ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదముద్ర | Union Cabinet Approved For AP Central University Bill | Sakshi
Sakshi News home page

ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదముద్ర

Published Wed, Jul 18 2018 6:06 PM | Last Updated on Wed, Jul 18 2018 6:16 PM

Union Cabinet Approved For AP Central University Bill - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనిర్సిటీ ఏర్పాటు బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 5 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో ఏపీలో విద్యావకాశాలు మరింత మెరుగవుతాయన్నారు. గత సంప్రదాయానికి భిన్నంగా సొసైటీ ఏర్పాటు చేసి క్లాసులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెంటార్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement