seemandra
-
'అర్హులైన సీమాంధ్రులను లబ్దిదారులుగా చేర్చాలి'
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం సమగ్ర సర్వే ప్రకంపనలు స్పష్టించింది. రాష్ట్రాన్ని స్తంభింపజేసి చేసిన సర్వే ఎందుకు ఉపయోగపడిందో చెప్పాలంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సంక్షేమ కార్యక్రమాల కోసమే సర్వే అన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలులో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ప్రశ్నించాయి. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం అర్హులైన సీమాంధ్రులను.. లబ్దిదారులుగా చేర్చకుంటే వారి తరపున ఎంఐఎం పోరాడుతుందన్నారు. 25 శాతం మంది సమగ్ర సర్వే పరిధిలోకి రాలేదని అక్బరుద్దీన్ అన్నారు. సర్వే పరిధిలోకి రానివారి కోసం మళ్లీ ఎప్పుడు సర్వే నిర్వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఎక్కడి ఉద్యోగులు అక్కడే..
సర్వీసు రిజిస్టర్లో పేర్కొన్న జిల్లా ప్రకారం స్థానికత ఆప్షన్లకు నెలరోజుల గడువు 30న కమలనాథన్ కమిటీ భేటీలో ముసాయిదా మార్గదర్శకాలు ఖరారు ఆంధ్రాలో 3,000 మంది.. తెలంగాణలో 4,000 మంది ఎక్కువ హైదరాబాద్: ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికి కేటాయించేందుకు కమలనాథన్ కమిటీ సిద్ధంగా ఉంది. తమ ప్రాంతానికి చెందినవారిని తమ రాష్ట్రానికే కేటాయించాలని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు కూడా ఇదే వైఖరి అవలంబిస్తే సీమాంధ్రకు చెందిన ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించడం వల్ల కమలనాథన్ కమిటీకి ఉద్యోగుల పంపిణీ సులభతరం కానుంది. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులో గుర్తించడానికి.. సర్వీస్ రిజిస్టర్లో ఏ జిల్లాకు చెందినవారో రాసి ఉంటుందని, దానిప్రకారం స్థానికత నిర్ధారిస్తే సరిపోతుందనేది అధికారుల భావన. ఫలితంగా స్థానికతపై తకరారు తొలగిపోతుందని అధికార వర్గాలంటున్నాయి. సూపర్ న్యూమరరీ పోస్టుల సృష్టి తప్పదు.. ఏ ప్రాంతానికి చెందినవారిని ఆ ప్రాంతానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పై, మధ్యస్థాయి పోస్టుల్లో 3,000 మంది ఎక్కువగా ఉంటారని, అలాగే తెలంగాణకు కిందిస్థాయిలో ఎక్కువమంది ఉద్యోగులతో మొత్తం 4,000 మంది అధికంగా ఉంటారని అధికార వర్గాలు చెప్పాయి. ఎక్కువగా ఉన్న ఉద్యోగులకోసం రెండు రాష్ట్రప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించడంతోపాటు ఖాళీ పోస్టుల్లోనూ నియమించవచ్చునని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 30న కమలనాథన్ కమిటీ భేటీ... ఏ ప్రాంతంవారిని ఆ ప్రాంతానికి కేటాయించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే కమలనాథన్ కమిటీ జిల్లాల స్థానికత ఆధారంగా ఎవరు ఆప్షన్ ఎక్కడ ఇస్తే అక్కడకు కేటాయించేలా ముసాయిదా మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఈ నెల 30న జరిగే సమావేశంలో ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేయాలనే పట్టుదలతో కమలనాథన్ ఉన్నారు. ఆరోజు ముసాయిదా మార్గదర్శకాలు ఖరారైతే మరుసటిరోజు ఇరు రాష్ట్రాలకు చెందిన వెబ్సైట్లలో వాటిని ఉంచుతారు. వాటిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించడానికి పది రోజుల గడువిస్తారు. తర్వాత జూలై నెలాఖరుకు తుది మార్గదర్శకాలను కమిటీ రూపొందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమోదానికి పంపుతుంది. మొత్తం పంపిణీ ప్రక్రియను ఆగస్టు నుంచి ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా పూర్తిచేయాలనేది కమిటీ భావన. -
ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి ఢోకా లేదు
అభినందన సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖపట్నం: సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం ఆమోదం లేదనడం సరికాదన్నారు. ప్రణాళికా సంఘ ఛైర్మన్ గా ప్రధానమంత్రి మోడీ వ్యవహరిస్తారని, ఆయనే ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించడం వల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ ద్దని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శనివారం విశాఖ వచ్చిన ఆయన్ని బీజేపీ నగరశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రణాళికా సంఘం సలహా సభ్యులు సంబంధిత మంత్రికి కేవలం ప్రత్యేక హోదా ఎలా ఇస్తారనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చారని, ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఉండాల్సిన పరిధి, నియమ నిబంధనలు వివరించారని చెప్పారు. ఈ నిబంధనలన్నీ సీమాంధ్రకు లేవంటూ మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొన్నారు. పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఉంటుందని, ఆ కాలంలో విస్తారంగా భారీ పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. సీమాంధ్రకు రాజధానిగా గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నందున రైల్వే జోన్ కేంద్రంగా విశాఖను చేస్తామని ప్రకటించారు. ఐఐఎం ఓ చోట, ఐఐటీ మరో చోట ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, శంకరంపల్లిలో విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేయాలని లేఖలు రాశానన్నారు. -
ఉద్యోగ సంఘాల మధ్య సమసిన వివాదం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం చోటు చేసుకున్న వివాదానికి ప్రభుత్వ పెద్దలు ముగింపు పలికారు. తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్‌లో అసోసియేషన్ కార్యాలయాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వివాదానికి ముగింపు దొరికింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉన్న కారణంగా శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మండిపడింది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించడంతో ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట కూడా జరిగింది. ఈ వివాదాన్ని మరింత పెద్దది కాకుండా చూసేందుకు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ఏ-బ్లాక్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల వాగ్వాదం
కార్యాలయం కేటాయింపుపై ఘర్షణ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయం విషయమై తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య శుక్రవారం తోపులాట, వాగ్వాదం జరిగింది. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం కార్యాలయం హెచ్ బ్లాక్‌లో ఉంది. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి పద్మాచారి అదే కార్యాలయాన్ని తమకూ కేటాయించాలని కేసీఆర్ ఫొటో పెట్టి సమావేశం నిర్వహించారు. దీనికి ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సాధారణ పరిపాలన శాఖ నుంచి అనుమతి తెచ్చుకోకుండా ఈ విధంగా సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతున్న నేపథ్యంలో తమకు కార్యాలయాన్ని కేటాయించడం తప్పనిసరని, అందుకే ఇక్కడ సమావేశం నిర్వహించుకున్నట్టు పద్మాచారి తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. దీనిపై టీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు స్పందిస్తూ.. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఎలాంటి వివాదాలూ లేవని, ఇవన్నీ ఎవరో కావాలని సృష్టిస్తున్నారని చెప్పారు. -
నేటి ‘ఇంటర్ సప్లిమెంటరీ’ వాయిదా
హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునివ్వడంతో గురువారం జరగాల్సిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగే ప్రథమ, ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్-బి, హిస్టరీ, జువాలజీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీని గురువారం ఖరారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
నేడు బ్యాంకర్ల భేటీలో రుణాలపై చర్చ
హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణలో వ్యవసాయ రుణాలు ఎంతమేర ఉన్నాయి, ఈ విషయంలో ఎలాంటివైఖరి అవలంబించాలనే దానిపై గురువారం నిర్వహించే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా సీమాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కానున్న ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. -
ఆర్టీసీ బస్సు పర్మిట్ల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణ-సీమాంధ్ర ప్రాంతాల మధ్య తిరుగుతున్న రెండు ప్రాంతాల ఆర్టీసీ బస్సులకు ప్రస్తుతం ఉన్న పర్మిట్‌ను మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి విభజన అధికారికం కానుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర నుంచి తెలంగాణకు దాదాపు 2 వేలకుపైగా బస్సులు తిరుగుతుండగా, తెలంగాణ నుంచి సీమాంధ్రకు అందులో మూడోవంతు కూడా వెళ్లటం లేదు. దీంతో రెండు రాష్ట్రాలకు ఆ బస్సులను జనాభా నిష్పత్తి ఆధారంగా పంచాలనే విషయంలో వివాదం కొనసాగుతోంది. జూన్ 2 నుంచి సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటామని కొందరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పర్మిట్లను మరో ఏడాది వరకు కొనసాగించొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వు జారీ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొలువు దీరిన తర్వాత పర్మిట్ల విషయంలో తీసుకునే నిర్ణయం ప్రకారం భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని అందులో పేర్కొంది. -
సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించండి
టీఆర్ఎస్ వార్‌రూం, టీఎన్జీవో గ్రీవెన్స్‌సెల్‌కు సమాచారం ఇవ్వండి: దేవీప్రసాద్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలి స్థానికత ఆధారంగా విభజన జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పిలుపు కరీంనగర్ : తెలంగాణలో పనిచేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించి టీఆర్ఎస్ వార్‌రూంకు, టీఎన్జీవో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు వెంటనే సమాచారం అందించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కరీంనగర్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సచివాలయంలో ఈ ప్రాంత ఉద్యోగులు మాత్రమే పనిచేయాలన్నారు. తెలంగాణ ఉద్యోగులం సీమాంధ్రలో పనిచేయమని, అదేవిధంగా సీమాంధ్ర ఉద్యోగులు ఇక్కడ పనిచేయొద్దని అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉన్న మూడు వేల మంది తెలంగాణ ఉద్యోగులు జన్మభూమిపై మమకారంతో ఇక్కడే పనిచేసేందుకు వాంటరీ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారని తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులు సీమాంధ్ర ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని పెంపొందించవద్దని కోరారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవని కేసీఆర్ చెప్పిన మాటను తప్పుపట్టవద్దన్నారు. అది ఒక్క కేసీఆర్ మాటే కాదని, నాలుగున్నర లక్షల తెలంగాణ ఉద్యోగుల మాటతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల డిమాండ్ అని పేర్కొన్నారు. ఆయా హెడ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితా ఇంతవరకు ప్రచురణకు నోచుకోలేదని చెప్పారు. జాబితాను బహిరంగంగా వెల్లడిస్తే తప్పుడు సమాచారమిచ్చిన ఉద్యోగుల వివరాలు బయటపడి అపాయింటెడ్ డే, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారంలోపు పరిశీలించే అవకాశం ఉండేదన్నారు. స్థానికత ఆధారంగా విభజన జరిగేంత వరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని దేవీప్రసాద్ సూచించారు. ఇప్పటివరకు 23 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన సచివాలయంలో తెలంగాణ జిల్లాల వారిని పట్టించుకోలేదన్నారు. అందుకే సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలన్నారు. 58ః42 ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియలో మంజూరీ పోస్టులను కాకుండా వర్కింగ్ పోస్టులను విభజించడం సరికాదన్నారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన తెలంగాణలోని నాలుగు వందల పోస్టులను వెంటనే పునరుద్ధరించాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. -
తేలిన అప్పుల లెక్క
తెలంగాణకు రూ.67వేల కోట్లు, సీమాంధ్రకు రూ.93వేల కోట్ల అప్పు తాత్కాలిక లెక్కల ప్రకారం అంచనా వేసిన ఆర్థిక శాఖ అధికారులు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు అప్పుల పంపిణీ ఎవరు ఏ అప్పు ఎంత వడ్డీతో కట్టాలో చెప్పనున్న ఆర్బీఐ హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పులను కొన్నింటిని ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాంతానికి వినియోగిస్తే ఆ ప్రాంతానికి పంపిణీ చేయనున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి మాత్రమే అప్పు తెచ్చినట్లు నిర్ధారించలేమని జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నా రు. అప్పుల పంపిణీకి సంబంధించి తాత్కాలికంగా ఆర్థికశాఖ అంచనాలను వేసింది. ఇప్పటి వరకు ఉమ్మడిరాష్ట్రంలో అన్ని రకాల అప్పులు కలిపి రూ.1.60లక్షల కోట్లుగా తేల్చారు. ఇందులో తెలంగాణకు రూ.67వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.93 వేల కోట్ల అప్పు ఉంటుందని ప్రాథమిక అంచనాలో తేల్చింది. ఇందులో ప్రత్యేకంగా ఒక ప్రాంతంలోని ప్రాజెక్టులకు తెచ్చిన విదేశీ, స్వదేశీ అప్పులను ఆయా ప్రాంతాలకే కేటాయించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులకు వెచ్చించిన అప్పులను మాత్రం జనాభా ప్రాతిపదికనే పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రణాళిక పద్దు కింద ఆస్తుల కల్పన వ్యయం కోసం సెక్యూరిటీల విక్రయం ద్వారా ప్రభుత్వం అప్పులు చేస్తుంది. ఈ అప్పులను బడ్జెట్ ద్వారా సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర ఆస్తుల కల్పన కోసం వ్యయం చేస్తారు. మొత్తం బడ్జెట్ ఆధారంగా వ్యయం చేస్తున్నందున ప్రాంతాల వారీగా ప్రాజెక్టుల వ్యయం తీయడంలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టుల వారీగా వ్యయం తీయాలంటే ప్రణాళిక పద్దు కింద ఏ జిల్లాల్లో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత వ్యయం చేసిందీ గత 30 సంవత్సరాల నుంచి లెక్కలు తీయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కోసం తెచ్చిన అప్పులను రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. విదేశీ సంస్థలు, నాబార్డు నుంచి తెచ్చిన అప్పులను ప్రత్యేకంగా ప్రాజెక్టుల వారీగా తెచ్చినందున ఆ అప్పులను ఏ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు ఉంటే ఆ ప్రాంతానికి అప్పులను లెక్కకట్టినట్లు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు కొన్ని 20 సంవత్సరాల్లో, కొన్ని 15 సంవత్సరాల్లో, కొన్ని పది సంవత్సరాల్లో, మరికొన్ని ఐదు సంవత్సరాల్లో తీర్చాల్సిన అప్పులు ఉంటాయని, వాటిలోను వడ్డీ శాతాల్లో వ్యత్యాసం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్పులు తీర్చే సమయం, వడ్డీ శాతాలను పరిగణనలోకి తీసుకుని ఏ రాష్ట్రంలో ఎంత కాలంలో, ఎంత వడ్డీ అప్పులను తీర్చాలో ఆర్బీఐ నిర్ధారించనుందని తెలిపారు. -
ప్రబల శక్తిగా ఆవిర్భవించాం
-
ప్రబల శక్తిగా ఆవిర్భవించాం
ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వెంటే నిలిచారు: పార్టీ సీనియర్ నేతల విశ్లేషణ గెలుపుపై పార్టీ నేతల్లో అతివిశ్వాసం అనేక చోట్ల దెబ్బతీసింది పార్టీ నిర్మాణం ఉండివుంటే ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చేవి పట్టణ ప్రాంతాల్లో మోడీ హవా టీడీపీకి కలిసివచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 1.96 శాతం మాత్రమే జాతీయంగా టీడీపీ - వైఎస్సార్ సీపీ మధ్య తేడా లక్ష ఓట్లే ఈ ఎన్నికల్లో అధికారం రాకపోయినా.. మంచి భవిష్యత్ ఉంది పరాజయంపై వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సమీక్షలు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్న నేతలు హైదరాబాద్: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో అధికారం దక్కించుకోవడానికి అవసరమైన అసెంబ్లీ సీట్లు గెలవలేకపోయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రబల శక్తిగా ఆవిర్భవించింది. సుదీర్ఘ కాలం రాజకీయ మనుగడ సాగిస్తున్న అనేక పార్టీలను మట్టికరిపించింది. కాంగ్రెస్‌తో పాటు ప్రతి ఎన్నికల్లోనూ తమ రాజకీయ ఉనికిని చాటుకునే అనేక పార్టీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా కొట్టుకుపోయాయి. అధికారానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయినా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా కీలక బాధ్యతలను ఆ పార్టీ చేపట్టబోతోంది. అనేక ఆటుపోట్ల మధ్య.. పార్టీ పరంగా ఎలాంటి నిర్మాణం లేకుండానే.. తొలిసారి ఎదుర్కొన్న సార్వత్రిక ఎన్నికల్లోనే ఏకంగా 45 శాతం ఓట్లను సాధించడం ఆ పార్టీకి సానుకూల అంశంగా మారింది. కేవలం 1.9 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినప్పటికీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందన్న అంచనాకు ఆ పార్టీ నేతలొచ్చారు. గత నాలుగు రోజులుగా ఎన్నికల ఫలితాలను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నేతల్లో నెలకొన్న అతి విశ్వాసం, పార్టీకి నిర్మాణం లేకపోవడం, పొత్తుల వల్ల టీడీపీకి ఓట్లు పెరగడం, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ హవా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయడం, కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పూర్తిగా చేతులెత్తేయడం, ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు లేనప్పటికీ రుణమాఫీ, ఇంటింటికో ఉద్యోగం వంటి చంద్రబాబు ఇచ్చిన హామీలు.. తదితర అంశాలు పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా విశ్లేషించారు. చంద్రబాబు రుణమాఫీ హామీ అనంతపురం, ఉభయగోదావరి జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందన్న అంచనాకొచ్చారు. దీనికి తోడు 30 ఏళ్ల కిందట ఏర్పడిన టీడీపీకి సంస్థాగత నిర్మాణం ఉండటంతో మిగతా అంశాలన్నీ ఆ పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషించారు. ప్రత్యర్థులు అనేక అస్త్రాలతో ఎన్నికల్లో దిగినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ 45 శాతం ఓట్లు సాధించడం మామూలు రాజకీయ పార్టీలకు సాధ్యం కాదని, సంఖ్యాపరంగా ఓడిపోయామే తప్ప తమ పార్టీకొచ్చిన ఫలితాలు భవిష్యత్తుకు మంచి సంకేతంగా భావిస్తున్నామని సీజీసీ సభ్యుడొకరు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో 90 శాతం స్థానాల్లో ఓడినా, టీడీపీకి వచ్చిన ఓట్లతో పోల్చితే పెద్ద తేడా లేకపోగా మరికొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వచ్చి ఉండేవని సీనియర్లు తేల్చారు. అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు... 1994 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం 26 స్థానాల్లో మాత్రమే గెలిచి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ తర్వాత కోలుకున్న కాంగ్రెస్ దేశంలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఈ రాష్ట్రంలో గెలిచిన ఎంపీలే కారణమయ్యేలా 33 మంది సభ్యులను గెలుచుకుంది. అలాంటి పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో ఊసు లేకుండా పోగా కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా దక్కని దయనీయస్థితికి పడిపోయింది. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడగా, మార్పు కోరుకున్న ప్రజలు కేంద్రంలో నరేంద్రమోడీకి పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా మోడీ గాలిలో సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్‌వాది పార్టీ, వామపక్ష పార్టీలు సైతం దెబ్బతిన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాది కేవలం 5 ఎంపీ సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. బీహార్‌లో బీజేపీ పొత్తును వదులుకొని ఎన్నికల్లో పోటీచేసిన అధికార జనతాదళ్ (యూ)కి ఈ ఎన్నికల్లో తలబొప్పికట్టింది. ఆ రాష్ట్రంలోని 40 స్థానాల్లో కేవలం రెండే సీట్లు దక్కాయి. ఈ పరిణామం ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ రాజీనామాకు దారితీసింది. మహారాష్ట్రలో కూడా అధికార కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు అక్కడి 48 స్థానాలకు గాను కేవలం 6 స్థానాలనే దక్కించుకున్నాయి. తక్కినవన్నీ బీజేపీ, శివసేన కూటమికే దక్కాయి. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాగేజరగ్గా పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశాలో మాత్రమే ఇందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలు నరేంద్రమోడీ గాలిని తట్టుకొని నిలబడ్డాయి. అదే పరిస్థితి సీమాంధ్రలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనబరిచింది. అక్కడ ఆ పార్టీలు అధికార పార్టీలుగా ఉండటంతో పాటు.. క్షేత్రస్థాయిలో బలమైన పునాదులతో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉండడంతో మెరుగైన ఫలితాలు సాధిం చాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆ పార్టీల మాదిరి నిర్మాణం లేనేలేదు. పార్టీ ఏర్పాటైనది మొదలు కాంగ్రెస్, టీడీపీలు కుట్రపూరితంగా దాన్ని అణచేసేందుకు ప్రయత్నించాయి. అయినా వాటన్నిటినీ తట్టుకొని పార్టీ సాధారణ ఎన్నికలకు వెళ్లింది. బీజేపీతో పొత్తుపెట్టుకొని పోటీకి దిగిన టీడీపీకి ఆర్థిక, అంగబలాలతో పాటు మోడీ గాలి కలసి వచ్చాయి. ఏమాత్రం తీసిపోని ప్రజాదరణ... వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు వచ్చిన ఓట్ల శాతాలు చూస్తే ప్రజాదరణలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పార్టీతో ఏమాత్రం తీసిపోనిదిగా నిలిచింది. టీడీపీకి, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా రెండు శాతం కూడా లే దు. కేవలం సీట్ల సంఖ్యలో ఆధిక్యతను సాధించి టీడీపీ అధికారంలోకి రాగలిగింది. అనేక సానుకూలాంశాలు కలసి వచ్చినప్పటికీ ఆ పార్టీ సాధించిన ఓట్లను బట్టి చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్సే గట్టిపోటీ ద్వారా ముందంజలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఎన్నికల్లో జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం చూస్తే టీడీపీతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ 2.5 శాతం ఓట్లు సాధించింది. అత్యధిక ఓట్లు సాధించిన పార్టీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయస్థాయిలో పదో స్థానంలో నిలిచింది. టీడీపీ 1,40,94,545 ఓట్లు రాబడితే వైఎస్సార్ కాంగ్రెస్ 1,39,91,280 ఓట్లు సాధించింది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం లక్ష మాత్రమేనని ఎన్నికల సంఘం తేల్చింది. జాతీయస్థాయిలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రకారం చూస్తే టీడీపీకి 14, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 14 స్థానాలు రావలసి ఉందని ‘ద హిందూ’ పత్రికలో విశ్లేషణలు వచ్చాయి. కొంచెం జాగ్రత్త పడి ఉంటే... రాష్ట్రంలో పార్టీ ఏర్పాటైన అతి తక్కువ కాలంలోనే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా 67 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాలను గెల్చుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలనే సాధించినట్లు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. పోల్ మేనేజ్మెంటులో కానీ, ఆర్థికపరమైన వ్యవహారాలను చాపకిందనీరులా చక్కబెట్టడంలో కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు సిద్ధహస్తులు కావడంతో అది ఈ ఎన్నికల్లో వారికి కలసివచ్చింది. పార్టీకి ప్రజాదరణ ఉందని, ఎట్టిపరిస్థితుల్లో తమదే గెలుపు అని చాలా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు, నేతలు ఒకింత అతివిశ్వాసంతో వ్యవహరించడంతో ఆ స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశానికి వదులుకోవలసి వచ్చింది. ఇలాంటి నియోజకవర్గాలు దాదాపు 30కి పైగా ఉన్నాయని గుర్తించారు. ఈ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఒకింత అప్రమత్తతతో వ్యవహరించి ఉంటే ఓట్లలోనే కాకుండా సీట్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్‌దే పైచేయిగా ఉండేదని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. -
సీమాంధ్రకు అన్యాయం!
ఏపీఎండీసీ ఆస్తుల పంపకం ప్రతిపాదనలపై ఉద్యోగుల్లో అసంతృప్తి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీపీ) ఆస్తుల పంపకం ప్రతిపాదనలు సీమాంధ్ర కు అన్యాయం కలిగించేలా ఉన్నాయని ఆ ప్రాంత ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఆదాయంలో 95 శాతం వాటా కలిగిన సీమాంధ్రకు అప్పులు వదిలేసి ఆదాయాన్ని మాత్రం సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్), తెలంగాణలకు 52 : 48 నిష్పత్తిలో పంచాలంటూ సంస్థ చేసిన ప్రతిపాదనలపై అసహనంతో ఉన్నారు. ‘ఏపీఎండీసీకి రూ. 700 కోట్ల డిపాజిట్లు, ఇతరత్రా నగదు నిల్వలు ఉన్నాయి. ఇందులో సుమారు రూ. 200 కోట్లు పల్వరైజింగ్ మిల్లుల వారు బెరైటీస్ ఖనిజం కోసం చెల్లించిన అడ్వాన్సులకు సం బంధించినవి. భవిష్యత్తులో వారికి రూ. 200 కోట్ల విలువైన ఖనిజాన్ని ఇవ్వాల్సి ఉంది. అంటే ఈ రూ. 200 కోట్లు అప్పు కింద తొలగించాల్సి ఉంది. అప్పు కింద రూ. 200 కోట్లు మినహాయించి మిగిలిన రూ. 500 కోట్లు 52 : 48 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉండగా అప్పును వదిలేసి నగదు నిల్వలు మాత్రమే పంచేలా సంస్థ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే’ అని ఆ ప్రాంత ఉద్యోగులు పేర్కొంటున్నారు. అమీర్‌పేట భవనంలో వాటా ఉంచండి.. ఏపీఎండీసీకి వస్తున్న ఆదాయంలో మొదటి నుంచి 95 శాతం సీమాంధ్రలోనిదే. కాగా మంగంపేట బెరైటీస్, చీమకుర్తి గ్రానైట్స్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే అమీర్‌పేటలో ఏపీఎండీసీకి భవనాన్ని కొనుగోలు చేశారు. దీనిని కూడా రెండు రాష్ట్రాలకు 52:48 నిష్పత్తిలో పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా పంచి విక్రరుుంచడం ద్వారా తమ వాటా ఇవ్వకుండా భవనాన్ని అలాగే ఉంచాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది హైదరాబాద్‌లో అలాగే ఉంటే తమకు అతిథి గృహంగానైనా ఉపయోగపడుతుందనే అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనులివ్వాలి ఏపీఎండీసీకి మధ్యప్రదేశ్‌లోని సిలిగురి, ఒడిశాలోని నొవగాం-తెలిసాహిలో బొగ్గు గనులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి బొగ్గు గనులు ఉన్నందున ఏపీఎండీసీకి ఉన్న రెండు కోల్‌బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కే వదిలేయాలని సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ గనుల కోసం ఏపీఎండీసీ వెచ్చించిన మొత్తమంతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చినదేనని ఆ సంస్థ ఉద్యోగులు అంటున్నారు. -
కేంద్ర హామీల్లో స్పష్టతనివ్వండి
-
లోక్‌సత్తా.. వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల్లో లోక్‌సత్తా పార్టీ వైఫల్యానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తనదే పూర్తి బాధ్యతని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఆది వారం పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఏర్పాటైన తర్వాత అనేక మైలురాళ్లు సాధించామని, వచ్చేనెల 14, 15 తేదీల్లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తామని చెప్పారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌ల విజయాన్ని అభినందించారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు. -
కేంద్ర హామీల్లో స్పష్టతనివ్వండి
నేడు మోడీని కలవనున్న వైఎస్సార్సీపీ బృందం విభజన హామీల్లో స్పష్టత కోరనున్న జగన్ పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై విజ్ఞప్తి ఎన్నికల్లో ఘన విజయానికి అభినందనలు హైదరాబాద్: త్వరలో దేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన లోక్‌సభ సభ్యుల ప్రతినిధి బృందం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమవారం కలవనుంది. మధ్యాహ్నం ఢిల్లీలో మోడీని కలిసి, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయనుంది. దాంతోపాటు, రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేయనుంది. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయం అందించాలని కోరనుంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మరింతగా అండదండలు అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటికీ కేంద్రం ప్రత్యేకంగా సాయం చేయాలని అర్థించనున్నారు. అలాగే తెలంగాణలో జలయజ్ఞం ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని మోడీకి వైఎస్సార్సీపీ బృందం విజ్ఞప్తి చేయనున్నట్టు ఆదివారం పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. విభజన సందర్భంగా కేంద్రం, అప్పటి ప్రధానమంత్రి ప్రకటించిన ప్యాకేజీలో స్పష్టత లేదని, దానిపై స్పష్టతనివ్వడంతో పాటు మరింత సహాయం అందించాలని కోరనున్నట్టు పేర్కొంది. -
వైఎస్సార్సీపీదే విజయం: మైసూరా
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ 110 నుంచి 125 శాసనసభ, 20కి పైగా లోక్‌సభ స్థానాలను ఖాయంగా గెల్చుకుంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిపై తమ పార్టీ అంతర్గతంగా ‘ఎగ్జిట్ పోల్’ సర్వే నిర్వహించిందని, దాని ప్రకారమే తమకు వచ్చే స్థానాల సంఖ్యపై ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నామని అన్నారు. తమ అంచనా నూటికి నూరు శాతం నిజం అవుతుందని పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైసూరా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజ కీయ పార్టీ అయినా ప్రజా తీర్పును శిరసావహించక తప్పదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తాము కూడా అంగీకరిస్తున్నామని అన్నారు. అయితే స్థానిక ఎన్నికలపై పూర్తిగా స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వం తీరు తెన్నులు ప్రభావం చూపుతాయని, పైగా ఎన్నికలు జరిగేది కూడా తక్కువ ఓట్ల పరిధిలోనే అని ఆయన చెప్పారు. ఒక ఎంపీటీసీ అంటే 2 వేల ఓట్ల లోపే ఉంటాయని, ఇందులో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. అరుుతే స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మధ్య అనేక రాజకీయ పరిణామాలు, సమీకరణలు చోటు చేసుకున్నాయని, ఇవన్నీ ఓటర్ల దృక్పథంలో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు. స్థానిక ఓట్ల శాతంలో తేడా చాలా స్వల్పం వైఎస్సార్సీపీ కొత్త పార్టీ అనీ, అయినప్పటికీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి దీటుగా నిలబడగలిగిందని మైసూరా అన్నారు. తమ పార్టీ కొంత వెనుకబడినా టీడీపీతో పోల్చితే తేడా చాలా స్వల్పమేనన్నారు. తమ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కన్నా 4 శాతం, మండల, జడ్పీ ఎన్నికల్లో 3.07 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని ఆయన గణాంకాలను వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే ఆ తేడా మరింత తక్కువగా ఉందన్నారు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు
సీమాంధ్రలో అసెంబ్లీ ఫలితాలపై ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ హైదరాబాద్: సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ముందంజ అని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ 80 నుంచి 100 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంద ని తేల్చింది. అలాగే టీడీపీకి 75-90 వరకు రావొచ్చని తెలిపింది. ఇతరులు 5 నుంచి 15 స్థానాలు గెలుపొందుతారని సర్వే స్పష్టం చేసింది. లోక్‌సభ ఫలితాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమానంగా 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. వైఎస్సార్సీపీకి 12, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి 13 స్థానాలు వస్తాయని తెలిపింది. బుధవారం ప్రసారం చేసిన ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు మాత్రం ఫలితాలు ఏకపక్షంగా జగన్ వైపే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకన్నా వైఎస్సార్ సీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్.రామ్ పేర్కొన్నారు. -
సీపీఐ తెలంగాణ, సీమాంధ్ర శాఖల ఏర్పాటుకు సన్నాహాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్రల్లో శాఖల ఏర్పాటుకు సీపీఐ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22, 23 తేదీల్లో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ భేటీ కానుంది. ఈ క్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గం ఈ నెల 21న సమావేశమై దీనికి సంబంధించిన అజెండాను ఖరారు చేస్తుంది. వాస్తవానికి ఏప్రిల్‌లోనే రెండు శాఖల్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినప్పటికీ ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. రెండు ప్రాంతాలకు ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేసి ప్రస్తుత కార్యదర్శి కె. నారాయణను ఇప్పటి దాకా ఆ పదవిలో కొనసాగించారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో శాఖల ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కమిటీలకు నాయకత్వం వహించిన చాడా వెంకటరెడ్డి తెలంగాణకు, సీమాంధ్రకు కె.రామకృష్ణ కార్యదర్శులుగా ఎంపికయ్యే అవకాశముంది. -
29 కేంద్రాల్లో నేడు రీ పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రలోని పది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మధ్యలో పనిచేయడం మానేశాయి. వాటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్ నిర్వహించారు. అయితే ఇలాంటి చోట్ల రీ పోలింగ్ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవీ.. నిజామాబాద్ లోక్‌సభకు బోధన్ అసెంబ్లీ పరిధిలోని 64వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు జుక్కల్ అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 146వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు బాన్సువాడ అసెంబ్లీ పరిధిలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానానికి 48, 168 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలోని 9వ పోలింగ్ కేంద్రం కూకట్పల్లి అసెంబ్లీ స్థానానికి 371/ఎ పోలింగ్ కేంద్రం కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి 161వ పోలింగ్ కేంద్రం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి 239వ పోలింగ్ కేంద్రం శ్రీకాకుళం లోక్‌సభకు శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలోని 46వ పోలింగ్ కేంద్రం కురుపాం అసెంబ్లీ స్థానానికి 192వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభకు సాలూరు అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభ, పాడేరు అసెంబ్లీ స్థానానికి 68వ పోలింగ్ కేంద్రం మచిలీ పట్నం లోక్‌సభకు గుడివాడ అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం మచిలీపట్నం లోక్‌సభకు అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోని 29వ పోలింగ్ కేంద్రం అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి 91వ పోలింగ్ కేంద్రం పెనమలూరు అసెంబ్లీ స్థానానికి 59, 172 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ పరిధిలోని 212వ పోలింగ్ కేంద్రం విజయవాడ లోక్‌సభకు మైలవరం అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం నందిగామ అసెంబ్లీ స్థానానికి 171, 174 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు జగ్గయ్యపేట అసెంబ్లీ పరిధిలోని 122వ పోలింగ్ కేంద్రం కరీంనగర్ లోక్‌సభకు హుస్నాబాద్ పరిధిలోని 170వ పోలిం గ్ కేంద్రం కడప పార్లమెంట్‌కు, జమ్మలమడుగు అసెంబ్లీకి 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. -
కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిన రఘువీరా
-
కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిన రఘువీరా
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అంగీకరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి నామ మాత్రపు సీట్లు వచ్చాయని ఆయన చెప్పారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. హంగ్ ఏర్పడిన కొన్ని మున్సిపాలిటీల్లో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా తమ పార్టీకి విజయావకాశాలు లేవని రఘువీరా రెడ్డి అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించాల్సివుందని, కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రఘువీరా రెడ్డి అన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు .. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కనమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. చాలా చోట్ల కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. -
తెలంగాణకు రెవెన్యూ మిగులు 8,000 కోట్లు
సీమాంధ్రకు 14 వేల కోట్ల లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల సడలింపునకు ఆర్థిక శాఖ లేఖ రెవెన్యూ లోటు లేకపోతేనే కేంద్ర నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ మిగులుతో ఏర్పాటవుతోంది. రాష్ట్ర విభజన సమయం సమీపిస్తున్నందున ఆర్థిక శాఖ రెండు రాష్ట్రాల ఆదాయం, అప్పులను లెక్కకట్టే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (సమైక్య రాష్ర్టం) ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఆర్ధిక క్రమశిక్షణ కోసం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం తీసుకువచ్చారు. ఆ మేరకు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించడంతో పాటు రెవెన్యూ లోటు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించకుండా చూశారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలోని నిబంధనలను పాటిస్తేనే, రెవెన్యూ లోటు లేకపోతేనే గ్రాంట్ల రూపంలో కేంద్ర నిధులు ప్రభుత్వాలకు వస్తాయి. ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లోనే ఉంది. ద్రవ్య లోటు మూడు శాతం లోపే ఉంది. అరుుతే ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. ఈ రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం రూ.8 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉండనుంది. రాజధాని ఇక్కడే ఉండడం, తద్వారా ఆదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విభజనానంతరం కూడా ఇక్కడ మిగులే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు వచ్చేవిధంగా రెండు ఆర్ధిక సంవత్సరాల పాటు ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించాలని ఆర్ధిక శాఖ ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ మిగతా అంశాల్లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అమలు చేయడం కష్టసాధ్యమవుతుందని ఆర్థిక శాఖ భావించింది. -
సొంత ఊళ్లకు పయనం
సాక్షి, సిటీబ్యూరో : సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మూడు రోజులుగా సీమాంధ్రకు తరలివెళ్తున్న ప్రయాణికుల రద్దీ మంగళవారం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం ఎన్నికలు కావడంతో నగరవాసులు భారీ సంఖ్యలో బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లలోనే కాకుండా లక్షలాది మంది ప్రజలు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజులుగా చార్జీలు రెట్టింపు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లు మంగళవారం కూడా దోపిడీ కొనసాగించారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులే ప్రయాణ చార్జీలను భరిస్తుండడంతో ప్రయాణికులు చార్జీలు రెట్టింపయినా లెక్క చేయకుండా బయలుదేరారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది బయలుదేరినట్లు అంచనా. కిక్కిరిసిన ఎంజీబీఎస్ ... మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రోజూ నడిచే 850 దూరప్రాంత బస్సులతో పాటు, మంగళవారం మరో 700 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, నె ల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సులు సైతం కిటకిటలాడాయి. కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి. ప్రయాణికుల ధర్నా.. సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ల వద్ద గందరగోళం నెలకొంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, రిజర్వేషన్ నిర్ధరణకాని వాళ్లు, జనరల్ బోగీ ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వారిని స్లీపర్‌క్లాస్ బోగీల్లోకి అనుమతించారు. దీంతో అప్పటికే స్లీపర్‌క్లాస్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ ప్రయాణికులంతా బోగీల్లోకి ఎక్కేయగా రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవలసి వచ్చింది. విశాఖకు వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. కొంతమంది టీసీలు ప్రయాణికుల వద్ద అదనపు డబ్బులు తీసుకొని ఎస్-6 బోగీలోకి సాధారణ ప్రయాణికులను ఎక్కించడంతో 30 మందికి పైగా రిజర్వేషన్ ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మరో రైలులో వారిని విశాఖకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు.. ఓటు వేసేందుకు వచ్చా.. నేను మహారాష్ట్ర ఉద్దిర్లో వ్యాపారం చేస్తున్నా. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వ్యాపారాన్ని మానుకుని మా స్వస్థలమైన చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోన గ్రామానికి వెళ్తున్నా. - నాగస్వామి నాయక్ బంధువులతో కలిసి.. పదేళ్ల క్రితం రాజమండ్రి నుంచి నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా యమన్నగర్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మా బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్తున్నా. - ఎండపల్లి వీరవేణి పనిమానేసి వెళ్తున్నా.. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్‌లో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా. మా స్వస్థలమైన కావలి (నెల్లూరు జిల్లా) లో ఓటు వేసేందుకు పనిమానేసి వెళ్తున్నా. - శ్రీనివాస్, శంషాబాద్ -
చరిత్రాత్మక సమరం!
అనేకవిధాల చరిత్రాత్మకమనదగ్గ కీలక ఎన్నికలకు సీమాంధ్ర ప్రాంతం సిద్ధమైంది. అక్కడ 25 లోక్‌సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకూ బుధవారం జరగబోయే ఎన్నికలకు సకల ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయి, ఇక విడిపోవడం లాంఛనప్రాయంకానున్న తరుణంలో వచ్చిన ఈ ఎన్నికలు కేవలం వచ్చే అయిదేళ్ల కాలాన్ని మాత్రమే కాదు..మొత్తంగా ఆ ప్రాంత భవిష్యత్తునే నిర్దేశించబోతు న్నాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన అనేకానేక సంక్షేమ పథకాలను, అభినవ భగీరథుడై అత్యంత సాహసోపేతంగా ఆయన తలపెట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు హృదయాలకు హత్తుకుని 2009లో కాంగ్రెస్‌కు ఇక్కడ రెండోసారి అధికారాన్ని కట్టబెట్టడంతోపాటు 33 లోక్‌సభ స్థానాలను కానుకగా ఇచ్చారు. విపక్షాలన్నీ మహాకూటమిగా ఏకమైనా, సినీ తళుకుబెళు కులతో మరో పార్టీ రంగంలోకొచ్చినా ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కే పట్టంగట్టారు. విశ్వసనీయతకూ, వంచనకూ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో వైఎస్వైపే దృఢంగా నిలబడ్డారు. పాలించేవారికి సహజంగా ఉంటుందనుకునే ‘అధికారపక్ష వ్యతిరేకత’(యాంటీ ఇన్కమ్బెన్సీ ఫ్యాక్టర్) భావనకే తావులేకుండా చేశారు. కానీ, నమ్మి నానబోస్తే పుచ్చిబూరటిల్లినట్టు వైఎస్ కనుమరుగైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానం ఈ రాష్ట్ర ప్రజలపై పగబట్టింది. సర్వ సంక్షేమపథకాలకూ తిలోదకాలివ్వడమే కాదు... ప్రశ్నించేవారు లేరన్న భరోసాతో ఇరుప్రాంతాలమధ్యా వైషమ్యాలను రెచ్చగొట్టింది. రాష్ట్రాన్ని అగ్నిగుం డంగా మార్చింది. ఈ రాష్ట్ర ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని మాత్రమే ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోవాల్సి ఉండగా, నాలుగేళ్లు కాలహరణంచేసి, ఆ కాలమంతా ఇరుప్రాంతాల నేతలతోనూ రెచ్చగొట్టే ప్రకటనలిప్పించి స్వీయప్రయోజనాల కాంక్షతో ఆఖరి క్షణంలో రాష్ట్ర విభజనకు ఉపక్రమించింది. మరోపక్క దీనికి సమాంతరంగా వైఎస్ కుటుంబంపైనా, ప్రత్యేకించి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా కాంగ్రెస్ అధిష్టానం కక్ష రాజకీయాలను కొనసాగించింది. ఓదార్పు యాత్రను విరమించుకోమన్న తమ సలహాను తిరస్కరించారన్న ఏకైక కారణంతో ఆయనను పార్టీలో ఒంటరిని చేయడానికి ప్రయత్నించింది. ఇందుకు నిరసనగా జగన్, ఆయన తల్లి విజయమ్మ కాంగ్రెస్ పార్టీకి, తమ చట్టసభల సభ్యత్వాలకూ రాజీనామా చేయాల్సివచ్చింది. అనంత రకాలంలో జగన్ సారథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. వరస ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కాంగ్రెస్ అధిష్టానం తన ఎమ్మెల్యేతో హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయించి, అందుకు టీడీపీని కూడా తోడుతెచ్చుకుని ఆయనపై వేధింపుల పర్వానికి తెరతీసింది. సీబీఐ ద్వారా అక్రమ కేసులు బనాయించింది. తమకు రెండోసారి అధికారభిక్ష పెట్టారన్న కృత జ్ఞత కూడా లేకుండా వైఎస్ స్మృతికి కళంకం ఆపాదించే పాపకార్యానికి దిగజారింది. కానీ, ఏదీ సాధ్యంకాలేదు. అపారమైన ప్రజాభిమానం ముందు ఏదీ నిలబడలేదు. తాను కోల్పోయిన ప్రజాదరణను మరో ప్రాంతంలో రాబట్టుకోవచ్చునన్న ఏకైక కారణంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర విభ జన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడిక సీమాంధ్ర ప్రాంతం తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సివుంది. నిన్నటివరకూ ఉన్నతవిద్యా అవకాశాలన్నా, ఉద్యోగాలన్నా, ఆరోగ్య సదుపాయాలన్నా కేరాఫ్ అడ్రస్ హైదరాబాదే. ఇకపై వీటన్నిటినీ సీమాంధ్ర ప్రాంతమే సమకూర్చుకోవాల్సివుంటుంది. ఉన్నతస్థాయి విద్యాసంస్థలను, అత్యున్నత శ్రేణి విద్యాబోధనను, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తానే అన్వేషించుకోవాల్సి ఉంటుంది.ఉన్నతస్థాయి ఆరోగ్యసదుపాయాలను ఏర్పర్చుకోవాల్సి ఉంటుంది. సంక్షేమానికీ, అభివృద్ధికీ వైరుధ్యంలేదని...అవి రెండూ పరస్పరాశ్రీతాలు, పరస్పర పూరకాలు అని విశ్వసించి అవి సమానంగా వికసించేలా తన అయిదేళ్ల పాలనలో చర్యలు తీసుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడలే ఆదర్శంగా సీమాంధ్రను తీర్చిదిద్దుతానని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇస్తున్నది. అటు వ్యవసాయాన్ని, ఇటు పరిశ్రమలను ప్రోత్సహించి కొత్త బంగారులోకాన్ని సృష్టిస్తానని చెబుతున్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చగల అయిదు సంతకాలు చేస్తానని వివిధ బహిరంగ సభల్లో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే, కుంటుబడిన పలు పథకాలకు జవజీవాలు కల్పిస్తానని ప్రకటించారు. ఇందుకు భిన్నంగా 2009 ఎన్నికలనాటి ‘ఆల్ ఫ్రీ’ బాణీని చంద్రబాబు కొనసాగించారు. అంతేకాదు...తన చేతుల్లోలేని లక్షన్నర కోట్ల రూపాయల రైతు రుణమాఫీని ప్రకటించే సాహసం చేశారు. నరేంద్ర మోడీని, బీజేపీని నెత్తినెత్తుకుని తనది అవకాశవాద సిద్ధాంతామని రుజువుచేశారు. తన ప్రసంగాలను వ్యక్తిగత దూషణలతో నింపేశారు. ఇంతచేసినా విజయావకాశాలు కాస్తయినా కనబడకపోవడంతో సినీ నటుడు పవన్‌కల్యాణ్ ఇంటికెళ్లి ప్రచారానికి వచ్చేలా ఆయనను ఒప్పించారు. అర్థంపర్ధంలేని పవన్ పలుకులు, హావభావాలు టీడీపీ, బీజేపీలకు లాభంకంటే నష్టాన్నే కొనితెచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలయ్యే వరకూ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడం తమ ఘనతేనని చెప్పుకున్న బాబు అండ్ కో అటుతర్వాత సీమాంధ్రకొచ్చేసరికి స్వరం మార్చింది. ప్రసారమాధ్యమాల ప్రభావం అమితంగా పెరిగిన ఈకాలంలో కూడా నయవంచనకు తెగించింది. విజ్ఞులైన సీమాంధ్ర ఓటర్లు దీన్నంతటినీ గుర్తించారు. ఈ విజ్ఞతను ప్రదర్శించడానికి సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నారు. ఇంకెంత... 24 గంటలు! -
ఆ స్వరం ...సమైక్యం
జనం గొంతుకైన ఒకే ఒక్కడు కటకటాల్లోంచే సమైక్య శంఖారావం దేశమంతటినీ ఒక్కటి చేసేలా ఉద్యమం జాతీయ స్థాయిలో సమైక్యానికి మద్దతు ‘విభజించండి గానీ, సరిహద్దు రాళ్లూ అవీ కాస్త స్పష్టంగా కన్పించేలా వెనకా ముందూ చూసుకుని విభజించండి’ అని చెప్పిన రెండు కళ్ల సిద్ధాంతి ఒకరు ‘విభజిస్తారా?’ అంటూ ఆవేశపడుతూనే, ముఖ్యమంత్రి హోదాలో విభజనకు అన్ని విధాలా సహకరించి తరించిన... ముసుగు వీరుడు, ఉత్తర కుమారుడు మరొకరు కొన్ని ఓట్లు, కాసిన్ని సీట్లే పరమావధిగా హస్తిన పెద్దల పుర్రెలో పురుడు పోసుకున్న పన్నాగంలో సీఎంగా కిరణ్, విపక్ష నేతగా చంద్రబాబు పాత్రధారులుగా మారారు.పుట్టిన గడ్డకే ద్రోహం చేసిన పరమ కిరాతకులుగా, తమ ప్రాంత ప్రయోజనాలు అస్సలు పట్టని పచ్చి స్వార్థపరులుగా చరిత్రలో మిగిలిపోయారు. అలాంటి సమయంలో... ఒకే ఒక్కడు. సీమాంధ్రకు నేనున్నానంటూ ముందుకొచ్చాడు. సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. విలువలకు నిలువెత్తు రూపమతడు. విశ్వసనీయతకు చెరగని చిరునామా అతడు. ఆ ఒకే ఒక్కడు... మహానేత వారసుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. అధికార ప్రతిపక్షాలు ఒక్కటై సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తున్న తీరుపై జగన్ నిప్పులు చెరిగాడు. కుట్రలు చేసి తనను కటకటాల పాలు చేసినా అక్కడి నుంచే పిడికిళ్లు బిగించాడు. అన్నపానీయాలు మాని ఆమరణ దీక్షకు దిగాడు. హస్తిన చేస్తున్న అన్యాయంపై గళమెత్తాడు. సీమాంధ్ర అంతటా కలియదిరిగి సమైక్య శంఖారావం పూరించాడు. జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేసి ఢిల్లీ పాలకులను నిలదీశాడు. అడ్డగోలు విభజనను అడ్డుకోవాల్సిందిగా కోరి దేశమంతటినీ కదిలించాడు. దేవెగౌడ మొదలుకుని శరద్ యాదవ్ దాకా ముఖ్యమైన జాతీయ స్థాయి నేతలందరి గడపా తొక్కాడు. సమైక్యానికి వారందరి మద్దతూ కూడగట్టాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండంటూ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాశాడు. స్వయంగా వెళ్లి వినతిపత్రాలు సమర్పించాడు. విభజనతో వినాశనమేనని సోదాహరణంగా వివరించాడు. విభజన బిల్లును అనుమతించొద్దంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశాడు. సమైక్య తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశపరచండంటూ గవర్నర్‌ను కలిసి కోరా డు. అడ్డగోలు విభజనను నిరసిస్తూ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. పదవులను వదులుకుని సమైక్యోద్యమంలోకి దూకారు. ఆయన మాతృమూర్తి వైఎస్ విజ యమ్మ సమైక్యం కోసం నిరాహార దీక్ష చేశారు. సీమాంధ్ర అంతటా పర్యటించారు. జగన్ సోదరి షర్మిల సీమాంధ్ర అంతటా బస్సు యాత్ర చేపట్టారు. ప్రజల ఆందోళనతో గొంతు కలిపారు. వారి గొం తుకై నిలిచారు. జగన్ స్వయంగా లోక్‌సభలోనూ సమైక్యనాదం చేశారు. సీమాంధ్ర గుండెచప్పుడును చట్టసభల్లో ప్రతిధ్వనింపజేశారు. సమైక్యాంధ్ర చాంపియన్‌గా, సీమాంధ్రకు ఏకైక ఆశాజ్యోతిగా నిలిచారు. వైఎస్ వారసుని రాక కోసం సీమాంధ్ర ప్రజ కళ్లలో వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోందిప్పుడు.. -
మళ్లీ కోడ్ మీరితే లగడపాటి అరెస్టు
సీఈవో భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఎన్నికలు జరగటానికి ముందుగా సర్వేల పేరుతో లగడపాటి తెలంగాణలో వీరు గెలుస్తారు, సీమాంధ్రలో వారు గెలుస్తారు అంటూ మీడియాకు ప్రకటనలు చేయటాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ తప్పుపట్టారు. మరోసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లగడపాటి చర్యలను కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తూ లగడపాటికి నోటీసులు జారీ చేసినట్లు ఆదివారం భన్వర్‌లాల్ విలేకరులకు తెలిపా రు. తెలంగాణలో పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారు ఇంజన్లో కాలిన డబ్బులు పట్టుపడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించినట్లు చెప్పారు. ఆ డబ్బు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కంపెనీకి చెందినదేనని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని, దర్యాప్తులో రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. సీమాంధ్రలో 7వ తేదీన పోలింగ్ సందర్భంగా జిల్లాకు రెండు మూడు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
సీమాంధ్రలో ప్రచారానికి నేటితో తెర
ఆ తర్వాత నుంచి అమల్లోకి ఆంక్షలు హైదరాబాద్: సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడనుంది. మావోయిస్టు ప్రభావిత అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియనుండగా... కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగుస్తుంది. మిగతా 165 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని సాయంత్రం 6 గంటలకు ముగించేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయి. ప్రతీ నియోజకవర్గం పరిధిలో ఓటర్లు కాని బయటి వ్యక్తులు ఉండి ఉంటే, వారిని గుర్తించి అక్కడి నుంచి పంపించేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం హోటళ్లు, లాడ్జిలు, అతిధి గృహాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. -
సమైక్య ఉద్యమ ఏకైక సారథి జగనే..
సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతో అనేక మంది నాయుకులు సీమాంధ్ర జనజీవనంతో ఆటలాడుకున్నారు.. ప్రచారం కోసం ఎన్నో జిమ్మిక్కులు చేశారు. రాష్ట్రం ముక్కలవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకులు నాటకాలాడారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏమవుతుంది.. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చే ప్రమాదముంది. ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి.. అని ఆందోళన చెంది రాష్ట్ర పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేసింది.. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని పోరాటం చేసింది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పి.తిమ్మారెడ్డి అన్నారు. సమైక్య ఉద్యమంలో నేతల పాత్రలపై ఆయన అభిప్రాయాలు ఇవీ... విభజన అంశం ఎన్నో ఏళ్లుగా నానుతున్నా... రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎగసిపడింది. ఇదే అసలైన సమైక్య ఉద్యమవుని చెప్పవచ్చు. అరుుతే జనానికి బాసటగా నిలవాల్సిన పార్టీలు, నేతలు ఉద్యవూన్ని సొవుు్మ చేసుకునేందుకు వుహానాటకాలాడారుు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఇరు ప్రాంతాల్లోనూ తన పార్టీ ఉనికి కోసం రెండు కళ్ల సిద్ధాంతం పేరిట డ్రామాలాడారు. రెండు ప్రాంతాల్లో తవుు్మళ్లతో వీధి పోరాటాలు చేయించారు. అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే సమైక్యసింహవునే స్థారుులో.. క్రికెట్లో చివరి బంతి ఉందంటూ చేసిన హడావుడి అంతాఇంతాకాదు. చివరిరోజు వరకు సీఎం పదవిని అనుభవించి ఆ తర్వాత బయటికొచ్చి ఇప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ అని తిరుగుతున్నారు. కానీ ప్రజలకు ఎవరేమిటో బాగా తెలుసు. అందుకే ఆయన మీటింగ్‌లకు ఎవరైనా వెళ్తున్నారా.. మూడేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని సరిగ్గా నెలరోజులు తిరక్కముందే జనం మరిచిపోయారంటే కిరణ్‌కు జనంలో ఉన్న విలువ ఏపాటిదో స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. జనమే వాళ్ల గురించి ఆలోచించడం లేదు. మరి సమైక్య రాష్ట్రం కోసం నిజమైన పోరాటం చేసిందెవరనే ప్రశ్న వస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డేనని అంతా చెబుతున్నారు. రాష్ట్రా న్ని విడగొట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ జైలులో ఉండి అక్కడే ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని చూసినా ఆయన ఒప్పుకోలేదు. ఓ విధంగా ప్రాణం మీదకు తెచ్చుకుని మరీ సమైక్యం కోసం పోరాటం చేశారు. జైలు నుంచి విడుదలయ్యూక ఆమరణదీక్ష చేపట్టారు. ఇక విజయమ్మ కూడా గుంటూరులో ఆమరణ దీక్ష చేపట్టారంటే సమైక్యం పట్ల వారికున్న నిబద్ధత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబులా జగన్ రెండు ప్రాంతాల్లోనూ పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. ఎక్కడైనా సమైక్యమే నినాదమన్నారు. ఇరు ప్రాంతాల అభివృద్ధే తన ప్రాణమన్నారు. అందుకే జనవుంతా ఆయన్ను సొంతమనిషిగా భావిస్తున్నారు. ఆయున వస్తే నీరాజనాలు పలుకుతున్నారు. పి. తిమ్మారెడ్డి -
కిరణ్.. నిండా ముంచారు
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... సీఎం పదవిని అడ్డుపెట్టుకుని సీమాంధ్ర పాలిట అక్షరాలా సైంధవ పాత్ర పోషించారు. విడదీసేందుకు వీల్లేదని పైకి మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తూనే లోలోన విభజనకు కావాల్సిన రంగాన్నంతా సిద్ధం చేశారు. కేంద్రం ఆడించినట్టల్లా ఆడుతూ, విభజనకు కావాల్సిన సమాచారం దగ్గరి నుంచి అన్ని రకాల సాయమూ ఎప్పటికప్పుడు అం దించి సహకరించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు శల్య సారథ్యం వహించారు. వారి నుంచి అధిష్టానానికి ఎలాంటి ఇబ్బం దులూ తలెత్తకుండా కాపు కాశారు. ‘విభజన బిల్లు రాకముందే మేల్కొందాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ముందుగానే అసెంబ్లీలో తీర్మానం చేద్దాం’’ అని సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా మొత్తుకున్నా కాకమ్మ కథలతో వారించారు. రాజీనామాలన్నా చేద్దామన్నా, ‘అసెంబ్లీలో సమైక్య గళాన్ని ఎవరు విన్పిస్తా’రంటూ దానికీ అడ్డుపడ్డారు. విభజనను ఆపేందుకు బ్రహ్మాస్త్రముంది లెమ్మంటూ బీరాలు పలికారు. చివరికి విభజన బిల్లుపై అసెంబ్లీలో సజావుగా చర్చ జరిగేలా, అది సభ అభిప్రాయంతో పాటుగా రాష్ట్రపతికి తిరిగి వెళ్లేలా దగ్గరుండి అన్ని జాగ్రత్తలూ తీసుకుని తరించారు. -
రెండు ఉపముఖ్యమంత్రి పదవులిస్తా
ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు నెట్వర్క్: తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రకు రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఒకటి బీసీలకు, రెండోది కాపులకు ఇస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఆచంట, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, ఉంగుటూరు.. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, తుని, సామర్లకోట, రంపచోడవరంలలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేందుకు కృషిచేస్తామని, ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, సామాజిక న్యాయం కోసం బీసీలకు ఆమోదయోగ్యమైన రీతిలో కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాను దేశంలోకెల్లా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలో ఐటీ కారిడార్ ఏర్పాటుచేయడంతో పాటు ఏలేరు ఆధునీకీకరణ, సుద్దగడ్డ ముంపు నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికుల రుణాల రద్దు, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవనభృతిగా రూ.5 వేలు, 100 కేజీల బియ్యం, సబ్సిడీపై డీజిల్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దేనికైనా రెడీగా ఉండండి..: ‘ఈ ఎన్నికల్లో గెలవడం మనకు చాలా అవసరం. మీరు దేనికైనా రెడీగా ఉండండి. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలపై కక్ష తీర్చుకోండి. మీకు అండగా నేనుంటాను’ అంటూ చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియాగాంధీ ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు ముక్కలు చేసిందని పేర్కొన్న చంద్రబాబు ఇందులో తన ప్రమేయమేమీ లేదన్నారు. కేంద్రం సహకారం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అదుపు తప్పి మాట్లాడితే సైకిల్‌తో తొక్కించేస్తామని హెచ్చరించారు. -
మాట మీద నిలబడే నాయకుడు కావాలి
సీమాంధ్ర ఇప్పుడు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలి. ఇతర రాష్ట్రాలతో పోటీపడేలా ఎదగాలి. నాలుగేళ్లుగా తెలుగు నేల అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమలంతా హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటయ్యాయి. సీమాంధ్రలో జరగాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. యువ నాయకత్వంతోనే మంచి రోజులొస్తాయని పారిశ్రామికవేత్తలంతా కోరుకుంటున్నారు. మాట మీద నిలబడే వ్యక్తితోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అంటున్నారు హోలీమేరీ, నలంద విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, సప్ల ఆర్గానిక్స్ డెరైక్టర్ ఆరిమంద యామినీరెడ్డి. ఆమె మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె) సీమాంధ్ర శాఖ కార్యదర్శిగా ఉన్నారు. కోవె ద్వారా మహిళలను పరిశ్రమల వైపు ప్రోత్సహిస్తున్నారు. పారిశ్రామికవేత్తలంతా యువ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని యామినీరెడ్డి చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. వైఎస్‌తో మంచి రోజులు వచ్చాయి.. 2004కు ముందు రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య అతిస్వల్పం. వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చాకే మంచి రోజులు వచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించారు. మహిళలు పరిశ్రమలు స్థాపించేందుకు స్థలాలు కేటాయించారు. పరిశ్రమల స్థాపనకు ఇప్పుడు ఎందరో సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ అవసరం పెరుగుతుంది. 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిబ్బరంగా ఉన్నారు. ఆ పాలన మళ్లీ రావాలి.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి వైఎస్ బాటలు పరిచారు. ఉన్నత విద్యను సామాన్యుడి గుమ్మం ముందు నిలిపారు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అయితే కళాశాలలకు మాత్రం నాలుగేళ్లుగా నిధులు ఆలస్యంగా వస్తున్నాయి. వైఎస్ పాలన మళ్లీ వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మహిళా సంఘాలకు రూ.20వేల కోట్ల రుణాలు మాఫీ అయితే వారికి పెద్ద ఊరటే. జగన్‌తోనే సాగు-బాగు సీమాంధ్రలో వ్యవసాయం ఎక్కువ. ఈ రంగాన్ని అర్థం చేసుకున్న నాయకుడే వ్యవసాయాధార పరిశ్రమలను ప్రోత్సహించగలడు. ఐటీ రంగం అంటూ బాబు వ్యవసాయాన్ని విస్మరించారు. వ్యవసాయానికి వైఎస్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన వారసుడిగా జగన్ నాయకత్వంలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కడం ఖాయం. రెండు జిల్లాలకో వ్యవసాయ కళాశాల, ప్రాసెసింగ్ పరిశ్రమలు, అన్ని జిల్లాల్లో శీతల గిడ్డంగులు, రూ.3,000 కోట్ల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్లతో ఏటా ప్రత్యేక నిధి ఏర్పాటు హామీని పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. సామాన్యులకు రాజకీయాలు తెలియవు. వారికి కావాల్సిందల్లా కష్టసుఖాలను అర్థం చేసుకునే నాయకుడు. అండగా ఉంటాడన్న భరోసా వారు కోరుకుంటున్నారు. వైఎస్ అంటేనే 108, ఆరోగ్యశ్రీ. ఈ రెండూ పక్కాగా అమలవ్వాలని ప్రతి ఒక్కరి అభిలాష. మలి వయసులో అన్నం కోసం ఎవరూ చేయి చాచనక్కరలేదని జగన్ హామీ ఇస్తున్నారు. అవ్వా తాతలకు నెలకు రూ.700 పింఛను, వృద్ధాశ్రమాల స్థాపన హామీ ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. -
కాంట్రాక్టర్లకు ‘ఎన్నికల’ నిధులు!
సీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రూ. 550 కోట్లు మంజూరు అత్యున్నత కార్యాలయం ఒత్తిడితో దొడ్డిదారిన ఫైలుకు ఆమోదం మరో ఐదు రోజుల్లో సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు ఆర్థిక ‘వ్యవహారాల’కు శ్రీకా రం చుట్టింది. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం ఒత్తిడి మేరకు, ఒక కేంద్రమంత్రి రంగంలోకి దిగి ఈ అడ్డగోలు వ్యవహారాన్ని నడిపించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసంఎన్నికలు కాంట్రాక్టర్లకు ఏకంగా రూ. 550 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగానే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కళ్లు కప్పి మరీ ఫైలును నడిపించేశారు. దీన్ని బట్టే ఈ తతంగం వెనుక ఎంత పెద్ద శక్తుల హస్తం ఉందో అర్థమవుతోంది. మార్చిలోనే తిరస్కరించిన సీఈవో.. మార్చి నెలాఖరున ఇదే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్ల మేర బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు మార్క్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిధులను విడుదల చేయడానికి భన్వర్‌లాల్ అనుమతి కోరారు. అయితే ఫైలును పరిశీలించిన భన్వర్‌లాల్ ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తే ఆ నిధులు పార్టీలకు చేర తాయని, పార్టీలు ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినియోగిస్తాయనే కారణంతో నిధుల విడుదలకు అంగీకరించలేదు. ఎన్నికలు పూర్తి అయిన తరువాతనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని సంబంధిత ఫైలుపై భన్వర్‌లాల్ స్పష్టంగా రాశారు. పెద్దల ఒత్తిడితో దొడ్డిదారిన ఆమోదం... అయితే ఇప్పుడు పెద్దల ఒత్తిడితో, భన్వర్‌లాల్‌ను తోసి రాజని నేరుగా ఆర్థిక శాఖకు ఫైలును పంపడం ద్వారా నిధుల విడుదలకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల కన్నా ముందుగానే ఈ నిధులను విడుదల చేయించడానికి ఒక కేంద్రమంత్రి స్వయంగా ఇటీవల రాష్ట్ర అత్యున్నత కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. అత్యున్నత కార్యాలయం ఆదేశాల మేరకు సాగునీటి శాఖ ప్రాణహిత - చేవెళ్ల కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్లు విడుదల చేయడానికి కొత్తగా ఓ సమాంతర ఫైలును రూపొందించింది. ఆ ఫైలుకు సీఎస్ మహంతి కూడా ఆమోదం తెలిపారు. గతంలో సీఈవో భన్వర్‌లాల్‌కు పంపి, ఆయన అనుమతి కోరిన సీఎస్.. ఈసారి ఆ పని చేయకుండా నేరు గా ఆర్థికశాఖకు పంపించారు. ఆర్థికశాఖ అధికారులకు నిధులు ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం, కేంద్రమంత్రి ఒత్తిడితో అయిష్టంగా ఆమోదం తెలిపినట్లు చెప్తున్నారు. -
నవ్యాంధ్ర వికాసం
యువనాయకత్వంతోనే జగన్‌పైనే యువత ఆశలు వైఎస్ పథకాలన్నీ మళ్లీ గాడిన పడతాయన్న నమ్మకం బాబు పాలన వద్దంటున్న జనం సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అవమానకరరీతిలో రాష్ట్రం ముక్కలైన తరుణంలో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నూతన రాష్ట్ర వికాసం ఎవరి వల్ల సాధ్యం.. ఏ పార్టీకి పట్టం కడితే తమ జీవితాల్లో మళ్లీ వెలుగులు విరబూస్తాయి.. ఏ నాయకుడికి తోడుంటే తమ కష్టాలు తీరతాయి అన్నవాటిపైనే ఆలోచిస్తున్నారు. వైఎస్ సువర్ణయుగంతో పాటు నవ్యాంధ్ర వికాసం యువనేతతోనే సాధ్యమని వారు విశ్వసిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కాకినాడ రూరల్, అనపర్తి, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’ రోడ్‌షో నిర్వహించారు. ప్రజల మనోగతం వారి మాటల్లోనే.... ఆదివారం ఉదయం కాకినాడ జగన్నాథపురం వంతెన వద్ద నుంచి ‘సాక్షి రోడ్ షో’ మొదలైంది. అంబేద్కర్ సెంటర్లోని టాక్సీ స్టాండ్‌లో ఉన్న కారు డ్రైవర్లు, ఓనర్లను ప్రస్తుత రాజకీయాలపై ప్రశ్నించగా కొందరు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. వారిలో పందిరి రాజు, ఒక్కిబట్ల శ్రీను మాత్రం జగనే రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం ముక్కలైన తరువాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో వచ్చే సీఎం సమర్ధుడు కావాలని, ఆ సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికే తాము మద్దతిస్తామని మరో డ్రైవర్ కె. సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్కడ నుండి సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి వెళ్లాం. అక్కడ మార్కెట్లో ఉన్న సత్తి బాబు, పెంకె గోపి, ఆదినారాయణ, రాయుడులతో మాట్లాడగా తాము టీడీపీవైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. గ్రామంలో సైకిల్‌పై తిరుగుతూ కల్లు విక్రయిస్తున్న రమణను పలకరించగా, ‘తనకు రాజకీయాల గురించి తెలియదని తమ కులపోళ్లు ఎటు చెప్తే అటే ఉంటాననన్నాడు. ఈ సారి వాళ్లు ఫ్యాన్‌కు మద్దతివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అక్కడి నుంచి పెదపూడి మండలం రామేశ్వరం పై కొత్తూరు గ్రామానికి చేరుకున్నాము. ఊళ్లో రోడ్డు పక్కన రైతు చల్లపు రాంబాబుతో మాట్లాడగా తాను జగన్‌కే మద్దతిస్తున్నట్లు తెలిపాడు. అక్కడ నుంచి రామేశ్వరం గ్రామానికి చేరుకున్నాం. అక్కడ మార్కెట్లో రైతు తొండిపూడి వీరభద్ర రాజును కదిలిస్తే తాను వైఎస్ బిడ్డకే మద్దతిస్తానన్నాడు. వైఎస్ హయాంలో రైతులకు భరోసా ఉండేదని తెలిపాడు. ఆ కృతజ్ఞత తనకుందన్నాడు. ఆ తర్వాత అచ్యుతాపురం వెళ్లి గ్రామంలో తాపీ పని చేస్తున్న యువకుడు శ్రీనుతో మాట్లాడగా రాష్ట్రంలో చిన్నవయస్సులో పార్టీ పెట్టి చరిత్ర సృష్టించిన జగన్ వెంటే ఉంటానన్నాడు. గ్రామ చివర ఉన్న దళిత వాడ లో మహిళలతో మాట్లాడగా తమ వాడల్లోకి ఇంతవరకు నాయకులెవరూ రాలేదని.. షర్మిలమ్మ పాదయాత్ర చేస్తూ అక్కడికి వచ్చి తమతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందన్నారు. జగనన్న అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చిందన్నారు. అందుకే ఈ సారి జగన్‌ను గెలిపించుకునేందుకు తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి వేట్లపాలెం వైపు బయలు దేరాం. పొలంలో ఉన్న మార్నె బుచ్చయ్య చౌదరి, మార్నె వెంక ట్రావు, మాడ శివసత్య బాబులతో మాట కలపగా రైతులందరూ వైఎస్ బిడ్డకే మద్దతిస్తారన్నారు. కాస్త ముందుకెళ్లి రైతులు శివరామకృష్ణ, నరసింహారావు, ధర్మారావులతో మాట్లాడగా.. ‘చంద్రబాబు పాలన భయానకమని.. మళ్లీ ఆ రోజులు మా కొద్దు...కలలో కూడా ఊహించని రోజులవి’..అన్నారు. అక్కడ నుండి వేట్లపాలెం గ్రామానికి వెళ్లాం. వెంకటరాజు, వీర్రాజులుతో మాట్లాడగా విడిపోయిన రాష్ట్రం బాగుపడాలన్నా, పేదల బతుకుల్లో వెలుగులు రావాలన్నా జగన్ అధికారంలోకి రావాలన్నారు. జగన్ కొత్తగా ఏమీ చేయనక్కర లేదని, వాళ్ల నాన్న పథకాలు సరిగ్గా అమలు చేస్తే చాలన్నారు. అక్కడ నుంచి సామర్లకోటకు చేరుకున్నాం. అక్కడ రైల్వే స్టేషన్ ఎదుట ఆటో డ్రైవర్లతో మాట్లాడగా రాష్ట్రం ముక్కలైనా ఎవరూ పట్టించుకోనందుననోటా బటన్ నొక్కి వచ్చేస్తానని.. రాజు అనే డ్రైవర్ అన్నాడు. అక్కడి నుంచి కోదండరామపురం గ్రామం వచ్చాం. అక్కడ చెరుకు రసం అమ్మే నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు అంతా జగన్ గాలి వీస్తుందన్నాడు. అదే గ్రామానికి చెందిన ఇక్కుర్తి సాంబశివరావు, కొండిశెట్టి సోమేశ్వరరావు, జనార్ధన్ మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ తప్ప ప్రత్యామ్నాయం లేదన్నారు. అక్కడ నుంచి జల్లూరు గ్రామానికి వచ్చాం అక్కడ హోటల్లో కూర్చున్న పదిమందిలో ఆరుగురు జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. అక్కడ నుంచి ఫకృద్ధీన్పాలెం వెళ్లి షేక్ ఖాజావలితో మాట కలిపితే... వైఎస్సార్ అంటే మైనారిటీలకు మాత్రం నాలుగు శాతం రిజర్వేషన్లు గుర్తుకువస్తాయన్నారు.. అక్కడి నుంచి పిఠాపురం చేరుకున్నాం పిఠాపురం ఆలయానికి వచ్చిన అనంత పద్మనాభశాస్త్రితో మాట్లాడగా, పూజారులకు గౌరవ వేతనం పెరిగింది వైఎస్ హయంలోనేనని... ధూపదీప నైవేద్యాలకు నోచని గుడులకు ఆయన ఆసరాగా నిలిచారన్నారు. వాళ్లబ్బాయి అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. రాపర్తి గ్రామంలో ఎలక్ట్రీషియన్ శ్రీనివాసుతో మాట్లాడగా, కొత్త వాళ్లకు మద్దతివ్వడం గోదావరి జిల్లాలకు అలవాటేనని ఈసారి జగన్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి చిత్రాడకు వెళ్లి సామ్రాజ్యం, జ్యోతి, కస్తూరి, రత్నకుమారిలతో మాట్లాడగా.. వైఎస్ కొడుకుపై కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకు బయటికి వచ్చిన విజయమ్మ తన భర్త ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారన్నారు. జగన్ సోదరి షర్మిల పాదయాత్రతో స్త్రీ శక్తిని లోకానికి చాటిందన్నారు. ఆ కుటుంబం అధికారంలోకి రావాల న్నారు. పండూరు గ్రామంలో రైతులను కదిలిస్తే రైతులెవరూ బాబును నమ్మరన్నారు. బాబు పాలనలో తమ జిల్లాలో కూడా కరువు వచ్చిందని.. వ్యవసాయం కష్టమైపోయిందన్నారు. ఆరోజులను ఎప్పటికీ మర్చిపోలేమని కట్టా మల్లికార్జునరావు, కావూరి సత్యనారాయణ అన్నారు. మరో రైతు నరసింహం.. మాట్లాడుతూ జగన్ వాళ్ల నాన్నలా చేస్తారనే అనుకుంటున్నాం. ఈసారికి ఆయనకే మద్దతిస్తాం... అని స్పష్టం చేశారు. వైఎస్ కార్డుతోనే ఇలా ఉన్నా.. నేను జగన్ కే మద్దతిస్తా... వాళ్ల నాన్న ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతోనే నేను ఈ రోజు నడవగలుగుతున్నా. నా నడుము పడిపోతే కాకినాడ పెద్దాస్పత్రిలో వైఎస్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా ఆపరేషన్ చేయించారు. ఆయన బిడ్డకు మద్దతిచ్చి రుణం తీర్చుకుంటా. - నాగమణి, మాధవ పట్నం -
నేటినుంచి సీమాంధ్రలో జేపీ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఇక సీమాంధ్ర జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. గురువారం నుంచి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రచారం ప్రారంభిస్తారని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, కాకినాడలో, 2న విజయవాడలో, 3న గుంటూరు, ఒంగోలులో, 4న నెల్లూరు, తిరుపతిలో, 5న నంద్యాల, కర్నూలులో ప్రచారం చేస్తారని తెలిపింది. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ డీవీవీఎస్ వర్మలు కూడా వివిధ జిల్లాల్లో రోడ్‌షోల ద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ ప్రకటనలో తెలియజేశారు. -
2న గుంటూరులో సోనియూ సభ
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడేలా కనిపించకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు చేతులెత్తేస్తున్నారు. అక్కడ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం, సమన్వయం తదితర బాధ్యతలన్నీ ఏపీసీసీ నేతలకే వదిలేశారు. పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సైతం ఈ ప్రాంతంలో ఒక్కొక్క సభకే పరిమితమవుతున్నారు. రాహుల్ ఈ నెల 30న హిందూపురంలో, సోనియూమే 2న గుంటూరులో సభలు నిర్వహించనున్నారు. తెలంగాణలో రాహుల్, సోనియాలు రెండు దఫాలుగా ఏడు సభలు నిర్వహించినా సీమాంధ్రలో ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఒక్కొక్క సభకే పరిమితం కావడం విశేషం. వాస్తవానికి వీరిద్దరి సభల విషయంలో అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తిగా లేరు. ‘మా దగ్గర పరిస్థితి బాగోలేదు.. రావద్దు’ అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. సోనియాగాంధీతో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, అనంతపురంలలో సభలు నిర్వహిస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల నేతలతో చర్చించగా ఎవరి నుంచీ ఆశించిన స్పందన రాలేదు. పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ ప్రాబల్యమున్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రధాన కేంద్ర ం విశాఖలోనైనా సోనియాతో సభను నిర్వహించాలని అనుకున్నారు. అయితే క్షేత్రస్థాయి నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోవడంతో జనసమీక రణ సాధ్యం కాదని నివేదికలందడంతో ఏపీసీసీ విశాఖ సభపై పునరాలోచనలో పడింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 32 అసెంబ్లీ స్థానాలకు గాను 24 స్థానాలు కాంగ్రెస్‌వే ఉండేవి. కానీ వలసలతో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారు. ఇక, సోనియా, రాహుల్‌లు పాల్గొనే రెండు సభలకు జన స్పందన ఎలా ఉంటుందోననే ఆందోళన ఏపీసీసీ నేతలను వీడటం లేదు. పార్టీ అగ్రనేతలకే ఈ పరిస్థితి ఉంటే ఇక తామొచ్చి ఏం చేయగలుగుతామంటూ ఏఐసీసీలోని ఇతర సీనియర్లు సీమాంధ్రకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ఎన్నికల సమన్వయానికి గత కొద్దిరోజులుగా దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రులు గులాంనబీ అజాద్, వాయలార్ రవి, జైరాం రమేశ్, మునియప్ప తదితరులంతా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. తెలంగాణలో ఎన్నికలనే ప్రధానంగా భావిస్తూ అక్కడ పోలింగ్ ముగిసేవరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఆ తరువాత కూడా అక్కడే ఉండి సోనియా, రాహుల్ సభలను పర్యవేక్షిస్తారు. మరోపక్క సీమాంధ్రలో ప్రచారానికిగాను చిరంజీవికి పార్టీ ఖర్చుతో హెలీకాప్టర్ ఏర్పాటు చేస్తున్నారు. -
ఏక్సే బడ్కర్ ఏక్
కాక కతలు సెప్తుంటడు. గవి గిప్పటి కతలు గావు. ఎన్కటి జమాన కతలు.అట్లిట్ల జేసి గా కతలను గాయిన గిప్పటి జమానకు గల్పుతుంటడు. గీ నడ్మ మా కాక ఒక కత జెప్పిండు. ఎన్కట ఒక పంతులుండె. గాయినకు పెండ్లాం పిల్లలు లేరు. గాయిన తాన పోరగాండ్లు సద్వుకునెటోల్లు. ఒక దినం పక్కూరుకెల్లి ఒక పోరడు గాయిన తాన్కి వొచ్చిండు. గాడు గున్నకుగున్నున్నడు. రాంగనే గాడు పంతులు కాల్లు మొక్కిండు. నాకెవ్వరు లేరు. మీ తాన సద్వుకునేతందుకొచ్చిన. నన్ను మీ కొడ్కనుకొండ్రి. మీ తాన్నె ఉంచుకొండ్రి అని ఒక్క తీర్గ బత్మిలాడిండు. గాని మాటలకు పంతులు మనసు బరఫ్ లెక్క గర్గింది. నాతాన్నే ఉండి సదువుకో అని గాయిన అన్నడు. గాడు పొద్దుగాల్లే నిద్రలేసెటోడు. ఆకిలూకెటోడు. సాన్పు సల్లి ముగ్గ్గేసెటోడు. పంతులు లెవ్వంగనే యాప్పుల్ల దెంపి ఇచ్చెటోడు. గాయిన మొకం గడ్గంగనే ఛాయ్ ఇచ్చెటోడు. గాయిన తానం జేసెతందుకు చేదబాయిల కెల్లి నీల్లు దోడిచ్చెటోడు. నాస్త బెట్టెటోడు. వొంటజేసెటోడు. పంతులు పండుకుంటె కాల్లు పిస్కెటోడు. గాన్ని పంతులు గూడ కొడ్కులెక్క జూసెటోడు. గా పంతులు తాన ఒక బొంత ఉండేది. గూసున్నా, నిలవడ్డా, పండుకున్నా, గీడున్నా, గాడున్నా ఎప్పుడు గా బొంతను గాయిన ఇడ్సెటోడు గాదు. ఒక్క మినిట్ గూడ ఎవ్వరికి ఇచ్చెటోడు గాదు. గది గాయిన పానం. ఒకసారి పంతులుకు పక్కూర్ల పనిబడ్డది. మీరు మా వూరికే బోదమనుకుంటున్నరు. నేను గూడ మీతోని వొస్త అని గాడు అన్నడు. మంచిది రారా అని పంతులన్నడు. పంతులు బొంత దీసి సంకల బెట్టుకున్నడు. ఇద్దరు గల్సి నడ్సుకుంట పక్కూరికి బోబట్టిండ్రు. ఎండ ఎక్వ ఉండబట్కె చెమ్టతోని ఇద్దరు తోపుతోపైండ్రు. నడ్మల ఒక చెర్వు గండ్లబడ్డది. పంతులూ! పెయ్యంత చీదరచీదరున్నది. చెర్ల తానం జేసొస్త అని గాడన్నడు. చెర్ల దుంకి తానం జేసిండు. నాగ్గూడ పెయ్యి చీదరచీదరగున్నది. నేను గూడ చెర్ల తానం జేస్తే బాగుండు గని గీ బొంత నా పానమసుంటిది. ఏం జెయ్యాలె ? అని పంతులు జెరసేపు సోంచాయించిండు. గీడు నాతాన్నే ఉంటడాయె. నన్నిడ్సి యాడికి బోతడు గీనిక నా బొంత ఇచ్చి చెర్ల తానం జేస్త అని పంతులు మనసుల అనుకుండు. అనుకోని గానికి బొంత ఇచ్చిండు. చెర్లకు దిగిండు. పంతులిట్ల చెర్లకు దిగంగనే బొంత దీస్కోని చెంగోబిల్లన్నడు. పెయి మీద బట్ట పామై గర్సిందని పంతులనుకున్నడు. బొంత బోయిందనే ఫికర్తోనే సచ్చిండు. అసల్ సంగతేందంటె గా బొంత నిండ బంగారమున్నది. బొంతనెత్కబోయెతందుకే గాడు పంతులు తాని కొచ్చిండు. బంగారం తోని గాడు మజా ఉడాయించుకుంట బత్కిండు. కొన్నేండ్లకు గాడు గూడ సచ్చిండు. పంతులు ఎన్టీఆర్గ బుట్టిండు. బొంతనెత్కబోయిన గాడు చెంద్రబాబుగా బుట్టిండు. అని మా కాక కత జెప్పిండు. గీ జల్మల గూడ బాబుకు ఎన్కటి గునం బోలేదన్నడు. ఎప్పటి తీర్గనే గా దినం గూడ పాన్ డబ్బా కాడికి బోయిన. గాడ్కి మా దోస్తులొస్తుంటరు. పాన్ దినెటోడు పాన్ దింటడు. సిగిలేటు దాగెటోడు సిగిలేటు దాగుతడు. ‘ చెంద్రబాబు సీమాంద్రను బంగారి సీమాంద్ర జేస్తనంటున్నడు’అని మా సత్నారి అన్నడు.గానికి మా కాక జెప్పిన కత జెప్పిన. ‘గిప్పుడు గూడ బాబుకు బంగారమంటె శానిస్టమున్నట్టు గొడ్తున్నది.’ అని సిగిలెటు దాక్కుంట మా యాద్గిరి అన్నడు. ‘ గట్లే గొడ్తున్నది బంగారం గాయినకు .. పచ్చంగిలు, పచ్చ జెండలు. పస్కలు కడ్మోల్లకు’ అని పాన్ నమ్లుకుంట సత్నారి అన్నడు. ‘చెంద్రబాబు సైకిల్ గేరు బద్లాయించి స్పీడ్ బెంచుతడట. ఎదురుంగ ఎవ్వరొచ్చిన కిందికి తొక్కుతడట.’ అని మా లచ్చినారి అంటే - ‘ఎవ్వరన్న బుడ్డ మొలతోని గాయిన సైకి ల్ గాలిదీస్తే ఎం జేస్తడు’ అని సత్నారి అడిగిండు.‘బిజెపితోని సోపతి జెయ్యబట్కే మా సైకిల్ గాలి బోయిందని అంటడు’ మా ముచ్చట ఇంటున్న పాన్డబ్బోడన్నడు.‘చెంద్రబాబు కడ్మ పార్టిల లీడర్ల గుండెలల్ల నిద్రబోతనంటున్నడు.’ అనా యాద్గిరి అన్నడు. ‘ముక్యమంత్రి కుర్సి ఉండంగ గది యాడ బోతదో అనే బయంతోని గాయిన నిద్రబోలేడు. గిప్పుడు ముక్యమంత్రి కుర్సి దొరుక్తదో లేదో అనేటి పరేషాన్తోని నిద్రబోతలేడు. ఇగ గాల్ల గుండెల గీల్ల గుండెల గాయిన నిద్రబోయే సవాలే లేదు.’ అని సిగిలేటు ముట్టించుకుంట సత్నారి అన్నడు. ‘గీ పారి సీమాంద్రల తప్పకుంట ముక్యమంత్రినైతనని చెంద్రబాబు అంటున్నడు’ యాద్గిరి పాన్ ఉంచుకుంట అన్నడు. ‘ఏం జేసిండని అయితదడట. పాదయాత్ర జేసినందుకా? ప్రజాగర్జన మీటింగ్‌లు బెట్టినందుకా? కోట్లకు కోట్లున్నోల్లను టిడిపిల శరీక్ జేస్కున్నందుకా? ఎందుకైతడట’ అని పత్నారి అడిగిండు. గీ యాడాది ఆనలు సరిగ గుర్వయి. కర్వుకాలం వొస్తున్నదని బాబుకు ఎర్కైంది. నేను ముక్యమంత్రిగ ఉండంగ దప్పిడ్సి ఎవ్వరు ముక్యమంత్రిగ ఉండంగ కర్వుకాలం రాలేదు. కర్వుకాలమొస్తున్నదంటె నేను ముక్యమంత్రి అయితున్నట్టే గదా అని గాయినంటున్నడు’ అనా యాద్గిరి జెప్పిండు. ‘పవన్‌కల్యాన్ గీయినను జూసి మొకం దిప్పుకున్నా గాయిన ఇంటికి బొయిండు. టిడిపి దిక్కుకెల్లి ప్రచారం జెయ్యుమని ఒక్క తీర్గ బత్మిలాడిండు. మోడి, నువ్వు, నేను ఒక్కతీర్గనేసోంచాయిస్తమన్నడు. మోడి ఈన్న తీర్గ 1+1+1= 3 గాదు 111 అన్నడు.మనం ముగ్గురం గలిస్తేనే 111 అని మల్లొక్కపారి పవన్‌కు జెప్పిండు.’ అని లచ్చినారి అన్నడు. ‘అవ్ పవన్ ఏక్ మోడి గ్యారా చెంద్రబాబు ఏక్సౌగ్యారా. ఏక్సే బడ్కర్ ఏక్. ఏదాంట్ల అంటె ఎన్కకెల్లి పొడ్సుట్ల.’ అని సత్నారి అన్నడు. గీ తీర్గ రాత్రి పదిగొట్టె దాంక ముచ్చట బెట్టి ఎవ్వరింటికి గాల్లు బోయినం. తోక : గాంగ్రెస్ సెంటర్మంత్రి సర్వే సత్యనారాయన ఎలచ్చన్ల ప్రచారం జేస్కుంట దిర్గబట్టిండు. ఒక తాన మీటింగ్బెట్టిండ్రు. కడ్మ లీడర్లు స్పీచ్ గొడ్తుంటే స్టేజి మీద కూసొనే గాయిన నిద్రబోయిండు. ‘అన్న ఐదేండ్లు మంచిగ నిద్రబోయిండు. గిప్పుడు గుడ్క నిద్రబోతె ఎట్లరా బై’ అని గల్లి కాంగ్రెస్ లీడర్ పక్కనున్నోని తోని అన్నడు. -
30న సీమాంధ్రలో నరేంద్ర మోడీ ప్రచారం
హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 30, వచ్చే నెల 1వ తేదీ రెండురోజుల పాటు సీమాంధ్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు. రెండురోజుల్లో మొత్తం ఆరు సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న తిరుపతి, గుంటూరు, మే 1న మదనపల్లి, నెల్లూరు, భీమవరం, విశాఖపట్నం లలో సభలు నిర్వహించనున్నారు. కొన్ని సభలకు జనసేన నాయకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇలావుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్ ఈ నెల 28న సీమాంధ్రలో ఒక రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఏ ఏ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసేదీ ఒకటిరెండు రోజుల్లో ఖరారవుతుందని బీజేపీ నేతలు తెలిపారు. -
కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే
ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నెల్లూరు: ఎలాంటి అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం తమ పార్టీ చేసిన పెద్ద పొరపాటని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను పలువురు నేతలు వీడటంతో పీడ విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. విశ్వాస ఘాతకుడైన కిరణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్వతంత్ర అభ్యర్థులకైనా నాలుగు ఓట్లు వస్తాయని, కిరణ్ పార్టీకి అవీ రావన్నారు. విభజన విషయమై ప్రతిదీ ముందే తెలిసినప్పటికీ తమకెవరికీ చెప్పకుండా మభ్యపెట్టారని విరుచుకుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేశాక తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు కిరణ్ అడ్డు తగిలారని, కేవలం సీఎంగా కొనసాగేందుకే కాలయాపన చేశారని మండిపడ్డారు. కిరణ్ గురించి మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. -
జేఎస్పీ, సీపీఎంల మధ్య కుదిరిన పొత్తు
18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎంకు జేఎస్పీ మద్దతు కిరణ్‌కుమార్‌రెడ్డి, మధు వెల్లడి హైదరాబాద్: సీమాంధ్రలో పోటీ చేసేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), సీపీఎంల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీపీఎంకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో జేఎస్పీ మద్దతు ప్రకటించింది. ఇరుపార్టీల మధ్య పరస్పర అవగాహన కుదిరిందని బుధవారం జేఎస్పీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పి.మధులు ప్రకటించారు. కిరణ్ మాట్లాడుతూ తమ ఆలోచనలకు, సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నందునే సీపీఎంతో ఎన్నికల సర్దుబాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా తాము పనిచేస్తామన్నారు. కాగా, ఎన్నికల్లో తన పోటీపై కిరణ్ దాటవేశారు. మధు మాట్లాడుతూ ఇప్పటివరకు 18 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో సీపీఎం పోటీ చేసేందుకు జేఎస్పీతో సూత్రప్రాయంగా పొత్తు కుదిరింద ని చెప్పారు. -
అఖిలేష్‌తో భేటి తర్వాత వైయస్ జగన్ సమావేశం
-
శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న బంద్
-
నల్లారి వారి తెలివి తెల్లారినట్లే ఉంది
-
బస్సు యాత్రకు బ్రేకులు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ‘తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆర్భాటంగా ప్రారంభించిన బస్సుయాత్రకు బ్రేకులు పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర ఉద్యమం తీవ్రమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో తలపెట్టిన యాత్రను అర్ధంతరంగా వాయిదా వేసుకున్నారు. ఈ నెల 1న గుంటూరు జిల్లాలో ప్రారంభమైన బస్సుయాత్ర కృష్ణా జిల్లాలో పూర్తయిన తరువాత పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సభలకు ఆశించిన స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు హాజరు కాకపోగా... పలు ప్రాంతాల్లో సమైక్యవాదులు నిరసన తెలిపారు. విభజనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ నిలదీశారు. దీంతో పదిరోజులకే ఆయన యాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో బాబు బస్సుయాత్ర ఉంటుందని ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు ప్రకటించారు. అయితే, ఉద్యమకారుల నుంచి నిరసనలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి సీమాంధ్రలో పర్యటన చేయడమేమిటన్న వ్యతిరేకత సర్వత్రా వ్యక్తమవుతోందని జిల్లా పార్టీ నేతలు తాజా పరిస్థితిని వివరించారు. తాము కూడా సహకరించే పరిస్థితులు లేవని స్పష్టంచేయడంతో చేసేదిలేక బాబు తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే, గురువారం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో బాబు అత్యవసర సమావేశం కానున్నారన్న కారణంగానే యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నప్పటికీ గతంలో యాత్ర కొనసాగుతున్న ప్రాంతంలోనే సమావేశాలు నిర్వహించిన విషయాన్ని మరికొందరు నేతలు చెబుతున్నారు. నేడు, రేపు నేతలతో సమావేశాలు చంద్రబాబు తనయడు లోకేష్ బుధవారం పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. దాదాపు 40 మంది నేతలకు ఫోనుచేసి సమావేశంలో తప్పక పాల్గొనాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. సమైక్య ఉద్యమం నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బస్సుయాత్రను విజయవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. చంద్రబాబు కూడా గురువారం ఈ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమవుతారు. -
విభజనపై పార్లమెంటులో వాగ్వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశం పార్లమెంట్ ఉభయ సభల్లో మరోసారి గురువారం ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. విభజనకు నిరసనగా నెలకుపైగా సాగుతున్న సీమాంధ్ర ఉద్యమ తీవ్రతను, తెలంగాణ అంశంపై నాలుగు దశాబ్దాల క్రితం పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించేందుకు ఉండవల్లి ప్రయుత్నించారు. అయితే ఉండవల్లి ప్రసంగాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఉద్యమం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సీవూంధ్ర టీడీపీ సభ్యుడు సీఎం. రమేశ్ రాజ్యసభలో ప్రస్తావించారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కోస్తా,రాయలసీమల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే రాష్ట్రంలో నెల కొన్న ఉద్రిక్తతలపై ప్రసంగించేందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు స్పీకర్ అనుమతించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ఎంపీ లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గందరగోళం ఏర్పడింది. ముల్కీ నిబంధనలు చెల్లుబాటు అవుతాయన్న సుప్రీంకోర్టు తీర్పుతో రాజధానిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకడం తమకు సమ్మతం కాదం టూ సీమాంధ్ర ప్రజలు 41 సంవత్సరాల క్రితం ప్రత్యే క రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, అయితే, మొత్తం సమస్యను జాతీయ దక్ఫధంతో చూడాల్సి ఉంటుం దని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొన్నారని, ఆ డిమాండ్‌ను అంగీకరించలేదని అన్నారు. ఆమె ప్రసం గ పాఠాన్ని వినిపించేందుకు ఉండవల్లి ప్రయుత్నించా రు. అయితే, తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సభ్యులు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోవుటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్యు, ఇటీవల టిఆర్ఎస్లో చేరిన వివేక్, మందా జగన్నాథం, టీడీపీ సభ్యు డు నామా నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం: ఉండవల్లి నెలరోజులుపైగా, రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పార్లమెంట్ ద్వారా మొత్తం జాతికి వివరించేందుకు చేసిన తన ప్రయత్నాలను అడ్డుకొన్న తెలంగాణ ఎంపీల వైఖరి ప్రజాస్వామ్య మౌలికసూత్రాలకే విరుద్ధమని ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. -
తెలంగాణలోనూ వైఎస్సార్సీపీ ఉంటుంది: బాజిరెడ్డి గోవర్ధన్
బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టీకరణ చంద్రబాబు మూడుసార్లు తెలంగాణను మోసం చేశారు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానంటూనే సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకున్నానంటున్నారు ఇరుప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే సమైక్యంగా ఉంచమనే వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే సహించం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అనేక వైఖరులు అవలంభించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉండగా లేనిది తమ పార్టీ ఎందుకుండదని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేసిన నాయకుడని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ ప్రాంతమే అత్యధికంగా లబ్ది పొందిందని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కచ్చితంగా ఉంటుందని చె ప్పారు. వైఎస్‌ను అదరించిన వ్యక్తులు, అభిమానులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసినా, ఈ విషయమై రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా సహించేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు. పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్‌రావు, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావులతో కలసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల విషయంలో తమ పార్టీ మొదటినుంచీ ఒకే వైఖరి అవలంభిస్తున్న విషయం బాజిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనిపక్షంలో సమైక్యంగా ఉంచమని చెబుతోందే తప్ప ఇతర పార్టీల మాదిరిగా ప్రాంతాల వారీగా వైఖరులను అవలంభిస్తూ ప్రజలను గందరగోళ పరచడంలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన విషయం ఆయన గుర్తుచేశారు. న్యాయంగా వ్యవహరిస్తున్న పార్టీపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరమేంటో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఉండగాలేనిది వైఎస్సార్సీపీ ఎందుకుండదు? ‘తెలంగాణ ప్రాంతాన్ని మూడుసార్లు మోసం చేసిన చంద్రబాబు ఒకపక్క విభజనకు లేఖ ఇచ్చానని చెబుతూనే.. మరోపక్క సీమాంధ్రలో యాత్ర చేస్తూ తెలంగాణను అడ్డుకున్నది తానే అని చెబుతున్నారు. అలాంటి టీడీపీ, ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసగించిన బీజేపీ రెండు ప్రాంతాల్లో ఉండగాలేనిది, వైఎస్సార్సీపీ ఎందుకు ఉండదు?’ అని బాజిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు...సీమాంధ్రలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ఎండగట్టడం లేద ని ఆయన నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర నేతలను ఎందుకు బహిష్కరించ డంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
మూడు నెలల్లోనే తెలంగాణ
సిద్దిపేట, న్యూస్‌లైన్: ‘చెన్నారెడ్డి అంత గొప్ప మేధావి దేశంలోనే లేడు.. సీమాంధ్రులు ఆయన్ను సంవత్సరం కూడా సీఎంగా పనిచేయనీయ లేదు.. కేంద్రంలో మైనార్టీలో ఉన్నా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన పీవీ నర్సింహారావు వంటి మేధావిని అలాగే చేశారు.. 60 ఏళ్ల ఆంధ్రపదేశ్ పాలనలో తెలంగాణ నుంచి ముగ్గురే సీఎం లుగా పని చేశారంటే సీమాంధ్ర పాలనలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. నాడు ఇందిరాగాంధీ చేయలేని సాహసాన్ని సోనియా గాంధీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేశారు’ అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల సహా య మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శనివారం సిద్దిపేటకు వచ్చిన ఆయన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజ లు మేలు చేస్తే మరచిపోరని.. అలాగని మోసం చేస్తే వది లి పెట్టే పరిస్థితి ఉండదన్నారు. అప్పట్లో బీజేపీని బ్లాక్ మెయిల్ చేసిన టీడీపీ తెలంగాణ రాకుండా అడ్డుకున్న దన్నారు. అమ్మ స్వభావం, మనస్తత్వం తనకు తెలుసునని, తెలంగాణ ఇస్తే ఆంధ్రలో సీట్లు పోతాయని తెలి సినా ఇచ్చిన మాటకు కట్టుబడినట్లు చెప్పారు. సీడబ్ల్యూ సీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. రెండు, మూడు నెలల్లోనే తెలంగాణ ఏర్పడుతుందన్నారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఎందుకు ఉద్యమించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. హైదరాబాద్‌ను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించిన సీమాంధ్ర బడా బాబులు, వ్యాపారులు, కొందరు బ్రోకర్లే అక్కడ స్టేజి షోలు చేయిస్తున్నారని విమర్శించారు. వీహెచ్‌పై దాడిని ఆయన ఖండిస్తూ, ఇలాంటి సంఘటనలు వారికే నష్టమన్నారు. నరేంద్రమోడీ వెంట లీడర్.. క్యాడర్ ఏది లేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, పీసీసీ కార్యదర్శి గంప మహేందర్‌రావు తదితరులు కేంద్ర మంత్రి సర్వేను సన్మానించారు. -
ఊరు వాడ ఉద్యమం 11th Aug 2013
-
కొత్త రాష్ట్రాలకు సీఎంలు ఎవరన్నదానిపై ఆసక్తి
-
అవసరమైతే రాజీనామాలు: సీమాంధ్ర మంత్రులు
-
అడగని విభజనపై అడుగులెందుకు?