భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య భూభాగాల మార్పిడితో దేశ పౌరులైన వారికి ఓటుహక్కు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఎన్నికల చట్టం(సవరణ) బిల్లు, 2016ను న్యాయశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2002 పునర్విభజన చట్టంలోని సెక్షన్ 11, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9లో సవరణకు ఉద్దేశించిన ఈ బిల్లును లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
లోక్‌సభలో... 8 బొగ్గు శాఖకు చెందిన నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు మార్చి 29న సమ్మె చేస్తున్నట్లు నోటీసులిచ్చాయని విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. యూనియన్లతో చర్చలు జరుపుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
రాజ్యసభలో... 8 సివిల్ సర్వీసు పరీక్షలకు సంబంధించి వివిధ అంశాల అధ్యనానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆగస్టులో నివేదిక అందిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు.