బిహార్ బ‌రిలో ఈ 25 ఏళ్ల యువ‌తి హైలైట్‌! | 25 Years Old Sambhavi Choudhary Youngest Dalit Woman To Contest For Lok Sabha Polls, Details Inside - Sakshi
Sakshi News home page

Sambhavi Choudhary: బిహార్ బ‌రిలో ఈ 25 ఏళ్ల యువ‌తి హైలైట్‌!

Published Sun, Mar 31 2024 6:54 AM | Last Updated on Sun, Mar 31 2024 1:50 PM

Sambhavi Choudhary youngest Dalit woman to contest Lok Sabha polls - Sakshi

పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో  లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్)  అభ్యర్థులను ప్రకటించింది. ఎన్‌డీఏ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ పార్టీకి ఐదు సీట్లు ద‌క్క‌గా మొత్తం ఐదు స్థానాలకు అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసింది. 

పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్  హాజీపూర్ నుండి పోటీ చేస్తుండ‌గా.. ఆయ‌న లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన జామ‌యి సీటును నిలబెట్టుకునేందుకు త‌న బావ అరుణ్ భారతి ఇక్క‌డ నుంచి పోటీకి నిల‌బెట్టారు. ఇక పార్టీ జాబితాలో వైశాలి నుండి టిక్కెట్ పొందిన ఏకైక సిట్టింగ్ ఎంపిగా వీణాదేవి ఉన్నారు. అలాగే రాజేష్ వర్మకు ఖగారియా నుండి టిక్కెట్ ఇచ్చారు.

హైలైట్‌గా శాంభ‌వి చౌద‌రి
జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభ‌వి చౌదరిని రంగంలోకి దింపడం ఈ జాబితాలో హైలైట్. చిరాగ్ బంధువు ప్రిన్స్ రాజ్ ప్రాతినిధ్యం వహించిన సమస్తిపూర్ రిజర్వు స్థానం నుండి ఈమె పోటీ చేస్తున్నారు. 25 సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సులో మూడవ తరం రాజకీయవేత్త అయిన శాంభ‌వి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన దళిత మహిళ కావ‌చ్చు. ఆమె తాత మహావీర్ చౌదరి కాంగ్రెస్ నుండి బీహార్ మంత్రిగా ప‌నిచేశారు.

శాంభ‌వి లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. "బీహార్ రాజకీయాల్లో లింగ, కులాల విభజన"పై డాక్టరేట్ చేస్తున్నారు. బీహార్‌లోని దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించిన ఘనత పొందిన మాజీ ఐపీఎస్‌ అధికారి ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సాయన్ కునాల్‌ను వివాహం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement