బీజేపీ, జనతాదళ్ (యూ) పార్టీల మధ్య చీలికతో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) లాభపడుతోందని ఆ పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం రాజస్థాన్లో రున్ఝ్నులో అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో ఆ రెండు పార్టీల మధ్య వైరం అంతకంతకు పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని మైనారటీలైన ముస్లిం ఓట్లల్లో 80 శాతం తమ పార్టీకి వేస్తారని ఆయన పేరొన్నారు.
దాంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో అత్యధిక లోక్సభ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీహార్ రాష్ట్ర శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ అధిక సీట్లు సొంతం చేసుకుంటుందని పాశ్వాన్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఎల్జేపీ, ఆర్జేడీ పార్టీలు సంయూక్తంగా బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో బీహార్లోని జనతాదళ్ యూ, బీజేపీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నామరూపాలు లేకుండా పొతుందన్నారు.