అల్లాడుతున్నాం... | Muslim religious community was backward after india got independence | Sakshi
Sakshi News home page

అల్లాడుతున్నాం...

Published Fri, Mar 28 2014 1:56 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

అల్లాడుతున్నాం... - Sakshi

అల్లాడుతున్నాం...

* అన్ని రంగాల్లో ఉన్నా.. అవకాశాలు అందని ముస్లింలు
* జనాభా దామాషా ప్రకారం వాటా కరువు

 
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు ముస్లిం జన సముదాయం అన్ని రంగాల్లో వెనుకబడింది. కూటికి, గుడ్డకు కూడా సరిపోని ఉపాధి మార్గాలు.. కుటుంబ అవసరాలు తీర్చలేని వృత్తుల్లో కొనసాగుతుండటం వల్ల దాదాపు 60 శాతం మంది ముస్లింలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. సొంత వ్యాపారాలు పెట్టుకునే ఆర్థిక స్థోమత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేక దాదాపు 70 శాతం యువత విలువైన సమయాన్ని వృథా చేసుకుంటోంది. ఈ విషాదకర వాస్తవాన్ని గత 60 ఏండ్లుగా ప్రభుత్వ, ఇతర అధ్యయన సంస్థలు నిర్వహించిన సర్వేలు కుండబద్దలు కొట్టాయి. ప్రభుత్వ కమిటీలు, కమిషన్‌లన్నీ సాధికారిక గణాంకాలతో ఈ అంశాన్నే రుజువు చేశాయి. ఆరు దశాబ్దాలుగా దేశం, రాష్ట్రాలను ఏలిన ప్రభుత్వాలు ఆ సిఫార్సులను, సూచనలను బుట్టదాఖలు చేయడంతో ముస్లింలు అల్లాడిపోతున్నారు.
 
 వుుహ్మద్ వుంజూర్: వుుస్లిం ఓట్లు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వున దేశంలో అత్యంత విసృ్తతంగా చర్చలో నిలిచే పదబంధమిది. వుుస్లింల ఓట్ల కోసం పార్టీలు చేసే ప్రయుత్నాలు అన్నీ ఇన్నీ కావు. హిందూత్వ పార్టీగా పేరుబడ్డ బీజేపీ కూడా కొంతకాలంగా వుుస్లిం ఓట్ల జపం చేస్తోందంటే వారి ఓట్లకున్న ప్రాధాన్యమే అందుకు కారణం. దేశవ్యాప్తంగా కనీసం 150కి పైగా లోక్‌సభ స్థానాల్లో వుుస్లిం ఓట్లు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నారుు. వాటిలో బహువుుఖ పోటీలుండే స్థానాల్లో కచ్చితంగా వుుస్లిం ఓట్లే నిర్ణాయుకంగా వూరతారుు. కానీ ఈ గణాంకపరమైన ప్రాధాన్యత వుుస్లింల జీవితాల్లో వూత్రం వెలుగులు నింపలేకపోతుండటం విషాదం. పార్టీలకు ఎంతసేపూ వుుస్లింల ఓట్లపైనే దృష్టి తప్ప, వారి రాజకీయు అభ్యున్నతిని అవి పట్టించుకున్న దాఖలాలు పెద్దగా లేవు. 2009లో దేశవ్యాప్తంగా లోక్‌సభకు పోటీ చేసిందే 832 వుంది వుుస్లింలరుుతే, వారిలో సగానికి సగం వుంది స్వతంత్రులుగానే బరిలో దిగాల్సి రావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత లోక్‌సభలో వుుస్లిం ఎంపీలు కేవలం 6 శాతం వూత్రమే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఏకంగా 20 రాష్ట్రాల నుంచి ఒక్క వుుస్లిం ఎంపీ కూడా లేడు.
 
 ఈ నేపథ్యంలో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వుుస్లింల ఓటింగ్ సరళి బీజేపీ అధికార ఆకాంక్షలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందన్నది అత్యంత ఆసక్తికరంగా వూరింది. రాష్ట్రంలో కూడా ముస్లింల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. మెజారిటీ జిల్లాల్లో వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. పలు లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను కూడా ప్రభావితం చేయగలరు. అయినా వెనకబాటుతనంతో నిత్య పోరాటమే. అందుకే వారి సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎంతగానో తపించారు. ఎన్ని ఆటంకాలెదురైనా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. సంక్షేమ పథకాల ఫలాలందేలా చూశారు. ఎన్నికలు ముంగిట్లోకొచ్చిన ఈ తరుణంలో వైఎస్ జమానాను రుబాబు పాలనతో ముస్లిం ఓటర్లు పోల్చి చూసుకుంటున్నారు. తమ అభ్యున్నతికి పాటుపడగలిగిన, నమ్మదగిన నాయకునికే అవకాశమివ్వాలని భావిస్తున్నారు...
 
 ఏ జన సముదాయమైనా అభివృద్ధి చెందాలంటే వారికి అన్నిరంగాల్లో సముచిత వాటా దక్కాలి. దుర్భర స్థితి నుంచి ముస్లింలకు విముక్తి లభించాలంటే.. విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ, ఆర్థిక, వర్తక, వాణిజ్య రంగాలలో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలి. అధికారంలో కూడా కచ్చితమైన భాగస్వామ్యం అవసరం. ప్రతి జిల్లాలో 2లక్షల నుంచి 4 లక్షల వరకు ముస్లిం జనాభా ఉన్నప్పటీకీ చట్టసభలలో కనీస వాటా దక్కడం లేదు. తత్ఫలితంగా నియామక, నిర్ణయాత్మక పాలన మండళ్లలో నామమాత్రంగా కూడా ముస్లింలు లేరు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి.. అన్ని రంగాలలో సదవకాశాలు, సమానావకాశాలు కల్పించేందుకు అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలి. మేనిఫెస్టోల్లో వరాలతో సరిపెట్టకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినపుడు చట్టబద్ధమైన, రాజ్యాంగపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి.
 
 ముస్లింల ప్రధాన డిమాండ్లు..
 *    విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులకూ దీనిని వర్తింపజేయాలి.
 *    ఉపాధ్యాయులు, పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల మాదిరిగా జిల్లాకొక మైనారిటీ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
 సంక్షేమం..
 *    ఎస్టీ, ఎస్టీ ఉప ప్రణాళిక మాదిరిగానే ముస్లిం ఉప ప్రణాళికకు రూపకల్పన చేయాలి. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. సబ్-ప్లాన్ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలి.
 *    ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ యువశక్తి, పి.యం.ఆర్.వై వ్యవసాయ భూ పంపిణీ, ఇందిరాక్రాంతి, ఇందిరా ప్రభ, ఇందిరా పశుక్రాంతి, జీవక్రాంతి, సమభావన స్వయం సహాయక బృందాలు తదితర ప్రభుత్వ పథకాలలో 10% లబ్ధి ముస్లింలకు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలి.
 
 విద్య..
 *    {పతి నియోజకవర్గంలో ముస్లిం విద్యార్థుల కొరకు ప్రీమెట్రిక్ హాస్టల్, గురుకుల పాఠశాలను నెలకొల్పాలి. ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో ఐటీఐ, డీఈడీ, బీఈడీ, పాలిటెక్నిక్, పీజీ సెంటర్ నెలకొల్పాలి.  
 ఉపాధి..
 *    ముస్లింలలో ఉపాధి అవకాశాలు, పని నైపుణ్యాన్ని, యాజమాన్య సామర్థ్యాన్ని పెంపొందించేందుకు.. మార్కెట్ వసతులు, ముడి సరుకులు అందుబాటులోకి తెచ్చేందుకు.. వృత్తుల పట్ల ఆసక్తిని పెంచుటకు, శాశ్వత ఆదాయం కల్పించేందుకు మైనారిటీ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
 *    ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కనీసం 10,000 మంది యువతీ యువకులకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల వరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రుణాలను నేరుగా మంజూరు చేయాలి.
 *    బ్యాంకుల నుంచి ముస్లింలకు సహకారం లేనందున ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా సహకార పరపతి బ్యాంకును నెలకొల్పాలి.
  పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి భూ కేటాయింపులో 10% వాటా కల్పిస్తూ ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేసిన రాయితీలను కల్పించాలి.
 
 వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ
*    కబ్జాకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవాలి.  ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా వక్ఫ్ చట్టాన్ని సవరించాలి. వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అవసరమైన బడ్జెట్ కేటాయించాలి. బోర్డు ద్వారా మసీదుల ఇమాం, మౌజన్‌లకు ప్రతి నెలా రూ.10,000 వేతనం చెల్లించాలి.

 ఉర్దూ భాషాభివృద్ధి...
 *    తెలుగు, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో హిందీకి బదులుగా ఉర్దూను ఐచ్ఛిక భాషగా ముస్లిం విద్యార్థులకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో అవసరమైన సంఖ్యలో ఉర్దూ అనువాదకులను నియమించాలి. భాషా పరిరక్షణకు ఉర్దూ అధికార భాషా సంఘం, జిల్లా స్థాయిలలో కలెక్టర్ అధ్యక్షతన తగిన విభాగాలను ఏర్పాటు చేయాలి.
 *    ఉర్దూ ఉపాధ్యాయుల నియామకంలో ఎస్సీ-ఎస్టీ రిజర్‌‌వడ్ పోస్టులకు అభ్యర్థులు లభించక ఏళ్ల తరబడి ఖాళీగా పెట్టేస్తున్నారు. వీటిని అర్హతగల ముస్లిం అభ్యర్థులతో భర్తీ చేయాలి.

 భద్రతకు భరోసా..
 *    పోలీసు నియామకపు సెలక్షన్ కమిటీల్లో గతంలోలా మైనార్టీ సభ్యులను నియమించాలి.
 *    జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో మైనార్టీ సభ్యులను నియమించాలి.
 *    ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం తరహాలో ముస్లింల రక్షణ-భద్రతకు ‘ముస్లిం అట్ట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్’ను రూపొందించాలి.
 
 దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలి..
 ముస్లింల మీద సాగుతున్న దుష్ర్పచారానికి విరుగుడుగా వాస్తవిక, సామాజిక, చారిత్రక సమాచారాన్ని ప్రజలకు అందజెయ్యాలి. స్వాతం త్య్రోద్యమంలో పాల్గొన్న ముస్లిం యోధులు, దేశాభ్యున్నతి కోసం అనితర సాధ్యమైన కృషి చేసిన ప్రముఖులకు పాఠ్యగ్రంథాలలో స్థానం కల్పించాలి. రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలలో వారి స్మారకస్థూపాలను ఏర్పాటు చేయాలి.    
 - సయ్యద్ నసీర్ అహ్మద్,
 మైనారిటీ సంక్షేమ సంఘాల సమాఖ్య సలహాదారుడు, చరిత్రకారుడు

 
 ఈ పరిస్థితి మారాలి
 దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అణచివేతకు గురయ్యామనే భావనలో ఉన్నారు ముస్లింలు. చివరకు తమ భద్రతకు హామీగా నిలబడే లౌకిక పార్టీలకు ఓటేసే ముస్లిం సముదాయంపై ‘ఓటు బ్యాంకు’ అనే ముద్రవేసి సాగిస్తున్న దుష్ర్పచారమే దీనికి బలమైన నిదర్శనం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముంది.
 - ఎం. ఖదీరుల్లా
 కన్వీనర్, మత సామరస్య పరిరక్షణ కమిటీ

 
 జనహితమే అభిమతం

 ముస్లింల కష్టాలను స్వయంగా చూశాడు మహానేత వైఎస్. మతాలకతీతంగా జనహి తమే అభిమతమని చాటాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్‌‌సమెంట్‌తో ‘అనేకులకు’ ఆనందాన్ని పంచాడు. ‘ఏకాకులకు’ ఎన్నెన్నో లాభాలు చేకూర్చాడు. ప్రత్యేకించి వారి పిల్లలకు విద్య, ఉద్యోగావకాశాల్లో అండగా నిలిచాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా 4శాతం రిజర్వేషన్లు అమలు చేశాడు. అందుకే.. పండ్లవ్యాపారి కొడుకు పాఠాలు చెప్పే పంతులయ్యాడు. రిక్షా పుల్లర్ కుమార్తె డాక్టర్ అయ్యింది. హమాలీ కొడుకు ఆఫీసర్ అయ్యాడు. మెకానిక్ కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యాడు. అంతేనా... గుండె నొప్పితో బాధపడుతూ చాయ్‌లమ్మే  గరీబు జీవితంలో సంతోషం నిండింది. పింఛన్ లేని బేవా బెహన్ బతుకులో వెలుగురేఖ ప్రసరించింది. పైసల్లేని బూఢే బడేమియాకు భరోసా లభించింది. ఆసరా కోసం నీరిక్షించిన అంధా ఆద్మీ కళ్లలో కొత్తకాంతి విరిసింది. దర్‌‌ద భరీ జిందగీలో కొత్తపొద్దు పొడిచింది.
 
 హమారా.. భయ్యా
 తెలుగునేలపై ముస్లింల జనాభా గణనీయమైనది.  ఇప్పుడు వారు... తొమ్మి దేళ్ల  రు‘బాబు’లు తమకొద్దంటున్నారు. ‘తోఫా’లేమీ అక్కర్లేదంటున్నారు. మాట తప్పి మతతత్వం పాటందుకున్నందుకు ‘మాఫ్’ చేయమంటున్నారు. కలిసి మెలసి జీవించే తమకు గుజ‘రాత్’ వద్దంటున్నారు. ‘ఓటుబ్యాంకు’ రాజకీయాలు చేయవద్దంటు న్నారు. సాయం చేసినవారి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఆసరా దేనేవాలే భయ్యా కోసం ఎదురు చూస్తున్నారు.  
 
 వారు.. నామ్ కే వాస్తే నవాబులు.. తరాల తరబడి గరీబులు. అన్ని కులవృత్తుల్లోనూ వారు. అన్ని పనుల్లోనూ వారు.
 వారు.. పొద్దంతా పనిచేసి పదిరూపాయలు సంపాదించేవారు. కుటుంబమంతా కష్టపడి కడుపు నింపుకునేవారు.
 వారు.. అన్ని సుఖాలూ వదులుకుని అహోరాత్రాలు శ్రమించేవారు. అయినవారందరినీ వదలి ఎడారి దేశాలకు వెళ్లేవారు.
 వారు.. అక్షరాల తోట వైపు అడుగేయలేని అసహాయులు. అధికారంలో వాటా ఉన్నా అడిగేందుకూ సాహసించనివారు.
 వారు.. సంఖ్యలో అనేకులు.. సమూహంలో ఏకాకులు. వారు.. విశ్వాసానికి మారుపేరు. ఆత్మవిశ్వాసానికి మరోపేరు.
 వారు.. నిరుపేద ముస్లింలు! బతుకు సమరం సాగిస్తున్న భాయిసాబులు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement