
వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు
సీమాంధ్రలో అసెంబ్లీ ఫలితాలపై ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్
హైదరాబాద్: సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ముందంజ అని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 46 శాతం ఓట్లు, టీడీపీకి 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. ఈ లెక్కన వైఎస్సార్ కాంగ్రెస్ 80 నుంచి 100 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంద ని తేల్చింది. అలాగే టీడీపీకి 75-90 వరకు రావొచ్చని తెలిపింది. ఇతరులు 5 నుంచి 15 స్థానాలు గెలుపొందుతారని సర్వే స్పష్టం చేసింది.
లోక్‌సభ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు సమానంగా 45 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 12, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి 13 స్థానాలు వస్తాయని తెలిపింది. బుధవారం ప్రసారం చేసిన ఈ ఎగ్జిట్ పోల్ సందర్భంగా చర్చాగోష్టిలో పాల్గొన్న వక్తలు మాత్రం ఫలితాలు ఏకపక్షంగా జగన్ వైపే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలకన్నా వైఎస్సార్ సీపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ది హిందూ గ్రూపు చైర్మన్ ఎన్.రామ్ పేర్కొన్నారు.