సమైక్యాంధ్ర పాలనలో విచ్చలవిడిగా చేపట్టిన ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఈ నెలాఖరులోగా పరిష్కారమవుతుందని, ఈ విషయంలో ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు పేర్కొన్నారు.
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు
హైదరాబాద్: సమైక్యాంధ్ర పాలనలో విచ్చలవిడిగా చేపట్టిన ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య ఈ నెలాఖరులోగా పరిష్కారమవుతుందని, ఈ విషయంలో ఉద్యోగులు భయాందోళనకు గురికావద్దని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మంత్రిమండలి త్వరలో సబ్ కమిటీని వేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదివారం ఇక్కడి టీఎన్జీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో దేవీప్రసాద్ పాల్గొన్నారు.