
హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్(పాత చిత్రం)
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలకు టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇస్తే భారీ ప్యాకేజీ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. టీడీపీకి మద్ధతుగా సర్వే చేస్తోన్న 15 మందిని పట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు.
హిందూపురంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైఎస్సార్‌సీపీ నేతలను ప్రలోభపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నేత నవీన్ నిశ్చల్ ఆరోపించారు. సర్వే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతల కీలక సమాచారాన్ని సేకరించడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓడిపోవడం ఖాయమన్నారు. అందుకే టీడీపీ నేతలు భయపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment