janayudham
-
కంపెనీల సేవలో పార్టీలు
విరాళాల కోసం కార్పొరేట్లకు సాగిలపాటు పార్టీ ప్రధాన ఆదాయ వనరు కంపెనీల విరాళాలే ఎన్నికల్లో డబ్బు చూపే ప్రభావం అంతాఇంత కాదు. కోట్లు ఖర్చయ్యే ఎన్నికలను భరించాలంటే రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎన్నికల రణరంగంలో పెద్ద పార్టీల ఖర్చులే వేల కోట్లలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కానీ అంత ఖర్చు చేశామని అవి చెప్పవు. ఆయా పార్టీలకు ఇంతింత మొత్తాల్లో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి ఇవి కీలక ప్రశ్నలు. సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు, కంపెనీలు రాజకీయ పార్టీలకు భారీ మొత్తాల్లో విరాళాలు ఇస్తుంటాయి. కానీ అవి అంత భారీ విరాళాలను ఊరికే ఇవ్వవు. లక్షల రూపాయలు విరాళాలిచ్చి, కోట్ల రూపాయలు లబ్ధిగా పొందే ఉద్దేశంతోనే అవి విరాళాలిస్తుంటాయి. కార్పొరేట్ విరాళాలు 2004 -2011 మధ్య కాలంలో రూ.2008 కోట్ల ఆదాయం వచ్చిందని కాంగ్రెస్, రూ.994 కోట్ల రాబడి ఉందని బీజేపీ ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఆదాయం ఏటేటా పెరుగుతూనే వచ్చిం దని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్), ఎన్ఈడబ్ల్యూ (నేషనల్ ఎలక్షన్ వాచ్) సంస్థలు విశ్లేషించాయి. కార్పొరేట్ విరాళాలే రాజకీయ పార్టీలకు ప్రధాన ఆదాయ వనరులని ఆ సంస్థలు తెలిపాయి. ఇతరత్రా ఆదాయాలు కాంగ్రెస్ పార్టీ 2007-09 మధ్య కూపన్లు అమ్మడం ద్వారా రూ. 598 కోట్లను, ఇతర విరాళాల ద్వారా రూ. 72 కోట్లను, వీటిమీద వడ్డీ ద్వారా రూ. 38 కోట్లను సంపాదించింది. బీజేపీ రూ. 297 కోట్లు విరాళాల ద్వారా, రూ. 21 కోట్లు వడ్దీ ద్వారా సంపాదించింది. ఇవి చూస్తుంటే ఈ పార్టీల ఆదాయం ఇంతేనా అనిఆశ్చర్యమేస్తుంది. కాంగ్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పార్టీ ఎన్నికల మీద (ఈ ఎన్నికలు కాదు) కేవలం రూ. 215 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. పబ్లిసిటీకి రూ. 58 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇతరులకు రూ.56 కోట్లు ఇచ్చింది(ఆ ఇతరులు అంటే ఎవరో చెప్పలేదు). ఇక బీజేపీ తెలిపిన వ్యయ వివరాలు చూస్తే.. ఆ పార్టీ అంత పొదుపరా అనిపించక మానదు. బీజేపీ ప్రచారం మీద చేసిన వ్యయం రూ. 89.16 కోట్లు మాత్రమే. వివరాలు లేని విరాళాలు 2004-2012 మధ్య జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 87% కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిందని ఏడీఆర్ తేల్చింది. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. ఈ పార్టీలు 75 శాతం ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడిస్తాయి. కానీ ఆ పార్టీలకు తెలియని మార్గాల ద్వారా వచ్చే డబ్బు 25 శాతం దాకా ఉంటుంది. బీజేపీకి 1334 కార్పొరేట్ వ్యాపార వర్గాల నుంచి రూ. 192.47 కోట్లు వస్తే, కాంగ్రెస్‌కు 418 కార్పొరేట్ వర్గాల నుంచి రూ. 172.25 కోట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఆదాయంలో 92 శాతం, బీజేపీకి 85 శాతం ఆదాయం కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చింది. ఈ పార్టీలకు ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలు (రూ.99.71 కోట్లు) అత్యధికంగా విరాళాలిచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం (రూ. 24.1 కోట్లు) తరువాతి స్థానంలో ఉంది. కమ్యూనికేషన్ రంగం నుంచి రూ. 13.26 కోట్లు, షిప్పింగ్ రంగం నుంచి రూ. 3.67 కోట్లు జాతీయ పార్టీలకు అందాయి. కాంగ్రెస్‌కు ట్రస్ట్స్ అండ్ గ్రూప్ కంపెనీల నుంచి రూ. 70.28 కోట్లు అందితే, బీజేపీకి ఎక్కువగా ఉత్పత్తి రంగం నుంచి రూ. 58.18 కోట్లు అందింది. జాతీయ పార్టీలకు రూ.25.28 కోట్లు విరాళంగా ఇచ్చిన 301 మంది దాతలు విరాళాల పత్రంలో తమ పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్), చిరునామా, ఇతర వివరాలివ్వలేదు. వివరాలు చెప్పకుండా రూ. 22.53 కోట్ల రూపాయల గుప్తదానాలు చేసిన వారిలో 273 మంది బీజేపీకి ఇచ్చిన వారే. విదేశీ కంపెనీల నుంచి, భారతదేశంలో కంపెనీలను అదుపు చేసే విదేశీ కంపెనీల నుంచి పార్టీలు విరాళాలు తీసుకునే వీల్లేదు. కానీ 2003-12 మధ్య కాలంలో కాంగ్రెస్, బీజేపీలు రూ. 29.26 కోట్లను విదేశీ సంస్థల నుంచి విరాళంగా తీసుకున్నాయి. సీపీఐకి రూ. 11 లక్షలే కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ. 36.41 కోట్లు ఇచ్చింది. భారతీ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భార్తీ గ్రూపు రూ.11 కోట్లు ఇచ్చింది. టోరెంట్ పవర్ లిమిటెడ్ వారు రూ. 11.85 కోట్లు ఇచ్చారు. బీజేపీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 26.57కోట్లను, టోరెంట్ పవర్ లిమిటెడ్ రూ. 13 కోట్లను, ఆసియా నెట్ హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 10 కోట్లను ఇచ్చారు. మూడు కార్పొరేట్ కంపెనీల నుంచి సీపీఐకి రూ. 11 లక్షలు, 108 కార్పొరేట్ కంపెనీలు సీపీఎంకు రూ. 1.76 కోట్లు ఇచ్చాయి. రాజకీయ పార్టీలు వార్షిక చందాలు, సభ్యత్వ రుసుము ద్వారా ఎక్కువ మంది నుంచి విరాళాలు స్వీకరిస్తూ జనానికి జవాబుదారీగా ఉంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ గుప్పెడు కంపెనీలు ఇచ్చే భారీ విరాళాలకు ప్రలోభపడితే ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే పనిచేయాల్సి వస్తుంది. విరాళాల కోసం పార్టీలు కార్పొరేట్లకు దాసోహం అంటే.. ప్రజాస్వామ్య భారతదేశం కార్పొరేట్ పాలనలోకి వెళ్లే ప్రమాదముంది. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ -
కష్టాల కాపురం
టీడీపీని ఆదరిస్తూ వచ్చిన హిందూపురం ప్రజలు వారి గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి ఆది నుంచి పట్టం కడుతూ వచ్చారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ఎన్నికలు జరగ్గా.. అన్నిసార్లూ ఆ పార్టీ అభ్యర్థులకే అవకాశమిచ్చారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను 1989లో మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి ఓటర్లు తిరస్కరించినా.. హిందూపురం ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మరో రెండుసార్లూ ఆదరించారు. దీంతో ఎన్టీఆర్ హిందూపురాన్ని దత్తత తీసుకున్నారు. కాగా, చంద్రబాబు హయాంలో ‘పురం’ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. ఎన్టీఆర్‌ను ఆదరించిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. తాగునీరు, రహదారులు వంటి కనీస సదుపాయాలూ కల్పించలేదు. వైఎస్ సీఎం అయ్యాకే అభివృద్ధికి నోచుకుంది. మూడు దశాబ్దాల నుంచి టీడీపీ అభ్యర్థులనే గెలిపిస్తున్నా తమను పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టీడీపీకి బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు. తొమ్మిదేళ్లూ కష్టాలే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో హిందూపురం ప్రజలను కష్టాలపాలు చేశారు. నియోజకవర్గంలోని కొడికొండ వద్ద 1977లో ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఇందులో 1979 నుంచి 1998 వరకు రోజుకు సగటున మూడు వేల టన్నుల చెరకు క్రషింగ్ చేసేవారు. రోజూ సగటున 1,200 క్వింటాళ్ల చక్కెరను ఉత్పత్తి చేసేవారు. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 473 మందికి, పరోక్షంగా 1,500 కుటుంబాలకు ఉపాధి లభించేది. లాభాల్లో ఉన్న ఈ పరిశ్రమను చంద్రబాబు ప్రభుత్వం నష్టాల పాలు చేసింది. మొలాసిస్ విక్రయాల్లో పెట్టిన నిబంధన ఇందుకు కారణమైంది. నష్టాల సాకు చూపి చంద్రబాబు 1998లో చక్కెర ఫ్యాక్టరీని విక్రయానికి పెట్టారు. రూ.100 కోట్ల విలువ కలిగి... 143 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీని కర్ణాటకలోని బెల్గాంకు చెందిన చంద్రబాబు సన్నిహితుడికి సంబంధించిన రేణుకా షుగర్స్‌కు రూ.5 కోట్లకే ధారాదత్తం చేశారు. పరిశ్రమల ప్రాణం తీశాడు! హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ఎన్టీఆర్ భావించారు. తూమకుంట వద్ద 350 ఎకరాల్లో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయించారు. ఇందులో విప్రో సంస్థ 23 పరిశ్రమలను నెలకొల్పింది. దీంతో పాటు శాంతి, గోమతి స్టీల్ ప్లాంట్లు, అజాద్, శాంశరత్ ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఈ పారిశ్రామికవాడపై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసింది. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. విద్యుత్ రాయితీలను ఎత్తేసింది. దీంతో సగానికి పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. మూడు వేల మందికిపైగా కార్మికులు రోడ్డున పడ్డారు. రైతుల పొట్ట కొట్టారు... చంద్రబాబు తన హయాంలో హిందూపురం రైతుల పొట్ట కొట్టారు. నదీ పరివాహక ప్రాంతాలను పరిరక్షించడంలో విఫలమయ్యారు. పెన్నా, కుముద్వతి, చిత్రావతి నదులపై కర్ణాటక ప్రభుత్వం 1996-98 మధ్య అక్రమంగా వందలాది చెక్‌డ్యాంలను నిర్మించినా పట్టించుకోలేదు. దీంతో ఆ నదులు ఎండిపోయాయి. నియోజకవర్గంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. ఎగువ నుంచి నీరు రాక పెన్నార్-కుముద్వతి ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. తమ నోట్లో దుమ్ముకొట్టిన బాబుకు గుణపాఠం చెబుతామని రైతులు అంటున్నారు. సమస్యలు తీర్చేవారికే.. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వస్తారు. మా కష్టాలు తీరుస్తామని చెబుతారు. వాటిని నమ్మి ఇన్నా ళ్లూ మేం ఒక పార్టీకే ఓట్లు వేస్తూ వచ్చాం. అయినా.. మా కష్టాలు తీర్చలేదు. ఆ పార్టీ వాళ్ల కథ ఇప్పుడు చెబుతాం. మా సమస్యలను తీర్చే పార్టీకే ఓటేస్తాం. - వెంకటలక్ష్మి, హిందూపురం. ఎమ్మెల్యే పట్టించుకోలేదు మా వీధిలో మురుగుకాలువలు పూడికతో నిండిపోయాయి. దుర్వాసన మధ్య చస్తూ బతుకుతున్నాం. ఇంతవరకు ఎమ్మెల్యే మా ముఖం చూడలేదు. ఇప్పుడు నా వద్దకు ఏ మొహం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు? - ఫకృద్దీన్,హిందూపురం. వైఎస్ హయాంలో పరుగులెత్తిన ప్రగతి హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపారు. మునిసిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని 90 శాతం గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండేది. బిందెడు నీళ్లు కావాలంటే రూ.5 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఈ సమస్యను గుర్తించిన వైఎస్.. రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని పూర్తి చేయించారు. 180 కిలోమీటర్ల దూరంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి హిందూపురానికి పైపులైన్ వేయించి.. నీటిని సరఫరా చేయించారు. ఈ పథకాన్ని ఆయన డిసెంబర్ 30, 2008న ప్రారంభించారు. 1. హిందూపురం వద్ద 55.92 ఎకరాలలో రూ.3 కోట్లతో ఆటో నగర్‌ను ఏర్పాటు చేయించారు. 2. చంద్రబాబు పాలనలో కళ తప్పిన హిందూపురం పారిశ్రామికవాడకు వైఎస్ సీఎం అయ్యాక నూతన శోభ వచ్చింది. దీనిని ఆయన 350 నుంచి 3,500 ఎకరాలకు విస్తరించారు. మౌలిక సదుపాయాలు కల్పించి, రాయితీలివ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొచ్చారు. రూ.500 కోట్లతో బెర్జర్ పెయింట్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. 3. హిందూపురాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వైఎస్ భావిం చారు. ఇందులో భాగంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సంస్థలు రూ.11 వేల కోట్లతో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా 2008లో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే, వైఎస్ హఠాన్మరణంతో ఆ పరిశ్రమలు ఏర్పాటుకు నోచుకోలేదు. 4. హిందూపురం వద్ద ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్(ఐఐఎస్సీ) రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి 2008లో కేంద్రాన్ని వైఎస్ ఒప్పించారు. ఆయన మరణంతో కేంద్రం దానిని పక్కన పెట్టింది. -
శాసనసభాపక్ష నేతగా.. ప్రజల పక్షాన...
భర్త చాటు గృహిణిగా, కుటుంబమే తన లోకంగా ఉంటూ వచ్చిన వైఎస్ విజయమ్మ అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి దక్షత గల నేతగా ఎదిగారు. నాలుగున్నరే ళ్ల ప్రజా జీవితంలో ఢక్కా మొక్కీలు తిన్నా, ప్రజల తరపున పోరాడే నేతగా ఆమె రాణిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంత వరకూ ఆమె ఏనాడూ ఎండ మొహం చూసి ఎరుగలేదు. వైఎస్ మరణించాక పుట్టెడు కష్టాలు ఎదురైనా, కుంగి పోకుండా భర్త ఆశయాల సాధన కోసం తనయుడు జగన్ తనపై మోపిన బాధ్యతలను ఆమె ఎంతో సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. కాంగ్రెస్ కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసినప్పుడు విజయమ్మ ప్రతిపక్ష పాత్రను సమర్థంగా పోషించారు. దీటైన ప్రతిపక్ష నేతగా శాసనసభలో రాణించారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలోనూ, ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రతిఘటించడంలోనూ ఆమె ఏనాడూ వెనుకాడలేదు. ప్రజల కోసం ముందుండి వైఎస్సార్ శాసనసభా పక్షాన్ని అందరూ ఆశ్చర్యపడేలా నడిపించారు. శాసనసభా పక్ష నేతగా, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలిగా, సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరపున పోరాడే ఉద్యమకారిణిగా ఆమె పలు బాధ్యతలను మోశారు. తనయుడు జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీకి దిశా నిర్దేశం చేశారు. వైఎస్ మరణంతో ఖాళీ అయిన పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి తొలిసారి ఆమె అసెంబ్లీలోకి అడుగు పెట్టినపుడు అమాయకంగా క నిపించినా, ఆమె దీక్షా దక్షతలు, పోరాట పటిమ ఏమిటో అనతికాలంలోనే అందరికీ బోధపడింది. శాసనసభా పక్ష నేతగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలిగానే కాక, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కూడా ఆమె పగ్గాలు చేపట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యుత్ చార్జీలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడమే కాక, ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు పూనుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలసి ఐదురోజులు సాగించిన దీక్ష రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. కీలక సమయాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడకుండా ముఖం చాటేసినా విజయమ్మ మాత్రం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నిరంకుశంగా రాష్ట్ర విభజనకు పూనుకున్నప్పుడు ఆమె పార్టీ ఎమ్మెల్యేలతో కలసి తుదికంటా సమైక్యత కోసం పోరాడారు. ప్రతి బీఏసీ (శాసనసభా వ్యవహారాల సలహా మండలి) సమావేశాలకు హాజరై ప్రజావాణిని వినిపించారు. విభజన బిల్లు కేంద్రం నుంచి శాసనసభకు రాకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తీర్మానం చేద్దామని ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి నచ్చజెప్పేందుకు ఆమె పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. విభజన బిల్లు విషయంలో అప్పటి సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒక అవగాహనతో ఉండటంతో విభజనను ఆపడం సాధ్యం కాలేదు. పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో... కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైల్లో పెట్టించినపుడు విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా నిర్వహించిన పాత్ర అనన్య సామాన్యం. కొత్త పార్టీ నిర్మాణానికి సంకల్పించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు, బూత్, గ్రామ స్థాయి నుంచి కమిటీల ఏర్పాటు వంటి వాటిపై ఆమె దృష్టిని పెట్టారు. పదే పదే సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచి ముందుకు ఉరికేలా చేశారు. జగన్ జైలు నుంచి విడుదలయ్యేంత వరకు ఆయన లేని లోటు తెలియకుండా పోరాటాలు చేశారు. ఫీజుల పథకాన్ని నీరు గారుస్తున్నందుకు, ఆరోగ్యశ్రీ నుంచి పలు వ్యాధులను తొలగించినందుకు, తుపాను, కరవు బారిన పడిన రైతాంగానికి పరిహారం ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు నిరసనగా ఆమె ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు దీక్షలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా దీక్ష, ఫీజుల కోసం దీక్ష, రైతుల కోసం దీక్ష వంటివెన్నో చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమె నిరశన దీక్ష చేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా, ఈ నాలుగున్నరేళ్ల వ్యవధిలో ప్రజలతో మమేకమై పరిణతి చెందిన నేతగా మన్ననలందుకున్నారు. -
తిప్పల కుప్పం
నిత్యం ఏడు వేల వుంది నిరుద్యోగుల వలస మంచినీటి కోసం వ్యవసాయు బోర్లపై ఆధారం గొంతెండుతున్నా పటి ్టంచుకోని చంద్రబాబు టీడీపీని గెలిపిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తావుంటున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాటల్లో డొల్లతనం.. కుప్పం నియోజకవర్గాన్ని చూస్తే తెలుస్తుంది. ఆయన పాతికేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో చేసింది తక్కువ. చెప్పుకునేది ఎక్కువ. వుూడు దశాబ్దాలుగా ఇక్కడి ఓటర్లు టీడీపీకి పట్టం కడుతున్నా జనం కష్టాలు కడతేరడం లేదు. ఇప్పటికీ 200లకు పైగా గ్రామాలు బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారుు. సాగునీరు లేక రైతులు కూలీలుగా మారారు. జనం వలసబాట పట్టారు. మాటలతో కోటలు కడుతున్న చంద్రబాబు తీరును ఆయన నియోజకవర్గం ప్రజలు ఎండగడుతున్నారు. కన్నీటి కష్టాలు నియోజకవర్గంలో 200 పైగా గ్రామాల్లో మంచినీటి సమస్య జఠిలంగా ఉంది. 510 స్కీమ్ బోర్లకు గాను 310 ఎండిపోయాయి. దాంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. శాంతిపురం, కుప్పం తదితర మండలాల్లో నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ట్యాంకర్ రూ.400 చొప్పున ప్రజలు రోజుకు రూ.లక్ష నీటి కోసం వెచ్చిస్తున్నారు. క్యాన్లు, ప్యాకెట్ల వ్యాపారం మరో రూ. 30 వేల దాకా ఉంది. కుప్పానికి 8 కి.మీ. దూరంలోని వేపనపల్లె వద్ద బుడ్డిగాని చెరువు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. రూ. 40 లక్షలు వెచ్చించి ఎత్తిపోతల పథకం ద్వారా దాహార్తిని తీర్చేందుకు పదేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉండగానే అంచనాలు రూపొందించినా నిర్మాణం చేయులేకపోయూరు. కుప్పానికి 12 కి.మీ. దూరంలోని ఓఎన్ కొత్తూరు వద్ద అటవీ ప్రాంత చెరువుల్లోనూ నీరు పుష్కలంగా ఉన్నా వాడుకలోకి తేలేకపోయూరు. శాంతిపురం మండలంలో పాలారు నదిపై ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఐదేళ్లకు సరిపడే స్థారుులో నీటి నిల్వకు వీలుండేది. తమిళనాడు అభ్యంతరంతో పనులు ఆగినా బాబు పట్టించుకోలేదు. రహదారులు అధ్వానం 1. అడుక్కో అతుకు.. గజానికో గతుకు.. అన్నట్టుగా రోడ్లున్నారుు. 2. ఆర్టీసీ డిపో నష్టాల్లో కూరుకుపోరుు చాలా బస్సు సర్వీసులను ఇతర డిపోలకు తరలించారు. 3. డిపోను సబ్-డిపోగా కుదించే కసరత్తు పూర్తి చేశారు. సీఎంగా ఉన్నపుడూ.. చేసింది శూన్యమే పదెకరాల ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 2001లో వేసిన శిలాఫలకం వెక్కిరిస్తూనే ఉంది. ఒక్క పరిశ్రవు కూడా ఏర్పాటు కాలేదు. ఆ తర్వాత వుూడేళ్లు సీఎంగా ఉన్నా.. సెరి పార్కు, మార్కెట్ యార్డు నిర్మాణానికి నోచుకోలేదు. పట్టు రైతుల కోసం రూ.2 కోట్ల తో జపాన్ సహకారంతో చేపట్టిన సెరిపార్కు ప్రాజె క్టు వుధ్యలోనే ఆగిపోయింది. బాబు సీఎంగా ఉండగా ఇజ్రాయిల్ టెక్నాలజీ డెమో ప్రాజెక్టు ప్రారంభించారు. తక్కువ నీటితో పంటలు పండించే ఈ ప్రాజెక్టుకు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. రైతులకు అందజేసిన నాణ్యత లేని డ్రిప్ పరికరాలు, సాంకేతిక లోపాల వల్ల కోట్ల రూపాయుల ప్రజాధనం వృథా అయ్యింది. రాజపేటలోని కార్యాలయం దగ్గర రూ. లక్షల విలువైన యంత్రాలు ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉండటమే ఇందుకు సాక్ష్యం. ‘కడా’ కడే.. కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా)ని ఏర్పాటు చేసిన చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆఫీసు దాదాపు మూతపడింది. చంద్రబాబు కుప్పం కార్యదర్శి మనోహర్ జేబులు నింపేందుకే ‘కడా’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న కడా భవనాల్లో వైఎస్ సీఎం అయ్యాక ఐటీఐ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపయోగపడేలా చేశారు. టీడీపీ ‘బోగస్’ బాగోతం కుప్పంలో టీడీపీ భారీగా బోగస్ ఓట్లను చేర్పించి ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ వారు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని బంధువుల పేరిట ఇక్కడ ఓట్లు నమోదు చేయి స్తున్నారు. ఇలా 10-20 వేల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడులోని అరసనాపురం పంచాయుతీ గొల్లపల్లె గ్రామస్తులు వెయ్యి వుందికి పైగా కుప్పం మండలం కంగుందిలో ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు సరిహద్దులోని పెద్దవంకలో అధిక బోగస్ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. తేడా గమనిస్తున్న ఓటర్లు బోగస్ ఓట్లతో ప్రతిసారీ గెలుస్తున్న టీడీపీకి ఈసారి కుప్పం ఓటర్లు వుుచ్చెవుటలు పట్టించబోతున్నారు. చంద్రబాబు-వైఎస్ ప్రభుత్వాల్లో తేడాలను గుర్తించిన ఫలితంగా టీడీపీ ఎదురీదుతోంది. ప్రధానంగా రైతులు, మహిళలు, యుువత వైస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల లబ్ధిదారులు కూడా ఇప్పుడు రుణం తీర్చుకోనున్నారని పలువురు చెబుతున్నారు. సీఎంగా ఉన్నా డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు 2002లో బాబు ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. కాన్పుల యూనిట్లో సదుపాయూలు లేక వృథాగా మారింది. ఆస్పత్రి కమిటీ చైర్మన్ హోదాలో చంద్రబాబు ఆ కమిటీ సవూవేశాన్నే నిర్వహించలేదు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి అభివృద్ధికి వూత్రం ఆయన తోడ్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని 2002లో విద్యార్థులందరూ కలిసి చంద్రబాబును కోరినపుడు.. ‘కుప్పంకు ఏమి చేయూలో నాకు తెలుసు..’ అని నోళ్లు మూయించారు. నీళ్ల కోసం కష్టాలు గ్రామంలో తాగునీరు లేక నాలుగు నెలలుగా అవస్థ పడుతున్నాం. స్థానిక సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ధర్నా చేసినా పట్టించుకోలేదు. - జయమ్మ, ఎం.శాంతంపల్లె, శాంతిపురం మండలం వ్యవసాయ బోర్లే దిక్కు ఊళ్లోని మంచినీటి బోరు ఎండిపోయింది. కిలోమీటరు దూరంలోని వ్యవసాయ బోర్లే ఆధారం. కరెంటు కోతల కారణంగా రైతులు బోర్ల వద్దకు రానివ్వడం లేదు. - మునెమ్మ, బ్రాహ్మణ కొత్తూరు, శాంతిపురం మండలం -
నిషేధ పర్వంలో విషం
1986 ప్రాంతాల్లో ‘న్యూఢిల్లీ టైమ్స్’ అనే హిందీ సినిమా మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. తనకు తెలియకుండానే ఒక ప్రముఖ దినపత్రిక సంపాదకుడు ఎలా తన పత్రిక యాజమాన్యమూ, రాజకీయ వర్గాలూ ఆడిన నాటకంలో పావుగా మారాడో అర్థం చేసుకుని సినిమా చివరి సీన్లో చెప్పే డైలాగ్ ‘ఐ హావ్ బీన్ యూజ్డ్’ (నన్ను వాడుకున్నారు.) పత్రిక యాజమాన్యం, కొన్ని రాజకీయ వర్గాలూ అతనికి ఉద్దేశపూర్వకంగా అందించిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆయన రాసే రాతలు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు కారణమై చివరకు మారణకాండకు దారితీసి అది యాజమాన్యానికి, ఆ రాజకీయ వర్గానికి లాభం చేకూరుతుంది. అది తెలుసుకున్న సంపాదకుడు తన పదవికి రాజీనామా చేస్తాడు. మీడియా యాజమాన్యా లు కొన్ని సందర్భాల్లో రాజకీయాలను ఎట్లా శాసిస్తాయో, రాజకీయ శక్తులు మీడియాను తమ ప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగ పరుస్తాయో చెప్పడానికి ‘న్యూఢిల్లీ టైమ్స్’ సినిమా మంచి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి సంఘటనలు మనకు అనేకం కనిపిస్తాయి. సామాన్య పాఠకులకు, మీడియా వెలుపల ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో ఇవి అర్థంకావు, మరికొన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఎటువంటి రాతలు రాస్తున్నారో.1992 అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కరరెడ్డి రాష్ట్రానికి ఆ టర్మ్‌లో కాంగ్రెస్ సీఎంగా నియమితుడయ్యాక సరిగ్గా ఒక సంవత్సరానికి మద్య నిషేధాన్ని కోరుతూ ప్రారంభమైన ఉద్యమం, ఆ ఉద్యమం సాగిన తీరు దానిని పత్రికా యాజమాన్యాల మధ్య ఆర్థిక పోరాటంగా మలచి చివరికి అత్యంత పాఠకాదరణ పొందిన ఒక ప్రముఖ దినపత్రిక పూర్తిగా చతికిలబడిపోయిన వైనం నేను జర్నలిస్ట్‌గా ఉండి స్వయం గా చూశాను. తన అవసరాల కోసం మీడియా ఎలాగైనా వ్యవహరించగలదనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆంధ్రప్రభ దినపత్రికలో బ్యూరోచీఫ్‌గా ఉన్న నాకు ఒకరోజు పొద్దున్నే ఇంకా దినపత్రికలు తెరిచి చూడకముందే (అప్పట్లో టీవీ న్యూస్ చానళ్లు లేవు. ఉదయం దినపత్రికలు చదవితేనే వార్తలు తెలిసేది) మా ఎడిటర్ నుంచి ఫోన్. ఈనాడు చూడండి బ్రదర్, కవరేజీలో మనం ఫెయిల్ అయ్యాం అని. ఏమిటా అని చూస్తే ఆ రోజు ఈనాడు పతాక శీర్షికన ప్రచురించిన వార్త నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ అనే మహిళ నాయకత్వంలో మద్యం మీద మహిళలు ప్రారంభించిన యుద్ధానికి సంబంధించినది. నేను వెంటనే నెల్లూరు జిల్లాలో మా విలేకరులతో మాట్లాడాను. ఆందోళన జరిగిన మాట వాస్తవమే, మద్యం దుకాణాల మీద దాడికి ప్రయత్నం జరిగిన మాటా వాస్తవమే కానీ పతాక శీర్షికన ప్రచురించేంత తీవ్రత లేదన్నారు మా విలేకరులు. వార్త ‘మిస్’ అయ్యాం కాబట్టి అట్లా చెబుతున్నారేమోనని ఆ జిల్లాలో తెలిసిన వారు కొందరికి ఫోన్లు చేసి తెలుసుకున్నా. వాళ్లూ అదేమాట చెప్పారు. ఈనాడు అక్కడితో ఆగితే బాగుండేది. కానీ దాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. తన విలేకరులను పురమాయించి మద్య నిషేధ ఉద్యమం లేని చోట కూడా నలుగురిని ప్రేరేపించి పత్రికల్లో వార్తలు వస్తాయని రెచ్చగొట్టి కొన్ని సంఘటనలు జరిగేట్టుగా జాగ్రత్త పడుతూ వచ్చింది. చివరకు ఈనాడు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రభావంతోనే ప్రతిపక్ష నాయకుడు ఎన్టీ రామారావు మద్యనిషేధం తన ప్రధాన ప్రచారాస్త్రంగా స్వీకరించి 1994 ఎన్నికలకు ప్రచారం కోసం బయల్దేరారు. ఆయన వాహనం మీద తెల్లజెండా అందులో మహాత్మాగాంధీ చిత్రం మద్యనిషేధ ప్రచారానికి ప్రతీకగా నిలిచింది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రభ సహా ఇతర పత్రికలన్నీ అర్థం చేసుకున్నాయి. ఈనాడు ప్రచారం చేస్తున్న స్థారుులో ఆ ఉద్యవుం లేదని, అందుకే ఆ తరువాత మిగిలిన పత్రికలేవీ దాన్ని అంతగా భుజాన వేసుకోలేదు. సంపాదకులకు త్వరలోనే పరిస్థితి అర్థం అరుు్యంది. అది ఈనాడు ఎజెండా, ఈనాడు ద్వారా తెలుగుదేశం ఎజెండా కాబట్టి వునం అంతగా బట్టలు చించుకోనక్కర్లేదని ఎడిటర్లే స్వయుంగా చెప్పారు. అయినా ఈనాడు రాస్తున్న స్థారుులో ఉద్యవుం ఉందేమో అనిపించి ఎడిటర్ అనువుతితో ఒక వారం రోజులు రాష్ట్రంలోని వుూడు ప్రాంతాలు స్వయుంగా తిరిగాను. అప్పుడు అర్థం అరుు్యంది. ఇదంతా ఈనాడు యూజవూన్యం ఒక లక్ష్యంతో చేస్తున్న పని అని. చివరకు ఈనాడు ప్రచార ఉధృతికి కాంగ్రెస్ సర్కార్ కూడా తలొగ్గి తొలి చర్యగా రాష్ట్రంలో సారారుుని నిషేధించింది. అరుునా ఈనాడు, టీడీపీ ప్రచారం ఆగలేదు. ఎన్నికల దాకా కొనసాగించింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఎన్.టి.రావూరావు సీఎంగా చేసిన మొదటి నిర్ణయుం రాష్ట్రంలో సంపూర్ణ వుద్యపాన నిషేధం. 1995 జనవరి 16 నుంచి రాష్ట్రంలో వుద్య నిషేధం అవులులోకి వచ్చింది. ఇప్పుడిక ఈనాడు యాజమాన్యం రహస్య ఎజెండా గురించి మాట్లాడుకోవాలి. 1984 డిసెంబర్లో ఉదయం దినపత్రిక ప్రారంభం కావడం కావడమే ఈనాడు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు దినపత్రికారంగంలోనే ఆ నాటికి ఏజెంట్లు డిపాజిట్లు ముందే చెల్లించి లక్ష కాపీల సర్కులేషన్‌తో ప్రారంభమైన పత్రిక ఇంకోటి లేదు. దాసరి నారాయణరావు యాజమాన్యంలో ప్రారంభమైన ఆ దిన పత్రిక ప్రారంభం నుంచే ఈనాడు యాజమాన్యానికి పోటీగా నిలిచి గంగవైలెత్తించింది. దాంతో ఈనాడు యాజమాన్యం.. వార్తలతో పోటీ పడే బదులు ఉదయం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ఆలోచనలో పడింది. దాసరి నారాయణరావు యాజమాన్యంలోనే కొనసాగితే ఈనాడు కోరిక నెరవేరేదే. కానీ ఆయన ఉదయం నడపలేకపోయారు. యాజమాన్యం మారి కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు మాగుంట సుబ్బరామిరెడ్డి చేతికి వచ్చింది. సుబ్బరామిరెడ్డి మద్యం వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఉదయం నిర్వహణకు ఆర్థిక ఇబ్బంది ఏమీ లేదు. ఈనాడుకు పోటీగా నిలిచిన ఉదయం మూతపడాలంటే సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి. అది జరగాలంటే మద్యనిషేధం రావాలి. భావోద్వేగాల నడుమ ఎన్టీఆర్ ఈనాడు యాజమాన్యం అసలు పథకం గురించి ఆలోచించలేకపోయారు. రహస్య ఎజెండా అమలు అయింది. మద్య నిషేధం కారణంగా సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలమీద తగినంత దెబ్బ పడింది. ఈలోగా నక్సలైట్లు అకారణంగా ఆయనను హతమార్చారు. ఉదయం దిక్కులేనిదయింది. పైగా సీఎంగా ఉన్న చంద్రబాబుపై నిషేధం ఎత్తివేతకు అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరిగింది. మద్యం వ్యాపారుల ఒత్తిడి అన్నిటికంటే ఎక్కువగా బాబు మద్యనిషేధాన్ని ఎత్తివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చెబుతారు. ఆధారాలు లేక వార్తలు రాయలేకపోయాం. ఈనాడు ఎజెండా కూడా అమలు అయింది. కాబట్టి మద్యనిషేధం ఎత్తివేసిన తరువాత ఆ పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో ఒక సంపాదకీయం రాసి ఈనాడు మద్యనిషేధ ఉద్యమాన్ని వొదిలించుకుంది. చేతులు దులుపుకుంది. తాను అంత పవిత్రయుద్ధంగా భావించి అమలు చేయించిన మద్యనిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంపై ఈనాడు ‘పెన్నెత్తి’ ఒక్కమాట కూడా రాయలేదు. (38 సంవత్సరాల జర్నలిజం వృత్తి అనుభవాల కూర్పుగా త్వరలో రానున్న ‘నేను ఎవరు’ పుస్తకంలోని ఒక భాగం ఇది) -
కుప్పం అభివృద్ధిపై వైఎస్ ముద్ర
ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం అయినప్పటికీ కుప్పం అభివృద్ధికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగానో కృషి చేశారు. చంద్రబాబు హయాంలో కుప్పంలో కాలేజీ విద్య ఇంటర్మీడియట్ వరకే ఉండేది. వైఎస్ సీఎం అయ్యాక డిగ్రీ, ఐటీఐ, వృత్తి విద్యా కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రతి వుండలంలో కస్తూర్బా పాఠశాలలను ప్రారంభించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు.. విద్యార్థినులకు ప్రత్యేక హాస్టళ్లను నెలకొల్పారు. బాబు పాలనలో నియోజకవర్గానికి ఏటా 300 పక్కాగృహాలు మాత్రమే మంజూరయ్యేవి. వైఎస్ హయాంలో 40 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆరు వేలకు పైగా పింఛన్లు మంజూరు చేశారు. బాబు హయాంలో పది వేల రేషన్‌కార్డులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్యను వైఎస్ 25 వేలకు పెంచారు. కుప్పం ప్రజల చిరకాల కోరిక అరుున పాలారు ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకాలకూ కుప్పంలోనే బీజం వేశారు. 2004 ఫిబ్రవరిలో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద జరిగిన ఎన్నికల సభలో తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఫైల్‌పై మొదటి సంతకం చేసామని వైఎస్ ప్రకటించారు. అలాగే 2006 డిసెంబర్లో బైపాస్‌రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభ కు సీఎం హోదాలో హాజరైన వైఎస్... ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రకటించారు. -
ఇక మిగిలింది 24 గంటలే..
ప్రచార హోరు సద్దుమణిగింది. ఇంకో ఇరవై నాలుగు గంటలే ఉంది. ఓటరు అన్నీ విన్నాడు. అందరి తీరూ కన్నాడు. విజ్ఞతతో తన తీర్పు వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో జరుగుతున్న చరిత్రాత్మక ఎన్నికలివి. కొద్ది వారాలుగా సాగిన ప్రచార సరళి రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దం పడుతోంది. ఒకే ఒక్కడిగా నిలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా సాగిన అడ్డూ అదుపూ లేని కుట్రలను చూసి రాష్ట్రమంతా విస్తుపోయింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ హద్దులన్నింటినీ చెరిపేస్తూ ఆయనపై తీవ్రరూపుదాల్చిన మూకుమ్మడి దాడిని చూసి అసహ్యించుకుంది. జగనే లక్ష్యంగా ఈసారి అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం తేడాలన్నీ పక్కన పెట్టి మరీ ఒక్కటయ్యాయి. విలువలన్నిటినీ ఏనాడో వదిలేసిన ఒక వర్గం మీడియా జతకూడింది. అంతా కలిసి ముఠా కట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన మరుక్షణం నుంచీ ఆయన వారసుడిపై ముప్పేట దాడికి దిగారు. వైఎస్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని, గత నాలుగున్నరేళ్లుగా కనీవినీ ఎరగని స్థాయిలో వేధింపులకు దిగారు. రాజకీయంగానే గాక వ్యక్తిగతంగానూ, మానసికంగానూ రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసి వికృతానందం పొందారు. తండ్రి ఆకాంక్షలను నెరవేరుస్తానన్నందుకు, ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినందుకు జగన్‌పై కత్తి కట్టారు. అడ్డగోలు కేసులతో వేధించారు. అక్రమంగా నిర్బంధించారు. న్యాయం కోరుతూ వైఎస్ సతీమణి విజయమ్మ సహా కుటుంబ సభ్యులంతా నడిరోడ్డుపై బైఠాయించాల్సిన, అది చూసి రాష్ట్రమంతా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. సోనియాగాంధీ మొదలుకుని నరేంద్ర మోడీ దాకా... చంద్రబాబు మొదలుకుని రామోజీ దాకా... ఆవలివైపు మోహరించిన శక్తులు ఆషామాషీవి కాదు. కులం, మతం, ధనం, అధికారం... అవి ప్రయోగిస్తూ వచ్చిన అస్త్రాలూ అలాంటిలాంటివి కాదు. అయినా సరే... ఆ శక్తులన్నింటికీ తానొక్కడై సమాధానమిచ్చారు జగన్. ప్రజల ఆదరణే శ్రీరామరక్షగా వాటి పన్నాగాలన్నింటినీ ఒంటిచేత్తో తిప్పి కొట్టారు. ఒకవైపు వైఎస్ విజయమ్మ, మరోవైపు సోదరి షర్మిల వెంట రాగా రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రజా తీర్పు కోరారు. నాలుగున్నరేళ్ల పరిణామాలను బేరీజు వేసి వారినే న్యాయం చెప్పమన్నారు. సీమాంధ్ర ప్రజ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. ప్రచార పర్వం పొడవునా ఆయన సభలకు, రోడ్ షోలకు మండుటెండలను కూడా లెక్కచేయకుండా అపార జనవాహిని నిరంతరం పోటెత్తింది. విజయమ్మకు, షర్మిలకు ఊరూరా మంగళారతులు పట్టింది. కొద్ది వారాలుగా వైఎస్ జగన్‌పై ఎంత అడ్డగోలు దాడి జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ప్రజల చేత శాశ్వత తిరస్కరణకు గురైన పచ్చ బాబుల తరఫున వకాల్తా పుచ్చుకుని ఒక పత్రికాధిపతి పడుతున్న పడరాని పాట్లను గమనిస్తూనే ఉన్నాం. పేజీలకు పేజీలు జగన్నామస్మరణ చేస్తున్న వైనం... ప్రతి వాక్యంలోనూ వైఎస్, జగన్ అనే పదాలు లేకుండా కనీసం ఏ రోజూ సంపాదకీయం కూడా రాయలేని స్థితికి దిగజారిన తీరు కళ్లముందే కన్పిస్తోంది. ఎటుచూసినా కొట్టొచ్చినట్టు కన్పిస్తున్న వైఎస్ జగన్ ప్రభంజనాన్ని ఎలాగోలా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రచార పర్వం పొడవునా సాగిన కుటిల యత్నాలను, అధికార-ప్రతిపక్ష శక్తుల బరితెగింపుతనాన్ని, మీడియా ముసుగులో వెల్లువెత్తుతున్న అడ్డగోలు రాతల్లోని డొల్లతనాన్ని ‘జనాయుధం’ ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే వచ్చింది. నిజానిజాలను నిత్యం పాఠకుల ముందుంచింది. విజ్ఞులైన ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ సాగిన ఈ కనీవినీ ఎరగని అడ్డగోలు దాడి లక్ష్యమేమిటో, జుగుప్స పుట్టించే రాతల లోగుట్టేమిటో వారికి తెలియనిది కాదు. ఇప్పుడిక ఓటరు తన చూపుడు వేలితో అం తిమ తీర్పు వెలువరించాల్సిన సమయం సమీపించింది. కొత్తగా ఊపిరి పోసుకోనున్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపగల సమర్థ నాయకుడిని ఎంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది... ఓటు రూపంలో మన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని విచక్షణతో ప్రయోగించాల్సిన సమయమిది. విశ్వసనీయతకు ఓటేసి, మహానేత మనకు చవిచూపిన స్వర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిన వేళ ఇది. -
ఆ స్వరం ...సమైక్యం
జనం గొంతుకైన ఒకే ఒక్కడు కటకటాల్లోంచే సమైక్య శంఖారావం దేశమంతటినీ ఒక్కటి చేసేలా ఉద్యమం జాతీయ స్థాయిలో సమైక్యానికి మద్దతు ‘విభజించండి గానీ, సరిహద్దు రాళ్లూ అవీ కాస్త స్పష్టంగా కన్పించేలా వెనకా ముందూ చూసుకుని విభజించండి’ అని చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతి ఒకరు ‘విభజిస్తారా?’ అంటూ ఆవేశపడుతూనే, ముఖ్యమంత్రి హోదాలో విభజనకు అన్ని విధాలా సహకరించి తరించిన... ముసుగు వీరుడు, ఉత్తర కుమారుడు మరొకరు కొన్ని ఓట్లు, కాసిన్ని సీట్లే పరమావధిగా హస్తిన పెద్దల పుర్రెలో పురుడు పోసుకున్న పన్నాగంలో సీఎంగా కిరణ్, విపక్ష నేతగా చంద్రబాబు పాత్రధారులుగా మారారు.పుట్టిన గడ్డకే ద్రోహం చేసిన పరమ కిరాతకులుగా, తమ ప్రాంత ప్రయోజనాలు అస్సలు పట్టని పచ్చి స్వార్థపరులుగా చరిత్రలో మిగిలిపోయారు. అలాంటి సమయంలో... ఒకే ఒక్కడు. సీమాంధ్రకు నేనున్నానంటూ ముందుకొచ్చాడు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. విలువలకు నిలువెత్తు రూపమతడు. విశ్వసనీయతకు చెరగని చిరునామా అతడు. ఆ ఒకే ఒక్కడు... మహానేత వారసుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అధికార ప్రతిపక్షాలు ఒక్కటై సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగాడు. కుట్రలు చేసి తనను కటకటాల పాలు చేసినా అక్కడి నుంచే పిడికిళ్లు బిగించాడు. అన్నపానీయాలు మాని ఆమరణ దీక్షకు దిగాడు. హస్తిన చేస్తున్న అన్యాయంపై గళమెత్తాడు. సీమాంధ్ర అంతటా కలియదిరిగి సమైక్య శంఖారావం పూరించాడు. జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసి ఢిల్లీ పాలకులను నిలదీశాడు. అడ్డగోలు విభజనను అడ్డుకోవాల్సిందిగా కోరి దేశమంతటినీ కదిలించాడు. దేవెగౌడ మొదలుకుని శరద్ యాదవ్ దాకా ముఖ్యమైన జాతీయ స్థాయి నేతలందరి గడపా తొక్కాడు. సమైక్యానికి వారందరి మద్దతూ కూడగట్టాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశాడు. స్వయంగా వెళ్లి వినతిపత్రాలు సమర్పించాడు. విభజనతో వినాశనమేనని సోదాహరణంగా వివరించాడు. విభజన బిల్లును అనుమతించొద్దంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశాడు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచండంటూ గవర్నర్‌ను కలిసి కోరా డు. అడ్డగోలు విభజనను నిరసిస్తూ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. పదవులను వదులుకుని సమైక్యోద్యమంలోకి దూకారు. ఆయన మాతృమూర్తి వైఎస్ విజ యమ్మ సమైక్యం కోసం నిరాహార దీక్ష చేశారు. సీమాంధ్ర అంతటా పర్యటించారు. జగన్ సోదరి షర్మిల సీమాంధ్ర అంతటా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల ఆందోళనతో గొంతు కలిపారు. వారి గొం తుకై నిలిచారు. జగన్ స్వయంగా లోక్‌సభలోనూ సమైక్యనాదం చేశారు. సీమాంధ్ర గుండెచప్పుడును చట్టసభల్లో ప్రతిధ్వనింపజేశారు. సమైక్యాంధ్ర చాంపియన్‌గా, సీమాంధ్రకు ఏకైక ఆశాజ్యోతిగా నిలిచారు. వైఎస్ వారసుని రాక కోసం సీమాంధ్ర ప్రజ కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోందిప్పుడు.. -
జనం గొంతుకైన షర్మిల
అన్న వైఎస్ జగన్, తల్లి విజయమ్మ బాటలోనే షర్మిల కూడా సమైక్య శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ 4వ వర్ధంతి సందర్భంగా గత సెప్టెంబర్ 2 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. విభజన వల్ల ఎన్ని నష్టాలో, అలాంటి విభజనకు అటు చంద్రబాబు, ఇటు కిరణ్ ఎలా కారణమయ్యారో వివరిస్తూ సీమాంధ్ర అంతా కలియదిరిగారు. ‘కొడుకును ప్రధాని చేయడానికి కోట్లాది సీమాంధ్రులకు అన్యాయం చేసేందుకు సోనియా పూనుకున్నారు. ఇక... తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోని చంద్రబాబు, హత్య చేసి, శవంపై వెక్కి వెక్కి ఏడ్చిన చందంగా బస్సు యాత్ర చేస్తారట’ అంటూ తూర్పారబట్టారు. ప్రజల ఆందోళనలో భాగస్వామి అయ్యారు. జనం గొంతుకగా మారారు. -
సమైక్యం కోసం విజయమ్మ పోరు
ఏకపక్షంగా జరుగుతున్న రాష్ర్ట విభజనను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఓవైపు జనంలో ఉండి పోరాడుతూనే, వురోవైపు పార్టీ తరఫున ప్రధాని వున్మోహన్‌సింగ్‌కు, హోంవుంత్రి సుశీల్ కువూర్ షిండేకు పలు లేఖలు రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డివూండ్ చేస్తూ కిందటేడాది ఆగస్టు 19న గుంటూరు వేదికగా ఆవురణదీక్షకు దిగారు. సెప్టెంబర్ 6, 11న షిండేకు లేఖలు రాశారు. విభజనను రాష్ర్టంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రాన్ని యుథాతథంగా ఉంచాలని అందులో కోరారు. అంతకుముందు ఆగస్టు 14న ప్రధానికి లేఖ రాశారు. విభజనను మీరైనా ఆపాలంటూ ఆగస్టు 27న రాష్ట్రపతి ప్రణబ్ వుుఖర్జీని స్వయుంగా కలిసి విన్నవించారు. -
వైఎస్ జగన్ మాట
‘ఆంధ్రప్రదేశ్ విభజన కోసం జరిగే ఏ ప్రయుత్నాన్నయినా వ్యతిరేకించాలనేది వూ పార్టీ విధానవుని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర విభజన కోసం చేపట్టే ఏ చర్యనైనా మేం వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర వుంత్రివర్గం 2013 అక్టోబర్ 3న తీసుకున్న నిర్ణయుం వూకు ఏ వూత్రమూ సవ్ముతం కాదు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్నారు.’ - కేంద్ర హోంశాఖకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో.. ‘ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనపై యూవద్దేశవుూ ఆలోచించాలి. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశే కాదు.. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు కర్ణాటకను, తమిళనాడును కూడా విభజించే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన చేయుడం న్యాయువూ? విభజన విషయుంలో టీడీపీ-కాంగ్రెస్ కువ్ముక్కు అందరికీ తెలుసు. చరిత్రహీనుడు కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా బాబు సమైక్య ఉద్యవుంలో కలసి రావాలి.’ - సమైక్య రాష్ట్రం కోసం ఆవురణ నిరాహార దీక్ష సందర్భంలో.. ‘నేను కేంద్రప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మొదట 2014 ఎన్నికలు పూర్తి చేయుండి. నేను, నా పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటాం. ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపడతాం. 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. 2014 ఎన్నికలనే రెఫరండంగా తీసుకునే దవుు్మ మీకుందా?’ - జాతీయు స్థారుు నేతలను కలుస్తున్న సందర్భంగా చెన్నైలో.. ‘ఓట్ల కోసం, సీట్ల కోసం ఆడే ఈ రాజకీయు క్రీడ వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే.. దిగువన ఏర్పడే రాష్ట్రం వునిషి చేసిన ఎడారి అవుతుంది. తవు నిర్ణయూల వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా అధికార కాంగ్రెస్ పెద్దలు నియుంతృత్వ పోకడ లతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. నా రాజీనావూతో, వూ పార్టీ వారు చట్టసభలకు చేసిన రాజీనావూలతో ఈ నిరంకుశ నిర్ణయుంలో ఏమైనా వూర్పు వస్తుందేమోనన్న ఆశతో రాజీనావూ చేస్తున్నాం.’ - ఎంపీ పదవికి రాజీనావూ చేసిన సందర్భంలో.. ‘రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల వుుందు తరాలకు శతాబ్దాల తరబడి తీవ్ర హాని కలుగుతుంది. కేంద్ర నిర్ణయుం ప్రజలకు బ్రిటీష్ వారి 1905 నాటి బెంగాల్ విభజనను గుర్తుకు తెస్తోంది. నాడు కర్జన్ అనుసరించిన ‘విభజించి.. పాలించు’ అనే కుటిల నీతినే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది.’ - కేంద్ర వుంత్రుల బృందానికి పంపిన లేఖలో.. ‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయుంపై జరుగుతున్న ఈ పోరాటానికి జాతీయు పార్టీలన్నీ వుద్దతివ్వాల్సిన అవసరముంది. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సవుస్య వూత్రమే కాదు. కాంగ్రెస్ తలబిరుసుతనాన్ని, నిరంకుశ వైఖరిని, ద్వంద్వ విధానాన్ని, ఆధిపత్యవాదాన్ని తెలుగు ప్రజలు నేడు సవాలు చేస్తున్నారు. ప్రజాస్వావ్యుంలోనూ, ప్రజాభీష్టంలోనూ విశ్వాసవుున్న ప్రతీ పార్టీ ఈ విభజనను ప్రతిఘటించాల్సి ఉంది.’ - సమైక్య పోరుకు వుద్దతు కోరుతూ వావుపక్షాలకు లేఖ.. ‘రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరాటం చేద్దాం. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి వుధ్య పోరా టం. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీ స్థానాలు గెలుచుకుని ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. 30 ఏళ్ల క్రితం ఈ దేశ పౌరసత్వం తీసుకున్న సోనియూకే ఈ దేశంపై ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసున్న తెలుగు ప్రజలను విడదీస్తే వునకెంత బాధగా ఉంటుంది.’ - హైదరాబాద్‌లో జరిపిన సమైక్య శంఖారావం సభలో.. -
సమైక్య ఉద్యమ ఏకైక సారథి జగనే..
సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో అనేక మంది నాయుకులు సీమాంధ్ర జనజీవనంతో ఆటలాడుకున్నారు.. ప్రచారం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేశారు. రాష్ట్రం ముక్కలవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏమవుతుంది.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదముంది. ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. అని ఆందోళన చెంది రాష్ట్ర పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేసింది.. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పి.తిమ్మారెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమంలో నేతల పాత్రలపై ఆయన అభిప్రాయాలు ఇవీ... విభజన అంశం ఎన్నో ఏళ్లుగా నానుతున్నా... రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎగసిపడింది. ఇదే అసలైన సమైక్య ఉద్యమవుని చెప్పవచ్చు. అరుుతే జనానికి బాసటగా నిలవాల్సిన పార్టీలు, నేతలు ఉద్యవూన్ని సొవుు్మ చేసుకునేందుకు వుహానాటకాలాడారుు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల్లోనూ తన పార్టీ ఉనికి కోసం రెండు కళ్ల సిద్ధాంతం పేరిట డ్రామాలాడారు. రెండు ప్రాంతాల్లో తవుు్మళ్లతో వీధి పోరాటాలు చేయించారు. అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సమైక్యసింహవునే స్థారుులో.. క్రికెట్లో చివరి బంతి ఉందంటూ చేసిన హడావుడి అంతాఇంతాకాదు. చివరిరోజు వరకు సీఎం పదవిని అనుభవించి ఆ తర్వాత బయటికొచ్చి ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ అని తిరుగుతున్నారు. కానీ ప్రజలకు ఎవరేమిటో బాగా తెలుసు. అందుకే ఆయన మీటింగ్‌లకు ఎవరైనా వెళ్తున్నారా.. మూడేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని సరిగ్గా నెలరోజులు తిరక్కముందే జనం మరిచిపోయారంటే కిరణ్‌కు జనంలో ఉన్న విలువ ఏపాటిదో స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. జనమే వాళ్ల గురించి ఆలోచించడం లేదు. మరి సమైక్య రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిందెవరనే ప్రశ్న వస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డేనని అంతా చెబుతున్నారు. రాష్ట్రా న్ని విడగొట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ జైలులో ఉండి అక్కడే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని మరీ సమైక్యం కోసం పోరాటం చేశారు. జైలు నుంచి విడుదలయ్యూక ఆమరణదీక్ష చేపట్టారు. ఇక విజయమ్మ కూడా గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారంటే సమైక్యం పట్ల వారికున్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబులా జగన్ రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. ఎక్కడైనా సమైక్యమే నినాదమన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధే తన ప్రాణమన్నారు. అందుకే జనవుంతా ఆయన్ను సొంతమనిషిగా భావిస్తున్నారు. ఆయున వస్తే నీరాజనాలు పలుకుతున్నారు. పి. తిమ్మారెడ్డి -
విభజన ‘వారధి’
చంద్రబాబు ‘రెండు కళ్ల’ సిద్ధాంతమే ఆంధ్రప్రదేశ్‌కు శాపమైంది. ఆయనది మొదట్నుంచీ ‘విభజన’ రాగమే. ఆయన నోటి నుంచి ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే రాలేదు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అభ్యంతరమూ చెప్పలేదు. వైఎస్ ఉన్నంత కాలం బాబు కుయుక్తులు సాగలేదు. అనంతరం ఆయన రెచ్చిపోయారు. విభజన కుట్రలకు పదును పెంచారు. తెలుగుజాతికి ద్రోహం చేశారు. చంద్రబాబుదే విభజన పాపం మల్లు విశ్వనాథరెడ్డి సీమాంధ్రలో సగటు ఓటరుకు సింగపూర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేవు. చిత్తూరు జిల్లా కుప్పం వాసులు మంచినీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. గొంతు తడుపుకునే మార్గం లేక కిలోమీటర్ల కొద్దీ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా చంద్రబాబు మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతున్నాయి. సీమాంధ్ర ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతుంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ పంచరంగుల సినిమా చూపిస్తున్నారు. విభజించేదాకా వెంటబడ్డ బాబు రాష్ట్రం విడిపోకుండా ఉంటే సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలుండేవి. చంద్రబాబుకు మాత్రం రాష్ట్రం కలిసి ఉండటం ఇష్టం లేదు. అందుకే విడగొట్టాలని పంచాయతీ పెట్టారు. రాష్ట్రాన్ని విడదీసే వరకు ఆయన విశ్రమించలేదు. కర్నాటక ప్రాజెక్టులు నిండితే గాని మన ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా వస్తాయో అర్థంకాని పరిస్థితి. అయినా రాష్ట్రాన్ని విడగొట్టాలనే బాబు పట్టుబట్టారు. ఒక్కమాటల చెప్పాలంటే.. ‘ఇదిగో విడగొట్టమని లేఖ ఇస్తున్నా.. తీసుకోండి’ అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత ‘ఇంకెప్పుడు విడగొడతారంటూ కేంద్రం వెంటపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్లు కూడా అందించే ఏర్పాటు చేయలేని చంద్రబాబు.. అదేదో ఉట్టికి ఎగరలేనమ్మ.. అన్న తీరులో ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ రాష్ట్ర విభజన విషయంలో మీ అభిప్రాయమేంటని అడిగినప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఆనాడు ‘మాకిష్టం లేదు.. మేం ఒప్పుకోం.. అంగీకరించే ప్రసక్తే లేదు’ అని ఒక్క మాట.. ఒకే ఒక్క మాట చెప్పి, అదేమాటపై నిలబడి ఉంటే విభజన జరిగేదే కాదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇవ్వడంతోనే కేంద్రం ప్రభుత్వం విభజన వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించడంలో తొలి ముద్దాయి కాంగ్రెస్ అయితే మలి ముద్దాయిగా చంద్రబాబు నిలిచారు. విభజనకు టీడీపీ అనుకూలంగా ఉందని పేర్కొంటూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడంతో మొదలు.. విభజనకు ముందు జరిగిన ఆఖరి అఖిలపక్షం వరకు.. చంద్రబాబు విధానం విభజనకు అనుకూలంగానే సాగింది. ఏ దశలోనూ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. పైగా కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ఢిల్లీ పెద్దలు ఆడమన్నట్లుగా ఆడారు. సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఆయన కేంద్రంపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. విభజన పాపాన్ని కడిగేసుకోవడానికైనా సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీల కోసం పట్టుబట్టాల్సిన చంద్రబాబు.. సొంతలాభం కోసం సీమాంధ్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. వెంటాడుతున్న విభజన పాపం చంద్రబాబు సహకారం వల్లనే రాష్ట్ర విభజన సులభమైందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తనపై ఉన్న కేసులకు సంబంధించి సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు సహకరించారని భావిస్తున్నారు. సీమాంధ్రలో టీడీపీని విభజన పాపం వెంటాడుతోంది. విభజనకు సహకరించడంతో పాటు సీమాంధ్ర ప్రయోజనాలను గాలికి విడిచిపెట్టిన చంద్రబాబు తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆగ్రహం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయేమోనని టీడీపీ నేతలు భయపడుతున్నారు. చంద్రబాబు లేఖల చరిత్ర 2008 అక్టోబర్ 18: తెలంగాణకు టీడీపీ అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ 2012 సెప్టెంబర్ 26: తెలంగాణ అంశంపై తాత్సార ధోరణి తగదని, శ్రీకష్ణ కమిటీ సూచన మేరకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అక్కడికక్కడే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ. 2012 డిసెంబర్ 27: గతంలో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదని, అదే వైఖరికి కట్టుబడి ఉన్నామంటూ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖను సమర్పించిన పార్టీ ప్రతినిధి బృందం. 2013 నవంబర్ 12: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీవోఎం) ఏర్పాటు చేసిన అన్ని పార్టీల సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయిం చిన టీడీపీ.. విభజనలో గత సంప్రదాయాలు పాటించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసింది. - తెలంగాణకు అనుకూలంగా అక్టోబర్ 18, 2008న అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి చంద్రబాబు రాసిన లేఖ - గతంలో రాసిన లేఖను ధ్రువీకరిస్తూ 27.12.2012న కేంద్ర హోంమంత్రి షిండేకు బాబు రాసిన మరో లేఖ -
కన్నీటి గాథలు
మా ఉసురు తగులుతుంది.. 2013 అక్టోబర్ 17వ తేదీ టీవీలో వార్తలు చూసిన మానాన్న తలారి ఆండ్రూస్ (49) రాష్ట్రం విడిపోతే కేసీ కెనాల్ కింద మాకున్న రెండెకరాల పొలానికి నీళ్లు రావని ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేక మా అమ్మ ఆనందమ్మ అనారోగ్యంతో అస్పత్రిపాలయింది. అప్పటినుంచి మేము పంటలు సాగు చేసుకోలేక అప్పులపాలయ్యాం. కూలీ పనులతో వచ్చిన సొమ్ము తిండిగింజలకే సరిపోతుంది. అమ్మ ఆరోగ్యం బాగాలేదు. నాన్న ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవాడు. ఆయన పోయినప్పటినుంచి ఇబ్బందులు పడుతున్నాం. పాత అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు మా ఉసురు తగలక మానదు. రాష్ట్రం విడిపోకపోతే మానాన్న మాతో ఉండే వాడు. మా కుటుంబం సంతోషంగా ఉండేది’ రెండుగా చూడలేక.. పోయాడు బతుకు దెరువు కోసం మా ఆయన ఏపూరి రమణ మమ్మల్ని తీసుకుని ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. బాచుపల్లిలోని ఒక ప్రైవేటు ఏజెన్సీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. తెలంగాణ వస్తుందని.. ఇక్కడ పని చేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వెంటనే వెళ్లిపోవాలని కంపెనీ యాజమాన్యం పలుమార్లు ఒత్తిడి చేసింది. ఈ విషయంపై ఇంటికి వచ్చి నాతో చెప్పుకొని బాధపడేవాడు. గత జులై 9వ తేదీన రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటూ తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకునేందుకు నేనూ..నాభర్త ఇద్దరు పిల్లలను తీసుకొని తిరుపతి బయలుదేరాం. కాలినడకన తిరుమల మెట్లు ఎక్కుతుండగా మార్గమధ్యంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడు. అప్పటినుంచి ఇంటి పెద్దదిక్కును కోల్పోయి మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విభజనకు కారకులైనవారు మూల్యం చెల్లించుకుంటారు. - రాధమ్మ, రామళ్లకోట(వెల్దుర్తి), కర్నూలు జిల్లా ఈ పాపం ఊరికే పోదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం మా కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేసింది. నా భర్త రేగళ్ల శ్రీనివాసరావు విజయవాడ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మొదటి నుంచి సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమంలో తిరిగి అస్వస్థతకు గురైన ఆయన రోజూ ఇంటికొచ్చి రాష్ట్ర విభజన గురించి బాధపడేవారు. ఒకరోజు ఉద్యమంలో పాల్గొని ఇంటికొచ్చి టీవీలో రాష్ట్ర విభజనపై వస్తున్న కార్యక్రమాలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. నాకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం చదువుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఏ బెనిఫిట్స్ లభించలేదు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యూటీ కూడా కార్పొరేషన్ అధికారులు ఇవ్వలేదు. పిల్లల ఫీజులు కట్టలేక, ఇంటిపై ఉన్న బ్యాంకు రుణం తీర్చలేక ఎన్నో అవస్థలు పడుతున్నాను. విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీల పాపం ఊరికే పోదు. - రేగళ్ల రాధ, విద్యాధరపురం (విజయవాడ) -
ఒకే ఒక్కడు సమైక్యయోధుడు
తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేశారు. తెలుగు నాది.. తెగువ నాది.. తలదించని పౌరుషం నాది.. అంటూ ముందుకు కదిలారు. ప్రజల గొంతుకై సమైక్యనాదాన్ని మోగించారు. రాష్ట్రపతి, ప్రధాని.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్య నేతలను కలిసి సమైక్య పరిరక్షణకు సహకరించమని కోరారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలు.. బీజేపీ సహకారం వల్ల రాష్ర్టం ముక్కలైపోయింది. సమైక్యస్ఫూర్తితో ఉద్యమించిన జగన్ మాత్రం.. ప్రజల మనసుల్లో ఒకే ఒక్కడుగా నిలిచారు. ‘గత 60ఏళ్లుగా పెనవేసుకున్న ఈ అనుబంధాన్ని అర్థం చేసుకోవాలి. కోట్లాది మంది తెలుగు ప్రజలను కొన్ని తరాలపాటు అధోగతి పాలు చేసే ఈ రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుతల్లి’ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి 2013, సెప్టెంబర్ 13న మంత్రుల బృందానికి రాసిన లేఖ గరికిపాటి ఉమాకాంత్ ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) గత ఏడాది జూలై 30న తీసుకున్న నిర్ణయం దరిమిలా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అలుపెరుగని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డే. జైల్లో ఉన్నా.. జనంలో ఉన్నా సమైక్యమే లక్ష్యంగా ఉద్యమించారు. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో ఆరునెలల పాటు అవిశ్రాంత పోరాటం చేశాయి. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, బంద్‌లు, సమ్మెలు, రిలే, నిరవధిక దీక్షలు... ఇలా వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. మరో పక్క జగన్మోహన్రెడ్డి జైలు నుంచి విడుదలైన వెంటనే జాతీయస్థాయి నేతలను కలిసి రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండేందుకు సహకరించాలని కోరారు. పార్లమెంటులో టీ బిల్లు ఆమోదం పొందే చివరిక్షణం వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవిశ్రాంత పోరాటం చేశారు. ఇదే సందర్భంలో రెండుకళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు, సమైక్య ముసుగులో అప్పటి సీఎం కిరణ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం జగన్ వెంటే ఉన్నారు. ఆయన ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఎక్కడున్నా సమైక్యమే శ్వాసిస్తూ.. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కోట్లాది ప్రజలు ఉద్యమిస్తుంటే.. అధికార, ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల ఆక్రందనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే... అదిచూసి ఆవేదన చెందిన జగన్ ప్రజాఉద్యమానికి మద్దతుగా చంచల్‌గూడ జైల్లోనే దీక్ష చేపట్టారు. ఆరోగ్యం విషమించినా లెక్కచేయక నిరశన కొనసాగించారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో జైలువర్గాలు ఆయన్ను బలవంతంగా నిమ్స్‌కు తరలించాయి. అక్కడ కూడా ఆయన నిరశన కొనసాగించారు. ఆరోగ్యం పూర్తిస్థాయిలో క్షీణించడంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన ఆయన లోటస్‌పాండ్ వద్ద తిరిగి నిరవధిక నిరాహారదీక్ష చేశారు. జననేత దీక్షలకు నీరా‘జనం’ జైలులోనూ, ఆ తర్వాత లోటస్‌పాండ్ వద్ద నిరశన దీక్షలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీమాంధ్ర ప్రజ నీరాజనం పలికింది. పార్టీలు, రాజకీయాలకతీతంగా అన్నివర్గాల ప్రజలు సంఘీభావం ప్రకటించారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జగనన్నకు మద్దతుగా దీక్షా శిబిరాలు పోటెత్తాయి. విజయమ్మ నిరశనతో దీక్షాంధ్ర రాష్ట్ర విభజను నిరసిస్తూ గతేడాది ఆగస్టులో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయక సమైక్యమే లక్ష్యంగా ఆమె చేపట్టిన దీక్షకు చలించిన పార్టీ శ్రేణులు సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో ఎక్కడికక్కడ దీక్షలకు దిగాయి. ఐదురోజుల తర్వాత ఆమెఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలతో భేటీ దేశంలో ఇంతకుముందు ఏ రాష్ట్రాన్ని విభజించినా శాసనసభ అనుమతి పొందాకే ప్రక్రియ చేపట్టేవారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకు విరుద్ధంగా చేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయస్థాయి నేతలను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వివరించారు. చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన అధ్య క్షుడు ఉద్దవ్ థాకరే, కోల్‌కతా వెళ్లి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ రాజధాని పాట్నాలో నితీశ్‌కుమార్, లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్‌లతో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం బాదల్‌ను కూడా కలిసి కేంద్రం వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక తీరును వివరించారు. ఇక ఢిల్లీలో మాజీ ప్రధాని దేవెగౌడ, వామపక్ష అగ్రనేతలు సీతారాం ఏచూరి, ప్రకాష్‌కారత్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌లతో భేటీ అయ్యారు. ఢిల్లీలోనూ మార్మోగిన సమైక్యం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేపట్టారు. ధర్నా ప్రదేశం నుంచి పార్లమెంటు వరకు ర్యాలీకి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కుప్పం నుంచి సమైక్య యాత్ర రెండుకళ్ల సిద్ధాంతంతో ప్రజలను ఏమార్చిన చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచే జగన్ ‘సమైక్య శంఖారావం’ యాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రమంతా పర్యటించి సమైక్య స్ఫూర్తిని రగిలించడంతో పాటు ఉద్యమ ఆవశ్యకతపై ప్రజలను చైతన్యం చేశారు. విభజనలో టీడీపీ, కాంగ్రెస్‌ల కుమ్మక్కు కుట్రలను ప్రజలకు వివరిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. రాజధానిలో సమైక్య శంఖారావం హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పేరిట భారీ బహిరంగసభ నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల నుంచే కాక తెలంగాణలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా సభకు లక్షలాది మంది సమైక్యవాదులు తరలివచ్చారు. షర్మిల బస్సు యాత్ర ‘సమైక్యం’పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు జగన్ సోదరి షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి నాడు ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరుపతికి వెళ్లి సమైక్యశంఖారావం సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి చిత్తూరు, మదనపల్లె సభల్లో పాల్గొని కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారు. ఆ తర్వాత అనంతపురం, కర్నూలు, కోస్తా జిల్లాల్లోనూ షర్మిల బస్సుయాత్ర కొనసాగింది. ఎమ్మెల్యేల రాజీనామాల బాట రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచన మేరకు జూలై నెలాఖరులోనే 16మంది వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖలు రాసి ఆయన కార్యాలయానికి ఫ్యాక్స్ పంపారు. ఎమ్మెల్యే పదవులను తృణప్రాయంగా వదిలి సమైక్య ఉద్యమంలోచురుగ్గా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల ఉద్యమపథం ‘సమైక్య’ డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణతో సమైక్య పోరాటాన్ని ఉధృతం చేశారు. సీమాంధ్ర జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. పార్టీ శ్రేణులకు తోడుగా సమైక్యవాదులు ఊరూ వాడా ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, జాతీయ రహదారుల దిగ్బంధనం చేపట్టడంతో సీమాంధ్ర ఓ దశలో అట్డుడికింది. ఇక జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమప్రభంజనం సృష్టించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖలు.. వినతిపత్రాలు విభజన తీరును గర్హిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మలు పలుమార్లు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు లేఖలు రాశారు. ఢిల్లీ వెళ్లి వినతిపత్రాలు సమర్పించారు. ఏకాభిప్రాయం లేకుండా ఎలా విభజిస్తారంటూ కేంద్రహోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. అదే లేఖను ఆ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఆ తర్వాత వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలు ఢిల్లీ వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిలను స్వయంగా కలిసి వినతిపత్రాలు అందజేసి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి హెదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన్ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము విభజనకు వ్యతిరేకమంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా సమైక్యంపై తీర్మానం చేసేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను జగన్ సెప్టెంబర్ 30వ తేదీన కలిశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును పెట్టొద్దంటూ స్పీకర్ మీరాకుమార్‌కు లేఖ రాశారు. -
కిరణ్.. నిండా ముంచారు
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... సీఎం పదవిని అడ్డుపెట్టుకుని సీమాంధ్ర పాలిట అక్షరాలా సైంధవ పాత్ర పోషించారు. విడదీసేందుకు వీల్లేదని పైకి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తూనే లోలోన విభజనకు కావాల్సిన రంగాన్నంతా సిద్ధం చేశారు. కేంద్రం ఆడించినట్టల్లా ఆడుతూ, విభజనకు కావాల్సిన సమాచారం దగ్గరి నుంచి అన్ని రకాల సాయమూ ఎప్పటికప్పుడు అం దించి సహకరించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు శల్య సారథ్యం వహించారు. వారి నుంచి అధిష్టానానికి ఎలాంటి ఇబ్బం దులూ తలెత్తకుండా కాపు కాశారు. ‘విభజన బిల్లు రాకముందే మేల్కొందాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం’’ అని సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా మొత్తుకున్నా కాకమ్మ కథలతో వారించారు. రాజీనామాలన్నా చేద్దామన్నా, ‘అసెంబ్లీలో సమైక్య గళాన్ని ఎవరు విన్పిస్తా’రంటూ దానికీ అడ్డుపడ్డారు. విభజనను ఆపేందుకు బ్రహ్మాస్త్రముంది లెమ్మంటూ బీరాలు పలికారు. చివరికి విభజన బిల్లుపై అసెంబ్లీలో సజావుగా చర్చ జరిగేలా, అది సభ అభిప్రాయంతో పాటుగా రాష్ట్రపతికి తిరిగి వెళ్లేలా దగ్గరుండి అన్ని జాగ్రత్తలూ తీసుకుని తరించారు. -
గొంతెత్తి.. ఎలుగెత్తి
* విభజన వద్దని పోరాడిన ఏకైక నాయకుడు జగనే * చంద్రబాబుది గోడమీద పిల్లివాటం * అసెంబ్లీలో నోరు విప్పకపోవడమే ప్రత్యక్ష నిదర్శనం * ఆనాడు పవన్ కల్యాణ్ గొంతు మూగబోయిందా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన వల్ల సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొదటి నుంచి వాదించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. సీపీఎం కూడా సమైక్యానికే కట్టుబడినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం సాగించింది మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే. బాబు అవకాశవాదం విభజనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా అడ్డగోలు విభజనపై కనీసం పెదవి విప్పని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట్లాడుతున్న తీరు ఆయన అవకాశవాద రాజకీయాలను తేటతెల్లం చేస్తోంది. విభజన నష్టాలపై గొంతెత్తింది జగనే రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర నష్టపోతుందని, యువత ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతుందని, ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడుతుందని వైఎస్ జగన్ ఆది నుంచి వివిధ సందర్భాల్లో వివరిస్తూ వచ్చారు. అందు వల్లే విభజనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టాలపై జగన్ పేర్కొన్న అంశాలివీ... హైదరాబాద్ నగరం గత 60 ఏళ్లుగా మొత్తం 23 జిల్లాలకు కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి పోవాలి? 60 ఏళ్లుగా తెలుగు ప్రజలందరి సమష్టి కృషి ఫలితంగానే నేడు హైదరాబాద్ రాబడి రాష్ట్ర బడ్జెట్లో సగానికి పైగా ఉంది. రాష్ట్ర విభజనతో ఉద్యోగుల వేతనాలు చెల్లించడమే సీమాంధ్ర ప్రభుత్వానికి కష్టమవుతుంది. నిధుల కొరత వల్ల అభివృద్ధి, సంక్షేమం కుంటుపడుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు నేడు హైదరాబాద్‌లోనే ఉపాధి పొందుతున్నారు. పొదుపు చేసిన మొత్తాలను ఇక్కడే మదుపు చేశారు. విభజన జరిగి ఆ పెట్టుబడుల విలువ ఒక్కసారిగా పడిపోతే సీమాంధ్రులే నష్టపోతారు. రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న జల వివాదాలు తీవ్రతరమవుతున్నాయి. ట్రిబ్యునళ్లు, కోర్టు తీర్పులు, ఆదేశాలు, వాటర్‌బోర్డులు ఉన్నా తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జల వివాదం చెలరేగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలను బేఖాతరు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూనే ఉంది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక తమ అవసరాలు తీరిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు (ఉమ్మడి రాష్ట్రానికి) నీరు వదులుతామంటున్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే.. విభజిస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? విభజనతో రాష్ట్రంలో కృష్ణా నది ప్రవహించే ప్రాంతం వెంబడి తరచుగా ఘర్షణలు తలెత్తవా? కృష్ణా ఆయకట్టుకు నీరు ఎలా అందిస్తారు? గోదావరి జలాల సంగతేమిటి? పోలవరం ప్రాజెక్టుకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మిగులు జలాలపై ఆధారపడి నిర్మిం చిన, నిర్మిస్తున్న ప్రాజెక్టుల గతి ఏమిటి? ట్రిబ్యునళ్లు, బోర్డులు నిరర్థకమైనవి కావడం వల్ల సమైక్యంగా ఉండగానే రాష్ట్రం దుర్భిక్షానికి, వరద బీభత్సానికి గురవుతూ వస్తోంది. రాష్ట్రాన్ని విభజిస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది. మరో జలమండలి లేదా వాటర్‌బోర్డు ఏర్పాటు చేయడం దేనికి తోడ్పడుతుంది? కృష్ణా జలాల వినియోగంపై బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి పూర్తి హక్కులు ఇచ్చినా, వాటిని విస్మరించి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆ హక్కును మహారాష్ట్ర, కర్ణాటకలకు కట్టబెట్టింది. రాష్ట్ర విభజన జరగబోతుందన్న వార్తలతో అప్పుడే ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు మిగులు జల్లాల్లోనూ, కేటాయించిన జలాల్లోనూ వాటాలు పెంచాలని కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విభజన జరిగితే తెలుగు ప్రజలపై మరింత దుష్ర్పభావం చూపక తప్పదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ సముద్రపు ఉప్పునీరు తప్ప తాగడానికి మంచినీరు ఏదీ? ఎక్కడి నుంచి నీరు ఇస్తారు? రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెలిగొండ, హంద్రీ - నీవా, గాలేరు - నగరి సుజల స్రవంతి పథకాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా ఆయకట్టులో నీటి కోసం రోజూ ప్రజలు కొట్టుకునే పరిస్థితి రాదా? ఉన్నత విద్య, ఉపాధి కోసం సీమాంధ్ర యువత హైదరాబాద్‌పైనే ఆధారపడి ఉంది. పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లాలంటే సీమాంధ్ర యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లాలి? రాష్ట్ర బడ్జెట్లో రూ. 90 వేల కోట్లు వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్ నుంచే వస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 55 శాతం, కేంద్రానికి రాష్ట్రం నుంచి వెళుతున్న పన్నుల్లో 65 శాతం కేవలం హైదరాబాద్ నుంచే జమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి ఇంత డబ్బు ఖజానాకు రాకపోతే... వృద్ధాప్య పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్తు, రూపాయికే కిలో బియ్యం తదితర సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంటు సాక్షిగా సమైక్య నినాదం లోక్‌సభలో మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి పతాక శీర్షికల్లో నిలిచారు. రాష్ట్రం ముక్కలు కాకూడదన్న ఆయన పట్టుదలకు, సమైక్యాంధ్ర పరిరక్షణకు ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారో తెలియజేప్పేందుకు.. సాక్షాత్తూ చట్టసభలో జరిగిన ఘటనే నిదర్శనం. సోనియాకు జగన్ సూటి ప్రశ్న రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియాగాంధీపై జగన్ అనేక సందర్భాల్లో ధ్వజమెత్తారు. ‘రాహుల్ ప్రధాని అయ్యేందుకు ఇక్కడి బిడ్డల జీవితాలతో ఆడుకుంటారా? ఇటలీ దేశీయురాలు సోనియా.. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకుని భారత్‌కు వచ్చారు. 30ఏళ్ల క్రితం భారత పౌరసత్వం తీసుకున్నారు.. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి విదేశీయులకు ఇచ్చిన పౌరసత్వాలన్నీ రద్దు చేస్తున్నామంటే ఇటలీ వెళ్లిపోతారా..’ అని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం సభలో జగన్ సూటిగా ప్రశ్నించడం అందరికీ గుర్తుంది. -
ఖాకీవనంలో కష్టాలగానం
ఈ ఏడాది నెలరోజుల తేడాతో 5 ఎన్నికలను పోలీసులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల వేళ సరిపడ సిబ్బంది లేకపోయినా సమస్యే. మన రాష్ట్రంలో ఈ దుస్థితి ఉంది. 1.29లక్షల మంది పోలీసులు ఉండాల్సి ఉంటే కేవలం 90,843మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరతతో పోలీసులపై మరింత పనిభారం పడుతుంది. రాష్ట్రజనాభా 8,45,80,777. కానీ రాష్ట్రంలో ఉన్న పోలీసులు కేవలం 90,843మంది మాత్రమే! దీనిని బట్టే శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారో తెలుస్తుంది. పోలీసులకు ప్రతీ ఎన్నికల్లో మూడురోజులు డ్యూటీ వేస్తారు. ఎన్నికలకు రెండురోజులు ముందు కేటాయించిన ప్రాంతానికి వెళ్లాలి. ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలకు సీమాంధ్ర నుంచి పోలీసులు 27న బయలుదేరారు. 28న తెలంగాణకు చేరుకున్నారు. తిరిగి 1వ తేదీ బయలుదేరి 2న ఇళ్లకు వచ్చారు. అంటే 5రోజులు డ్యూటీ ఉన్నట్లు. మన రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలోని ఎన్నికల విధులకు కూడా మన పోలీసులు వెళ్లాల్సిందే! * పల్లెల్లో పోలీసులకు నివసించేందుకు గదులుండవు. మరుగుదొడ్ల సమస్యా ఉంది. * ఎన్నికల విధులకు వెళ్లిన పోలీసులు రాజకీయ నేతల ఇళ్లలో భోజనం చేయకూడదనే నిబంధన ఉంది. ఒక్కోసారి భోజనం దొరక్క పస్తులుండి డ్యూటీలు చేయాల్సి వస్తోంది. * మహిళా పోలీసుల పరిస్థితి మరింత దయనీయం. రాత్రి వేళల్లో ఉండేందుకు సరైన బస లేక ఇబ్బందులు పడుతుంటారు. * ఎన్నికల వేళ గ్రామంలో ఏ మూలన ఎలాంటి గొడవ జరిగినా పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. ఒక వేళ గొడవ పెద్దదైతే వారిపై చర్యలు ఉంటాయి. * పల్లెల్లో గొడవలను నివారించే సమయంలో పోలీసులు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడి ప్రాణం మీదకు తెచ్చుకున్న పోలీసులూ ఉన్నారు. * స్థానిక సంస్థల్లో బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ జరుగుతుంది కాబట్టి.. కొందరు దుండగులు బాక్సుల్లో ఇంక్, నీళ్లు పోయడం లాంటి చర్యలకు ఉపక్రమిస్తారు. ఇదే జరిగితే పోలీసులకు ఇబ్బందే. * ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్‌బాక్స్‌లను స్ట్రాంగ్‌రూంకు తీసుకెళ్లడం కత్తిమీద సామే. ఇలా అడుగడుగునా గండాల నడుమ పోలీసులు విధులు నిర్వర్తించాలి. అయినా ఎవరూ వారి గురించి సానుభూతితో ఆలోచించరు. తీవ్రమైన ఒత్తిడి ఎన్నికలే కాదు.. దోపిడీలు, దొంగతనాలు.. ప్రమాదాలు, ప్రమోదాలు.. ధర్నాలు, దొమ్మీలు.. హత్యలు, అత్యాచారాలు.. బెట్టింగ్‌లు, వైట్కాలర్లు.. ఉరుసులు, ఊరేగింపులు.. విపత్తులు, వైపరీత్యాలు.. సందర్భం ఏదైనా పోలీసులుండాల్సిందే. 24 గంటలూ డ్యూటీలో లేదా రెడీగా ఉండాల్సిందే! దండెత్తి వచ్చే శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేవారు సైనిక జవానులైతే.. అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది పోలీసులు. అందుకే వారు నిరంతరం ఒత్తిడిలో పనిచేయాల్సి ఉంటుంది. వారికీ కుటుంబం ఉన్నా.. శ్రద్ధ తీసుకునే అవకాశముండదు. ఫలితంగా చాలామంది పోలీసుల పిల్లలు సరైన కెరీర్లో ఉండరు. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు పిల్లల పరీక్షలు జరిగాయి. కానీ పోలీసులు తమ పిల్లలు పరీక్షలు రాసే సమయంలో ఇంటి వద్ద ఉండి వారికి ధైర్యం చెప్పే అవకాశం లేకపోయింది. గౌరవం.. గుర్తింపూ ఉండదు ప్రజలకు సేవ చేయడమంటే పరమాత్మునికి సేవ చేయడమే. అందుకే పెద్దలు మానవ సేవే మాధవ సేవ అన్నారు. ప్రజాసేవలో ఉండే వారి నుంచి నీతి, నిజాయితీ, అంకితభావం, మానవత్వం, కాస్తంత త్యాగం వంటి లక్షణాలను సమాజం ఆశిస్తుంది. ఎంత చేశామన్నది కాదు, ఎలా చేశామన్నది ముఖ్యమని సమాజం అంటుంది. ఇరవై నాలుగ్గంటలూ ప్రజల మధ్య ఉండి వారిని కనిపెట్టుకునే పోలీసు నుంచి కూడా ఇటువంటి విలువలనే సమాజం కోరుకుంటుంది. అయితే పోలీసుల చిన్న చిన్న తప్పులను అందరూ పరిగణలోకి తీసుకుంటారు. కానీ నాటి చైనా యుద్ధం నుంచి నేటి అంతర్గత భద్రత వరకు సాయుధ సంఘర్షణలో ప్రతి నిత్యం చావుబతుకుల మధ్య పోరాటం సాగిస్తున్న వారి త్యాగాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. పోలీసులందరూ అవినీతిపరులూ కాదు. అందరూ నీతిమంతులూ కాదు. సమాజంలోని అన్ని వర్గాల్లో, అన్నిశాఖల్లో ఉన్నట్లు పోలీసు శాఖలో కూడా కలుపుమొక్కలుంటాయి. అయితే మనకవి మహావృక్షాలుగా గోచరిస్తాయి. మహిళా సిబ్బందీ.. కొరతే విధుల్లో మహిళా ఉద్యోగులు మరింత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఏఆర్ విభాగాల్లో 4,646 మంది మహిళా పోలీసులు ఉండాలి. ప్రస్తుతం 1,975 మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యేక పీఆర్సీ ఇవ్వాలి అందరు ఉద్యోగుల్లా మేము ఆందోళనకు దిగలేం. మాకు ప్రత్యేకంగా వేతన సవరణ చేయాలి. ప్రమోషన్లు వేగవంతం చేయాలి. పోలీస్స్టేషన్ల సంఖ్యను పెంచాలి. పని విభజన జరగాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అవసరానికి తగ్గట్టుగా కొత్త పోస్టులు మంజూరు చేయాలి. ఇంకా మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలి. - అగ్రహారం శ్రీనివాసశర్మ, పోలీసు సంఘం వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు. వైఎస్ హయాంలో పోలీసుల సంక్షేమం పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ద చూపించారు. పోలీసు కాలనీలకు కళ్యాణమంటపాలు, మినరల్‌వాటర్ ప్లాంట్లు.. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు తదితర విషయాల్లో ప్రత్యేక చొరవ చూపారు. సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేందుకు 31శాతం ఖాళీలను భర్తీ చేశారు. కొత్తగా పోస్టులను మంజూరు చేశారు. తత్ఫలితంగా వేలాదిమంది ఉద్యోగాలు సాధించారు. * ఆర్డర్లీ వ్యవస్థను రద్దు చేశారు. * లూప్లైన్లో పనిచేసే పోలీసులకు 30 శాతం ఇంక్రిమెంట్లు వేస్తామని 2009లో చెప్పారు. * రాష్ట్రంలోని పోలీసులందరికీ ఇళ్లపట్టాలు ఇస్తామని మాట ఇచ్చారు. కొన్ని చోట్ల ఇచ్చారు కూడా. * పత్యేకంగా వేతన సవరణ చేయాలని భావించారు. * డీటీసీ, పీటీసీలను బలోపేతం చేయాలనుకున్నారు. అయితే ఆయన హఠాన్మరణంతో ఇవన్నీ ఆచరణకు నోచుకోలేదు. హోం‘గార్డు’కు రక్షణ ఇవ్వని బాబు హోంగార్డు.. పోలీసు శాఖకు రక్షకుడి లాంటి వాడు. చూసేవాళ్లకు పోలీసు శాఖలో ఉద్యోగమే అరుునా వేతనం వూత్రం అరకొరే. వురీ వుుఖ్యంగా చంద్రబాబు పాలనా కాలంలో వారి పరిస్థితి దయునీయుంగా ఉండేది. అప్పటి ప్రభుత్వం కూలీల కంటే హీనంగా చూసింది. రోజు వేతనం రూ.75లే భవన నిర్మాణ, ఇతర రంగాల్లోని కూలీలకు రోజు వారీ కూలి రూ.100కు పైగా ఉండగా... అప్పట్లో హోంగార్డులకు చంద్రబాబు సర్కారు ఇచ్చింది రోజుకు రూ.75లే. సెలవులు, వీక్లీ ఆఫ్‌లు ఇవ్వలేదు. గైర్హాజరు కాకుండా నెలంతా పని చేస్తే రూ.2,250 వచ్చేది. ఈ వేతనం ఏవూత్రవుూ చాలక హోంగార్డుల కుటుంబాలకు పస్తులు తప్పేవికావు. నోరెత్తితే ఉద్యోగాలు ఊడగొట్టేవారు. ముష్టిలా ఇచ్చే వేతనం కూడా మూడు.. నాలుగు నెలలకోసారి చేతికొచ్చేది. టీడీపీ నేత ఒత్తిళ్లతో.. ఈ ఫొటోలోని వ్యక్తిపేరు సురేష్. కర్నూలు జిల్లా బండిఆత్మకూరు వాసి. 2013బ్యాచ్‌కు చెందిన ఆయన ఇటీవలే వైఎస్సార్‌జిల్లా ఓబుళవారిపల్లె పోలీసుస్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న వివాహమైంది. విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండే సురేష్‌ది సున్నిత మన స్తత్వం. ఏప్రిల్ 6న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కొందరికి అనుకూలంగా పనిచేయాలని అన్నిస్థాయిల్లో ఒత్తిడి వచ్చింది. మనస్సాక్షిని చంపుకోలేక సురేష్ చివరకు అదే నెల 7వ తేదీన పోలీసు క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు విడిచాడు. సురేష్ మృతికి ఓ టీడీపీ నేత ప్రధాన కారణమని పోలీసు వర్గాలు బాహాటం గానే ఆరోపి స్తున్నాయి. ఇలా ఒత్తిళ్లు తాళలేక విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయినవారు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. సురేష్ మృతిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇంతటితో సురేశ్ కుటుంబానికి న్యాయం జరుగుతుందా? అనే ప్రశ్నకు ప్రభుత్వాలు, నాయకులు సమాధానం చెప్పాలి. వయో పరిమితిని కుదించిన ఘనుడు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల్లో వంద పోస్టులకు గాను పది చొప్పున హోంగార్డులకు ఇవ్వాలని రిజర్వేషన్ ఉంది. నియమితులై రెండేళ్లు పూర్తవడంతో పాటు ఆ కాలంలో కనీసం 180 రోజులు విధులు నిర్వర్తించిన వారికే ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 1995 కంటే ముందు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే హోంగార్డుల వయోపరిమితి 35 ఏళ్ల వరకు ఉండేది. దీన్ని చంద్రబాబు 30 ఏళ్లకే కుదించారు. తద్వారా వేలాది మంది హోంగార్డుల పొట్టకొట్టారు. సేవలను గుర్తించిన వైఎస్ రాజశేఖరరెడ్డి హోంగార్డుల సేవలను వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తించి... వారి సంక్షేమానికి కృషి చేశారు. వేతనాన్ని రూ.2,250 నుంచి రూ.6 వేలకు పెంచారు. వారి పిల్లల ఉన్నత చదువు కోసం ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్షిప్ పథకాలను వర్తింపజేశారు. వేతనం ప్రతినెలా సక్రవుంగా అందేలా చూశారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని తిరిగి 35 ఏళ్లకు పెంచారు. దీంతో వేలాది మందికి లబ్ధి చేకూరింది. వైఎస్ హయూంలో రాష్ట్రంలో హోంగార్డుల నియూవుకాలు కూడా భారీఎత్తున చేపట్టారు. చంద్రబాబు హయూంలో 20 వేల లోపే ఉండగా.. వైఎస్ ఆ పోస్టుల సంఖ్యను 40 వేలకు పెంచి నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. వీరిలోనూ 12వేల మందికి పైగా మహిళా హోంగార్డులు ఉండటం గవునార్హం. పోలీస్ లీడర్ రావాలి పోలీసు శాఖలో చాలా పోస్టుల భర్తీకి వుుఖ్యవుంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోలీసు శాఖ బలంగా ఉండాలని కోరుకునేవారు. పోలీసు అకాడమీని రక్షించిన నాయుకుడు వైఎస్. పైగా, కొంత భూమి నష్టపోరుునందుకు పోలీస్ అకాడమీకి ప్రభుత్వం నుంచి ఏ మేరకు పరిహారం ఎంతకావాలో కూడా ఇస్తావుని చెప్పారు. ధైర్యమిచ్చే పోలీస్ బాస్ కావాలి రాజకీయు ఒత్తిళ్లు. అండగా నిలవాల్సిన పోలీసుల్లో వునకెందుకనే నిరుత్సాహ ధోరణి. వీటి వుధ్య విధులు నిర్వహించే పోలీసులకు ఏ సవుస్య ఎదురైనా అనునిత్యం యుుద్ధమే. ఇప్పుడున్న పోలీసు విధానం వూరాలంటే గతంలో వూదిరిగా సవుర్ధుడైన పోలీస్ బాస్‌లు ఉండాలి. అప్పుడే కింది స్థారుులో పోలీసులకు వునోధైర్యం ఉంటుంది. జనానికి కూడా పోలీసుల దగ్గరకు వెళితే సవుస్య పరిష్కారం అవుతుందనే ధీవూ ఏర్పడుతుంది. పోలీస్ బాస్ అంటే ఒక్క డీజీపీనే కాదు. జిల్లా స్థారుులో ఎస్పీ వరకు పోలీస్ బాసే అవుతారు. కింది స్థారుులో ఎవరైనా తప్పు చేస్తే పిలిచి హెచ్చరించి బాగా పనిచేసేలా చేయూలి. -
రాజన్న రాజ్యంలో.. జలయజ్ఞం
బాబు పాలన: బాబు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కానీ, కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తికాలేదు. ఆ కారణం వల్లనే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మనకు వ్యతిరేకంగా వచ్చింది. - కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులను అప్పట్లోనే నిర్మించి ఉంటే ట్రిబ్యునల్ తీర్పు మనకు అనుకూలంగా వచ్చేది. - బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం చేసిన వ్యయం రూ. 700 కోట్లు మాత్రమే. అంటే.. ఏడాదికి వంద కోట్లను కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదు. - ఇంకుడుగుంతలపై చూపిన శ్రద్ధ భారీ ప్రాజెక్టులపై చూపలేదు. - ఆనాడు కేంద్రంలో తానే చక్రం తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు... కేంద్రంలో మాట్లాడి ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేకపోయారు. మన రాష్ట్ర సాగునీటి హక్కులు కాపాడలేక పోయారు. రాజన్న రాజ్యం అందుబాటులోకి వచ్చిన ప్రతి నీటి బిందువునూ ఒడిసి పట్టుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలని కలలుగన్న ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన మహాయజ్ఞం... జలయజ్ఞం! దివి నుంచి భువికి గంగను రప్పించే భగీరథయత్నం.. కరవు కాటకాలను తరిమికొట్టడానికి చేపట్టిన వజ్రాయుధం.. కోటి ఎకరాలకు నీరందించి రైతన్న భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు మహానేత తీసుకున్న దృఢసంకల్పం జలయజ్ఞం! - ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించారు వైయస్సార్. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో 86 ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారు. - జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో ఐదేళ్లలోనే 12 ప్రాజెక్టులను పూర్తిచేశారు. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి, సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించారు. - ఐదేళ్లలోనే రూ. 53 వేల కోట్లను ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. చాలా ప్రాజెక్టులు చివరిదశకు చేరుకున్నాయి. - ఆయన హయాంలో వేగంగా జరిగిన పోలవరం ప్రాజెక్టు పనులు తర్వాత పూర్తిగా నిలిచిపోయాయి. డిజైన్‌ను మార్చడం వల్ల మళ్ళీ టెండర్లను ఖరారు చేయానికే ప్రభుత్వం మూడేళ్ళ సమయాన్ని తీసుకుంది. వైఎస్ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు అదే వేగంతో జరిగినట్టయితే... ఈ సమయానికి పూర్తయి...పశ్చిమ గోదావరి జిల్లాలో 7.2 లక్షల ఆయకట్టుకు నీటి వసతిని కల్పించడంతో పాటు కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించడానికి, విశాఖపట్టణానికి 30 టీఎంసీల నీటి సరఫరాకు అవకాశం ఉండేది. - ఆ ఒక్క ప్రాజెక్టునే కాదు, మహానేత మరణానంతరం ఇతర ప్రాజెక్టులను సైతం పట్టించుకున్న నాధుడే లేడు. జగన్ సంకల్పం పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కూడా తానే తీసుకుంది. పోలవరంతోపాటు పెండింగ్‌లో ఉన్న గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యత ప్రాతిపదికపై నిర్మాణం పూర్తిచేయడం జరుగుతుంది. ప్రాజెక్టుల నిర్మాణ ప్రభావం మైనింగ్, ట్రాన్స్పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్, వినిమయ రంగాలపై ప్రసరించి, 2004-09 మధ్య విస్తరించిన అభివృద్ధి మాదిరిగానే ఆయా రంగాల పురోగతికి దోహదం చేస్తుంది. సిమెంట్, స్టీల్, నిర్మాణ సామగ్రి... వీటన్నింటి కొనుగోళ్ళూ పెరగటం, మైనింగ్, ట్రాన్స్‌పోర్టు పెరగటం అంటే ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మళ్ళీ జీవం పోయటమే! -
పల్లెల్లోకే పాలన
* కార్డుల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు. * రేషన్‌కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పక్కా ఇంటి కార్డు ఇలా.... * అన్ని కార్డులు, పత్రాలు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో 24 గంటల్లో జారీ. * ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాఫీసు. * ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకే తెస్తాం. - ప్రతి గ్రామంలోనూ ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంచాలన్నది మా లక్ష్యం. దీని కోసం ప్రతి గ్రామంలోనూ కార్యాలయం ఏర్పాటు చేసి ఐరిస్ కార్యక్రమం ద్వారా రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, సామాజిక పింఛన్ కార్డులు, పక్కా ఇంటి కార్డులు, ఆధార కార్డు సహా ఏ కార్డు అయినా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ప్రజలకు అందించే విధానాన్ని అమలు చేస్తాం. ఈ కార్యాలయాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటర్, ఐరిస్ మిషన్, లామినేటింగ్ మిషన్ సదుపాయం ఉంటుంది. - సిటిజన్స్ చార్టర్: నిర్ణీత కాల వ్యవధిలో ప్రజల పనులు పూర్తయ్యేలా చూస్తాం. - ఫైళ్ళ సమీక్ష: ఎమ్మార్వో కార్యాలయం మొదలు సచివాలయం వరకూ అన్ని ఫైళ్ళకూ బార్ కోడ్ ఇచ్చి ఫైళ్ళ సమీక్ష నిర్వహిస్తాం. ప్రజలు తమ ఫైళ్ళు ఏ కార్యాలయంలో, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవటానికి ఇది తోడ్పడుతుంది. - మహిళా అదాలత్‌లు/ న్యాయ వ్యవస్థ: మహిళా కేసులను త్వరితగతిన విచారించి, న్యాయం చేకూర్చటానికి రాష్ట్రంలోని అన్ని కోర్టులూ సాయంత్రం పూట కూడా పనిచేస్తాయి. - రాష్ట్ర స్థాయి లోకాయుక్త (లోక్‌పాల్)ని పటిష్ఠం చేస్తాం. - అన్ని పంచాయతీల్లోనూ జన సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. - అర్హత ఉన్న అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనం చేకూరుస్తాం. - అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ నిర్ణీత వ్యవధిలో సమీక్షించి, ప్రజాభిప్రాయం ప్రకారం మరింత పటిష్ఠపరుస్తాం. - పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ అన్ని చట్టాలనూ పునఃపరిశీలిస్తుంది. కమిటీ సూచనల మేరకు కాలదోషం పట్టిన చట్టాలన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఆచరణయోగ్యమైన చట్టాలను తీసుకువస్తాం. - {పజలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేసి, నూరు శాతం ఈ-గవర్నెన్స్‌ను సాధిస్తాం. - భూమి రికార్డులన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తాం. భూమి లావాదేవీలను బెంగళూరులో మాదిరిగా ఆన్లైన్లో నిర్వహిస్తాం. - కాలం చెల్లిన బ్రిటిష్ పోలీస్ చట్టం స్థానంలో కొత్త పోలీస్ చట్టాన్ని తెచ్చి ప్రజలకు సత్వరంగా, చిత్తశుద్ధితో పోలీసులు సేవలందించేలా చేస్తాం. - ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం: నీటి కాలుష్యంతో వచ్చే రోగాలను అరికట్టటానికి ప్రతి గ్రామంలోనూ ఆర్వో, రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. మినరల్ వాటర్‌ను నామ మాత్రపు ధరలకే సరఫరా చేసేందుకు ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తాం. ఈ ప్లాంట్ల నిర్వహణలో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రాధాన్యం ఇస్తాం. - నిర్ణీత వ్యవధులలో పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, నూరు శాతం టీకాలు వేయించుకునేలా చేస్తాం. ‘హయ్యర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్’ సాధించటానికి నూరు శాతం ‘డీ వార్మింగ్’ చేస్తాం. పిల్లలకు ఉచితంగా కళ్ళద్దాలు అందిస్తాం. - గుజరాత్, తమిళనాడులలో మాదిరిగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు రూపాయికి ఓ ప్యాడ్ చొప్పున శానిటరీ నేప్కిన్లను సరఫరా చేస్తాం. - ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లను నిర్మించటం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం. - ఆధార్ కార్డు సహాయంతో రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పిస్తాం. వలస కూలీలకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. రేషన్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. - రేషన్ దుకాణాల్లో విటమిన్ ఏ, డీ, ఐరన్, క్యాల్షియం బిళ్ళలను విక్రయించడం ద్వారా ఆహార పరిపుష్టత కల్పిస్తాం. - మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంత గ్రామాలలో ఉచిత సౌరశక్తి లాంతర్లు, పొగరాని పొయ్యిలు ఏర్పాటు చేస్తాం. -
బాబు, వైఎస్ పాలనలో.. చేనేత
బాబు పాలన: నేత కార్మికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు. - 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుం బంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు. - బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు. - నేత కార్మికులకు పింఛనివ్వాలని బాబు ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు. - చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలలో దాదాపు వంద వరకు మూసేశారు. - ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు. - బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భివండి, సూరత్‌లకు వలసపోయారు. రాజన్న రాజ్యం సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వైఎస్ ఆర్థికసాయం అందించారు. మొత్తం 125 కుటుంబాలకు రూ. లక్షన్నర చొప్పున సాయం చేశారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీ వర్తింపజేశారు. ఇందులో కార్మికుడి అప్పుల సర్దుబాటుకు రూ. యాభైవేలు, కుటుంబ జీవనోపాధికి మరో రూ.లక్ష అందించారు. మరో 120 కుటుంబాలకు రూ.25వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. - 12వేల మంది నేత కార్మికులకు అంత్యోదయ అన్న యోజన పథకం(ఏఏవై) కార్డులు అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలనెలా 35కిలోల బియ్యం అందుతున్నాయి. - చేనేత కార్మికుల ఆరోగ్య సమస్యల దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ 50వేల మందికి ప్రతి నెలా రూ.200 పింఛనిచ్చారు. - 2004లో రూ.32కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్‌ను రూ.250కోట్లుగా మార్చి ఆదుకున్నది వైఎస్సే. - పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ పదిశాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. - వైఎస్ హయాంలో 2008 నాటికి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి. - సిరిసిల్ల స్త్రీలను చైతన్యవంతులను చేసి 1,480 సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి స్త్రీకి రూ.50వేల రుణం అందించారు. ఒక్క సిరిసిల్లలోనే రూ.74 కోట్ల పావలావడ్డీ రుణమివ్వడంతో మైక్రోఫైనాన్స్ వేధింపులు తగ్గాయి. - చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరం ఏర్పాటు చేసి 84 మంది వైద్యులతో వైద్య సేవలు అందించారు. - ఇళ్లు లేని పేద చేనేత కార్మికులకు సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లిలో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ. - సిరిసిల్ల పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. - నేతన్నల సంక్షేమం కోసం రూ. 2 కోట్ల కార్పస్‌ఫండ్ మంజూరు చేశారు. - జనశ్రీ బీమాలో కార్మికుల ప్రీమియంను రూ.80నుంచి రూ.40కి తగ్గించి మిగతా రూ.40 ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసి లక్షన్నరమంది కార్మికులకు ఆరోగ్య ధీమా కల్పించారు. - నేత కార్మికులు ప్రైవేటు రుణాల బారిన పడకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలావడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేశారు. - రాష్ట్ర వ్యాప్తంగా 77వేలకు పైగా ఉన్న పవర్‌లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ.29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధుల విడుదల. - 2 లక్షలమంది కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే రుణాలిచ్చారు. - వైయస్సార్ సిఎం అయ్యాక 327 కోట్ల రూపాయల మేరకు చేనేత రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2 లక్షలమంది చేనేత కార్మికులకు మేలు జరిగే ఈ నిర్ణయం అమలు చేయాల్సిన దశలో ఆయన హఠాన్మరణం చెందారు. రోశయ్య సిఎం అయ్యాక ఈ పథకానికి కోత విధించారు. కేవలం రూ.148 కోట్లతో 67 వేలమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా చేసి వైయస్సార్ ఆశయాలపై నీళ్లు చల్లారు. జగన్ సంకల్పం - చేనేత కార్మికులు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం. చేనేత కార్మికులకు రూ లక్ష వరకూ వడ్డీ లేని రుణాలివ్వటమే కాకుండా వారికి చేనేత షెడ్డుతో కలిపి ఇల్లు కట్టించి ఇస్తాం. మరమగ్గాల చేనేత కార్మికులకు యూనిట్‌కు రూ. 1.50కి విద్యుత్ సరఫరా చేస్తాం. ముడి పదార్థాల మీద సబ్సిడీ పెంచుతాం. జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరించటం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, పాఠశాలల్లోనూ చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం. ఆర్టిజాన్ కార్డులపై ప్రయోజనాలు కల్పిస్తాం. చేనేత కార్మికుల పింఛన్‌ను రూ. 1000కి పెంచుతాం. -
వైఎస్, బాబు పాలనలో.. అర్చకుల సంక్షేమం
గుళ్ల నుంచి ఇళ్ల దాకా ఏ శుభకార్యం జరగాలన్నా, భగవంతుడికి-భక్తుడికి అనుసంధానంగా వుండాలన్నా పూజారి ఉండాల్సిందే. కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న బ్రాహ్మణుల జీవితాల్లో మాత్రం అంతా చీకటే! రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది బ్రాహ్మణులు ఉండగా, 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలాచోట్ల పూజారుల నెలసరి ఆదాయం రూ. 1500, పురోహితుల ఆదాయం రూ. 2000కు మించి ఉండదు. అందుకే, వీరిలో చాలామంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అయితే, బాధాకరమైన విషయమేంటంటే, వీరికి తెల్ల రేషన్ కార్డులు కూడా లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదు. చాలామందికి సొంత ఇళ్లు కూడా లేవు. 12 ఏళ్లపాటు అభ్యసించిన వేదవిద్యకు ఆదాయం ఈ రకంగా ఉండడంతో చాలామంది నిరుత్సాహపడి అర్చక వృత్తినే వదిలేస్తున్నారు.రాష్ట్రంలో 84 వేల ఆలయాలున్నా, దేవాదాయ శాఖ మాత్రం ఆదాయమున్న 100 ఆలయాల కోసమే అన్నట్లు పనిచేస్తోంది. బాబు పాలన చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అర్చకుల, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు. 2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్మెంట్ స్కీంను కూడా పెట్టారు. జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది. దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001 సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న రాజ్యం వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు. చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని వైఎస్సాఆర్‌ను అర్చకులు అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా. ఈ హామీతో వైఎస్సాఆర్‌కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు. - అర్చక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు - అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు - విద్య గృహ నిర్మాణానికి రుణాలు అందజేశారు - గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు - ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ. లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు - కామన్‌గుడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి దేవాలయాల - పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు జగన్ సంకల్పం హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని క్రమంగా తగ్గించటానికి మేము కట్టుబడి ఉన్నాం. అర్చకులకు, దేవాలయాల సిబ్బందికి పనిచేసేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తాం. ధూప దీప నైవేద్యాల కోసం ఇప్పుడు ఇస్తున్న కనీస మొత్తాన్ని నెలకు రూ. 2500 నుంచి రూ.5000కు పెంచుతాం. హిందూ దేవాలయాల విషయంలో, అర్చకుల విష యంలో వైయస్ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు పరచటానికి కట్టుబడి ఉన్నాం. ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే నిధులను, పదవీ విరమణ చేసిన అర్చకుల పింఛన్‌ను పెంచుతాం. -
బాబు, వైఎస్ పాలనలో.. ప్రభుత్వ ఉద్యోగులు
బాబు పాలన.. ‘‘ఏం? పిచ్చ పిచ్చగా ఉందా?’’ ‘‘ఏం మాట్లాడుతున్నావ్? నాతోనే వాదిస్తావా? తమాషాలు పడుతున్నావా?’’ ...ఇవి ఏ తాపీ మేస్త్రీయో తన దగ్గర పని చేసే కూలీలపై అరిచిన అరుపులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నోటి వెంట జాలువారిన తిట్ల దండకాలు. ‘పిచ్చ పిచ్చగా ఉందా’ అంటూ దుయ్యబట్టిందెవరినో తెలుసా? అంబేద్కర్ వర్సిటీ వైఎస్ చాన్సలర్‌ను! ఇక ‘తమాషాలు పడుతున్నావా’ అంటూ నోరు పారేసుకున్నదేమో ఏకంగా న్యాయ శాఖ అదనపు కార్యదర్శిపై! అక్కడితో ఆగకుండా, ‘నీ పరిధిలో నువ్వుండు! యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక అప్పటి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పారావు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే! అత్యున్నత ప్రభుత్వాధికారులకే చుక్కలు చూపిన చంద్రబాబు... సాధారణ ప్రభుత్వోద్యోగుల విషయంలోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు! ‘మీ గుండెల్లో నిద్రపోతాను’ అంటూ నిత్యం బెదిరించేవారు. బెదిరించడమే కాదు... తన పాలన పొడవునా వేతన జీవులు ఏనాడూ కంటినిండా నిద్ర కూడా పోకుండా చేశారు. జనం ముందు, సాటి ఉద్యోగుల ముందు వారిని దోషుల్లా నిలబెట్టి, నిలువునా పరువు తీయడాన్ని, కసురుకోవడాన్ని, సస్పెండ్ చేసి పారేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు... అదో భయానక గతం..! బాబు ఆర్థిక సంస్కరణలకు ప్రధానంగా బలైంది ఉద్యోగులే! ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించే పద్ధతినే చంద్రబాబు భాషలో సంస్కరణలు అంటారని సామాజిక కార్యకర్తలు ఎప్పుడూ విమర్శిస్తుంటారు కూడా. ఆయన తొమ్మిదేళ్ల పాలనంతా ఉద్యోగుల ఉసురు పోసుకుంటూనే సాగింది. ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఏటా 1.9 శాతం మేర ఉద్యోగులను తొలగిస్తానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్న ఘనుడు బాబు! ఉద్యోగుల కుదింపుకు సంబంధించి ఉత్తర్వులు (జీవో 58) కూడా జారీ చేశారు! 1998లో 747 మంది కార్మికులను, 1999లో 1,683, 2000లో 3,439, 2001లో 1,382 మందిని తొలగించారు. పైగా, ‘రిటైరైన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడమే మహా ఎక్కువ. మళ్లీ డీఏ కూడానా? ఇచ్చేది లేదు’ అంటూ అధికారంలో ఉండగా తెగేసి చెప్పిన చరిత్ర చంద్రబాబుది! తను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ ఉన్న ఉద్యోగాలనే వీలైనంతగా తొలగించిన బాబు ఇప్పుడు అధికారంకోసం కొత్త ఉద్యోగాలిస్తానంటే ఎలా నమ్ముతామని ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు! ఈ రెండు నాల్కల ధోరణేంటి బాబూ..? - అధికారం కోసం కుటుంబానికో ఉద్యోగం అంటూ ఊదరగొడుతున్న బాబుకు, రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయో తెలుసా? అసలు ఎన్ని ఉద్యోగాలిస్తారో స్పష్టంగా చెప్పరేం? అలా సంఖ్య చెబితే అన్ని ఉద్యోగాలు ఎలా సాధ్యమో కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఎటూ తేల్చకుండా తెలివిగా తప్పించుకుంటున్నారన్నది నిజం కాదా? - ‘ఒక వంటగది వాడుతున్న వారంతా ఒక కుటుంబం’ అనే నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని జనాభా లెక్కల సేకరణ విభాగం 2011లో చెప్పిన లెక్క ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.1 కోట్ల కుటుంబాలున్నాయి. వాస్తవానికి నేటి లెక్క ప్రకారం కుటుంబాల సంఖ్య 3.5 కోట్ల దాకా ఉంటుంది. - ఇక ఉద్యోగ లెక్కల్లోకి వస్తే - ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ తదితరాలన్నింటినీ కలిపి కూడా రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వోద్యోగాలు 13 లక్షలే. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, ఐటీ, సేవ రంగం తదితరాల్లోని మొత్తం ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య 35 లక్షలు దాటదు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య 50 లక్షల్లోపే. మరి కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తానని నమ్మిస్తున్న బాబు, ఈ లెక్కన మరో 3 కోట్ల ఉద్యోగాలు ఎక్కడి నుంచి సృష్టిస్తారో ఆయనకే తెలియాలి! ఉద్యోగస్థుల్ని బాబు పురుగుల్లా చూశాడు! ఉద్యోగులంటే బాబుకు ఏమాత్రం గౌరవముండేది కాదు. వారిని పురుగుల్లా చూసేవారు. మా సమస్యలపై విన్నవించడానికి ఎప్పుడు వెళ్లినా గద్దింపు స్వరమే సమాధానమయ్యేది. సమస్య వినకుండానే, మా చేతుల్లోని వినతి పత్రాలను లాక్కుని పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కనీసం కూర్చోబెట్టే మర్యాద కూడా తెలియదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి అయ్యాక ఐదున్నరేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సువర్ణయుగంలా గడిచింది. అసలు ప్రభుత్వోద్యోగిని మనిషిగా చూడటం వైఎస్ పాలనలోనే జరిగింది. ఏ సమస్యపై వెళ్లినా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించే వారు వైఎస్! ఆ రోజులు మాకిప్పటికీ గుర్తే! - గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు బాబు ‘మనసులో మాట’... ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృథా. ప్రభుత్వోద్యోగం అనగానే శాశ్వతం, భద్రం అనే భావన పనిచేయనీయకుండా చేస్తున్నది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల వల్ల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితికి దారితీసింది. జీతభత్యాల బిల్లు పెరగడానికి జీతాల పెరుగుదలే కాక ఉద్యోగుల సంఖ్య పెరగడమూ ముఖ్య కారణం. ఉద్యోగుల పెరుగుదలతో సామర్థ్యం పెరగడం లేదు. (పేజీ. 63) కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ సిబ్బంది సంఖ్యను తగ్గించడంలో ఉత్తమమైన మార్గం... ఉన్న ఉద్యోగాలను స్తంభింపచేయడం. అంటే రిటైరైన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేయకుండా ఉండడం. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల స్తంభీకరణ కిందితరగతి ఉద్యోగాల స్థాయిలో జరిగింది. (పేజీ.66) రాజన్న రాజ్యం ఉద్యోగ ఖాళీల భర్తీ డిమాండ్‌ను 2000 డిసెంబర్ 26న విపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో లేవనెత్తారు. అందుకు చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నిరుద్యోగుల ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని 2001 జనవరి 9న వైఎస్ సందర్శించారు. దీక్షలో ప్రాణాలొదిలినా బాబు కరకు హృదయం కరగదని, తాను అధికారంలోకి వస్తే ఖాళీలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. 2004లో తాను అధికారంలోకి రాగానే ఆ హామీని నిలబెట్టుకున్నారు. 1999 గ్రూప్-2 నోటిఫికేషన్లో ఖాళీలు చూపించిన 1,500 పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరదించారు. తర్వాత పలు గ్రూప్ 1, 2, 4 నోటిఫికేషన్లు ఇచ్చారు. జూనియర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశారు. భారీగా ఉపాధ్యాయ పోస్టులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టులు భర్తీ చేశారు. వైఎస్ ఐదేళ్ల హయాంలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారు! జగన్ సంకల్పం రాష్ట్ర విభజన ద్వారా తలెత్తిన ఉద్యోగుల సమస్యలను, పెన్షనర్ల సమస్యలను ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పటం ద్వారా త్వరితగతిన పరిష్కరిస్తాం. వారికి అండగా నిలుస్తాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేస్తాం. క్యాష్‌లెస్ ట్రీట్మెంటును ప్రోత్సహిస్తాం. - వైయస్ఆర్ గర్వపడేలా పిఆర్సీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. బాబు హయాంలో ఉద్యోగులకు పిఆర్సీ 16 శాతం వచ్చింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిగారి హయాంలో 39 శాతం పిఆర్సీ ఇచ్చారు. ఏ లోకంలో ఉన్నా రాజశేఖరరెడ్డిగారు గర్వపడేలా పిఆర్సీని ఇస్తాం.’ - ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంత ఇల్లు ప్రతి ఉద్యోగికీ ఇల్లు ఒక హక్కుగా ఇవ్వాలి. ప్రతి ఉద్యోగికీ ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం. క్లాస్-4 ఎంప్లాయిస్‌కు కూడా ఇల్లొచ్చేలా చేస్తాం. - ఆరోగ్యశ్రీ తరహాలో క్యాష్‌లెస్ పాలసీ.. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్మెంట్ ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ పాలసీని తెస్తాం. - కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు చలా బాధలుపడుతున్నారు. జీతాలు తక్కువ, రిటైర్మెంట్ తర్వాత వారికి పెన్షన్లు రావు. ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికీ హామీ ఇస్తున్నాం... అధికారంలోకి వచ్చాక ఓ కమిటీ వేస్తాం. అర్హత ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ రెగ్యులరైజ్ చేస్తాం. - వయో పరిమితి 40 ఏళ్ళు ప్రభుత్వోద్యోగ నియామకాల వయోపరిమితిని 34 నుంచి 40కి (వన్‌టైమ్) పెంచుతాం. ఎస్సీ ఎస్టీలకు కూడా తదనుగుణంగా వయో పరిమితిని (వన్‌టైమ్) పెంచుతాం. ఏపీపీఎస్సీని సమూలంగా తీర్చి దిద్దుతాం. - సమైక్యతకు సలాం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన సమ్మెను ప్రత్యేకమైనదిగా పరిగణించి, ప్రభుత్వోద్యోగులందరికీ సమ్మె కాలానికి జీతాన్ని చెల్లిస్తాం. -
బాబు, వైఎస్ పాలనలో.. విద్యుత్
బాబు పాలన.. రైతులకు ఉచిత విద్యుత్..? ఏ పాలకుడూ ఊహించని పథకం ఇది. కానీ, తొమ్మిదేళ్లు సీఎంగా, రైతులను అన్ని రకాలుగా వేధించిన చంద్రబాబు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ విద్యుత్ తీగలు బట్టలారేసుకోవడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నా వినిపించుకోకపోగా, చంద్రబాబు వ్యవసాయం దండగమారి వ్యవహారమని, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని వ్యాఖ్యానించారు. కరువు కాటకాలతో కుంగి కృశిస్తున్న రైతులు విద్యుత్ బకాయిలు కట్టకపోతే వారి మోటార్లు, స్టార్టర్లను పీక్కెళ్లేవారు. అంతేకాదు రైతులను జైళ్లకు కూడా పంపారు. బకాయి వసూలు, పెనాల్టీల వసూలు కోసం ప్రత్యేక జీవోలు విడుదలయ్యాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని రైతులు ఉద్యమిస్తే హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో వారిని పిట్టల్లా కాల్చారు. రైతులు, చేనేత కార్మికులు పరిహారం కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అవమానించిన రాజకీయ నాయకుడు చరిత్రలో చంద్రబాబునాయుడే. - ప్రభుత్వం చేసే ప్రతీ పనికీ ప్రజల నుంచి చార్జీలు వసూలు చేయాలన్నది బాబు పాలసీ, ఫిలాసఫీ. ఇందులో భాగంగానే వ్యవసాయానికీ విద్యుత్ చార్జీలను వసూలు చేశారు. - విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు. - మొత్తం మీద 78 వేల కేసులను రైతుల మీద నమోదు చేశారు. - ప్రతీ ఏటా విద్యుత్ చార్జీలను పెంచారు. అటు గృహ వినియోగానికీ, ఇటు వ్యవసాయానికీ కరెంటు చార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే. - చార్జీలు చెల్లించడం లేదని వ్యవసాయ కనెక్షన్లు తొలగించారు. పొలాల మీద పడి మోటార్లు ఎత్తుకెళ్లారు. ఫ్యూజులు పీకేశారు. పంటలు ఎండిపోతున్నా కనికరించలేదు. - ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించదని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలకు బట్టలు ఆరేసుకోవాల్సిందేనని హేళన చేశారు. విద్యుత్ పోటు.. బాబు హయాంలో విద్యుత్ సంక్షోభం అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. వ్యవసాయ రంగం మీద ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన రూ. 50లకు హార్స్పవర్ విద్యుత్ చార్జీని రూ.250కి పెంచి కోలుకోలేకుండా దెబ్బ తీశారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలను ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. - విద్యుత్ సంస్కరణల వెనుక రహస్య ఎజెండా ఏదీ లేదని పదేపదే ప్రకటించుకున్నా బాబు ప్రపంచబ్యాంకు ఎజెండానే అమలు చేశారు. విద్యుత్ చార్జీలను పెంచాలని తాము రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జేమ్స్ ఉల్ఫెన్సన్ ప్రకటించారు. - సామాన్యుల మీద విద్యుత్ భారం మోపడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఏటేటా విద్యుత్ చార్జీలు వడ్డిస్తామని చంద్రబాబు అధికారంలో ఉండగానే ప్రకటించారు. రాజన్న రాజ్యం ఉచితంపైనే తొలి సంతకం - అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ‘ఉచిత విద్యుత్’ ఫైలు పైనే చేశారు. - ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ లభించింది. రైతులు బకాయిపడ్డ రూ. 1250 కోట్ల కరెంటు బకాయిలు మాఫీ అయ్యాయి. సుమారు రెండు లక్షల మంది రైతులపై నాటి చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు రద్దయ్యాయి. - ప్రతీ ఏటా కొత్తగా లక్షన్నర వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. - 2004 నుంచి ఒక్క ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. కనీస సర్వీస్ చార్జీ అయిన రూ. 20ని కూడా వసూలు చేయలేదు. - వచ్చే ఐదేళ్లు కూడా విద్యుత్ చార్జీలు పెంచేది లేదని 2009 ఎన్నికలకు ముందు స్వయంగా వైఎస్ హామీ ఇచ్చారు. రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామన్నారు. జగన్ సంకల్పం ఉచిత విద్యుత్ - వ్యవసాయానికి రోజుకు 7 గంటల నిరంతర ఉచిత విద్యుత్. - పగటిపూటే రైతులకు కరెంటు. - 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. - రైతు కుటుంబాల్లో మళ్లీ కాంతులు పండిస్తాను. 150 యూనిట్ల కరెంటు రూ. 100 కే... * తప్పుడు బిల్లులు, ఛార్జీల భారంతో ఇన్నాళ్లూ ఇక్కట్లు * పెద్ద బిల్లులు కట్టకపోతే కనెక్షన్లే కట్ చేశారు. * ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ * నిరుపేద కుటుంబాలు కరెంటు కోసం * పక్కమార్గాలు వెతుక్కుంటున్నారు. ఇకపై ఈ చీకట్లు ఉండవు... * 150 యూనిట్ల వరకు నెలకు రూ.100కే కరెంటు ఇస్తాం. * 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో * విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితి లేకుండా చేస్తా. మరింత కరెంటు - అన్ని గృహ, వాణిజ్య సముదాయాలలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. సోలార్, విండ్ విద్యుత్తు పార్కులను ప్రోత్సహిస్తాం. - సౌరశక్తిని, పవనశక్తిని పూర్తిగా వినియోగించుకోవటంపై, చిన్న తరహా జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. - అంతే కాకుండా 800 మెగా వాట్ల కృష్ణపట్నం థర్మల్ కేంద్రం రెండో దశ, 800 మెగా వాట్ల వీటీపీఎస్ 5 వ దశ, 960 మెగావాట్ల పోలవరం జలవిద్యుత్ కేంద్రం, 1600 మెగావాట్ల వాడరేవు మెగా విద్యుత్ కేంద్రం మొదటి దశల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. -
బాబు హామీల బండారం
' 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? బాబు ఏం చేశాడు? ' 1. కిలో బియ్యం రెండు రూపాయలకే అందించటం ' 2. సంపూర్ణ మద్యపాన నిషేధం ' 3. ఒక్కో హార్స్ పవర్‌కు రూ.50 చొప్పున వ్యవసాయ విద్యుత్తు సరఫరా మోడీని నరహంతకుడన్న మాటను మరచాడా బాబు? గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు హైదరాబాద్ వస్తే స్వాగతించారు. బీజేపీని అంటరాని పార్టీగా తేల్చి, మోడి నరహంతకుడు అని, ఆయనకు ఎలాంటి అర్హత లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే మోడీతో స్నేహానికి, బీజేపీతో పొత్తుకు ిసిద్ధమయ్యారు. ' ఈ వాగ్దానాల్నీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తప్పాడు. మూడు వాగ్దానాలు కూడా అమలు చేయలేని ఈ అసత్య హరిశ్చంద్రుడు ఇప్పుడు గత నాలుగేళ్ళుగా కనీసం మూడు వందల వాగ్దానాలు చేశాడు. ' చంద్రబాబు బియ్యం, విద్యుత్తు, మద్యనిషేధం వల్ల రూ.4000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లోటు ఏర్పడిందంటూ ఆ మేరకు సబ్సిడీ బియ్యం ధర పెంచారు. అంతే కాకుండా నీటి తీరువా, వ్యవసాయ కరెంటు చార్జీలు, టర్నోవర్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, వృత్తి పన్ను, ఆర్టీసీ చార్జీలు... ఇలా అన్నీ ఒక్కసారిగా పెంచేశారు. ' చంద్రబాబు ఎంతటి ఘనుడంటే, మద్య నిషేధం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని ముందుగా దాదాపు 2000కోట్ల రూపాయలు పన్నులు విధించి, ఆ తరువాత మద్య నిషేధాన్ని ఎత్తివేశాడు. ఆ పన్నుల్ని మాత్రం అలాగే కొనసాగించాడు. 1999లో వాగ్దానాలు - బాబు ఏం చేశాడు? ' మహిళలకు - మహిళలకు మాంగల్యాలు, మహిళా బ్యాంకులు, 10వ తరగతి వరకు బాలికలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, బాలికలకు సైకిళ్ళు... బాలికా సంరక్షణ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.5వేలు నగదు.... ' పేదలకు పక్కా ఇళ్లు, భూమి లేని వారికి పట్టాలు... ' 200పైగా జనాభా ఉన్న ప్రతి ఆవాసానికీ రక్షిత తాగునీరు ' మూడేళ్లలో నిరుపేదల్లో అర్హులందరికీ ఇళ్ళ స్థలాలు ' బలహీన వర్గాలకు అయిదేళ్ళలో 35లక్షల ఇళ్లు. బలహీన వర్గాలకు ఏటా 7లక్షల పక్కా గృహాలు- 5ఏళ్ళలో 35లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. 2002 నాటికే పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు. ' ఇవేవీ జరగలేదు. ' కోటి మందికి ఉద్యోగాలు అని చెప్పి 2001 నాటికి 21,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ' 25లక్షల ఎకరాలకు సాగునీరు అని చెప్పి ఒక్కటంటే ఒక్క పెద్ద ప్రాజెక్టు చేపట్టిన పాపాన పోలేదు. ' బలహీన వర్గాలకు ఏటా 7లక్షల పక్కా గృహాలు- 5 ఏళ్ళలో 35 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ కట్టినది ఎంతంటే... 13 లక్షల, 23 వేలు. అంటే దాదాపు మూడో వంతు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు కట్టింది 27.5 లక్షలు. ' బీసీల గురించి మాట్లాడే చంద్రబాబు బీసీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారు. ఆప్కోను నిర్వీర్యం చేశారు... ఆప్టెక్స్లను రద్దు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జనతా వస్త్రాలను ప్రవేశపెడితే- ఆ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. ' 2009 ఎన్నికల్లోనూ బీసీలకు 100 సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు- తీరా ఎన్నికలు వచ్చాక మాట తప్పి 50 సీట్లే ఇచ్చారు. ఈసారి పరిస్థితి మరీ దారుణం. 100 ఇస్తామని చెప్పి 38 ఇచ్చారు. ' మైనార్టీలకు- దుకాన్ అవుర్ మకాన్... పథకం పేరుతో 5వేల మందికి ప్రయోజనం చేకూరుస్తామన్నారు. అదీ గోవిందా. ' వ్యవసాయ రంగానికి 12గంటల పాటు- అదీ కూడా పట్టపగలు ఉచిత కరెంటు ఇస్తానని 2009 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చంద్రబాబు పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకునే దండేల్లా మారతాయన్నాడు. మంచినీళ్లడిగితే గుంతలు తవ్వుకోమన్నారు... ' 200 ఇళ్ళకు పైగా ఉన్న ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బాబు అన్నారు. చివరికి ‘ఇంటింటికీ ఇంకుడుగుంత మీరే తవ్వుకోండి. మీ ఊళ్ళో చెరువుల్లో పూడిక మీరే తీసుకోండి. మీ ఊళ్ళో కాల్వల్ని మీరే బాగుచేసుకోండి’ అని కరువు కాటకాల తన పాలనలో కనీసం బోర్లు, బావులు కూడా తవ్వించకుండా ప్రజల గొంతు ఎండగట్టిన పాలన చంద్రబాబుది. -
అవకాశవాద పొత్తులు ఎండనుబట్టి గొడుగులు
ఎన్నికల్లో పొత్తులకు... స్నేహాలకు సంబంధించి చంద్రబాబుకు సిద్ధాంతాలేం లేవు... కేవలం అవసరాలే. ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1994 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. 1999 ఎన్నికల్లో బాబు కమ్యూనిస్టులకు కటీఫ్ చెప్పి బీజేపి పంచన చేరారు. 2004లో తిరిగి బీజేపీతోనే ముందుకు వెళ్లారు. 2009లో బీజేపీకి కటీఫ్ చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో, తెరాసాతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేశారు. మతతత్వ పార్టీ బీజేపీతో జీవితంలో కలిసే ప్రసక్తే లేదన్నారు. మోడీ వంటి నరహంతకుని హైదరాబాద్‌లో అడుగు పెట్ట నిచ్చేది లేదని హెచ్చరించారు. తనను మించిన సెక్యులర్ ఇంకెవరూ లేరన్నారు. ప్రస్తుత ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందన్నారు. చివరి నిమిషంలో అదే బీజేపీతో స్నేహం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రాపకం కోసం బాబు తాపత్రయం మరీ విడ్డూరం. జూనియర్ ఎన్టీఆర్‌తో 2009 ఎన్నికల ప్రచారాన్ని చేయించుకున్న చంద్రబాబు ఈ సారి జూనియర్ స్థానంలో పవన్‌కల్యాణ్‌ను తిప్పాలనుకున్నారు. మోడీకి జై కొడుతోన్న పవన్ కాస్తా టీడీపీ ఊసెత్తకపోయే సరికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కనపెట్టి... పవన్ కల్యాణ్ ఇంటికి తానే ఫోను చేసి మరీ తేనీటికి వస్తున్నానని చెప్పి వెళ్లి పార్టీకి ప్రచారం చేసి పెట్టమని ప్రాధేయపడ్డారు. 1994 ఎన్నికల్లో జనామోదం పొందిన ఎన్టీఆర్‌ను ఏడాదికే అన్యాయంగా పదవిలో నుంచి దించి 1995లో పాలనా పగ్గాలు చేపట్టిన బాబు, 1996లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ముద్ర వేయలేక పోయారు. పార్టీ అధినేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని, లేదంటే 1999 శాసనసభ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని ఆయనకు బాగా తెలుసు. దాంతో, అప్పటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసిన బాబు కాంగ్రెస్‌తో పాటు బీజేపీపైనా ధ్వజమెత్తారు. అది మతతత్వ పార్టీ అని గొంతు చించుకుని ప్రచారం చేశారు. ముస్లిం మైనారిటీ ఓట్ల మీద కన్నేశారు. విజయవాడలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, బీజేపీ ఎంత మతతత్వ పార్టీ అంటే, అది మసీదు (బాబ్రీ మసీదు)లను కూలుస్తుంది అన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా 1998లోనూ టీడీపీకి ఆశించిన స్ధాయిలో లోక్‌సభ స్థానాలు రాలేదు. అలా బాబు లెక్క తప్పింది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ దక్కుతుందన్న భరోసా కలగలేదు. మరి దొడ్డిదారిన తెచ్చుకున్న అధికారం నిలుస్తుందో, లేదో! ఈ సందేహంతో బాబు సతమతమయ్యారు. లౌకికవాదపు రంగు పులుముకుని అంతకు ముందు దాకా తాను చెప్పిన మాటలన్నీ మరచి బీజేపీతో అంటకాగారు బాబు. ఆయన అదృష్టం బాగుండి ఆ ఎన్నికల్లో గండం గట్టెక్కారు. అలా ఆయన సీఎం పీఠం నిలబడ్డా ఆయన లౌకిక వాదం మాత్రం గాలికి పోయింది. గోధ్రా అనంతర అల్లర్లకు కారకుడైన నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీల్లేదని, వెంటనే ఆయన్ని మార్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో 2002 ఏప్రిల్ 11న తీర్మానం చేసింది. మోడీని తక్షణం గద్దె దించకపోతే తాము ప్రజా విశ్వాసం కోల్పోతామని టీడీపీ భీష్మించింది కూడా. అయినా బీజేపీ నాయకత్వం వీసమెత్తు కూడా ఖాతరు చేయలేదు. గుజరాత్ మత అల్లర్లకు సంబంధించి మోడీపై వాజ్‌పేయి ఆగ్రహంగా ఉన్నారని అందిన గాలి వార్త ఆధారంగా, దాన్నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు బాబు నెత్తికెత్తుకున్న ‘మోడీని మార్చాల్సిందే’ నినాదపు ఎత్తుగడ అలా వికటించింది. 2003లో అలిపిరిలో మందుపాతర పేలుడు ఉదంతం తర్వాత మరోమారు సానుభూతి పవనాల సాయంతో గట్టెక్కాలని ఎంతగానో ఆశపడ్డారు. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడన్నట్టు బీజేపీతో పొత్తు సాగిస్తూనే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ జనాగ్రహం దెబ్బకు తాను మునగడమే గాక కేంద్రంలో ఎన్డీఏ కూటమినీ, దాని ప్రధాన భాగస్వామి బీజేపీనీ ముంచారు. తానూ తేలిపోయారు. 2004లో అధికారం దూరమైన నాటి నుంచి చంద్రబాబు మళ్లీ మాట మార్చారు. ఎన్డీఏతో పొత్తు తప్పేనని, గోధ్రా అల్లర్ల ప్రభావం తమపైనా పడి ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమయ్యారని పాత పాట అందుకున్నారు. 2009 ఎన్నికల ముందు పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుతో ఈ మేరకు బహిరంగ ప్రకటన ఇప్పించారు. నెపాన్ని బీజేపీపై నెట్టి, నెమ్మదిగా ఇతర పక్షాలకు దగ్గరయ్యే యత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ వాతావరణాన్ని, దాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న జాడల్లేని సీమాంధ్ర రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త ఎత్తుగడకు దిగారు. అది కాస్తా చివరికి మహా భంగపాటుకే దారి తీసింది. ‘బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడం తప్పయింది. మేం అధికారంలో ఉన్నప్పటి మా విధానం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం’ అంటూ 2011 మేలో జరిగిన టీడీపీ మహానాడులో బహిరంగంగానే బాబు చెంపలేసుకున్నారు. ‘గోధ్రా అనంతర ఘటనలకు బీజేపీ నాయకత్వమే కారణం. అదే గనక జరిగి ఉండకపోతే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం’అని పార్టీ 30వ వ్యవస్థాపన దినం సందర్భంగా 2012 మార్చి 29న అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పలికారు. అదే అసెంబ్లీ వేదిక నుంచి, అంతకు ముందే ముస్లిం మైనారిటీలకు క్షమాపణ చెబుతూ, ‘జీవితంలో మరోమారు బీజేపీ వైపు వెళ్లను గాక వెళ్లను’ అని కూడా అన్నారు. ‘బీజేపీతో పొత్తు జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని భవిష్యత్తులో మళ్లీ చేయను’ అని 2013 జూన్ 11న మైనారిటీలతో జరిగిన సదస్సులో కూడా చెప్పారు బాబు. తాజాగా దేశంలో మోడీ గాలి వీస్తోందంటూ మీడియా కథనాలు రాగానే, బీజేపీ పిలవకపోయినా బాబు అటువైపు అదేపనిగా పరుగులు తీశారు. గతమంతా నీటి మూటే అయింది. తానే పలికిన లౌకికవాదం గాలి మాటగా మిగిలింది. తప్పని చెంపలేసుకున్న బీజేపీతో పొత్తే మళ్లీ ముద్దయింది. విశ్వసనీయత అడుగంటిన టీడీపీతో పొత్తు వద్దుగాక వద్దంటూ బీజేపీ స్థానిక నాయకత్వమంతా ఎంతగా మొరపెట్టుకున్నా, పక్షం రోజుల పాటు ఇదో రాజకీయ వివాదంగా మారినా... బాబు పట్టుబట్టి మరీ ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబు మార్కు అవకాశవాదానికి ఇవి కొన్ని మచ్చుతునకలు. బాబుపై వేసిన చార్జిషీట్‌ను మరచిందా బీజేపీ? టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు, సంభాషణలను గుర్తుచేసుకుంటే... ఆ రెండింటి మధ్య పొత్తు చారిత్రక పొత్తా? చరిత్ర హీనమైన పొత్తా? అనేది అవగతమవుతుంది. 1998లో బాబు పరిపాలనలో వంద తప్పులు అంటూ బీజేపీ చార్జిషీట్ వేసింది. తాము అధికారంలోకి వస్తే బాబుపై సీబీఐ విచారణ జరిపించి కటకటాల వెనక్కి పంపిస్తామంది. -
తిరుగులేని రాజధాని... ఎదురు లేని రాష్ట్రం
ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆరంభంలోనే విప్లవం అత్యాధునికమైన, పర్యావరణపరంగా అత్యున్నతమైన, దేశంలోని రాష్ట్రాల రాజధాని నగరాలతో కాకుండా... ప్రపంచంలోని సుందరమైన నగరాలతో పోల్చదగిన, సామాన్యుడికి కూడా చేరువగా ఉండే వరల్డ్ క్లాస్ రాజధాని నగరాన్ని నిర్మించాలనేది జగన్ సంకల్పం. కొత్త రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రాజధాని గురించి, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అభివృద్ధి గురించి జగన్ ఆవిష్కరించిన ప్రణాళిక ఇదీ... ► పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే. ► కొత్త రాజధానికి-ప్రధాన నగరాలకు మధ్య రేపిడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం. ► ఎన్టీపీసీ-బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టు పూర్తి. ► కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 8 లేన్ల రోడ్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ, రైలు మార్గం, బులెట్ ట్రైన్ సదుపాయం. ► విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ► అనంతపురం-కృష్ణపట్నం ఇండస్ట్రియల్ కారిడార్. ► పెట్రోలియం, కెమికల్స్, పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ . ► రాయలసీమ, కోస్తా ఆంధ్రల్లో ఒక్కో చోట ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్. ► విజయవాడ, విశాఖ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు అంతర్జాతీయ స్థాయి. ► ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వేజోన్. ► విశాఖపట్టణంలో మెట్రో రైలు; విజయవాడ, గుంటూరు, తెనాలి - మెట్రోపాలిటన్ ఏరియాలో మెట్రో రైలు. ► దుగ్గరాజపట్నం నౌకాశ్రయం. ► మచిలీపట్నం, వాన్‌పిక్ పోర్టులు. ► 800 మెగావాట్ల కృష్ణపట్నం-2 థర్మల్ ప్లాంట్. ► 800 మెగావాట్ల వీటీపీఎస్ అయిదో దశ నిర్మాణం. ► 960 మెగావాట్ల పోలవరం హైడ్రో పవర్ స్టేషన్. ► 1600 మెగావాట్ల వాడరేవు మెగా పవర్‌ప్లాంట్ స్టేజి-1 నిర్మాణం. ► పోలవరంతో పాటుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం. ► కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లో డ్రైనేజి వ్యవస్థ ఆధునికీకరణ. ► ప్రతి జిల్లాలోనూ ఆగ్రో ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ సదుపాయాల ద్వారా వేల కొద్దీ అదనపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఏటా పది లక్షల ఇళ్ళు చొప్పున అయిదేళ్ళలో యాభై లక్షల ఇళ్లు. ► మునుపటిలా పక్కా ఇంటి నిర్మాణానికి మార్జిన్ మనీ, రుణ భారం లేకుండా, వాటిని రద్దు చేసి... ప్రభుత్వమే ఇళ్ళు కట్టించి, ఇళ్ళ పట్టాలు ఇస్తుంది. బ్యాంకర్లతో మాట్లాడి ఈ ఇల్లే గ్యారంటీగా స్వయం ఉపాధి కోసం రూ.30 వేల వరకు పావలా వడ్డీ రుణం ఇప్పించే ఏర్పాటు. ► ప్రతి గ్రామ పంచాయతీలోనూ వివిధ సామాజికవర్గాల్లో చదువుకున్న 10మందికి మహిళా పోలీసు ఉద్యోగాలు, తద్వారా సోషల్ ఆడిటింగ్. ► జిల్లాకో సూపర్ స్పెషాలిటీ, రాజధాని కేంద్రంలో 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు. ► 104, 108ల విస్తరణ ద్వారా మెరుగైన సేవలు, మరిన్ని ఉద్యోగాలు. ► రాష్ట్రంలో మూడు వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, వాటికి అనుబంధంగా ప్రతి రెండు జిల్లాలకు ఒకటి చొప్పున వ్యవసాయ కళాశాల, పంటల సాగునుబట్టి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, భూసార పరీక్షలు, వ్యవసాయ సూచనల కోసం ఆ కళాశాలలకు అనుబంధంగా మొబైల్ ఆగ్రి క్లినిక్‌లు, మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు. ► జిల్లాకో విశ్వ విద్యాలయం ఏర్పాటు ద్వారా ఉద్యోగం, ఉపాధి. ఇంత భారీ ప్రాజెక్టులన్నింటినీ ఒకేసారి చేపట్టటంతో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఆర్థిక వ్యవస్థలో కదలిక వస్తుంది. నిర్మాణ రంగంలో కూడా భారీ బూమ్ చోటు చేసుకుంటుంది. ఫలితంగా ఆర్థిక వృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఒక రంగంలో వేగం మిగతా రంగాల అభివృద్ధి వేగానికి మల్టిప్లయర్ ఎఫెక్ట్ ద్వారా అనేక రెట్లు దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్, సిమెంట్ ఉత్పత్తితో పాటుగా కార్మికులు, ఉద్యోగులు అదనంగా అవసరం అవుతారు. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో లక్షల కొద్దీ కొత్త కొలువులు లభిస్తాయి. స్టీల్, సిమెంటుకు పెరిగే డిమాండ్ సున్నపు రాయి, ఇనుము మైనింగులకు భారీ డిమాండ్‌ను తీసుకువస్తుంది. ఆ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలూ విసృ్తతం అవుతాయి. వీటన్నింటికీ ముడిపడిన రవాణా రంగంలో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. లక్షలాది ఉద్యోగాలకు తద్వారా బాటలు పడి ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, ఇతరత్రా ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ వైఎస్సార్ కాంగ్రెస్ అభివృద్ధి ప్రణాళికతో మొత్తం ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించి, మిగతా రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం తథ్యం! -
మా సారు వస్తేనే... మాకు బతుకు
‘మాకు పెద్దగా కోరికలేమీ లేవు. మా గూడు మాకుంటే చాలు. మా తిండి మాకుంటే చాలు. మొక్కవోని మా ధైర్యం మాకుండనిస్తే చాలు. కాకపోతే జగనన్న రాజ్యంలో మాకు ఏ చీకూ చింత ఉండదు..’ అని చెబుతున్నారు గిరిజనులు. రాజన్న వారసత్వమే ఈ నమ్మకానికి గీటురాయి అనేది వాళ్ల భావన. విశాఖ జిల్లా అరకులోయలో ‘సాక్షి’ నిర్వహించిన రోడ్‌షోలో పలువురు గిరిజనులు తమ మనోభావాలను ఈవిధంగా పంచుకున్నారు. రాజన్నకు గుండె నిండా ప్రేమ సారూ.. మట్టిలో పుట్టి... ఈ మట్టిలోనే పెరిగిన మమ్మల్ని రాజన్న పలకరించిండు సారూ! గుండెలకు హత్తుకున్నడు. ఈ ఊరు వచ్చిన ప్రతిసారీ ఏం కావాలని అడిగేవాడు.. ఇప్పుడు జగన్ సారూ అంతే... ఇంట్లోకి వచ్చి మాట్లాడాడు. పెన్షన్ వస్తుందా.. అని అడిగాడు. ఇంతకన్నా మాకేం కావాలి. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రయితేనే మేలు... అవుతాడు... ఆయన కోసం ఊరూరు తిరుగుతాం. - సింగారి రాము, రంగిని వలస 108 లేకుంటే ఏమయ్యేవాడినో.. రాజన్నకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే రాజన్న ప్రవేశపెట్టిన 108 నాకు పునఃజన్మనిచ్చింది. రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోతే... ఒక్క ఫోన్‌కాల్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లింది. అదే లేకపోతే నేను ఇప్పుడు మీ ముందు ఉండేవాడినే కాదు. అందుకే రాజన్న వారసుడు పాలకుడు కావాలి. ఆయన ఆశయాలను బతికించాలి. - కార్తీకరాజు, సుంకరమెట్ట జగనన్న మాకు ఉద్యోగమిస్తాడు చదువుకున్నా.. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఉద్యోగం రాలేదు. ఊళ్లోనే పనులకెళ్తున్న. జగనన్న వస్తే యువతకు ఉద్యోగం గ్యారెంటీ. ఉన్న ఊళ్లోనే మాకు బతుకుతెరువు చూపిస్తాడు. యువకులందరూ ఇదే ఆశతో ఉన్నారు. బాబు పాలనలో ఉన్న ఉద్యోగాలే తీసేశారు. ఆయన పాలన మాకొద్దు బాబోయ్.. - శెట్టి ప్రియాంక, లోతేరు బాబువన్నీ మాయమాటలే.. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలే. జగనన్న పథకాలు మా గిరిజనుల బతుకులను బాగుచేస్తాయనే ప్రతి ఒక్కరం నమ్ముతున్నాం. మా కష్టసుఖాలన్నీ ఆయన తెలుసుకున్నాడు. అందుకే మాకు మేలు చేస్తాడని అందరం నమ్ముతున్నాం. - ఎస్ భాగ్యవతి, జాకర వలస వైఎస్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నం.. వైఎస్ మా ఊరు వచ్చి ఏం కావాలని అడిగిండు. ఏ మొద్దన్నం. ఇల్లులేదు కాదా అన్నాడు. అధికారులను పిలిచి, ఇల్లు కట్టించమని చెప్పాడు. అంతే, రెండు నెలల్లో అయిపోయింది. మా బాగోగులు పట్టించుకున్న మహానుభావుడు. ఆయన కొడుక్కీ అలాంటి లక్షణాలే ఉన్నాయి. మాకు నమ్మకం ఉంది. ఆయన గెలుస్తాడు. మా తండాలకొస్తాడు. మా ఊళ్లో అందరికీ ఇల్లిస్తాడు. - గొల్లూరి దాతిమ్మ, చినలబుడు గ్రామం -
బాబు, రాజన్నపాలనలో... ఐటీ
బాబు పాలన హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధికి తానే కారకుడినంటూ చెప్పుకునే చంద్రబాబు మాటల్లో నిజం ఎంతుందో ఓసారి చూద్దాం! వై2కే వల్ల అమెరికాలో ఏర్పడిన డిమాండ్ కారణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎగుమతులకు భారతదేశానికి గొప్ప అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన ముందు పని చేసిన ముఖ్యమంత్రులంతటి సమర్థుడై ఉన్నా ఆ ఆవకాశాన్ని అందిపుచ్చుకుని సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టి ఉండేవారు. ఎందుకంటే దేశంలోని ప్రప్రథమ ఎస్టీపీఐ (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్) 1991లోనే ఆంధ్రప్రదేశ్‌లోనే స్థాపించడం జరిగింది. అలాగే ప్రభుత్వ రంగ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీఎంసీ) సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఎస్టీపీఐ, సీఎంసీ ఒక వైపు, సత్యం కంప్యూటర్స్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజం మరో వైపు ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ ఎగుమతులలో రాష్ట్రం ఆయన హయాంలో అగ్రస్థానం సాధించలేకపోయింది. ఐటీ నిజాలు 1995 సెప్టెంబర్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందుగా సాఫ్ట్వేర్ ఎగుమతులలో దేశంలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2004 నాటికి 5వ స్థానానికి పడిపోయింది. 1995-96 మధ్య కాలంలో సాఫ్ట్వేర్ ఎగుమతులలో బెంగుళూరు, హైదరాబాద్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే 2003-04లో అంటే చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి సాఫ్ట్వేర్ ఎగుమతులలో ఈ రెండు నగరాల మధ్య ఉన్న వ్యత్యాసం 2,500 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది.2003-04లో భారతదేశం నుంచి జరిగిన సాఫ్ట్వేర్ ఎగుమతులలో కర్నాటక వాటా 38 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 8 శాతం మాత్రమే. చాలా ఆలస్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఆ తర్వాత కాలంలో అంటే... చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అధిగమించిపోయాయి. అలా... దక్షిణ భారతదేశంలో మూడవ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ‘భారతదేశానికే ఐటీ రాజధాని’ అంటూ, చంద్రబాబు మీడియాను మేనేజ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం ప్రారంభించారు. ఐటీ రంగంలో ఎవరి పరిపాలన ఎలా జరిగింది? ఆంధ్ర ప్రదేశ్ అధికారిక చంద్రబాబు వై.ఎస్.ఆర్. వృద్ధి గణాంకాలు (1994-’04 సగటు) (2004-’09) దేశంలో ఐ.టి.లో రాష్ట్ర వాటా 8 శాతం 14 శాతం ఐ.టి. ఉద్యోగాలు 81 వేలు 2.51 లక్షలు ఐ.టి. ఎగుమతులు 2004లో 5 వేల కోట్లు 2009లో 33 వేల కోట్లు జగన్ సంకల్పం కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం హైదరాబాద్‌ను కోల్పోయినందున రెవెన్యూలో వాటానే కాదు... మాన్యుఫాక్చరింగ్, ఐటీ రంగాలను కూడా కోల్పోయింది. అంతమాత్రాన నిరాశ చెందనక్కరలేదు. అభివృద్ధికి కేవలం నిధుల లేమి ఒక్కటే అవరోధం కాదని నిరూపిస్తా! ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఐటీఐఆర్ (ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ను నెలకొల్పుతామని విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తాం. రాయలసీమ, కోస్తా ఆంధ్రల్లో రెండుచోట్లా ఐటీఐఆర్‌లు ఏర్పాటు చేస్తాం. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు పారిశ్రామిక కారిడార్ నెలకొల్పడంతో పాటు కేంద్రం ఇచ్చిన పారిశ్రామిక, ఐటీఐఆర్ హామీలు నెరవేరేలా కృషిచేస్తాం. వీటివల్ల అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమల వృద్ధికి వీలు ఏర్పడుతుంది. తద్వారా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, టెక్నీషియన్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు వీలు కలుగుతుంది. పరిశ్రమలు బాబు పాలన ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి కార్మిక వర్గం నుంచి ప్రతిఘటన తప్పడం లేదు. ఆయన ఏలుబడిలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డ గడ్డు పరిస్థితులే శ్రామిక లోకానికి గుర్తుకొస్తున్నాయి. బాబు హయాంలో సంస్కరణల పేరుతో 87 ప్రభుత్వ రంగ సంస్థల నడ్డి విరిచారనేది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. 1994- 2004 మధ్యకాలంలో 22 సంస్థలను మూసివేశారు. మరో 12 సంస్థలను పునర్వ్యవస్థీకరించారు. 11 సంస్థలను ప్రైవేటీకరించారు. 9 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 54 సంస్థల తలరాతనే చంద్రబాబు మార్చేయడం అప్పట్లో విమర్శలకు కారణమైంది. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేది ఆరోపణ.రాష్ట్ర స్థాయి సంస్థలు, కో-ఆపరేటివ్ సంస్థల మార్కెట్ విలువ రూ. 636 కోట్ల వరకూ ఉంటే కేవలం రూ.209 కోట్లకే అమ్మారనే దానికి బాబు వద్ద సరైన సమాధానం లేదు. ఏమిటీ దారుణం? చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకూ సజావుగా లాభాలతో నడిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు దివాలా తీశాయో, ఆ తర్వాత అవి టీడీపీ నాయకగణం చేతుల్లోకి వెళ్లాక ఎలా లాభాల బాట పట్టాయో విడ్డూరమే. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు ఇంటిదారి పట్టినా చంద్రబాబు సర్కారుకు పట్టలేదు.2002లో హనుమాన్, ఏఎస్ఎం కో ఆప రేటివ్ షుగర్‌మిల్స్, డెల్టా పేపర్ మిల్స్‌ను కారు చౌకగా కట్టబెట్టడం, టీడీపీ ఎంపీ నామా నాగే శ్వరరావుకు పాలేరు షుగర్స్ ధారాదత్తం చేయడం, బాబుకు సన్నిహితుడు మండవ ప్రభాకర్ రావుకు చెందిన ఎన్ఎస్ఎల్ గ్రూప్‌నకు షుగర్ మిల్లు, స్పిన్నింగ్ మిల్లును రాసివ్వడం సభా సంఘాలనే విస్మయపరచింది. ఇదో పెద్ద దోపిడీ నిజాం షుగర్స్ బాబును ఇప్పటికీ వెంటాడే శాపమే. ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ పరిశ్రమ వెన్నులో కత్తి దూసిన వైనాన్ని కార్మిక లోకం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది. షక్కర్నగర్, మెట్పల్లి, ముంబోజిపల్లి చక్కెర మిల్లులతో పాటు షక్కర్నగర్ డిస్టిలరీని విక్రయిం చిన వ్యవహారంలో ప్రభుత్వానికి 300 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని శాసనసభా సంఘం అంచనా వేసింది. నిజాం షుగర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 173 కోట్లు సాయం చేసిందంటూ 2000 సెప్టెంబర్‌లో చంద్రబాబు తప్పుడు సమాచారం ఇవ్వడాన్ని ఉటంకించింది. వివిధ కార్పొరేషన్స్ ద్వారా నిజాం షుగర్స్ రుణాలు తీసుకుందని వెల్లడించింది.నిజాం షుగర్స్ నాలుగు యూనిట్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకు అమ్మేసింది. అదీ శాసనసభ రద్దయిన తర్వాత. తన హెరిటేజ్ కోసం వేలాది రైతులు, ఉద్యోగుల పొట్టగొట్టారనే ఆరోపణలకు చంద్రబాబు ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోతున్నారు. రాజన్న రాజ్యం హా దేశంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: రిజర్వ్‌బ్యాంకు నివేదిక 2007 హా దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో ఆంధ్రప్రదేశ్ మంచి ఫలితాలను సాధిస్తోంది: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) హా దేశంలోనే ఏపీ ముందంజలో ఉంది: ప్రపంచబ్యాంకు నివేదిక 2007 హా పేపరు, సిమెంట్, బల్క్ డ్రగ్స్ తయారీలో దేశంలో మొదటిస్థానం హా 2008-09 తొలి ఆరు నెలలకు రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకొచ్చాయి. వాటిని ఆకర్షించడంలో ఏపీయే నంబర్‌వన్: సీఐఐ సర్వే జగన్ సంకల్పం పరిశ్రమలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 మూడవ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని అంశాలను అమలుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం.అలాగే, అందుబాటులో ఉన్న అన్ని సహజ వనరులు, ఖనిజాలను సద్వినియోగంలోకి తీసుకు రావడం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికీకరణ అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించేలా కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు మరో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్ర పరిధిలోని అనంతపురం, కృష్ణపట్నం కారిడార్లను కూడా ఏర్పాటు చేస్తాం. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, పీసీపీఐఆర్, ఐటీఐఆర్, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ అన్నీ తోడైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప ప్రేరణ కలుగుతుంది. దేశంలోని మాన్యుఫాక్చరింగ్ రంగంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) అత్యంత ప్రధాన భూమిక పోషిస్తాయి.అత్యధికమందికి ఉపాధి కల్పించే రంగాలలో మాన్యుఫాక్చరింగ్ రంగం ఒకటి. అలాంటి ఈ రంగం తీవ్రంగా పెరిగిపోయిన విద్యుత్ చార్జీలు, ప్రకటిత, అప్రకటిత విద్యుత్ కోతలతో దారుణంగా నష్టపోయింది. ఈ రంగం ఆర్థికంగా లాభసాటిగా మారేందుకు దీనికి ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీని అందించాలని మేము భావిస్తున్నాం. -
జగనన్న హామీ పథకాలు
అమ్మ ఒడి బిడ్డ భవిష్యత్తు కోసం ఏ తల్లీ భయపడాల్సిన పనిలేదు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు తల్లికి ఊరట! బిడ్డను బడికి పంపితే అమ్మ ఖాతాలోకి డబ్బు. 1 నుండి 10వ తరగతి వరకు ప్రతి బిడ్డకు నెలకు రూ.500, ఇంటర్ చదివిస్తే రూ.700, డిగ్రీలో రూ.1000. మీ పిల్లల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తాను. పింఛన్లు అన్నం కోసం వృద్ధులు కూలి పని చేయకూడదు. ప్రతి అవ్వకు, తాతకు నెలకు రూ.700 పింఛను, వితంతువులకు నెలకు రూ.700, వికలాంగులకు నెలకు రూ.1000. ప్రతి నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు ఆశ్రమాలు స్థాపిస్తాం. వాటిని మండలస్థాయికి విస్తరిస్తాం. అవ్వాతాతలకు ఇది ఒక మనవడి మాట. వ్యవసాయం గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రభుత్వం బాధ్యత. రైతుల కోసం రూ.3000 కోట్ల స్థిరీకరణ నిధి. ఇక కరువులకు, వరదలకు భయపడాల్సిన పనిలేదు. రూ.2000 కోట్లతో ప్రతి ఏడాది ప్రత్యేక సహాయనిధి. భూసార పరీక్షలు, రైతులకు సలహాలు, సూచనలకోసం 102 సర్వీసు. ప్రతి రెండు జిల్లాలకు ఒక వ్యవసాయ కళాశాల. విత్తనాలు, ఎరువులు, మందుల క్వాలిటీ నియంత్రణ బాధ్యతను 102 అనుసంధానంతో కళాశాలలకే అప్పగిస్తాం. 108 లాగే పశుసంపద రక్షణకు 104 అంబులెన్స్. ప్రతి జిల్లాలో శీతల గిడ్డంగులు, నిల్వ సామర్థ్యం పెంపు. గ్రేడింగ్ వసతి, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ యూనిట్లు. ఈ వ్యవస్థను రెవిన్యూ డివిజన్ స్థాయికి విస్తరిస్తాం. వీటివల్ల రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర రావడమే కాక గ్రామీణ ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. వ్యవసాయ శాఖకు ఇద్దరు మంత్రుల నియామకం. వ్యవసాయాన్ని మళ్లీ పండగ చేస్తాం. పల్లెల్లోకే పాలన కార్డులకోసం కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పక్కా ఇంటి కార్డు ఇలా... అన్ని కార్డులు, పత్రాలు 24 గంటల్లో జారీ. అందుకోసం ప్రతి గ్రామంలో, వార్డులో ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాఫీసు. ప్రభుత్వాన్ని మీ ఇంటి ముందుకే తెస్తాను. పక్కా ఇళ్లు 2019 నాటికి గుడిసే లేని రాష్ట్రం... ఏటా 10 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు. ప్రస్తుతం ఇల్లు ఇచ్చినా యాజమాన్య హక్కు లేదు. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తాను. ఇంటిని రుణంలో కాదు.. ఇంటిమీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇస్తా... ఆదుకుంటా. మహిళా సంఘాల రుణాలు మాఫీ రూ.20 వేల కోట్ల మహిళా సంఘాల రుణాలు మాఫీ. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు. అక్కచెల్లెళ్లకు ఇది నా భరోసా. ఆరోగ్యశ్రీ ప్రతి పెద్దాసుపత్రిలో పేదలకు ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించిన అన్ని వ్యాధులనూ మళ్లీ చేరుస్తాం. డాక్టర్ల కొరత లేకుండా జిల్లాకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. కొత్త రాజధానిలో కార్డియాలజీ, క్యాన్సర్, కిడ్నీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ వంటి 20 ఫ్యాకల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో కూడిన హెల్త్ సిటీ. ఈ హెల్త్ సిటీని జిల్లాలకు అనుసంధానం చేసి, రొటేషన్ పద్ధతిలో ఎక్కడా, ఏ జిల్లాలోనూ డాక్టర్ల కొరత లేకుండా రొటేషన్ పద్ధతిలో డాక్టర్లు ఉండేలా చేస్తాం. ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను మరింత బలపరుస్తాం. 108, 104 సేవలను ఇంకా మెరుగుపరుస్తాం. ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు కోలుకునే సమయంలో పనిచేయలేరు కాబట్టి, వారికి నష్టం జరగకుండా ఉపాధి, మందుల కోసం నెలకు రూ.3000 సహాయం. నా కుటుంబం ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతుందో అదే హాస్పిటల్లో మీకూ వైద్యం, ఓ హక్కుగా చేస్తా. ఉచిత విద్యుత్ వ్యవసాయానికి రోజుకు 7 గంటలు పగటిపూటే నిరంతర ఉచిత విద్యుత్.2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.రైతు కుటుంబాల్లో మళ్లీ కాంతులు పండిస్తాను. 150 యూనిట్ల కరెంటు రూ.100కే... తప్పుడు బిల్లులు, ఛార్జీల భారంతో ఇన్నాళ్లూ ఇక్కట్లు. పెద్ద బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేశారు. ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటూ నిరుపేద కుటుంబాలు కరెంటు కోసం పక్కమార్గాలు వెతుక్కుంటున్నాయి. ఇకపై ఈ చీకట్లు ఉండవు. 150 యూనిట్ల వరకు నెలకు రూ.100కే కరెంటు ఇస్తాం. దీనితో 3 బల్బులు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో విద్యుత్ వాడాలంటే భయపడే పరిస్థితి లేకుండా చేస్తా. బెల్టు షాపుల నిర్మూలన ప్రతి పల్లెలో అదే గ్రామానికి చెందిన 10 మంది మహిళా పోలీసులు. గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా లేకుండా చేస్తాం. నిరుపేద కుటుంబాల్లో సరికొత్త వెలుగులు. మద్యం మహమ్మారి నా అక్కచెల్లెళ్ల జీవితాలను ఛిద్రం చేయకుండా, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తా. యువతకు భవిత ఒక అన్నలా నా తమ్ముళ్లు, చెల్లెళ్ల ఉద్యోగాల కోసం శ్రమిస్తాను. చదువుకునే ప్రతి ఒక్కరికీ అండ... ఉద్యోగం వచ్చేదాకా తోడు. అంతర్జాతీయ స్థాయి చదువు ప్రతి ఒక్కరి హక్కుగా మారుస్తాను. చదువుకున్న ఏ ఒక్కరికీ భవిష్యత్తుపై భయం లేకుండా చేస్తా. -
బాబు, రాజన్నపాలనలో... మైనార్టీల సంక్షేమం
బాబు పాలన బాబు పాలనలో మైనార్టీలకు కేవలం రూ.32 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అవి కూడా చాలా వరకు అందకపోవడంతో మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యేవారు.విద్యాసంస్థల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేక చాలామంది చదువుకు దూరంగా ఉండేవారు. మధ్యలోనే చదువును మానేసి, బతుకుతెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవాళ్లు. దుకాన్-మకాన్ స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారం చేసుకోవడానికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, ఇళ్ల నిర్మాణానికి 3 శాతం వడ్డీతో రుణాల పంపిణీవితంతువులు, విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు 3 శాతం వడ్డీతో రూ.పది వేల రుణాలు.ష్నీ పథకం ద్వారా వృత్తి పనివారికి 20 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు, పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ మైనార్టీ పేద అమ్మాయిల వివాహాలకు నామమాత్రపు ఆర్థికసాయం చేసేవారు. రాజన్న రాజ్యం ళీ మైనారిటీల బడ్జెట్‌ను రూ. 350 కోట్లకు పెంచారు. ళీ పేద ముస్లింలకు రుణ మాఫీ చేశారు. ళీ ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలకు రూ.30 వేల చొప్పున సబ్సిడీ రుణాలు ఇచ్చారు. ళీ డోమువా పథకం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో నివసించే పేద ముస్లిం మహిళలకు సబ్సిడీ రుణాలు ళీ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ పథకం ద్వారా ముస్లిం పిల్లలకు విద్యా రుణాలు ళీ స్కాలర్షిప్ పథకం ద్వారా ప్రతి ఏటా 3 లక్షల మంది ముస్లిం పిల్లలు విద్యావంతులయ్యారు. ళీ ముస్లింలు విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందడానికి 4 శాతం రిజర్వేషన్ల కల్పన. దీనివల్ల లక్షల మంది విద్య, ఉపాధి రంగాల్లో రాణించారు. వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి. ఎన్నో కుటుంబాలు దారిద్య్ర రేఖ నుంచి పైకి ఎదిగాయి. ళీ పేద ముస్లిం అమ్మాయిల కోసం మాస్ మ్యారేజెస్ (సామూహిక వివాహాల) పథకాన్ని ప్రవేశ పెట్టారు. ళీ కుటుంబ వార్షికాదాయం రూ. 80 వేల కంటే తక్కువగా ఉన్నవారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు సబ్సిడీ రుణాల పంపిణీ ళీ దీపం పథకం ద్వారా ముస్లిం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ళీ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూను అమలు కోసం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించారు. ళీ మధ్యలో చదువు ఆపేసిన పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఓపెన్ స్కూల్స్ ఏర్పాటు. ళీ మదరసాల్లో చదివే విద్యార్థుల కోసం కంప్యూటర్ల ఏర్పాటు ళీ యువతకు ఐటీ, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి కంపెనీల్లో ఉద్యోగాల కల్పన. జగన్ సంకల్పం వైఎస్సార్ హయాంలో ప్రవేశపెట్టిన అన్ని మైనార్టీ పథకాలనూ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్రంలో కూడా కొనసాగిస్తాం. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, మాస్ మ్యారేజెస్, ఉర్దూ భాషాభివృద్ధి, ఉర్దూ మీడియం స్కూళ్లలో వసతులు, ఉర్దూ టీచర్ల నియామకం, ఉర్దూ అకాడమీకి మరిన్ని నిధులు, మైనారిటీ విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, పవిత్ర హజ్ యాత్రలో సబ్సిడీ, వక్ఫ్ భూముల పరిరక్షణ చట్టం, అర్హులైన అందరికీ గృహనిర్మాణాలు మొదలైనవన్నిటినీ అమలుచేస్తాం. మతపరమైన దాడులు జరగకుండా చట్టాలను కఠినతరం చేస్తాం. ముస్లింల కోసం ప్రస్తుతమున్న బడ్జెట్‌ను పెంచుతాం. ముస్లిం అమ్మాయిలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు సైకిళ్లు, యూనిఫామ్‌లను అందిస్తాం. మధ్యలో చదువు మానేసిన ముస్లిం విద్యార్థుల కోసం, అమ్మాయిలకు వృత్తి విద్యలో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ రుణాలు ఇస్తాం. మసీదుల నిర్మాణం, మరమ్మతుల కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకంలో ముస్లిం జనాభా ప్రతిపాదికన వాటా కల్పిస్తాం. పేద ముస్లిం అమ్మాయిల వివాహం కోసం ఒక అన్నయ్యలా వారి నిఖా సందర్భంగా 50 వేల రూపాయలను కానుకగా అందించి అర్థికంగా అదుకుంటా. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పటిష్ఠపరిచి తద్వారా చిన్న తరహా వ్యాపారులకు రుణాలు అందేలా చేస్తాం. -
బాబు, రాజన్నపాలనలో... పింఛన్లు
పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం! వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా, దానివల్ల అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ వైఎస్ వచ్చే వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. బాబు పాలన చంద్రబాబు హయాంలో అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. 2004లో పదవి నుంచి దిగిపోయే నాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు. రాజన్న రాజ్యం 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు.2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ. వంద నుంచి రూ. 200కు పెంచారు.2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. {పతి నెలా జీతంలా పెన్షన్లు ఇచ్చారు. జగన్ సంకల్పం అన్నం కోసం వృద్ధులు కూలి పని చేయకూడదు. ప్రతి అవ్వకు, తాతకు నెలకు రూ.700 పింఛను, వితంతువులకు నెలకు రూ.700, వికలాంగులకు నెలకు రూ.1000 ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో వృద్ధులకు, అనాథలకు ఆశ్రమాలు స్థాపిస్తాం. వాటిని మండలస్థాయికి విస్తరిస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే రెండో సంతకం ఇదే! అవ్వాతాతలకు ఇది ఒక మనవడి మాట. -
బాబు, రాజన్నపాలనలో... పక్కా ఇళ్లు
బాబు పాలన తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం దక్కినా కనీసం మూడో వంతు కుటుంబాలకు కూడా ఇళ్లను నిర్మించి ఇవ్వలేకపోయారు చంద్రబాబు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మితమైన ఇళ్లు 20 లక్షల లోపే.నియోజకవర్గానికి ఏడాదికి వేయి ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు అప్పట్లో చెప్పిన ఆయన, వాటి నిర్మాణంలో ఎమ్మెల్యేల పెత్తనాన్ని పెంచారు. వారు చెప్పినవారికే ఇళ్లు కేటాయించే పద్ధతిని కొనసాగించి, వాటిలో అనర్హులు పాగా వేసేలా చేశారు.జన్మభూమి పేరుతో అట్టహాసంగా నిర్వహించిన కార్యకమాల్లో... ఇళ్లు కావాలంటూ పేదలు లక్షల సంఖ్యలో అందజేసిన విజ్ఞాపనలను బుట్టదాఖలు చేశారు. ‘వాంబే’ పేర కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లనే తన ఘనతగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీశారు. రాజన్న రాజ్యం పేదలందరికీ సొంత గూడు ఉండాలన్న ఆలోచన కొత్తది కానప్పటికీ, సొంతిల్లు లేని కుటుంబం ఒక్కటి కూడా రాష్ట్రంలో ఉండరాదనే సంకల్పంతో ఆ బృహత్ ప్రణాళికను పూర్తి చేయటం ప్రారంభించింది మాత్రం వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పేదల కష్టాలను కళ్లారా చూసి... వాటిని దూరం చేయాలన్న తపనతో వారికి ఏం చేస్తే బాగుంటుందన్న కోణంలో అప్పుడే ప్రారంభమైన ఆలోచనలో పుట్టుకొచ్చిందే... ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలన్న తపన. 2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతకుముందు కొనసాగిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని మామూలుగానే కొనసాగించారు. అంతకుముందు మంజూరై నత్తనడక నడుస్తున్న కొన్ని ఇళ్లు కలుపుకొని మొత్తం నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేశారు. విప్లవాత్మక మార్పులు తెస్తేగాని పేదలందరికీ సొంత గూడు లభించదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం మూడేళ్ల కాలంలో వీలైనంతమంది పేదలకు ఇంటి వసతి కల్పించాలన్న లక్ష్యంతో ఓ యజ్ఞంలా దాన్ని ప్రారంభించి కొనసాగించారు. 2006-07, ఇందిరమ్మ మొదటి దశ: కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క ఏడాదిలోనే 20,22,801 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడసాగింది. ఇంతటి భారీ సంఖ్యలో ఇళ్లను ప్రారంభించి, పూర్తి చేయటం సాధ్యమా అని ముఖ్యమంత్రులంతా విస్తుపోయారు. కానీ రాజశేఖరరెడ్డి దాన్ని చేసి చూపారు.2007-08, ఇందిరమ్మ రెండో దశ: అంతకుముందు సంవత్సరం రికార్డును బద్దలు కొడుతూ 20,95,110 ఇళ్లను ప్రారంభించారు.2008-09, ఇందిరమ్మ మూడో దశ: 15,44,889 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇలా ఈ మూడేళ్ల కాలంలో సింహభాగం పేదలకు ఇళ్లు అందాయి. వైఎస్సార్ బతికున్నపుడు దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు కడితే.. ఆయన హయాంలోనే ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టారు.మరోసారి ప్రజల్లోకి వెళ్లి ఇంకా పేదల ఇంటి పరిస్థితిని కళ్లారా చూసి, వారి నోటివెంటే వారి పరిస్థితిని తెలుసుకోవాలనుకున్నారు. ఈలోపు ఎన్నికలు ముంచుకొచ్చాయి. పేదల వెన్నంటి ఉన్నందున రాజశేఖరరెడ్డిని ప్రజలు మళ్లీ ఆశీర్వదించారు. ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకోవాలన్న ఆకాంక్షతో ‘రచ్చబండ’ కార్యక్రమం చేపట్టారు... ఆ కార్యక్రమానికి వెళ్లే క్రమంలోనే ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మనందరికీ దూరమయ్యారు. జగన్ సంకల్పం ‘‘సొంత గూడు లేక లక్షల మంది దుర్భర జీవితం గడుపుతున్నారు. వారందరికీ యోగ్యమైన సొంతింటి అవసరముంది. వారి కలను నిజం చేసి చూపిస్తా. 2019 నాటికి ‘మాకు సొంతిల్లు లేదు’ అని ఎవరూ చెయ్యెత్తి చూపే పరిస్థితి లేకుండా చేస్తా. ఏటా 10 లక్షల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తా. ఇల్లు ఇచ్చినప్పుడే ఆడపడుచు పేరున పట్టా ఇస్తా. ఇంటిని రుణంలో కాదు.. ఇంటి మీదే రుణం తెచ్చుకునేలా చేస్తా. ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు తీసుకునే అవకాశం కల్పిస్తా. ఉండడానికి నీడనిస్తా... ఇంటి పత్రాలను చేతికిస్తా... ఆపదలో అవసరమైతే పావలావడ్డీకి రుణం తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చి ఆదుకుంటా! దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పేదలకు సొంత గూడు కల్పించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరు స్ఫూర్తిగా దీన్ని సాధ్యం చేసి చూపుతా...’’ -
బాబు, రాజన్నపాలనలో... ఆరోగ్యం
బాబు పాలన చంద్రబాబు తన పాలనలో వైద్య, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రజలు సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. {పభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులుండేవారు కాదు. ఇతర సిబ్బందీ అరకొరగానే ఉండేవారు. వైద్య పరికరాలు ఎప్పుడూ మరమ్మత్తులోనే ఉండేవి. 2002లో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేద రోగులతోనూ యూజర్ చార్జీలు వసూలు చేశారు.మందులు బయటి నుంచి తెచ్చుకోవాల్సిందే. ఏవైనా సేవలు కావాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.పేద రోగుల పరిస్థితి దారుణంగా ఉండేది. చికిత్స సరిగా జరగదేమోనన్న భయంతో ప్రభుత్వాసుపత్రులకు వెళ్లలేక, ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే ఖర్చు భరించలేక కొట్టుమిట్టాడేవారు. ఆపదలో ఆస్పత్రికెళ్లాలంటే వందలాది రూపాయలు చెల్లించి ఏ ప్రైవేటు వాహనాన్ని మాట్లాడుకుని వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్డు ప్రమాదం జరిగితే అంబులెన్సులు లేవు. పురిటినొప్పులకు ఎద్దుల బళ్లు లేదా వ్యక్తిగత వాహనాలే దిక్కు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే డోలీలోనే తీసుకుపోవాల్సిన పరిస్థితి. అంబులెన్సు అంటే ఏంటో ప్రజలకు తెలియని పరిస్థితి. వేళగాని వేళ ప్రమాదం జరిగితే ప్రాణంపై ఆశ వదులుకోవాల్సిన దుస్థితి. ఎలాగోలా ఆస్పత్రికి తీసుకెళ్లినా వైద్యం చేసేవారు కరువు. ఇక పల్లెటూరి రోగుల పరిస్థితిని ఊహించలేం. వృద్ధులు, బాలింతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికెళ్లినా సరైన మందులు దొరికేవి కావు. పట్నంలో ఉన్న పెద్దాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. పల్లెటూళ్లలో దీర్ఘకాలిక జబ్బులతో పాటు సాధారణ జబ్బులతో బాధపడే కోట్లాది మంది పేద రోగులు దుర్భర పరిస్థితులు అనుభవించేవారు. బాబు పాలనలో సీఎంఆర్ఎఫ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) కింద ఆర్థికసాయం కావాలంటే ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో బ్రతిమాలుకొని వారి ద్వారా వినతిపత్రం సమర్పించినా కచ్చితంగా సాయం వస్తుందనే భరోసా ఉండేది కాదు.ఒకవేళ ఈ సిఫార్సుల వల్ల మంజూరైనా అది అరకొర మొత్తమే. అప్పోసప్పో చేసి ఖరీదైన జబ్బులకు మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి పాతికవేలు మంజూరు చేస్తే అదే గొప్ప అన్నట్లుండేది.కీలక భూమిక నిర్వహించే మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలున్నవారికే ఎక్కువ మొత్తం మంజూరయ్యేది.దరఖాస్తు చేశాక అది మంజూరు కావడానికి కూడా రెండు3 నెలలకు పైగా పట్టేది. అత్యవసర వైద్యం కావాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) మాటే లేదు. అందువల్ల నిరుపేదలైనా అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిందే. ఈ నిధి (ఎల్ఓసీ) కోసం ఎదురుచూస్తే రోగుల ప్రాణాలకే ముప్పుగా ఉండేది. సిఫార్సులు లేని అభాగ్యులు చంద్రబాబు పాలనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి మీద ఆశపెట్టుకోవడమన్నదే అత్యాశ అన్న పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చంద్రబాబు నాయుడు తన చివరి అయిదేళ్ల పదవీ కాలం (1999 - 2004)లో 15 వేల మందికి 36 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేశారు. రాజన్న రాజ్యం 108 - 104 + 2006 సెప్టెంబర్‌లో తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. + 2007 నవంబర్ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలు ఇచ్చారు. + 2009 నాటికే ఈ పథకం పై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు. + రోజుకు 6వేలకు పైగా ఎమర్జన్సీ కాల్స్ వస్తే అందులో నాలుగువేల కాల్స్‌ను అటెండ్ చేసేవారు. + రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 3500 నుంచి 4వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరుస్తున్నాయి ఈ అంబులెన్సులు. + పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయింపులు జరిపారు. + 70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులకు ఫోన్ చేసి వినియోగించుకునేవారు. + ఫోన్ చేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ఘటనా స్థలానికి 25 నిమిషాల్లోనే చేరుకునేవి. + 108 వాహనాల్లో అత్యవసర పరికరాలతో పాటు మందులకు, సిబ్బందికి లోటు లేకుండా ఉండేది వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఖరీదైన చికిత్స అవసరమైన జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చారు.తొలి దశగా 2007 ఏప్రిల్ 1న మహబూబ్‌నగర్, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో 163 జబ్బులతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు.రెండవ దశలో భాగంగా 2007 డిసెంబర్ నాటికి ఈ పథకం కింద మరో ఐదు జిల్ల్లాలను (చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, రంగారెడ్డి, నల్లగొండ) చేర్చారు. రెండో దశలో 163 జబ్బుల నుంచి 272 జబ్బులకు పెంచారు.మూడవ దశలో భాగంగా 2008 ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ పథకంలోకి కడప, కరీంనగర్, మెదక్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను చేర్చి, చికిత్సల సంఖ్య 332కు పెంచారు.2008 జూలై నాటికి మిగిలిన పది జిల్లాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి, పథకం పరిధిలోకి ఏకంగా 942 జబ్బులను చేర్చారు. అంటే సరిగ్గా ఏడాదిన్నరలో పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన ఘనత దక్కించుకున్నారు. ఆరోగ్యశ్రీ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకూ లబ్ధి పొందిన వారు 23 లక్షల మంది పైనే. ఇందులో ఆరు లక్షల మంది ప్రభుత్వాసుపత్రుల్లోనూ, 16 లక్షల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు.గుండెజబ్బులు, కిడ్నీ (డయాలసిస్ రోగులు), నరాల జబ్బులు, కేన్సర్, కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి ఖరీదైన జబ్బులతో బాధపడే వారు ఎక్కువ శాతం మంది ఆరోగ్యశ్రీ కింద లబ్ధి పొందారు. పుట్టుకతోనే గుండె జబ్బులొచ్చిన నిరుపేద చిన్నారులెందరో ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందారు.రోజూ రెండు వేల వరకూ శస్త్రచికిత్సలు జరిగేవి. రోజూ రూ.2 కోట్లుపనే వాటికి వెచ్చించేవారు.నిత్యం ఆరోగ్యశ్రీ హెల్త్ క్యాంపులు జరిగేవి. రోజూ పాతికవేల మంది ఔట్పేషెంట్లు సేవలు పొందేవారు.ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా రూ. 925 కోట్లు కేటాయించేవారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.350 కోట్లు ఇచ్చేవారు.ఆరోగ్యశ్రీ పథకంలో అత్యంత ఖరీదైన చికిత్స కాక్లియర్ ఇంప్లాంట్. పుట్టుకతోనే చెవిటి, మూగతో పుట్టే వారిని శాశ్వత వైకల్యం నుంచి బయటపడేసేదే ఈ చికిత్స. రాజన్న రాజ్యంలో సీఎంఆర్ఎఫ్ వైఎస్సార్ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి సహాయనిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.అప్పటి వరకూ పెద్దల సిఫార్సులున్న వారికే పరిమితమైన సీఎం సహాయనిధి ఒక్కసారిగా పేదల పాలిట పె‘న్నిధి’గా మారింది.దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు.రాష్ట్ర సచివాలయంలోనే కాకుండా తన అధికార నివాసంలో కూడా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని తెచ్చారు.వైఎస్ రాజశేఖరరెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో సీఎంఆర్ఎఫ్ నుంచి లక్షా ముప్పై వేల మందికి పైగా రూ. 441.41 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనలోని చివరి అయిదేళ్ల కాలంలో మంజూరు చేసిన మొత్తంతో పోల్చితే ఇది 12 రెట్లు ఎక్కువ. {పజాప్రతినిధులు (ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల) సిఫార్సుల ఆధారంగా వచ్చిన వినతులకు సంబంధించి 86,468 మందికి రూ. 279.50 కోట్ల రూపాయల ఆర్థికసాయం మంజూరు చేశారు. ఎవరి సిఫార్సులూ లేకుండా నేరుగా తనను కలిసి ఆర్థికసాయం కోరిన 43,532 మందికి రూ. 156.50 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేశారు.పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న ఎందరికో సీఎంఆర్ఎఫ్ కింద వైద్యసాయం లభించింది.హఠాత్తుగా కుటుంబ యజమానిని కోల్పోయి పూట గడవక కష్టాలు పడుతున్న ఎన్నో నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించారు. పేద రోగుల కష్టాలు తెలిసిన వైద్యునిగా, డాక్టరు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ఎందరో పేదలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది వైద్యం చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారు. సీఎంఆర్ఎఫ్ నుంచి నిధుల మంజూరులో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఏ పార్టీ వారు సిఫారసు చేసినా వినతి అందిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేశారన్న ప్రశంసను వైఎస్ అందుకున్నారు. జగన్ సంకల్పం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నుంచి తొలంగించిన 133 వ్యాధులను మళ్ళీ ఆ పథకంలో చేర్చి, మరిన్ని ఆస్పత్రుల్లో పథకం అమలయ్యేలా చూస్తాం. బధిరులకు, మూగవారికి... ప్రత్యేకంగా కాక్లియర్ ఇంప్లాంట్ వంటి ఖరీదైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును రీయింబర్సు చేస్తాం. ఈ ఖర్చు ఒక్కోసారి రూ. 6 లక్షల వరకూ ఉంటుంది. మరిన్ని 104, 108 వాహనాలు 108, 104 వాహనాల సంఖ్యను మరింతగా పెంచి ఆరోగ్య సేవల రంగాన్ని పటిష్ఠం చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ, రాజధానిలో 20 ఫ్యాకల్టీ ఆసుపత్రులు{పతి జిల్లా కేంద్రంలోనూ వైద్య కళాశాలతో అనుబంధం ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం. వీటిని రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసే 20 ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతో అనుసంధానం చేస్తాం. తద్వారా రొటేషన్ పద్ధతిలో స్పెషాలిటీ వైద్యుల్ని ప్రతి జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండేలా చూస్తాం. {పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ సరిపడినన్ని మందులు, వైద్యులు, సిబ్బంది ఉండేలా చూస్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయటానికి మేం అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఆపరేషన్ లేదా తీవ్ర ఫ్రాక్చర్లకు వైద్యం పొంది ఆసుపత్రి నుంచి బయటపడినా పనిచేయలేని రోగికి ఉపాధి, మందుల కోసం నెలకు రూ. 3000 చొప్పున సహాయం చేస్తాం. మెడికల్ పీజీ సీట్లు రెట్టింపు ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల సంఖ్యను రెట్టింపు చేస్తాం. -
బాబు, రాజన్నపాలనలో... మహిళల రుణాలు
మహిళా పక్షపాతిగా వ్యవహరించిన వైఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా వారిని అన్ని విధాల ప్రోత్సహించారు.బాబు హయాంలో మహిళలు అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతూ మైక్రో ఫైనాన్స్ కంపెనీల మెట్లెక్కి దిగుతూ నానా ఇబ్బంది పడేవారు. అప్పు వచ్చే వరకు ఒక బాధ అయితే రుణం తీర్చే విషయంలో చాలా అవమానాలకు గురయ్యేవారు. బకాయిల వసూలుకు కంపెనీలు రౌడీలను పురమాయించేవి. వారు చేసే యాగీని భరించలేక అవమానాలను తట్టుకోలేక చాలా మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ మహిళలకు అన్నగా, అందగా, పెద్ద కొడుకుగా నిలిచారు. జీవితంపై భరోసా కల్పించారు. మహిళలకు వడ్డీ రేట్లను ఒకవైపు తగ్గిస్తూ ప్రైవేటు మైక్రోఫైనాన్స్ సంస్థలపై మరోవైపు నియంత్రణ పెంచారు. చివరికి పావలావడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోయే విధానాన్ని అమలుచేశారు. వైఎస్ హయాంలో మహిళా సంఘాలు సమర్థంగా పనిచేస్తూ కుటుంబాల జీవనప్రమాణాలను మార్చేశాయి. బాబు పాలన ‘‘మహిళా ఓట్లతోనే అధికారంలోకి వచ్చాం.. వారంతా మా పక్షమే’’... అప్పట్లో చంద్రబాబు పదేపదే చెప్పిన మాటలివి. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తమకు ఏం జరిగిందని ఏ స్త్రీమూర్తిని అడిగినా ఆ నాటి ఘటనలు తలచుకుని మండిపోతుంది. ఎన్నికల నాడు ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించిన అంగన్వాడీలను హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు సాక్షిగా గుర్రాలతో తొక్కించిన వైనం... చంకలో పసిపిల్లలతో ఆందోళన చేస్తున్నా పోలీసులతో తరిమితరిమి కొట్టించిన పాశవిక సన్నివేశాలు... గుక్కెడు నీటి కోసం జన్మభూమిలో నిలదీస్తే తెలుగుసేన రూపంలో దండెత్తిన వైనాలు... తండా మహిళలపై ‘దేశం’ తమ్ముళ్లు జరిపిన దారుణాలు... విద్యుత్ చార్జీలు భారమంటే లాఠీలు ఝళిపించిన దృశ్యాలు... ఇలా ఎన్నెన్నో రాజన్న రాజ్యం వైఎస్ సీఎం అయ్యేనాటికి రాష్ట్రంలో 5 లక్షల మహిళా సంఘాలుంటే, ఆయన హయాంలో ఏకంగా 4.5 లక్షలకు పైగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సంఘాలకు లభించే బ్యాంకు రుణంగా ఎప్పుడూ గరిష్ఠంగా రూ.25 వేలకు మించలేదు. కానీ వైఎస్ మరణించే నాటికి ప్రతి గ్రూపుకూ సగటున లభించిన బ్యాంకు రుణం ఏకంగా రూ.1.6 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 8 రెట్లు! ఇక బాబు హయాంలో లభించిన బ్యాంకు రుణాలు రూ.1,898 కోట్లు మాత్రమే ఉంటే వైఎస్ మరణించే నాటికి అవి ఏకంగా రూ.27,000 కోట్లకు చేరాయి. పావలా వడ్డీ పథకం కింద వైఎస్ తన హయాంలో దాదాపు రూ.500 కోట్లు పావలా వడ్డీ కోసం మహిళలకు రీయింబర్స్ చేశారు. పండుటాకులకు ఆసరా... 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలకు ఆసరాగా నిలిచేందుకు, వారు కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు వైఎస్ ప్రారంభించిన బీమా తరహా పథకం అభయహస్తం. 18-59 ఏళ్ల మధ్య వయసు మహిళలంతా ఇందులో చేరడానికి అర్హులు. వారు రోజుకు ఒక రూపాయి పొదుపు చేస్తే అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. 60 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి నెలా రూ.500 నుంచి రూ.2,250 దాకా పించన్ వస్తుంది. కొద్ది నెలల్లోనే దాదాపు 45 లక్షల మంది మహిళలు ఈ పథకంలో చేరారు. 4.5 లక్షల మంది వృద్ధులకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ మంజూరైంది. మహిళల కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క మహిళతన భర్తతో సమానంగా సంపాదించగలిగినప్పుడే ఆమెకు మంచి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేసేవరకు నిద్రపోను.నేను కలలుగన్న మరో ప్రపంచానికిమహిళలే మూలస్తంభాలు. - దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి -
బాబు, రాజన్నపాలనలో... విద్య
బాబు పాలన ఆ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో యువత ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ల చదువు పట్ల బాబుకు చిన్నచూపు ఉండేది.తానే హైటెక్‌సిటీ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబుకు అప్పుడు పల్లెల్లోని పేదలు గుర్తుకు రాలేదు. మెరిట్ ప్రతిపాదికన కాకుండా బీసీలందరికీ స్కాలర్షిప్పులు ఇవ్వాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. 2000-01లో 18,782 మంది బీసీ విద్యార్థులకు కేవలం రూ.2.99 కోట్లు కేటాయించారు.స్కాలర్షిప్పులు, మెస్ ఛార్జీలు పెంచాలని ఎన్ని ఉద్యమాలు చేసినా వాటిని అణచివేయడమే తప్ప రూపాయి కూడా అదనంగా ఇచ్చింది లేదు. విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా, మేనేజ్మెంటుకు కోటాలో లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండా చేశారు. కొత్త ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటును పట్టించుకోలేదు.9 ఏళ్ల బాబు పాలనలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాలు 3 మాత్రమే. రాజన్న రాజ్యం ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే విద్యార్థుల సమస్యలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టి పెట్టారు.విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభించారు.ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు.2008-09 బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు.2009-10 బడ్జెట్లో రూ. 2,333.04 కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. ఉన్నత విద్యను వికేంద్రీకరించే ఉద్దేశంతో మొత్తం 18 విశ్వవిద్యాలయాలను వై.ఎస్. ఏర్పాటు చేశారు.అనేక డీమ్డ్ యూనివర్సిటీలకు ప్రోత్సాహం అందించారు.జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు తోడ్పాటునందించారు.అంతర్జాతీయ స్థాయి కలిగిన హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ వంటి సంస్థల ఏర్పాటుకు చొరవ చూపారు. పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులు, మెస్ ఛార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేశారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34కోట్ల మేర విడుదల చేశారు.2005-06 సంవత్సరంలో 409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74 కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు. సక్సెస్ స్కూళ్లు 6,500 సక్సెస్ స్కూళ్లను ఏర్పాటు చేసి, 6 నుంచి 10వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌తో విద్య అందించారు.అన్ని స్థాయుల్లోనూ డ్రాపవుట్లను తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న భోజనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల వరకే మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండగా, దానిని 9, 10 తరగతులకు కూడా వైఎస్ వర్తింపజేశారు.ఇందుకు ఏటా అయ్యే ఖర్చు రూ. 250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీలు నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో ఏపీ ట్రిపుల్ ఐటీలను ప్రారంభించారు.రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని నేతృత్వంలో తెలంగాణలోని బాసరలో, రాయలసీమలోని ఇడుపులపాయలో, కోస్తాంధ్రలోని నూజివీడులో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు.ఒక్కో క్యాంపస్‌లో ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,000 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. జగన్ సంకల్పం అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన 6,500 సక్సెస్ స్కూళ్లను విజయవంతం చేయడం. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పకడ్బందీగా అమలు చేయడం. రాష్ర్టంలో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేయడం.చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే లక్ష్యం. పరిమితుల్లేని బడ్జెట్ కేటాయించి, భారమెంతైనా కానీ పథకాన్ని మాత్రం అమలు చేస్తారు. -
సింగపూర్ కాదు గుక్కెడు నీళ్లివ్వండి..
చంద్రబాబు పేరెత్తితే చాలు పల్లెల్లో జనం ఇప్పటికీ భయపడుతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు ఎత్తుకెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో వేలకు వేలు పోసి వైద్యాన్ని కొనుక్కున్న భయానక పాలనను తలుచుకుని కుమిలిపోతున్నారు. విధి వైపరీత్యమో, బాబు అధికారం చేపట్టిన వేళా విశేషమో తెలియదు గానీ, తొమ్మిదేళ్ల ఆయన పాలనలో నరకం చూశామంటున్నారు. బాబు హయాంలో చేపట్టిన ఒక్క పథకం కూడా సామాన్య ప్రజలకు, పేద రైతులకు మేలు చేయలేదని వాపోయారు. అద్దంకి, దర్శి, మార్కాపురం, కనిగిరి, కందుకూరు ప్రాంతాల్లో ‘సాక్షి’ ప్రతినిధి నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలు ఏమన్నారో.. వారి మాటల్లోనే.. ప్రకాశం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జి.రామచంద్రారెడ్డి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని, సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న ఆయన ఈ సింగపూర్ నిర్మాణాలు ఏ పథకంలో భాగమో చెప్పాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలోని ‘నగదు బదిలీ’ పథకాన్ని ప్రస్తుత మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదన్నారు. రూ.70 పింఛన్ ఇచ్చేందుకు ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాగ్దానాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల పక్షాల నిలబడి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇచ్చారన్నారు. హామీ ఇవ్వకుండానే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి గుక్కెడు నీళ్లిచ్చిన మహానేతను ఒంగోలు ప్రజలు ఎలా మర్చిపోగలరన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? బాబు హయాంలో కరెంటు మోటార్లు లాక్కెళ్లిన సంగతి గుర్తుంది.. ప్రకాశం జిల్లా సాక్షి రోడ్ షోలో సామాన్యుల ఆవేదన తొమ్మిదేళ్ల భారం మళ్లీ ఎందుకు? చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలపై భారాలు మోపారు. మళ్లీ ఇప్పుడు ఆయన పాలన అవసరమా? మంచినీళ్లు లేక అల్లాడుతుంటే సింగపూర్లు కట్టుకుని ఏం చేయాలి? ఆయన పాలనలో రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన సింగపూర్‌లోనే ఉంటే రాష్ట్రానికి మంచిది. - పల్నాటి చెన్నయ్య,కందుకూరు రైతులకు మేలు చేసింది వైఎస్సే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇచ్చినమాట ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారు. ఆరోగ్యశ్రీ, 108 పథకాలు, రుణ మాఫీని ఎవరూ మర్చిపోలేరు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మకం ఉంది. - గట్టమనేని బసవయ్య, పలుకూరు (కందుకూరు) మంచినీటి సమస్య తీర్చండి బాబూ.. మంచినీటి సమస్యతో మార్కాపురం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో మంచినీటి సౌకర్యం కల్పించి ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కల్పిస్తే చాలు. మాకు సింగపూర్లు, మలేషియాలు అవసరం లేదు. - ఎస్ఏ రజాక్, మార్కాపురం జగన్‌తోనే ఆరోగ్యశ్రీ అమలు సాధ్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. వైఎస్ తనయుడు జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే ఆరోగ్యశ్రీ పథకం అమలు సాధ్యమవుతుంది. - దేవండ్ల సుబ్బమ్మ, మార్కాపురం డ్వాక్రా రుణాల రద్దు మహిళలకు వరం వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని హామీ ఇవ్వడం మహిళలకు వరం లాంటిది. ప్రభుత్వం ఇచ్చిన రుణాలు సరిపోకపోవటంతో అప్పులు తెచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామనడం హర్షనీయం. ఇచ్చిన మాటపై నిలబడే మనిషి జగన్. అందుకే డ్వాక్రా మహిళలందరం ఆయనకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. - చాగంటి వెంకట సుబ్బమ్మ, సర్పంచ్, వేములకోట -
జలసిరులు.. అందరికీ సొంతం కావాలి
జగన్ మాట శ్రీకాకుళంలో జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంశధార, మద్దువలస, తోటపల్లి, ఆఫ్‌షోర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. బాబు పాలనలో.. వంశధార మొదటి దశకు తొమ్మిదేళ్ల టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తంతో కాలువలు తవ్వడం ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయగలిగారు. రెండోదశ విషయాన్ని ఆ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదు. ఇక మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేయడమే తప్ప విస్తరణ గురించి పట్టించుకోలేదు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ఆలోచనే రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2000 నుంచి 2003 వరకూ కరువు కరాళ నృత్యం చేసినా చంద్రబాబుకు పట్టలేదు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు వర్షాధార మండలాలు. వీటికి సాగు, తాగునీరివ్వాల్సిన మడ్డువలస ప్రాజెక్టు విస్తరణ, తోటపల్లి జలాశయం కాలువల తవ్వకంపై శ్రద్ధ చూపలేదు. వైఎస్ హయాంలో.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004లో జలయజ్ఞంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు రూ.933 కోట్లతో వంశధార రెండోదశ పనులకు శ్రీకారం చుట్టారు. * రూ.310 కోట్లతో వంశధార, నాగావళి నదులకుకరకట్టల నిర్మించారు. * రూ.57 కోట్లతో మడ్డువలస ప్రాజెక్టు విస్తరించారు. * రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, రూ.452 కోట్లతో తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలను వరదల నుంచి రక్షించేందుకు వీలుగా రూ.310 కోట్ల అంచనాతో కరకట్టల నిర్మాణానికి వైఎస్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తొలివిడతగా రూ.30 కోట్లు మంజూరు చేసింది. మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు జలయజ్ఞం కింద రూ.160 కోట్లు మంజూరు చేశారు. ఎచ్చెర్ల మండలానికి నీరు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ నిధులు మంజూరు చేశారు. మహేంద్రతనయ నదిపై రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ జలాశయాన్ని వైఎస్ మంజూరు చేశారు. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నందిగాం, పలాస మండలాలకు సాగునీరుతో పాటు పలాసకు తాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో టీడీపీ హామీ ఇచ్చినా నెరవేరలేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో చేర్చి తొలి విడతగా రూ.20 కోట్లు మంజూరు చేశారు. తోటపల్లి బ్యారేజ్‌ను జలాశయంగా మార్చే ప్రాజెక్టుకు అప్పట్లో రూ.452 కోట్ల అంచనాతో మంజూరు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, రణస్థలం, లావేరు, వంగరతో పాటు మరికొన్ని మండలాల్లో 48 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టు లభిస్తుంది. రాజశేఖరరెడ్డి హయాంలో రూ.400 కోట్ల వరకు మంజూరు కాగా, 80% పనులు పూర్తయ్యాయి. వైఎస్ మరణానంతరం.. వైఎస్సార్ మరణం cరువాత సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్ జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు పెద్దగా మంజూరు చేయలేదు. దీంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. బడ్జెట్లలో జరిపిన అరకొర కేటాయింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయేవి. ఈ కారణంగానే జిల్లాలో అదనపు ఆయకట్టు సాగులోకి రాలేదు. ఒడిశా రాష్ట్ర అభ్యంతరం పేరుతో వంశధార రెండోదశ పనులు నిలిపివేశారు. వాస్తవానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే పనులు ఆగిపోయాయి. వైఎస్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగాలి. పనులు నిలిచిపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాల భూములకు నీరందడం లేదు. గొట్టా బ్యారేజీ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. వంశధార రెండోదశ ప్రాజెక్టుకు అంచనా వ్య యం మరో రూ.150 కోట్లకు పెరిగింది. నిధులు లేక నాగవళి, వంశధార తీర గ్రామాల్లో కరకట్టల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు నిధులు విడుదల చేయకపోవడంతో కాలువ నిర్మాణాలు నిలిచిపోయాయి. మహేంద్ర తనయపై ఆఫ్‌షోర్ పనులూ నిలిపివేశారు. తోటపల్లి జలాశయం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడంతో అంచనా వ్యయం రూ.100 కోట్లు పెరిగింది. అసంపూర్తిగా ఎత్తిపోతల పథకం వైఎస్ మరణానంతరం ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మా ప్రాంతం లో వంశధార కుడి కాలువపై నిర్మించిన అక్కులపేట ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉంది. దీంతో శివారు భూములకు సాగునీరు అందడంలేదు. పంటలు పండక వలస పోతున్నాం. - గొరివెళ్లి కృష్ణమూర్తి, రైతు, పొన్నాంపేట, ఆమదాలవలస మండలం వైఎస్ ఉన్నపుడే ప్రాజెక్టు పనులు జరిగాయి.. మా భూములన్నీ వర్షాధారమే. సాగునీరు లేక భూములన్నీ బీడువారాయి. మా కష్టాలను చూసిన వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తోటపల్లి, మడ్డువలస ఫేజ్-2 సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఆయన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చురుగ్గా జరిగేవి. మరి కొద్దిరోజుల్లో సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయి నీరు రాక పంటలు పండటం లేదు. - లంకలపల్లి తవిటియ్య, రైతు, కేశవరాయునిపురం, లావేరు మండలం రెండు పంటలు పండించుకుంటున్నాం మడ్డువలస ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆశలు చిగురించాయి. కాలువల ద్వారా సాగునీరు సకాలంలో అందుతుండటంతో ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు సకాలంలో మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. అంతకముందు సాగునీరు లేక వ్యవసాయంపై విరక్తి కలిగి వలసపోయాం. వైఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం ఆనందానిచ్చింది. - కారు లక్ష్ముం, కేఎం వలస, రేగిడి మండలం ‘వంశధార’తో మహర్దశ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరుచేసిన వంశధార ప్రాజెక్టుతో మా జిల్లా రైతాంగానికి మహర్దశ పట్టింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నిలిచిపోయాయి. తరువాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. రెండు పంటలకు నీరందించేందుకు తలపెట్టిన రిజర్వాయర్ పనులు జగన్ సీఎం అయితేనే పూర్తవుతాయి. - చింతాడ అప్పలనాయుడు, రైతు, తురకపేట, ఎల్ఎన్ పేట -
ప్రజావెల్లువతో పులకరింపు...
ప్రజా సేవకుడు అన్న బిరుదును ప్రజానాయకుడు అన్న హోదా కంటే గొప్పగా భావించినపుడు ప్రజాస్వామ్యం పూలతోటలా, పండ్ల చెట్టులా మురిసిపోతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాసేవకుడిగా పనిచేశాడు. ప్రజానాయకుడిగా జీవించాడు. ప్రజలమనిషిగా జీవిస్తున్నాడు. పేద, గొప్ప... కుల, మత... ప్రాంత, వర్గాలకు అతీతంగా ఆయనకు తమ గుండెల్లో పక్క సర్ది, దూది దిండు వేసి ఉయ్యాల సేవ చేశారు. చేస్తున్నారు. అలా నిదురించాలని వైఎస్ఆర్కు మనసులో ఉందో లేదో నాకు తెలియదు కానీ... మెలకువగా ఉన్న ప్రతి నిమిషమూ ప్రజల కష్టాన్ని, ఆవేదనను తన బాధగా కౌగిలించుకున్నాడాయన. బియ్యంలో రాళ్లను ఏరేసినట్టు... బాటలో ముళ్లు వేరేసినట్టు... గుండె తడిలో కన్నీరు వేరేసినట్టు... కాంతితో నీడను వేరేసినట్టు... దీపంలో వొత్తికి ఉన్న నొప్పిని కూడా వేరేసినట్టు... ప్రజల జీవితాల్లో గుచ్చుకున్న ప్రతి కష్టాన్నీ వేరేస్తూ జీవించాడు. అందుకే ప్రజలు ఆయనకు తమ గుండెల్లో పక్క సర్దారు. అక్కడ కంటున్న కలలే వైఎస్ జగన్ నిజం చేయాలంటున్నాడు. తండ్రిని మించిన తనయుడు కావాలన్నది ప్రతి తండ్రి ఆశయం. కానీ జగన్ మరోలా ఆలోచించాడు. తన వల్ల తండ్రికి ఇంకా కీర్తి పెరగాలనుకున్నాడు. ‘వైఎస్ఆర్ శకం ముగిసింది... జగన్ యుగం మొదలైంది’ అని ఎవరైనా చెబితే... కాదు... వైఎస్ఆర్ యుగం కొనసాగుతోంది అని నవ్వుతూ అంటాడు జగన్. అదే ఆయనకు శక్తి. అందుకే... ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, పిల్లల్ని వదిలి పెద్ద కుటుంబం కోసం పరితపించాడు. ఏసీ గదిలో పడుకుని నచ్చిన నాలుగు రకాల వంటలు తినేవాడు గుడిసెలో గంజిని ఎన్నుకున్నాడు. 103 జ్వరం వచ్చి ఒళ్లు కాలిపోతున్నా చల్లగా నవ్వుతూ ఉండగలిగాడు. అభిమానంతో ప్రజలు తనను ఎలాగైనా తాకాలనే ఉత్సాహంలో చేతులకు గాట్లు పడుతున్నా ప్రేమతో కరచాలనం చేయగలిగాడు. ప్రజల పట్ల అతని ప్రేమను తలచుకుంటేనే మనసు పులకరిస్తుంది. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లోంచి తొంగి కొడుకును చూసి మురిసిపోతుంటాడు అనిపిస్తుంది. నిజమే కదా! మన పిల్లలు ఒక చూపులేని మనిషిని రోడ్డు దాటిస్తే ఎంతగా ముచ్చటపడతాం! ఎన్నాళ్లు మురిసిపోతాం! మరి జగన్ ఇంతమందిని కష్టం నుంచి దాటేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్మురిసిపోడా! జగన్ అలాంటి కొడుకుగా బతకాలనుకున్నాడు కాబట్టే... తను, తన కుటుంబం కష్టాల నీడలో జీవించాల్సి వచ్చింది. ఒక్కసారి ఢిల్లీ ముందు మోకరిల్లి ఉంటే ఓ క్యాబినెట్ పదవి, ఓ ముఖ్యమంత్రి పదవి ఖాయం కదా! ఆ మాట ఢిల్లీవాళ్లే చెప్పారు కదా! సర్దుబాటు చేసుకుంటే దొంగ కేసులు, 16 నెలల జైలు జీవితం, అవమానం, ఆవేదన తప్పి ఉండేవి కదా! అన్నిసార్లు గుచ్చినా, ఎన్నిసార్లు కింద పడేయాలని చూసినా, ఇంకెన్నిసార్లు వెనక్కి లాగేయాలని కుట్ర చేసినా వదల్లేదు కదా జగన్! ఎంత క్షోభపెట్టినా, ఎంత హింసించినా తన తండ్రి ఆశయాన్ని, తన మాటను ఇంకా గట్టిగా కౌగిలించుకున్నాడు తప్ప వదిలేయలేదు కదా. అంత కష్టంలో ప్రజలను వదలనివాడు... గెలిపించుకుంటే ఏం చేస్తాడో తలచుకుంటేనే గుండె పులకరిస్తుంది. వైఎస్ఆర్ పడుకున్న ప్రతి గుండెను తట్టి... ఆ సారును లేపి... ‘‘అయ్యా చూడు... అచ్చం నీలాగే ఎంత మంచి మనసయ్యా నీ కొడుకుది. స్వామీ చూడు... నీ ఆశయాలనే వారసత్వంగా తీసుకుని పోరాడుతున్నాడయ్యా! ఎన్ని గాయాలు చేశారు నీ బిడ్డకు... ఒక్కసారి పలకరించిపో అయ్యా! నీ కీర్తి కోసం తన దేహానికి, మనసుకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకుంటున్న కొడుకుతో ఒక మాట చెప్పి పోవయ్యా! ఒక్కసారి కూడా కన్నీరు పెట్టకుండా గుండెల్లో వెయ్యి అగాథాలను మోస్తూ.... ప్రతి గుండెలో నీ జాడ చూసుకుంటూ జీవిస్తోన్న, ఉద్యమిస్తోన్న తనయుడిని ‘శహభాష్’ అని అనవయ్యా! భూదేవంత సహనాన్ని, ఆకాశమంత ఆశయాన్ని నీకోసం మోస్తున్న ఆ గుండెను దీవించయ్యా..! ఆ గుండెలో రక్తం కాకుండా ప్రవహిస్తోన్న తడిని నీ చిరుజల్లుతో కడుగయ్యా..! పోనీ... ఒక్కసారి జగన్ నిద్రలోకైనా వచ్చి తల నిమిరిపోవయ్యా..! ’’ అని వెక్కివెక్కి ఏడుస్తూ అర్థించాలని ఉంది.అలాంటి యువకుడు మన నాయకుడని గుండె దరువుతో చాటింపు వేయాలని ఉంది. ప్రజాస్వామ్యాన్ని పూబాటలా, పండ్ల తోటలా మార్చాలనే అభిమతానికి సలాం కొట్టాలని ఉంది. ‘యువకుడు, ఉత్సాహవంతుడు. మీకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వదించండి’ ఇది ఆరోజు వైఎస్ మాట. అదే ఈ రోజు ప్రజల నమ్మకం. - వాన చుక్క -
ఏడుకొండలవాడి కరుణ ఎవరికో
తిరుపతిలో తగ్గిన కాంగ్రెస్ పరపతి తిరుపతి... ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం. అత్యంత ప్రాధాన్యవుున్న ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు వెళ్లడానికి అభ్యర్థులంతా ఉవ్విళ్లూరుతున్నారు. అరుుతే...ప్రధాన పోటీ వూత్రం వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, బీజేపీ వుధ్యే నెలకొంది. ఈ త్రివుుఖ పోరులోనూ వైఎస్సార్ సీపీ వుుందుంది. సిటింగ్ ఎంపీగా ప్రజావ్యతిరేకత, పార్టీ దుస్థితి కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌కు ప్రతికూలంగా వూరారుు. టీడీపీ శ్రేణుల సహాయు నిరాకరణ, పార్టీ కేడర్ బలహీనంగా ఉండటం బీజేపీ అభ్యర్థి జయురాంను కలవరపెడుతున్నారుు. ఇదే తరుణంలో బలమైన పార్టీ కేడర్, వైఎస్ జగన్ ప్రభంజనం వల్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు రేసులో వుుందు నిలిచారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఇక్కడ 14 సార్లు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ ఏకంగా 12 సార్లు గెలుపొందింది. ఒకసారి టీడీపీ, ఇంకొకసారి బీజేపీ విజయుం సాధించారుు. ఇక్కడి నుంచి రికార్డు స్థాయిలో ఆరుసార్లు గెలుపొందిన ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ సారి ఎదురుగాలి వీస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోలీసు అధికారి కె.జయరాం తొలిసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ అధికారి వెలగపల్లి వరప్రసాదరావు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, ఆయన మీద జనానికి ఉన్న అభిమానం, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనం వరప్రసాద్‌కు సానుకూల వాతావరణాన్ని సృష్టించారుు. కాంగ్రెస్‌కు ‘చింత’! తిరుపతి నుంచి ఏడుసార్లు ఎంపీగా పోటీచేసిన చింతా మోహన్ ఆరుసార్లు విజయుం సాధించారు. 1984లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఆయున.. ఆ తర్వాత ఐదుసార్లు కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యూరు. 1991-96 మధ్య కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం కారణంగా 1996లో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో నెలవల సుబ్రహ్మణ్యంకు అవకాశం వచ్చింది. 1998లో చింతా మోహన్ మళ్లీ టికెట్ సాధించుకుని గెలుపొందారు. 1999లోనూ పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి ఎన్.వెంకటస్వామి చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో 1,99,329 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన చింతామోహన్... 2009లో వూత్రం చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు 19,280 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌కు గడ్డు పరిస్థితి ఎదురుకావడంతో ఈసారి చిత్తూరు జిల్లా సత్యవేడు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. అరుుతే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు కరువు కావడంతో సిటింగ్ ఎంపీ చింతా మోహన్నే కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి బరిలోకి దించింది. దీంతో ఎనిమిదో సారి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల్లో ఎదురీతకు సిద్ధపడ్డారు. దూసుకెళుతున్న వెలగపల్లి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీకి సానుకూల పవనాలు వీస్తున్నారుు. నియోజకవర్గ పరిధిలోని ఒక్క వెంకటగిరి మినహాయిస్తే మిగిలిన ఆరు శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి జనంలో పరపతి ఉన్న అభ్యర్థులే దొరకలేదు. దీంతో పోటీ నామమాత్రమే కానుంది. ఇదే తరుణంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు ఏడాది కాలంగా లోక్‌సభ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో వుమేకవుయ్యూరు. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. బీజేపీ నామమాత్రపు పోటీ టీడీపీతో ఎన్నికల పొత్తులో భాగంగా దక్కించుకున్న ఈ స్థానానికి బీజేపీ చివరి నిమిషం వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయింది. చివరకు పోలీసు అధికారి జయరాంను బరిలోకి దించింది. ఆయునకు టీడీపీ కేడర్ సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బీజేపీ నామమాత్రపు పోటీకే పరిమితమైంది. ఇదీ చరిత్ర తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అదే ఏడాది జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతశయనం అయ్యంగార్ తన ప్రత్యర్థి, కేఎల్పీ అభ్యర్థి ఎల్బీ నాయుడుపై 6,037 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయున తొలి లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గాను, రెండో స్పీకర్‌గాను పని చేశారు. ఈ లోక్‌సభ స్థానం 1957లో రద్దరుు్యంది. 1962లో మళ్లీ ఆవిర్భవించింది. అప్పట్నుంచి ఎస్సీలకు రిజర్వు అరుు్యంది. అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి మారినా లోక్‌సభ స్థానం మాత్రం రిజర్వ్ స్థానంగా కొనసాగుతూ వస్తోంది. ఈ స్థానం నుంచి సి.దాస్ (1962, 1967) టి.బాలకృష్ణయ్య (1971, 1977), పసల పెంచలయ్య (1980), డాక్టర్ చింతామోహన్ ( 1984, 1989, 1991, 1998, 2004, 2009), నెలవల సుబ్రహ్మణ్యం (1996), డాక్టర్ ఎన్. వెంకటస్వామి (1999) ఎంపీలుగా పనిచేశారు. తిరుపతి 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి 18 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే బరిలోకి దిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు. జయాపజయాలను ప్రభావితం చేసే టీటీడీ ఉద్యోగులు వైఎస్సార్ సీపీ పట్ల అభిమానంతో ఉండటం కరుణాకరరెడ్డికి లాభిస్తుంది. పైగా ఆయున గత రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. టీడీపీ అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఆయన భూకబ్జాకోరని గత ఎన్నికలప్పుడు చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున వుబ్బు దేవనారాయుణరెడ్డి పోటీ చేస్తున్నారు. శ్రీకాళహస్తి తాజా వూజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే రైతులు, బీసీలు వైఎస్సార్ సీపీపై అభిమానం చూపుతున్నారు. యువ నాయకుడు బియ్యపు మధుసూదనరెడ్డి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయునకు ప్రజల్లో వుంచి పేరుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బత్తయ్యు నాయుుడు బరిలో ఉన్నారు. సత్యవేడు రైతులు, తమిళ ఎస్సీలు, బీసీలు గెలుపోటములను నిర్ణరుుస్తారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం రెండేళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ జనంలో గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. స్థానికులకు పరిచయుం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా టి.చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీతో పాటు కాంగ్రెస్ కూడా నావువూత్రపు పోటీకే పరిమితవుని ప్రజలు చర్చించుకుంటున్నారు. సూళ్లూరుపేట ఇంజనీర్ కిలివేటి సంజీవయ్య వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయున చాలాకాలంగా జనంతో వుమేకమై ఉన్నారు. టీడీపీ అభ్యర్థి, తాజా వూజీ ఎమ్మెల్యే పరసా వెంకటరత్నంపై వ్యతిరేకత ఉంది. టీడీపీలోని అంతర్గత విభేదాలూ ఆయున్ను కలవరపెడుతున్నారుు. కాంగ్రెస్ అభ్యర్థి డి.వుధుసూదనరావు ప్రభావం చూపే పరిస్థితి లేదు. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి లాభించనున్నాయి. ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో వైఎస్‌పై జనానికి ఉన్న అభిమానం, పటిష్టమైన పార్టీ నాయకత్వం సంజీవయ్య విజయూవకాశాలను మెరుగుపరుస్తున్నాయి. గూడూరు తాజా వూజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో డాక్టర్ జ్యోత్స్నలతను టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆమె రాజకీయాలకు కొత్త. మునిసిపల్ మాజీ చైర్మన్ పాశం సునీల్‌కుమార్ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ రైతులు, ఎస్సీలు వైఎస్సార్ సీపీకి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పనబాక క్రిష్ణయ్యు పోటీ నామమాతమే. సర్వేపల్లి నెల్లూరు జెడ్పీ మాజీ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి రెండేళ్లుగా వైఎస్సార్ సీపీ తరఫున జనంతో మమేకవుయ్యూరు. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. టీడీపీ అభ్యర్థిగా వూజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున కె.పట్టాభిరావుయ్యు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీకి తిరుగులేదన్న భావన ప్రజల్లో ఉంది. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నుంచి తాజా వూజీ ఎమ్మెల్యే రామకృష్ణ పోటీలో నిలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రామకృష్ణ ఈ ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయులేదన్న భావన జనం లో కన్పిస్తోంది. ఇవన్నీ వైఎస్సార్ సీపీకి కలసిరానున్నారుు. వైఎస్సార్ సీపీ బలం, కొమ్మి లక్ష్మయ్యనాయుడుకు వ్యక్తిగతంగా జనంలో ఉన్న మంచి పేరు మిగిలిన రెండు పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. అభివృద్ధికి ఆనవాళ్లు * వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుపతిలో ఎస్వీ పశువైద్య, వేద విశ్వవిద్యాలయూలు ఏర్పాటు చేరుుంచారు. * తిరుపతి నగరాన్ని జేఎన్‌ఎన్‌యుూఆర్‌ఎం పథకంలో చేర్పించి రూ.వేల కోట్ల నిధులు విడుదల చేయించారు. * తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి పరిచారు. * గాలేరు - నగరి ప్రాజెక్టు పూర్తి చేయించారు. * శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరందించే తెలుగుగంగ ప్రాజెక్టు పనులు 90 శాతానికి పైగా పూర్తి చేయించారు. * సోమశిల-స్వర్ణముఖి కెనాల్‌కు శ్రీకారం చుట్టారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేయించారు. * మన్నవరంలో రూ.6 వేల కోట్లతో ఎన్బీపీపీఎల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల విడిభాగాల తయారీ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. కేంద్రంతో పోట్లాడి మరీ ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు తన్నుకు పోకుండా చూశారు. దీనివల్ల 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. * సత్యవేడు సెజ్‌లో దేశీయ, విదేశీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేశారు. * ముత్తుకూరు మండలం నేలటూరులో 1,600 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేరుుంచారు. * సోమశిల జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని 36 టీఎంసీల నుంచి 72 టీఎంసీలకు పెంచారు. దీనివల్ల శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగునీరు, 2.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. సమాధి రాళ్లు 1. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1996లో కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దాన్ని పట్టించుకోలేదు. 2. గాలేరు -నగరి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారు. అప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించి...రైతులకు అన్యాయుం చేశారు. 3. ఉబ్బలవుడుగు రిజర్వాయుర్ ఆధునికీకరణకు హామీ ఇచ్చినా.. రూపారుు కూడా విడుదల చేయులేదు. 4. వుుత్తుకూరు వద్ద 1991లో అప్పటి సీఎం నేదురువుల్లి జనార్దనరెడ్డి ప్రారంభించిన ఫిషరీస్ సైన్స్ కళాశాలను చంద్రబాబు 1996లో వురోసారి ప్రారంభించి షో చేశారు. జీవనాడి కుటుంబానికి ప్రాణదాత.. విద్యాప్రదాత నేను స్టిక్కరింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. ఈ పనితోనే కుటుంబాన్ని పోషిస్తున్నా. మా అమ్మ అరవంబేటి గురవమ్మకు గతంలో గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. రెండు రక్త నాళాలు దెబ్బతిన్నాయని, ఆపరేషన్ చేయూలని డాక్టర్లు చెప్పారు. చేతిలో రూపాయి లేదు. ఏమి చేయూలో పాలుపోలేదు. 2007 మార్చిలో సవుస్య వురింత తీవ్రమైంది. చివరకు ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఈ పథకం కింద విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేశారు. ఐదేళ్ల తరువాత నాకు కూడా గుండెనొప్పి వచ్చింది. అర్జంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. తిరుపతి స్విమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నా. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా. ఇదంతా వైఎస్ చలవే. ఆయున పుణ్యమా అని నా కొడుకు విశ్వతేజను కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కాలేజీలో చదివించా. ప్రస్తుతం నాయుడుపేట దగ్గర ఉన్న గ్రీన్‌టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు విష్ణుప్రియ హ్యాండ్లూమ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. వూ కుటుంబం మొత్తం వైఎస్‌కు రుణపడి ఉంది. - అవరంబేటి వీరప్రసాద్, నాయుడుపేట (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
ఆ పార్టీల పొత్తు ప్రమాదకరం
టీడీపీ-బీజేపీ చెట్టాపట్టాలతో రాష్ట్రానికి తీరని నష్టం ఒట్టు తీసి గట్టు పెట్టిన చంద్రబాబు నారాయణకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు సీపీఎం, వైఎస్సార్సీపీల కూటమి విజయం తథ్యం తెలంగాణ రాష్ట్ర సీపీఎం సారధి తమ్మినేని వీరభద్రం మేకల కళ్యాణ్‌చక్రవర్తి, ఖమ్మం కాంగ్రెస్ - సీపీఐ, తెలుగుదేశం - బీజేపీల మధ్య కుదిరిన పొత్తులు అనైతికం. వారి పొత్తులు ఫలప్రదం కావు. జాతీయ వైఖరికి భిన్నంగా సీపీఐ నేతలు కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారు. అందుకే సీపీఐకి కూడా మద్దతు ఇవ్వడం లేదు. వైఎస్సార్సీపీ, సీపీఎంల మధ్య కుదిరిన అవగాహన ఖమ్మం జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తుందన్నారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ‘సాక్షి’కి ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే. జాతీయ విధానానికి భిన్నం కాంగ్రెస్, సీపీఐల పొత్తు గురించి చెప్పాలంటే అది కమ్యూనిస్టుల జాతీయ విధానానికి భిన్నమైనది. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌లు నిర్ణయించాయి. దానికి విఘాతం కలిగిస్తూ సీపీఐ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలో పోటీచేస్తుండటం దురదృష్టకరం. వీరి పొత్తు సఫలం కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతోంది. తెలంగాణ ఇవ్వడం కాంగ్రెస్ గొప్పతనమని ప్రజలు భావించడం లేదు. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం సీపీఐకే నష్టం. నారాయణకు మద్దతివ్వకపోవడం సమర్థనీయం ఖమ్మం పార్లమెంటుకు సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు మద్దతు ఇవ్వకూడదన్న మా వైఖరి సమర్థనీయమే. ఎందుకంటే నారాయణా, ఇంకో వ్యక్తి అనేదాన్ని బట్టి మేం మద్దతివ్వడం, ఇవ్వకపోవడం ఉండదు. వాళ్లు కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయ్యారు. మేం ఆ కూటమికి మద్దతివ్వం. అందుకే నారాయణకు మద్దతివ్వడమనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు. కాంగ్రెస్ కూటమిని ఓడించడమే మా లక్ష్యం. టీడీపీది రాజకీయ అవకాశ వాదం టీడీపీ, బీజేపీల పొత్తు ఈ రాష్ట్రానికి హానికరం. ఫాసిస్టు లక్షణాలున్న మతతత్వ పార్టీ బీజేపీ. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా చంద్రబాబు బీజేపీకే మేలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పునాది లేని బీజేపీ మన రాష్ట్రంలో వేళ్లూనుకునేందుకు ఈ పొత్తు ఉపయోగపడుతుందన్నది మా భావన. ఈ పాపం టీడీపీ చరిత్రలో మిగిలిపోతుంది. గతంలో కూడా బాబు బీజేపీకి మద్దతిచ్చారు. గుజరాత్లో అల్లర్లు జరిగిన తర్వాత నరేంద్రమోడీ సీఎం కుర్చీకే పనికి రాడని, బీజేపీతో ఇంకెప్పుడూ పొత్తు పెట్టుకోనని చంద్రబాబు ప్రజలకు చెప్పారు. కానీ ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరించాడు. తన అధికారం కోసం చేస్తున్న జిమ్మిక్కు తప్ప నష్టదాయకమైన ఈ పొత్తును ప్రజలు అంగీకరించరు. అది ప్రత్యర్థుల ప్రచారం జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక శక్తులతో క లిసి ఎన్నికలకు వెళ్లాలన్న సీపీఎం పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకే వైఎస్సార్ సీపీతో అవగాహన కుదిరింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీతో అవగాహన కుదుర్చుకున్నారు. మహాజన సోషలిస్టు పార్టీతో కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కలిసి పనిచేస్తున్నాం. కానీ వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణుల మధ్య కొంత అంతరం ఉందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వారు ఎంత ప్రచారం చేసినా మా రెండు పార్టీల కూటమి విజయం తథ్యం. మేం కలిసికట్టుగా ముందుకెళ్లి జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయం. ఇప్పుడు మా సిద్ధాంతాలు చెబితే ఎలా ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వాస్తవం. వాస్తవాన్ని బట్టి వ్యవహరించాలే తప్ప మా సిద్ధాంతం చెప్పి వెళ్లడం కుదరదు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే సీపీఎం ముందున్న కర్తవ్యం. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలను నిజం చేయాలి. అందుకు మూడు అంశాలు ఎంచుకున్నాం. సమగ్రాభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అనే మూడు సూత్రాల విజన్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఎస్సీలను సీఎం చేస్తాం, బీసీలను సీఎం చేస్తామనడం సామాజిక న్యాయం కాదు. ఇలాంటి వాగ్దానాల్లో ఓట్లు కొల్లగొట్టడమే తప్ప చిత్తశుద్ధి కనిపించదు. అన్ని వర్గాల పేదలకు న్యాయం జరిగేలా కార్యక్రమం ఉండాలి. సామరస్యం, సమన్వయం అవసరం రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరుణంలో రెండు రాష్ట్రాలు, రెండు ప్రాంతాల మధ్య సమన్వయం, సామరస్యం కీలకం, ఇక తగాదాలు పడాల్సిన పనిలేదు. ఒకరినొకరు సహకరించుకోవాలి. కొన్ని వనరులు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. అక్కడ ఉన్న పొడవైన సముద్రతీరాన్ని , అధిక విద్యుత్‌ను మనం వినియోగించుకోవచ్చు. మన బొగ్గును వారు తీసుకెళ్లొచ్చు. కానీ సామరస్యం లేకుండా ఇది సాధ్యం కాదు. ఇరు రాష్ట్రాల మధ్య సామరస్య వారధిగా సీపీఎం పనిచేస్తుంది. -
కట్టలు తెంచిన కరెన్సీ బాబు
* ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసిన బాబు * ఎన్నికల్లో భారీ ఖర్చుకు తెర తీసిన ఘనుడు యాచమనేని పార్థసారథి: అది 1994. ఎన్నికల వేళ. ఆర్థిక బలం పెద్దగా లేని కొందరు అభ్యర్థులకు బీ ఫారాలతో పాటు కొంత నగదు సాయం కూడా చేశారు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సంపర (ఇప్పుడు రద్దయింది) అసెంబ్లీ స్థానం అభ్యర్థి టి.సత్యలింగ నాయకర్‌కు రూ.5 లక్షలిచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ గెలిచింది. ఎన్నికల హడావిడి సద్దుమణిగాక నాయకర్ సుమారు రూ.2 లక్షలను ఒక కవర్లో పెట్టి భద్రంగా తీసుకొచ్చి ఎన్టీఆర్‌కు తిరిగిచ్చారు. ఆయన ఆశ్చర్యపోతూ, ‘బ్రదర్ ఏమిటిది?’ అని ప్రశ్నించారు. ‘మీరు నాకు ఇచ్చిన ఎన్నికల విరాళంలో ఖర్చు పెట్టగా మిగిలిన మొత్తం. పార్టీ ఖర్చులకు వినియోగించండి’ అన్నారాయన. అందుకు ఎన్టీఆర్ ఎంతో సంతోషించారు. ఓకే బ్రదర్ అంటూ భుజం తట్టి పంపించారు. ఇక్కడ కట్ చేస్తే... అది 2006. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల వేళ. టీడీపీ తరఫున ఎన్నికల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన మాజీ మంత్రి ఒకరిని అధ్యక్షుడు చంద్రబాబు అక్కడికి పంపారు. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే అప్పుడు కూడా అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను ఆ పరిశీలకుడితోనే పంపించారు. ఎన్నికలు ముగిశాక సదరు పరిశీలకుడు తిరిగొచ్చారు. ఓటింగ్ సరళి, పార్టీ నేతల పనితీరు నివేదికతో పాటు అభ్యర్థుల ఖర్చుల కోసం తనతో పంపిన మొత్తంలో మిగిలిన డబ్బును బాబుకు తిరిగిచ్చారు. అంతే! తోక తొక్కిన తాచులా లేచారు బాబు. సదరు నేతపై ఆగ్రహోదగ్రుడయ్యారు. ‘‘ఇంత సీనియర్ నాయకులైన మీకు ఎన్నికలను ఎలా మేనేజ్ కూడా చేయాలో తెలియకపోతే ఏమనాలి! మీకు అంత డబ్బులిచ్చింది ఎందుకు? ఖర్చు చేయకుండా మిగుల్చుకొని తేవడానికా? ఇలా నాకు తిరిగిస్తే ఏం ప్రయోజనం? ఆ డబ్బును కూడా ఖర్చు చేస్తే మనకు మరో రెండు మూడు కార్పొరేటర్ సీట్లొచ్చేవి కదా!’’ అంటూ మండిపడ్డారు. ఎన్నికలను చంద్రబాబు ఏ మేరకు డబ్బుమయం చేశారనేందుకు చిన్న ఉదాహరణగా రాజకీయ వర్గాల్లో ఈ ఉదంతాన్ని చెబుతూ ఉంటారు. బాబుతోనే ఎన్నికలు డబ్బు మయం రాష్ట్రంలో ఎన్నికలు ఇంతగా డబ్బుమయంగా మారాయంటే అది చంద్రబాబు పుణ్యమేనని రాజకీయ వర్గాల్లో విసృ్తత ప్రచారం. రాజకీయ ఎదుగుదలకు ఆయన ఎంచుకున్న దొడ్డిదారి మార్గం కూడా అందుకు కొంతవరకు కారణమైందని చెబుతుంటారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దె దింపి అందలమెక్కిన బాబు... పార్టీలోనూ, బయటా ఎన్టీఆర్ పేరే వినిపించకూడదు, ఎవరూ ఆయన నామస్మరణ చేయరాదు అన్న ఉద్దేశంతో, వీలైనంతగా తన పేరే ప్రచారంలో ఉండాలనే యావతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్ల డం మొదలుపెట్టారు. బాబు సీఎంగా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో రూ.500 కొత్త నోట్లు పెళపెళమన్న సందర్భం అదే! అప్పటిదాకా ఓట్ల కోసం అంత పెద్ద మొత్తాన్ని ఏ రాజకీయ పార్టీ కూ డా ఓటర్లకు పంచిన దాఖలాలు లేనే లేవని ఆ ఎన్నికను నిశితంగా గమనించిన పలువురు విశ్లేషించారు. మరీ ఇంత భారీగా ఓటర్లకు 500 రూ పాయల నోట్లు పంచుతున్నదెవరా అని ఆరా తీస్తే.. అది బాబు ఘనతేనని తేలిందంటారు. అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఉదంతం అనివార్యంగా ప్రస్తావనకు వస్తుంది. దీని గురించి తెలిసిన వారంతా, ‘రాష్ట్రంలో ఓటర్లకు పెద్ద గాంధీని పరిచయం చేసింది చంద్రబాబే’ అని చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద గాంధీ అంటే రూ.500 నోటన్నమాట. ఎందుకంటే అప్పట్లో అదే పెద్ద నోటు. రూ.1,000 నోటు ఇంకా రాలేదు. బాబు జమానాకు ముందు వరకూ ఏ పార్టీ అయినా మహా అయితే 5 నుంచి 10 లక్షల్లో ఎన్నికల తంతు పూర్తి చేసేదని 1990వ దశకంలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని ఎవరిని అడిగినా చెబుతారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు లెక్కాపత్రం లేకుండా అడ్డగోలుగా పెరిగింది 1995 తర్వాతేనని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా అంగీకరిస్తారు. ప్రతి నియోజకవర్గానికీ పెద్ద సంఖ్యలో నేతలను ఇన్చార్జిలుగా నియమించటం, వారికి లక్ష్యాలను నిర్దేశించటం, వాటి సాధనకు ఎలాంటి వనరులు కావాలన్నా క్షణాల మీద సమకూర్చడం... ఇదీ బాబు మార్కు ఎలక్షన్ మేనేజ్మెంట్. కొత్తగా పార్టీ పగ్గాలను చేపట్టడం, తాను పేరున్న నాయకుడు కాకపోవడం, పైగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడన్న మచ్చ ఉండడం... ఏ చిన్న ఎన్నికలో ఓడినా, తన నాయకత్వ లేమి బయట పడుతుందనే భయం... వెరసి విచ్చలవిడి ఖర్చుకు బాబు శ్రీకారం చుట్టారని విశ్లేషకులు అంటుంటారు. కోట్లు కొట్టినోళ్లకే టికెట్లు... సీమాంధ్రలో పార్టీకి భవిష్యత్తు లేనట్టేనని నిర్ధారణకు వచ్చిన టీడీపీ నాయకత్వం... భారీగా ముట్టజెప్పిన వారికే టికెట్లు కట్టబెట్టిందని సర్వత్రా వినిపిస్తోంది. చాలా టికెట్లకు 5 నుంచి 25 కోట్ల రూపాయల దాకా బాబు కోటరీ వసూలు చేసిందని సమాచారం. నిజానికి ఇలాంటి వారికి టికెట్లను కేటాయించడానికే... పలు స్థానాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు దాకా ఖరారు చేయకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేశారన్న ప్రచారమూ ఉంది. టీడీపీలో జోరుగా సాగిన టికెట్ల అమ్మకాలను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి స్వయంగా బయట పెట్టారు. డబ్బు లేదన్న కారణంతోనే తనకు టికెట్ నిరాకరించారన్నారు. టికెటిస్తే భార్యాబిడ్డల కిడ్నీలు అమ్ముకునైనా ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తానని లింగారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ ఆ టికెట్‌ను వరదరాజులరెడ్డికి రూ.25 కోట్లకు టీడీపీ ఉపాధ్యక్షుడు సీఎం రమేశ్ అమ్ముకున్నారని మీడియా ముందు లింగారెడ్డి వెల్లడించారు. ఇలాగే విజయనగరం అసెంబ్లీ టికెట్‌ను రూ.5 కోట్లు చెల్లించి మీసాల గీత దక్కించుకున్నారనే ఆరోపణలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్‌సభ సీటును కూడా ఇలాగే డబ్బు సంచులకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులవర్తి రామాంజనేయులు ఆ కోవలోనే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలకొల్లు సీటుకు కూడా భారీ రేటు పలికింది. నర్సాపురం, ఉంగుటూరు టికెట్లు దక్కించుకున్న వారు కూడా భారీగానే సమర్పించుకున్నామని అభ్యర్థులే సన్నిహితుల ముందు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో నందమూరి హరికృష్ణ పోటీ చేయాలని ఆసక్తి చూపిన స్థానమైతే ఏకంగా రూ.5 కోట్లు పలికిందని జిల్లాలో బలంగా వినిపిస్తోంది. అవనిగడ్డ టికెట్ ఆశించిన మాజీ మంత్రి ఒకరు రూ.2 కోట్లు చెల్లించారని జిల్లాలో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇక నూజివీడు టీడీపీ టికెట్‌ను కాంగ్రెస్ నేత ఒకరు 3 కోట్లు చెల్లించి దక్కించుకున్నారని జిల్లా పార్టీ నేతలు చెబుతున్నారు. విజయవాడ తూర్పు సీటును తాజాగా కాంగ్రెస్ నుంచి చేరిన సిటింగ్ ఎమ్మెల్యే ఆశించారు. రూ.3 కోట్లిస్తే టికెటిస్తామని బాబు కోటరీ బేరం పెట్టింది. అంత ఇచ్చుకోవటం తన వల్ల కాదనడంతో కనీసం కోటి అయినా ఇవ్వండంటూ కూరగాయల బేరానికి దిగింది. ఆ మాత్రం కూడా వల్ల కాదంటూ ఆయన చేతులెత్తేయటంతో చివరకు ఆ సీటు కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఓ మాజీ ఎమ్మెల్యేకు రూ.కోటిన్నర తీసుకుని కట్టబెట్టారని విజయవాడలో బలంగా వినిపిస్తోంది. గుంటూరు (తూర్పు) టికెట్ కేటాయింపులో టీడీపీ జిల్లా పార్టీ పరిశీలకుడే కీలక పాత్ర పోషించారంటున్నారు. 3-5 కోట్ల మధ్య చెల్లింపులు జరిగినట్టు సమాచారం. ఇక నరసరావుపేట స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దాన్ని యడ్లపాటి రఘునాథబాబుకు కేటాయించగా ఆయన బలహీన అభ్యర్థంటూ బాబు కోటరీ నానా యాగీ చేసింది. చివరికి ఆ టికెట్‌ను తమ సన్నిహితుడైన తిరుమల డెయిరీ డెరైక్టర్ నల్లమోతు వెంకట్రావుకు ఇప్పించుకుంది. ఈ డీల్‌లో టీడీపీ పెద్దల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. అలాగే మాచర్ల, ప్రత్తిపాడు టికెట్లకూ భారీ మొత్తాలు చేతులు మారాయి. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నుంచి చేరిన సీనియర్ నేత కూడా టికెట్ కోసం భారీగానే ముట్టజెప్పినట్టు బలంగా వినిపిస్తోంది. అసలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్ల పరిశీలన పేరుతో కూడా టీడీపీ పెద్దలు లక్షల్లో గుంజారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కోట్లు... కోటరీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నేర్చుకున్న ‘ఎలక్షన్ మేనేజ్మెంట్’ సూత్రాన్నే ప్రతిసారీ అమలు చేస్తుంటారు చంద్రబాబు. ఈసారి కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థికైతే కనీసం 6 నుంచి 10 కోట్లు, లోక్‌సభ అభ్యర్థయితే హీన పక్షం రూ.30 కోట్ల పైచిలుకే ఖర్చు పెట్టాలని బాబు చెబుతున్నట్టు బలంగా వినిపిస్తోంది. నామినేషన్ల దాఖలు వేళ బాబు హడావుడిగా టీడీపీలో చేర్చుకున్న వారిలో అత్యధికులు ఇలా కోట్లు వెదజల్లగలవారే! కొన్నేళ్లుగా బాబు కోటరీలోని పారిశ్రామికవేత్తలే టీడీపీ తాలూకు డబ్బు లావాదేవీలన్నింటినీ నిర్వహిస్తున్నారు. పైగా ఏరికోరి వారినే బాబు ఆయా జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జిలుగా కూడా నియమించారు! -
చంద్రబాబుకు అధికారం కలే..
* బీజేపీ పొత్తుతో టీడీపీకి నష్టమే * మైనారిటీల్లో సన్నగిల్లిన విశ్వాసం * సీమాంధ్రలో వైఎస్ జగన్ హవా * దేశంలో ప్రాంతీయ పార్టీలదే జోరు * మూడో ఫ్రంట్కే అధికారం * పవన్ ప్రభావమేమీ ఉండదు * ఎన్నికల తర్వాత కొత్త మిత్రులు బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: బీజేపీతో పొత్తు ద్వారా ఏదోలా అధికారాన్ని దక్కించుకోవాలను కుంటున్న చంద్రబాబు కల కలగానే మిగిలిపోతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి జోస్యం చెప్పారు. పైగా బీజేపీతో పొత్తు వల్లే బాబు కనీసం మరో పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏచూరి పలు అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... వాళ్లకు అనవసరం. ఎలా చేయాలన్నది పార్టీలు చూసుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు ఆయన్ను ఆదరించారు. ఎన్నికల తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా తమ బతుకులు మార్చేదిగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. భారాలు మోపని, ధరల మోత లేని ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లతో సాధ్యం కాదనేది వారు గ్రహించారు. పైగా వాటి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. రెండూ ఒకే ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాయి. అవినీతి, కుంభకోణాల్లోనూ వాటి మధ్య తేడా ఏమీలేదు. లోక్‌సభలో యూపీఏ, ఎన్డీఏల మ్యాచ్‌ఫిక్సింగ్ అనేక సందర్భాల్లో బయట పడింది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్‌ల ఓటమి... మరీ ముఖ్యంగా మతతత్వ బీజేపీ ఓటమి చాలా ముఖ్యం. యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ప్రకటించినా, వాటి ఒత్తిడి వల్లే దేశంలో విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపా ధి హామీ వంటి మంచి పనులు జరిగాయి. యూపీఏ-2 కూడా వాటిని కొనసాగించింది. వాటికోసం లక్షల కోట్లు కేటాయించింది. ఇప్పుడు దేశ విదేశీ పెట్టుబడిదారీ వర్గాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని ముందుకు తీసుకొస్తున్నాయి. 1929లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి పెట్టుబడిదారీ వర్గానికి హిట్లర్ రూపంలో ఒక దారి దొరికింది. అవి హిట్లర్‌ను ఆకాశానికెత్తాయి. కానీ హిట్లర్ నియుంతృత్వం ఏమిటో ఆ తర్వాత బయటపడింది. ఇప్పుడూ అలాగే ప్రపంచంలో పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో ఆ వర్గాలకు మోడీ దొరికాడు. కనుకే అవి బీజేపీకి వంతపాడుతున్నాయి. బీజేపీ ఎన్నికల ప్రకటనల బడ్జెట్టే రూ.15 వేల కోట్లు! ప్రజలిప్పుడు మూడో ఫ్రంట్ వైపే మొగుతున్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా ఇప్పటిదాకా జరిగిన పోలింగ్‌లో ప్రజలు ప్రత్యావ్నూయు విధానాలకే ఓటేశారన్నది సుస్పష్టం. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలే నిర్ణాయూక శక్తులు. బీహార్‌లోనూ ప్రాంతీయ పార్టీలదే హవా. అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికత ఆధారంగానే ప్రజలు ఆలోచిస్తున్నారు. దాంతో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంత బలహీనపడుతుందో అంతే స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్నాయి. మూడో ఫ్రంట్కే అవకాశాలు దేశంలో మూడో ఫ్రంట్కే అవకాశాలున్నాయి. కొత్త మిత్రులు అనేకమంది వచ్చే అవకాశముంది. పలు ప్రాంతీయ పార్టీలు ఈసారి వురింత పుంజుకుంటాయి. గతంలో ప్రతి పదేళ్లకోసారి మాడో ప్రత్యామ్నాయం వచ్చింది. ఇప్పుడూ అదే జరగనుంది. ఆ పార్టీలది పాకులాటే తెలంగాణ తెచ్చిన ఘనత కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పాకులాడటం వృథా. ఇప్పుడు ప్రజలు ఓటేయబోయేది ఎవరు తెచ్చారన్న దాన్ని బట్టి కాదు. వెనుకబాటును తొలగించేందుకు ఎవరు ఏం చేస్తారన్న దానిబట్టి మాత్రమే. తెలంగాణ ఉద్యమానికి మేం మద్దతివ్వనందుకు మాకు బాధ లేదు. పైగా ఉద్యమం వల్ల మేం నష్టపోయిందీ లేదు. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ హవా ప్రస్తుత పరిస్థితి ప్రకారం సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది. వైఎస్సార్సీపీ చేస్తున్న వాగ్దానాలకు, జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ కొందరు చేస్తున్న విమర్శలకు అర్థంలేదు. జనానికి ఆర్థిక విషయాలు పట్టవు. ఎలా చేస్తారన్నది వాళ్లకు అనవసరం. ఎలా చేయాలన్నది పార్టీలు చూసుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు ఆయన్ను ఆదరించారు. బెంగాల్లో మమతపై వ్యతిరేకత... పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఎంతగా భయోత్పాతం సృష్టిస్తోందో బయటి ప్రపంచానికి తెలియదు. సీపీఎంలో పని చేసే వాళ్ల ఇళ్లకు తృణమూల్ నాయకులు వెళ్లి ముత్తైదువులకు తెల్లచీర ఇస్తారు. ‘నీ భర్త సీపీఎంలో పని చేస్తే ఇదే నీ భవిష్యత్తు’ అంటూ బెదిరిస్తారు. మరికొందరి ఇళ్లకు వెళ్లి ‘నీకు కూతురు ఉంది కదా!’ అంటూ బెదిరిస్తున్నారు. అక్కడ అక్కడ మాకు చాలా సానుకూలంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ ప్రభుత్వం భారీగా రిగ్గింగ్ చేసినా వామపక్షాలకు 39 శాతం ఓట్లొచ్చాయి. వామపక్షాలకు ఈసారి దేశవ్యాప్తంగా గణనీయంగా సీట్లొస్తాయి. పోలింగ్ పూర్తయిన కేరళలో సీపీఎం ప్రస్తుతమున్న 4 ఎంపీ సీట్లను కనీసం రెండింతలు చేసుకుంటుంది. దోచిపెట్టడమే మోడీ మోడల్ అభివృద్ధి నినాదంతో ముందుకొస్తున్న నరేంద్ర మోడీ నిజానికి ఏ విధమైన అభివృద్ధిని తీసుకొస్తారు? ఆయన చెబుతున్న గుజరాత్ మోడల్లోని వాస్తవమేమిటో అందరికీ తెలుసు. అక్కడ సామాన్యుల పరిస్థితి మరింత దిగజారింది. టాటా నానో కారు ధర రూ.లక్ష అయితే అందులో ఏకంగా రూ.60 వేల మేరకు రకరకాల సబ్సిడీల రూపంలో టాటాలకు గుజరాత్ ప్రభుత్వం అప్పగింత పెట్టింది. అంటే సంపదనంతా మోడీ ఎవరికి దోచిపెడుతున్నట్టు? ఇది ఏ మోడల్ అభివృద్ధో ఆయనే చెప్పాలి. బడా పారిశ్రామికవేత్తలంతా మోడీని వెనకేసుకు వస్తున్నారంటే ఇదే కారణం. దేశ విదేశీ పారిశ్రామిక శక్తులు మోడీని కోరుకుంటున్నాయి. -
జగన్ లాంటి నాయకుడే అవసరం
రాజకీయాల్లోకి యువత వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డే నిదర్శనం. నేను పంజాబ్‌లో పుట్టాను. హర్యానాలో పెరిగాను. పూణేలో సెటిల్ అయ్యా. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ రావడంతో ఆర్నెల్ల కితం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యా. మొదటి నుంచి రాజకీయాలపై అవగాహన, ఆసక్తి ఉన్న నాకు రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడకు లక్షలాదిగా జనం రావడం ఆశ్చర్యం కలిగించింది. అంతటి జనాకర్షకశక్తి ఇప్పుడు ఏ నేతకూ లేదు. కేవలం పేదప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమాభిమానాలే అంతటి ఆదరణకు కారణమని తెలుసుకున్నా. ఇప్పుడు ప్రజలకు జగన్ లాంటి నాయకుడే అవసరం. మరో ముఖ్యమైన మాట ఏంటంటే.. ప్రజలు తాము వేసిన ఓటు వృధాకాకుండా సమర్ధులైన నేతలనే ఎన్నుకోవాలి. - సునీతా రానా, హీరోయిన్ -
బాబు జేబులో జేపీ
బాబు, జేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం టీడీపీ, బీజేపీ ఓడిపోవద్దంటూ.. జేపీ మమ్మల్ని పోటీ నుంచి తప్పించారు జేపీ కోసమే బాబు రేవంత్‌రెడ్డిని మల్కాజ్గిరి బరిలో నిలపలేదు గెలిస్తే.. బీజేపీకి మద్దతిచ్చి కేంద్రమంత్రి అవ్వాలని జేపీ ఆశ సిద్ధాంతాలు వదిలి పొత్తుల కోసం వెంపర్లాడారు లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు ఆరోపణ ఎలక్షన్ సెల్ తెలంగాణలో లోక్‌సత్తా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజ్గిరి నుంచి ఆ పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, చేవెళ్ల నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగు రామారావు, సికింద్రాబాద్ నుంచి పి.రోహిత్‌కుమార్, మహబూబాబాద్ నుంచి రెడ్యానాయక్‌లను పార్టీ అభ్యర్థులుగా ఈ నెల ఆరో తేదీన ప్రకటించింది. జయప్రకాశ్ నారాయణ మాత్రం మల్కాజ్గిరి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మిగతా ముగ్గురు నామినేషన్లు వేసేందుకు సిద్ధం కాగా చివరి క్షణంలో జేపీ వారికి బీ ఫారాలు ఇవ్వలేదు. ‘మనం ఆ మూడు చోట్ల పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారు. అందువల్ల మీరు పోటీ చేయొద్ద’ని అభ్యర్థులకు నచ్చజెప్పి తానుమాత్రం లోక్‌సభ బరిలో నిలిచారు. ఈ మొత్తం తతంగం వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జయప్రకాశ్ నారాయణల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఉందని లోక్‌సత్తా పార్టీ నుంచి చేవెళ్ల టిక్కెట్టు లభించి బీఫారం పొందని ఏనుగు రామారావు ఆరోపిస్తున్నారు. ఆయన ‘సాక్షి’కిచ్చిన ఇంటర్వ్యూ.. ఆయన మాటల్లోనే..! ఫోనోచ్చింది.. ఒప్పందం కుదిరింది నన్ను చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిగా ఈ నెల ఆరున అధికారికంగా ప్రకటించారు. 9వ తేదీ నామినేషన్లకు చివరి గడువు కావడంతో 8వ తేదీ రాత్రి బీ-ఫారం కోసం పార్టీ ఆఫీసుకు వెళ్లాను. ఎంత రాత్రయినా బీ-ఫారం ఇవ్వలేదు.చివరకు మనం ఆ మూడుచోట్లా (మల్కాజిగిరి మినహా) పోటీ చేయడంలేదంటూ జేపీ చావు కబురు చల్లగా చెప్పారు. లోక్‌సత్తా పోటీలో ఉంటే ఓట్లు చీలి టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారనే కుంటి సాకు చెప్పారు. ‘మల్కాజిగిరిలో కూడా టీడీపీ అభ్యర్ధి రంగంలో ఉన్నాడు కదా. టీడీపీ కోసం మీరు కూడా తప్పుకోవాలి కదా’ అంటే సమాధానం లేదు. వాస్తవానికి ఆ రోజు జరిగిందేంటంటే.. జేపీకి ఆ రోజు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘చేవెళ్లలో దేవేందర్‌గౌడ్ కొడుకు వీరేంద్రగౌడ్ టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు. ఏనుగు రామారావు పోటీ చేస్తే వీరేంద్రగౌడ్ గెలవడు.. అందువల్ల ఏనుగు రామారావును బరిలోకి దింపొద్ద’ని చంద్రబాబు చెప్పడం వల్లే నాకు బీ ఫామ్ ఇవ్వలేదు. దేవేందర్‌గౌడ్ కొడుకు కోసం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకొని నన్ను తప్పించారు. చేవెళ్లలో నేను పోటీ చేస్తే కనీసం లక్ష ఓట్లు వస్తాయి. ఇప్పుడు నేను పోటీ నుంచి తప్పుకుంటే.. ప్రత్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని అమ్ముడుపోయానని ప్రజలు పొరబడే అవకాశం ఉంది. కాబట్టి జేపీ బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. జేపీ మల్కాజిగిరీలో పోటీలో ఉంటే వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. లోక్‌సత్తా స్థాయిని దిగజార్చారు మద్యం, డబ్బులు పంచొద్దు.. నేరచరితులకు టిక్కెట్లు ఇవ్వొద్దనేది లోక్‌సత్తా విధానం. అలా చేసే పార్టీలకు మద్దతు ఇవ్వొద్దనేది నిబంధన. టీడీపీ, బీజేపీలతో పొత్తుకోసం వెంపర్లాడి.. లోక్‌సత్తా స్థాయిని జేపీ దిగజార్చారు. వామపక్షాలతో పొత్తు అన్నాడు. కానీ వాళ్ల వల్ల తనకు ప్రయోజనం లేదనుకొని టీడీపీ, బీజేపీ పంచన చేరాడు. ఆమ్ఆద్మీతో పొత్తు అన్నాడు. కానీ వాళ్లు విలీనం అన్నారు. దీంతో అహం దెబ్బతిని దానికి దూరంగా ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి పార్టీని ఎదగనీయడం లేదు. తనకు తాను మేధావినని అనకుంటూ.. పార్టీలోని ఇతర నాయకులకు విలువ ఇవ్వడు. ప్రైవేటు ఎస్టేట్‌లా పార్టీని తయారుచేశాడు. అవినీతిపరులతో చేతులు చంద్రబాబు-జయప్రకాశ్ నారాయణ ఇద్దరూ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టపడ్డా మల్కాజిగిరి నుంచి ఆయనను చంద్రబాబు నిలబెట్టలేదు. జేపీతో ఒప్పందం చేసుకవడం వల్లనే బలమైన రేవంత్‌రెడ్డిని తప్పించి ఈ మధ్యే టీడీపీలో చేరిన మల్లారెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా జేపీకి మార్గం సుగమం చేశారు. అందుకు కృతజ్ఞతగా జేపీ మమ్మల్ని బలి చేశాడు. ఒకవేళ గెలిస్తే బీజేపీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో మంత్రి పదవి పొందొచ్చన్నది జేపీ దురాలోచన. వయస్సు మీద పడుతుండటంతో ఆయనకు పదవీ వ్యామోహం పెరిగింది. అంతేకాదు తన స్వప్రయోజనాల కోసం కటారి శ్రీనివాసరావును ఈసారి కూకట్పల్లి నుంచి పోటీ చేయిస్తున్నారు. ఎందుకంటే ఆ అసెంబ్లీ స్థానం మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఓట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఆయన్ను ఇక్కడి నుంచి నిలబెట్టారు. జేపీలాంటి దేశద్రోహులకు బుద్ధి చెప్పాలి. జేపీ మాయమాటలకు ఎందరో బలయ్యారు. అవినీతిపరులు, నేరచరిత్రులకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇప్పుడు వాళ్లతోనే చేతులు కలుపుతున్నార -
కోటరీ చేతిలో ‘కీ’లుబొమ్మ
కార్పొరేట్ మాటే బాబుకు వేదం కార్యకర్తలకు, నేతలకు దూరమైన పార్టీ బినామీల రాజ్యంగా టీడీపీ యాచమనేని పార్థసారథి: తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం చర్చలకు వెళ్లండి. ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడండి . తన కోటరీలోని పారిశ్రామికవేత్తలు సీఎం రమేశ్, సుజనా చౌదరిలకుబాబు పురమాయింపు. విశాఖలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య విభేదాలు మరీ పెరిగాయి. సర్దుబాటు చేయండి .తన సన్నిహితుడైన విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పి.నారాయణకు బాబు ఆదేశం (నారాయణకు టీడీపీలో ఏ పదవీ లేదు) . కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్సీపీలో చేరజూస్తున్నారు, వారిని ఎలాగోలా మన పార్టీలో చేరేలా ఒప్పించండి. అవసరమైతే ‘నిధులు’ సర్దుబాటు చేయండి .తన కోటరీలోని సుజనా, నామా నాగేశ్వరరావులకు చంద్రబాబు నిర్దేశం. ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలో తేల్చారా, లేదా? .మరో పారిశ్రామికవేత్త గరికపాటి మోహనరావుకు బాబు ప్రశ్న . ‘సీట్లు అడుగుతున్నారు సరే, అసలు మీ దగ్గర దండిగా నోట్లున్నాయా?’ పొత్తు చర్చల్లో బీజేపీ నేతలకు టీడీపీ కార్పొరేట్ బినామీలు సంధించిన తొట్టతొలి ప్రశ్న. టీడీపీ పూర్తిగా కార్పొరేట్ మయమైపోయింది. బడా బాబుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలకు, నేతలకు ఏనాడో దూరమైంది. టీడీపీ ఇప్పుడు ఆద్యంతం బాబు బినామీలుగా చలామణీ అవుతున్న వారి కనుసన్నల్లోనే నడుస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో ఎవరు అందెవేసిన చెయ్యి అయితే వారిదే హవా! మరో నాయకుడి మాటకు పూచికపుల్ల పాటి విలువైనా లేని పరిస్థితి. పార్టీపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ బడాబాబులదే పెద్ద పాత్ర. బీసీ, ఎస్సీ తదితర వర్గాల నేతలకు గానీ, జనాదరణ ఉన్నా ఆర్థిక బలం లేని నేతలకు గానీ చోటే లేదు. వెరసి టీడీపీలో వ్యవహారాలన్నీ కార్పొరేట్ క్రయ విక్రయాలను తలపించేలా సాగుతున్నాయి! బాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో రకంగా లబ్ధి పొందిన బడా బాబులే నేతల అవతారమెత్తి పార్టీని తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. పార్టీని ఒక పెట్టుబడి యం త్రంగా మలిచారన్న విమర్శ ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచే బలంగా విన్పిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో ఒక కాంగ్రెస్ నేతను టీడీపీలో చేర్పుకుని లోక్‌సభ టికెట్ కట్టబెట్టేందుకు బాబు కోటరీలోని కార్పొరేట్లే రంగంలోకి దిగారు. మంతనాలు జరిపారు. లావాదేవీలు నడిచాయి. సదరు కాంగ్రెస్ నేత టీడీపీలో చేరారు. లోక్‌సభ టికెట్ ఖరారైంది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపుగా రూ.100 కోట్ల ప్యాకేజీ కుదిరినట్టు చెబుతున్నారు. పైగా లోక్‌సభ టికెట్ ఇచ్చినందుకు ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు మొత్తాన్నీ ఆ నేతే భరించాలి. వీటిన్నింటికీ బదులుగా... టీడీపీ అధికారంలోకి వస్తే గిస్తే రాయితీలే రాయితీలు! ఇదీ డీల్. గుంటూరు జిల్లా నుంచే మరో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో కూడా ఈ కోటరీ ముఖ్యులే మంతనాలు జరిపారు. లోక్‌సభకు పోటీ చేసేందుకయ్యే ఖర్చుతో పాటు, ఆ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరి ఖర్చూపెట్టుకోవాలని ప్రతిపాదించారు. అందుకాయన సరేననడమే గాక వార అడిగినంత మొత్తం చూపించిన తర్వాతే చేరికకు బాబు పచ్చజెండా ఊపారు. అలా సదరు కాంగ్రెస్ ఎంపీ ఇటీవలే తన సోదరుడితో కలిసి టీడీపీలో చేరారు. కోటరీ చెప్పి మేరకు ఆయన కోసం టీడీపీ సిట్టింగ్ ఎంపీని కూడా పక్కకు తప్పించారు బాబు! కృష్ణా జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సోదరుడి కూడా టీడీపీ కార్పొరేట్ గ్యాంగ్ గాలమేసింది. ఎమ్మెల్యే టికెటిస్తామనే హామీతో జిల్లా టీడీపీ వ్యవహారాలు చూస్తున్న బాబు కోటరీ ముఖ్యుడొకరు ఆయన నుంచి కోట్లలో వసూళ్లు చేసినట్టు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇటీవల ఇదే పద్ధతిలో టీడీపీలో చేరారు. అదే సీటు కోసం కాంగ్రెస్ మాజీ మంత్రి ఒకరు ప్రయత్నించగా, ‘నీవెంత ఖర్చు పెడతావ్? ఇంత పెట్టగలిగితేనే చేర్చుకుంటాం. లేదంటే నీ దారి నువ్వు చూసుకో’ అని సదరు కార్పొరేట్ బినామీ సూటిగానే చెప్పేశారు! సీమాంధ్రలో కాంగ్రెస్ పనైపోయిందని, వైఎస్సార్సీపీలో ఎటూ ఖాళీ లేదని తెలిసే, తప్పనిసరిగా టీడీపీలోకి రావాల్సిందేనన్న ధీమాతోనే బాబు బినామీ ఇలా గొంతుపై కత్తి పెటి మరీ బేరాలాడుతున్నారట. ఇలాగే గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ సీటును గతంలో పీఆర్పీ తరఫున పోటీ చేసిన నేతకు ఇచ్చేందుకు బాబు కోటరీ ముఖ్యుడొకరు తనకు సంబంధించిన ఒక వ్యాపార ప్రయోజనాన్ని నెరవేర్చాలని షరతు విధించారు. అది కుదిరాకనే టికెట్ ఖాయం చేశారు. సదరు కోటరీ ముఖ్యుడికి రంగారెడ్డి జిల్లాలో వైద్య కళాశాలతో పాటు హైదరాబాద్ నడిబొడ్డున ఆసుపత్రులున్నాయి. కోటరీ + లోకేశ్ = టీడీపీ! చంద్రబాబు పార్టీకి సంబంధించి ఏ చిన్న పని చేయాలన్నా కార్పొరేట్ కోటరీ సూచనలుండాల్సిందే. వాటిని మాత్రమే తూచా తప్పకుండా పాటిస్తారాయన. ఇప్పుడు టీడీపీలో నామా నాగేశ్వరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, డాక్టర్ పి.నారాయణ వంటి ధనవంతుల మాటకు తిరుగులేదు. వీరిలో నామా మినహా మిగతా వారంతా పరోక్షంగా పదవులు ఆశించిన వారే. ఎన్నికల్లో టికెట్ల పంపిణీ వ్యవహారాలన్నీ వీరే కనుసన్నల్లోనే సాగుతున్నాయి! వీరంతా చంద్రబాబు కుమారుడు లోకేశ్ పర్యవేక్షణలో గుట్టుగా వ్యవహారాలు నడుపుతారు. బాబు సైతం తానుగా జోక్యం చేసుకోకుండా వారు చెప్పిందానికే తలూపుతున్నారని ఇప్పుడు పార్టీలో బలంగా వినిపిస్తోంది. పొత్తులు, ఎత్తులు మొదలుకుని డబ్బూ దస్కం పంపిణీ దాకా సర్వం కార్పొరేట్ కోటరీ నిర్ణయాలకు అనుగుణంగానే నడుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ వాళ్లే ఇప్పుడు బాబుకు ఆత్మ, అంతరాత్మ. పార్టీలో ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా సరే, వీరిముందు జీ హుజూర్ అంటూ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇది గమనించిన చాలామంది నేతలు ముందుగా వీరి దర్శనమే చేసుకుంటున్నారు. తాజాగా జిల్లాలవారీగా పార్టీపరంగా ఎన్నికల వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతను కూడా బాబు వారికే అప్పగించారు. సీమాంధ్రలోని ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో పార్టీ పనులను గరికపాటి పర్యవేక్షిస్తున్నారు. రాయలసీమ జిల్లాలను సీఎం రమేశ్, మిగతా జిల్లాలను సుజనా చౌదరి, నారాయణ, నామా చూసుకుంటున్నారు. ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరికి టికెటివ్వాలి, ప్యాకేజీలు ఎవరికివ్వాలి, ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి వంటి సర్వ వ్యవహారాలనూ వీరే తేల్చేస్తారు! గత ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలోనూ వీరిదే కీలక పాత్ర! డబ్బులు గుప్పిస్తే పొత్తుకు రాని నాయకుడు గానీ, పార్టీ గానీ ఉండవన్నది వారి నమ్మకం. తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికీ వీరే మధ్యవర్తిత్వం నెరిపారు. పొత్తుల విషయం గతంలో ఆయా పార్టీ కార్యాలయాల్లోనో, నేతల ఇళ్లలోనో చర్చలు జరిగేవి. కానీ ఈ కోటరీ హవా విస్తరించాక ఈ చర్చలకు కూడా స్టార్ హోటళ్లే వేదికవుతున్నాయి. బీజేపీతో పొత్తు చర్చల్లో కూడా, ‘మీరు పెద్దగా ఖర్చు పెట్టలేరు’అనే వాదన సాయంతోనే వారికి వీలైనన్ని తక్కువ సీట్లతో సరిపెట్టేందుకు ప్రయత్నించారు. -
ఓటుకు ‘పచ్చ’నోటు
ఆయన మాట్లాడితే... ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయిపోయిందంటూ ఎక్కడ లేని ఆవేదన చెందుతాడు... వేల కోట్లతో ఓట్లు కొనుక్కునేందుకు నాయకులు వస్తున్నారని విమర్శలు చేస్తాడు... రాజకీయాల్లో నీతి, నిజాయితీ కావాలని పెద్ద పెద్ద మాటలు చెపుతాడు... నల్లధనాన్ని వెలికితీయాలని... ఓటుకు నోటు సంస్కృతి పోవాలని ఉపన్యాసాలు దంచేస్తాడు... ఆయనెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది కదా..! ఓటుకు నోటు సంస్కృతికి ఆద్యుడు... ఎన్నికల్లో మద్యాన్ని వరదలా పారిస్తే మత్తులో ఓట్లు గుద్దుతారని నమ్మే మాజీ ముఖ్యమంత్రి... పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఏ ఎన్నికలకైనా కోట్లు ఖర్చు చేసే దేశంలోని ఏకైక నేత ... ఇంకెవరు..? చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ పచ్చనోట్ల పంపకాలకు అప్పుడే తెరతీసింది. రూ. వందల కోట్లు వెదజల్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలని చంద్రబాబు కలరింగ్ ఇచ్చినా.. అంతిమ లక్ష్యం మాత్రం నమ్ముకున్న లాబీ ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు కోట్లాది రూపాయలు పంపించడమే. గురువారం కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పీఏ ఏకంగా రూ. 98లక్షలు ఆర్టీసీ బస్సులో తరలిస్తూ పోలీసులకు పట్టుబడడం దీనికి ఊతమిస్తోంది. అయితే పోలీసులకు దొరకకుండా ఇతర మార్గాల ద్వారా తరలిపోయిన మొత్తం రూ.వందల కోట్లకు పైనేనని సమాచారం. రూ. వందల కోట్లు వెచ్చించైనా...! చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదలైన ‘ధన’స్వామ్య పోటీ.. ఆయన పదవి నుంచి దిగిపోయి పదేళ్లవుతున్నా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలవలేమని తెలిసినా.. టీడీపీ టిక్కెట్టు కోసం పోటీ ఎందుకంటే.. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ నుంచి వచ్చే డబ్బుల మూటల కోసమే. ఇటీవల ముగిసిన మునిసిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో సైతం టీడీపీ తెలంగాణలో కోట్ల రూపాయలు పంచింది. అయినా ఎన్ని వార్డుల్లో, మండలాల్లో గెలుస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచే అవకాశం ఉన్న ఒక్కో నియోజకవర్గానికి రూ. 5 కోట్ల వరకు పార్టీ ద్వారా పంపించేందుకు పథక రచన పూర్తిచేసింది. టీడీపీ తరపున ప్రచారం చేయడానికి జనం స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో గ్రామాల్లో ఎంపిక చేసిన నాయకుల ద్వారా డబ్బులు పంచేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంది. పారిశ్రామిక ‘నాయకుల’ ద్వారానే! పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లే టీడీపీలో ఇప్పుడు కీలకంగా మారారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు పంచేది వారే కాబట్టి పార్టీలో వారికి విపరీత ప్రాధాన్యముంది. టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులతో కూడిన కోటరీ ఈ ఖర్చునంతా భరిస్తుంటుంది. అభ్యర్థులు చంద్రబాబును డబ్బులు అడిగిన వెంటనే ఆయన వీరికి ఫోన్‌చేసి సీఆర్ (కోటి) పంపించాలంటూ ఆదేశిస్తారు. ఆ మేరకు వారు ఎవరికీ అనుమానం రాకుండా ‘ప్రణాళిక’ ప్రకారం అనుకున్న చోటికి పకడ్బందీగా డబ్బును చేరవేస్తారు. ఈ మాఫియా తరహా తతంగాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద యంత్రాంగమే పనిచేస్తోంది. అభ్యర్థి పలుకుబడిని బట్టి కొన్నిచోట్ల రూ.10 కోట్ల వరకు పంపిస్తున్నారు! ఇబ్బందిగా మారిన నిఘా అడుగడుగునా పోలీసులు, ఎన్నికల నిఘా సంస్థలు తనిఖీలు చేపడుతుండడం టీడీపీకి ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే విజయ రమణారావు పీఏ అడ్డంగా దొరికిపోవడంతో పార్టీ పారిశ్రామిక నాయకులు ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల తరహాలో రైళ్లలో డబ్బు తీసుకెళ్లడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. హవాలా మార్గం లోనూ జిల్లాకేంద్రాలకు డబ్బులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం హవాలా నిర్వహించే వారి జాబితాను సేకరించినట్లు తెలిసింది. రెండో విడత డబ్బుల పంపిణీకి కార్ల స్టెప్నీ టైర్లు, లోడ్లతో వెళ్లే లారీలను, ట్రాన్స్‌పోర్టు కంపెనీలను కూడా మార్గంగా ఎంచుకున్నట్లు సమాచారం. -
కోటలో కోట్లాట
అసెంబ్లీ నియోజకవర్గం గద్వాల ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 6, టీడీపీ-2, జనతాపార్టీ-1, స్వతంత్రులు-3, సమాజ్‌వాదీపార్టీ-1, ప్రస్తుత ఎమ్మెల్యే: డీకే అరుణ (కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: వర్గ రాజకీయం, నమ్మినవారికి అండగా నిలవడం, రాజకీయ చైతన్యం, బీసీ ఓటర్లు అధికం ప్రస్తుతం బరిలో నిలిచింది: 19 ప్రధాన అభ్యర్థులు వీరే.. డీకే అరుణ (కాంగ్రెస్) బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (టీఆర్ఎస్) వీఎల్ కేశవరెడ్డి (బీజేపీ) మాజీ మంత్రి డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో మరోమారు కీలక పోరు జరగబోతోంది. ఇక్కడ ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా పదిసార్లు డీకే కుటుంబ సభ్యులే ఎన్నికయ్యారు. ఆ కుటుంబం గద్వాల నుంచి మొత్తం 36 సంవత్సరాలు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించింది. డీకే సత్యారెడ్డి ఏడేళ్లు, ఆయన కుమారులు సమర సింహారెడ్డి 14 ఏళ్లు, భరత సింహారెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. భరతసింహారెడ్డి భార్య డీకే అరుణ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎన్నికల్లో అరుణ కాంగ్రెస్ నుంచి, ఆమె మేనల్లుడు కృష్ణమోహన్‌రెడ్డి టీఆర్ఎస్ నుంటి పోటీ పడుతున్నారు. గద్వాల సంస్థానానికి చెందిన వీఎల్ కేశవరెడ్డి తొలిసారిగా బీజేపీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1. గద్వాలను జిల్లా చేస్తా 2. నెట్టెంపాడులో మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తా. 3. గద్వాల ప్రాంతంలో వెయ్యి మెగావాట్ల సోలార్, వెయ్యి మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా. 4. విద్యాభివృద్ధితో ఉపాధి అవకాశాల పెంచుతా 5. జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తా - డీకే అరుణ 1. అవినీతి లేని పాలన అందిస్తా 2. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయడానికి కృషి చేస్తా 3. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తా 4. సాగునీటి వనరులను పెంచండం ద్వారా గద్వాలను ప్రగతిపథంలోకి నడిపిస్తా 5. వైద్య సదుపాయాలు కల్పిస్తా. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చేస్తా సేవలు అందిస్తా - బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 1. అభివృద్ధిలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తా 2. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తా. వలసలు నివారిస్తా 3. {పతీ పల్లెకు తాగునీటిని అందిస్తా 4. గద్వాల ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందిస్తా - వీఎల్ కేశవరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారిన అరుణ 1999లో గద్వాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో కాంగ్రెస్ టికెట్ ఆశించినా దక్కక పోవడంతో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన అరుణ మంత్రిగా వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. అదే సమయంలో జిల్లా రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం ఎన్నికలు అరుణకు కీలకంగా మారాయి. ఆమె ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆరాట పడుతున్నారు. వరుసగా పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండడంతో ప్రజల్లో సహజంగా ఉండే వ్యతిరేకతను చెరిపేసేందుకు అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు డీకే అరుణ బావ, మాజీమంత్రి డీకే సమరసింహారెడ్డి టీడీపీ టికెట్ ఆశించినా బీజేపీతో పొత్తు మూలంగా నిరాశ ఎదురైంది. ఇక్కడ ఈయన అనుసరించే వైఖరి కూడా కీలకం కానుంది. సానుభూతిపైనే టీ ఆర్ఎస్ ఆశ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి మేనత్త చేతిలో ఘోరంగా ఓడిపోయిన కృష్ణమోహన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో సానుభూతిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని టికెట్ దక్కించుకున్న ఆయన తెలంగాణవాదం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. నియోజకవర్గంలో డీకే కుటుంబాన్ని తట్టుకుని నిలబడగలిగే సత్తా తనకు మాత్రమే ఉందని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. తొలిసారిగా సంస్థాన వారసుడు గద్వాల సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన వీఎల్ కేశవరెడ్డి తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గద్వాల సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన కె.రాంభూపాల్ 1962లో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. టీడీపీ హయాంలో ఇదే కుటుంబానికి చెందిన విజయమోహన్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సంస్థానాధీశుల వారసురాలు డాక్టర్ సుహాసినీరెడ్డి దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి సమీప బంధువు. ఆమె కుమారుడైన కేశవరెడ్డి అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ వ్యాపారంలో ఉన్నారు. చాలాకాలం తర్వాత రాజకీయాల్లోకి సంస్థానాధీశుల వారసుడు రావడంతో ఇక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నువ్వా.. నేనా
అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ తూర్పు ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ - 3, స్వతంత్రులు -2 ప్రస్తుత ఎమ్మెల్యే: బస్వరాజు సారయ్య(కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం ఎక్కువ. మైనార్టీలు, బీసీలు, ఎస్సీల ఓట్లు అధికం ప్రస్తుతం బరిలో నిలిచింది: 15 ప్రధాన అభ్యర్థులు వీరే.. బస్వరాజు సారయ్య (కాంగ్రెస్) కొండా సురేఖ (టీఆర్ఎస్) రావు పద్మరెడ్డి (బీజేపీ) మెట్టు శ్రీనివాస్ (సీపీఎం) మాజీ మంత్రుల మధ్య బిగ్ ఫైట్ ఇప్పుడు అందరి దృష్టి వరంగల్ తూర్పు స్థానం మీదే ఉంది. హ్యాట్రిక్ సాధించిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నాలుగోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. రాజకీయ జన్మనిచ్చిన పరకాలను, పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన మరో మాజీ మంత్రి కొండా సురేఖ, సారయ్య విజయాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ, సీపీఎం అభ్యర్ధులు రావు పద్మ, మెట్టు శ్రీనివాస్ ఏమేరకు ఓట్లు చీలుస్తారన్నదాని మీదే గెలుపోటములు ఆధారపడిఉన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సారయ్యకు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అభివృద్ధి సానుకూల అంశం. సారయ్య మంత్రి అయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం కారణంగా నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు అనుచరులు టీఆర్ఎస్లో చేరడం ప్రతికూల అంశాలు. పట్టు కోసం సురేఖ కొండా సురేఖ కొత్త నియోజకవర్గమైనా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సారయ్య వ్యతిరేకులను కలుపుకుని పోతున్నారు. టికెట్ రాక నిరాశకు గురయిన గులాబీ నేతలను బుజ్జగిస్తున్నారు. ప్రచారం హోరుగా సాగుతున్నప్పటికీ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. స్థానికేతరులు కావడం, నియోజకవర్గంపై పట్టులేకపోవడం ఆమెకు ప్రతికూలాంశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్లో చేరడం కూడా చర్చనీయాంశం అయింది. మోడీ జపంతో రావు పద్మ టీడీపీ, బీజేపీ పొత్తుల భాగంగా రావు పద్మ బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈమె హన్మకొండకు చెందిన వారు కావడం ప్రతికూలాంశం. టీడీపీ ఓట్లు బీజేపీకి మారుతాయా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ కోసం బీజేపీ చేసిన యత్నం, మోడీ మంత్రమే ఆయుధంగా సాగుతున్నారు. అభివృద్ధి మెట్టు సీపీఎం అభ్యర్ధి మెట్టు శ్రీనివాస్ ప్రజా సమస్యలు, నగరాభివృద్ధి, సంక్షేమంపై కేంద్రీకరించి ప్రచారం చేస్తున్నారు. గుడిసెవాసుల్లో, కార్మికపేటల్లో సీపీఎంకు గట్టి ఓటు బ్యాంకున్నది.వివిధ సమస్యలపై పోరాడినా వాటిని ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. సమైక్యవాదం ఈ పార్టీకి కొంత ఇబ్బందిగా మారనున్నది. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం నగరంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తా అండర్‌డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తా - బస్వరాజు సారయ్య టెక్స్టైల్ పార్కు ఏర్పాటు పూర్తి చేయిస్తా స్పిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు కృషి ఐటీ రంగాభివృద్ధికి ప్రయత్నం చేస్తా వరంగల్ నగరాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా - కొండా సురేఖ అపెరల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తా వరంగల్‌లో అండర్గ్ర {yైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస బీడీ కార్మికుల సంక్షేమంపై దృష్టి ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా - రావు పద్మ నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దుతా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తా అసంఘటిత కార్మికుల ఉపాధి కల్పన విద్య, వైద్య వసతులపై కేంద్రీకరిస్తా - మెట్టు శ్రీనివాస్ -
ఓటరు సందేహాలకు ఈసీ సమాధానాలు
ఎన్నికల సమయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు.. కార్డులో తప్పులు.. ఉద్యోగుల ఇబ్బందులు.. వేలిపై సిరా మరకలు.. ఇంకా ఎన్నో సందేహాలు.. ఇలాంటివాటికి పరిష్కార మార్గాలను భన్వర్‌లాల్ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తారు. మీ ప్రశ్నలు మాకు పంపండి. - ఎలక్షన్ సెల్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్, లేదా ్ఛ్ఛఛ్టిజీౌఃట్చజుటజిజీ.ఛిౌఝకు మెయిల్ చెయ్యండి. ఏ అభ్యర్థీ నచ్చనప్పుడు వారందరినీ తిరస్కరించేందుకు ‘నోటా’ ఓటు కల్పించారు. ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకోరు కదా? అటువంటప్పుడు ‘నోటా’ వల్ల ప్రయోజనం ఏమిటి? - డాక్టర్ పీవీ రామకుమార్, విజయవాడ గతంలో అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ఎన్నుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరినీ తిరస్కరించే అవకాశం కలిగింది. ఓటరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు ఇది ఒక అదనపు ప్రత్యామ్నాయం మాత్రమే. పోలింగ్ ఏజెంట్లను ప్రలోభపెట్టి బూత్‌లో ఏకపక్షంగా ఓట్లు వేయించే అవకాశం ఉంది. దీనిని ఎలా నివారిస్తారు? -చాంద్‌భాష, ప్రొద్దుటూరు అలా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈసారి ప్రతి బూత్లోనూ ‘లైవ్ వెబ్ క్యాస్టింగ్’ ఏర్పాటు చేస్తున్నాం. బూత్‌లో జరిగే వ్యవహారమంతా రికార్డు అవుతూ ఉంటుంది. ఇంటింటికీ తిరిగి ఎన్నికల సంఘమే ఓటర్ స్లిప్పులు ఇస్తోంది కదా. పార్టీల అభ్యర్థులు స్లిప్పులు ఇవ్వడాన్ని నివారిస్తే బాగుంటుంది. - ప్రకాష్, నిజామాబాద్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఓటర్లకు స్లిప్పులు ఇవ్వడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పోలింగ్‌కు 48 గంటల ముందు పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ఇలా స్లిప్పుల పంపిణీ చేపడితే మాత్రం అది చట్ట విరుద్ధం అవుతుంది. అప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం. -
ఇదిగో జనాయుధం
‘విలువలు లేని రాజకీయం’ సంఘ జీవితాన్ని ధ్వంసంచేసే సప్త మహా పాతకాల్లో ఒకటిగా వర్ణించాడు మహాత్ముడు. అంతటి పాతకానికి యథేచ్ఛగా, నిర్లజ్జగా దిగజారుతున్న రాజకీయచిత్రం వర్తమాన యవనికపై గజ్జెకట్టి నాట్యం చేస్తోంది. అదృష్టవశాత్తు, మన దేశంలోని సాధారణ ప్రజలు అడుగడుగునా అద్భుతమైన చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయవేత్తలు స్వార్థపరులై విలువలను విడిచేసిన ప్రతిసారీ, విశ్వసనీయతను తుంగలో తొక్కిన ప్రతి సందర్భంలోనూ, దగాకోరులై వంచన చేసిన ప్రతి పర్యాయం... వారికి కర్రు కాల్చి వాతపెడుతూ, అధికార పీఠం నుంచి లాగిపడేసి ఈ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కంటిపాపలా కాపాడుకుంటున్నది సామాన్య ప్రజలే. మళ్లీ అటువంటి సందర్భం మనముందున్నది. వంద కోట్లు దాటిన జనభారతి అభ్యున్నతి కోసం మరో సారి విలువలకు పట్టం కట్టడం అత్యవసరం. ఇది పరీక్షా సమయం. కొన్నేళ్లుగా కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ ఊహించని దారుణాలన్నీ చూస్తున్న జనం తీర్పరులుగా మారుతున్న సమయం. యువత తమ భవిత ఎలావుండాలో తామే స్వయంగా సంకల్పం చెప్పుకోవలసిన సందర్భం. మహిళలు తమ సంక్షేమాన్ని, సాధికారతనూ ఆలోచించాల్సిన కీలక తరుణం. గత నాలుగున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న సంక్షుభిత స్థితి నుంచి తెలుగుజాతిని విముక్తం చేసి అభివృద్ధి వైపు పరుగులు పెట్టించే బలమైన నాయకత్వం కావాలిప్పుడు. అభివృద్ధి సౌధాలను పునాదుల స్థాయి నుంచి పునర్నిర్మించి, ఆకాశమే హద్దుగా పురోగమించడానికి సారథ్యం వహించే నవ నాయకత్వం కావాలిప్పుడు. సగం జనాభాగా విస్తరించిన యువశక్తులను ఉత్తేజపరచి ప్రగతిపథంవైపు పరుగులెత్తించగల దమ్మున్న నాయకత్వం కావాలిప్పుడు. దార్శనికత, చిత్తశుద్ధి, విశ్వసనీయత కలగలిసిన సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునే సువర్ణావకాశం సార్వత్రిక ఎన్నికల రూపంలో మన తలుపు తడుతోం ది. ఓటుతో తీర్పు చెప్పేముందు ఆ తీర్పు కోసం తమ ముందుకొచ్చిన నేతల విలువలు, విశ్వసనీయతలపై లోతైన పరిశీలన చేద్దాం. ఆ తర్వాత ఓటేద్దాం. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలించి, ప్రజాకంటక పరిపాలనకు పర్యాయపదమై నిలిచి, జనాగ్రహానికి గురై పదేళ్ల కిందటే పదవీచ్యుతుడైన ఒక నాయకుడు... ఆయనను ఒక జానపద కథానాయకుడుగా, ఒక మహా మంత్రి తిమ్మరుసులా, ఒక హైటెక్ మేధావిగా చిత్రించేందుకు ఇరవై యేళ్లుగా పడరానిపాట్లు పడుతున్న ఒక మీడియా వ్యవస్థ. ఆ నాయకుడూ - ఆ మీడియా తెలుగు ప్రజల పాలిటి స్పెషల్ దౌర్భాగ్యం. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ నాయకునికి మారువేషం వేసి, మహాకూటమిని జతచేసి ‘రాజువెడలె రవి తేజములలరగ...’ అంటూ ఆ మాయ మీడియా చేసిన హడావుడి ఇంకా మన జ్ఞాపకాల్లో తాజాగానే వుంది. ఎంత మాయ చేద్దామనుకున్నా చైతన్యవంతులైన మన జనం ఆ ముసుగునేతను గుర్తుపట్టనే పట్టారు. మళ్ళీ తరిమికొట్టారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరో కొత్తవేషంలో, మరో కొత్త కూటమితో, మరో కొత్త స్క్రిప్టుతో సదరు నాయకుడూ, సదరుమీడియా మళ్లీ తయార్. కొన్ని దశాబ్దాలపాటు ఈ తెలుగు నేలపై జనస్వామ్యాన్ని గుత్తకు తీసుకుని ఆ జనం ఎలా ఆలోచించాలో, ఎలా స్పందించాలో, ఏ బాబుకు జైకొట్టాలో... అక్షరమక్షరం నిర్దేశించాలని చూసి... చివరికి జన చైతన్యంతో భంగపడి... ఇప్పటికీ జన జాగృతిని విశ్వసించని ఈ ఛాందస శక్తులు మళ్లీ ముస్తాబైపోయాయి. మాటపై నిలిచిన వారిపై కత్తిగట్టి... గోబెల్స్ ప్రచారం చేసే విషపు రాతలు, దృశ్యాలు మళ్లీ సిద్ధమైపోయాయి. కుమ్మక్కు రాజకీయం, కుటిల పాత్రికేయం ఒక్కటైతే ఎలా ఉంటుందో ఈ రాష్ర్ట ప్రజలకు తెలియనిదేమీ కాదు. గత రెండు ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలను కుళ్లగించి, పెళ్లగించేశారు జనం. అయినా మామూలే! ఎన్నికల వేళ షరా మామూలే!! అందుకే పారాహుషార్! పారాహుషార్!! రాజరికంలో మగ్గి, పరాయిపాలనపై పోరాడి పదునెక్కిన ప్రజాస్వామ్యం మనది. వందల భాషలున్నా, పదుల రాష్ట్రాలున్నా భారతీయమనే ఏకైక మూలానికి కట్టుబడ్డ జన భారతం మనది. 76 కోట్ల మంది ఓటర్లున్న ఈ నవభారతానికి... ఆ జనంలోని చైతన్యమే శ్రీరామరక్ష. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని ప్రలోభాలు చూపించినా కీలెరిగి వాత పెట్టించగలుగుతోంది ఆ చైతన్యమే. జనచేతనమే నవకేతనమై మళ్లీ మళ్లీ ఎగరాలి. అలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి కలం సాక్షిగా నిత్యం కాపు కాసే పట్టుగొమ్మలు పత్రికలైతే, పాలకుల పనితీరుకు ప్రోగ్రెస్ కార్డులే ఎన్నికలు. ఆరేళ్ల కిందట ఆరంభమైన ‘సాక్షి’... ప్రతి ప్రజా పోరాటంలోనూ తన వంతు బాధ్యత పోషిస్తూనే ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటూ... ఓ పత్రికగా తనపై ఉన్న గురుతర బాధ్యతను నిత్యం నెరవేరుస్తూనే ఉంది. అదే స్ఫూర్తితో... ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఈ పవిత్ర ఎన్నికల క్రతువులో కూడా పూర్తి నిబద్ధతతో పాల్గొంటుంది ‘సాక్షి’... జనం గొంతుకై ప్రతిధ్వనిస్తుంది ‘సాక్షి’... అందుకోసం మీ చేతిలో ఆయుధంగా మారుతూ నేటినుంచి మీ చేతికి అందిస్తోంది... జనాయుధం... సార్వత్రిక ఎన్నికల సమగ్ర కవరేజీతో కూడిన 4 పేజీల ప్రత్యేక అనుబంధం నేటినుంచి మీ కోసం... - ఎడిటర్