హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. 72 కోర్సుల ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. సీట్లు సాధించిన విద్యార్థులకు జూన్ 6 నుంచి ప్రవేశాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఎంఫిల్ (ఉర్దూ), పీహెచ్‌డీ (ఉర్దూ), పీహెచ్‌డీ (కెమిస్ట్రీ), ఎంఫిల్ (నాలెడ్జ్ ఇన్నోవేషన్ అండ్ సొసైటీ స్టడీస్), పీహెచ్‌డీ (మ్యాథమెటిక్స్), పీహెచ్‌డీ (హెల్త్ సైకాలజీ) కోర్సుల ఫలితాలు జూన్ 2న విడుదలవుతాయి