ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్,
హైదరాబాద్, లేదా ్ఛ్ఛఛ్టిజీౌఃట్చజుటజిజీ.ఛిౌఝకు మెయిల్ చెయ్యండి.
ఏ అభ్యర్థీ నచ్చనప్పుడు వారందరినీ తిరస్కరించేందుకు ‘నోటా’ ఓటు కల్పించారు. ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకోరు కదా? అటువంటప్పుడు ‘నోటా’ వల్ల ప్రయోజనం ఏమిటి? - డాక్టర్ పీవీ రామకుమార్, విజయవాడ
గతంలో అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరినీ తిరస్కరించే అవకాశం కలిగింది. ఓటరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఇది ఒక అదనపు ప్రత్యామ్నాయం మాత్రమే.
పోలింగ్ ఏజెంట్లను ప్రలోభపెట్టి బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు వేయించే అవకాశం ఉంది. దీనిని ఎలా నివారిస్తారు? -చాంద్‌భాష, ప్రొద్దుటూరు
అలా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈసారి ప్రతి బూత్‌లోనూ ‘లైవ్ వెబ్ క్యాస్టింగ్’ ఏర్పాటు చేస్తున్నాం. బూత్‌లో జరిగే వ్యవహారమంతా రికార్డు అవుతూ ఉంటుంది. ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘమే ఓటర్ స్లిప్పులు ఇస్తోంది కదా. పార్టీల అభ్యర్థులు స్లిప్పులు ఇవ్వడాన్ని నివారిస్తే బాగుంటుంది.
- ప్రకాష్, నిజామాబాద్
పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పోలింగ్‌కు 48 గంటల ముందు పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఇలా స్లిప్పుల పంపిణీ చేపడితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. అప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం.