
ఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడతల వారీగా లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ పార్టీ 'లోక్ జనశక్తి పార్టీ' (LJP) తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన లోక్ జనశక్తి పార్టీ.. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికోసం ఐదు మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ రిలీజ్ చేసింది. హాజీపూర్ నుంచి పార్టీ చీఫ్ 'చిరాగ్ పాశ్వాన్' పోటీ చేయనున్నారు. జముయ్ నుంచి అరుణ్ భారతి, ఖగారియా నుంచి రాజేష్ వర్మ, సమస్తిపూర్ నుంచి శాంభవి చౌదరి, వైశాలి నుంచి వీణాదేవిలను ఎన్నికల బరిలో దించింది.
మార్చి 18న.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్‌సభ ఎన్నికల కోసం బీహార్‌లో సీట్ల ఒప్పందాన్ని ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి. కాగా లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది.
लोक जनशक्ति पार्टी (रामविलास) के द्वारा लोकसभा चुनाव - 2024 के लिए निम्न प्रत्याशियों के नामों पर अपनी सहमति प्रदान की है :@iChiragPaswan @ANI pic.twitter.com/XZTZsuUU3L
— Lok Janshakti Party (@LJP4India) March 30, 2024