సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతోంది. ‘యన్.టి.ఆర్’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభకానుందని తెలుస్తోంది.
ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్ పరంగా నిరాశపరిచినా.. భారీ వసూళ్లు సాధించి మాస్ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు బోయపాటి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment