Lok Janshakti Party
-
జార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల సీట్ల పంపకాలు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ మధ్య సీట్ల పంపకాలు ఖరార య్యాయి. బీజేపీ 68, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 2, లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) 1 స్థానంలో పోటీ చేయాలని శుక్రవారం నిర్ణయించాయి. ఏజేఎస్‌యూ– సిల్లి, రామ్‌గఢ్, గోమియా, ఇచాగర్, మాండు, జుగ్సాలియా, డుమ్రి, పాకూర్, లోహర్దగా, మనోహర్పూర్, జేడీయూ– జంషెడ్పూర్ వెస్ట్, తమర్ స్థానాల నుంచి, ఎల్జేపీ (ఆర్) ఛత్రా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20ల్లో రెండు దళల్లో పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు ప్రకటించనున్నారు. -
Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిహార్ నుంచి 25 ఏళ్ల శాంభవి చౌదరి ఎన్నికల్లో పోటీ చేయనుంది. దేశంలో అతి చిన్నవయసు మహిళా దళిత అభ్యర్థిగా శాంభవి వార్తల్లో నిలిచింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా తాను వేయదగ్గ ముద్ర... తనదైన దృష్టికోణం ఉన్నాయంటున్నది శాంభవి. ‘నేను పనిచేసే చోట స్త్రీలు, యువతే నా లక్ష్యం. వీరికి ఆర్థిక స్వావలంబన, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తే అభివృద్ధి దానంతట అదే జరుగుతుంది’ అంటోంది శాంభవి చౌదరి. 25 ఏళ్ల 9 నెలల వయసు వున్న ఈ డాక్టరెట్ స్టూడెంట్ బిహార్‌లోని ‘సమస్తిపూర్’ పార్లమెంట్ స్థానం నుంచి లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తరఫున పోటీ చేయనుంది. ఇది రిజర్వ్డ్ స్థానం. బహుశా శాంభవి దేశంలోనే అత్యంత చిన్న వయసు కలిగిన దళిత మహిళా అభ్యర్థి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. అందుకే అందరూ ఆమెవైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయ కుటుంబం నుంచి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎం.ఏ. సోషియాలజీ చేసి ఇప్పుడు ‘బిహార్ రాజకీయాల్లో కులం, జెండర్ ప్రాధాన్యత’ అనే అంశం మీద పీహెచ్డీ చేస్తున్న శాంభవి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఈమె తండ్రి అశోక్ కుమార్ చౌదరి జెడి (యు)లో మంత్రి. తాత మహదేవ్ చౌదరి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేశారు. శాంభవి భర్త సాయన్ కునాల్ సామాజిక రంగంలో ఉన్నాడు. ఈమె మామగారు మాజీ ఐ.పి.ఎస్ అధికారి ఆచార్య కిశోర్ కునాల్ దళితుల కోసం చాలా పోరాటాలే చేశాడు. చాలా గుడులలో దళిత పురోహితులను ఆయన నియమించాడు. వీరందరి మధ్యలో చదువు మీద దృష్టి పెట్టి, పరిశోధన కొనసాగిస్తున్న శాంభవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో దిగింది. నాకంటూ వ్యక్తిత్వం ఉంది శాంభవి పోటీ చేస్తున్న లోక్ జనశక్తి పార్టీ ఎన్డిఏ కూటమిలో ఉంది. బిజెపి కుటుంబ వారసత్వం గురించి అభ్యంతరం చెప్పడం తెలిసిందే. ‘మీ నాన్నగారు మంత్రి. మరి మీకు సీటిచ్చారు’ అనే ప్రశ్నకు ‘నిజమే. కాని నాకు సీటు రావడంలో ఆయన ప్రమేయం మాత్రం లేదు. చిన్నప్పటి నుంచి నేను మా తాత, నాన్న పేదవాళ్ల సమస్యలు వింటూ వారి కోసం పనిచేయడం చూస్తూ పెరిగాను. అది నామీద ఎక్కడో ప్రభావం చూపింది. దళితుల్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా, చదువుకున్న మహిళగా దళితుల పట్ల నాకు అవగాహన ఉంది. రాజకీయ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు. ఎలక్షన్లు సమీపించేవరకూ నేను నిలబడాలని అనుకోలేదు. కాని సమీపించాక లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో చెప్పాను. ఆయన నా భర్తను సొంత తమ్ముడిలా చూస్తారు. అంతేకాదు, బిహార్ రాజకీయాలలో యువత రాణించాలని భావిస్తారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న కారణం రీత్యానే సీట్ ఇచ్చారు’ అని తెలిపిందామె. అత్తగారి ఊరు పట్నాలో పుట్టి పెరిగిన శాంభవి తన అత్తగారి ఊరైన సమస్తిపూర్‌లో గెలవడానికి సిద్ధమవుతోంది. ‘ఆ ఊరి గురించి నిజం చెప్పాలంటే నాకేమీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మొదట అక్కడ ఒక ఇల్లు కొని అక్కడే ఉంటానన్న భరోసా కల్పించాలి. ఆ ఊరి యువతతో ఇప్పటికే కాంటాక్ట్‌లోకి వెళ్లాను. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపిస్తారు. అవి వమ్ము చేయకుండా ఉండటమే నా ప్రథమ లక్ష్యం’ అంటున్న శాంభవి రాజకీయ జీవితాన్ని త్వరలో ఓటర్లు నిర్ణయిస్తారు. -
ఎల్జేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల
ఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడతల వారీగా లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ పార్టీ 'లోక్ జనశక్తి పార్టీ' (LJP) తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన లోక్ జనశక్తి పార్టీ.. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి స్థానాల్లో పోటీ చేయనుంది. దీనికోసం ఐదు మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ రిలీజ్ చేసింది. హాజీపూర్ నుంచి పార్టీ చీఫ్ 'చిరాగ్ పాశ్వాన్' పోటీ చేయనున్నారు. జముయ్ నుంచి అరుణ్ భారతి, ఖగారియా నుంచి రాజేష్ వర్మ, సమస్తిపూర్ నుంచి శాంభవి చౌదరి, వైశాలి నుంచి వీణాదేవిలను ఎన్నికల బరిలో దించింది. మార్చి 18న.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్‌సభ ఎన్నికల కోసం బీహార్‌లో సీట్ల ఒప్పందాన్ని ప్రకటించింది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో, జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలోనూ పోటీ చేయనున్నాయి. కాగా లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది. लोक जनशक्ति पार्टी (रामविलास) के द्वारा लोकसभा चुनाव - 2024 के लिए निम्न प्रत्याशियों के नामों पर अपनी सहमति प्रदान की है :@iChiragPaswan @ANI pic.twitter.com/XZTZsuUU3L — Lok Janshakti Party (@LJP4India) March 30, 2024 -
ఇండియా కూటమితో టచ్‌లో పశుపతి పరాస్!
రాష్ట్రీయ లోక్‌జనశక్తి (ఆర్ఎల్జేపీ) పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్.. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తనకు అన్యాయం జరగటంతో ఎన్డీయే కూటమితో పాటు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు మంగళవారం ప్రకటించారు. అయితే ఆయన ప్రతిపక్షాల ఇండియా కూటమికి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. పశుపతి పరాస్ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన వెంటనే ఆర్జేడీ నేత తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందిస్తూ.. బిహార్‌లోని ప్రతిపక్ష కూటమికి ఆహ్వానించారు. ‘ఒకవేళ పశుపతి పరాస్ బీహార్ ప్రతిపక్ష కూటమిలోకి రావాలనుకుంటే.. మేము స్వాగతం చెప్పడానికి ఎప్పుడూ సిద్ధమే. రాజీనామా చేసిన పరాస్‌ను బీజేపీ ఏం చేయలేదు’ అని అన్నారు. అయితే పరాస్.. పలు లోక్‌సభ స్థానాలతో పాటు హాజీపూర్ సెగ్మెంట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు ఎంతో కీలకమైన హాజీపూర్ స్థానంలో కచ్చితంగా పోటీ చేస్తానని.. అవసరమైతే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడానికి కూడా సిద్దమేని ఇటీవల పరాస్ ప్రకటించారు. అయితే సోమవారం బీజేపీ.. పరాస్‌ను పక్కనబెట్టి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)తో సీట్ల పంపకం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పశుపతి పరాస్ ఎన్డీయే నుంచి తప్పుకున్నారు. మరోవైపు పరాస్‌కు కంచుకోట అయిన హాజీపూర్‌లో బీజేపీ.. లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) పార్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించటం గమనార్హం. ఒకవేళ పరాస్ ఇండియా కూటమిలో చేరితే ఆయనకు హాజీపూర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో లేదో వేచి చూడాలి. -
‘అవసరమైతే ఎన్డీయే నుంచి బయటకొస్తాం’
బీహార్‌లో ఎన్డీయే కూటమికి మిత్రపక్షం రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) ఝలక్ ఇచ్చింది. తాము కోరుకున్న స్థానాలు ఇవ్వని పక్షంలో ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఉన్న మంత్రి పశుపతి కుమార్ పరాస్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ)కి గట్టిపట్టు ఉన్న ఐదు స్థానాల్లో పోటీ ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరతాం. ఆ సీట్లను వేరేవాళ్లకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోం. నేను కూడా లోక్‌సభ బరిలో ఉంటా అని పశుపతి కుమార్ పరాస్ స్పష్టం చేశారు. కూటమి ధర్మాన్ని గనుక విస్మరిస్తే.. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా వెనకాడబోమని ఎన్డీయేను హెచ్చరించారాయన. కూటమిలో భాగంగా చిరాగ్ పాశ్వన్ లోక్‌జనశక్తి పార్టీ(రాం విలాస్)కి బీజేపీ ఐదు సీట్లను కేటాయించింది. అందులో.. ఆర్ఎల్జేపీ చీఫ్ పశుపతి ప్రాతినిధ్యం వహిస్తున్న హాజీపూర్ స్థానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమిలో తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఆర్ఎల్జేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ‘కూటమి నుంచి వెళ్లిపోవడానికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి’ అంటూ పశుపతి వ్యాఖ్యానించడం గమనార్హం. ‘మేము ఎన్డీయేలో భాగం. మేము నిజాయితీగా కూటమిలో ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటే మాకు గౌరవం ఉంది. మా పార్టీకి బీజేపీ నుంచి ప్రాధాన్యత లభించటం లేదని వార్తలు వస్తున్నాయి. మా పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ చివరి జాబితా వెల్లడించే వరకు మేము వేచిచూస్తాం. ఆ తర్వాత మేము ఇక ఎవరికి గౌరవం ఇవ్వాల్సి అవసరం లేదు. మా స్వేచ్ఛానుసారం కూటమి నుంచి బయటకు వచ్చేస్తాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని పశుపతి పేర్కొన్నారు. -
ఇండియా కూటమి కొత్త ప్లాన్.. బీజేపీ మిత్ర పక్షానికి గాలం!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సరికొత్త ఎత్తులు వేస్తోంది. బీహార్‌లో సీట్ల పంపకాల విషయంలో ఎన్డీఏలో తర్జనభర్జనలు కొనసాగుతుండగా ఇండియా కూటమి రాజకీయ చదరంగంలో ఎత్తుగడ వేసింది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు బిహార్‌లో ఎనిమిది లోక్‌సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాలను ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఎన్డీఏ బీహార్‌లో తమకు కేవలం ఆరు లోక్‌సభ నియోజకవర్గాలను మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఇవి కూడా తన చిన్నాన్న పశుపతి పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీతో పంచుకోవాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితిలో ఇండియా కూటమి నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పాశ్వాన్‌ను ఊరించవచ్చు. చిరాగ్ పాశ్వాన్‌ను ఆకట్టుకునేందుకు 2019లో అవిభాజ్య లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) పోటీ చేసిన మొత్తం ఆరు సీట్లతోపాటు అదనంగా బిహార్‌లో రెండు, ఉత్తరప్రదేశ్‌లో రెండు స్థానాలను ఇండియా కూటమి ఈ డీల్‌లో పొందుపరిచినట్లు సమాచారం. పార్టీ చీఫ్, ప్రముఖ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణించిన ఏడాది తర్వాత పశుపతి పరాస్ తిరుగుబాటుతో 2021లో లోక్ జనశక్తి పార్టీ చీలిపోయింది. పశుపతి పరాస్ రామ్ విలాస్ పాశ్వాన్‌కు సోదరుడు. చిరాగ్ పాశ్వాన్‌కు చిన్నాన్న. పరాస్‌కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ బెర్త్ ఇచ్చినప్పుడు చిరాగ్ పాశ్వాన్ జేడీయూ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు చేశారు. అయితే బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం పళ్లెత్తు మాట కూడా అనలేదు. నితీష్ కుమార్‌తో విభేదాల కారణంగా 2020లో ఎన్డీఏ నుండి వైదొలిగిన చిరాగ్ పాశ్వాన్ మళ్లీ గతేడాది తిరిగి ఎన్డీఏలో చేరారు. -
18న ఎన్డీఏ భేటీకి రండి
న్యూఢిల్లీ: ఎన్డీయే పక్షాలతో ఈనెల 18న జరగబోయే కీలక భేటీకి పలు పార్టీల అగ్రనేతలను బీజేపీ ఆహ్వానిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి ఈ మేరకు లేఖ రాశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్‌కూ లేఖ అందింది. ఆయనతో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఇప్పటికే భేటీ కావడం తెలిసిందే. బిహార్ మాజీ సీఎం, హిందుస్తానీ ఆవామ్ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంఝీ కూడా హాజరవుతారని సమాచారం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇంతటి విస్తృతస్థాయిలో ఎన్డీయే భేటీ జరగనుండటం ఇదే తొలిసారి. -
బిహార్‌లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్‌లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
ఎంపీ ప్రిన్స్ రాజ్‌పై రేప్ కేసు
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) నేత, బిహార్‌లోని సమస్తీపూర్ ఎంపీ ప్రిన్స్ రాజ్‌పై రేప్ కేసు నమోదైంది. ఎల్జేపీ ముఖ్యనేత చిరాగ్ పాశ్వాన్‌కు ప్రిన్స్ రాజ్ దగ్గరి బంధువు. ఎల్జేపీ మహిళా కార్యకర్త గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రిన్స్‌రాజ్‌పై ఫిర్యాదు చేయొద్దంటూ తనపై చిరాగ్ ఒత్తిడిచేశారంటూ బాధితురాలు పేర్కొనడంతో చిరాగ్ పేరునూ ఎఫ్ఐఆర్లో చేర్చారు. తన పేరును చేర్చడంపై చిరాగ్ పాశ్వాన్ గతంలో∙స్పందించారు. ‘వివాదాన్ని పరిష్కరించాలని ఇద్దరూ నా వద్దకు వచ్చారు. పోలీసుల వద్ద తేల్చుకోండని సూచించాను. కేసు వద్దని సదరు మహిళపై నేనేమీ ఒత్తిడి చేయలేదు’ అని అన్నారు. కేసు నమోదు నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ కోసం ప్రిన్స్‌రాజ్ మంగళవారం ఢిల్లీ కోర్టు మెట్లెక్కారు. ముందస్తు బెయిల్ దరఖాస్తును స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్ గురువారం పరిశీలించనున్నారు. ‘ సదరు మహిళ సమ్మతితోనే సంబంధాన్ని కొనసాగించాను. ఆమెకు వేరే వ్యక్తితో అంతకుముందే సంబంధముంది. మేం సన్నిహితంగా ఉన్నపుడు ఆ వ్యక్తి వీడియోలు తీశాడు. కొన్నాళ్ల తర్వాత రూ.1 కోటి ఇవ్వాలని వారిద్దరి నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. రూ.2 లక్షలు ముట్టజెప్పాను. తర్వాత చట్టప్రకారం సమస్య పరిష్కారం కోసం పోలీసులకు ఫిర్యాదుచేశాను’ అని ఫిబ్రవరిలో ఇచ్చిన పోలీసు ఫిర్యాదులో ప్రిన్స్‌రాజ్ పేర్కొన్నారు. -
పాశ్వాన్ వారసుడెవరో ప్రజలే తేలుస్తారు
న్యూఢిల్లీ: బిహార్‌లోని లోక్‌జనశక్తి పార్టీలో బాబాయ్, అబ్బాయిల మధ్య పోరాటం కొత్త పరిణామాలకు దారి తీసింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కి తానే అసలు సిసలైన వారసుడినని చెప్పుకోవడానికి, పార్టీపై పట్టు పెంచుకోవడానికి చిరాగ్ ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. ఆదివారం ఢిల్లీలోని చిరాగ్ నివాసంలో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. చిరాగ్ ఇక తాను ప్రజల్లోకి వెళ్లి బాబాయ్ పశుపతి పరాస్ నీచ రాజకీయాలను ఎండగట్టాలని నిర్ణయించారు. జూలై 5న రామ్‌విలాస్ పాశ్వాన్ జయంతి రోజున హజీపూర్ నుంచి ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. పరాస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, తానే జనంలోకి వెళ్లి వాస్తవాలన్నీ వెల్లడిస్తానని అన్నారు. అంతేకాదు ఈ సమావేశం పాశ్వాన్‌కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా చేసింది. సమావేశం ముగిసిన తర్వాత చిరాగ్ పాశ్వాన్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో మహాభారత యుద్ధాన్ని చూస్తారని ఆవేశంగా చెప్పారు. ‘‘వర్కింగ్ కమిటీ సభ్యుల్లో 90 శాతం నా వైపే ఉన్నారు. ఢిల్లీ, కశ్మీర్ పార్టీ అధ్యక్షులు మినహాయించి మిగిలిన వారంతా ఆ వైపు ఉన్నారు. పశుపతి పరాస్ వైపు 9 శాతం మంది మాత్రమే ఉన్నారు’’అని చిరాగ్ వెల్లడించారు. మరోవైపు పరాస్ ఆ సమావేశానికి చట్టబద్ధత లేదన్నారు. సమావేశానికి హాజరైన వారంతా పార్టీ సభ్యులే కారని ఆరోపించారు. ఎవరిది అసలైన పార్టీ్టయో ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని విలేకరులతో చెప్పారు. పార్టీ ఎంపీలను తన వైపు తిప్పుకొని పరాస్ తిరుగుబాటు జెండా ఎగుర వేసినప్పటికీ బిహార్‌లో 6 శాతం జనాభా ఉన్న పాశ్వాన్ వర్గం ఇప్పటికీ చిరాగ్‌నే పార్టీ నాయకుడిగా చూస్తోంది. అంతేకాదు లాలూ ప్రసాద్ యాదవ్‌కి చెందిన ఆర్జేడీ కూడా పాశ్వాన్ జూనియర్‌కే మద్దతిస్తామని సూచనప్రాయంగా వెల్లడించింది. -
‘నువ్వు నా రక్తం కావు; ఇక మీ బాబాయ్ చచ్చిపోయాడు’
వెబ్‌డెస్క్: మనం ఇతరులకు ఏం ఇస్తామో అదే తిరిగి వస్తుంది.. మంచి చేస్తే మంచి.. చెడు చేస్తే చెడు.. అవమానానికి అవమానం.. ప్రతీకారానికి ప్రతీకారం.. రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బాబాయ్ పశుపతి పరాస్తో తన వ్యవహార శైలి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందు వెళ్లి చేజేతులా తానే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునే విధంగా ప్రవర్తించాడని పేర్కొంటున్నారు. తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మరణించిన తర్వాత చిరాగ్ పూర్తిస్థాయిలో ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, అప్పటివరకు తండ్రి నీడలో ఉన్న చిరాగ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల(2020) సమయంలో తమతో పాటు ఎన్డీయేలో భాగస్వామి అయిన సీఎం నితీశ్ కుమార్‌తో విభేదించారు. కూటమి సమీకరణాలు పట్టించుకోకుండా సొంతంగా ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీతో సఖ్యతగా మెలుగుతూనే అధికార జేడీయూకు వ్యతిరేకంగా అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎల్జేపీ ఘోరంగా విఫలమైనప్పటికీ, జేడీయూ ఓట్లను మాత్రం చీల్చగలిగింది. దాదాపు 35 స్థానాల్లో సీట్లకు గండికొట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి పరిణామాల వెనుక కచ్చితంగా జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తమను దెబ్బకొట్టిన చిరాగ్‌కు తమ సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే పశుపతి పరాస్తో తిరుగుబాటు చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పశుపతి మాత్రం ఈ వార్తలను కొట్టిపడేశారు. ఎల్జేపీని పరిరక్షించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తనతో సహా ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందని కుండబద్దలుకొట్టారు. నువ్వు నా రక్తం కావు.. ఈ నేపథ్యంలో... చిరాగ్‌కు, పశుపతికి మధ్య చెలరేగిన విభేదాలు తారస్థాయికి చేరడంతోనే ఎల్జేపీలో చీలిక వచ్చిందన్న విషయం సుస్పష్టమవుతోందని వారి సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా తండ్రి మృతి తర్వాత చిరాగ్, బాబాయ్ పశుపతిని తీవ్రంగా అవమానించారని పేర్కొంటున్నారు. ఒకానొక సమయంలో.. తన తల్లి రీనా పాశ్వాన్, కజిన్ ప్రిన్స్ రాజ్, అతడి అనుచరుడు సౌరభ్ పాండే ముందే.. ‘‘నువ్వు నా రక్తం కానేకాదు’’ అంటూ వ్యాఖ్యానించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. చిరాగ్ మాటలతో మనోవేదనకు గురైన పరాస్.. ‘‘ఈరోజు నుంచి మీ బాబాయ్ నీకు లేడు. చచ్చిపోయాడు’’ అంటూ అదే స్థాయిలో అతడికి బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన చిరాగ్ తల్లి రీనా పాశ్వాన్, పరాస్‌కు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారని, అయితే, ‘‘అన్నదమ్ముల అనుబంధం గురించి మీకు బాగా తెలుసు. కానీ దీపు(చిరాగ్‌ను ఉద్దేశించి) నన్ను పార్టీ నుంచి వెళ్లగొడతానని బెదిరించినపుడు మీరు తనను చెంపదెబ్బకొట్టలేదు. కనీసం తన మాటలు వెనక్కు తీసుకోవాలని చెప్పలేదు. మరి ఇప్పుడు ఇలా ఎందుకు’’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను చిరాగ్ తెగేదాకా లాగడంతోనే పరాస్ తిరుగుబాటుకు ఉపక్రమించారని ఆ కుటుంబ పరిస్థితుల గురించి తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు. ‘‘చిరాగ్ ఎప్పుడూ తన తండ్రి, బాబాయ్‌ల మధ్య అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. వారికి ఎటువంటి కష్టం రాకుండా కనిపెట్టుకుని ఉన్న తీరును గమనించలేదు. బహుశా అందుకేనేమో ప్రతీసారి దూకుడుగా ప్రవర్తించి పరిస్థితి ఇంతదాకా తెచ్చుకున్నాడు’’ అని వారు వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. గంటన్నర సేపు వెయిట్ చేయించారు రామ్ విలాస్ పాశ్వాన్‌కు అత్యంత సన్నిహితుడైన పశుపతి పరాస్... తెరవెనుక ఉంటూనే ఆయన రాజకీయ జీవితంలో తన వంతు పాత్ర పోషించారు. మరో సోదరుడు రామచంద్ర పాశ్వాన్‌కు సైతం అన్ని విధాలా అండగా నిలబడ్డారు. అయితే, రామ్‌విలాస్ మరణం తర్వాత చిరాగ్ మాత్రం ఆయనను ఖాతరు చేయలేదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరాస్ సలహాలు, సూచనలు పట్టించుకోకపోవడం, కించపరిచే విధంగా వ్యవహరించడం సహా... ఒంటెద్దు పోకడలతో పార్టీని మొత్తంగా ముంచివేసే విధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని పరాస్ నివాసానికి వెళ్లి, గంటన్నర సేపు ఎదురుచూసినా ఎటువంటి సమాధానం ఇవ్వకుండా తనకు ఎదురైన అవమానాలకు బదులు తీర్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్ల తిరుగుబాటు నేపథ్యంలో మంగళవారం ఎల్జేపీ జాతీయాధ్యక్ష పదవి నుంచి చిరాగ్ పాశ్వాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా తానే తిరుగుబాటు ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చిరాగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో తదుపరి ఆయన ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారన్న అంశం చర్చనీయాంశమైంది. చదవండి: ఎల్జేపీలో ముసలం.. నితీశ్ చాణక్యం! -
Bihar: దెబ్బ మీద దెబ్బ.. తగ్గేదే లే అంటున్న చిరాగ్!
పట్నా: బిహార్ యువ రాజకీయనేత చిరాగ్ పాశ్వాన్‌కు గట్టిఎదురుదెబ్బ తగిలింది. లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించారు. కాగా చిరాగ్ పాశ్వాన్ బాబాయ్, ఎంపీ పశుపతి పరాస్ నేతృత్వంలో ఎల్జేపీలో తిరుగుబాటు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు... లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. దీంతో, పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన పరాస్ బృందం, పార్టీ పదవి నుంచి చిరాగ్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పరాస్, ఎల్జేపీ పార్లమెంటరీ నేతగా, పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌గా, జాతీయాధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసింది. అదే విధంగా, ఎల్జేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సూరజ్భాన్ సింగ్ ఉంటారని పేర్కొంది. ఈ క్రమంలో రెండుమూడు రోజుల్లో పూర్తిస్థాయిలో అధికార మార్పిడి జరిగి పశుపతి కుమార్ పరాస్ చేతికి పార్టీ పగ్గాలు వస్తాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక తనను తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే చిరాగ్, పార్టీ సభ్యులతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. అధిష్టానం ఆదేశాలు బేఖాతరు చేసిన ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చిస్తానని తెలిపారు. చదవండి: ‘ఎల్జేపీ’లో తిరుగుబాటు -
‘ఎల్జేపీ’లో తిరుగుబాటు
న్యూఢిల్లీ/పట్నా: బిహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్ స్థాపించిన ‘లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)’లో తిరుగుబాటు తలెత్తింది. పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు పార్టీ నేత, రామ్‌విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. చిరాగ్ పాశ్వాన్ స్థానంలో ఆయన బాబాయి, హజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్‌ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ఉపనేతగా మరో ఎంపీ మెహబూబ్ అలీ కైజర్‌ను ఎన్నుకున్నారు. లోక్‌సభలో ఎల్జేపీ నేతగా పరాస్‌ను ఎన్నుకున్నట్లు ఆదివారం రాత్రి వారు స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలసి తెలియజేశారు. పరాస్‌ను ఎల్జేపీ పక్షనేతగా గుర్తిస్తూ సోమవారం లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. పార్టీని తాను విచ్ఛిన్నం చేయలేదని, నిజానికి పార్టీని కాపాడానని పార్టీలో తిరుగుబాటు అనంతరం సోమవారం పశుపతి çపరాస్ వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్‌కు, ఎల్జేపీకి ప్రత్యర్థి అయిన జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్‌ను గొప్ప నాయకుడు, ప్రగతిశీల ముఖ్యమంత్రి అని పరాస్ ప్రశంసించారు. ఈ తిరుగుబాటు వెనుక ఆయన లేరన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో ఎల్జేపీ పోరాడిన తీరుపై 99% కార్యకర్తల్లో అసంతృప్తి ఉందన్నారు. పార్టీలోని సంఘ వ్యతిరేక శక్తుల కారణంగా పార్టీ నాశనమయ్యే స్థితికి చేరుకుందన్నారు. ఐదుగురు ఎంపీల తమ బృందం ఎన్డీయేలో కొనసాగుతుందన్నారు. ఈ తిరుగుబాటుపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. బాబాయి నివాసం వద్ద గంటన్నర నిరీక్షణ! తన బాబాయిని కలుసుకునేందుకు చిరాగ్ సోమవారం స్వయంగా ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు. చిరాగ్ సోదరుడు (కజిన్), మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అదే నివాసంలో ఉంటున్నారు. అక్కడ గంటన్నర పాటు వేచిచూసిన తరువాత చిరాగ్ పాశ్వాన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ చిరాగ్‌తో ఆయన బాబాయి పరాస్ కానీ, సోదరుడు ప్రిన్స్ రాజ్ కానీ కలవలేదని సమాచారం. ఆ సమయంలో పరాస్, ప్రిన్స్‌రాజ్ అక్కడ లేరని ఆ తరువాత అక్కడి సిబ్బంది తెలిపారు. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంపై చాన్నాళ్లుగా ఎంపీలు పరస్, ప్రిన్స్ రాజ్, చందన్ సింగ్, వీణాదేవి, మెహబూబ్ అలీ కైజర్లు అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా నిలవడం రాష్ట్రంలో ఎల్జేపీని బాగా దెబ్బతీసిందని వారు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 2020లో తండ్రి రామ్‌విలాస్ పాశ్వాన్ హఠాన్మరణం అనంతరం పార్టీ అధ్యక్షుడిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన చిరాగ్ పాశ్వాన్‌కు ప్రస్తుతం ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. పరాస్ వర్గం పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా పాశ్వాన్‌ను తొలగించనున్నారని, ఆ తరువాత ఎన్నికల సంఘాన్ని కలిసి నిజమైన ఎల్జేపీ తమదేనని గుర్తించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. త్వరలో కేంద్ర మంత్రివర్గంలోకి చిరాగ్ పాశ్వాన్‌ను తీసుకోనున్నారనే వార్తల నేపథ్యంలోనే, జేడీయూ సూచనల మేరకే ఈ తిరుగుబాటు జరిగిందని చిరాగ్ సన్నిహితులు ఆరోపించారు. కాగా, ఇది ఎల్జేపీ అంతర్గత వ్యవహారమని బీజేపీ వ్యాఖ్యానించింది. ఎన్డీయే నుంచి విడిపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ.. చిరాగ్ పాశ్వాన్ ఎన్నడూ బీజేపీని, ప్రధాని మోదీని విమర్శించలేదు. -
ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
పట్నా: లోక్ జనశక్తి పార్టీని ఎన్డీయేలో కొనసాగించడంపై నిర్ణయం తీసుకునేది కూటమిలోని కీలక భాగస్వామి అయిన బీజేపీయేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితం కావడానికి ఎల్జేపీనే కారణమన్న వార్తలపై నితీశ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 71 స్థానాల్లో గెల్చడం తెల్సిందే. ఎన్డీయే మిత్రపక్షాలతో శుక్రవారం చర్చించి, ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తామని నితీశ్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగుస్తుందని, అందువల్ల ప్రమాణ స్వీకారానికి తమకు తగినంత సమయముందని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 లోపు ప్రమాణ స్వీకారం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల సీఎంగా పాలనలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశముందా? అన్న ప్రశ్నకు నితీశ్.. అలాంటిదే ఉండబోదని సమాధానమిచ్చారు. ‘నేరాలు, అవినీతి, మతతత్వం.. ఈ మూడింటి విషయంలో రాజీ ఉండదు. వాటి విషయంలో మా విధానంలో మార్పు ఉండదు. నేను సీఎం అయిన తరువాత బిహార్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు’ అన్నారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో గెలుపొందడంపై స్పందిస్తూ.. ప్రజా తీర్పు అంతిమమని వ్యాఖ్యానించారు. ‘ఇవే నా చివరి ఎన్నికల’ని ప్రచార సమయంలో తాను చేసిన వ్యాఖ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీశ్‌కుమార్ తెలిపారు. ‘చివరి ఎన్నిక అంటే నా ఉద్దేశం చివరి ప్రచార సభ అని’ అని వివరణ ఇచ్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం!? బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి నితీశ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. పవిత్రమైన ‘భయ్యూ దూజ్’ పండుగ రోజైన సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి. -
పాశ్వాన్‌కు కన్నీటి వీడ్కోలు
పట్నా: లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు, కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం బిహార్ రాజధాని పట్నాలో ముగిశాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న జనార్దన్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్య క్రియలు నిర్వహించారు. పాశ్వాన్ చితికి ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిప్పంటించారు. బిహార్ సీఎం నితీశ్, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, అధిక సంఖ్యలో పాశ్వాన్ అభిమానులు తరలివచ్చారు. పాశ్వాన్ స్వస్థలం హాజీపూర్ నుంచి జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు. చితికి నిప్పపెట్టాక చిరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురై కుప్పకూ లిపోయాడు. కొంతసేపు అచేతన స్థితికి చేరుకున్నాడు. చిరాగ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సమీప బంధువులు తెలిపారు. -
కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్. చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఏపీ గవర్నర్, సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: పాశ్వాస్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. పాశ్వాన్ తన ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో అణగారిన వర్గాల వాణిని ఎలుగెత్తి చాటారని వైఎస్ జగన్ నివాళులర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాశ్వాన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వేణుంబాక విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్, సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: పాశ్వాన్ మృతిపట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేశారు. 1969లోనే ఎమ్మెల్యే 1946 జులై 5న బిహార్‌లోని ఖగారియాలో పాశ్వాన్ జన్మించారు. పీజీ, న్యాయవిద్య అభ్యసించారు. విద్యాభ్యాసం అనంతరం డీఎస్పీగా పోలీసు ఉద్యోగం వచ్చినా రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగంలో చేరలేదు. 1969లో సంయుక్త సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 8 సార్లు గెల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు చాలా రోజుల పాటు ఆయన పేరు పైనే ఉన్నది. పాశ్వాన్ 1975 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జైలుకెళ్లారు. 2000 సంవత్సరంలో ఆయన మరికొందరు నాయకులతో కలిసి లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ)ని స్థాపించారు. పేదలు, అణగారిన వర్గాల సమస్యలపై అవకాశం లభించిన ప్రతీసారి గళమెత్తే నేతగా పాశ్వాన్ పేరు గాంచారు. మండల్ కమిషన్ నివేదిక అమలుకు ఆయన గట్టిగా ప్రయత్నించారు. పార్టీలకు అతీతంగా అందరు నాయకులతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీల నేతృత్వంలో సాగిన కేంద్ర ప్రభుత్వాల్లో ఆయన భాగస్వామిగా, మంత్రిగా విజయవంతంగా కొనసాగడం విశేషం. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారులోనూ కీలకంగా వ్యవహరించడం ఆయనకే చెల్లింది. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో దళితులు, అణగారిన వర్గాల కోసం పోరాడే నేతగా ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. ఉత్తర భారత దేశంలో దళితులను ఏకం చేయడంలో పాశ్వాన్ కీలక పాత్ర పోషించారని ఆయన దీర్ఘకాల సహచరుడు, జేడీయూ నేత కేసీ త్యాగి గుర్తు చేసుకున్నారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పాశ్వాన్.. మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు కృషి చేశారన్నారు. బీజేపీతో విబేధాల కారణంగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సమయంలో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించిన పాశ్వాన్.. అదే మోదీ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. సిద్ధాంతాలకు అతీతంగా అధికారంలో ఉన్న పార్టీలకు దగ్గరయ్యే ఆయన తీరును ప్రత్యర్థులు ‘వాతావరణ నిపుణుడు’ అంటూ విమర్శిస్తారు. -
రెబల్స్‌కు ఫడ్నవీస్ వార్నింగ్ !
బిహార్: లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్‌ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్‌కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు. మోది పేరు వాడొద్దు... భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బిహార్ ఎన్డీఏ నుంచి ఎల్జేపీ ఔట్
న్యూఢిల్లీ: బిహార్‌లో అధికారంలో ఉన్న నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) నుంచి ఆదివారం కీలక భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వైదొలగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోరాడుతామని స్పష్టం చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గానూ 143 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. భవిష్యత్తులో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నది తమ లక్ష్యమని, అందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్యపక్షంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ భేటీలో నిర్ణయించారు. లక్షలాది బిహారీల అభిప్రాయాలను క్రోడీకరించి తాము రూపొందించిన ‘బిహార్ ఫస్ట్.. బిహారీ ఫస్ట్’ దార్శనిక పత్రం అమలు జేడీయూతో కలిసి కూటమిలో ఉంటే సాధ్యం కాదని స్పష్టమైందని వ్యాఖ్యానించింది. జేడీయూతో సైద్ధాంతిక విభేదాల కారణంగా కూటమికి సంబంధం లేకుండా బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, బీజేపీ అభ్యర్థులు పోటీలో నిలిచిన స్థానాల్లో ఎల్జేపీ తరఫున అభ్యర్థులను నిలపబోమని తెలిపింది. బీజేపీపై వ్యతిరేకత లేదని, ప్రధాని మోదీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంది. ఎల్జేపీ నిర్ణయంతో.. రానున్న ఎన్నికల్లో జేడీయూ పలు స్థానాల్లో నష్టపోనుందని, కాంగ్రెస్, ఆర్జేడీల విపక్ష కూటమి లాభపడే అవకాశముందని భావిస్తున్నారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: వీఐపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీకి దిగుతామని విపక్ష కూటమి నుంచి బయటకు వచ్చిన వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ప్రకటించింది. రామ్‌విలాస్ పాశ్వాన్‌కు శస్త్ర చికిత్స కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్‌కు ఆదివారం గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతతో గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దళిత నేత హత్య బహిష్కృత ఆర్జేడీ నేత శక్తి మాలిక్ ఆదివారం హత్యకు గురయ్యారు. బిహార్‌లోని పుర్నియా జిల్లాలోని ఆయన నివాసంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఇది రాజకీయ హత్య అని, దళిత నాయకుడైన తన భర్త స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. శక్తి మాలిక్ హత్య అనంతరం ఒక వీడియో వైరల్ అయింది. రాణిగంజ్ టికెట్ కావాలంటే రూ. 50 లక్షలు ఇవ్వాలని తేజస్వీ యాదవ్ శక్తి మాలిక్‌ను డిమాండ్ చేస్తున్నట్లుగా, అంతు చూస్తానని బెదిరించినట్లు, కులం పేరుతో దూషించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ కేసులో తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
వారసుడికి పార్టీ పగ్గాలు
న్యూఢిల్లీ: లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) కొత్త అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ ఎన్నికయ్యారు. 2000వ సంవత్సరంలో ఎల్జేపీని స్థాపించిన సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ (73) దాదాపు రెండు దశాబ్దాలపాటు పార్టీ చీఫ్‌గా కొనసాగారు. నూతన అధ్యక్షుడిగా తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను పార్టీ జాతీయ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుందని మంగళవారం ఆయన ప్రకటించారు. రెండు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన చిరాగ్ కొంతకాలంగా పార్టీ విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిరాగ్‌ను ఎల్జేపీ అధ్యక్షుడిగా నియమించినట్టు తెలుస్తోంది. 2014లో ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ చేరడంలో ఆయన కీలక భూమిక పోషించారు. ‘యువ నాయకత్వం కోసం కార్యకర్తలందరూ పట్టుబట్టారు. ఎంపీలు కూడా దీనికి మద్దతు ప్రకటించారు. పేదలు, నిమ్నవర్గాలకు న్యాయం జరిగేలా పార్టీని చిరాగ్ నడిపిస్తాడని నాకు నమ్మకముంద’ని రామ్‌విలాస్ పాశ్వాన్ అన్నారు. సంస్థాగతంగా ఎల్జేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మీడియాకు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. త్వరలో జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 6 సీట్లు కేటాయించాలని బీజేపీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. గత ఎన్నికల్లో జార్ఖండ్‌లో ఎల్జేపీ కేవలం ఒకచోట మాత్రమే పోటీ చేసింది. -
కేంద్ర మంత్రి ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి, ఎల్జేపీ నాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు, లోక్‌సభ సభ్యుడు రామచంద్ర పాశ్వాన్(56) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్ర పాశ్వాన్ నేడు రామ్ మనోహార్ లోహియా ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రస్తుతం రామచంద్ర పాశ్వాన్ బిహార్‌లోని సమస్తిపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్ర పాశ్వాన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధ కలిగించిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవ వెల కట్టలేనిదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రామచంద్ర పాశ్వాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంవిలాస్ పాశ్వాన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. Shri Ram Chandra Paswan Ji worked tirelessly for the poor and downtrodden. At every forum he spoke unequivocally for the rights of farmers and youngsters. His social service efforts were noteworthy. Pained by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) July 21, 2019 -
పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు
పట్నా: సంపన్న దళితులు, ఇతర కులాల వారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. నిమ్నకులాలకు చెందిన సంపన్నులు తమకు తాముగా రిజర్వేషన్లు వదులుకుంటే అర్హులకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ మాను సింఘ్వి అన్నారు. ముందుగా చిరాగ్ పాశ్వాన్ తన రిజర్వేషన్ వదులుకోవాలని జేడీ(యూ) నేత పాశ్వాన్ వర్మ సూచించారు. తాను ఆచరించి ఇతరులకు చెబితే బాగుంటుందని అన్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకుంటున్నగా ఆర్థికంగా నిలదొక్కుకున్న నిమ్నవర్గాల వారు రిజర్వేషన్లు వదులుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సోమవారం వ్యాఖ్యానించారు. కులవ్యవస్థలేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు. -
'దళిత నాయకుడిగా ఉండాలని లేదు'
పాట్నా: తనకు దళిత నాయకుడిగా ఉండాలని లేదని లోక్ జన శక్తి పార్టీనేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోజులు మారాయని చెప్పారు. ఇప్పటి వరకు దళిత నాయకుడిగానే చెప్పుకుంటూ పాశ్వాన్ గొప్ప నాయకుడిగా ఎదగగా.. హీరో నుంచి నాయకుడిగా మారిన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. 'నాకు దళిత నాయకుడిగా తెలియడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటి రోజులు వేరు ప్రస్తుత రోజులు వేరు. ఇప్పుడంతా మారిపోయింది' అని చిరాగ్ అన్నాడు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. -
ఓ జాతీయ నేత సొంత ఊర్లో లాంతర్లే దిక్కు
ఇంట గెలిచి రచ్చ గెలువాలనే సామెత అందరికి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పే నాయకులు మీడియాలో ఎన్నో హామీలను గుప్పిస్తుంటారు. జాతీయ రాజకీయాల్లో గొప్ప నాయకుడిగా చెలామణి అవుతున్న నేత సొంత గ్రామంలోనే విద్యుత్ సౌకర్యం లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కోతలు లేని విద్యుత్ అందిస్తామని రాజకీయ నేతలు అదను దొరికితే కోతలు కోస్తునే ఉంటారు. భారతదేశంలోని దాదాపు సుమారు అన్ని గ్రామాలు విద్యుదీకరణ జరిగాయని నేతలు సభల్లో గొప్పలు చెప్పుకుంటారు. మీరు నమ్ముతారో లేదో కాని లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ స్వంత గ్రామంలో లాంతర్లతోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారట. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని రాసుకు తిరుగుతున్న పాశ్వాన్, బీహార్ లోని ఖాగారియా జిల్లాలోని శహర్బాణి సొంత గ్రామంలో ఇంకా లాంతర్లే ప్రజలకు వెలుగునిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వంత గ్రామం నలంద జిల్లాలోని కళ్యాణ్ బిఘా, లాలూ ప్రసాద్ యాదవ్ గ్రామం గోపాల్ గంజ్ లోని ఫుల్వారియాలో జరిగిన అభివృద్దికి పూర్తి వ్యతిరేకంగా పాశ్వాన్ గ్రామం చీకటిలో మగ్గుతోంది. ఇంకా దారుణమైన విషయమేమిటంటే 2007 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు పాశ్వాన్ సొంత గ్రామంలో అడుగుపెట్టలేదట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 1981లో విడాకులిచ్చిన పాశ్వాన్ తొలి భార్య కూడా ఇదే గ్రామంలో లాంతర్లతోనే జీవితం గడుపుతోంది. నాలుగున్నర దశాబ్దాల క్రితం పాశ్వాన్ గెలిచిన అసౌలీ అసెంబ్లీలో పరిధిలో ఇప్పటికి 44 రెవెన్యూ గ్రామాలకు, 21 పంచాయితీలు విద్యుదీకరణకు నోచుకోలేదనే సమాచారం ఉంది. ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో రాజకీయనాయకులు అశ్రద్ద వహిస్తున్నారని.. కనీసం విద్యుత్ లేకుండానే బ్రతకడమనేది అత్యంత దుర్భరకరమైన విషయమన్నారు. ఖగారియా పార్లమెంట్ పరిధిలోని మరో 50 గ్రామ పంచాయితీలకు కూడా విద్యుత్ సౌకర్యం లేదని ఆ నియోజకవర్గ ప్రజలు వెల్లడిస్తున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ఎన్నికల గుర్తు లాంతర్ అని.. బీహార్ లోని ప్రజలను లాంతర్ కే పరిమితం చేయడం తప్ప వారి జీవితాల్లో వెలుగు నింపలేదని ప్రస్తుత ఖగారియా ఎంపీ దినేష్ చంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు ఆపి..కనీస వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎత్తుకోవాల్సిందేనని అక్కడి ప్రజలు విజ్క్షప్తి చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పాశ్వాన్ సొంత గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణమే కాదా!. దేశానికి స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఇలాంటి సంఘటనలు ఇంకా వినాల్సి వస్తోందంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో ఊహించుకోవచ్చు. -
అనంతరం: తండ్రి బాటలోకే తిరిగొచ్చాడు...
నది... పుట్టినచోటే ఉండదు. ముందుకు సాగేకొద్దీ తన నడక మార్చుకుంటుంది. ఎక్కడో మొదలై ఎక్కడికో చేరుతుంది. చిరాగ్‌ని చూస్తే నదిని చూసినట్టే ఉంటుంది. రాజకీయ కుటుంబంలో పుట్టాడు. సినిమా మీద ఆసక్తితో అటువైపు మళ్లాడు. అక్కడ కలసి రాకపోవడంతో మళ్లీ రాజకీయాలవైపు చూస్తున్నాడు. తన నడకను మార్చుకుంటూ పోతున్నాడు. అసలు అతడి గమ్యం ఏదో? అతడి పయనం ఎందాకో? 2011... నవంబర్ 4. ‘మిలే న మిలే హమ్’ సినిమా రిలీజయ్యింది. హీరోయిన్ అందరికీ తెలిసిందే... కంగనా రనౌత్. అయితే ఆమె పక్కన నటించిన పిల్లికళ్ల పిల్లాడెవరో చాలామందికి తెలియదు. ‘కొత్త పిల్లాడు, బానే ఉన్నాడే’ అనుకున్నారంతా. అలా అంటారని తెలిసే ఆ అబ్బాయి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఫలితం మాత్రం అనుకున్నట్టుగా రాలేదు. అందుకే అతడు మళ్లీ తెరమీద కనిపించలేదు. 2013... జూన్. హాజీపూర్‌లో ఒక సభ జరుగుతోంది. ఎంతోమంది వచ్చారు. వేదిక మీద ఓ యువకుడు ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. తన తండ్రిలో ఎంత మంచి రాజకీయ నాయకుడు ఉన్నాడో వివరంగా చెబుతున్నారు. తండ్రి తరఫున తనే హామీలు ఇస్తున్నాడు. అనుభవం ఉన్న రాజకీయవేత్తలా మాటలు వెదజల్లుతున్నాడు. నాటి నటుడు, నేటి ఈ యువకుడు ఒక్కరే... చిరాగ్. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామ్‌విలాస్ పాశ్వాన్ తనయుడు. ముగ్గురు ఆడపిల్లల మధ్య రాకుమారుడిలా పెరిగాడు. ఇంటి నిండా రాజకీయ వాతావరణం, అయినా ఆ వాసన అతడికి ఒంటబట్టలేదు. ఊహ తెలిసిన నాటి నుండీ అతడి కళ్లల్లో రంగుల కలలు మెరిసేవి. మనసు సినీ వినీలాకాశం వైపు రెక్కలు కట్టుకుని ఎగరాలని ఉవ్విళ్లూరేది. అందుకే బడిలో పాఠాలతో పాటు నటనలో మెళకువలు కూడా నేర్చుకున్నాడు. డ్రామా అంటే మనోడు ఉండాల్సిందే. ఏదో ఒక పాత్రను తన తరహాలో పండించాల్సిందే. అద్భుతంగా చేశావు అంటే అమితాబ్‌తో పోల్చినంత ఆనందం. నటుడవ్వాలన్న కోరిక ఎప్పుడు కంచెలు తెంచుకుందామా అని చూసేది. పెరిగి పెద్దయ్యేకొద్దీ ఆ ఆశ అతడి అణువణువునూ ఆక్రమించేసింది. ‘నేను హీరోనవుతాను అంటే మా వాళ్లు అంతగా షాకవలేదు’ అంటాడు చిరాగ్. ఎందుకవుతారు? మాటలు వచ్చినప్పట్నుంచీ సినిమా అన్న పేరు అతడి నోటి నుంచి ఎన్ని లక్షల సార్లు వచ్చి ఉంటుందో. అందుకే వాళ్లు షాక్ తినలేదు. కానీ కాస్త డిజప్పాయింట్ అయితే అయ్యారు. చిరాగ్‌ని పాలిటిక్స్‌లోకి రమ్మని పాశ్వాన్ ఎప్పుడూ బలవంతపెట్టలేదు. నా మార్గంలో నడవడం ఇష్టం లేకపోతే... కనీసం డాక్టరో, ఇంజినీరో అవ్వమన్నారు. కానీ చిరాగ్ ఆలోచనల్లో ఆ రెండు ప్రొఫెషన్లూ లేవు. ఉన్నదల్లా ఒక్కటే... సినిమా. తన ఆసక్తికి తండ్రి పొలిటికల్ బ్యాక్గ్రౌండుని జోడించి ఎలాగయితేనేం... బాలీవుడ్లో అడుగుపెట్టాడు విలాస్ వారసుడు. కానీ అవకాశం వచ్చినంత వేగంగా అదృష్టమైతే వరించలేదు. ఒక్క సినిమాతోనే చిరాగ్ కలలకు తెర పడింది. ఆ సినిమా వైఫల్యం అతడిని నిరాశలో ముంచేసింది. ఇంత వరకూ తేరుకోకుండా చేసింది. రెండేళ్లుగా తన కలలను పునర్మించుకునేందుకు శ్రమపడుతున్నా... ఫలితం మాత్రం కనిపించలేదు. దాంతో విసుగే చెందాడో... లేక తండ్రికి తన తోడే అవసరమనుకున్నాడో తెలియదు కానీ, నాన్న అడుగుల్లో అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బీహార్‌లో తన తండ్రిని, ఆయన పార్టీని ప్రమోట్ చేసేందుకు ర్యాలీలు నిర్వహిస్తున్నాడు చిరాగ్. అందమైన రూపం, సినిమాలో నటించాడన్న చిన్నపాటి క్రేజ్, మాటల్లో ఉట్టిపడే ఆవేశం అతణ్ని అందరికీ దగ్గర చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి గెలుపునే తన లక్ష్యంగా చేసుకున్న చిరాగ్, తన అసలైన లక్ష్యాన్ని పక్కన పెట్టేశాడా? లేక కొడుకుగా తన బాధ్యతను నెరవేర్చాక మళ్లీ వెళ్దామని బ్రేక్ తీసుకున్నాడా? లేదంటే... ఇక కలసిరాని కలలను ఏరుకోవడం మానేసి, కనిపించే మార్గంలో సాగిపోవాలని నిర్ణయించుకున్నాడా? అసలు చిరాగ్ ఎటు పయనిస్తున్నాడు! - సమీర నేలపూడి -
ఆ రెండు పార్టీల మధ్య వైరం మాకు లాభం: పాశ్వాన్
బీజేపీ, జనతాదళ్ (యూ) పార్టీల మధ్య చీలికతో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) లాభపడుతోందని ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం రాజస్థాన్‌లో రున్ఝ్నులో అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఆ రెండు పార్టీల మధ్య వైరం అంతకంతకు పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని మైనారటీలైన ముస్లిం ఓట్లల్లో 80 శాతం తమ పార్టీకి వేస్తారని ఆయన పేరొన్నారు. దాంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీహార్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధిక సీట్లు సొంతం చేసుకుంటుందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఎల్జేపీ, ఆర్జేడీ పార్టీలు సంయూక్తంగా బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో బీహార్‌లోని జనతాదళ్ యూ, బీజేపీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నామరూపాలు లేకుండా పొతుందన్నారు.