banvarlal
-
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్
కాణిపాకం: తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ ఆదివారం కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. భన్వర్‌లాల్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని భన్వర్‌లాల్ దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. కుంకుమార్చన సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. -
అనర్హులను ఓటరు జాబితా నుంచి తొలగించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ విజయవాడ : రాష్ట్రంలో ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పోలింగ్ బూత్‌లు తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి బన్వర్‌లాల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బాబూ.ఏ హైదరాబాద్ నుంచి, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల గుర్తింపు కార్డు జారీలో డూప్లికేషన్, అర్హతలేని మరణించిన, ఇళ్లు మారిన ఓటర్లను గుర్తించి జాబితానుంచి తొలగించడానికి చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇంటి నంబరు, ఇంటిలో ఉండే వ్యక్తుల పేర్లను అనుసంధానం చేస్తూ వాటికి సంబంధించిన పోలింగ్ బూత్‌ను గుర్తించేలాగా రూట్ మ్యాప్‌ను రూపొందించాలని చెప్పారు. 2016 ఎలక్ట్రోరల్ ప్రత్యేక సమ్మరి రోల్‌ను సెప్టెంబర్ 10 నాటికి పూర్తి చేసి అక్టోబర్ 5వ తేదీనాటికి డ్రాఫ్ట్ రోల్ ప్రచురించాలని బన్వర్‌లాల్ ఆదేశించారు. బీఎల్వో స్థాయిలో ప్రతి సిబ్బందికి వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఆన్లైన్లో అనుసంధానం చేయాలని, వారికి జరిపే అన్ని రకాలైన చెల్లింపులు ఖాతాలకు జమచేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ బాబు.ఏ మాట్లాడుతూ జిల్లాలో 1,066 డూప్లికేట్ ఎపిక్ కార్డులు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందని, వాటిని బీఎల్వో స్థాయిలో పరిశీలించి తొలగించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,190 మరణాల వలన 37,730 ఇళ్లు మారడం వల్ల వారి పేర్లను ఓటర్‌లిస్టు నుంచి తొలగించినట్లు వివరించారు. జిల్లాలో 33,41,069 మంది ఓటర్లు నమోదు కాగా వారిలో పురుషులు 16,59,455, మహిళలు 16,81,361, ఇతరులు 253 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో ఆధార్ సీడింగ్ ప్రక్రియ నిమిత్తం 29,15,374 మందిని గుర్తించి వారిలో 99.23 శాతం మంది వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ -2 ఒంగోలు శేషయ్య, ఆర్డీవోలు సీహెచ్.రంగయ్య, సాయిబాబా, ఇన్చార్జి డీఆర్వో చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఈ నెల 16న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే దానిపై ఆరా తీశారు. ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపు సందర్భంలో చేపట్టే భద్రతా చర్యలను అడిగి తెలుసుకున్నారు. చెల్లింపు వార్తలు, పట్టుబడి న నగదు, మద్యం, ఎంసీఎంసీ కమిటీ ద్వారా జారీ చేసిన నోటీసుల వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రతకు పోలీసు బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సిబ్బందికి 16,300 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేశామన్నారు. అందులో 14,704 మంది ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్నారని తెలి పారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ సందర్భంగా రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జేసీ రామారావు, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెం కటేశ్, డీఆర్వో సులోచన, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
బాలయ్య బరిలో ఉన్నాడు.. ‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి!
భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ విజ్ఞప్తి హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నందున ఆయన నటించిన చిత్రం లెజెండ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. లెజెండ్ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఆపార్టీ నేతలు చిత్ర ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు శివకుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఉప ఎన్నికల అధికారి దేవసేనను కలిసి ఫిర్యాదు చేశారు. -
కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి
నల్లగొండ కలెక్టర్‌కు రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశం హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పందించారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో నివేదికను పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను భన్వర్‌లాల్ ఆదేశించారు. దీని ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు భన్వర్‌లాల్ ఓ నివేదిక పంపించనున్నారు. కాగా, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలపైనా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వివరణ కోరామని, అయితే ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని భన్వర్‌లాల్ బుధవారం తెలిపారు. పార్టీల నుంచి వచ్చే వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు. -
డబ్బు తీసుకునే ఓటర్లపైనా కేసులు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఓట్లు వేసేందుకు డబ్బు తీసుకునే వారిపైనా కేసులు పెడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ హెచ్చరించారు. డబ్బు పంచడానికి వచ్చే వారి ముఖాన్నే దానిని కొట్టాలని, మంచి వారికే ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించాలని ప్రజల ను కోరారు. తద్వారా దేశంలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు - ఓటరు చైతన్య కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు, మద్యం పట్టుబడటానికి బహుశా ఇక్కడ పలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్) ఎన్నికలు ఉండటం కారణం కావచ్చునని భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలనే చైతన్యం ప్రజల్లో బాగా వచ్చిందని, గతంలో 30-35 లక్షల కొత్త ఓట్లు నమోదు కాగా ఈ పర్యాయం ఏకంగా 90 లక్షల ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. -
15 నుంచి ఓటర్ స్లిప్పుల జారీ
తనిఖీల్లో దొరికిన మొత్తం రూ. 92.58 కోట్లు 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండి స్వాధీనం రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడి హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 17 పార్లమెంట్ స్థానాలకు గాను 267 మంది రంగంలో మిగిలారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1682 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శనివారం వెల్లడించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ నెల 12వ తేదీ వరకు ఓటర్ల సంఖ్య 2,81,66,266గా ఉందని చెప్పారు. సీమాంధ్ర ప్రాంతంలో 3.63 కోట్ల మందితో కలిపి రాష్ట్రం మొత్తం మీద 6.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. తెలంగాణలో ఈ నెల 30న పోలింగ్ జరుగనున్నందున, 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వానికి తెరపడుతుందన్నారు. 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు రంగంలో ఉన్న స్థానాల్లో రెండేసి ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలవుతుందని, వారంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. ఓటరు స్లిప్పులను ఓటర్‌కు లేదా వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని, అందువల్ల ఈ వారం పాటు ఇళ్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పులను గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. వాటిలో పోలింగ్ కేంద్రం సంఖ్య, ప్రాంతం, పోలింగ్ సమయం ముద్రించి ఉంటుందని వివరించారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చీరలు, ఇతర సామగ్రి పంపిణీకి సంబంధించి కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, వారి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. నోటా గుర్తు విషయంలో హైకోర్టు ఆదేశాలపై ఈసీకి నివేదించామని, వారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భన్వర్‌లాల్ తెలిపారు. దేశంలోనే అత్యధికంగా నగదు స్వాధీనం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నగదు తరలిస్తున్న వారి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఇప్పటి వరకు 92.58 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే 69.50 కిలోల బంగారం, 289.74 కిలోల వెండితోపాటు 3.48 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ డబ్బును కోర్టుకు అప్పగించి, ఆదాయపన్ను శాఖకూ సమాచారమిస్తున్నామన్నారు. సరైన ఆధారాలను చూపించి డబ్బును తిరిగి పొందవచ్చని, అలాగే ఆదాయపన్ను శాఖకు సరైన వివరాలు ఇవ్వలేనిపక్షంలో వారు విధించే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రానికి 400 కంపెనీల కేంద్ర బలగాలు రానున్నాయని, వాటిని నక్సల్ ప్రభావిత, ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వినియోగించనున్నామని చెప్పారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎంపీకి పోటీ ఎక్కువ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం 39 మంది ఎంపీ అభ్యర్థులు, 554 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకొన్నారు. దీంతో మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాల నుంచి అత్యధికంగా 30 మంది చొప్పున, నాగర్‌కర్నూలుకు అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు పోటీలో మిగిలారు. నియోజకవర్గాలవారీగా చూస్తే.. ఆదిలాబాద్(8), పెద్దపల్లి(17), కరీంనగర్(17), నిజామాబాద్(16), జహీరాబాద్(10), మెదక్(13), మల్కాజిగిరి(30), సికింద్రాబాద్(30), హైదరాబాద్(16), చేవెళ్ల(16), మహబూబ్‌నగర్(10), నాగర్‌కర్నూల్(6), నల్లగొండ(9), భువనగిరి(13), వరంగల్(12), మహబూబాబాద్(17), ఖమ్మం ఎంపీ స్థానానికి 27 మంది రంగంలో ఉన్నారు. ఆందోల్ అసెంబ్లీ స్థానానికి ఐదుగురే..: మెదక్ జిల్లా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదుగురే రంగంలో నిలవగా.. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, ఖమ్మం అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 25 మంది చొప్పున పోటీలో ఉన్నారు. కాగా జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్‌లో 10 స్థానాలకు 124 మంది, నిజామాబాద్‌లో 9 సీట్లకు 101 మంది, కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాలకు 168 మంది, మెదక్‌లో పది స్థానాలకు 105 మంది, రంగారెడ్డిలో 14 స్థానాలకు 284 మంది, హైదరాబాద్‌లో 15 స్థానాలకు 298 మంది, మహబూబ్‌నగర్‌లో 14 స్థానాలకు 144 మంది, నల్లగొండలోని 12 స్థానాల్లో 161 మంది, వరంగల్‌లో 12 నియోజకవర్గాలకు 154 మంది, ఖమ్మంలో పది స్థానాలకు 143 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. -
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా ్ఛ్ఛఛ్టిజీౌఃట్చజుటజిజీ.ఛిౌఝకు మెయిల్ చెయ్యండి. ఏ అభ్యర్థీ నచ్చనప్పుడు వారందరినీ తిరస్కరించేందుకు ‘నోటా’ ఓటు కల్పించారు. ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకోరు కదా? అటువంటప్పుడు ‘నోటా’ వల్ల ప్రయోజనం ఏమిటి? - డాక్టర్ పీవీ రామకుమార్, విజయవాడ గతంలో అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరినీ తిరస్కరించే అవకాశం కలిగింది. ఓటరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఇది ఒక అదనపు ప్రత్యామ్నాయం మాత్రమే. పోలింగ్ ఏజెంట్లను ప్రలోభపెట్టి బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు వేయించే అవకాశం ఉంది. దీనిని ఎలా నివారిస్తారు? -చాంద్‌భాష, ప్రొద్దుటూరు అలా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈసారి ప్రతి బూత్లోనూ ‘లైవ్ వెబ్ క్యాస్టింగ్’ ఏర్పాటు చేస్తున్నాం. బూత్‌లో జరిగే వ్యవహారమంతా రికార్డు అవుతూ ఉంటుంది. ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘమే ఓటర్ స్లిప్పులు ఇస్తోంది కదా. పార్టీల అభ్యర్థులు స్లిప్పులు ఇవ్వడాన్ని నివారిస్తే బాగుంటుంది. - ప్రకాష్, నిజామాబాద్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పోలింగ్‌కు 48 గంటల ముందు పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఇలా స్లిప్పుల పంపిణీ చేపడితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. అప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం. -
ఎన్నికలు పకడ్బందీగానిర్వహించాలి
ప్రణాళిక సిద్ధం చేసుకోండి వారంలోగా పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించాలి రాజకీయ పార్టీల పోస్టర్లను తొలగించాలి మేనిఫెస్టోపై నివేదిక ఇవ్వాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌కు వీడియో కాన్ఫరెన్సలో ఆదేశాలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలను వారంలోగా స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్ గోడలపైన అతికించి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను అనుసంధానం చేసి ఎన్నికల సంఘం వారికి అందించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు చెందిన పోస్లర్లు ,క్యాలెండర్లు,గోడ,కర ప్రతులు,హోర్డింగులు తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. రాజకీయ పార్టీలు తయారు చేసే మేనిఫెస్టోను ఎన్నికల అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రతిరోజు నివేదిక 10 గంటలలోగా అందించాలన్నారు. అక్రమంగా మద్యం పంపిణీ, మద్యం అమ్మకాలు, రవాణా జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీల తరపున బరిలో నిలబడే వ్యక్తులు అఫిడ విట్లు తప్పకుండా సమర్పించేలా చూడాలన్నారు. అభ్యర్థి నుంచి సేకరించిన అపిడ విట్లను వెంటనే ఎలక్షన్ కమిషన్‌కు అధికారులు పంపాలన్నారు.ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం ఉండే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, సంబంధిత మ్యాపింగ్‌ను ఈనెల 13లోగా ఎన్నికల కమిషన్‌కు అందించాలన్నారు. వీడియె కాన్ఫరెన్స్‌లో ఎస్పీ తరుణ్‌జోషీ, డీఐజీ సూర్యనారాయణ,అదనపు జేసీ శేషాద్రి,ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్రంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. భన్వర్‌లాల్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోను, ఆ తరువాత గవర్నర్‌తోను సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు బడ్జెట్ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి తొలుత రూ.150 కోట్లు విడుదల చేయాల్సిందిగా కోరారు. ఎన్నికల నిర్వహణకు మొత్తంరూ. 800 కోట్ల వ్యయం అవుతుండగా ఇందులో సగం రాష్ట్ర ప్రభుత్వం, మిగతా సగం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అనుగుణంగా ప్రతిపాదనలను పంపారు. ఇలా ఉండగా లోక్‌సభ తోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈ నెల 3 లేదా 4వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా మిగిలి ఉంటే అందుకు రెండు మూడు రోజుల సమయం అవసరమైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను 6వ తేదీ లేదా 7వ తేదీకి కమిషన్ వాయిదా వేయవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. లేని పక్షంలో 3 లేదా 4వ తేదీనే షెడ్యూల్‌ను కమిషన్ ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు? గత రెండు సాధారణ ఎన్నికల్లానే ఈసారి కూడా రాష్ట్రంలో రెండు విడతల్లో పోలింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో జరిగే సాధారణ ఎన్నికల షెడ్యూలు విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తిచేసింది. 2004లో ఇలా.. షెడ్యూలు విడుదల: ఫిబ్రవరి 29 పోలింగ్ తేదీలు: ఏప్రిల్ 20, 26, మే 5, 10 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్: ఏప్రిల్ 20, 26 ఓట్ల లెక్కింపు: మే 13 2009లో ఇలా.. షెడ్యూలు విడుదల: మార్చి 2 పోలింగ్ తేదీలు: ఏప్రిల్ 16, 23, 30, మే 7, మే 13 ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్: ఏప్రిల్ 16, 23 ఓట్ల లెక్కింపు: మే 16 -
రేపటి వరకు ఓటర్ల తుది జాబితా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : శుక్రవారం నాటికి జిల్లా ఓటర్ల తుది జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల కమిషనర్ బన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 18-19 సంవత్సరాలు గల యువత 67,716 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. 14,988 మంది బోగస్ ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపారు. జిల్లాలో ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. జిల్లాలో 83పోలింగ్ కేంద్రాలకు ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ములుగు నియోజకవర్గంలోని తాడ్వాయిలో తొమ్మిది, ఏటూరునాగారంలో 18, గోవిందరావుపేటలో 14 గ్రామాలు, మహబూబాబాద్ నియోజకవర్గంలో 22గ్రామాలకు ఎటువంటి కమ్యూనికేషన్స్ లేనట్లు తెలిపారు. పోలీసు బందోబస్తుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, నోడల్ అధికారులను ఏర్పాటు చేశామని చెప్పారు. మేడారం జాతర దృష్ట్యా ఉప కలెక్టర్లు, తహసీల్దార్లు ఎంపీడీవోల బదిలీలను జాతర అనంతరం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కోరగా.. ఎన్నికల కమిషనర్ అనుమతించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, కమిషనర్ పాండాదాస్, డీఆర్వో సురేందర్‌కరణ్ పాల్గొన్నారు. -
27,43,754 జిల్లాలో ఓటర్లు
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ కసరత్తు వేగవంతం చేస్తోంది. సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటివరకు నమోదైన ఓటర్ల తుది జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 27,43,754 ఓటర్లుగా నమోదయ్యారు. 2013 నవంబర్ 18 నాటి ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 26,40,264 మంది ఓటర్లు ఉండగా అనంతరం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో కొత్తగా 1,03,530 మంది జాబితాలో చేరారు. ఓటరు నమోదు నిరంతరం కొనసాగుతున్నా ఫిబ్రవరి 15 వరకు నమోదయ్యే ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా జిల్లాలో పక్కా ఓటరు జాబితా ప్రచురణకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. గతేడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. ఈ సమయంలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ జిల్లాకు వచ్చి ఓటరు నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు అనర్హులను పక్కాగా జాబితా నుంచి తొలగించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో నమోదు గడువు మూడుసార్లు పెంచు తూ వచ్చిన నేపథ్యంలో తుదిజాబితా ప్రచురణకు సమయం సరిపోకపోవడంతో ఈ నెల 16 నుంచి 31వరకు ఎన్నికల కమిషన్ గడువు పెంచింది. గతేడాది నవంబర్ 18 నాటి ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 38,80,041 మంది జనాభా ఉన్నారు. అందులో మహిళలు 19,47,556 మంది కాగా, పురుషులు 19,32,485 మంది. పురుష ఓటర్లు 13,29,067, మహిళా ఓటర్లు 13,11,157 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేయడంలో సఫలీ కృతమైంది. అనేక అవగాహన కార్యక్రమాల ఫలి తంగా కొత్త ఓటరు నమోదు కోసం యువత నుంచి మంచి స్పందన వచ్చింది. జిల్లాలో 1.45 లక్షల మంది ఓటుహక్కులేని యువత ఉన్నారని గుర్తించారు. ఫారం-6, ఆన్లైన్ ద్వారా మొత్తంగా 1.64 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. అధికారుల నివేదిక ప్రకారం ఓటు కోసం నమోదు చేసుకున్నవారు 1,47,594 మంది. అందులో పరిశీలన, విచారణ అనంతరం అనర్హులను తొలగించారు. రెండు చోట్ల ఓటు నమోదైనవారితోపాటు మొత్తంగా 44,064 దరఖాస్తులు, ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 1,03,530 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో పురుషులు 47,687 మంది కాగా మహిళలు 55,843 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,43,754 మందికి చేరింది. అందులో మహిళా ఓటర్లు 13,67,000, పురుషులు 13,76,754 మంది ఉన్నారు. ఈ నెల 31న ఓటరు తుదిజాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరి పేర్లున్నాయో... ఎవరివి లేవో సరిచూసుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలు ఖరారు పోలింగ్‌బూత్‌ల ఏర్పాటు ప్రక్రియ కూడా ఓ కొలిక్కివచ్చింది. మూడు నెలల క్రితమే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. అనుకూలంగా ఉన్న వాటి వివరాలతో నివేదిక సమర్పించారు. వచ్చే ఎన్నికల కోసం జిల్లాలో 3,393 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటి మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. -
కంగ్రాట్స్
ముగ్గుల పోటీలో విజేతకు మిక్సీ అందిస్తున్న దృశ్యం ఇది..ఇందులో విశేషమేముందంటారా.. బహుమతి ఇచ్చే వ్యక్తిని బాగా చూడండి.. గుర్తు పట్టలేదా.. ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్‌లాల్.. వీరబ్రహ్మంగారిని దర్శించునేందుకు ఆదివారం బి.మఠం వచ్చినప్పుడు నిర్వాహకులు ఇలా ఆయన చేత బహుమతులు ఇప్పించారు. -న్యూస్‌లైన్, బి.మఠం -
యువతా..బీ రెడీ...
ఈ ఏడాదిలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాలి. - కడపలో ‘ఓటే మా బ్రహ్మాస్త్రం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్న మాటలివి. వైవీయూ, న్యూస్‌లైన్ : యువత ఓటుహక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పి. భన్వర్‌లాల్ అన్నారు. శనివారం నగర శివారులోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఓటే మా బ్రహ్మాస్త్రం’ అన్న అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈ ఎన్నికల్లో యువత ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. యువత ఓటుహక్కును వినియోగించుకుంటే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కందుల శివానందరెడ్డి, డెరైక్టర్ కె.ఎస్.ఎన్.రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, డీఆర్ఓ ఈశ్వరయ్య, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
16న ఓటర్ల తుది జాబితా
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇది వరకు చేపట్టిన డ్రైవ్‌కు సంబంధించి ఈ నెల 16న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భ న్వర్‌లాల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుం చి జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పు లు, కొత్తగా నమోదు కోసం వ చ్చిన దరఖాస్తుల న్నింటినీ విచారణ ఈనెల 13 లోగా పూర్తి చేసి, అప్లోడ్ చేయాలన్నారు. ఈ వి షయంలో నిర్లక్ష్యం వహించకుండా, కావాల్సినంతగా సిబ్బందిని నియమించుకోవాలని ఆయన సూచించారు. పక్రియను వేగవంతం చేసి తుది జాబితా విడుదలకు అంద రూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సారి జాబితా తప్పుల్లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఓట ర్ల జాబితా సవరణకు సంబంధించి నిధులను ఇటీవల విడుదల చేశామని, వాటిని సకాలంలో వినియోగించుకోవాలన్నారు. ఇంకా నిధుల అవసరముంటే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఓటర్లకు ఎపిక్ కార్డులను జారీ చేసేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని భన్వర్‌లాల్ తెలి పారు. ఈ కార్డులు ప్లాస్టిక్ రూపంలో ఉంటాయ ని, కావాల్సినవారు మీసేవలో తీసుకోవచ్చని చెప్పారు. 80 శాతం పూర్తి చేశాం: కలెక్టర్ కొత్తగా వచ్చిన దరఖాస్తుల విచారణను ఇప్పటికే 80శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ గిరిజాశంకర్ సీఈఓకు వివరించారు. విచారణ అనంతరం అప్‌లోడ్‌ను తక్షణమే పూర్తిచేసి తుదిజాబితా విడుదలకు సిద్ధంగా ఉంటామన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజవర్గానికి సంబంధించి ఈఆర్ఓ పోస్ట్ ఖాళీగా ఉందని, దానిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఆయన కోరారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... దరఖాస్తుల పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కావాల్సినంతగా కంప్యూటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆర్డీలు, తహశీల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్వో రాంకిషన్, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. -
అక్రమాల ‘కొండ’
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఆడలేక మద్దెల ఓడనన్నట్లుంది టీడీపీ వర్గీయుల తీరు..! బోగస్ ఓటర్లను భారీ ఎత్తున చేర్పించిన టీడీపీ.. అదే రీతిలో వ్యతిరేక పార్టీలకు ఓటేసే వారి పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నింది. ఆ క్రమంలోనే ఎలక్షన్ వాచ్ పేరిట టీడీపీ వర్గీయులతో ఓ సంస్థను ఏర్పాటుచేసి, సర్వే చేసినట్లు భ్రమింపజేసింది. తమ కార్యకర్తలతో తప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు చేయించారు. ఈ తప్పుడు ఫిర్యాదులను ఆధారాలతో భన్వర్‌లాల్‌కు వివరించి.. సైబర్ క్రైం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి కోరనున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండ నియోజకవర్గం జనాభా 2,74,716. ఇందులో మహిళలు 1,35,880, పురుషులు 1,38,836. ప్రతి వెయ్యి మంది జనాభాకు 619 మంది ఓటర్లు ఉండటం శాస్త్రీయమని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘం నిబంధల మేరకు ఉరవకొండ నియోజకవర్గంలో 1,70,0049 మంది ఓటర్లు ఉండవచ్చు. కానీ.. 1,81,195 మంది ఓటర్లు ఉన్నారు. అంటే.. 11 వేలకుపైగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు విశదమవుతోంది. ఈ అంశాన్ని కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ కూడా బాహాటంగా అంగీకరిస్తున్నారు. బోగస్ ఓటర్లను తొలగిస్తామని ప్రకటించారు. కానీ.. కలెక్టర్ ఆదేశాలను బీఎల్వోలు, తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో అమలు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం.. టీడీపీ వర్గీయుల బెదిరింపులే. ఇదొక పార్శ్వమైతే.. మరొక పార్శ్వం వ్యతిరేక పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగింపజేసేందుకు కుట్ర పన్నడం. ఉరవకొండ నియోజకవర్గంలో ఎలెక్షన్ వాచ్ సంస్థ నిర్వహించిన సర్వే.. ఏడు వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు తేలాయని, వాటిని తొలగించాలని ఫారం-7లను ఆన్లైన్లో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే తప్పులో కాలేశారు. ఓటరు జాబితా నుంచి ఒకరిని తొలగించాలంటే.. అందుకు అదే గ్రామానికి చెందిన మరొక ఓటరు ప్రతిపాదిస్తూ ఫారం-7పై సంతకం చేయాలి. ఫలానా వ్యక్తి తమ గ్రామంలో ఉండటం లేదని.. ఆయనకు మరొక ప్రాంతంలో ఓటు ఉందని, ఆయన పేరును జాబితా నుంచి తొలగించాలని ఫారం-7పై సంతకం చేసి, అధికారులకు అందించాల్సి ఉంటుంది. వీటిపై బీఎల్వో, తహశీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. ఆర్డీవోకు నివేదిక ఇస్తారు. అనర్హులని తేలితే సంబంధిత వ్యక్తుల పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన వారం రోజుల్లోగా తాను ఆ గ్రామంలోనే నివాసం ఉంటున్నట్లు, తనకు మరొక చోట ఓటు లేనట్లు అఫిడవిట్ సమర్పిస్తే, సంబంధిత వ్యక్తి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించరు. లేనిపక్షంలో తొలగిస్తారు. కానీ.. ఎలెక్షన్ వాచ్ ఆన్లైన్లో చేసిన ఫిర్యాదుల్లో ఈ నిబంధనను ఏవీ పాటించలేదు. అయినా.. వాటిని అధికారులు పరిగణనలోకి తీసుకుని, ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు.. ఉరవకొండ నియోజకవర్గంలో ఏడు వేల మందిని ఓటరు జాబితా నుంచి తొలగించడానికి కుట్ర పన్నారు. కూడేరు మండలం కమ్మూరులో ఇంటి నంబరు 1-19లో నగరూరు పరమేశ్వరరెడ్డి నివసిస్తున్నారు. నగరూరు పరమేశ్వరరెడ్డి, ఆయన భార్య జయంతిలకు ఓటరు జాబితాలో (వరుస నం: 78, 79) పేర్లున్నాయి. కానీ.. వారు అక్కడ నివసించడం లేదని అదే గ్రామానికి చెందిన వన్నూరప్పతో ఫిర్యాదు చేసినట్లు ఎలెక్షన్ వాచ్ పేర్కొంది. కానీ.. ఆ ఫిర్యాదును తాను ఇవ్వనే లేదని వన్నూరప్ప చెబుతున్నారు. కానీ.. ఎన్నికల అధికారులు ఎలెక్షన్ వాచ్ ఫిర్యాదునే ప్రాతిపదికగా తీసుకుని.. ఆ ఇద్దరికీ ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. ఈ గ్రామంలో వారిద్దరికే కాదు.. ఏకంగా 51 మందకి నోటీసులు జారీ చేసింది. = ఇదే పద్ధతిలో ఉరవకొండ మండలం రాకెట్లలో 330 ఓట్లను తొలగించాలని ఎలెక్షన్ వాచ్ సంస్థ ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారులు ఎలెక్షన్ వాచ్ ఫిర్యాదునే ప్రాతిపదికగా తీసుకుని.. వారికి ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. ఎలెక్షన్ వాచ్ కాదు.. టీడీపీ వాచ్: ఎలెక్షన్ వాచ్ టీడీపీ ఏర్పాటు చేసుకున్న బోగస్ సంస్థ. ఆ సంస్థ ఉరవకొండలో ఎలాంటి సర్వే చేయలేదు. కానీ.. చేసినట్లు తప్పుడు మాటలు చెబుతోంది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉండే వారి పేర్లను జాబితా నుంచి తొలగింపజేసి, దొడ్డిదారిన గెలవాలని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. అందుకే ఎలెక్షన్ వాచ్ పేరుతో ఆన్లైన్లో తప్పుడు ఫిర్యాదులు చేశారు. పయ్యావుల కేశవ్‌కు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నన్ను ఎదుర్కోవాలి. దొడ్డిదారిన సైబర్ నేరాలకు పాల్పడటం సరి కాదు. ఈ అంశంపై ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేస్తా. తప్పుడు ఫిర్యాదు చేసిన వారికి శిక్షపడే వరకూ మడమ తిప్పకుండా పోరాడతాం. - వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ఉరవకొండ -
రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై నేడు ఈసీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఏర్పాట్లపై కసరత్తును ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లతో కేంద్ర డిప్యుటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, పోలింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని గుర్తించడం, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, ఈవీఎంల లభ్యత, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించనున్నారు.