తిప్పల కుప్పం | so many problems are there in kuppam | Sakshi
Sakshi News home page

తిప్పల కుప్పం

Published Tue, May 6 2014 1:21 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

తిప్పల కుప్పం - Sakshi

తిప్పల కుప్పం

నిత్యం ఏడు వేల వుంది  నిరుద్యోగుల వలస
మంచినీటి కోసం వ్యవసాయు బోర్లపై ఆధారం
గొంతెండుతున్నా పటి ్టంచుకోని చంద్రబాబు

 
 టీడీపీని గెలిపిస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తావుంటున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాటల్లో డొల్లతనం.. కుప్పం నియోజకవర్గాన్ని చూస్తే తెలుస్తుంది. ఆయన పాతికేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో చేసింది తక్కువ. చెప్పుకునేది ఎక్కువ. వుూడు దశాబ్దాలుగా ఇక్కడి ఓటర్లు టీడీపీకి పట్టం కడుతున్నా జనం కష్టాలు కడతేరడం లేదు. ఇప్పటికీ 200లకు పైగా గ్రామాలు బిందెడు నీటి కోసం అవస్థలు పడుతున్నారుు. సాగునీరు లేక రైతులు కూలీలుగా మారారు. జనం వలసబాట పట్టారు. మాటలతో కోటలు కడుతున్న చంద్రబాబు తీరును ఆయన నియోజకవర్గం ప్రజలు ఎండగడుతున్నారు.
 
 కన్నీటి కష్టాలు

 
 నియోజకవర్గంలో 200 పైగా గ్రామాల్లో మంచినీటి సమస్య జఠిలంగా ఉంది. 510 స్కీమ్ బోర్లకు గాను 310 ఎండిపోయాయి. దాంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. శాంతిపురం, కుప్పం తదితర మండలాల్లో నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ట్యాంకర్ రూ.400 చొప్పున ప్రజలు రోజుకు రూ.లక్ష నీటి కోసం వెచ్చిస్తున్నారు. క్యాన్లు, ప్యాకెట్ల వ్యాపారం మరో రూ. 30 వేల దాకా ఉంది. కుప్పానికి 8 కి.మీ. దూరంలోని వేపనపల్లె వద్ద బుడ్డిగాని చెరువు ఎప్పుడూ నిండుగా ఉంటుంది. రూ. 40 లక్షలు వెచ్చించి ఎత్తిపోతల పథకం ద్వారా దాహార్తిని తీర్చేందుకు పదేళ్ల క్రితం చంద్రబాబు సీఎంగా ఉండగానే అంచనాలు రూపొందించినా నిర్మాణం చేయులేకపోయూరు. కుప్పానికి 12 కి.మీ. దూరంలోని ఓఎన్ కొత్తూరు వద్ద అటవీ ప్రాంత చెరువుల్లోనూ నీరు పుష్కలంగా ఉన్నా వాడుకలోకి తేలేకపోయూరు. శాంతిపురం మండలంలో పాలారు నదిపై ప్రాజెక్టును నిర్మించి ఉంటే ఐదేళ్లకు సరిపడే  స్థారుులో నీటి నిల్వకు వీలుండేది. తమిళనాడు అభ్యంతరంతో పనులు ఆగినా బాబు పట్టించుకోలేదు.  
 
 రహదారులు అధ్వానం

 
1.   అడుక్కో అతుకు.. గజానికో గతుకు.. అన్నట్టుగా రోడ్లున్నారుు.
2.   ఆర్టీసీ డిపో నష్టాల్లో కూరుకుపోరుు చాలా బస్సు సర్వీసులను ఇతర డిపోలకు తరలించారు.
3.    డిపోను సబ్-డిపోగా కుదించే కసరత్తు పూర్తి చేశారు.
 
 సీఎంగా ఉన్నపుడూ.. చేసింది శూన్యమే
 
 పదెకరాల ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు 2001లో వేసిన  శిలాఫలకం వెక్కిరిస్తూనే ఉంది. ఒక్క పరిశ్రవు కూడా ఏర్పాటు కాలేదు. ఆ తర్వాత వుూడేళ్లు సీఎంగా ఉన్నా.. సెరి పార్కు, మార్కెట్ యార్డు నిర్మాణానికి నోచుకోలేదు. పట్టు రైతుల కోసం రూ.2 కోట్ల తో జపాన్ సహకారంతో చేపట్టిన సెరిపార్కు ప్రాజె క్టు వుధ్యలోనే ఆగిపోయింది. బాబు సీఎంగా ఉండగా ఇజ్రాయిల్ టెక్నాలజీ డెమో ప్రాజెక్టు ప్రారంభించారు. తక్కువ నీటితో పంటలు పండించే ఈ ప్రాజెక్టుకు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. రైతులకు అందజేసిన నాణ్యత లేని డ్రిప్ పరికరాలు, సాంకేతిక లోపాల వల్ల కోట్ల రూపాయుల ప్రజాధనం వృథా అయ్యింది. రాజపేటలోని కార్యాలయం దగ్గర రూ. లక్షల విలువైన యంత్రాలు ఇప్పటికీ నిరుపయోగంగా పడి ఉండటమే ఇందుకు సాక్ష్యం.
 
 ‘కడా’ కడే..
 
 కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)ని ఏర్పాటు చేసిన చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆఫీసు దాదాపు మూతపడింది. చంద్రబాబు కుప్పం కార్యదర్శి మనోహర్ జేబులు నింపేందుకే ‘కడా’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న కడా భవనాల్లో వైఎస్ సీఎం అయ్యాక ఐటీఐ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపయోగపడేలా చేశారు.
 
 టీడీపీ ‘బోగస్’ బాగోతం

 
 కుప్పంలో టీడీపీ భారీగా బోగస్ ఓట్లను చేర్పించి ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ వారు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లోని బంధువుల  పేరిట ఇక్కడ  ఓట్లు నమోదు చేయి స్తున్నారు. ఇలా 10-20 వేల ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడులోని అరసనాపురం పంచాయుతీ గొల్లపల్లె గ్రామస్తులు వెయ్యి వుందికి పైగా కుప్పం మండలం కంగుందిలో ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తమిళనాడు సరిహద్దులోని పెద్దవంకలో అధిక బోగస్ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది.
 
 తేడా గమనిస్తున్న ఓటర్లు
 
 బోగస్ ఓట్లతో ప్రతిసారీ గెలుస్తున్న టీడీపీకి ఈసారి కుప్పం ఓటర్లు వుుచ్చెవుటలు పట్టించబోతున్నారు. చంద్రబాబు-వైఎస్ ప్రభుత్వాల్లో తేడాలను గుర్తించిన ఫలితంగా టీడీపీ ఎదురీదుతోంది. ప్రధానంగా రైతులు, మహిళలు, యుువత వైస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాల లబ్ధిదారులు కూడా ఇప్పుడు రుణం తీర్చుకోనున్నారని పలువురు చెబుతున్నారు.
 
 సీఎంగా ఉన్నా డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు

 
 2002లో బాబు ప్రారంభించిన వంద పడకల ఆస్పత్రిలో రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. కాన్పుల యూనిట్‌లో సదుపాయూలు లేక వృథాగా మారింది. ఆస్పత్రి కమిటీ చైర్మన్ హోదాలో చంద్రబాబు ఆ కమిటీ సవూవేశాన్నే నిర్వహించలేదు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి అభివృద్ధికి వూత్రం ఆయన తోడ్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని 2002లో విద్యార్థులందరూ కలిసి చంద్రబాబును కోరినపుడు.. ‘కుప్పంకు ఏమి చేయూలో నాకు తెలుసు..’ అని నోళ్లు మూయించారు.    
 
 నీళ్ల కోసం కష్టాలు


 గ్రామంలో తాగునీరు లేక నాలుగు నెలలుగా అవస్థ పడుతున్నాం. స్థానిక సర్పంచ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ధర్నా చేసినా పట్టించుకోలేదు.
 - జయమ్మ, ఎం.శాంతంపల్లె, శాంతిపురం మండలం
 
 వ్యవసాయ బోర్లే దిక్కు

ఊళ్లోని మంచినీటి బోరు ఎండిపోయింది. కిలోమీటరు దూరంలోని వ్యవసాయ బోర్లే ఆధారం. కరెంటు కోతల కారణంగా రైతులు బోర్ల వద్దకు రానివ్వడం లేదు.
 - మునెమ్మ, బ్రాహ్మణ కొత్తూరు, శాంతిపురం మండలం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement