
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ సాక్షిగా చంద్రబాబుది దుష్ప్రచారమని తేట తెల్లమైంది. విశాఖపట్నంలో దొరికింది డ్రగ్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నంలో సీబీఐ 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్‌ను సీజ్ చేసిందని పేర్కొంది. అయితే అందులో నార్కోటిక్స్ లాంటి మత్తు పదార్థాలు లేవని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ నిర్ధారించిందని తెలిపింది. ఈ విషయాన్ని సంబంధిత కోర్టులో ఫైల్ చేశామని.. ఆ కేసు సెప్టెంబర్ 21, 2024లో క్లోజ్ అయిందని రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.
సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టగా, మార్చి 16న విశాఖ పోర్టుకు ఎస్‌ఈకేయూ4375380 కంటెయినర్‌లో వెయ్యి బ్యాగుల సరుకు వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు అందులో తనిఖీ చేశారు. మార్చి 19న గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన నిపుణులు 49 నమూనాలు సేకరించి, 27 నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన సీబీఐ, జడ్జి ఆధ్వర్యంలో మరో 100 నమూనాలు సేకరించింది. ఆ నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. 8 నెలల తర్వాత నివేదిక వచ్చింది.

Comments
Please login to add a commentAdd a comment