జనం గొంతుకైన షర్మిల
అన్న వైఎస్ జగన్, తల్లి విజయమ్మ బాటలోనే షర్మిల కూడా సమైక్య శంఖారావాన్ని పూరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ 4వ వర్ధంతి సందర్భంగా గత సెప్టెంబర్ 2 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. విభజన వల్ల ఎన్ని నష్టాలో, అలాంటి విభజనకు అటు చంద్రబాబు, ఇటు కిరణ్ ఎలా కారణమయ్యారో వివరిస్తూ సీమాంధ్ర అంతా కలియదిరిగారు.
‘కొడుకును ప్రధాని చేయడానికి కోట్లాది సీమాంధ్రులకు అన్యాయం చేసేందుకు సోనియా పూనుకున్నారు. ఇక... తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోని చంద్రబాబు, హత్య చేసి, శవంపై వెక్కి వెక్కి ఏడ్చిన చందంగా బస్సు యాత్ర చేస్తారట’ అంటూ తూర్పారబట్టారు. ప్రజల ఆందోళనలో భాగస్వామి అయ్యారు. జనం గొంతుకగా మారారు.