* బీజేపీ పొత్తుతో టీడీపీకి నష్టమే
* మైనారిటీల్లో సన్నగిల్లిన విశ్వాసం
* సీమాంధ్రలో వైఎస్ జగన్ హవా
* దేశంలో ప్రాంతీయ పార్టీలదే జోరు
* మూడో ఫ్రంట్‌కే అధికారం
* పవన్ ప్రభావమేమీ ఉండదు
* ఎన్నికల తర్వాత కొత్త మిత్రులు
బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: బీజేపీతో పొత్తు ద్వారా ఏదోలా అధికారాన్ని దక్కించుకోవాలను కుంటున్న చంద్రబాబు కల కలగానే మిగిలిపోతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి జోస్యం చెప్పారు. పైగా బీజేపీతో పొత్తు వల్లే బాబు కనీసం మరో పదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఏచూరి పలు అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... వాళ్లకు అనవసరం. ఎలా చేయాలన్నది పార్టీలు చూసుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు ఆయన్ను ఆదరించారు.
ఎన్నికల తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా తమ బతుకులు మార్చేదిగా ఉండాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. భారాలు మోపని, ధరల మోత లేని ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్‌లతో సాధ్యం కాదనేది వారు గ్రహించారు. పైగా వాటి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. రెండూ ఒకే ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నాయి. అవినీతి, కుంభకోణాల్లోనూ వాటి మధ్య తేడా ఏమీలేదు. లోక్‌సభలో యూపీఏ, ఎన్డీఏల మ్యాచ్‌ఫిక్సింగ్ అనేక సందర్భాల్లో బయట పడింది. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్‌ల ఓటమి... మరీ ముఖ్యంగా మతతత్వ బీజేపీ ఓటమి చాలా ముఖ్యం.
యూపీఏ-1 ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ప్రకటించినా, వాటి ఒత్తిడి వల్లే దేశంలో విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపా ధి హామీ వంటి మంచి పనులు జరిగాయి. యూపీఏ-2 కూడా వాటిని కొనసాగించింది. వాటికోసం లక్షల కోట్లు కేటాయించింది. ఇప్పుడు దేశ విదేశీ పెట్టుబడిదారీ వర్గాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నరేంద్ర మోడీని ముందుకు తీసుకొస్తున్నాయి. 1929లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి పెట్టుబడిదారీ వర్గానికి హిట్లర్ రూపంలో ఒక దారి దొరికింది. అవి హిట్లర్‌ను ఆకాశానికెత్తాయి. కానీ హిట్లర్ నియుంతృత్వం ఏమిటో ఆ తర్వాత బయటపడింది. ఇప్పుడూ అలాగే ప్రపంచంలో పెద్ద మార్కెట్ అయిన భారత్‌లో ఆ వర్గాలకు మోడీ దొరికాడు. కనుకే అవి బీజేపీకి వంతపాడుతున్నాయి. బీజేపీ ఎన్నికల ప్రకటనల బడ్జెట్టే రూ.15 వేల కోట్లు! ప్రజలిప్పుడు మూడో ఫ్రంట్ వైపే మొగుతున్నారు.
ప్రాంతీయ పార్టీలదే హవా
ఇప్పటిదాకా జరిగిన పోలింగ్‌లో ప్రజలు ప్రత్యావ్నూయు విధానాలకే ఓటేశారన్నది సుస్పష్టం. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలే నిర్ణాయూక శక్తులు. బీహార్‌లోనూ ప్రాంతీయ పార్టీలదే హవా. అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికత ఆధారంగానే ప్రజలు ఆలోచిస్తున్నారు. దాంతో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంత బలహీనపడుతుందో అంతే స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలోపేతమవుతున్నాయి.
మూడో ఫ్రంట్‌కే అవకాశాలు
దేశంలో మూడో ఫ్రంట్‌కే అవకాశాలున్నాయి. కొత్త మిత్రులు అనేకమంది వచ్చే అవకాశముంది. పలు ప్రాంతీయ పార్టీలు ఈసారి వురింత పుంజుకుంటాయి. గతంలో ప్రతి పదేళ్లకోసారి మాడో ప్రత్యామ్నాయం వచ్చింది. ఇప్పుడూ అదే జరగనుంది.
ఆ పార్టీలది పాకులాటే
తెలంగాణ తెచ్చిన ఘనత కోసం టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పాకులాడటం వృథా. ఇప్పుడు ప్రజలు ఓటేయబోయేది ఎవరు తెచ్చారన్న దాన్ని బట్టి కాదు. వెనుకబాటును తొలగించేందుకు ఎవరు ఏం చేస్తారన్న దానిబట్టి మాత్రమే. తెలంగాణ ఉద్యమానికి మేం మద్దతివ్వనందుకు మాకు బాధ లేదు. పైగా ఉద్యమం వల్ల మేం నష్టపోయిందీ లేదు.
సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ హవా
ప్రస్తుత పరిస్థితి ప్రకారం సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది. వైఎస్సార్‌సీపీ చేస్తున్న వాగ్దానాలకు, జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటూ కొందరు చేస్తున్న విమర్శలకు అర్థంలేదు. జనానికి ఆర్థిక విషయాలు పట్టవు. ఎలా చేస్తారన్నది వాళ్లకు అనవసరం. ఎలా చేయాలన్నది పార్టీలు చూసుకోవాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి అనేక పథకాలు అమలు చేశారు. ప్రజలు ఆయన్ను ఆదరించారు.
బెంగాల్‌లో మమతపై వ్యతిరేకత...
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఎంతగా భయోత్పాతం సృష్టిస్తోందో బయటి ప్రపంచానికి తెలియదు. సీపీఎంలో పని చేసే వాళ్ల ఇళ్లకు తృణమూల్ నాయకులు వెళ్లి ముత్తైదువులకు తెల్లచీర ఇస్తారు. ‘నీ భర్త సీపీఎంలో పని చేస్తే ఇదే నీ భవిష్యత్తు’ అంటూ బెదిరిస్తారు. మరికొందరి ఇళ్లకు వెళ్లి ‘నీకు కూతురు ఉంది కదా!’ అంటూ బెదిరిస్తున్నారు. అక్కడ అక్కడ మాకు చాలా సానుకూలంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ ప్రభుత్వం భారీగా రిగ్గింగ్ చేసినా వామపక్షాలకు 39 శాతం ఓట్లొచ్చాయి. వామపక్షాలకు ఈసారి దేశవ్యాప్తంగా గణనీయంగా సీట్లొస్తాయి. పోలింగ్ పూర్తయిన కేరళలో సీపీఎం ప్రస్తుతమున్న 4 ఎంపీ సీట్లను కనీసం రెండింతలు చేసుకుంటుంది.
దోచిపెట్టడమే మోడీ మోడల్
అభివృద్ధి నినాదంతో ముందుకొస్తున్న నరేంద్ర మోడీ నిజానికి ఏ విధమైన అభివృద్ధిని తీసుకొస్తారు? ఆయన చెబుతున్న గుజరాత్ మోడల్‌లోని వాస్తవమేమిటో అందరికీ తెలుసు. అక్కడ సామాన్యుల పరిస్థితి మరింత దిగజారింది. టాటా నానో కారు ధర రూ.లక్ష అయితే అందులో ఏకంగా రూ.60 వేల మేరకు రకరకాల సబ్సిడీల రూపంలో టాటాలకు గుజరాత్ ప్రభుత్వం అప్పగింత పెట్టింది. అంటే సంపదనంతా మోడీ ఎవరికి దోచిపెడుతున్నట్టు? ఇది ఏ మోడల్ అభివృద్ధో ఆయనే చెప్పాలి. బడా పారిశ్రామికవేత్తలంతా మోడీని వెనకేసుకు వస్తున్నారంటే ఇదే కారణం. దేశ విదేశీ పారిశ్రామిక శక్తులు మోడీని కోరుకుంటున్నాయి.
చంద్రబాబుకు అధికారం కలే..
Published Mon, Apr 28 2014 2:01 AM | Last Updated on Tue, Aug 14 2018 5:51 PM
Advertisement
Advertisement