సీమాంధ్ర, తెలంగాణలో వ్యవసాయ రుణాలు ఎంతమేర ఉన్నాయి, ఈ విషయంలో ఎలాంటివైఖరి అవలంబించాలనే దానిపై గురువారం నిర్వహించే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణలో వ్యవసాయ రుణాలు ఎంతమేర ఉన్నాయి, ఈ విషయంలో ఎలాంటివైఖరి అవలంబించాలనే దానిపై గురువారం నిర్వహించే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా సీమాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కానున్న ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.