వైఎస్సార్‌సీపీదే విజయం: మైసూరా | general election win by ysrcp : maisura reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీదే విజయం: మైసూరా

Published Thu, May 15 2014 1:38 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

వైఎస్సార్‌సీపీదే  విజయం: మైసూరా - Sakshi

వైఎస్సార్‌సీపీదే విజయం: మైసూరా

 హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ 110 నుంచి 125 శాసనసభ, 20కి పైగా లోక్‌సభ స్థానాలను ఖాయంగా గెల్చుకుంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత ఓటింగ్ సరళిపై తమ పార్టీ అంతర్గతంగా ‘ఎగ్జిట్ పోల్’ సర్వే నిర్వహించిందని, దాని ప్రకారమే తమకు వచ్చే స్థానాల సంఖ్యపై ఇంత ధీమాగా చెప్పగలుగుతున్నామని అన్నారు. తమ అంచనా నూటికి నూరు శాతం నిజం అవుతుందని పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైసూరా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజ కీయ పార్టీ అయినా ప్రజా తీర్పును శిరసావహించక తప్పదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తాము కూడా అంగీకరిస్తున్నామని అన్నారు. అయితే స్థానిక ఎన్నికలపై పూర్తిగా స్థానిక  పరిస్థితులు, స్థానిక నాయకత్వం తీరు తెన్నులు ప్రభావం చూపుతాయని, పైగా ఎన్నికలు జరిగేది కూడా తక్కువ ఓట్ల పరిధిలోనే అని ఆయన చెప్పారు. ఒక ఎంపీటీసీ అంటే 2 వేల ఓట్ల లోపే ఉంటాయని, ఇందులో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. అరుుతే స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు మధ్య అనేక రాజకీయ పరిణామాలు, సమీకరణలు చోటు చేసుకున్నాయని, ఇవన్నీ ఓటర్ల దృక్పథంలో మార్పు తీసుకువచ్చాయని తెలిపారు.

 స్థానిక ఓట్ల శాతంలో తేడా చాలా స్వల్పం

 వైఎస్సార్‌సీపీ కొత్త పార్టీ అనీ, అయినప్పటికీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి దీటుగా నిలబడగలిగిందని మైసూరా అన్నారు. తమ పార్టీ కొంత వెనుకబడినా టీడీపీతో పోల్చితే తేడా చాలా స్వల్పమేనన్నారు. తమ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కన్నా 4 శాతం, మండల, జడ్పీ ఎన్నికల్లో 3.07 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని ఆయన గణాంకాలను వివరించారు. కొన్ని జిల్లాల్లో అయితే ఆ తేడా మరింత తక్కువగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement