రబీలో పగలే 9 గంటల విద్యుత్ | 9-hour power in the Rabi sayes KCR | Sakshi
Sakshi News home page

రబీలో పగలే 9 గంటల విద్యుత్

Published Tue, Oct 4 2016 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రబీలో పగలే 9 గంటల విద్యుత్ - Sakshi

రబీలో పగలే 9 గంటల విద్యుత్

విద్యుత్ శాఖకు సీఎం ఆదేశం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ సారి మంచి వర్షాలు కురిసినందున రబీ లో రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ అందించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రబీలో ప్రతి ఎకరాలో పంట సాగు చేసే అవకాశం ఉన్నందున, వ్యవసాయ విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, డిమాండ్‌లపై సోమవారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులతో సీఎం సమీక్ష జరిపారు. మంచి వర్షాల వల్ల బావుల్లో నీరు నిండిందని, భూగర్భ జల మట్టాలు కూడా బాగా పెరిగాయని కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో పంపుసెట్ల ద్వారానే ఎక్కువగా సాగు జరుగుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. డిమాండ్‌ను బట్టి విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంత డిమాండ్ ఉన్నా సరే సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభాకర్ రావు.. సీఎంకు తెలిపారు. థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తి గురించి కూడా కేసీఆర్ సమీక్షించారు. థర్మల్ కేంద్రాలతో పాటు శ్రీశైలం, అప్పర్ జూరాల, లోయర్ జూరాల, పోచంపాడు, సింగూరు ప్రాజెక్టుల వద్ద జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రబీ నాటికి రాష్ట్రంలో అన్ని రకాలుగా తొమ్మిది వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని, మరో వెరుు్య మెగావాట్లు ఛత్తీస్‌గఢ్ నుంచి అందుతుందని సీఎం వెల్లడించారు. రబీలో రైతుల అవసరాల మేరకు విద్యుత్ సరఫరా జరిగేటట్లు కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement