ప్రజలే నా బలం
- ప్లీనరీ సమావేశంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్
- సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
హిందూపురం అర్బన్ : ప్రజలే నాబలం.. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎవరూ తుడిచేయలేరని హిందూపురం అసెంబ్లీ నియోజవకర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో బుధవారం స్థానిక సాయిరాం ఫంక‌్షన్ హాల్ ప్రాంగణంలో మండల కన్వీనర్ బసిరెడ్డి అ«ధ్యక్షతన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ పరిశీలకులు తిప్పేస్వామి హాజరయ్యారు. ఈసందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ.. ‘హిందూపురంలో ప్రజలు నీళ్ల కోసం ఎక్కిళ్లు పడుతున్నా పట్టించుకునే నాథుడు కరువుయ్యారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని బాలకృష్ణ దంపతులు దొంగ గృహప్రవేశం చేసి ప్రజలను మభ్యపెట్టారు. గెలిచాల బాలకృష్ణ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. రెండేళ్ల క్రితం రంజాన్ మాసంలో మార్కెట్‌ను నిలువునా కూల్చి ముస్లిం సోదరులకు నిలువు నీడ లేకుండా చేసి రోడ్డున çపడేశారు. నీటికోసం, మార్కెట్ నిర్మాణం కోసం తాను «ప్రజల పక్షాన నిలిచి ధర్నా చేస్తుంటే పోలీసులతో గృహ నిర్భంధం చేయించారు. అక్రమంగా కేసులు బనాయించారు. కేసులకు భయపడేదే లేదు’ అన్నారు. ప్రజల ఆదరణ తనపై ఉన్నంత వరకు టీడీపీ వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.
అనంతరం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శివ మాట్లాడుతూ చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను నిలువునా ముంచారని ఎద్దేవా చేశారు. తర్వాత బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మరచి నిరంతరం అమరావతి అంటూ తిరుగుతన్నారని ఎద్దేవా చేశారు. కౌన్సిలర్ నాగభూషణరెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లుగా టీడీపీ నాయకులే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినా ప్రజల దాహార్తి తీర్చలేదని విమర్శించారు. మహిళ కన్వీనర్ నాగమణి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వపోయినా మద్యం ఏరులా పారిస్తోందని విమర్శించారు. రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి ప్రశాంత్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీలో పని చేసే కార్యకర్తలపై పోలీసులతో బెదిరింపులు, అక్రమంగా కేసులు బనాయిస్తే భయపడేది లేదన్నారు. చిలమత్తూరు మండల కన్వీనర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అన్ని విధాలా ఆదుకుంటానని మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు రవికిశోర్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమాన్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు షానూర్‌బాషా, ముత్తవల్లీ ఎస్‌ఎం బాషా, కన్వీనర్ నారాయణస్వామి, మహిళ కన్వీనర్ షామింతాజ్, కౌన్సిలర్లు అసీఫ్‌వుల్లా, జబీవుల్లా, అంజినప్ప, రజనీ, జయమ్మ, షాజియా, షాహతాజ్, జరీనా, బీసీ సెల్ రాము, మండల నాయకులు అన్నా సుందరాజ్, రాజారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, రామచంద్రప్ప, నారాయణస్వామి, నాగిరెడ్డి, రంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, ఆజాం, బాలాజీ, రియాజ్, నరసింహారెడ్డి, శివశంకర్‌రెడ్డి, రవికుమార్, మురళి, అజుబా, చంద్రశేఖర్, సమద్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు హనుమంతరాయప్ప, నాగమ్మ, లక్ష్మీనారాయణరెడ్డి, సరోజమ్మ, లక్ష్మీదేవి, నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు.