నిషేధ పర్వంలో విషం | Prohibition dialogue poisoning | Sakshi
Sakshi News home page

నిషేధ పర్వంలో విషం

Published Tue, May 6 2014 1:18 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

నిషేధ పర్వంలో విషం - Sakshi

నిషేధ పర్వంలో విషం

1986 ప్రాంతాల్లో ‘న్యూఢిల్లీ టైమ్స్’ అనే హిందీ సినిమా మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించింది. తనకు తెలియకుండానే ఒక ప్రముఖ దినపత్రిక సంపాదకుడు ఎలా తన పత్రిక యాజమాన్యమూ, రాజకీయ వర్గాలూ ఆడిన నాటకంలో పావుగా మారాడో అర్థం చేసుకుని సినిమా చివరి సీన్‌లో చెప్పే డైలాగ్ ‘ఐ హావ్ బీన్ యూజ్‌డ్’ (నన్ను వాడుకున్నారు.)

 పత్రిక యాజమాన్యం, కొన్ని రాజకీయ వర్గాలూ అతనికి ఉద్దేశపూర్వకంగా అందించిన తప్పుడు సమాచారం ఆధారంగా ఆయన రాసే రాతలు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలకు కారణమై చివరకు మారణకాండకు దారితీసి అది యాజమాన్యానికి, ఆ రాజకీయ వర్గానికి లాభం చేకూరుతుంది. అది తెలుసుకున్న సంపాదకుడు తన పదవికి రాజీనామా చేస్తాడు. మీడియా యాజమాన్యా లు కొన్ని సందర్భాల్లో రాజకీయాలను ఎట్లా శాసిస్తాయో, రాజకీయ శక్తులు మీడియాను తమ ప్రయోజనాల కోసం ఎలా దుర్వినియోగ పరుస్తాయో చెప్పడానికి ‘న్యూఢిల్లీ టైమ్స్’ సినిమా మంచి ఉదాహరణ.

 ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి సంఘటనలు మనకు అనేకం కనిపిస్తాయి. సామాన్య పాఠకులకు, మీడియా వెలుపల ఉన్న వారికి కొన్ని సందర్భాల్లో ఇవి అర్థంకావు, మరికొన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఎటువంటి రాతలు రాస్తున్నారో.1992 అక్టోబర్‌లో కోట్ల విజయభాస్కరరెడ్డి రాష్ట్రానికి ఆ టర్మ్‌లో కాంగ్రెస్ సీఎంగా నియమితుడయ్యాక సరిగ్గా ఒక సంవత్సరానికి మద్య నిషేధాన్ని కోరుతూ ప్రారంభమైన ఉద్యమం, ఆ ఉద్యమం సాగిన తీరు దానిని పత్రికా యాజమాన్యాల మధ్య ఆర్థిక పోరాటంగా మలచి చివరికి అత్యంత పాఠకాదరణ పొందిన ఒక ప్రముఖ దినపత్రిక పూర్తిగా చతికిలబడిపోయిన వైనం నేను జర్నలిస్ట్‌గా ఉండి స్వయం గా చూశాను. తన అవసరాల కోసం మీడియా ఎలాగైనా వ్యవహరించగలదనడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఆంధ్రప్రభ దినపత్రికలో బ్యూరోచీఫ్‌గా ఉన్న నాకు ఒకరోజు పొద్దున్నే ఇంకా దినపత్రికలు తెరిచి చూడకముందే (అప్పట్లో టీవీ న్యూస్ చానళ్లు లేవు. ఉదయం దినపత్రికలు చదవితేనే వార్తలు తెలిసేది) మా ఎడిటర్ నుంచి ఫోన్. ఈనాడు చూడండి బ్రదర్, కవరేజీలో మనం ఫెయిల్ అయ్యాం అని. ఏమిటా అని చూస్తే ఆ రోజు ఈనాడు పతాక శీర్షికన ప్రచురించిన వార్త నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ అనే మహిళ నాయకత్వంలో మద్యం మీద మహిళలు ప్రారంభించిన యుద్ధానికి సంబంధించినది.

 నేను వెంటనే నెల్లూరు జిల్లాలో మా విలేకరులతో మాట్లాడాను. ఆందోళన జరిగిన మాట వాస్తవమే, మద్యం దుకాణాల మీద దాడికి ప్రయత్నం జరిగిన మాటా వాస్తవమే కానీ పతాక శీర్షికన ప్రచురించేంత తీవ్రత లేదన్నారు మా విలేకరులు. వార్త ‘మిస్’ అయ్యాం కాబట్టి అట్లా చెబుతున్నారేమోనని ఆ జిల్లాలో తెలిసిన వారు కొందరికి ఫోన్లు చేసి తెలుసుకున్నా. వాళ్లూ అదేమాట చెప్పారు. ఈనాడు అక్కడితో ఆగితే బాగుండేది. కానీ దాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. తన విలేకరులను పురమాయించి మద్య నిషేధ ఉద్యమం లేని చోట కూడా నలుగురిని ప్రేరేపించి పత్రికల్లో వార్తలు వస్తాయని రెచ్చగొట్టి కొన్ని సంఘటనలు జరిగేట్టుగా జాగ్రత్త పడుతూ వచ్చింది. చివరకు ఈనాడు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రభావంతోనే ప్రతిపక్ష నాయకుడు ఎన్టీ రామారావు మద్యనిషేధం తన ప్రధాన ప్రచారాస్త్రంగా స్వీకరించి 1994 ఎన్నికలకు ప్రచారం కోసం బయల్దేరారు. ఆయన వాహనం మీద తెల్లజెండా అందులో మహాత్మాగాంధీ చిత్రం మద్యనిషేధ ప్రచారానికి ప్రతీకగా నిలిచింది.

 ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రభ సహా ఇతర పత్రికలన్నీ అర్థం చేసుకున్నాయి. ఈనాడు ప్రచారం చేస్తున్న స్థారుులో ఆ ఉద్యవుం లేదని, అందుకే ఆ తరువాత మిగిలిన పత్రికలేవీ దాన్ని అంతగా భుజాన వేసుకోలేదు. సంపాదకులకు త్వరలోనే పరిస్థితి అర్థం అరుు్యంది. అది ఈనాడు ఎజెండా, ఈనాడు ద్వారా తెలుగుదేశం ఎజెండా కాబట్టి వునం అంతగా బట్టలు చించుకోనక్కర్లేదని ఎడిటర్లే స్వయుంగా చెప్పారు. అయినా ఈనాడు రాస్తున్న స్థారుులో ఉద్యవుం ఉందేమో అనిపించి ఎడిటర్ అనువుతితో ఒక వారం రోజులు రాష్ట్రంలోని వుూడు ప్రాంతాలు స్వయుంగా తిరిగాను. అప్పుడు అర్థం అరుు్యంది. ఇదంతా ఈనాడు యూజవూన్యం ఒక లక్ష్యంతో చేస్తున్న పని అని. చివరకు ఈనాడు ప్రచార ఉధృతికి కాంగ్రెస్ సర్కార్ కూడా తలొగ్గి తొలి చర్యగా రాష్ట్రంలో సారారుుని నిషేధించింది. అరుునా ఈనాడు, టీడీపీ ప్రచారం ఆగలేదు. ఎన్నికల దాకా కొనసాగించింది. 1994 ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. ఎన్.టి.రావూరావు సీఎంగా చేసిన మొదటి నిర్ణయుం రాష్ట్రంలో సంపూర్ణ వుద్యపాన నిషేధం. 1995 జనవరి 16 నుంచి రాష్ట్రంలో వుద్య నిషేధం అవులులోకి వచ్చింది.
 ఇప్పుడిక ఈనాడు యాజమాన్యం రహస్య ఎజెండా గురించి మాట్లాడుకోవాలి.

1984 డిసెంబర్‌లో ఉదయం దినపత్రిక ప్రారంభం కావడం కావడమే ఈనాడు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తెలుగు దినపత్రికారంగంలోనే ఆ నాటికి ఏజెంట్‌లు డిపాజిట్లు ముందే చెల్లించి లక్ష కాపీల సర్కులేషన్‌తో ప్రారంభమైన పత్రిక ఇంకోటి లేదు. దాసరి నారాయణరావు యాజమాన్యంలో ప్రారంభమైన ఆ దిన పత్రిక ప్రారంభం నుంచే ఈనాడు యాజమాన్యానికి పోటీగా నిలిచి గంగవైలెత్తించింది. దాంతో ఈనాడు యాజమాన్యం.. వార్తలతో పోటీ పడే బదులు ఉదయం ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ఆలోచనలో పడింది. దాసరి నారాయణరావు యాజమాన్యంలోనే కొనసాగితే ఈనాడు కోరిక నెరవేరేదే. కానీ ఆయన ఉదయం నడపలేకపోయారు. యాజమాన్యం మారి కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు మాగుంట సుబ్బరామిరెడ్డి చేతికి వచ్చింది. సుబ్బరామిరెడ్డి మద్యం వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఉదయం నిర్వహణకు ఆర్థిక ఇబ్బంది ఏమీ లేదు. ఈనాడుకు పోటీగా నిలిచిన ఉదయం మూతపడాలంటే సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలి. అది జరగాలంటే మద్యనిషేధం రావాలి.


 భావోద్వేగాల నడుమ ఎన్టీఆర్ ఈనాడు యాజమాన్యం అసలు పథకం గురించి ఆలోచించలేకపోయారు. రహస్య ఎజెండా అమలు అయింది. మద్య నిషేధం కారణంగా సుబ్బరామిరెడ్డి ఆర్థిక మూలాలమీద తగినంత దెబ్బ పడింది. ఈలోగా నక్సలైట్లు అకారణంగా ఆయనను హతమార్చారు. ఉదయం దిక్కులేనిదయింది. పైగా సీఎంగా ఉన్న చంద్రబాబుపై నిషేధం ఎత్తివేతకు అన్ని వైపుల నుంచీ ఒత్తిడి పెరిగింది. మద్యం వ్యాపారుల ఒత్తిడి అన్నిటికంటే ఎక్కువగా బాబు మద్యనిషేధాన్ని ఎత్తివేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని చెబుతారు. ఆధారాలు లేక వార్తలు రాయలేకపోయాం. ఈనాడు ఎజెండా కూడా అమలు అయింది. కాబట్టి మద్యనిషేధం ఎత్తివేసిన తరువాత ఆ పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకొచ్చిందో ఒక సంపాదకీయం రాసి ఈనాడు మద్యనిషేధ ఉద్యమాన్ని వొదిలించుకుంది. చేతులు దులుపుకుంది. తాను అంత పవిత్రయుద్ధంగా భావించి అమలు చేయించిన మద్యనిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయకత్వంలోని  టీడీపీ ప్రభుత్వంపై ఈనాడు ‘పెన్నెత్తి’ ఒక్కమాట కూడా రాయలేదు.
 
(38 సంవత్సరాల జర్నలిజం వృత్తి అనుభవాల కూర్పుగా త్వరలో రానున్న ‘నేను ఎవరు’
 పుస్తకంలోని ఒక భాగం ఇది)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement