కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇది వరకు చేపట్టిన డ్రైవ్‌కు సంబంధించి ఈ నెల 16న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భ న్వర్‌లాల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ నుం చి జిల్లా కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పు లు, కొత్తగా నమోదు కోసం వ చ్చిన దరఖాస్తుల న్నింటినీ విచారణ ఈనెల 13 లోగా పూర్తి చేసి, అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ వి షయంలో నిర్లక్ష్యం వహించకుండా, కావాల్సినంతగా సిబ్బందిని నియమించుకోవాలని ఆయన సూచించారు.
పక్రియను వేగవంతం చేసి తుది జాబితా విడుదలకు అంద రూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సారి జాబితా తప్పుల్లేకుండా ఉండేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఓట ర్ల జాబితా సవరణకు సంబంధించి నిధులను ఇటీవల విడుదల చేశామని, వాటిని సకాలంలో వినియోగించుకోవాలన్నారు. ఇంకా నిధుల అవసరముంటే ప్రతిపాదనలు పంపాల్సిందిగా కలెక్టర్లకు సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజు ఓటర్లకు ఎపిక్ కార్డులను జారీ చేసేందుకు చ ర్యలు తీసుకుంటున్నామని భన్వర్‌లాల్ తెలి పారు. ఈ కార్డులు ప్లాస్టిక్ రూపంలో ఉంటాయ ని, కావాల్సినవారు మీసేవలో తీసుకోవచ్చని చెప్పారు.
80 శాతం పూర్తి చేశాం: కలెక్టర్
కొత్తగా వచ్చిన దరఖాస్తుల విచారణను ఇప్పటికే 80శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ గిరిజాశంకర్ సీఈఓకు వివరించారు. విచారణ అనంతరం అప్‌లోడ్‌ను తక్షణమే పూర్తిచేసి తుదిజాబితా విడుదలకు సిద్ధంగా ఉంటామన్నారు. జిల్లాలోని కొడంగల్ నియోజవర్గానికి సంబంధించి ఈఆర్‌ఓ పోస్ట్ ఖాళీగా ఉందని, దానిని వెంటనే భర్తీ చేయాల్సిందిగా ఆయన కోరారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... దరఖాస్తుల పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కావాల్సినంతగా కంప్యూటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని, సకాలంలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆర్డీలు, తహశీల్దార్లకు సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, డీఆర్వో రాంకిషన్, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు పాల్గొన్నారు.
16న ఓటర్ల తుది జాబితా
Published Sun, Jan 5 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement