Power Ministry
-
ఎలక్ట్రిక్ వాహనదారుల కష్టాలకు చెక్.. జోరుగా ఈవీ స్టేషన్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వాహనాల(ఈవీల)కు డిమాండ్ ఊపందుకోవడంతో వాటి చార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా ఇప్పుడు దేశమంతటా పెరుగుతూ పోతున్నాయి. కేవలం గత నెల నాలుగు నెలల్లోనే మెట్రో సిటీల్లో వీటి సంఖ్య రెండున్నర రెట్లు పెరగడమే ఇందుకు ఒక ఉదాహరణ. సూరత్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో చార్జింగ్ స్టేషన్లు గణనీయంగా పెరిగాయని సెంట్రల్ పవర్ మినిస్ట్రీ తెలిపింది. ఈ 9 నగరాల్లో అక్టోబర్ 2021 నుంచి జనవరి 2022 మధ్య కాలంలోనే అదనంగా 678 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశంలోని 1,640 పబ్లిక్ ఈవీ ఛార్జర్లలో దాదాపు 940 ఈ నగరాల్లోనే ఉన్నాయని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్టు వెల్లడించింది. 4 మిలియన్లకు పైగా జనాభా ఉన్న 9 మెగా నగరాలపై ప్రభుత్వం మొదట్లో తన దృష్టిని పెంచింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల జనవరి 14, 2022న ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను జారీ చేసింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ప్రైవేటు కంపెనీలతో పాటు బీఈఈ, ఈఈఎస్ఎల్, పీజీసీఐఎల్, ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలూ ఈ వ్యాపారంలోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పొందడానికి సౌకర్యవంతమైన ఛార్జింగ్ నెట్ వర్క్ గ్రిడ్ అభివృద్ధి చేయడానికి ఈవి ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. మెట్రో సిటీల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ బలంగా ఉన్నందున, ప్రభుత్వం దశలవారీగా ఇతర నగరాలకు కవరేజీని విస్తరించాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు, జాతీయ రహదారులపై 22,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో ప్రకటించాయి. వీటిలో10 వేల స్టేషన్లను ఐఓసీఎల్ ద్వారా.. 7000 స్టేషన్లు బీపీసీఎల్ ద్వారా.. మిగిలిన 5000 స్టేషన్లు హెచ్‌పీసీఎల్ ద్వారా ఇన్స్టాల్చేస్తారు. (చదవండి: పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను వీడని కష్టాలు..!) -
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్రం బలవంతం చేస్తోందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు మంగళవారం 'అపోహలు-వాస్తవాలు' పేరిట కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని తాము ఏ రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. సౌర విద్యుత్ కొనుగోలు చేయాలంటూ రాష్ట్రాలను ఒత్తిడి చేయడంలేదని వివరించింది. ఓపెన్ బిడ్ ల ద్వారానే కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. విద్యుత్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్ల అంశం రాష్ట్రాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పునరుత్పాదక విద్యుత్ కొనాలని తాము ఎక్కడా చెప్పలేదని, కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. అసలు, ఫలానా వారి నుంచే విద్యుత్ కొనాలని చెప్పలేదని, ఏ రాష్ట్రం ఎవరినుంచైనా కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది. సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్రం విమర్శించింది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పుగా ఇచ్చాయని, కేసీఆర్ అందుకు రుణపడి ఉండాలని హితవు పలికింది. ఇది చదవండి: కేసీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా, చర్చకు సిద్ధం! కానీ.. -
కేంద్రం పవర్ గేమ్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం– 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. (చదవండి: ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!) రాష్ట్రాల అధికారాలకు కత్తెర ఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేయబోతోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్ఈఆర్సీ)ల చైర్మన్, సభ్యులను.. కేంద్రం నియమించే కమిటీ ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఏవైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. విద్యుత్ చట్టం సవరణలు అమల్లోకి వస్తే ఆ అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత విధానంలో రాష్ట్రాలు నియమించుకుంటున్న ఈఆర్సీ చైర్మన్, సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని, దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపినట్లు ఎస్ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఇకపై కేంద్రం నియమించనుందని, దీంతో వీరి నిర్ణయాలు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ప్రైవేటీకరణకు రాచబాట! విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి. ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియామకమైన వ్యక్తి/సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యులు కానున్నాయి. ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనకపోతే జరిమానా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50 పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది. ఏటేటా బిల్లుల వాత.. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం పేర్కొంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను వచ్చే ఏడాదికి సర్పాజ్ చేసుకుంటూ పోతున్న ప్రస్తుత విధానానికి ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. ఈ నిబంధలను అమలు చేస్తే ఏటా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం.. ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నివాస గృహాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, హెయిర్ కటింగ్ సెలూన్స్ తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన కొంత సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుండగా, మిగిలిన భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీలను నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేకుండానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రానుంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం క్రాస్ సబ్సిడీల భారం మోస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే కేటగిరీల వినియోగదారులకు ఈ విధానంతో భారీ ఊరట లభించనుంది. మరోవైపు క్రాస్ సబ్సిడీల ఆదాయానికి గండిపడటంతో ఆ మేరకు చార్జీల భారం సైతం సబ్సిడీ వినియోగదారులైన గృహాలు, ఇతర వినియోగదారులపైనే పడనుంది. వ్యవసాయ కనెక్షన్లకు సైతం మీటర్లు పెట్టి బిల్లులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ టారిఫ్ పాలసీ వస్తేనే విద్యుత్ సబ్సిడీల విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. ప్రస్తుతం ఇలా.. భవిష్యత్తులో ఎలా.. ఇప్పుడు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసల నుంచి రూ.9.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. నెలకు 50 యూనిట్లు మాత్రమే వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 100 యూనిట్ల లోపు వినియోగిస్తే 51–100 యూనిట్లకు రూ.2.45 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్లు దాటితే తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున టారిఫ్ ఉంది. వినియోగం 300 యూనిట్లు దాటితే రూ.7.20, 400 యూనిట్లకు చేరితే రూ.8.50, 400–800 యూనిట్ల వినియోగానికి రూ.9, 800 యూనిట్లు దాటితే రూ.9.50 చొప్పున ధరతో టారిఫ్ వసూలు చేస్తున్నారు. (చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు) తక్కువ విద్యుత్ వినియోగించే పేదలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీల అమలును నిలిపేయాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్) ఆధారంగా ఆయా కేటగిరీల వినియోగదారులకు టారిఫ్‌ను నిర్ణయించాలని ఈ బిల్లులో కేంద్రం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటున రూ.7.02 వరకు వ్యయం అవుతోంది. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, తదితర కేటగిరీలకు ఈ వ్యయంలో స్వల్ప తేడాలుంటాయి. ఆయా కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు లేకుండా పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టుకోవాలని కొత్త బిల్లు చెబుతోంది. అంటే, యూనిట్‌కు రూ.7, ఆపై చొప్పున టారిఫ్‌ను వినియోగదారులందరూ చెల్లించాల్సి రానుంది. దీంతో ప్రస్తుతం నెలకు వందల్లో బిల్లులు చెల్లిస్తున్న గృహ, ఇతర కేటగిరీల బిల్లులు ఒక్కసారిగా రూ.వేలకు పెరగనున్నాయి. -
ఈ-వాహనాలు తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని పరిధిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలను సంప్రదాయ కార్లకు స్వస్తి పలికి ఎలక్ర్టానిక్ వాహనాలకు మళ్లాలని ఇంధన మంత్రిత్వ శాఖ కోరింది. 2030 నాటికి వాహన ట్రాఫిక్‌లో 30 శాతం బ్యాటరీలపై నడిచే వాహనాలు ఉండాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల ఎలక్ర్టికల్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన ముందుకొచ్చింది. పలు మంత్రిత్వ శాఖలకు ఇంధన వనరుల మంత్రి ఆర్కే సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎలక్ర్టిక్ వాహనాలకు మళ్లాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. తొలిదశలో జాతీయ రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ శాఖలు, పీఎస్‌యూల్లో ఎలక్ర్టిక్ వాహనాలను ప్రవేశపెడతారు. విద్యుత్ మంత్రిత్వ శాఖలోని పీఎస్‌యూలతో కలిసి పనిచేసే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎస్) ఇప్పటికే 10,000 ఎలక్ర్టిక్ వాహనాలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలను కూడా పలు ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్టు లేఖలో ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
స్టార్.. స్టార్... దగా స్టార్
విజయవాడ నడిబొడ్డున ముఖ్యనేత భూదందా ⇒ రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్‌కో భూమికి ఎసరు ⇒ 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలవాలని ఆదేశం ⇒ సర్వే ప్రారంభించిన పర్యాటక శాఖ అధికారులు ⇒ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ అభ్యంతరాలు బేఖాతరు ⇒ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట బినామీ సంస్థకు ధారాదత్తం! ⇒ కొంతకాలం తర్వాత చినబాబుకు అప్పగించేలా ఒప్పందం విజయవాడ నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వ భూమి. అందులో ఒక బ్రహ్మాండమైన ఐదు నక్షత్రాల హోటల్ నిర్మించే బాధ్యత ఓ ప్రముఖ హోటల్ నిర్వహణ సంస్థది. వాళ్లు ఆ హోటల్ నిర్మించి, కొంతకాలం పాటు లాభాల బాటలో నడిపించిన తర్వాత చినబాబుకు కట్టబెడతారు. ఇదీ చినబాబు వేసిన అదిరిపోయే స్కెచ్. అంటే కాణీ ఖర్చు లేకుండా రాజధాని నగరంలో చినబాబు ఖాతాలో ఖరీదైన హోటల్ పడబోతోందన్నమాట. ఈ భూమి ప్రస్తుతం విద్యుత్ శాఖ అధీనంలో ఉంది. చినబాబు స్కెచ్ వేయగానే భూమిని స్వాధీనం చేసుకుని, ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు పర్యాటక శాఖ అధికారులు సర్వే ప్రారంభించారు. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో చినబాబు, ప్రభుత్వ పెద్దలు ఏపీ ట్రాన్స్‌కో– ఏపీఎస్పీడీసీఎల్కు చెందిన రూ.200 కోట్ల విలువైన 4.80 ఎకరాల భూమిని బినామీల ముసుగులో హస్తగతం చేసుకునేందుకు పథకం వేశారు. లీజు పేరిట 99 ఏళ్లకు దక్కిం చుకునేందుకు పన్నాగం పన్నారు. అందు కోసం అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటక శాఖ ద్వారా రంగంలోకి దిగారు. ట్రాన్స్‌కో, సదరన్ డిస్కం ఉద్యోగుల అభ్యం తరాలను కూడా వారు లెక్కచేయడం లేదు. మరోవైపు తాము ఈ భూదందాలో కేవలం పావులమేనని, అసలు బాగోతం అంతా ప్రభుత్వ ముఖ్యనేతదేనని పర్యాటక శాఖ వర్గాలు చెబుతుండడం గమనార్హం. లోపాయికారీ ఒప్పందం రాజధానిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చేందుకు స్టార్ హోటళ్లు నిర్మించే ముసుగులో ఆ 4.80 ఎకరాలను దక్కించుకోవాలని ముఖ్యనేత వ్యూహం పన్నారు. ఇప్పటికే స్టార్ హోటళ్లు నిర్వహిస్తున్న ఓ కార్పొరేట్ సంస్థతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని ప్రకారం... సదరు సంస్థకు 99 ఏళ్ల లీజు పేరిట ఆ 4.80 ఎకరాలను కట్టబెడతారు. ఆ సంస్థ చినబాబుకు బినామీగా ఉంటూ స్టార్ హోటల్‌ను నిర్మించాలి. దాన్ని కొంతకాలం నిర్వహించిన అనంతరం పూర్తిగా చినబాబుకే అప్పగించాలి. ట్రాన్స్‌కోకు సమాచారం లేదు స్టార్ హోటల్ నిర్మాణానికి వీలుగా 4.80 ఎకరాలను లీజుకు ఇచ్చేందుకు వెంటనే టెండర్లు పిలవాలని పర్యాటక శాఖను ముఖ్యనేత కార్యాలయం ఆదేశించింది. ట్రాన్స్‌కో, ఏపీ ఎస్పీడీసీఎల్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భూమి అప్పగించకుండా తాము టెండర్లు ఎలా పిలుస్తామని పర్యాటక శాఖ అధికారి ఒకరు సందేహం వ్యక్తం చేశారు. అదంతా తాము చూసుకుంటామని, టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు మొదలుపెట్టాలని ముఖ్యనేత స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా ఉంటే పెద్దలతో మాట్లాడుకోండి ముఖ్యనేత ఆదేశాలతో పర్యాటక శాఖ రంగంలోకి దిగింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోని భూమిని శుక్రవారం సర్వే చేసింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. తమ సంస్థకు చెందిన భూమిని పర్యాటక శాఖ సర్వే చేయడమేమిటని ప్రశ్నించారు. ఆ భూమిని పర్యాటక శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తాము సర్వే చేస్తున్నామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు ఏదైనా ఉంటే సచివాలయంలో పెద్దలతో మాట్లాడుకోవా లని, తమ సర్వేను అడ్డగించవద్దని తేల్చిచెప్పారు. స్టార్ హోటల్‌పై చినబాబు మక్కువ విజయవాడ ఏలూరు రోడ్డులోని గుణదలలో విద్యుత్తు సౌధ భవన ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలో దాదాపు 4.80 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 1952 నుంచి అప్పటి రాష్ట్ర ఎలక్ట్రికల్ బోర్డు అధీనంలో ఈ భూమి ఉంటూ వచ్చింది. ఏపీఎస్ఈబీని విభజించిన తరువాత ఈ భూమిని ఏపీ ట్రాన్స్‌కో, సదరన్ డిస్కంలకు ఉమ్మడిగా కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్ ధర రూ.40 కోట్లకు పైమాటే. ఆ లెక్కన మొత్తం భూమి మార్కెట్ విలువ దాదాపు రూ.200 కోట్లు. ఖాళీగా ఉన్న ఈ విలువైన భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్న చినబాబు ఆ భూమిలో ఓ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ముఖ్యనేత ఓ కార్పొరేట్ సంస్థ ముసుగులో చినబాబు స్టార్ హోటల్‌కు అడ్డంకుల్లేకుండా ఎత్తుగడ వేశారు. ప్రైవేట్‌కు అప్పగిస్తే ట్రాన్స్‌కోకు తీవ్ర నష్టం రాష్ట్ర విభజన అనంతరం మౌలిక వసతులు లేక ట్రాన్స్‌కో, ఏపీఎస్సీడీసీఎల్ సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగుల శిక్షణ కేంద్రం, ఆర్అండ్డీ కేంద్రం కూడా లేవు. విజయవాడలో నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఎస్పీడీసీఎల్ భవనం ఉంది. ఆ భవనాన్ని ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. విద్యుత్తు సౌధ ప్రాంగణంలోనే ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లకు భవనాలను నిర్మించాలని యోచిస్తున్నారు. కానీ, తమ సంస్థలకు చెందిన భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం ఏమిటని ట్రాన్స్‌కో, ఎస్పీ డీసీఎల్ అధికారులు, ఉద్యోగులు నిలదీస్తున్నారు. ట్రాన్స్‌కోకు నష్టాన్ని కలిగించే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ట్రాన్స్‌కో ఇంజనీర్ల అసోషియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సంఘ ప్రతినిధి కోటేశ్వరరావు డిమాండ్ చేస్తున్నారు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం ‘‘ఈ భూమి ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ ఉమ్మడి ఆస్తి. ఎస్పీడీసీఎల్కు సొంత భవనం లేదు. భవిష్యత్తులో ట్రాన్స్‌కో అవసరాలు పెరుగుతాయి. అప్పుడు మేము ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లాలా? ట్రాన్స్‌కో చెందిన విలువైన ఆస్తిని ప్రైవేటుకు కట్టబెడతారా? ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’ – ఉదయ్‌కుమార్, ట్రాన్స్‌కో ఇంజనీర్ల సంఘం అదనపు కార్యదర్శి -
పండుగ తర్వాత ‘పవర్’ షాక్!
-
పండుగ తర్వాత ‘పవర్’ షాక్!
18న ఏపీఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు రూ.7,122 కోట్ల లోటును పూడ్చుకునే ప్రయత్నం సాక్షి, అమరావతి: సంక్రాంతి తర్వాత విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) కొత్త విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీన విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సమర్పించ నున్నాయి. రెండు డిస్కమ్‌లకు కలిపి రూ.7,122 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి. వినియోగదారులపై టారిఫ్‌ల పిడుగు పరోక్ష రాబడిపై కూడా విద్యుత్ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 2016–17కి కొత్త శ్లాబుల వర్గీకరణను తెరపైకి తెచ్చారు. 2015–16లో విద్యుత్ వినియోగం 900 యూనిట్లు దాటిన వారిని తర్వాత శ్లాబులోకి తీసుకెళ్లి దొంగ దెబ్బతీశారు. ఇప్పుడు ఈ శ్లాబ్ పరిధిని 600 యూనిట్లకు కుదించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించే వీలుంది. అంటే వినియోగదారుడు ఏడాదికి 600 యూనిట్లు విద్యుత్ వాడితే... నెలకు (యూనిట్‌కు రూ.1.45 చొప్పున) రూ.72.50ల బిల్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 601 యూనిట్లు వినియోగిస్తే అప్పుడు వినియోగదారుడు తదుపరి శ్లాబులోకి వెళ్తాడు. అంటే ప్రతి యూనిట్‌కు రూ.2.45 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల నెలకు రూ.122.50 వరకూ (అదనంగా రూ.50) బిల్లు వస్తుంది. యూనిట్ల శ్లాబును 900 నుంచి 600కు తగ్గించడం వల్ల దాదాపు 3.5 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. మిగులు విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ కొనగోళ్లను ప్రోత్సహిస్తోంది. యూనిట్ సగటున రూ.5.25 చొప్పున కొనుగోలు చేస్తోంది. వీటివల్లే విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ భారీగా ఆర్థిక లోటు ఏర్పడింది. దీన్ని వినియోగదారుల నుంచే రాబట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
ఛేంజ్ ఇస్తేనే మీటర్ ఎక్స్ఛేంజ్
♦ పాత విద్యుత్ మీటర్ మార్చేందుకు రూ.200 డిమాండ్ ♦ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం ♦ ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు నెల్లూరు (టౌన్): వెంకటాచలం మండలం కాకుటూరులో రాపూరు హరిబాబు నివాసం ఉంటున్నారు. ఇంటికి విద్యుత్ పాత మీటరు ఉండటంతో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటరను అమర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు గురు వారం ఇంటికి వచ్చారు. అయితే రూ. 200లు ఇస్తేనే కొత్త మీటరు బిగిస్తామని స్పష్టం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో మీటరు మార్చకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సమస్య ఒక హరిబాబుకే కాదు.. జిల్లాలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ ఉంది. రీడింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు విద్యుత్ శాఖ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించింది. రీడింగ్‌ను పరికరం సహాయంతో స్కానింగ్ చేయడంతో కచ్చితమైన రీడింగ్ వస్తుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పాత మీటర్ల స్థానంలో కొత్తగా ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు పంపిణీ చేశారు. జిల్లాలోని గృహ సర్వీసులకు సంబంధించి చెడిపోయిన మీటర్లతో పాటు పని చేస్తున్న మీటర్ల స్థానంలో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును మార్చే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 9 లక్షల 60 వేలకు పైగా గృహ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో మీటర్లను మార్చే బాధ్యతను ఒక్కో డివిజన్లో ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. తొలుత ఒక మీటరు మార్పునకు రూ.20లు సంబంధిత కాంట్రాక్టర్లుకు విద్యుత్‌శాఖ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ధర సరిపోదని చెప్పడంతో మీటరు మార్పునకు రూ.70లను పెంచి ఆధర ప్రకారం చెల్లిస్తున్నారు. మార్పునకు రూ.200లు చెడిపోయినా, పాత మీటర్లు ఉన్నా వాటి స్థానంలో వినియోగదారుల నుంచి ఎలాంటి పైసా తీసుకోకుండా ఉచితంగా ఐఆర్డీఏ పోర్డ్ మీటరును మార్చాల్సి ఉంది. అయితే సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్లు మీటరు మార్పునకు వినియోగదారుడి నుంచి రూ.200లు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.70లతో పాటు అదనంగా వినియోగదారుడు నుంచి రూ. 200లు వసూలు చేసి రెండు చేతులతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కు మీటరు మార్పు విషయంలో కాంట్రాక్టర్లు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న నగదులో అధికారులుకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఇంటికి వచ్చి నేరుగా డబ్బులు వసూలు చేసే ధైర్యం ఉందంటే వారికి అధికారుల అండ కూడా కచ్చితంగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా మీటరు మార్పునకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుని డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు అడిగినంత డబ్బులు ఇచ్చి మీటరును మార్చుకుంటే డబ్బులు ఇవ్వని వినియోగదారులు మీటర్లు మాత్రం యథాతథంగానే ఉన్నా యని చెబుతున్నారు. జిల్లాలో గృహాలకు ఉన్న 9 లక్షల 60వేలు మీటర్లకు సగం మంది దగ్గర రూ. 200లు వసూలు చేసినా రూ. 8 కోట్లుకు పైగానే వసూలవుతుందని విద్యుత్‌శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో ముమ్మరంగా మీటర్లు మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీటరు మార్పునకు డబ్బు వసూలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని వినియోగదారులు కోరుతున్నారు. మీటరు మార్పునకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీటర్లను మార్చేందుకు ఆయా డివిజన్లు వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించాం. మీటరు మార్చినందుకు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు వసూలు చేస్తున్నారన్న విషయం తెలియదు. ఈ విషయంపై విచారణ జరిపి వసూలు చేస్తున్నారని తేలితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కళాధరరావు, ఎస్ఈ ట్రాన్స్‌కో -
జూన్ నాటికి శాఖమూరులో రిజర్వాయర్ పార్కు
- రాజధాని వ్యవహారాల సమీక్షలో ముఖ్యమంత్రి - బుధవారం నుంచి వెలగపూడి కార్యాలయానికి సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నగరానికి అలంకారంగా నిలిచే శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. సెంట్రల్ పార్కుగా అభివృద్ధి చేస్తున్న ఈ రిజర్వాయర్ ప్రాంతాన్ని అత్యుత్తమ వాటర్‌ఫ్రంట్ పార్కుగా తీర్చిదిద్దాల్సివుందని, వివిధ దేశాల నగరాల్లోని నమూనాలను పరిశీలించి ఉత్తమ ఆకృతిని ఎంపిక చేయాలని సూచించారు. నీరుకొండ నుంచి ఉండవల్లికి వెళ్లే మార్గంలో ఉన్న 24 కిలోమీటర్ల కొండవీటి వాగు వాటర్‌ఫ్రంట్ నిర్మాణాన్ని కూడా వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో రాజధాని వ్యవహారాలపై సీఆర్డీఏ, సీసీడీఎంసీ అధికారులు, కన్సల్టెంట్లతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. 97 హెక్టార్లలో ఉన్న శాఖమూరు రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా సుందరమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దితే అది రాజధానికి మకుటాయమానంగా మారుతుందని చెప్పారు. రోడ్ క్రాస్ సెక్షన్ ఆకృతులపై సమావేశంలో అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. విద్యుత్, ఇతర అవసరాలకు ఉపయోగించే అంతర్ వాహికల (డక్ట్స్) ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సివుందని చెప్పారు. రాజధానిలోని ప్రతి ఇంట్లోనూ వర్షం, వరద నీరు భూమిలోకి నేరుగా ఇంకిపోయే ఏర్పాటు ఉండి తీరాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రహదారుల విషయంలో వైట్ టాప్ రోడ్ల నిర్మాణానికే నిపుణులు మొగ్గు చూపారని, వీటివల్ల 15 శాతం వ్యయం అధికమైనా ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని శ్రీధర్ తెలిపారు. వెలగపూడిలో ముఖ్యమంత్రి కార్యాలయ ఇంటీరియర్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు చెప్పగా వచ్చే బుధవారం నుంచి విధులకు హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థుల ఫీజులు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఇస్తున్నామని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కరెంటు చార్జీల పెంపు ఖాయమే రాష్ట్రంలో కరెంటు చార్జీల పెంపు అనివార్యమని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్‌లు) తేల్చారుు. ప్రజలపై ఎంత భారం మోపాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారుు. సర్కారు ఇచ్చే రారుుతీ ఎంతో తెలిస్తే పెంపు స్పష్టమవుతుంది. విద్యుత్ శాఖ 2017-18 వార్షిక ఆదాయ అవసర నివేదికలపై విజయవాడలో బుధవారం సీఎం సమక్షంలో చర్చలు జరిగారుు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం.నేరుగా చార్జీల భారం మోపకుండా పరోక్ష విధానాలను అనుసరించాలని, విద్యుత్ సంస్థల ఆదాయాన్ని పెంచాలని ఆయన సూచించారు. -
రబీలో పగలే 9 గంటల విద్యుత్
విద్యుత్ శాఖకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి మంచి వర్షాలు కురిసినందున రబీ లో రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రబీలో ప్రతి ఎకరాలో పంట సాగు చేసే అవకాశం ఉన్నందున, వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్లపై సోమవారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్రావులతో సీఎం సమీక్ష జరిపారు. మంచి వర్షాల వల్ల బావుల్లో నీరు నిండిందని, భూగర్భ జల మట్టాలు కూడా బాగా పెరిగాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పంపుసెట్ల ద్వారానే ఎక్కువగా సాగు జరుగుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. డిమాండ్‌ను బట్టి విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంత డిమాండ్ ఉన్నా సరే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభాకర్ రావు.. సీఎంకు తెలిపారు. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి గురించి కూడా కేసీఆర్ సమీక్షించారు. థర్మల్ కేంద్రాలతో పాటు శ్రీశైలం, అప్పర్ జూరాల, లోయర్ జూరాల, పోచంపాడు, సింగూరు ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రబీ నాటికి రాష్ట్రంలో అన్ని రకాలుగా తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని, మరో వెరుు్య మెగావాట్లు ఛత్తీస్‌గఢ్ నుంచి అందుతుందని సీఎం వెల్లడించారు. రబీలో రైతుల అవసరాల మేరకు విద్యుత్ సరఫరా జరిగేటట్లు కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. -
రోడ్లన్నీ ఛిన్నాభిన్నం
- రాష్ట్రంలో 1,500 కిలోమీటర్లకుపైగా దెబ్బతిన్న రహదారులు - దెబ్బతిన్న వంద కల్వర్టులు, వంతెనలు - 200 ప్రాంతాల్లో భారీగా కోత.. 43 చోట్ల గండ్లు - నష్టం ప్రాథమిక అంచనా రూ.500 కోట్లకుపైనే! సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురికాగా.. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల పొడవునా ఆనవాళ్లు కూడా లేనంతగా పాడైపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు భవనాల శాఖ ఆధీనంలోని 1,000 కిలోమీటర్లకుపైగా రహదారులు, పంచాయతీ రాజ్ శాఖ అధీనంలోని 582 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని... మొత్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నా.. భారీ వరద వస్తే బలహీనంగా ఉన్న చోట రోడ్లు నిలిచే పరిస్థితి లేదు. భారీగా దెబ్బతిన్న కల్వర్టులు రాష్ట్రవ్యాప్తంగా 100 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. 200 చోట్ల వంతెనలు, కల్వర్టు గోడలు దెబ్బతిన్నాయి. 71 ప్రాంతాల్లో రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. వెయ్యి కిలోమీటర్ల మేర రహదారులు బాగా దెబ్బతిని గుంతలు పడ్డాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నష్టం ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 248 కి లోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 43 చోట్ల రోడ్లకు గండ్లుపడ్డాయి. కొత్త వంతెనలు, కల్వర్టుల నిర్మాణం కోసం వాహనాలను దారి మళ్లింపునకు నిర్మించిన తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. మెదక్ జిల్లా ఖన్సాన్పల్లి-ఖదీరాబాద్ రోడ్డు, కావెలి-కోహిర్-తుర్మామిడి రోడ్డుపై ఉన్న వంతెనలు కిలోమీటరు మేర ధ్వంసమయ్యాయి. కొడకల్-జగదేవ్‌పూర్ మార్గంలో రోడ్డు కొట్టుకుపోయింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.50 కోట్లు రోడ్లు దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో.. యుద్ధప్రాతిపాదికన తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేసి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. దీంతో రోడ్లు భవనాల శాఖ దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టింది. కాగా రహదారులకు జరిగిన నష్టంపై రోడ్లు భవనాల శాఖ మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తోంది. బాగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులు కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రహదారులు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ అధికారులు సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు తొమ్మిది జిల్లాల్లో 582 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.21.63కోట్లు అవసరమని, శాశ్వత మరమ్మతుల కోసం మరో రూ.126.03 కోట్లు కావాలంటూ అధికారులు నివేదిక సమర్పించారు. మొత్తంగా రూ.147.66కోట్లు విడుదల చేయాలని విన్నవించారు. భారీ వర్షాల నేపథ్యంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ ఈఎన్సీ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. అత్యవసర కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ శాఖలు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాయి. ప్రజల నుంచి వచ్చే ఫోన్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉండటంతో పాటు.. అందుకు అనుగుణంగా స్పందించే యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్‌ల వద్ద అధికారులు సిద్ధంగా ఉంచారు. సచివాలయంలో 040-23454088, జీహెచ్ఎంసీలో 21111111, విద్యుత్ శాఖలో 1912100, 7382072104, 7382072106, 9490619846, నీటిపారుదల శాఖలో 040-23390794 నంబర్లకు ఫోన్లు చేయాలని తెలిపారు. -
‘కరెంట్’లో నిర్లక్ష్యానికి పరిహారం
సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిందే.. లేదంటే వినియోగదారులకు రూ.100-4000 వరకు పరిహారం చెల్లించాలి - పరిహారం మొత్తాన్ని 90 రోజుల్లో విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలి - కొత్త ప్రమాణాలను జారీ చేసిన ఈఆర్సీ సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలతో విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేసినా కరెంటోళ్లు సకాలంలో స్పందించడం లేదా? కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కోసం వారాల తరబడి జాప్యం చేస్తున్నారా? ఇంట్లో చెడిపోయిన విద్యుత్ మీటర్‌ను మార్చమంటే పట్టించుకోవడం లేదా? ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి విద్యుత్ శాఖ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, పౌర సేవలు అందించడంలో విఫలమైతే బాధిత వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరులో కచ్చితంగా అమలు చేయాల్సిన కొత్త ప్రమాణాలను ప్రకటిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా నిర్వహించిన బహిరంగ విచారణల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా.. డిస్కంల పనితీరు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కొత్త ప్రమాణాలను జారీ చేస్తున్నట్లు ఈఆర్సీ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారులకు రూ.100 నుంచి రూ.4 వేల వరకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ ప్రమాణాల అమలు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లింపుపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది. పరిహారం మొత్తం బిల్లులో సర్దుబాటు ఈఆర్సీ ఆదేశాల ప్రకారం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత, మీటర్లు, బిల్లులు, ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదులను వినియోగదారుల సేవా కేంద్రాల వద్ద డిస్కంలు నమోదు చేసుకోవాలి. ప్రమాణాల అమలుపై వినియోగదారుల వారీగా సమాచారాన్ని క్రోడీకరించాలి. ఒకవేళ ప్రమాణాల మేరకు సేవలు అందించకుంటే 90 రోజుల వ్యవధిలో నిర్దేశించిన పరిహారాన్ని సంబంధిత వినియోగదారుడు/వినియోగదారులకు చెల్లించాలి. అయితే నగదు రూపంలో కాకుండా పరిహారాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయాలి. పరిహారం చెల్లించే విషయంలో డిస్కంలు విఫలమైతే వినియోగదారులు ‘ఫోరం ఫర్ రిడ్రస్సల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్స్(సీజీఆర్ఎఫ్)ను సంప్రదించవచ్చని ఈఆర్సీ పేర్కొంది. కొత్త కనెక్షన్ జాప్యమైతే ఒక్కో రోజుకు పరిహారం వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కొత్త కనెక్షన్‌ను మంజూరు చేయాలి. తర్వాత జరిగే జాప్యంపై ఒక్కో రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కనెక్షన్ కోసం లైన్ల విస్తరణ చేయాల్సి ఉంటే... ఎల్టీ కనెక్షన్‌ను 30 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.200), హెచ్‌టీ 11 కేవీ కనెక్షన్‌ను 45 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.400), హెచ్‌టీ 33 కేవీ కనెక్షన్‌ను 60 రోజుల్లో(లేకుంటే ఒక్కోరోజుకి రూ.1000 పరిహారం), ఎక్స్ట్రా హెచ్‌టీ సప్లైను 180 రోజుల్లో(లేకుంటే ఒక్కో రోజుకి రూ.1000 పరిహారం) మంజూరు చేయాలి. ఇతర ప్రమాణాలు ఇవీ.. ► యాజమాన్య పేరు మార్పు, కేటగిరీ మార్పులను 7 రోజుల్లో పరిష్కరించాలి. లో టెన్షన్ సింగిల్ ఫేజ్ నుంచి లో టెన్షన్ త్రీ ఫేజ్‌కు 30 రోజుల్లో మార్చాలి. ► విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి. అదనపు సమాచారం అవసరమైతే 7 రోజుల సమయం తీసుకోవచ్చు. ఉల్లంఘిస్తే మాత్రం రోజుకి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి. ► సరిగ్గా పనిచేయని మీటర్లపై ఫిర్యాదులను పట్టణ ప్రాంతాల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో పరిష్కరించాలి. లేదంటే రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాలి. ► విద్యుత్‌కు అంతరాయం కలిగించాల్సి ఉంటే 24 గంటల ముందే వినియోగదారులకు తెలియజేయాలి. రోజుకు 12 గంటలకు మించి కోత ఉండొద్దు. సాయంత్రం 6 గంటల్లోపు సరఫరాను పునరుద్ధరించాలి. దీన్ని ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారుడు ఒక్కడే అయితే రూ.400లు, ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరికి రూ.200 పరిహారం చెల్లించాలి. -
ఎన్నికల చట్టంలో సవరణకు ఆమోదం
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎన్నికల చట్టం(సవరణ) బిల్లు, 2016ను న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2002 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభలో... 8 బొగ్గు శాఖకు చెందిన నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 29న సమ్మె చేస్తున్నట్లు నోటీసులిచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. యూనియన్లతో చర్చలు జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజ్యసభలో... 8 సివిల్ సర్వీసు పరీక్షలకు సంబంధించి వివిధ అంశాల అధ్యనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆగస్టులో నివేదిక అందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. -
విద్యుత్ శాఖ తీరుపై అనుమానాలు
తప్పు చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది: కోదండరాం కప్పిపుచ్చుకోడానికి ఎదుటివారి నోరు మూయించడం సరికాదు మీడియాతో మాట్లాడొద్దన్న ట్రాన్స్‌కో సర్క్యులర్ రాజ్యాంగ విరుద్ధం సర్వీరు రూల్స్ పేరుతో ఉద్యోగుల హక్కులను హరించడం తగదు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: ‘‘ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యల నిబంధనలను పునరుద్ధరించడం సమంజసం కాదు. తద్వారా విద్యుత్ శాఖ ఏదో తప్పు చేసిందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు నోరు మూయించజూస్తోందనే అభిప్రాయం కలుగుతోంది. ఇది చాలా అన్యాయమైన పద్ధతి. విద్యుత్ ఉద్యోగులు మీడియాతో మాట్లాడొద్దనే సర్క్యులర్ ఏ పరిస్థితుల్లో తెచ్చారో అందరికీ అర్థమవుతూనే ఉంది’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ విద్యుత్ రంగంలో ఇటీవలి పరిణామాలపై ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు... ఉద్యోగులు మీడియాతో మాట్లాడొద్దన్న ట్రాన్స్‌కో సర్క్యులర్‌పై టీజేఏసీ స్పందన ఏమిటి? బ్రిటిష్, నిజాం కాలపు సర్వీసు రూల్స్‌నే ఇంకా అమలు చేస్తున్నారు. కానీ ప్రస్తుత సందర్భంలో సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి రాజ్యాంగం ప్రకారమే నడచుకోవాలి. సర్వీసు రూల్స్ పేరుతో పౌరుల హక్కులను కుదించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొంది. హక్కులను ఉపయోగించుకునే పరిస్థితి లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థగా నిలబడలేం. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునే కదా తెలంగాణ సాధన కోసం పోరాడినం. ఆ హక్కుల వల్లే తెలంగాణ సాధ్యమైంది. అవసరమైనప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తాం. ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లడం తప్పా? అదీ రాజ్యాంగబద్ధమైన సంస్థే. వారు ఈఆర్సీకి వెళ్లడం విద్యుత్ సంస్థలకే ప్రయోజనకరం. బాధ్యత గల ఉద్యోగి ఎవరైనా అదే చేయాలి. ఒప్పందంలో తప్పులుంటే దిద్దుకోడానికి అవకాశముంటది. ఈఆర్సీకి వెళ్లడాన్ని తప్పుబట్టడం చాలా అన్యాయం. దీనిపై జేఏసీలో చర్చిస్తాం. ఇలా చేయాల్సింది కాదని ట్రాన్స్‌కో సీఎండీతో మాట్లాడుతాం. అధికారుల స్పందన అనంతరం భావి కార్యాచరణ రూపొందిస్తాం. ఛత్తీస్ పీపీఏపై ఈఆర్సీలో పిటిషన్ వేసిన విద్యుత్ రంగ నిపుణుడు, ట్రాన్స్‌కో ఇంజనీర్ కె.రఘును ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బదిలీ చేసింది! ఈఆర్సీకి వెళ్లినందుకు సత్కరించాల్సింది పోయి ఇలా వేధించడం దుష్ట సంప్రదాయమ ని భావిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉద్యోగులు ఎన్నోసార్లు ఈఆర్సీకి వెళ్లారు. ఎన్నడూ ప్రభుత్వాలు అక్షేపించలేదు. ఆక్షేపించినా మేం తిప్పికొట్టాం. ఈఆర్సీని ఏర్పాటు చేసిందే ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష కోసం! తెలంగాణ వచ్చాక టీజేఏసీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందా? ఎందుకు? అదేమీ లేదు. ఏ కీలక సమస్య మీదా మేం మౌనంగా లేము. హైకోర్టు, ఉద్యోగుల విభజన వంటి అన్ని సమస్యలపై స్పందించాం. జేఏసీలో చురుకుదనం లోపించిందా? ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావిస్తున్నారా? మీ ప్రశ్న ‘కాసేపు ఊపిరి పీల్చుకోవడం ఆపుతారా?’ అన్నట్టుంది. హక్కులు, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలకు విరామముండదు. జేఏసీ అన్ని కార్యక్రమాలనూ కొనసాగిస్తుంది. -
విద్యుత్ శాఖకు పెరిగిన ఎల్టీ ఆదాయం
విజయనగరం మున్సిపాలిటీ: ఓ వైపు మండుటెండలతో పెరిగిన వినియోగం, మరో వైపు పెరిగిన యూనిట్ చార్జీలతో ఎల్టీ సర్వీసుల ద్వారా విద్యుత్ శాఖకు ఈ నెల ఆదాయం పెరిగింది. విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే. దీంతో ఈనెల విద్యుత్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 5లక్షల 75వేల ఎల్టీ సర్వీసులు ఉన్నాయి. వాటి ద్వారా బిల్లుల రూపంలో రూ 14 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. మే నెలలో వినియోగించిన విద్యుత్‌కు జూన్ నెలలో బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల ఎల్టీ సర్వీసుల ద్వారా వచ్చే ఆదాయం రూ19 కోట్లకు పెరిగింది. సర్కిల్ సీనియర్ అకౌంట్స్ అధికారి జి.వెంకటరాజు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇకపై సరాసరి ప్రతి నెల రూ18 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు. హెచ్‌టీ సర్వీసుల ఆదాయం రూ 4 కోట్లు తగ్గుదల: హెచ్‌టీ సర్వీసుల ద్వారా విద్యుత్ శాఖకు రావాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోంది. ఇందుకు జిల్లాలో అత్యధికంగా ఉండే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడుతుండటమే కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 243 వరకు హెచ్‌టీ సర్వీసులుండగా వాటి ద్వారా గతంలో రూ 42.50 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. జూన్ నెలలో చెల్లించాల్సిన మే నెల వినియోగం బిల్లులను పరిశీలిస్తే ఆదాయం రూ 38.50 కోట్లకు పడిపోయింది. ఈ లెక్కన విజయనగరం ఆపరేషన్‌సర్కిల్ పరిధిలో రూ 4 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడడం వల్లే ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. జిల్లాలోని జయలక్ష్మి ఫెర్రో అల్లాయిస్ , బెర్రి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు మూతపడగా.. డెక్కన ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ లైటింగ్ వినియోగానికే మాత్రమే విద్యుత్‌ను వాడుతున్నాయి. దీంతో అధిక మొత్తంలో విద్యుత్ వినియోగించే పరిశ్రమలు మూతపడటంతో విద్యుత్ శాఖ ఆదాయం తగ్గుతోంది. -
బకాయిల పంచాయతీ!
కర్నూలు(రాజ్‌విహార్) : దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుగొమ్మలు. అయితే ప్రస్తుతం పల్లెల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. విద్యుత్ బిల్లులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ శాఖ షాక్ ఇస్తోంది. బకాయి అధికంగా ఉన్న గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా విదల్చడంలేదు. పైగా పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించుకోవాలని సూచించడం కొత్త సమస్యకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 13వ ఆర్థిక సంఘం నిధులను కరెంటు బిల్లులకు ఉపయోగించబోమని, బిల్లులకు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలని గ్రామ సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, సర్పంచుల మధ్య నలుగుతున్న ఈ సమస్య కారణంగా బకాయిలు రూ. 92.49 కోట్లకు చేరాయి. ఇందులో రూ.6.70 కోట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందినవి కాగా మిగిలినవి మేజర్, మైనర్ పంచాయతీలవి ఉన్నాయి. జిల్లాలోని 918 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు (స్ట్రీల్ లైట్స్), వాటర్ వర్క్ (మంచినీటి సరఫరా)కు ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించిన బిల్లులను పంచాయతీలే చెల్లించాలి. అయితే వీటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. కాని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి కోసం విడుదల చేసే 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో సర్పంచులు ఎదురుతిరిగారు. ఆ నిధులు గ్రామాల అభివృద్ధికే ఉపయోగించుకుంటామని, కరెంటు బిల్లులకు సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేయాలని రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోతున్నాయి. బకాయిలపై విద్యుత్ శాఖ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్ ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో గ్రామ పంచాయతీల బకాయిలను తీవ్రంగా పరిగణించారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అత్యధిక బకాయిలు ఉన్న పంచాయతీలపై దృష్టి సారించారు. ఇప్పటికే కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీతోపాటు శ్రీశైలం, సున్నిపెంట, ఆదోని, నంద్యాల, డోన్ డివిజన్లలోని మరిన్ని గ్రామాల్లో వీధి దీపాలకు సరఫరా నిలిపివేశారు. -
విద్యుత్ ఉద్యోగులకు ఆరు లక్ష్యాలు
సిబ్బందికి ఇంధన శాఖ నిర్దేశం పనితీరే భవితకు ప్రామాణికం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ఇంధన శాఖ ఆరు లక్ష్యాలను నిర్దేశించింది. పని తీరే భవిష్యత్తుకు ప్రామాణికమని తేల్చి చెప్పింది. రాబోయే నాలుగేళ్లలో ఉద్యోగులు, సంబంధిత కంపెనీలు నిర్ణీత లక్ష్యాలను సాధించాలని స్పష్టంచేసింది. ప్రస్తుత వేతన సవరణ ఉద్యోగుల పనితీరు, ప్రమాణాలకు లోబడి ఉంటుందని తెలిపింది. 2017-18 నాటికి విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలను రెండు శాతం తగ్గించాలని, ఏటా నూటికి నూరు శాతం బిల్లులు వసూలు చేయాలని సూచించింది. దీంతో పాటు ప్రస్తుతం జెన్కో అధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటా సగటున 85 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (వాస్తవ సామర్థ్యంలో విద్యుత్ ఉత్పాదకత)ను సాధించాలని నిర్దేశించింది. వేతన సవరణకు అధికారికంగా అనుమతిస్తూ... ఉద్యోగ సంఘాలతో ఒప్పందం చేసుకునేందుకు రాసిన లేఖలో ఇంధన శాఖ ఈ లక్ష్యాలను ప్రత్యేకంగా పొందుపరిచింది. ‘‘నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, చేపట్టబోయే ప్లాంట్ల అంచనా వ్యయం పెరిగిపోకుండా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. నిర్వహణ ఖర్చులు, సాధారణ మరమ్మతుల వ్యయాన్ని రాబోయే నాలుగేళ్లలో ఏటా 5 శాతం చొప్పున తగ్గించాలి. ప్రతి కేటగిరీలో ఏటా 5 శాతం చొప్పున మీటర్ సేల్స్ పెంచాలి’’ అని లేఖలో ఇంధన శాఖ పేర్కొంది. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, డిస్కంల పరిధిలో పని చేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ వేతన సవరణ అమలు చేస్తున్నట్లు ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణకు ఆదేశాలు జారీ చేశారు. 15 ఏళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు. పెన్షనర్లు, వారి కుటుంబీకులకు కూడా 30 శాతం ఫిట్మెంట్ ప్రయోజనం వర్తించే పెన్షన్‌కు అంగీకరించారు. ఈ వేతన సవరణకు అధికారికంగా అనుమతి జారీ చేస్తున్నట్లు ఇంధన శాఖ టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్కోకు లేఖ రాసింది. భవిష్యత్తు పీఆర్సీపై పీటముడి భవిష్యత్తులో విద్యుత్ విభాగానికి ప్రత్యేకంగా పీఆర్సీ ఉండదని ఇంధన శాఖ ఇదే లేఖలో స్పష్టం చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పీఆర్సీతో అనుసంధానమై ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధనను విద్యుత్ శాఖలోని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. మంగళవారం టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు వేతన సవరణ ఒప్పందంపై గుర్తింపు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇంధన శాఖ లేఖలోని అంశాలన్నింటికీ సమ్మతి తెలిపిన ఉద్యోగ సంఘాలు... ప్రత్యేక పీఆర్సీ తొలగింపు నిబంధనపై మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపాయి. 327, 1104, టీఎన్టీయూసీ సంఘాల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు. రేయిం బవళ్లు.. ఆకస్మిక విధులు నిర్వహించే విద్యుత్ విభాగానికి ఇప్పుడున్న పీఆర్సీ యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. -
కేజీబీవీల్లో నిరంతర విద్యుత్‌కు చర్యలు
విశాఖపట్నం : జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూర్భాగాందీ బాలికా విద్యాలయాలకు (కేజీబీవీ) 24 గంటలూ విద్యుత్ ఉండేలా ఎస్ఎస్ఏ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సింగిల్ ఫేస్‌తో నడుస్తున్న 18 కేజీబీవీలకు 24 గంటలూ విద్యుత్ సరఫరా ఉండేలా త్రీ ఫేస్ అమర్చుతున్నారు. తొలుత కశింకోట, గొలుగొండ కేజీబీవీలకు ఈ సౌకర్యం కలగనుంది. త్వరలో త్రీ ఫేస్ దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్‌శాఖ అధికారులతో ఎస్ఎస్ఏ ఇంజినీరింగ్ అధికారులు మాట్లాడి త్రీ ఫేస్‌కు టాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సమకూర్చాలని కోరారు. ఇందుకు అవసరమైన ఖర్చును ఎస్ఎస్ఏ అధికారులు భరిస్తారు. ప్రస్తుతం కశింకోట, గొలుగొండ మండలాల్లో ఉన్న కేజీబీవీలకు త్రీఫేస్ విద్యుత్ సమకూర్చనున్నారు. సింగిల్ ఫేస్‌తో చదువుకోవడానికి బాలికలు ఇబ్బంది పడుతున్నారు. రాత్రిళ్లు విద్యుత్ సదుపాయం లేనప్పుడు మరుగుదొడ్లకు వెళ్లడానికి అవస్థలు పడడాన్ని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలలకు త్రీఫేస్ ఇచ్చేందుకు ఇప్పటికే విద్యుత్‌శాఖకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. మిగతా కేజీబీవీలకు త్వరలోనే త్రీ ఫేస్ సౌకర్యం కల్పించనున్నారు. వీరు తీసుకున్న చొరవతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
తీరు మారాలి
జిల్లా వ్యవసాయరంగం పైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని రైతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల ఆయకట్టు కంటే బోర్ల ఆధారంగా పండించే పంటలే ఎక్కువ. ఈ సమయంలో పంటలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులపై ఉంది. ఎట్టి పరిస్థితులలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు కరెంటు సరఫరా చేసి తీరాల్సిందే. అధికారుల తీరు మారకపోతే చర్యలు తప్పవు. - వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీలను అడిగి సరి చూసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇవ్వడం లేదని, డీడీలు కట్టి ఏళ్లు గడస్తున్నా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని, నెలలు గడిచినా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మత్తులు చేసి ఇవ్వడం లేదని ఆరోపించారు. అనం తరం మంత్రి పోచారం మాట్లాడుతూ, జిల్లాలో అత్యధికంగా కరెంట్ బోర్‌వెల్స్ ఉన్నాయని, మూడు లక్షల పంపుసెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 7.50 లక్షల ఎకరాల లో రైతులు పంటలు పండిస్తున్నారన్నారు. వర్షాలు కురవనందున రైతులు బోర్లపై ఆధారపడి పంటలు వేశారని, ఇలాంటి సమయంలో ఏడు గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఫోనెత్తరేం రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదనే ఫిర్యాదులు చాలా వస్తున్నాయని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రైతులు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని, సబ్స్టేషన్లలో ఆపరేటర్లు కూడా ఉండటంలేదన్నారు. పై నుంచి కరెంట్ వచ్చినా, పోయినా పట్టించుకునేవారు కరువయ్యారని, అందుకే విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు. భయంతో కాకుండా భక్తితో పని చేయాలని, ఎట్టి పరిస్థితులలోనూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయద్దని సూచించారు. పడిపోయిన స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ తీగలను వారం రోజులలో సరిచేయాలని ఆదేశించారు. ‘‘నేను పగలు రాత్రి గ్రామాలలో తిరుగుతూనే ఉంటా అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే ఏఈలను బాధ్యులను చేస్తా’ అని హెచ్చరించారు. డీడీలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు లో వోల్టేజ్ సమస్య ఉందని, అదనపు ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు డీడీలను నెలలు, సంవత్సరాలుగా తమ జేబులలో పెట్టుకుని తిరుగుతున్నారని, కాలిపోయిన వాటికి కూడా సకాలంలో మరమ్మత్తులు చేయకపోవడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీడీల జాబితాను తయారు చేసి వాటిని వెంటనే పరిష్క రించాలని ట్రాన్స్‌కో ఏస్ఈ ప్రభాకర్రావునును ఆదేశించారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడినా ఊరుకోనన్నారు. లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి హెచ్‌వీడీఎస్ పథకం కింద రూ. 20 కోట్లతో కొత్త ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు అనుమతి ఉన్నా, కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి, వారికి వెంట వెంటనే పేమెంట్లు చేసి, నవంబర్‌కల్లా అన్ని నియోజకవర్గాలలో ఫీడర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులలో అవకతవకలను ట్రాన్స్ఫార్మర్లు, ఆయిల్, కాయిల్స్ చోరీలను నియంత్రించాలన్నారు. పని చేసే చోటే నివాసముండండి అధికారులందరూ పనిచేసే మండలాలోనే నివాసముండాలని మంత్రి సూచించారు. సబ్స్టేషన్లలో కేటగిరివారీ ఉద్యోగుల వివరాలు అందజేయాలని ఏఈలను ఆదే శించారు. రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ పథకం కింద కరెంటు స్తంభాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు, వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి,ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం పాల్గొన్నారు. -
నేడు బ్యాంకర్ల భేటీలో రుణాలపై చర్చ
హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణలో వ్యవసాయ రుణాలు ఎంతమేర ఉన్నాయి, ఈ విషయంలో ఎలాంటివైఖరి అవలంబించాలనే దానిపై గురువారం నిర్వహించే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా ఉండగా సీమాంధ్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కానున్న ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.