
పట్నా: బీహార్ బోర్డు(Bihar Board) తాజాగా 12వ తరగతి ఫలితాలను విడుదలు చేసింది. పెళ్లిళ్లలో మేళతాళాలు వాయించే వ్యక్తి కుమార్తె సంజనా కుమారి ఈ పరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆర్ట్స్ గ్రూపులో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. సంజన 93.6శాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది. ఆమె భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలనుకుంటోంది.
సంజనా కుమారి మోతీపూర్ పరిధిలోని అంజనాకోట్‌లో ఉంటోంది. కుటుంబంలోని ముగ్గురు సంతానంలో ఆమె మూడవది. సంజనా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు దీపక్ ఇటీవలే ప్రభుత్వ టీచర్(Government teacher) ఉద్యోగం సంపాదించాడని తెలిపింది. మరో సోదరుడు కూడా చదవులో ప్రతిభ చూపిస్తున్నాడని పేర్కొంది. ఇష్టంగా కష్టపడి చదవితేనే మంచి స్కోరు సాధించగలమని సంజన స్పష్టం చేసింది.
పరీక్షల్లో తాను రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచానని తెలియగానే ఎంతో ఆనందించానని, ఇంట్లోని వారికి ఈ విషయం తెలిసి, ఎంతో సంబరపడ్డారని సంజన పేర్కొంది. ఇండియా టీవీ కథనంలోని వివరాల ప్రకారం సంజన తన విజయానికి తన పాఠశాల ఉపాధ్యాయులే కారణమని, వారి మార్గదర్శకత్వంలో చదివి, తాను ఉత్తీర్ణత సాధించానని వివరించింది. తాను పరీక్షలకు ముందు రోజుకు 10 నుంచి 12 గంటలపాటు చదివేదానినని, సెల్ఫ్ స్టడీ తనకు ఎంతో ఉపకరించిందని తెలిపింది. భవిష్యత్‌లో ఐఏఎస్ కావాలన్నదే తన కల అని సంజన పేర్కొంది. కుమార్తె 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని తెలియగానే తండ్రి ఆమెను మేళతాళాలతో ఊరేగించారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పౌరసత్వ రుజువుకు పెద్దపీట
Comments
Please login to add a commentAdd a comment