
సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి, హిందూపురం: సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినధ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి ప్రతిపక్ష కార్యకర్తలపై దాడికి దిగారు.
స్థానిక ప్రజా సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాస్తోరోకో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.