ఉద్యోగాలడిగితే గొర్రెలు ఇస్తారా: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇవ్వాలని యువకులు అడుగు తుంటే గొర్రెలు, బర్రెలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ మరోసారి మోసం చేస్తున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఓయూ విద్యార్థి సంఘాల తో టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. పరాయి పాలనలో ఓయూ గేటు వరకే పోలీసులు వచ్చారని, సొంత రాష్ట్రంలో హాస్టళ్లలోనే పోలీసు క్యాంపులు పెడుతున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు పందులు పెంచుకోవడానికి ముందుకొస్తా రేమోనని ఎద్దేవా చేశారు.
జేవీ ప్రాజెక్టుల్లో అవినీతి నిరూపిస్తా: హౌసింగ్ బోర్డుకు చెందిన జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర మంత్రుల అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. విజిలెన్స్ నివేదికలను బుట్టదాఖలు చేసి, ప్రైవేటు సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలను తీసుకోవడం ద్వారా రూ.కోట్లు దండుకునే పనిలో ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్ ఉన్నారని ఆరోపించారు.