ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నందున ఆయన నటించిన చిత్రం లెజెండ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది.
భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ విజ్ఞప్తి
హైదరాబాద్: ప్రముఖ నటుడు బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ పడుతున్నందున ఆయన నటించిన చిత్రం లెజెండ్ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో సదరు చిత్రాన్ని నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది. లెజెండ్ చిత్రం టీడీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఆపార్టీ నేతలు చిత్ర ప్రదర్శనను నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు శివకుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి శుక్రవారం ఉప ఎన్నికల అధికారి దేవసేనను కలిసి ఫిర్యాదు చేశారు.