ప్రచారం ప్రాణం తీసింది | In TDP party elections compaign one person died | Sakshi
Sakshi News home page

ప్రచారం ప్రాణం తీసింది

Published Thu, May 1 2014 3:18 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

In TDP party elections compaign one person died

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు వస్తుందని ఆశపడిన ఆ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. మండుటెండలో టీడీపీ ప్రచారంలో తిరిగిన వడదెబ్బకు గురై మృతి చెందాడు. అప్పటిదాకా జేజేలు కొట్టించుకున్న పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తరువాత పట్టించుకోలేదంటూ బంధువులు వాపోతున్నారు.

పెనుబల్లికి చెందిన మన్నెం శివయ్య మృతితో భార్య, ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బంధువుల కథనం మేరకు.. మండలంలోని పెనుబల్లిలో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మద్యం, నగదు ఇస్తానని చెప్పడంతో మన్నెం శివయ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. వడదెబ్బ తగలడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. అనాథలైన శివయ్య భార్యాపిల్లలను  ఆదుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement