ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ నేతగా మారిన బిహార్‌కు చెందిన పప్పు యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కోవిడ్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘న్యూస్ 24’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు యాదవ్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మహమ్మారికి అందరూ భయపడుతుంటే తాను మాత్రం ఆ వైరస్‌నే భయపెట్టానని పేర్కొన్నారు. ‘కోవిడ్ సమయంలో మాస్క్, చేతికి గ్లోవ్స్ ధరించని ఏకైక వ్యక్తని నేనే. నేను సైన్స్ టాపర్‌ని’ అన్నారాయన. బిహార్ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న పప్పు యాదవ్ ప్రపంచ రాజకీయాలు, తత్వాలు, ఆర్థిక వ్యవస్థతో సహా తనకు అన్ని విషయాలు తెలుసునని పేర్కొన్నారు.
పప్పు యాదవ్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి వ్యతిరేకంగా 2015లో జన్ అధికార్ పార్టీని స్థాపించారు. పప్పు యాదవ్‌ను బిహార్ బాహుబలిగా వ్యవహరిస్తారు. ఆయన ఇటీవలే తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అధికారికంగా ఆ పార్టీలో చేరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment