వైఎస్ జగన్ మాట
‘ఆంధ్రప్రదేశ్ విభజన కోసం జరిగే ఏ ప్రయుత్నాన్నయినా వ్యతిరేకించాలనేది వూ పార్టీ విధానవుని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర విభజన కోసం చేపట్టే ఏ చర్యనైనా మేం వ్యతిరేకిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర వుంత్రివర్గం 2013 అక్టోబర్ 3న తీసుకున్న నిర్ణయుం వూకు ఏ వూత్రమూ సవ్ముతం కాదు. విభజనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఉద్యమిస్తున్నారు.’
- కేంద్ర హోంశాఖకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాసిన లేఖలో..
‘ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విభజనపై యూవద్దేశవుూ ఆలోచించాలి. ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశే కాదు.. ఓట్ల కోసం, సీట్ల కోసం రేపు కర్ణాటకను, తమిళనాడును కూడా విభజించే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన చేయుడం న్యాయువూ? విభజన విషయుంలో టీడీపీ-కాంగ్రెస్ కువ్ముక్కు అందరికీ తెలుసు. చరిత్రహీనుడు కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా బాబు సమైక్య ఉద్యవుంలో కలసి రావాలి.’
- సమైక్య రాష్ట్రం కోసం ఆవురణ నిరాహార దీక్ష సందర్భంలో..
‘నేను కేంద్రప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మొదట 2014 ఎన్నికలు పూర్తి చేయుండి. నేను, నా పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటాం. ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపడతాం. 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. 2014 ఎన్నికలనే రెఫరండంగా తీసుకునే దవుు్మ మీకుందా?’
- జాతీయు స్థారుు నేతలను కలుస్తున్న సందర్భంగా చెన్నైలో..
‘ఓట్ల కోసం, సీట్ల కోసం ఆడే ఈ రాజకీయు క్రీడ వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే.. దిగువన ఏర్పడే రాష్ట్రం వునిషి చేసిన ఎడారి అవుతుంది. తవు నిర్ణయూల వల్ల జరిగే కష్టనష్టాలను బేరీజు వేసుకోకుండా అధికార కాంగ్రెస్ పెద్దలు నియుంతృత్వ పోకడ లతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు. నా రాజీనావూతో, వూ పార్టీ వారు చట్టసభలకు చేసిన రాజీనావూలతో ఈ నిరంకుశ నిర్ణయుంలో ఏమైనా వూర్పు వస్తుందేమోనన్న ఆశతో రాజీనావూ చేస్తున్నాం.’
- ఎంపీ పదవికి రాజీనావూ చేసిన సందర్భంలో..
‘రాష్ర్ట విభజన నిర్ణయం వల్ల వుుందు తరాలకు శతాబ్దాల తరబడి తీవ్ర హాని కలుగుతుంది. కేంద్ర నిర్ణయుం ప్రజలకు బ్రిటీష్ వారి 1905 నాటి బెంగాల్ విభజనను గుర్తుకు తెస్తోంది. నాడు కర్జన్ అనుసరించిన ‘విభజించి.. పాలించు’ అనే కుటిల నీతినే ఇప్పుడు కాంగ్రెస్ అనుసరిస్తోంది.’
- కేంద్ర వుంత్రుల బృందానికి పంపిన లేఖలో..
‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయుంపై జరుగుతున్న ఈ పోరాటానికి జాతీయు పార్టీలన్నీ వుద్దతివ్వాల్సిన అవసరముంది. ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సవుస్య వూత్రమే కాదు. కాంగ్రెస్ తలబిరుసుతనాన్ని, నిరంకుశ వైఖరిని, ద్వంద్వ విధానాన్ని, ఆధిపత్యవాదాన్ని తెలుగు ప్రజలు నేడు సవాలు చేస్తున్నారు. ప్రజాస్వావ్యుంలోనూ, ప్రజాభీష్టంలోనూ విశ్వాసవుున్న ప్రతీ పార్టీ ఈ విభజనను ప్రతిఘటించాల్సి ఉంది.’
- సమైక్య పోరుకు వుద్దతు కోరుతూ వావుపక్షాలకు లేఖ..
‘రాష్ట్ర సమైక్యతకు అలుపెరగని పోరాటం చేద్దాం. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి వుధ్య పోరా టం. వచ్చే ఎన్నికల్లో అధిక ఎంపీ స్థానాలు గెలుచుకుని ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. 30 ఏళ్ల క్రితం ఈ దేశ పౌరసత్వం తీసుకున్న సోనియూకే ఈ దేశంపై ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసున్న తెలుగు ప్రజలను విడదీస్తే వునకెంత బాధగా ఉంటుంది.’
- హైదరాబాద్‌లో జరిపిన సమైక్య శంఖారావం సభలో..