కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఈ నెల 16న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే దానిపై ఆరా తీశారు. ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు సందర్భంలో చేపట్టే భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. చెల్లింపు వార్తలు, పట్టుబడి న నగదు, మద్యం, ఎంసీఎంసీ కమిటీ ద్వారా జారీ చేసిన నోటీసుల వివరాలు ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రతకు పోలీసు బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి 16,300 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేశామన్నారు. అందులో 14,704 మంది ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలి పారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రెండు బెటాలియన్ల సీఆర్‌పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జేసీ రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెం కటేశ్, డీఆర్వో సులోచన, ఆర్డీఓలు పాల్గొన్నారు.
పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు
Published Sat, May 10 2014 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement