బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పరస్పర అంగీకారంతో సీట్లను పంచుకుంది. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల సమస్య మరింత జఠిలమయ్యేలా కనిపిస్తోంది. మొదట ఔరంగాబాద్ సీటు విషయంలో కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తగా ఇప్పుడు పూర్నియా లోక్‌సభ సీటు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది.
తాజగా బిహార్ మాజీ మంత్రి బీమా భారతి జేడీయూను వీడి ఆర్జేడీలో చేరారు. అయితే ఆమె పూర్నియా లోక్‌సభ స్థానం నుండి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకుడు పప్పు యాదవ్‌కు చిక్కు ఎదురైంది. ఎందుకంటే ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమిలో మిత్ర పక్షంగా ఉంది.
పూర్నియా నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పు యాదవ్.. తాను ఈ లోకాన్ని అయినా విడిచిపెడతాను కానీ.. పూర్నియా లోక్‌సభ స్థానాన్ని మాత్రం వదిలి వెళ్లలేనని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
#WATCH | On his tweet on Purnea, Congress leader Pappu Yadav says, "I merged with the trust and blessings of a family, and the ideology of a party. All these responsibilities now lie with the leadership of that party. I have been working in Kosi-Seemanchal for the past 2 years… pic.twitter.com/h0xT2qholN
— ANI (@ANI) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment