కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి | Give KCR a report on election commision | Sakshi

కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి

Published Thu, Apr 17 2014 2:49 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM

కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి - Sakshi

కేసీఆర్ వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వండి

ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పందించారు.

నల్లగొండ కలెక్టర్‌కు రాష్ర్ట ఎన్నికల సంఘం ఆదేశం

 హైదరాబాద్: ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని టీడీపీ చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ స్పందించారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో, ఆడియోలతో నివేదికను పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను భన్వర్‌లాల్ ఆదేశించారు.

దీని ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు భన్వర్‌లాల్ ఓ నివేదిక పంపించనున్నారు. కాగా, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలపైనా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి వివరణ కోరామని, అయితే ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని భన్వర్‌లాల్ బుధవారం తెలిపారు. పార్టీల నుంచి వచ్చే వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement