రమే ఉన్నాయి. ఆ భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇదే అంశంపై కలెక్టర్ రాంగోపాల్‌ను ‘సాక్షి’ సంప్రదించగా.. ఐఐటీకి 400 ఎకరాలు, సెంట్రల్ వర్సిటీకి 400 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 200 ఎకరాల భూమి అవసరమని చెప్పారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవన్నారు. ఏర్పేడు, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో డీకేటీ భూములను సర్వే చేస్తున్నామని.. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. -
సంబురంగా ఆవిర్భావం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. అమరవీరుల కుటుంబాలు, పోలీస్ సిబ్బంది, మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్‌తోపాటు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఎస్పీ రాజకుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి, మాదాపూర్ డీసీపీ క్రాంతి రాణా టాటా, ట్రాఫిక్ డీసీపీ మొహంతి, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాలి లోకి బెలూన్లు వదిలి రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారు. మహిళల బతుకమ్మ, కోలా టం ఆడారు. కళాకారుల ఒగ్గుకథ, పీరీల అస్సైదులాలతో సైబరాబాద్ కమిషనరేట్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అభివృద్ధికి కంకణబద్ధులు కండి.. 29వ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి అందరూ కంకణబద్ధులు కావాలని కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. మలిదశ ఉద్యమంలోరంగారెడ్డి జిల్లాలో 16 మంది అమరులయ్యారని గుర్తు చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థను గౌరవిస్తూనే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజల ఆకాంక్షలు పరిపూర్ణమయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితమై, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుకావాలని కోరారు. అమరవీరుల కుటుంబాలకు సన్మానం తెలంగాణ రాష్ట్రం కోసం జిల్లాలో అసువులు బాసిన 16 మంది అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా ఉన్నతాధికారులు సన్మానించారు. అమరుల ఆశయాలను కొనసాగించేందుకు కృషిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. వారితోపాటు జిల్లాలోని పలు విభాగాల ఉద్యోగులను సన్మానించారు. నోరూరించిన తెలంగాణ వంటకాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలు నోరూరించాయి. సర్వపిండి, జొన్నరొట్టె, గారెలు, సకినాలు, మడుగుబూలు, గర్జెలు, నాటుకోడి పులుసు, బెల్లం భక్షాలతోపాటు పలు రకాల వంటకాలను సంబురాల్లో పాల్గొన్న వారికి వడ్డించారు. -
హెచ్‌సీయూ ఇంటర్వ్యూ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. 72 కోర్సుల ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చారు. సీట్లు సాధించిన విద్యార్థులకు జూన్ 6 నుంచి ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎంఫిల్ (ఉర్దూ), పీహెచ్డీ (ఉర్దూ), పీహెచ్డీ (కెమిస్ట్రీ), ఎంఫిల్ (నాలెడ్జ్ ఇన్నోవేషన్ అండ్ సొసైటీ స్టడీస్), పీహెచ్డీ (మ్యాథమెటిక్స్), పీహెచ్డీ (హెల్త్ సైకాలజీ) కోర్సుల ఫలితాలు జూన్ 2న విడుదలవుతాయి -
ముంగిట్లోనే ఉన్నత విద్య
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తోంది. వ్యయప్రయాసలకోర్చి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఒకప్పుడు ఎక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లాలోనే ఆ కోర్సులకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఆరు పీజీ కళాశాలు, ఐదు ఇంజినీరింగ్ కళాశాలలు, ఓ మెడికల్ కళాశాల, 24 డిగ్రీ కళాశాలలు, 10 బీఈడీ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా వేలాది మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయితే ఉన్నత విద్యకు సంబంధించి చాలా కోర్సులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇతర పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లలేనివారు విద్యకు పుల్‌స్టాప్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో జిల్లాకు పలు ఉన్నత విద్య కోర్సులు వస్తాయని విద్యాభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరైంది. ప్రస్తుతం ఏర్పాటు దశలో ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాకు మరిన్ని విద్యాసంస్థలు, కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశాలుంటాయి. గతేడాది మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీలో ప్రస్తుతం 22 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్య సమీప భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నూతన ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని విద్యాభిమానులు భావిస్తున్నారు. ఐఐటీ మెయిన్స్ వెలుగులు జిల్లాకు చెందిన విద్యార్థులు గతంలో ఇంటర్‌తో పాటు ఎంసెట్, ఐఐటీ, ఇంజినీరింగ్ కోర్సులలో నాణ్యమైన శిక్షణ కొరకు హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవలి కాలంలో జిల్లాలో పలు విద్యాసంస్థలు నెలకొన్నాయి. నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ఇక్కడే విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఏటా 28 వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ఆరు వేల మంది ఎంసెట్‌కు, 11 వేల మంది ఇంజినీరింగ్ శిక్షణవైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది ఐఐటీ తదితర కోర్సులు, చాలా మంది డిగ్రీవైపు చూస్తున్నారు. దీంతో పలు కళాశాలలు ఎంసెట్ తదితర కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోనూ ఐఐటీ శిక్షణ కేంద్రం అందుబాటులో ఉంది. కాకతీయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకున్నవారు ఉన్నత శిఖరాలకు బాటలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏకంగా 16 మంది విద్యార్థులు ఐఐటీ మెయిన్స్‌కు అర్హత సాధించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో మరిన్ని శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని విద్యాభిమానులు భావిస్తున్నారు. -
గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతా..
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే గుంటూరును ఐటీ హబ్‌గా తీర్చిదిద్తుతామని బాలశౌరి చెప్పారు. అలాగే మన ప్రాంతానికి సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌లాంటి హాస్పటల్స్‌తోపాటు, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గుంటూరు ప్రత్తి పంటకు కేంద్రంగా ఉన్నందున స్పిన్నింగ్‌మిల్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజశేఖరరెడ్డి హయాంలో స్పైసస్ బోర్డు శంకుస్థాపన చేశారని దీన్ని పునఃనిర్మాణం చేస్తామన్నారు. అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి.. వ్యాలీ యాడెడ్ చేస్తే రైతులకు మరింత ఆదాయం సమకూరుతుందన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఒక విజన్‌తో ముందుకు వచ్చిన జగన్‌ను ప్రజలు ఆశీర్వదించే సమయం ఆసన్నమైందని బాలశౌరి చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలను కైవశం చేసుకుంటామని స్పష్టం చేశారు. జగన్ సీఎం కాగానే గుంటూరులో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిన్నటి వరకు దొంగలు, హంతకులు, అవినీతి పరులు అని ఇప్పుడు టీడీపీలో చేర్చుకొని టిక్కెట్లు ఎలా ఇస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ముందడుగు అంటూ ప్రచారం చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా ముందడుగంటే శోభన్‌బాబు సినిమానే కదా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అలాగే ఇప్పటికే జిల్లాపరిషత్, మండలపరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసిందని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు రాతంశెట్టి రామాంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి రంగస్థలంపై టెంపెస్ట్ నాటకం
-
ఫెలిసిటీ 14
-
గోండు లిపి పుస్తకావిష్కరణ
దేశంలో ప్రథమంగా వెలుగులోకి... హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆదివాసి గోండు లిపి పుస్తకాలను, ప్రత్యేక ఫాంట్లను శుక్రవారమిక్కడి సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. దళిత్, ఆదివాసి అధ్యయనం, అనువాద విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాషా దినోత్సవంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి వీటిని అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వెలుగులో లేని అదివాసి, గిరిజన భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకు విశ్వవిద్యాల యాలు కృషిచేయాలని సూచిం చారు. ప్రత్యేక ఫాంట్, పుస్తకాల ప్రచురణ ద్వారా ఈ గిరిజన భాషలకు జీవం కల్పించిన వాళ్లమయ్యామన్నారు దేశంలో మొదటిసారిగా గోండు లిపిలో పుస్తకాల ఆవిష్కరణ, ఫాంట్లను వెలుగులోకి తెచ్చామని సీడీఏఎస్టీ డెరైక్టర్ ప్రొఫెసర్ కృష్ణ చెప్పారు. కార్యక్రమానికి హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, సీడీఏఎస్టీ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి జనార్దన్ నివాస్ తదితరులు హాజరయ్యారు. -
సవాళ్లు ఉంటాయ్... ఎదుర్కొంటాం
కాంగ్రా (హిమాచల్ ప్రదేశ్): ఆర్థిక రంగంలో సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా కూడా భారత్‌కు ఉందని ఆయన వివరించారు. షాపూర్లో హిమాచల్‌ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రణబ్, ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇలాంటి సమయంలో దేశాలకు సవాళ్లు తప్పవని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన 2008 ఆర్థిక సంక్షోభం అటు తర్వాత వచ్చిన యూరో సవాళ్లను ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు రావని సైతం ఎవ్వరూ చెప్పలేరని పేర్కొన్నారు. అయితే ఆయా సవాళ్లను భారత్ ఎదుర్కొనగలదన్నారు. -
పరిష్కారమిది కాదు!!
న్యూఢిల్లీ: రాజధానిలోని కళాశాలల్లో సీట్ల భర్తీపై మంత్రి మనీశ్ సిసోడియా చేసిన ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకే 90 శాతం సీట్లు కేటాయించాలనే అభిప్రాయాన్ని సిసోడియా ఇటీవలే సూచనప్రాయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రతిపాదనపై విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతుండగా విద్యావేత్తల్లో మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇది విశ్వవిద్యాలయ స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వ ప్రతిపాదనలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయి. ఉదాహరణకు సెంట్రల్ యూనివర్సిటీనే తీసుకుందాం. అక్కడికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా విద్యార్థులు చేరుతుంటారు. అప్పుడే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం ఢిల్లీ వాసులకే 90 శాతం సీట్లు కేటాయించడం ద్వారా తమకెలాగైనా సీటు వస్తుందనే అభిప్రాయం వారిలో పోటీతత్వాన్ని తగ్గిస్తుంద’ని దయాళ్‌సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐఎస్ బక్షీ అన్నారు. ‘మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయంలో చొరవ తీసుకోవడం ప్రశంసనీయమైన విషయమే. అయితే సమస్యకు పరిష్కారం ఇది కాదు. ఏటా 2.65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల నుంచి కళాశాల చదువుల కోసం బయటకు వస్తున్నారు. అయితే నగరంలోని కళాశాలల్లో కేవలం 90,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ కారణంగా నగర విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అంతేగానీ ఇతర ప్రాంతాలవారు వస్తున్నంతమాత్రాన స్థానిక విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారనుకోవడం సరికాదు. అయితే సమస్య పరిష్కారానికి బయట విద్యార్థులను రాకుండా అడ్డుకోవడం సమంజసమనిపించుకోదు. కళాశాలల సంఖ్య పెంచి, స్థానిక విద్యార్థుల అవకాశాలను మరింత మెరుగుపర్చాల’ని కిరోరీమాల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సలోనీ శర్మ అభిప్రాయపడ్డారు. పాఠశాలల్లో చదివిన విద్యార్థులతోనే కలిసి విశ్వవిద్యాలయాల్లో కూడా చదివితే అప్పుడు పాఠశాలకు, విశ్వవిద్యాలయానికి తేడా లేకుండా పోతుందని, ఇది విశ్వవిద్యాలయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ మాజీ సభ్యుడు అమర్దేవ్ శర్మ మాట్లాడుతూ... ‘ఢిల్లీ యూనివర్సిటీ అనేది రాష్ట్రానికి చెందిన విశ్వవిద్యాలయం కాదు. అది కేంద్ర విశ్వవిద్యాలయం. దానిని ఢిల్లీ వాసులకే పరిమితం చేస్తామంటే ఎలా? నగర విద్యార్థులు నగరంలోనే చదువుకోవాలనే అభిప్రాయం నేతల్లో ఉంటే వారి కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను ప్రారంభించుకోవాలి. అంతేకాని దేశంలోని మిగతా ప్రాంతాల విద్యార్థుల అవకాశాలను దెబ్బతీయడం సరికాద ’న్నారు. -
సమస్యలపై ప్రజాగ్రహం
చందానగర్/సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్‌లైన్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్‌లో నిర్వహించిన ‘సాక్షి జనసభ’లో ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు విన్నవించారు. బుధవారం చందానగర్ డివిజన్లోని అంబేద్కర్ కల్యాణ మండపంలో సాక్షి జనసభను ఫ్రెండ్స్ వె ల్ఫేర్ అసొసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. అసంపూర్తి డ్రైనేజీ పనులు, రోడ్లు, మంచినీటి సమస్యలను సమావేశం దృష్టికి తే వడంతోపాటు అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చే శారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్పొరేటర్ అశోక్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ రాజ్‌కుమార్, వాటర్ వర్క్స్ మేనేజర్ సరిత, వార్డు కమిటీ సభ్యులు మహేష్‌యాదవ్, పలు కాలనీలకు చెందిన ప్రజలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చందానగర్ డివిజన్లో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. జనసభలో ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను దశలవారీగా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం చేపడుతన్న పనుల్లో ఎక్కడా ఆలస్యం చోటు చేసుకోవడం లేదు. త్వరిత గతిన పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. అదనంగా సర్కిల్-12కు మరో ఏఈని నియమించడానికి ఉన్నతాధికారులు అంగీకరించారు. భూగర్భ డ్రైనేజీ పనులతో రోడ్లు ధ్వంసమయ్యాయి. వాటి మరమతులు చేపట్టే విషయాన్ని సీవరేజ్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. - రాజ్‌కుమార్, సర్కిల్-11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినియోగదారులదే బాధ్యత మంచినీటి పైప్‌లైన్ ఏర్పాటు కోసం తవ్విన పైప్‌లైన్ గుంతలను వినియోగదారులే పూడ్చివేయాలి. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని కాలనీల్లో మంజీరా పైప్‌లైన్ పనులను వేగవంతం చేయనున్నాం. చందానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నాం. జన సభ ద్వారా మా దృష్టికి వచ్చిన సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జనసభలో వెల్లువెత్తిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. - సరిత, మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్ రూ. 2కోట్లతో చందానగర్ అభివృద్ధికి ప్రతిపాదనలు : కార్పొరేటర్ అశోక్‌గౌడ్ చందానగర్ డివిజన్ అభివృద్ధికి రూ. 2కోట్లతో ప్రతిపాదన చేసినట్లు కార్పొరేటర్ అశోక్‌గౌడ్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి సాక్షి దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జనసభ ద్వారా కొత్త సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. రూ.20లక్షలతో ఎంఏనగర్‌లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పాత ముంబయి రోడ్డు నుంచి అమీన్పూర్ వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంటి నంబర్లు రాని వారికి వెంటనే నెంబర్లు ఇచ్చేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పలు కాలనీల్లో వీధిలైట్ల ఏర్పాటు, పనిచేయని చోట మరమతులు చేపడతామన్నారు. మియాపూర్‌లోని బస్‌స్టేషన్ సమీపంలో త్వరలో సులభ్‌కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినట్లు తెలిపారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా బోర్ల సంఖ్య పెంచడంతో పాటు అన్ని కాలనీలకు మంజీరా నీరు అందేలా కృషి చేస్తాం. చందానగర్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అధికారులు సమస్యల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ ప్రాంతవాసిగా ఇక్కడి సమస్యలు పరిష్కరించడం తన కర్తవ్యమన్నారు. జనసభల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకువెళ్తున్న ‘సాక్షి’ కృషి మరువలేనిదన్నారు. -
సెంట్రల్ యూనివర్సిటీ సాధ్యమేనా..?
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: రాష్ట్రవిభజన అనివార్యమైతే కేంద్ర ప్రభుత్వం వ రాలు జల్లు కురిపిస్తుంది. సీమాంధ్రలో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థలు ఏర్పాటవుతాయి. ఈనేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ మేరకు ఇక్కడ పోరాట కమిటీ ఏర్పాటైంది. ఇదిలా ఉండగా..రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన ఆంధ్రా యూనివర్సిటీని మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ చేయొద్దని అక్కడి వారు పోరాడుతుండడం గమనార్హం. ఇదీ కథ.. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో కనీస వసతులు కరువవుతున్నాయి. యూజీసీ 12-బి, నాక్ వంటి గుర్తింపు కూడా లేదు. వర్సిటీకి 80 మందికి పైగా బోధకులు అవసరం కాగా.. రెగ్యులర్ బోధకులు 12 మంది మాత్రమే ఉన్నారు. 2008లో వర్సిటీ ఏర్పడ్డాక మాతృ సంస్థ ఏయూకు వెళ్లిపోయిన బోధకులు స్థానాలను భర్తీ చేయలేదు. అనుబంధ కళాశాలలకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా లేదు. వర్సిటీకి ఒకే ఒక ప్లస్ ఏమిటంటే..అభివృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం. ప్రభుత్వం కేటాయించిన 130 ఎకరాల భూమి. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడితే రూ. కోట్లలో నిధులు వచ్చి పడతాయి.రెగ్యులర్ బోధకుల నియామకాలు జరుగుతాయి. పరిశోధనా కోర్సులు పెరుగుతాయి. కనీసం 100 డిపార్ట్మెంట్లు వరకు కొత్తగా ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. ఐదేళ్లలో మొత్త స్వరూపం మారిపోతుంది. సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల ప్రారంభానికి అవకాశం ఉంటుంది. ఏయూకు వద్దు.. ఏయూను సెంట్రల్ యూనివర్సిటీ చేయొద్దంటూ..సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎఫిలియేటెడ్ కళాశాలలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. సుమారు రూ.5 వేల కోట్ల ఆస్తులు వర్సిటీ సొంతం. యూజీసీకి సంబంధించి అన్ని గుర్తింపులు ఉండడంతో నిధుల కొరత లేదు. దూర విద్య కోర్సుల ద్వారా కూడా కోట్లాది రూపాయల నిధులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ యూనివర్సిటీ అయితే..నష్టమే తప్ప..లాభమేమీ ఉండదని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయమైంది. వెనుక బాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలి శ్రీకాకుళం.. వెనుకబడిన జిల్లా. ఇక్కడి ప్రజలందరూ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు. విభజన అనివార్యమైతే..బీఆర్‌ఏయూను సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలి. దీంతో ఇక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ప్రొఫెసర్ గుంట తులసీరావు, సీడీసీ డీన్, బీఆర్‌ఏయూ సెంట్రల్ యూనివర్సిటీ అవసరం ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు అవసరం. కావల్సినంత స్థలం ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ వస్తేనే ప్రాంతీయ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందుకే పోరాట కమిటీని ఏర్పాటు చేశాం. డాక్టర్ హనుమంతు సుబ్రహ్మణ్యం,సెంట్రల్ యూనివర్సిటీ పోరాట కమిటీ కన్వీనర్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇప్పటీ రాష్ట్ర విభజనను అడ్డు కుంటున్నాం. అనివార్య మైతే మాత్రం వెనుకబడిన శ్రీకాకుళానికి న్యాయం చెయ్యాలి. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలి. బీఆర్‌ఏయూను సెంట్రల్ యూనివర్సిటీ చెయ్యాలి.బడే రామారావు, విద్యార్థి జేఏసీ నాయకుడు -
ఇన్ని కార్డులెందుకు?: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వివిధ అవసరాల కోసం రకరకాల కార్డులు జారీ చేయడంపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాన్‌కార్డు, సిటిజన్ కార్డు, ఆధార్.. ఇలా రకరకాల కార్డుల స్థానంలో డీఎన్ఏ ఆధారిత కార్డులు జారీ చేస్తే మేలని సూచించారు. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్ రావు ఇన్స్టిట్యూట్లో డీఎన్ఏ 2013 సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డీఎన్ఏ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై ప్రజలతోపాటు పోలీసులు, వైద్యులకు అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన ఈ సదస్సులో ఆయన మాట్లాడారు. నేరం జరిగినప్పుడు దోషులకు తగిన శిక్ష పడాలని, న్యాయం సకాలంలో అందాలని ప్రజలు ఆశిస్తారన్నారు. పరిమితుల పేరుతో జరిగే జాప్యాన్ని సహించే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. దర్యాప్తులో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలను వాడకంలోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ ప్రసాదరావు, ఫోరెన్సిక్ సెన్సైస్ లేబొరేటరీ డెరైక్టర్ శారద అవధానం, సీఆర్ రావు ఏఐఎంఎస్సీఎస్ అధ్యక్షుడు డాక్టర్ వి.కె.సారస్వత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళనల నడుమ ఈసీ సమావేశం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: విద్యార్థి సంఘాల ఆందోళనల నడుమ హెచ్‌సీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలోని పరిపాలనా విభాగంలో బుధవారం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సమావేశాన్ని పలు విద్యార్థి సంఘాలు అడ్డుకునేందుకు యత్నించాయి. తాజాగా విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటనపై బాధ్యులను శిక్షించాలని, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ నివేదికను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ తప్పిదాలతో ఆత్మహత్య చేసుకున్న పుల్యాల రాజు, పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ కుటుంబాలకు పరిహారం అందజేయాలని పట్టుబట్టారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వీసీ రామకృష్ణ రామస్వామికి అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఏ, టీఎస్ఏ, ఎంఎస్ఎఫ్, ఏబీవీపీ,బీఎస్ఎఫ్, టీఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐల నాయకులు పాల్గొన్నారు. వీసీ అంగీకరించిన డిమాండ్లు ఇవే... ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్, పుల్యాలరాజుల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు హామీ. 2008 నుంచి జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర విచారణ చేసేందుకు నిర్ణయం. బాధ్యులుగా తేలితే ప్రొఫెసర్లపై చర్యలకు నిర్ణయం. విద్యార్థులకు, ప్రొఫెసర్లకు మధ్య సమన్వయం కుదిర్చేందుకు తగిన రిఫ్రెష్మెంట్ క్లాసుల నిర్వహణ. యూనివర్సిటీలో సైకాలజిస్ట్లచే విద్యార్థుల్లో మానసిక స్వావలంబన చేకూర్చేందుకు కార్యక్రమాలు. కోలుకుంటున్న ఇషానీ.. హెచ్‌సీయూలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేశ్ ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కలకత్తాకు చెందిన ఇషానీ(19) హెచ్‌సీయూలో ఎంఏ చరిత్ర విభాగంలో మొదటి సంవత్సరం చదవుతోంది. మంగళవారం రాత్రి ఆమె బ్లేడుతో చేతిపై కోసుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
PHD విద్యార్ధి వెంకటేశ్వర్లు సూసైడ్
-
విద్యావంతుడి విషాదాంతం
మంచాల, న్యూస్‌లైన్: ‘చదువుకున్నోడు, శాస్త్రవేత్త కావాల్సిన నా బిడ్డ శవమై వచ్చాడు..అయ్యో మాకేంటి ఈ గతి?’ అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం బంధువుల తరంకాలేదు. ఆదివారం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేష్ బలవన్మరణంతో స్వగ్రామం మంచాల మండలం లింగంపల్లి శోకసంద్రమైంది. గ్రామానికి చెందిన మాదారి అంజయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అంజయ్య రిటైర్డ్ ఏఎస్ఐ. వెంకటమ్మ గృహిణి. వీరి రెండో కుమారుడు వెంకటేష్(25) చురుకైన విద్యార్థి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే అహర్నిషలు శ్రమించేవాడు. నగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొద్ది మార్కుల తేడాతో డాక్టర్ చదవలేకపోయాడు. దీంతో ఆయన జేఎన్టీయూలో పీజీ చదివాడు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీలో బయో కెమెస్ట్రీలో పీహెచ్‌డీలో చేరి ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్నాడు. తరచూ తనను గైడ్ రవి వేధిస్తున్నాడని వెంకటేష్ కుటుంబీకులతో చెబుతుండేవాడు. కాగా గ్రామంలో ఆదివారం రాత్రి వెంకటేష్ అంత్యక్రియలు నిర్వహించారు. శోకసంద్రమైన లింగంపల్లి.. వెంకటేష్ మృతితో కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉన్నత లక్ష్యానికి చేరుకుంటాడనుకున్న వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తనకు జేఎల్(జూనియర్ లెక్చరర్) పరీక్ష ఉందని, సెంటర్ వరకు తీసుకెళ్తానని చెప్పిన తమ్ముడు వెంకటేష్ అంతలోనే విగత జీవి అయ్యాడని అక్క రాణి గుండెలుబాదుకుంది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనం
కూచిపూడి.. కథక్.. యక్షగానం.. బంజారా డ్యాన్స్‌లు.. విభిన్న రాష్ట్రాల కళా ప్రదర్శనలు నవోదయ జాతీయ సమైక్యతా సమ్మేళనంలో ఆవిష్కృతమయ్యాయి. సెంట్రల్ యూనివర్శిటీలోని డీఎస్టీ ఆడి టోరియంలో జాతీయ స్థాయి కళల ప్రదర్శన శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.దేశంలోని 8 నవోదయ విద్యాలయాల రీజియన్ల నుంచి 500 మంది విద్యార్థులు ఈ ప్రత్యేక సాంస్కృతిక సంబరాల్లో భాగస్వాములయ్యారు. దక్షిణ, ఈశాన్య, ఉత్తర భారతదేశ సంప్రదాయ, జానపద, గ్రామీణ కళలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. -
సీమాంధ్రకు ఐఐటీ, ఐఐఎం, మూడు సెంట్రల్ యూనివర్సిటీలు
రాష్ట్ర విభజన నిర్ణయంతో రగిలిపోతున్న సీమాంధ్ర ప్రాంత వాసులను బుజ్జగించేందుకు ఒక ఐఐటీ, ఒక ఐఐఎంతో పాటు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. అయితే, తెలంగాణపై కేంద్రం నియమించిన మంత్రుల బృందం ముందు ఈ నిర్ణయాన్ని ఉంచి, దాని ఆమోదం తీసుకోవాల్సి ఉందని మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలను కూడా సీమాంధ్రకు కేటాయించాలని హెచ్ఆర్డీ శాఖ నిర్ణయించింది. కీలకమైన విద్యా సంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్న వాదన వస్తుండటంతో, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ సంస్థలను ఆ ప్రాంతానికి కేటాయించినట్లు మంత్రిత్వశాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటివల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనం కలుగుతుందంటున్నాయి. ఈ సంస్థలన్నింటినీ నెలకొల్పేందుకు సుమారు రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 7 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొల్పే కేంద్ర విద్యా సంస్థలన్నింటికీ బిల్లు రూపంలో రక్షణ ఉండాలని, జాతీయ పార్టీలన్నీ దానిపై సంతకాలు చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ విజయం
=తొలిసారిగా అధ్యక్షురాలిగా మహిళ =రెండు స్థానాల్లో ఏబీవీపీ, ఒక స్థానంలో యూడీఏ కూటమి విజయం =ఫలితాలపై తిరస్కరణ ఓటు ప్రభావం సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ మరోమారు విజయం కేతనం ఎగురవేసింది. కీలకమైన మూడు పదవుల్లో జెండా ఎగురవేసింది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవికి ఎన్నికైంది. ఎన్నికల్లో 4,626 ఓట్లకుగాను 3738 ఓట్లు పోలయ్యాయి. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష అభ్యర్థి శిరీష 1197 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి ఉదయ్‌పై 79 ఓట్ల తేడాతో విజయం సాధించింది. మహబూబ్‌నగర్‌కు చెందిన వి. శిరీష యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ(ఎకనామిక్స్) చదువుతోంది. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి సందీప్‌కుమార్ 1174 ఓట్లు, సంయుక్త కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఆదిత్య హరీష్ 1283 ఓట్లతో విజయం సాధించారు. సాంస్కృతిక కార్యదర్శిగా ఏబీవీపీకి చెందిన స్వాతి వీఎం 1272 ఓట్లతో, క్రీడల కార్యదర్శిగా ఏబీవీపీ అభ్యర్థి కృష్ణచైతన్య 1221 ఓట్లతో విజయం సాధించారు. యునెటైడ్ డెమొక్రటిక్ అలయన్స్(యూడీఏ) కూటమికి చెందిన మణికంఠ ఉపాధ్యక్షులుగా 1189 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఎన్ఎస్యూఐలు ఒంటరిగా పోటీ చేయగా.. ఏఎస్ఏ, టీఎస్ఏ, టీఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సంఘాలు యూడీఏ పేరిట బరిలో నిలిచాయి. తొలిసారిగా నమోదైన తిరస్కరణ ఓట్లు ఫలితాలపై తిరస్కరణ ఓట్లు ప్రభావం చూపాయి. ఆరు పదవుల్లో తిరస్కరణ ఓట్ల కారణంగానే మెజార్టీ గణనీయంగా తగ్గింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ దేశంలోనే తొలిసారిగా హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు విధానాన్ని వర్సిటీ అధికారులు అమలు చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం పోలైన 3738 ఓట్లలో అధ్యక్ష పదవికి 87, ఉపాధ్యక్ష పదవికి 146, ప్రధాన కార్యదర్శికి 137, సంయుక్త కార్యదర్శికి 200, సాంస్కృతిక కార్యదర్శికి 172, క్రీడల కార్యదర్శికి 167 తిరస్కరణ ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనం. తమకు నచ్చని అభ్యర్థులకు తిరస్కరణ ఓటు వారి విజయంపై ప్రభావాన్ని చూపింది. గర్వంగా ఉంది హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్నికల్లో నన్ను తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం పట్ల గర్వంగా ఉంది. దీని ద్వారా విద్యార్థినుల సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. 34 సంవత్సరాల హెచ్‌సీయూ చరిత్రలో నాకు గౌరవం దక్కడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. - శిరీష, హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు -
హెచ్‌సీయూలో టెన్నిస్ కోర్టు ప్రారంభం
సెంట్రల్ యూనివర్సిటీ, న్యూస్‌లైన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్తగా టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. సిటీలోనే తొలిసారిగా రూ.23 లక్షల వ్యయంతో ఎనిమిది లేయర్ల సింథటిక్ ఆక్రాలిక్ టెన్నిస్ కోర్టును క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. వీసీ రామకృష్ణ రామస్వామి ఈ కోర్టును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో డిగ్రీ అర్హత గల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా అమలుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ కె.వి.రాజశేఖర్ మాట్లాడుతూ మొదటి దశలో ప్రధాన క్యాంపస్‌లో, రెండవ దశలో సౌత్ క్యాంపస్‌లో టెన్నిస్ కోర్టుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ బాస్కెట్ బాల్ , బీచ్ వాలీబాల్, ఏరోబిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియత్రణ అధికారి వెంకటేశ్వరరావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్ కిషోర్, పీఈటీలు శ్యామ్సన్, కృపాకర్ పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర ఉద్యమాలకు రూపం లేదు
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)స్థాయిలో కాకతీయ యూ నివర్సిటీ అభివృద్ధి చెందుతుందని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ అభిప్రాయపడ్డారు. కేయూ దూరవిద్యాకేంద్రంలో శని వారం జరిగిన జర్నలిజం విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత విద్యావనరులను విస్తరించుకోవాల్సి ఉంటుం దన్నారు. తాను 18 ఏళ్లలోపే పాత్రికేయ వృత్తిలో ప్రవేశించానని గుర్తుచేశారు. ఇంటర్ తర్వాత దూరవిద్య విద్యార్థినేనని చెప్పారు. జర్నలిజం కోర్సులో మెళకువలు నేర్చుకుంటే పాత్రికేయ వృత్తిలో రాణించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆరు ద శాబ్దాలుగా పోరు కొనసాగిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాక యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఉద్యమాల ఫలితంగా ఇటీవల కేంద్రం తెలంగాణ విభజన ప్రకటన చేసిందని చెప్పారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలకు రూపం లేదని విమర్శించారు. మన బొగ్గు, ముడి ఇనుము, ఖనిజాలు, వనరులను వినియోగించుకుంటే అద్భుత తెలంగాణ పునర్నిర్మితమవుతుందని పేర్కొన్నారు. కేయూ వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ దూరవిద్య జర్నలిజం కోర్సును నాణ్యమైన విద్యగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఓయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు మాట్లాడుతూ భారతదేశంలో 90 వేల పత్రికలు, 894 టీవీ చానళ్లున్నాయన్నారు. అందులో 424 న్యూస్ చానళ్లున్నాయని వివరించారు. ప్రస్తుతం ఎఫ్ఎం, ఇంటర్నెట్ వినియోగం కూడా భారతదేశంలో విస్తరిస్తున్నదన్నారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, దూరవిద్యాకేంద్రం డెరైక్టర్ డి.రాజేంద్రప్రసాద్, జర్నలిజం కోర్సు కోఆర్డినేటర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడారు. కార్యక్ర మంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజారాం, అకుట్ అధ్యక్షుడు జి.దామోదర్, జనరల్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి,అధ్యాపకులు వీరాచారి, వి.జగన్, కె.నర్సింహారావు, జయపాల్, సంపత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు బాబురావు, డి.రఘుపతి బీసీజే, ఎంసీజే విద్యార్థులు పాల్గొన్నారు.