సమైక్యం కోసం విజయమ్మ పోరు
ఏకపక్షంగా జరుగుతున్న రాష్ర్ట విభజనను అడ్డుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఓవైపు జనంలో ఉండి పోరాడుతూనే, వురోవైపు పార్టీ తరఫున ప్రధాని వున్మోహన్‌సింగ్‌కు, హోంవుంత్రి సుశీల్ కువూర్ షిండేకు పలు లేఖలు రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డివూండ్ చేస్తూ కిందటేడాది ఆగస్టు 19న గుంటూరు వేదికగా ఆవురణదీక్షకు దిగారు. సెప్టెంబర్ 6, 11న షిండేకు లేఖలు రాశారు. విభజనను రాష్ర్టంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రాన్ని యుథాతథంగా ఉంచాలని అందులో కోరారు. అంతకుముందు ఆగస్టు 14న ప్రధానికి లేఖ రాశారు. విభజనను మీరైనా ఆపాలంటూ ఆగస్టు 27న రాష్ట్రపతి ప్రణబ్ వుుఖర్జీని స్వయుంగా కలిసి విన్నవించారు.