నేడు హిందూపురంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ | today ysrcp pleanery in hindupur | Sakshi
Sakshi News home page

నేడు హిందూపురంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ

Published Tue, May 30 2017 10:59 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

today ysrcp pleanery in hindupur

హిందూపురం అర్బన్‌ : తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక వి«ధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైఎస్సార్‌సీపీ బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున, మండల కన్వీనర్‌ బíసిరెడ్డి, మహిళా కన్వీనర్‌ నాగమణి అన్నారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఆధ్వర్యంలో బుధవారం హిందూపురంలో ప్లీనరీ సభ నిర్వహించస్తున్నట్టు వారు తెలిపారు. ఈమేరకు స్థానిక చౌడేశ్వరీ కాలనీలో సాయిరాం ఫంక‌్షన్‌ హాల్‌ వద్ద నిర్వహిస్తున్న సభకు పార్టీ పరిశీలకులు తిప్పేస్వామితో పాటు పలువురు జిల్లా నాయకులు హాజరవుతారని చెప్పారు. సభకు హాజరయ్యే వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు కుర్చోవడానికి షామియానాలు, కుర్చీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం మధ్యలో సుమారు వందమంది నాయకులు ఆసీనులు కావడానికి వీలుగా వేదిక సిద్ధం చేశారు.

ఈనేపథ్యంలో పట్టణంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్లీనరీ సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యారు. ప్రాంగణం ఎదుటే వాహనాల పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అస్తవ్యస్త పాలనతో అన్నివర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధగా ఉన్నారన్నారు. ప్లీనరీకి నియోజకవర్గం నుంచి మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, నాగభూషణరెడ్డి, నాయకులు సుందరరాజు, రామకృష్ణారెడ్డి, రాము, శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement