saimakyandra
-
కాంట్రాక్ట్ ఉద్యోగులపై నెలాఖరులోగా నిర్ణయం
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు హైదరాబాద్: సమైక్యాంధ్ర పాలనలో విచ్చలవిడిగా చేపట్టిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఈ నెలాఖరులోగా పరిష్కారమవుతుందని, ఈ విషయంలో ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రిమండలి త్వరలో సబ్ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదివారం ఇక్కడి టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దేవీప్రసాద్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ మాట
‘ఆంధ్రప్రదేశ్ విభజన కోసం జరిగే ఏ ప్రయుత్నాన్నయినా వ్యతిరేకించాలనేది వూ పార్టీ విధానవుని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర విభజన కోసం చేపట్టే ఏ చర్యనైనా మేం వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర వుంత్రివర్గం 2013 అక్టోబర్ 3న తీసుకున్న నిర్ణయుం వూకు ఏ వూత్రమూ సవ్ముతం కాదు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్నారు.’ - కేంద్ర హోంశాఖకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో.. ‘ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనపై యూవద్దేశవుూ ఆలోచించాలి. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశే కాదు.. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు కర్ణాటకను, తమిళనాడును కూడా విభజించే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన చేయుడం న్యాయువూ? విభజన విషయుంలో టీడీపీ-కాంగ్రెస్ కువ్ముక్కు అందరికీ తెలుసు. చరిత్రహీనుడు కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా బాబు సమైక్య ఉద్యవుంలో కలసి రావాలి.’ - సమైక్య రాష్ట్రం కోసం ఆవురణ నిరాహార దీక్ష సందర్భంలో.. ‘నేను కేంద్రప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మొదట 2014 ఎన్నికలు పూర్తి చేయుండి. నేను, నా పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటాం. ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపడతాం. 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. 2014 ఎన్నికలనే రెఫరండంగా తీసుకునే దవుు్మ మీకుందా?’ - జాతీయు స్థారుు నేతలను కలుస్తున్న సందర్భంగా చెన్నైలో.. ‘ఓట్ల కోసం, సీట్ల కోసం ఆడే ఈ రాజకీయు క్రీడ వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే.. దిగువన ఏర్పడే రాష్ట్రం వునిషి చేసిన ఎడారి అవుతుంది. తవు నిర్ణయూల వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా అధికార కాంగ్రెస్ పెద్దలు నియుంతృత్వ పోకడ లతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. నా రాజీనావూతో, వూ పార్టీ వారు చట్టసభలకు చేసిన రాజీనావూలతో ఈ నిరంకుశ నిర్ణయుంలో ఏమైనా వూర్పు వస్తుందేమోనన్న ఆశతో రాజీనావూ చేస్తున్నాం.’ - ఎంపీ పదవికి రాజీనావూ చేసిన సందర్భంలో.. ‘రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల వుుందు తరాలకు శతాబ్దాల తరబడి తీవ్ర హాని కలుగుతుంది. కేంద్ర నిర్ణయుం ప్రజలకు బ్రిటీష్ వారి 1905 నాటి బెంగాల్ విభజనను గుర్తుకు తెస్తోంది. నాడు కర్జన్ అనుసరించిన ‘విభజించి.. పాలించు’ అనే కుటిల నీతినే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది.’ - కేంద్ర వుంత్రుల బృందానికి పంపిన లేఖలో.. ‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయుంపై జరుగుతున్న ఈ పోరాటానికి జాతీయు పార్టీలన్నీ వుద్దతివ్వాల్సిన అవసరముంది. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సవుస్య వూత్రమే కాదు. కాంగ్రెస్ తలబిరుసుతనాన్ని, నిరంకుశ వైఖరిని, ద్వంద్వ విధానాన్ని, ఆధిపత్యవాదాన్ని తెలుగు ప్రజలు నేడు సవాలు చేస్తున్నారు. ప్రజాస్వావ్యుంలోనూ, ప్రజాభీష్టంలోనూ విశ్వాసవుున్న ప్రతీ పార్టీ ఈ విభజనను ప్రతిఘటించాల్సి ఉంది.’ - సమైక్య పోరుకు వుద్దతు కోరుతూ వావుపక్షాలకు లేఖ.. ‘రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరాటం చేద్దాం. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి వుధ్య పోరా టం. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీ స్థానాలు గెలుచుకుని ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. 30 ఏళ్ల క్రితం ఈ దేశ పౌరసత్వం తీసుకున్న సోనియూకే ఈ దేశంపై ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసున్న తెలుగు ప్రజలను విడదీస్తే వునకెంత బాధగా ఉంటుంది.’ - హైదరాబాద్‌లో జరిపిన సమైక్య శంఖారావం సభలో.. -
సమైక్య ఉద్యమ ఏకైక సారథి జగనే..
సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో అనేక మంది నాయుకులు సీమాంధ్ర జనజీవనంతో ఆటలాడుకున్నారు.. ప్రచారం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేశారు. రాష్ట్రం ముక్కలవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏమవుతుంది.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదముంది. ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. అని ఆందోళన చెంది రాష్ట్ర పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేసింది.. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పి.తిమ్మారెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమంలో నేతల పాత్రలపై ఆయన అభిప్రాయాలు ఇవీ... విభజన అంశం ఎన్నో ఏళ్లుగా నానుతున్నా... రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎగసిపడింది. ఇదే అసలైన సమైక్య ఉద్యమవుని చెప్పవచ్చు. అరుుతే జనానికి బాసటగా నిలవాల్సిన పార్టీలు, నేతలు ఉద్యవూన్ని సొవుు్మ చేసుకునేందుకు వుహానాటకాలాడారుు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల్లోనూ తన పార్టీ ఉనికి కోసం రెండు కళ్ల సిద్ధాంతం పేరిట డ్రామాలాడారు. రెండు ప్రాంతాల్లో తవుు్మళ్లతో వీధి పోరాటాలు చేయించారు. అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సమైక్యసింహవునే స్థారుులో.. క్రికెట్లో చివరి బంతి ఉందంటూ చేసిన హడావుడి అంతాఇంతాకాదు. చివరిరోజు వరకు సీఎం పదవిని అనుభవించి ఆ తర్వాత బయటికొచ్చి ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ అని తిరుగుతున్నారు. కానీ ప్రజలకు ఎవరేమిటో బాగా తెలుసు. అందుకే ఆయన మీటింగ్‌లకు ఎవరైనా వెళ్తున్నారా.. మూడేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని సరిగ్గా నెలరోజులు తిరక్కముందే జనం మరిచిపోయారంటే కిరణ్‌కు జనంలో ఉన్న విలువ ఏపాటిదో స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. జనమే వాళ్ల గురించి ఆలోచించడం లేదు. మరి సమైక్య రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిందెవరనే ప్రశ్న వస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డేనని అంతా చెబుతున్నారు. రాష్ట్రా న్ని విడగొట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ జైలులో ఉండి అక్కడే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని మరీ సమైక్యం కోసం పోరాటం చేశారు. జైలు నుంచి విడుదలయ్యూక ఆమరణదీక్ష చేపట్టారు. ఇక విజయమ్మ కూడా గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారంటే సమైక్యం పట్ల వారికున్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబులా జగన్ రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. ఎక్కడైనా సమైక్యమే నినాదమన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధే తన ప్రాణమన్నారు. అందుకే జనవుంతా ఆయన్ను సొంతమనిషిగా భావిస్తున్నారు. ఆయున వస్తే నీరాజనాలు పలుకుతున్నారు. పి. తిమ్మారెడ్డి