ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఘనవిజయం | YV Subba Reddy win | Sakshi
Sakshi News home page

ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి ఘనవిజయం

Published Fri, May 16 2014 12:59 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

వైవి సుబ్బారెడ్డి - Sakshi

వైవి సుబ్బారెడ్డి

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ స్థానంలో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి ఘనవిజయం సాధించారు. ఇప్పటివరకు తెలిసిన ఫలితాలలో ఈ జిల్లాలోని నాలుగు శాసనసభ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. టిడిపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై సుబ్బారెడ్డి విజయం సాధించారు. వైఎస్ఆర్ సిపికి చెందిన అభ్యర్థులు మార్కాపురంలో     జంకే వెంకట రెడ్డి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, కందుకూరులో పోతుల రామారావు ఎర్రగొండపాలెంలో  పాలపర్తి డేవిడ్ రాజు, సంతనూతలపాడులో ఆదిమూలం సురేష్  గెలుపొందారు.  

వైఎస్ఆర్ సిపి ప్రభంజనం ఇక్కడ బాగా పనిచేసింది. ఆ పార్టీ ముఖ్య నేతలు జగన్మోహన రెడ్డి, విజయమ్మ, షర్మిల ఎన్నికల పర్యటనలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ప్రకాశం జిల్లాపరిషత్ స్థానం కూడా ఈ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

శాసనసభ స్థానాలలో టిడిపి అభ్యర్థులు ఈ జిల్లాలో ఒంగోలులో  దామచర్ల జనార్ధన్, కనిగిరిలో కదిరి బాబూరావు, పర్చూరులో ఏలూరు సాంబశివరావు  విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement