‘ప్రగతిభవన్ పైరవీల భవన్‌గా మారింది’
Published Wed, Jun 7 2017 3:42 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
జగిత్యాల: రాజధానిలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ పైరవీల భవన్‌గా మారిందని టీటీడీపీ నేత ఎల్ రమణ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి కొనసాగుతున్న పాలన అదుపు తప్పిందని విమర్శించారు.
రైతులకు అండగా నిలుస్తామన‍్న సీఎం కేసీఆర్ పంటలకు మద్దతు ధర కల్పించలేకపోయారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో మూడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూ కుంభకోణాల సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ నేరస్తులను, భూకబ్జాదారులను వదిలేసి రైతులకు బేడీలు వేస్తోందని దుయ్యబట్టారు.
Advertisement