బాబు హామీల బండారం | Chandrababu Naidu makes fake assures in elections canvassing | Sakshi
Sakshi News home page

బాబు హామీల బండారం

Published Sun, May 4 2014 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

బాబు హామీల బండారం - Sakshi

బాబు హామీల బండారం

' 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? బాబు ఏం చేశాడు?
' 1. కిలో బియ్యం రెండు రూపాయలకే అందించటం
' 2. సంపూర్ణ మద్యపాన నిషేధం
' 3. ఒక్కో హార్స్ పవర్‌కు రూ.50 చొప్పున వ్యవసాయ విద్యుత్తు సరఫరా

 
 మోడీని నరహంతకుడన్న మాటను మరచాడా బాబు?
 గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటామని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు హైదరాబాద్ వస్తే స్వాగతించారు. బీజేపీని అంటరాని పార్టీగా తేల్చి, మోడి నరహంతకుడు అని, ఆయనకు ఎలాంటి అర్హత లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే మోడీతో స్నేహానికి, బీజేపీతో పొత్తుకు ిసిద్ధమయ్యారు.
 
' ఈ వాగ్దానాల్నీ చంద్రబాబు అధికారంలోకి రాగానే తప్పాడు. మూడు వాగ్దానాలు కూడా అమలు చేయలేని ఈ అసత్య హరిశ్చంద్రుడు ఇప్పుడు గత నాలుగేళ్ళుగా కనీసం మూడు వందల వాగ్దానాలు చేశాడు.
' చంద్రబాబు బియ్యం, విద్యుత్తు, మద్యనిషేధం వల్ల రూ.4000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి లోటు ఏర్పడిందంటూ ఆ మేరకు సబ్సిడీ బియ్యం ధర పెంచారు. అంతే కాకుండా నీటి తీరువా, వ్యవసాయ కరెంటు చార్జీలు, టర్నోవర్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, వృత్తి పన్ను, ఆర్టీసీ చార్జీలు... ఇలా అన్నీ ఒక్కసారిగా పెంచేశారు.
 
' చంద్రబాబు ఎంతటి ఘనుడంటే, మద్య నిషేధం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని ముందుగా దాదాపు 2000కోట్ల రూపాయలు పన్నులు విధించి, ఆ తరువాత మద్య నిషేధాన్ని ఎత్తివేశాడు. ఆ పన్నుల్ని మాత్రం అలాగే కొనసాగించాడు.
 
 1999లో వాగ్దానాలు - బాబు ఏం చేశాడు?
' మహిళలకు - మహిళలకు మాంగల్యాలు, మహిళా బ్యాంకులు, 10వ తరగతి వరకు బాలికలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, బాలికలకు సైకిళ్ళు... బాలికా సంరక్షణ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.5వేలు నగదు....
 
'  పేదలకు పక్కా ఇళ్లు, భూమి లేని వారికి పట్టాలు...
'  200పైగా జనాభా ఉన్న ప్రతి ఆవాసానికీ రక్షిత తాగునీరు
'  మూడేళ్లలో నిరుపేదల్లో అర్హులందరికీ ఇళ్ళ స్థలాలు
'  బలహీన వర్గాలకు అయిదేళ్ళలో 35లక్షల ఇళ్లు. బలహీన వర్గాలకు ఏటా 7లక్షల పక్కా గృహాలు- 5ఏళ్ళలో 35లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. 2002 నాటికే పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు.
' ఇవేవీ జరగలేదు.
'  కోటి మందికి ఉద్యోగాలు అని చెప్పి 2001 నాటికి 21,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.
'  25లక్షల ఎకరాలకు సాగునీరు అని చెప్పి ఒక్కటంటే ఒక్క పెద్ద ప్రాజెక్టు చేపట్టిన పాపాన పోలేదు.
'  బలహీన వర్గాలకు ఏటా 7లక్షల పక్కా గృహాలు- 5 ఏళ్ళలో 35 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. కానీ కట్టినది ఎంతంటే... 13 లక్షల, 23 వేలు. అంటే దాదాపు మూడో వంతు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో చంద్రబాబు కట్టింది 27.5 లక్షలు.
 
'  బీసీల గురించి మాట్లాడే చంద్రబాబు బీసీ కార్పోరేషన్లను నిర్వీర్యం చేశారు. ఆప్కోను నిర్వీర్యం చేశారు... ఆప్టెక్స్‌లను రద్దు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జనతా వస్త్రాలను ప్రవేశపెడితే- ఆ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు.
'  2009 ఎన్నికల్లోనూ బీసీలకు 100 సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు- తీరా ఎన్నికలు వచ్చాక మాట తప్పి 50 సీట్లే ఇచ్చారు. ఈసారి పరిస్థితి మరీ దారుణం. 100 ఇస్తామని చెప్పి 38 ఇచ్చారు.
'  మైనార్టీలకు- దుకాన్ అవుర్ మకాన్... పథకం పేరుతో 5వేల మందికి ప్రయోజనం చేకూరుస్తామన్నారు. అదీ గోవిందా.
'  వ్యవసాయ రంగానికి 12గంటల పాటు- అదీ కూడా పట్టపగలు ఉచిత కరెంటు ఇస్తానని 2009 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చంద్రబాబు పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకునే దండేల్లా మారతాయన్నాడు.
 
 మంచినీళ్లడిగితే గుంతలు తవ్వుకోమన్నారు...
' 200 ఇళ్ళకు పైగా ఉన్న ప్రతి గ్రామానికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తానని ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బాబు అన్నారు. చివరికి ‘ఇంటింటికీ ఇంకుడుగుంత మీరే తవ్వుకోండి. మీ ఊళ్ళో చెరువుల్లో పూడిక మీరే తీసుకోండి. మీ ఊళ్ళో కాల్వల్ని మీరే బాగుచేసుకోండి’ అని కరువు కాటకాల తన పాలనలో కనీసం బోర్లు, బావులు కూడా తవ్వించకుండా ప్రజల గొంతు ఎండగట్టిన పాలన చంద్రబాబుది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement