LJP
-
కేంద్ర మంత్రి ఆప్తుడి ఇంట ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: హస్తినలో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎల్జేపీ(రామ్ విలాస్ వర్గం) అధినేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన హులాస్ పాండేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టార్గెట్ చేసుకుంది. పాట్నా, బెంగళూరు, ఢిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలతోపాటు బంధవుల ఇళ్లలోనూ తన బృందాలతో తనిఖీలు జరిపింది.ఆర్థిక లావాదేవీల అవకతవకలకు సంబంధించి.. హులాస్ పాండే(Hulas Pandey) మీద గతంలో చాలా ఆరోపణ వచ్చాయి. అయితే ఈడీ మాత్రం దాడులకు సంబంధించిన ప్రత్యేకమైన కారణాలను ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే.. హులాస్ పాండే ఎల్జేపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పాండే గతంలో బీహార్ ఎమ్మెల్సీగా పని చేశారు. తొలినాళ్లలో నితీశ్ కుమార్(Nitish Kumar) జేడీయూలో పని చేసిన ఈయన.. తర్వాత ఎల్జేపీ(LJP)లో చేరారు. అప్పటికే పాండే.. చిరాగ్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉంది. ఇక ఎల్జేపీలో చేరాక.. ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటిని ఇతనే చూసుకునేవారు. ఇదిలా ఉంటే.. 2012 నాటి హత్య కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పాండే పేరును చేర్చారు. దీంతో.. అనివార్య పరిస్థితుల మధ్య కిందటి ఏడాది డిసెంబర్లో ఎల్జేపీ పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పాండే రాజీనామా చేయాల్సి వచ్చింది. వివాదాస్పద ప్రకటనతో అప్పుడప్పుడు వార్తల్లోనూ నిలుస్తుంటారీయన.ఏమీటా కేసు..2012 జూన్ 1వ తేదీన రణ్వీర్ సేన అధినేత బ్రహ్మేశ్వర్ సింగ్ ముఖియా భోజ్‌పుర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే.. ఈ కేసు విచారణ జరిపిన సీబీఐ పాండే మీద సంచలన ఆభియోగాలు నమోదు చేసింది. ముఖియాకు పేరు వస్తుండడంతో తన రాజకీయ పలుకుబడి మసకబారిపోతుందనే భయంతోనే పాండే ఈ హత్య చేయించాడని పేర్కొంది. అయితే..పాండే మాత్రం ఆ ఆరోపణలను రాజకీయ కుట్రగా ఖండిస్తూ వస్తున్నారు. ఈలోపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సీబీఐ ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే.. ఈ ఉదయం నుంచి ఆయనకు సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ(ED) బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా.. స్థానిక పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇదీ చదవండి: అయోధ్య గ్రేటర్ దేన్ ఆగ్రా! -
బిహార్ బరిలో ఈ 25 ఏళ్ల యువతి హైలైట్!
పాట్నా: లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏ సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ పార్టీకి ఐదు సీట్లు దక్కగా మొత్తం ఐదు స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్ నుండి పోటీ చేస్తుండగా.. ఆయన లోక్‌సభకు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన జామయి సీటును నిలబెట్టుకునేందుకు తన బావ అరుణ్ భారతి ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టారు. ఇక పార్టీ జాబితాలో వైశాలి నుండి టిక్కెట్ పొందిన ఏకైక సిట్టింగ్ ఎంపిగా వీణాదేవి ఉన్నారు. అలాగే రాజేష్ వర్మకు ఖగారియా నుండి టిక్కెట్ ఇచ్చారు. హైలైట్‌గా శాంభవి చౌదరి జేడీయూ మంత్రి అశోక్ కుమార్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరిని రంగంలోకి దింపడం ఈ జాబితాలో హైలైట్. చిరాగ్ బంధువు ప్రిన్స్ రాజ్ ప్రాతినిధ్యం వహించిన సమస్తిపూర్ రిజర్వు స్థానం నుండి ఈమె పోటీ చేస్తున్నారు. 25 సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సులో మూడవ తరం రాజకీయవేత్త అయిన శాంభవి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పిన్న వయస్కురాలైన దళిత మహిళ కావచ్చు. ఆమె తాత మహావీర్ చౌదరి కాంగ్రెస్ నుండి బీహార్ మంత్రిగా పనిచేశారు. శాంభవి లేడీ శ్రీ రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. "బీహార్ రాజకీయాల్లో లింగ, కులాల విభజన"పై డాక్టరేట్ చేస్తున్నారు. బీహార్‌లోని దేవాలయాలలో అనేక మంది దళిత పూజారులను నియమించిన ఘనత పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సాయన్ కునాల్‌ను వివాహం చేసుకున్నారు. -
ఎల్జేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
ఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడతల వారీగా లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ పార్టీ 'లోక్ జనశక్తి పార్టీ' (LJP) తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన లోక్ జనశక్తి పార్టీ.. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికోసం ఐదు మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ రిలీజ్ చేసింది. హాజీపూర్ నుంచి పార్టీ చీఫ్ 'చిరాగ్ పాశ్వాన్' పోటీ చేయనున్నారు. జముయ్ నుంచి అరుణ్ భారతి, ఖగారియా నుంచి రాజేష్ వర్మ, సమస్తిపూర్ నుంచి శాంభవి చౌదరి, వైశాలి నుంచి వీణాదేవిలను ఎన్నికల బరిలో దించింది. మార్చి 18న.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్‌సభ ఎన్నికల కోసం బీహార్‌లో సీట్ల ఒప్పందాన్ని ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి. కాగా లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది. लोक जनशक्ति पार्टी (रामविलास) के द्वारा लोकसभा चुनाव - 2024 के लिए निम्न प्रत्याशियों के नामों पर अपनी सहमति प्रदान की है :@iChiragPaswan @ANI pic.twitter.com/XZTZsuUU3L — Lok Janshakti Party (@LJP4India) March 30, 2024 -
ఏ పార్టీకైనా నా సపోర్ట్ కావాల్సిందే.. ‘షేర్ కా బేటా’ ఇక్కడ!
ఏ పార్టీకైనా, కూటమికైనా తన సపోర్ట్ కావాల్సిందేనని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన మద్దతు కోసం వివిధ పార్టీలు పోటీపడుతున్నాయని, వీటిలో ‘గౌరవప్రదమైన’ ఆఫర్ ఇచ్చే పార్టీలతోనే తన పొత్తు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షంగా పాశ్వాన్‌కు బిహార్ ప్రతిపక్ష కూటమి 'మహాఘఠ్ బంధన్' నుండి ఆహ్వానం అందినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. సాహెబ్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన ర్యాలీలో చిరాగ్ మాట్లాడుతూ "చిరాగ్ పాశ్వాన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్న మీడియా వ్యక్తులను ఇక్కడ చూస్తున్నాను. చిరాగ్ పాశ్వాన్ కేవలం బిహార్ ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాడని వారికి చెప్పాలనుకుంటున్నాను" అన్నారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్‌కు నిజమైన వారసుడిగా తనను తాను "షేర్ కా బేటా" అని చిరాగ్ చెప్పుకొన్నారు. తమ పార్టీని చీల్చిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్‌ల పేర్లు ఎత్తకుండానే తన ఇల్లు, కుటుంబం, పార్టీని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. -
ఎన్డీయేలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ : అధికార ఎన్డీయేలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. బడ్జెట్ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ నేతృత్వంలో శనివారం ఎన్డీయే పక్షాల సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ భేటీకి లోక్ జన్‌శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కూడా బీజేపీ ఆహ్వానం పంపింది. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ చిరాగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీనివెనుక జేడీయూ అభ్యంతరాలే కారణమని భావిస్తున్నారు. కూటమి భావనను మరిచిపోయి, ఎన్నికల్లో తమను వెన్నుపోటు పొడిచిన పార్టీకి తిరిగి ఆహ్వానం పంపడమేంటంటూ జేడీయూ నేతలు బీజేపీపై ఒత్తిడి తెచ్చారని సమాచారం. బిహార్‌కే చెందిన ఎన్డీఏ పక్షాలు హిందుస్తాన్ ఆవామ్ మోర్చా, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీలు కూడా ఎల్జేపీకి ఆహ్వానం పంపడం ఏంటంటూ బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీంతో, ఎల్జేపీకి పంపిన ఆహ్వానాన్ని బీజేపీ వెనక్కి తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్జేపీ మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం నితీశ్ సారథ్యంలోని జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఎల్జేపీ అభ్యర్థులను నిలిపింది. తమకు వ్యతిరేకంగా చిరాగ్ అభ్యర్థులను బరిలో నిలపడంతో తాము పెద్ద ఎత్తున సీట్లను కోల్పోయామని జేడీయూ ఆరోపిస్తోంది. ఇదే అభిప్రాయాన్ని సీఎం నితీష్ కుమార్ సైతం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఎల్జేపీ, జేడీయూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. -
నితీష్‌కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్‌దాస్‌పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్‌కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్‌దాస్‌తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్‌కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
నితీశ్‌కు ‘చిరాక్’
పట్నా: ‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే నా ప్రధాన ఉద్దేశం. ఈ ఎన్నికల్లో నేను చూపించిన ప్రభావం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను’’.. ఎన్నికల ఫలితాల అనంతరం లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేత చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలివీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారం దక్కించుకుంది. ఈ కూటమిలోని బీజేపీ అనూహ్యంగా తన బలం పెంచుకుంది. మరో పార్టీ జేడీ(యూ) దారుణంగా చతికిలపడింది. ఇందుకు ప్రధాన కారణం ఎల్జేపీ పోటీలో ఉండడమే అని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ మిత్రపక్షమైన ఎల్జేపీ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలుండగా, 120 స్థానాల్లో చిన్నాచితక పార్టీలు ఓట్లను చీల్చి ప్రధాన పార్టీల విజయావకాశాలను దెబ్బతీశాయి. ఇందులో 54 సీట్లలో ఎల్జేపీ బలమైన ప్రభావం చూపింది. వీటిలో 25 సీట్లలో జేడీ(యూ) రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఎల్జేపీ పోటీ చేయడం వల్ల జేడీ(యూ) ఓడిపోయింది. మొత్తం 54 స్థానాల్లో ఎల్జేపీ మూడో స్థానంలో నిలిచింది. ఆయా స్థానాల్లో గెలిచిన, ఓడిన ప్రధాన పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కంటే ఎల్జేపీకి దక్కిన ఓట్లే అధికం కావడం విశేషం. ఈ ఓట్లన్నీ ఓడిపోయిన ప్రధాన పార్టీకి పడి ఉంటే కచ్చితంగా గెలిచేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎల్జేపీ మతీహన్ అనే స్థానంలో మాత్రమే గెలిచింది. మిగిలిన అన్ని చోట్లా పరాజయం పాలైంది. మహాకూటమికీ గట్టి దెబ్బ ఎన్డీయే మిత్రపక్షమైన వికాశీల్ ఇన్సాన్ పార్టీ కూడా ఎల్జేపీ వల్ల 4 స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న చాలాచోట్ల ఎల్జేపీ అభ్యర్థులను నిలపలేదు. కొన్నిచోట్ల ఎల్జేపీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎల్జేపీ వల్ల ఒక స్థానంలో మాత్రమే బీజేపీ ఓటమి మూటకట్టుకుంది. ఎల్జేపీ అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల మహాకూటమిలోని ఆర్జేడీ 12 సీట్లు, కాంగ్రెస్ 10, సీపీఐ(ఎంఎల్) రెండు సీట్లలో ఓడిపోయాయి. మొత్తంగా చూస్తే చిరాగ్ పాశ్వాన్ వల్ల ఎన్డీయే 30, మహాకూటమి 24 సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. లాభమెంత? నష్టమెంత? ఎల్జేపీ వల్ల ప్రధాన పార్టీలకు నష్టమే కాదు, లాభం కూడా దక్కింది. ఆయా పార్టీలు ఓడిపోవాల్సిన చోట గెలిచాయి. ఓట్లను ఎల్జేపీ చీల్చడంతో ఇది సాధ్యమైంది. ఎల్జేపీ పోటీ కారణంగా ఆర్జేడీ 24, కాంగ్రెస్ 6, జేడీ(యూ) 20, హిందూస్తాన్ ఆవామ్ మోర్చా 2, బీజేపీ ఒకటి, వీఐపీ పార్టీ ఒక సీటు గెలుచుకున్నాయి. స్థూలంగా చెప్పాలంటే.. చిరాగ్ పాశ్వాన్ కారణంగా బిహార్‌లో ఎన్డీయేకు లాభం 24, నష్టం 30. మహాకూటమికి లాభం 30, నష్టం 24. చిరాగ్ ఆత్మాహుతి దళంలా పని చేశారు ప్రధాని మోదీకి తాను హనుమంతుడి లాంటి భక్తుడినని చెప్పుకుంటున్న చిరాగ్ పాశ్వాన్ జేడీ(యూ)ను దెబ్బకొట్టడంపైనే దృష్టి పెట్టారు. ఆయన అనుకున్నది నెరవేరింది. ఈ ఎన్నికల్లో చిరాగ్, ఆయన బృందం ఆత్మాహుతి దళంలా పని చేసిందని జేడీ(యూ) నేత రాజీవ్ రంజన్ విమర్శించారు. -
పాశ్వాన్ మృతి: కుమారుడికి కష్టాలు..!
పట్నా : కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు లోక్‌జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మరణించడంతో ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు కష్టాలు తప్పేలా లేవు. మాయావతి తరువాత దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన దళిత నేతగా పేరొందిన రాంవిలాస్ మరణించడం.. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. దళిత ఓట్లను ఆకట్టుకోవడంలో వ్యూహ రచనచేయడంలో ఆయన దిట్టగా పేరొందారు. దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని చెప్పకతప్పడంలేదు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా పాశ్వాన్ దేశవ్యాప్తంగా పేరుగాంచారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకు దక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి.. నితీష్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని దళిత నేత ప్రణాళికలు రచించారు. దురదృష్టవశాత్తు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆయన మరణించడంతో యువనేత చిరాగ్ పాశ్వాన్ పార్టీ బాధ్యతలను భుజానకెత్తునే పరిస్థితి నెలకొంది. తండ్రి అంతటి రాజకీయ అనుభవంతో పాటు వ్యహరచనలో మెలుకువులు తెలియకపోవడం చిరాగ్‌కు పెద్ద సమస్యగా మారింది. పార్టీకి చిరాగ్ అధ్యక్షుడైనప్పటికీ ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఇంకా రాం విలాస్ పాశ్వాన్ పార్టీగానే పరిగణిస్తున్నారు. పాశ్వాన్ లేని ఎల్జేపీని బిహార్ ఓటర్లు ఏ విధంగా ఆదరిస్తారానేది ఆసక్తికరంగా మారింది. (సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ) ఇన్నేళ్లు పార్టీ కార్యక్రమాలను చిరాగ్ పర్యవేక్షిస్తున్నా అంతియ నిర్ణయం తండ్రిదే కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. తాజాగా నెలకొన్న విపత్కరమైన పరిస్థితుల్లో ప్రచార బాధ్యతల నుంచి, అభ్యర్థుల ఎంపిక కూడా చిరాగే చూడాల్సి ఉంది. అయితే చిరాగ్ మాటను పార్టీలోని సీనియర్లు ఎంత వరకు గౌరవిస్తారనేది భవిష్యత్‌లో బయటపడనుంది. మరోవైపు తొలివిడత పోలింగ్‌లో ఎల్జేపీకి అత్యంత కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి. వాటికి దీటుగా అనుభవంలేని చిరాగ్ ఎలా ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి. అయితే యువనేతకు మద్దతుగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు ఉన్నారనేది బిహార్ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. -
'గత్యంతరం లేకే జేడీయూతో పనిచేశాం'
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్‌కుమార్‌పై లోక్ జన శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరాగ్ పాశ్వాన్ నేరుగా విమర్శలు గుప్పించారు. నితీష్‌పై వ్యక్తిగతంగా తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని చెబుతూనే.. ఆయన పాలసీలు, వర్కింగ్ స్టైల్‌ను తప్పుబట్టారు. ఇన్నాళ్లూ ఆయనతో తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా కలిసి పనిచేయాల్సి వచ్చిందని అన్నారు. 'గత ఎన్నికల తర్వాత రాత్రికిరాత్రే ఆర్జేడీ-కాంగ్రెస్‌ల కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్డీఏలో చేరి నితీష్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆయన ఎవరి మాటా వినిపించుకోరని, సొంత అజెండాతో ముందుకు వెళ్తారని మాకు ముందే తెలుసు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇనాళ్లూ కలిసి పనిచేశాం' అని చిరాగ్ వ్యాఖ్యానించారు (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) 2013లో తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచే నితీష్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నానని చిరాగ్ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పిన చిరాగ్.. ఓటర్లు నితీష్‌కు కచ్చితంగా బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కొన్ని చోట్ల 'ఫ్రెండ్లీ ఫైట్' ఉంటుందని, కానీ నితీష్‌కుమార్‌పై బలమైన అభ్యర్థినే పోటీకి దించుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తాము సహకారం అందిస్తామని, నవంబర్ 10 తర్వాత 'డబుల్ ఇంజిన్ గవర్నమెంట్'ను చూస్తారని చిరాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సోలోగా ఎల్జేపీ.. ప్లాన్ మార్చిన బీజేపీ
పట్నా: బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ మార్చుకుంది. అభ్యర్థుల ఎంపికపై మరోసారి కసరత్తు ప్రారంభించింది. జేడీయూతో కూడిన ఎన్డీఏలో తాము చేరబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని లోక్ జన శక్తి పార్టీ(ఎల్జేపీ) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బీజేపీ పునరాలోచనలో పడింది. దాదాపు 143 స్థానాల్లో ఎల్జేపీ తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టనుంది. ఈక్రమంలో కుల సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే బీజేపీ బిగ్ బాస్ జేపీ నడ్డాతో బిహార్ బీజేపీ ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌మోడీలు ఇవాళ భేటీ కానున్నారు. బీజేపీతో ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ఈ సమావేశం తర్వాతే ఆయన ప్రకటించారు. బీజేపీ 'ప్లాన్ బి'లో భాగంగానే ఎల్జేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జేడీయూ ఉన్న ఎన్డీఏతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చిరాగ్ ప్రకటించినా ఇప్పటి వరకు బీజేపీ నేతలు స్పందించకపోవడం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఎల్జేపీకి దళిత ఓటర్ల మద్దతుంది. 2005 ఎన్నికల్లోనూ ఇలాంటి ప్లానింగ్‌తోనే బరిలోకి దిగిన ఎల్జేపీ... ఆర్జేడీ మరోసారి అధికారంలోకి రాకుండా నిలువరించింది. (చదవండి: ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం
-
బిహార్ ఎన్నికలు : జేడీయూకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూతో కలిసి పోటీచేయబోమని తేల్చిచెప్పింది. బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆదివారం ఢిల్లీలో జరిగిన కీలక భేటీ అనంతరం ఆ పార్టీ ప్రకటించింది. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ అభ్యర్ధులను బరిలో దింపుతామని ప్రకటించిన ఎల్జేపీ బీజేపీతో మాత్రం తమ దోస్తీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రస్ధాయిలో జేడీయూతో సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించిందని ఎల్జేపీ నేత అబ్ధుల్ ఖలీక్ ఓ ప్రకటనలో తెలిపారు. బిహార్ ఫస్ట్-బిహారి ఫస్ట్ నినాదంతో ఎల్జేపీ ఈ ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఇక బిహార్ విజన్ డాక్యుమెంట్‌పైనా ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదని, సిద్ధాంత వైరుధ్యాలతో తాము జేడీయూతో తెగతెంపులు చేసుకున్నామని ఆ పార్టీ పేర్కొంది. నితీష్ కుమార్ జేడీయూను తాము వీడినా బీజేపీతో సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని బిహార్‌లోనూ బీజేపీతో తమ బంధం కొనసాగించేందుకు సుమఖంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల అనంతరం బీజేపీ-ఎల్జేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతామని తెలిపింది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : వెనక్కి తగ్గిన నితీష్.. బీజేపీతో డీల్ ఓకే -
వెనక్కి తగ్గిన నితీష్.. బీజేపీతో డీల్ ఓకే
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాల విషయం కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. జేడీయూ చీఫ్, సీఎం నితీష్‌కుమార్ ఓ అడుగు వెనక్కి తగ్గి చెరి సగం సీట్లలో పోటీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా 122 సీట్లలో అధికార జేడీయూ, 121 సీట్లు బీజేపీ తమ అభ్యర్థులను పోటీకి దింపే దిశగా డీల్ కుదుర్చుకున్నట్టు వార్తలోస్తున్నాయి. పట్నాలో జేడీయూ, బీజేపీల సీనియర్ నేతలు మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్టు అనధికార వర్గాల సమాచారం. జేడీయూకి కేటాయించిన 122 సీట్లలోని 5 నుంచి 7 చోట్ల హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) అభ్యర్థులు పోటీ చేస్తారని, బీజేపీ వద్దనున్న121 సీట్లలోని కొన్నింటిని లోక్ జన శక్తి (ఎల్జేపీ)కి సర్దుబాటు చేసేలా ఈ చర్చల్లో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. తమకు కనీసం 42 సీట్లయినా ఇవ్వాల్సిందేనని ఎల్జేపీ పట్టుబడుతుండుగా 15కు మించి ఇవ్వలేమని బీజేపీ చేతులెత్తేసినట్టు వార్తలొచ్చాయి. తాము కోరినన్ని సీట్లివ్వని పక్షంలో స్వతంత్రంగానే 143 సీట్లలో పోటీకి దిగుతామని కూడా ఎల్జేపీ బాస్ చిరాగ్ పాశ్వాన్ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేఈ-ఎల్జేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆసక్తికంగా మారింది. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు) -
కేంద్ర మంత్రికి సర్జరీ.. చర్చలకు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయమై చర్చలు తుది దశకు చేరుకున్నాయనుకున్న తరుణంలో మరోసారి బ్రేక్ పడింది. లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) అగ్ర నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కి అత్యవసరంగా హార్ట్ సర్జరీ నిర్వహించడంతో శనివారం నిర్వహించాల్సిన భేటీ వాయిదా పడింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రికి ఇవాళ ఉదయం శస్త్రచికిత్స జరిగిందని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. రానున్న రోజుల్లో అవసరమైతే మరో శస్త్ర చికిత్స నిర్వహించే వీలుందని డాక్టర్లు వెల్లడించారని చిరాగ్ చెప్పారు. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ కూటమి ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమితో తలపడనుండగా ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. (ఆర్జేడీకి 144, కాంగ్రెస్‌కు 70 సీట్లు) -
బిహార్‌లో ఎల్జేపీ దూకుడు.. కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ భేదాలను చక్కదిద్దేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సీట్ల పంపకాల్లో క్లారిటీ కోరుతున్న జేడీయూ, ఎల్జేపీ నేతలతో కమలం పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌తో బీజేపీ బాస్ జేపీ నడ్డా చర్చలు జరిపి రాజీ ఫార్ములా కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా.. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి ఎన్ని సీట్లివ్వాలనే విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈక్రమంలో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌తో అమిత్ షా, నడ్డాలు చర్చించినా విషయం కొలిక్కిరాలేదు. ఎల్జేపీ కీలక భేటీ.. సీట్ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఇవాళ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఏర్పాటు చేసింది. బీజేపీ సీట్ల ఫార్ములా ప్రకారం ముందుకెళ్లాలా లేదా 143 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలా అనే విషయమై ఈ భేటీలో నిర్ణయించనున్నట్టు తెలిసింది. తాము కోరినన్ని సీట్లు ఇవ్వని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే బీజేపీకి తేల్చిచెప్పిన ఎల్జేపీ.. కమలం అభ్యర్థులు పోటీ చేసే చోట మాత్రం తాము అభ్యర్థులను నిలుపబోమని స్పష్టం చేసింది. 27 సీట్లేనా..? బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇందులో ఏకంగా 143 సీట్లను ఎల్జేపీ కోరుతుండగా 27 మాత్రమే ఇచ్చిందుకు బీజేపీ, జేడీయూ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇక.. ఎన్నికలు మొత్తం మూడు విడతల్లో జరగబోతున్నాయి. అధికారం కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అమీతుమీ తేల్చుకోబోతుంది. -
నితీశే బిహార్ సీఎం అభ్యర్థి
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ(జనతాదళ్, ఐక్య), ఎల్జేపీ(లోక్‌జనశక్తి పార్టీ)లు ఐక్యంగానే బరిలోకి దిగుతాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సారథ్యంలో తమ విజయం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం నడ్డా పార్టీ బిహార్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కలిసి ఎప్పుడు పోటీ చేసినా ఘన విజయం సాధించాయన్నారు. కొంతకాలంగా జేడీయూ, ఎల్జేపీ నేతల పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం.. అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్‌కుమారేనంటూ స్పష్టం చేయడం గమనార్హం. ఆదివారం భేటీలో ఆయన మాట్లాడుతూ.. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే బిహార్‌లో కూడా ప్రతిపక్షం నిర్వీర్యమైందనీ, ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశగా చూస్తున్న ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. ‘ప్రతిపక్షానికి ఒక సిద్ధాంతం, దృష్టి లేవు. ప్రజలకు సేవ చేయాలనే ఆసక్తి ఏమాత్రం లేదు. చిల్లర రాజకీయాల నుంచి అవి బయట పడలేదు’అంటూ విపక్షంపై మండిపడ్డారు. కోవిడ్–19 మహమ్మారి, రాష్ట్రంలో సంభవించిన వరదలపై బిహార్ ప్రభుత్వం సమర్థంగా స్పందించిందన్నారు. రాష్ట్రం ఈ రెండు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఎన్నికలు వస్తున్నాయని తెలి పారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కరోనా రికవరీ రేటు 73 శాతం వరకు ఉండగా, పాజిటివిటీ రేట్ 2.89 శాతం మాత్రమేనన్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని చిన్నచిన్న సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రధాని మోదీ బిహార్‌కు ప్రత్యేకంగా ప్రకటించిన ప్యాకేజీని తు.చ.తప్పకుండా అమలు చేస్తామని, ఈ ప్యాకేజీ వివరాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీతోపాటు మిత్ర పక్షాల గెలుపు కోసం కూడా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కేంద్రం తీసుకుంటున్న వివిధ చర్యలను, పేదల కోసం అమలు చేస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన వివరించారు. మోదీ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్లతో గరీబ్ కల్యాణ్ యోజన, రూ.20 లక్షల కోట్లతో ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రకటించిందని తెలిపారు. పేదల ఉద్యోగిత కోసం అమలు చేస్తున్న రూ.50 వేల కోట్ల పథకం బిహార్‌లోని 32 జిల్లాల్లో అమలు కానుందన్నారు. సకాలంలోనే బిహార్ ఎన్నికలు: ఈసీ వర్గాలు బిహార్ అసెంబ్లీకి సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం(ఈసీ) వర్గాలు అంటున్నాయి. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్నందున ఎన్నికలను వాయిదా వేయాలంటూ కొన్ని పార్టీల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో ఈసీ ఉన్నతాధికర వర్గాలు ఈ విషయం స్పష్టం చేశాయి. అక్టోబర్–నవంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. కోవిడ్‌ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఎన్డీఏ కూటమిలోని ఎల్జేపీ కోరింది. ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీతోపాటు ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ఇదే రకమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహమ్మారి సమయంలో ఎన్నికల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. -
జార్ఖండ్‌లో బీజేపీకి ఎల్జేపీ ఝలక్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఎన్డీఏ చిరకాల మిత్రపక్షం శివసేనతో విభేదాలు తెచ్చుకున్న బీజేపీకి..జార్ఖండ్‌లోనూ తలబొప్పి కడుతోంది. సీట్ల పంపకంలో తేడాలు రావడంతో కన్నెర్ర చేసిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) 50 స్థానాల్లో అభ్యర్థులను ఉంచుతామంటూ ప్రకటించి, బీజేపీకి షాకిచ్చింది. మరో మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) కూడా మరిన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి, బీజేపీపై ఒత్తిడి పెంచింది. ఈనెల 30వ తేదీ నుంచి రాష్ట్రంలోని 81 సీట్లకు ఐదు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా కేవలం ఒకే ఒక్క స్థానంలో బరిలోకి దిగిన ఎల్జేపీ ఆ ఒక్కటీ గెలవలేకపోయింది. కానీ, ఈసారి ఎన్నికల్లో ఆరు స్థానాల్లో పోటీ చేస్తామంటూ ముందుకు రాగా బీజేపీ తిరస్కరించింది. దీంతో ఎల్జేపీ యువ చీఫ్ చిరాగ్ పాశ్వాన్..‘ఎల్జేపీ జార్ఖండ్‌లో సొంతంగా 50 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. అభ్యర్థుల మొదటి జాబితాను సాయంత్రం విడుదల చేస్తాం’అంటూ మంగళవారం ట్విట్టర్లో ప్రకటించారు. రాష్ట్రంలో గణనీయ ప్రభావం చూపగలిగిన బీజేపీ మరో మిత్రపక్షం ఏజేఎస్‌యూ 2014 ఎన్నికల్లో పోటీ చేసిన 8 స్థానాల్లో 5 చోట్ల విజయం సాధించింది. ఈసారి ఈ పార్టీ 19 స్థానాలను కోరుకోగా బీజేపీ 9 కంటే ఎక్కువ ఇచ్చేందుకు ససేమిరా అంది. ఆగ్రహించిన పార్టీ నాయకత్వం.. బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ గిలువా పోటీ చేస్తున్న చక్రధర్పూర్ స్థానంతోపాటు 12 చోట్ల పోటీగా తమ అభ్యర్థులను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. దిగివచ్చిన కాషాయదళం, ఏజేఎస్‌యూ నేతలతో చర్చలు జరిపేందుకు అంగీకరించింది. -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
బిహార్‌లో ఎన్డీఏ సీట్ల పంపిణీ
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో అధికార ఎన్డీఏ సీట్ల పంపిణీ ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 చోట్ల, ఎల్జేపీ 6 చోట్ల అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) రాష్ట్ర అధ్యక్షులు వరుసగా నిత్యానంద్ రాయ్, వశిష్ట నారాయణ్ సింగ్, పశుపతి కుమార్ పరాస్‌లు ఈ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరిందని వారు తెలిపారు. ఇలా ఉండగా, రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా– సెక్యులర్ (హెచ్ఏఎం(ఎస్), లోక్ తాంత్రిక్ జనతాదళ్, వికాస్ శీల్ ఇన్సాన్ తదితర పార్టీలతో కూడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. -
'బీహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్ వచ్చేసింది'
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస హత్యల నేపథ్యంలో నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి, ఎల్జేపీ రాంవిలాస్ పాశ్వాన్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్డీయే చెప్పినవిధంగానే బిహార్‌లో మళ్లీ 'జంగల్ రాజ్' (ఆటవిక రాజ్యం) వచ్చేసిందని మండిపడ్డారు. వరుస హత్యలు జరుగుతున్నా నితీశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిష్క్రియగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 'బిహార్‌లో మళ్లీ జంగల్ రాజ్ వచ్చేసింది. నితీశ్-లాలూ జోడీకడితే బిహార్‌లో మళ్లీ ఆటవిక రాజ్యం వస్తుందని మేం ఎన్నికల ప్రచారంలో చెప్పాం. జంగల్‌రాజ్ కాదు 'మంగళ్ రాజ్' (మంగళకరమైన రాజ్యం) వస్తుందంటూ నితీశ్-లాలూ చెప్పారు. ఇది ఆటవిక రాజ్యామా? లేక మంగళకర రాజ్యమా? అన్నది ఇప్పుడు ప్రజలే చెప్పాలి' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. బిహార్‌లో వరుసగా ఇంజినీరింగ్ విద్యార్థుల మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
'బిహార్‌లో మధ్యంతర ఎన్నికలు రావొచ్చు'
పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం రెండేళ్లకు మించి పనిచేయకపోవచ్చునని, కచ్చితంగా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని కేంద్రమంత్రి, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై శనివారం ఆయన లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి ఎన్నికల్లో కులంకార్డును ప్రయోగించిందని, ఇది దీర్ఘకాలంలో పనిచేయబోదని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలువగా, జేడీయూ రెండోస్థానంలో నిలిచిందని, ఈ నేపథ్యంలో రెండు పార్టీలు ఆధిపత్యం కోసం కొట్లాడుతాయని, దీంతో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జట్టు కట్టిన ఎల్జేపీ 40 సీట్లలో పోటీచేసి.. ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుపొందింది. ఎజ్జేపీ రాష్ట్ర అధ్యక్షుడు పశుపతికుమార్ ప్రాస్‌తోపాటు పాశ్వాన్ సోదరుడు, ఆయన ఇద్దరు అల్లుళ్లు, మేనల్లుడు, పలువురు బంధువులు ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
'మాకు షాక్ ఇచ్చారు... అయినా వారి వెంటే'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి కేటాయించిన స్థానాల పట్ల లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. బీజేపీ మొదట తమకు చెప్పింది ఒకటి, తీరా కేటాయింపులో చేసింది మరొకటని ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్, రాంవిలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నిప్పు లేకుండా పొగ రాదని వ్యాఖ్యానించారు. బీజేపీతో మరోసారి చర్చలు జరిపి చూస్తామన్నారు. ఎన్డీఏ కూటమిలో కొనసాగుతామని స్పష్టం చేశారు. గత అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. సీట్ల పంపకంపై ఆగ్రహం లేదని అసంతృప్తి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తమకు సముచిత ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు. సీట్ల కేటాయింపుతో తమకు షాక్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీకి 40, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)కు 23, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ ఆవామ్ మోర్చా-సెక్యులర్(హెచ్ఏఎమ్-ఎస్)కు 20 స్థానాలు కేటయించారు. బీజేపీ 160 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. -
స్వాభిమాన్ ర్యాలీ అట్టర్ ప్లాప్: పాశ్వాన్
పాట్నా: ఆర్డేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పాట్నాలో నిర్వహించిన తొలి ర్యాలీ 'స్వాభిమాన్' విఫలం అయిందని కేంద్ర మంత్రి ఎల్ జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. కచ్చితంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలను ఖంగు తినిపించి సీట్లన్నింటిని ఎన్డీయే హస్తగతం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ మూడు పార్టీలు కలసి గాంధీ మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీకి పెద్దగా జనం హాజరుకాలేదని, ఆ వచ్చినవారిని కూడా తీసుకొచ్చేందుకే పార్టీ కార్యకర్తలకు నిర్వహకులకు చాలా కష్టం కలిగించిందని ఎద్దేవా చేశారు. బీహార్‌లో ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీలో భారీ స్థాయిలో విజయం సాధించాయని, అందుకే ప్రతిపక్షం వారు మోదీకి తమ బలమెంతో చూపించాలనే ఉద్దేశంతో సభ నిర్వహించారు కానీ అది అట్టర్ ప్లాఫ్ అయిందని, వారికి తీరని అసంతృప్తిని కలిగించిందని చెప్పారు. ఇప్పటికే బీహార్ ప్రజలు నితీశ్ కుమార్ పాలనపై ఓ అంచనాకు వచ్చారని, తిరిగి ఆయన పాలన కింద ఉండాలని వారు అనుకోవడం లేదని చెప్పారు. మోదీ చేసిన డీఎన్ఏ విమర్శ ఒక్క వ్యక్తినే ఉద్దేశించి చేసింది తప్ప అందరిని ఉద్దేశించి చేసినది కాదని చెప్పారు. ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో స్వాభిమాన్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. -
వాట్స్ యాప్‌లో స్మృతిపై అభ్యంతరకర చిత్రాలు
ఎల్జేపీ నేతపై కేసు నమోదు పాట్నా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరకంగా ఉన్నట్లు చూపే చిత్రాలను సామాజిక అనుసందాన వే దిక(వాట్స్‌యాప్)లో పెట్టిన బిహార్ ఎల్జే పీ నేత ఉమా శంకర్ మిశ్రాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా శంకర్ తన మొబైల్ ద్వారా స్మృతి ఇరానీ చిత్రాలను వాట్స్‌యాప్‌లో పెట్టడమే కాకుండా తమ నేతలకు కూడా పంపాడని స్థానిక బీజేపీ నేత రాజీవ్ రంజన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశామని రాజీవ్ తెలిపారు. స్మృతి ఇరానీ, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన ఉమా శంకర్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను కోరారు. సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసుపై విచారణను మొదలుపెట్టారు. -
ఎన్డిఏతో జతకట్టనున్న లోక్‌జనశక్తి
-
బీహార్‌లో కాంగ్రెస్‌కు షాక్