సమైక్య ఉద్యమ ఏకైక సారథి జగనే..
సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో అనేక మంది నాయుకులు సీమాంధ్ర జనజీవనంతో ఆటలాడుకున్నారు.. ప్రచారం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేశారు. రాష్ట్రం ముక్కలవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏమవుతుంది.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదముంది. ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. అని ఆందోళన చెంది రాష్ట్ర పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేసింది.. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పి.తిమ్మారెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమంలో నేతల పాత్రలపై ఆయన అభిప్రాయాలు ఇవీ...
విభజన అంశం ఎన్నో ఏళ్లుగా నానుతున్నా... రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎగసిపడింది. ఇదే అసలైన సమైక్య ఉద్యమవుని చెప్పవచ్చు. అరుుతే జనానికి బాసటగా నిలవాల్సిన పార్టీలు, నేతలు ఉద్యవూన్ని సొవుు్మ చేసుకునేందుకు వుహానాటకాలాడారుు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల్లోనూ తన పార్టీ ఉనికి కోసం రెండు కళ్ల సిద్ధాంతం పేరిట డ్రామాలాడారు. రెండు ప్రాంతాల్లో తవుు్మళ్లతో వీధి పోరాటాలు చేయించారు. అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సమైక్యసింహవునే స్థారుులో.. క్రికెట్‌లో చివరి బంతి ఉందంటూ చేసిన హడావుడి అంతాఇంతాకాదు. చివరిరోజు వరకు సీఎం పదవిని అనుభవించి ఆ తర్వాత బయటికొచ్చి ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ అని తిరుగుతున్నారు. కానీ ప్రజలకు ఎవరేమిటో బాగా తెలుసు. అందుకే ఆయన మీటింగ్‌లకు ఎవరైనా వెళ్తున్నారా.. మూడేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని సరిగ్గా నెలరోజులు తిరక్కముందే జనం మరిచిపోయారంటే కిరణ్‌కు జనంలో ఉన్న విలువ ఏపాటిదో స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. జనమే వాళ్ల గురించి ఆలోచించడం లేదు. మరి సమైక్య రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిందెవరనే ప్రశ్న వస్తే.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని అంతా చెబుతున్నారు.
రాష్ట్రా న్ని విడగొట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ జైలులో ఉండి అక్కడే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని మరీ సమైక్యం కోసం పోరాటం చేశారు. జైలు నుంచి విడుదలయ్యూక ఆమరణదీక్ష చేపట్టారు. ఇక విజయమ్మ కూడా గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారంటే సమైక్యం పట్ల వారికున్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబులా జగన్ రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. ఎక్కడైనా సమైక్యమే నినాదమన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధే తన ప్రాణమన్నారు. అందుకే జనవుంతా ఆయన్ను సొంతమనిషిగా భావిస్తున్నారు. ఆయున వస్తే నీరాజనాలు పలుకుతున్నారు.
పి. తిమ్మారెడ్డి