TTDP
-
టీడీపీ పొత్తు ప్రస్తావనే లేదు: తరుణ్‌చుగ్
-
తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీతో పొత్తా?
ఢిల్లీ: తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందని ఓ మీడియా వర్గం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారాయన. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తెలంగాణపై అసత్య ప్రచారాలు చేస్తూ.. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై ఆయన సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్ మీడియా కథనాలు రాసిందని ఆయన ప్రకటనలో మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని ఆయన తేల్చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని, రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ సదరు వర్గ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ భవన్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. -
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు!
అంటే మళ్లీ ‘నోటుకు కోట్లు’ లాంటివి రీపీట్ కావాలని కాదు! -
అవన్నీ కాని పనులు కానీ.. మిగిలినోళ్లు వెళ్లకుండా కాపాడుకుందాం సార్!
అవన్నీ కాని పనులు కానీ.. మిగిలినోళ్లు వెళ్లకుండా కాపాడుకుందాం సార్! -
Sakshi Cartoon: పాల్గొనడానికి ఎవరూ లేర్సార్... పాల్గొనే వారికోసమైనా..
పాల్గొనడానికి ఎవరూ లేర్సార్... పాల్గొనే వారికోసమైనా పోరుబాట చేయాల్సిందే! -
టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు
-
సమైక్య పాలకులది నేరపూరిత నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే నీటి పారుదల రంగానికి పూర్తిగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇన్నాళ్లూ పరాయి పాలకుల చేతిలో పరాదీనమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తునక అని అభివర్ణించారు. టీటీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఎల్.రమణ, శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. నా లైన్ ఎవరూ మార్చలేరు ‘రాష్ట్రం వస్తుందని ముందు నుంచే మేము బలంగా నమ్మాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనుల గురించి డబ్బా కొట్టు కోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము చేపట్టిన ఎజెండాతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మేము విఫలమైతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపే పునర్నిర్మాణంపై బాగా ఆలోచించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భావించాం. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగం బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. మీ దీవెనలు, అండదండలు, సహకారం ఉన్నన్ని రోజులు ప్రపంచంలో ఎవరూ నా లైన్ మార్చలేరు. నేను కలగన్న తెలంగాణను వంద శాతం చేరుకుంటా.. ’అని కేసీఆర్ స్పష్టం చేశారు. చేనేతకు చేయూత: ‘చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. తాజాగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా బీమా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. ఒకటి రెండు నెలల్లో ఈ కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నాం. సూరత్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికుల నైపుణ్యాన్ని స్థానికంగా వాడుకుని ఉపాధి కల్పించేందుకు ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటయ్యే భారీ స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించా. చేనేత కార్మికులు కూడా పాత పద్ధతిలో కాకుండా వినూత్నంగా పని చేయడాన్ని అలవరుచుకోవాలి. చేనేత రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది..’అని సీఎం పేర్కొన్నారు. -
ఆ ఒక్కటీ పాయె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రస్తుత శాసనసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యానికి ముగింపు పలుకుతూ ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలోనే టీఆర్ఎస్లో చేరిన మరో టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మెచ్చా బుధవారం సాయంత్రం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. తొలుత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో మెచ్చా నాగేశ్వర్రావు, సండ్ర వెంకట వీరయ్యలు భేటీ అయ్యారు. అనంతరం ముగ్గురూ కలిసి మంత్రుల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి వెళ్లారు. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో టీడీపీని విలీనం చేయాల్సిందిగా కోరుతూ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు తమ పార్టీలో చేరినట్లు టీఆర్ఎస్ పక్షాన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా స్పీకర్‌కు లేఖను అందజేశారు. టీఆర్ఎస్లో టీడీపీ శాసనసభా పక్షాన్ని విలీనం చేయాలని ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని నాలుగో పేరాను అనుసరించి విలీనాన్ని ఆమోదిస్తూ, శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులతో పాటు వారికి స్థానాలు కేటాయిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. తమ విలీన నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర్రావు బుధవారం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు కూడా లేఖను అందజేశారు. వీరి వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఉన్నారు. 119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం టీడీపీ శాసనసభా పక్షం విలీనంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంఖ్యా బలం 104కు చేరింది. ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎంతో మెచ్చా భేటీ.. సండ్ర మధ్యవర్తిత్వం 2019 సాధారణ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, తెలంగాణలో టీడీపీ కార్యకలాపాలు నామమాత్రంగా తయారయ్యాయి. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినా ఉనికిని చాటుకోలేక పోయింది. ఇటీవల జరిగిన శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో పోటీ చేసిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ నామమాత్ర ఓట్లు సాధించి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చిన మెచ్చా నాగేశ్వర్రావు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చా పలుమార్లు కలిశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్లో చేరాలనే ఆకాంక్షను వెలిబుచ్చినట్లు తెలిసింది. కాగా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా మెచ్చా చేరికలో క్రియాశీలంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మెచ్చా రెండు రోజుల క్రితం భేటీ అయినట్లు సమాచారం. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్లో మెచ్చా చేరిక, టీడీపీ శాసనసభా పక్షం విలీనానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత శాసనసభలోనూ టీడీఎల్పీ విలీనం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో ఏర్పాటైన తొలి శాసనసభకు టీడీపీ నుంచి 15 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో 12 మంది ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో తెలుగుదేశంను వీడి టీఆర్ఎస్లో చేరారు. నాటి టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని కోరుతూ అప్పటి స్పీకర్ మధుసూదనాచారికి లేఖ అందజేయగా ఆమోదిస్తూ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండో పర్యాయం కూడా టీడీపీ శాసనసభా పక్షం టీఆర్ఎస్లో విలీనం కావడం గమనార్హం. శాసనసభలో ఉనికి కోల్పోయిన టీడీపీ కాగా 2018 సాధారణ ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే 2019 మార్చిలో సండ్ర టీఆర్ఎస్లో చేరినా సాంకేతికంగా అసెంబ్లీలో టీడీపీ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. టీడీపీకి చెందిన మరో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వర్రావు కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నాలుగో పేరా నిబంధన ప్రకారం... ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. అలాంటప్పుడు వీరికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు టిఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం కావాలని నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ విలీనం సంపూర్ణమైంది. దీంతో రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. చదవండి: మిస్టర్ కేసీఆర్! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు -
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో టీడీపీ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. మువ్వా అరుణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. రంగారెడ్డి –హైదరాబాద్–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్.రమణ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. -
నేడు బీజేపీలోకి భారీగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో పెద్దఎత్తున టీటీడీపీ శ్రేణులు చేరడానికి రంగం సిద్ధమైంది. ఆదివారం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సమక్షంలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో 18 జిల్లాల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలు, క్షేత్రస్థాయినేతలు, కార్య కర్తలు మొత్తం 20 వేలమంది బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన చేరికల ద్వారా తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. మాజీమంత్రి పి.జగన్నాయక్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, ఊకె అబ్బయ్య, టీడీపీ నేతలు సామ రంగారెడ్డి, మొవ్వ సత్యనారాయణ, ఎంఎన్ శ్రీనివాస్, బి.శోభారాణి, లంకల దీపక్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సాదినేని శ్రీనివాస్, పాల్వాయి రజనీకుమారి, శ్రీకాంత్‌గౌడ్, శ్రీకళారెడ్డి బీజేపీలో చేరను న్నట్టు సమాచారం. త్వరలోనే మరి కొందరు టీడీపీ, కాంగ్రెస్‌నేతలు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహ, విజయ శాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.దేవేందర్‌గౌడ్, వీరేందర్‌గౌడ్, మాజీమంత్రి చంద్రశేఖర్, కె.లక్ష్మా రెడ్డి, ప్రసాద్‌లతో బీజేపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. రాష్ట్రానికి వస్తున్న నడ్డాకు ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఘ నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. -
టీటీడీపీ వాషవుట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతోంది. రాష్ట్రంలో దాదాపు అడుగంటిన ఆ పార్టీలో మిగిలిపోయిన నియోజకవర్గ, మండలస్థాయి నేతలంతా బీజేపీ బాటపడుతున్నారు. బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఆపరేషన్‌తో రాష్ట్రంలో నలుగురైదుగురు ముఖ్య నేతలు మినహా అందరూ త్వరలోనే కమలదళంలో చేరనున్నారు. ఈ మేరకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ల్లోని పార్టీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో మిగిలిన నేతలు కూడా నేడో, రేపో పార్టీని వీడనున్నారు. 2023 నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న ఆకాంక్షతో బీజేపీ అధిష్టానం టీడీపీ నేతలపై దృష్టిపెట్టి ఆ పార్టీని దాదాపు వాషవుట్ చేస్తుండడం గమనార్హం. మునిగిపోయిన నావలో మురవలేం తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఐదారేళ్లుగా జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని నానాటికీ కుదేలు చేశాయి. దీంతో పార్టీలో ని మెజారిటీ నేతలు వేరేదార్లు వెతుక్కుంటున్నా రు. కొందరు మాత్రం పార్టీపై ఉన్న అభిమానంతో పాటు ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేక పచ్చజెండా నే పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రూపంలో వారికి ప్రత్యామ్నాయం కనిపిస్తుండడంతో నిండా మునిగిపోయిన నావలో ఇంకా మురవలేమంటూ ఆ పార్టీ బాట పడుతున్నారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లు, ముఖ్యనేతలు సమావేశమై తాము టీడీపీకి రాం రాం చెప్పి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వం, పదవులకు రాజీ నామా చేస్తున్నామని వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లా నేతలు కూడా వీడ్కోలు తప్పదనే సంకేతాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా తాను బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో మిగిలిపోయిన నేతలతో కూడా బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతుండటంతో వారు కూడా నేడో, రేపో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరంతా ఈనెల18న నాంపల్లిలో జరిగే సభలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, దేవేందర్‌గౌడ్ వంటి నలుగురైదుగురు నేతలు మినహా టీటీడీపీ నేతలంతా బీజేపీలో కలిసిపోతుండటం, పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని పట్టించుకోకపోవడంతో ఇక రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైపోతుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలకూ గాలం! జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో జరుగుతున్న ఆపరేషన్‌తో గట్టి పునాదులు వేసుకోవాలనుకుంటున్న బీజేపీ.. కాంగ్రెస్ నేతలకూ గాలమేస్తోంది. బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలోకి వెళ్లాలను కుంటున్న వారి జాబితా చాంతాడంత ఉంది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు ఇద్దరు మాజీ ఎంపీలు, 10 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలతో తాము చర్చలు జరుపుతున్నామని, వారంతా పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని బీజేపీ నేతలు చెపుతున్నారు. అయితే, అదంతా బీజేపీ ప్రచారం మాత్రమేనని కాంగ్రెస్ నేతలంటున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు బీజేపీ అధిష్టానంతో పూర్తిస్థాయిలో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ఆయన కలిశారని, ఇటీవలే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తోనూ ఆయన భేటీ అయ్యారని తెలుస్తోంది. ఆయన దాదాపు బీజేపీలోకి వెళ్లేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, అమిత్‌షా పర్యటనలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. బాబు అనుమతితోనేనా? టీటీడీపీ నేతలు బీజేపీలోకి వెళుతుండటం వెనుక చంద్రబాబు వ్యూహముందనే చర్చ జరుగుతోంది. ఆయన అనుమతితోనే కమ లతీర్థం పుచ్చుకుంటున్నారని, తనకెలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు తెలంగాణ పార్టీని చంద్రబాబు పణంగా పెడుతున్నార ని ‘తమ్ముళ్లు’బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బాబు సూచనల మేరకు ఆయన వ్యాపారభాగస్వామి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు టీడీపీలోకి వెళుతున్నారంటున్నారు. ఏపీటీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లు కూడా బాబు కనుసన్నల్లో కాషాయ కండువా కప్పుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. -
టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా భారతీయ జనతాపార్టీ పావులు కదుపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార టీఆర్ఎస్కు దీటుగా నిలవాలనే లక్ష్యంతో చక్రం తిప్పుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో దక్షిణ భారతదేశంలో తెలంగాణను గేట్వేగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు అండగా నిలిచిన సామాజిక వర్గానికి చెందిన నేతలకు గాలం వేసే పనిని ముమ్మరం చేసింది. కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లను బీజేపీలో చేర్చుకోవాలనే యోచనతో కమలనాథులు చర్చలు జరుపుతున్నారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలోని అరడజను మంది ప్రముఖ నేతలను పార్టీలో చేర్చుకుని తమ సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసే బాధ్యతలను జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, మురళీధర్‌రావులకు అప్పగించిన అధిష్టానం.. రాష్ట్రంలో స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌కు అప్పగించారనే చర్చ జరుగుతోంది. ‘ముందస్తు’కు ముందు నుంచే... తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని బీజేపీ 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలకు ముందే ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బాబూమోహన్, బొడిగె శోభ, ఆదిలాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు తదితరులను పార్టీలోకి చేర్చుకుంది. వీరిలో కొందరికి టికెట్లు ఇచ్చి పోటీ చేయించింది. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలను తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేయొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో పాటు పలువురు అదే సామాజిక వర్గానికి చెందిన నేతలతో రాంమాధవ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో జరగనున్న పరిణామాలను బట్టి ఈ నెలాఖరులోగా కొందరు కీలక కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చే స్పందనను బట్టి పార్టీలో కూడా వారికి తగిన ప్రాధాన్యమివ్వాలని, బీజేపీలోకి వస్తే అటు పార్టీపరంగా, ఇటు తమ భవిష్యత్తు పరంగా గ్యారంటీ ఉంటుందనే భావనను కలిగించాలనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరేనా? తెలుగుదేశం పార్టీలో మిగిలిపోయిన సీనియర్లపై కూడా బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడా సురేశ్‌రెడ్డి వంటి నేతలు బీజేపీ పెద్దలను కలిసి చర్చలు జరిపారు. పెద్దిరెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరితో పాటు టీడీపీలో మిగిలిపోయిన నేతలను గుర్తించి వారందరినీ బీజేపీలో చేర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన లెంకల దీపక్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌కు చెందిన కొత్తకోట దయాకర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీకి బలం లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారం కోల్పోవడంతో ఇదే అదనుగా టీడీపీని ఖాళీ చేసే పనిలో కాషాయపార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘టీడీపీలో ఉన్న నేతలకు కనుచూపు మేరలో రాజకీయ భవిష్యత్తు కనిపించడం లేదు. వారు ఆ పార్టీలో ఎన్ని రోజులున్నా అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబుకు దగ్గరగా ఉండే రావుల చంద్రశేఖర్‌రెడ్డి మినహా ఆ పార్టీలో ఇంకెవరూ ఉండరేమో’ అని ఓ బీజేపీ ముఖ్య నేత వ్యాఖ్యానించడం చూస్తే టీడీపీని ఖాళీ చేయడమే కమలనాథుల లక్ష్యమని అర్థమవుతోంది. టార్గెట్.. 2023 దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారం దక్కుతున్నప్పటికీ దక్షిణ భారతదేశంలో బీజేపీ పుంజుకోలేకపోతోంది. కర్ణాటకలో కూడా అధికారం దోబూచులాటగానే మారింది. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోని సామాజిక, రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో కమలనాథులకు రాష్ట్రంపై నమ్మకం పెరిగింది. అందులో భాగంగానే గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్ అమిత్‌షా తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు మిగిలిన పార్టీల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుని ఎన్నికలకు రెండు మూడేళ్ల నుంచే తమ కార్యాచరణ ప్రారంభించాలని, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఊపు వచ్చేలా చేయాలనే వ్యూహంతో ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 2023 ఎన్నికల నాటికి బలీయ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు.. ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తోంది. -
బీజేపీలో చేరికపై టీడీపీ నేతల మంతనాలు
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బీజేపీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఎక్కువగా ఆసక్తిచూపుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో నాలుగు ఎంపీ సీట్ల గెలుపుతో తెలంగాణలో బీజేపీకి ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. ఢిల్లీలో తెలంగాణ టీడీపీ నేతలు ఈ.పెద్దిరెడ్డి, చాడా సురేశ్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. బీజేపీలో చేరడంపై కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ప్రస్తుతం తెలుగుదేశం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీగా పెద్దిరెడ్డి, టీడీపీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షడిగా మాజీ ఎంపీ చాడా సురేశ్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూడా పార్టీ పుంజుకుంటుండటంతో టీటీడీపీ నేతలు ఎక్కువగా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
మా పార్టె లేదాయె.. నేనెవ్వలకు వోటెయ్యాలె?
‘ఏవున్నదక్కో.. ఇల్లు సర్దుకున్న ఎల్లిపోతా వున్న.. ఈ వూల్లె నాకింక ఏవున్నదక్కో..’ అని రాగవెత్తుకొని పాడ్కుంటండు కట్టెమిషిని రంనయ్య. యెప్పుడో ముప్పయేల్ల కింద మేం బెట్టిన శివాజి యూతు క్లబ్బు తోటి గీ యెలశ్చన్ల యేమేం జెయ్యాల్నొ ఇచారించుకుందామని కమెటి మెంబర్లందరం కట్టెమిషిని కాడి యాపశెట్టు కాడికచ్చినం. గీడికి రాంగనె నవ్వారు మంచం మీద గూసొని రంనయ్య పాట పాడవట్టిండు. మమ్ముల సూడంగనె ‘ఎట్టా బత్కుతు.. ఎల్లా బత్కు తు తెలంగాన జిల్లల్లోన’ అని మల్లో రాగం దీసిండు. ‘ఏందిరో రంనన్నా.. గిసొంటి పాటల్వాడుతన్నవ్. పోలిసోల్లు ఇంటె లోపలవెడ్తరు. అసలె కర్నారం జిల్ల’ యెచ్చరించినట్టె జెప్పిండు మా వూరి కవి నాగరాజు. ‘అయిన నీకేవైందయ్యో? రోడ్‌మీద కట్టెమిషినుంది. పిల్వంగనె అచ్చె పోరగండ్లున్నరు. పెద్దపెద్దోల్లు సుత నీ దగ్గర్కె అచ్చి మీటింగులు వెడ్తరు. నువ్వు దల్సుకుంటె యెమ్మెల్లె, యెంపీలు సుత ఈడి కెల్లె యెలశ్చన్లు నడిపిత్తరు... గివ్వన్నుండంగ అన్నల పాటలు పాడవడ్తివ’ని దెప్పి పొడిసిండు క్లబ్బు కమెటి మెంబర్ లచ్చన్న. అందర్నోపారి జూసిన రంనయ్య.. ‘గిన్నేండ్ల సంది గీ వూల్లెనె ఉంటన్రు గద. మా తెల్దేశం పార్టి సింబల్లేకుండ ఎలశ్చన్లు జర్గినయా?’ అన్నడు కోపంగ. ‘వోహో.. నీ బాద గదానయో.. మీ తెల్దేశం పార్టిని కేసియారు పొలిమేర్లకు పంపిండు గద. గెల్వని శీటుకు కోట్లిచ్చుకుంట మూడేండ్ల కిందట రేవంతం దొర్కిన కాడికెల్లి పట్నమే ఇడిశిపెట్టి.. ‘గీవూల్లె నాకింగ ఏవున్నదక్కో..’ అనవట్టె. మొన్న అసంబ్లి ఎలశ్చన్ల తెలంగానల ఏవన్న చెయ్యాల్నని వుషారు లెక్కలు జేస్తే మల్లోసారి తర్మిగొట్టిరి..’ గప్పట్ల జర్గిన సంగతుల్ని పూసగుచ్చినట్లు జెప్పె రాగుల్దుబ్బల రమ్నారావు. ‘మా ప్రెశిడెంట్ ఏడికన్న పోనియ్యి. ఎలశ్చన్ల ఎవ్వల కోటెయ్యాలె? బ్యాలెట్ మీద సైకిలి గుర్తే లేకపాయె. అరె మనం పోటీ జేత్తలేం. మీరు గా పలానా పార్టికి ఓటెయ్యిర్రి అంటెనన్న యేత్తం. మొన్న అసంబ్లి ఎలశ్చన్ల కాంగిరెస్కు ఎయ్యిమంటె నేనైతె ఏశిన, గంతకు ముందు బార్తీయ జన్త పార్టి అంటె మా ఇంట్లున్న ఆరోట్లు అటె గుద్దితిమి. అంతకు ముందు కమ్మునిస్టులకు ఓటియ్యిమన్న ఏస్తిమి. మరి గిప్పుడు ఏంజెయ్యాల్లో జెప్పకపాయిరి. పోటీలో లేకపాయిరి..’ కడుపులున్నదంత గక్కిండు రంనయ్య. ‘గిదంత జూస్న రమ్నరావుకు తిక్కరేగింది. ‘అరె తీ.. నీ బాదేంది. గాడ ఆంద్రల్నె మీ శెంద్రాలుబాబుకు కుట్రలు, కుతంత్రాలు జెయ్యనీకే టైం లేదాయె. నల్లికుట్ల మాటలు మాట్లాడుకుంట తిర్గుతన్న సుత జనం నమ్ముతలేరాయె. ఇగ గీడికచ్చి, పోట్జేసి పొడిశేడ్దేవుంది? మొన్న అసంబ్లి ఎలశ్చన్ల ఏదో శేద్దావని తెలంగానల యేలు వెట్టి, కాంగిరేసును గుడ నాశినం జేసి పాయె. గిప్పుడు గా కాంగిరేసోల్లు సుత శెంద్రల్బాబంటె ఇషం పామును జూసినట్టు ఆమెడ దూరముర్కవట్టిరి. సైకిలి గుర్తం మ్మీద పోటి శేద్దామంటె లీడర్లు, క్యాడెర్ లేదాయె. గందుకె తెలంగానల వద్లేసుకున్నడు. ఇగ ఆంద్రల జగన్ గెలుత్తండని దెల్సి పిస్సపిస్స అయితండు. పవన కల్యానం, కేయేపాలు, మందలగిరి లోకేశెం తోటి కుట్రలు జేపిత్తండు. నువ్వేమొ ఇంక శెంద్రాలుబాబు అనవడ్తి’వని గురాయించి జూసిండు. ‘యేదొ యెన్టి రామరావు అప్పట్నుంచి తెల్దేశం జెండ కిందనె వుంటి. గిప్పుడు పాల్రమెంట్ ఎలశ్చన్ల అసల్కు పోటే శేత్తలేర నే సర్కి యెన్టి రామరావు పెట్టిన తెల్దేశం బత్కు ఎట్లయిపాయె అన్కొన్న. శెంద్రాలు యెన్టీయార్ను ఎన్కపోటు వొడ్చి జివునం లేకుంట జేస్న గుడ.. ఆయిన వెట్టిన పార్టి బతుకుందనుకున్నం. వోట్లకు నోట్ల కేస్ల మూడేండ్ల కిందటే అరస్టయితమని దెల్సి పెట్టబేడ సదుర్కపోయె. గిప్పుడు గాడ గుడ తెల్దేశం దుక్నం బంజేస్తడంటన్రు.. నోట్లె నోట్లెనె అనుకుంట..’ బయిటికననే అందర్కి ఇనబడెటట్లు అన్నడు రంనయ్య. ‘ఉట్టిగ మాటల్తోటి టయం వేస్టు జెయ్యకుండ ఇగ గా యూతు క్లబ్బు మీటింగేదొ మొదలువెట్టున్రి..’ అన్నడు సైకిల్ స్టాండు రవి.యాబైల వడుతున్న యూతు మెంబెర్లవంత మినెట్ బుక్సుతోటి యాప శెట్టుకిందికి పోయినం.– పోలంపల్లి ఆంజనేయులు,సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
తెలంగాణలో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తొలుత ఎన్నికల బరిలో నిలబడాలని భావించినా... సీనియర్ నేతలు పార్టీని వీడటం, మరోవైపు ఉన్నవాళ్లు పోటీకి ఆసక్తి చూపకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మిత్రపక్షం కాంగ్రెస్ ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ప్రకటించేంది. దీంతో ఒంటరిగా బరిలోకి నిలిచే ధైర్యం చేయలేకపోతోంది తెలంగాణ టీడీపీ. మరోవైపు నామా నాగేశ్వరరావు కోసం ఖమ్మం నుంచి పోటీలో నిలుద్దామని టీడీపీ ముందుగా భావించినా... ఆయన పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరడం, మిగిలిన స్థానాలకు కనీసం అభ్యర్థులు దొరకని వైనం నెలకొంది. మొన్నటి అసెంబ్లీ ఫలితాలతో సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓడిపోయేదానికి అంత ఖర్చు అవసరమా అనే భావనతో ఉన్నారు. దీంతో తెలంగాణ టీడీపీ నాయకత్వం లోక్‌సభ ఎన్నికల పోటీ ఆలోచనను విరమించుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా...తెలంగాణ టీడీపీ నేతలతో ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న టీడీపీ నేతలతో భేటీ అయ్యారు కూడా. ఈ నేపథ్యంలో టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలంగాణలో తాజా పరిణామాలపై చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్‌పై మద్దతు ఇచ్చే అంశంపై చర్చించేందుకు టీడీపీ నేతలు ఇవాళ మరోసారి సమావేశం కానున్నారు. -
తుమ్మలతో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావుతో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత సంతరించికుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీనిపై సండ్ర కొంత సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. మెచ్చా మాత్రం ఈ వార్తను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యతలను సీఎం తన సన్నిహితులకు అప్పగించినట్టు సమాచారం. తాజగా తమ్మలతో మెచ్చా భేటీ కావడంతో.. ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వారు కారెక్కుతారా..?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు త్వరలోనే గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వారికి ప్రభుత్వపరంగా ఎటువంటి అవకాశాలు లభిస్తాయనే దానిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ.. కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో సత్తుపల్లిలో తమ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను బరిలో నిలిపింది. ఆయన సుమారు 19వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. అశ్వారావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మెచ్చా నాగేశ్వరరావు 10వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు స్థానాల్లో విజయం సాధించడం.. వారిని టీఆర్ఎస్ గూటికి చేరిస్తే.. అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిధ్యమే ఉండ దన్న రాజకీయ వ్యూహంతో టీఆర్ఎస్ ప్రయ త్నిస్తోందని జిల్లాలో ప్రచారం హోరెత్తుతోంది. టీఆర్ఎస్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరే అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. చర్చించినట్లు తెలుస్తోం ది. ఉమ్మడి జిల్లాలో అసలే అంతంతమాత్రంగా ఉన్న టీడీపీలోని ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తే జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ వర్గాలే విశ్లేషిస్తున్నాయి. జిల్లా నుంచి కాంగ్రెస్, సీపీఐ మద్దతుతో మూడు స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీకి నూతన జవసత్వాలు వస్తాయని భావించిన కొద్దిరోజులకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ పార్టీ జిల్లా నేతల్లోనూ.. ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ నెలకొంది. ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంకటవీరయ్య, మూడుసా ర్లు సత్తుపల్లిలో టీడీపీ నుంచి విజయం సాధించడంతో ఆయన ‘కారెక్కితే’ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు భరోసా ఇచ్చారని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బాబును కలిసిన మెచ్చా.. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు జిల్లాలోని రాజకీయ పరిణామా లు, టీఆర్ఎస్ నుంచి అంది న ఆహ్వానం తదితర అంశాలను శనివారం అమరావతిలో చంద్ర బాబును కలిసి వివరించినట్లు తెలుస్తోంది. గతంలోనూ టీడీపీ ఎమ్మె ల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుతారని పలుమార్లు ప్రచా రం జరిగింది. అయితే జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వపరంగా అవకాశాలు అందిపు చ్చుకునే పరిస్థితి ఉందనే రాజకీయ వ్యూహం తో పార్టీ మారే అంశంపై టీడీపీ నేత లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాములునాయక్ టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆ పార్టీలో చేరడం వల్ల కలిగే రాజకీయ అవకాశాలపై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాలని టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేల ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నెలాఖరులోపు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్నా.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తుండడం విశేషం. ఇక పార్టీ మారే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల తో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని పార్టీ శ్రేణులకు వారు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. -
తెలంగాణలో టీడీపీకి ఝలక్
-
టీఆర్ఎస్లోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల చేరిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరే అంశం క్రిస్మస్ తర్వాతకు వాయిదా పడింది. సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం, టీఆర్ఎస్ ప్రతిపాదనలపై కార్యకర్తలతో మాట్లాడేందుకు తనకు సమయం కావాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరడంతో ఈ నెల 25 తర్వాతే ఈ అంశం కొలిక్కి రానుంది. పార్టీ మారే విషయంలో సండ్ర కొంత సానుకూల సంకేతాలిస్తున్నా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం ససేమిరా అంటున్నారు! తాను పార్టీ మారే సమస్యే లేదంటూ ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యత తీసుకున్న టీఆర్ఎస్లోని ఓ కీలక నేత వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. టచ్‌లో సీఎం సన్నిహితుడు... అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే టీడీపీ నుంచి ఎవరూ ప్రమాణం చేయకుండా చూడాలన్న వ్యూహంతోనే టీఆర్ఎస్ ఈ ఆపరేషన్ చేపట్టిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో చంద్రబాబు అండ్ కో ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఆలోచనతోనే సీఎం సన్నిహితుడు ఒకరు నేరుగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం. ఈ మేరకు సీఎం సన్నిహితుడి నుంచి తమ నాయకుడికి ఫోన్ వచ్చిందని సండ్ర అనుచరులు చెబుతున్నారు. అయితే సండ్రతోపాటు మెచ్చాను కూడా టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి అసెంబ్లీలో టీడీపీని అధికారికంగా టీఆర్ఎస్లో విలీనం చేయాలన్న షరతు వారిద్దరి మధ్య చర్చల్లో వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మెచ్చా కూడా వస్తానంటేనే తాను కూడా పార్టీ మారే విషయంలో నిర్ణయం తీసుకుంటానని సండ్ర తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్టు సమాచారం. సండ్ర సానుకూల సంకేతాలు... టీఆర్ఎస్ ప్రతిపాదనపై టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొంతన కుదరడం లేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య తెలంగాణలో టీడీపీ భవిష్యత్తుపై అంచనాకు వచ్చారని, అందుకే టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారడానికి తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని, అందుకు ప్రతిఫలంగా సత్తుపల్లి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం, హోదా కల్పించాలని సండ్ర కోరుకుంటున్నట్లు సమాచారం. హోదా దక్కితే ఇబ్బంది లేదని, లేదంటే తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని సన్నిహితులతో సండ్ర చెబుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. సండ్ర పార్టీ మారే అంశంపై నియోజకవర్గానికి చెందిన కీలక టీడీపీ నేతలు ఇప్పటికే పార్టీ కేడర్‌తో సానుకూల సంప్రదింపులు జరుపుతుండగా శనివారం సాయంత్రం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సండ్ర ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ మార్పు గురించి చర్చించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ ప్రతిపాదనల గురించి పార్టీ నేతలకు సండ్ర వివరించారని, వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అయితే మంత్రి పదవి లభిస్తేనే పార్టీ మారే విషయం గురించి ఆలోచించాలని అనుచరులు సండ్రకు సూచించినట్లు సమాచారం. మరోవైపు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా టీడీపీని వీడేది లేదంటూ ఆయన చేత అనుచరులు బలవంతంగా చెప్పించి వాట్సాప్‌లో పెట్టినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అయితే మెచ్చా స్వభావం రీత్యా కూడా నిర్ణయం తీసుకోవడంలో తర్జనభర్జనలు పడే అవకాశముందని, అనివార్యమైతేనే ఆయన పార్టీ మారతారని మెచ్చా అనుచరులు చెబుతున్నారు. నేనింకా నిర్ణయం తీసుకోలేదు పార్టీ మారడం గురించి నేనింకా నిర్ణయం తీసుకోలేదు. కొన్ని ప్రతిపాదనలపై చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. ఏదైనా క్రిస్మస్ తర్వాతే తేలుతుంది. నేను పార్టీ మారినా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశాన్ని అందరికీ చెప్పాకే ముందుకెళ్తా. దొంగచాటు రాజకీయాలు చేసే అవసరం నాకు లేదు. – ‘సాక్షి’తో సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారను.. టీడీపీ నుంచి నేను గెలిచాను. అదే రీతిలో పార్టీలో ఉంటానే తప్ప పార్టీ మారే సమస్యేలేదు. వదంతులు వస్తున్నాయి. వాటితో సంబంధం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎన్ని ఇబ్బందులున్నా.. నేను పార్టీలోనే ఉంటాను తప్ప మారే సమస్య లేదు – వాట్సాప్ వీడియోలో మెచ్చా నాగేశ్వరరావు -
టీడీపీ ఇంటింటా ప్రచారం
సాక్షి,సత్తుపల్లిటౌన్: ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను గెలిపించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ వస్తుందన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు రామిశెట్టి సుబ్బారావు, గాదె చెన్నకేశవరావు, దేవళ్ల పెద్దిరాజు, గాదెరెడ్డి సుబ్బారెడ్డి, పింగళి సామేలు, కిరణ్, పూచి గోవర్ధన్, అశోక్‌రెడ్డి, శ్రీకాంత్, నారాయణ, గురవయ్య, రాజేష్, గోపి, రాము, శ్రీను, వెంకటేశ్వరరావు, బాపయ్య, లక్ష్మణ్, ఆదినారాయణ పాల్గొన్నారు. టీడీపీ ఇంటింటా ప్రచారం కల్లూరురూరల్: మండల పరిధిలోని వెన్నవల్లిలో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య గెలుపునకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, పక్కా గృహాలు మంజూరు చేయలేదని నాయకులు వివరించారు. రానున్న మహాకూటమి ప్రభుత్వంలో పేదలందరికీ స్వంత స్థలాల్లోనే ఇండ్లు కట్టిస్తుందని, దీంతోపాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. టీడీపీ నాయకులు ఇనుపనూరి మోహనరావు, మేడి సీతయ్య, అంజి, మత్తే సత్యం, మాజీ సర్పంచ్ ఖమ్మంపాటి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, గుమ్మా భాస్కర్‌రావు, మార్తా పెద్దిరాజు, కావేటి వెంకట శ్రీను, ఖమ్మం పాటి వెంకటేశ్వర్లు, జాని, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోడ్డుపై సేద తీరిన నాయకులు సత్తుపల్లి: ప్రజాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ప్రచారంలో భాగంగా షెడ్యూల్ ప్రకారం కాకర్లపల్లి గ్రామానికి వస్తున్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎదురు చూశారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు కాకర్లపల్లి గ్రామానికి రావాల్సి ఉండగా.. ప్రచారం ఆలస్యం కావటంతో.. రాత్రి 7.30 గంటల వరకు ఎదురు చూశారు. గ్రామ శివారులో ఆలసిపోయిన టీడీపీ మండల అధ్యక్షుడు దొడ్డా శంకర్రావు, కార్యకర్త లాల్‌కుమార్ రోడ్డుపైనే సేద తీరారు. -
‘కూటమి’ ప్రభుత్వంలో మరింత అభివృద్ధి
సాక్షి,మధిర: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా కూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను గెలిపించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. గురువారం మధిర పట్టణంలోని 16, 17వార్డుల్లో భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామనాథం మాట్లాడుతూ... భట్టి గెలుపొందితే రాబోయే ప్రజా కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటారని తెలిపారు. అప్పుడు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. హస్తం గుర్తుకే ఓటువేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు మల్లాది వాసు, అయితం వెంకటేశ్వరరావు, మల్లాది హన్మంతరావు, మాదల రామారావు, గోకర్ల చంద్రయ్య, శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
టీటీడీపీ మేనిఫెస్టో ఇదే
సాక్షి, హైదరాబాద్ : నామినేషన్ల పర్వం ముగియడంతో రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మహాకూటమిలో భాగమైన తెలంగాణ టీడీపీ తమ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ మేనిఫెస్టోను ప్రకటించారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఏటా ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని, ప్రగతి భవన్‌ను ప్రజాస్పత్రిగా మారుస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ మేనిఫేస్టో రూపకల్పనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా టీడీపీ నేతలు తెలిపారు. గతం, వర్తమానం, భవిష్యత్తు అంశాలను పరిగణనలోకి తీసుకుని మేనిఫేస్టో రూపొందించామని వెల్లడించారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు రూ.2లక్షల వరకు రైతులకు రుణమాఫీ, దీన్ని కౌలు రైతులకు కూడా వర్తింపు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5లకే భోజనం, ఇంటర్ నుంచే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ. విభజన బిల్లులో అంశాల అమలుకు కేంద్రంపై ఒత్తిడి. అమరవీరుల కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం, ఇల్లు, వారి సంక్షేమానికి ప్రాధాన్యత. అన్ని జిల్లాల్లో పూలే, అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు, హైద్రాబాద్ ధర్నా చౌక్ పునరుద్దరణ, లోకాయుక్త ఏర్పాటు, లోకాయుక్త పరిధిలోకి ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి బెల్ట్ షాపుల రద్దు, విద్యారంగానికి బడ్జెట్లో అదనంగా రూ.5వేల కోట్లు కేటాయింపు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు, ప్రొఫెసర్ జయశంకర్ పేరిటి విద్యా సంస్థలు ఏర్పాటు పేద యువతుల వివాహానికి రూ.1.50 లక్షల ఆర్థికసాయం, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, బీసీలకు సబ్‌ప్లాన్, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు. 58 ఏళ్లు నిండిన అనాథలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2వేల పింఛన్. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సంక్షేమానికి చర్యలు. పక్కా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల సాయం, ప్రతి ఇంటికీ మంచినీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దివ్యాంగులకు రూ.3వేలు పించన్. -
మహా కుంపటి !
సాక్షి,ఖమ్మం: జిల్లాలో కాంగ్రెస్ ప్రకటించిన మధిర, పాలేరు నియోజకవర్గాల్లో అసంతృప్తి జాడలు పెద్దగా కనిపించకపోయినా.. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా భావిస్తున్న ఖమ్మం సీటును మహాకూటమి భాగస్వామ్య పక్షమైన టీడీపీకి కేటాయించడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నటి వరకు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఆశావహులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి.. దీనిని టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర అనుచరులు ఈ సీటును కూటమికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భవిష్యత్ కార్యాచరణ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌లో తనకు సీటు ఖాయమని భావించి.. ఏడాది కాలంగా ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న పోట్ల.. తన అనుచరులతో సమావేశమై తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్‌లో కమ్మ సామాజిక వర్గానికి గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ సైతం తనకు టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటామని చెబుతున్నా.. ఆయన వర్గీయులు గురువారం మానుకొండ వ్యవసాయ క్షేత్రం వద్ద సమావేశం నిర్వహించారు. మానుకొండతోపాటు పాలేరు టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సన్నిహితుడు దిరిశాల భద్రయ్య తదితరులు హాజరయ్యారు. రాధాకిషోర్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి తీరాల్సిందేనని కార్యకర్తలు పట్టుబట్టారు. పార్టీ కోసం పని చేసిన వారిని కాదని.. పొత్తుల పేరుతో టీడీపీకి ఇవ్వడం వల్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జరిగిన నష్టమే ఈసారీ పునరావృతం అవుతుందని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకుంటామని, కార్యకర్తల అభిప్రాయాలను ఆమె దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే కార్యాచరణ రూపొందించుకుందామని మానుకొండ కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పొంగులేటి కలత.. ఇక కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉన్న తనకు పదేపదే పార్టీలో అన్యాయం జరుగుతోందని, ఖమ్మం టికెట్‌పై పూర్తిస్థాయి ఆశలు పెట్టుకున్న శాసన మండలి ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తనకు సీటు రాకపోవడంపై తీవ్ర కలత చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సుధాకర్‌రెడ్డి అనుచరులు ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి.. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పునరాలోచించాలని ఇప్పటికే కోరారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారు. ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు పార్టీపరంగా తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్‌గాంధీ భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే అవకాశం లభిస్తుందని భరోసా ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక మహాకూటమి అభ్యర్థిగా అధికారికంగా ఖరారైన నామా నాగేశ్వరరావుకు సొంత పార్టీలో పెద్దగా తలనొప్పులు లేకపోయినా.. కాంగ్రెస్ నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను సర్దుబాటు చేయడం సవాల్‌గానే పరిణమించింది. టికెట్ ప్రకటించిన వెంటనే ఖమ్మం చేరుకున్న నామాకు టీడీపీ శ్రేణులతోపాటు సీపీఐ, కాంగ్రెస్‌లోని కొందరు నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకడంతో శుభపరిణామంగా భావించినా.. 24 గంటల్లో అదే పార్టీ నుంచి తిరుగుబాటు అభ్యర్థులు సిద్ధం కావడంతో ఆనందం ఆవిరయ్యే పరిస్థితి నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వర్గీయులతోపాటు మాజీ మంత్రి సంభాని, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ వర్గీయులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న టీడీపీ శ్రేణులు.. వారికి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ.. కూటమి విజయానికి కృషి చేయాల్సిందిగా కోరేందుకు టీడీపీ సమాయత్తమవుతోంది. టీడీపీ తరఫున జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో సమాలోచనలు జరిపారు. గురువారం రాత్రి నగరంలోని త్రీటౌన్ ఏరియాలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి నామా హాజరుకావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. నామా నామినేషన్ వేసే నాటికి కాంగ్రెస్ శ్రేణుల్లో తనపై ప్రజ్వరిల్లిన అసమ్మతి సెగలను చల్లార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరాపై ఫలించని విజ్ఞప్తులు.. ఇక వైరా నియోజకవర్గాన్ని ఈసారి కాంగ్రెస్‌కే కేటాయించాలని, పొత్తుల్లో ఏ పార్టీకి ఇవ్వొద్దంటూ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు చేసిన విజ్ఞప్తులు, ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిగా విజయాబాయిని ప్రకటించింది. దీంతో ఇక్కడ పోటీ చేసేందుకు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేత, మాజీ పోలీస్ అధికారి రాములునాయక్, మరో నేత లకావత్ గిరిబాబు కూటమి తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాములునాయక్ కాంగ్రెస్ నుంచి టికెట్ చేజారడంతో తన రాజకీయ భవిష్యత్‌పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరుపుతున్నారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో పర్యటించి.. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయాలని కాంగ్రెస్ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత సైతం తనకు కలిసొస్తుందనే భావనతో రాములునాయక్ ఈ ఎన్నికల్లో వైరా నుంచి పోటీ చేసేందుకు దాదాపు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. 17వ తేదీన ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 18వ తేదీన వైరా సీపీఐ అభ్యర్థిగా విజయాబాయి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక పాలేరు విషయానికొస్తే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌కు ఈ నియోజకవర్గ టికెట్ లభించకపోవడంతో ఆయన కినుక వహించారు. పాలేరుతో ఆయనకు గల రాజకీయ సంబంధాల దృష్ట్యా.. తనకు సహకరించాలని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి సంభానిని అభ్యర్థించినట్లు సమాచారం. -
నేడోరేపో నాలుగు స్థానాలపై ‘కూటమి’ ప్రకటన
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఫైనల్‌కు చేరింది. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీట్ల కేటాయింపు, సర్దుబాటుపై ఆ పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. సోమవారం హైదరాబాద్, ఢిల్లీలో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం రాత్రికిరాత్రే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 65 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. మొత్తం ఎనిమిది మందిలో ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు ముగ్గురు బీసీలు, ఇద్దరు దళిత అభ్యర్థులకు అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఎనిమిది స్థానాలను సోమవారం రాత్రి ప్రకటించిన అధిష్టానం.. మరో ఐదుస్థానాలపై సస్పెన్స్ పెట్టింది. పొత్తుల్లోభాగంగా సీపీఐకి మూడు స్థానాలు కేటాయించగా.. ఇందులో హుస్నాబాద్ కూడా ఉన్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. దీంతో మరో నాలుగుస్థానాలపై నేడో, రేపో కాంగ్రెస్, కూటమి పార్టీల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సీట్ల సర్దుబాటు.. ఫైనల్‌కు చేరినట్లేనని భావిస్తున్నారు. టీటీడీపీ, టీజేఎస్ తప్పుకున్నట్లే?.. హుస్నాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థి... తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీటీడీపీ, టీజేఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ ఆశిస్తున్న స్థానాలపై కొద్దిరోజులుగా ఉత్కంఠకు దారితీసింది. మొదట టీడీపీ హుజూరాబాద్, కోరుట్ల స్థానాలను అడిగింది. హుజూరాబాద్ నుంచి మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కోరుట్ల నుంచి ఎల్.రమణ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పోటీచేసేందుకు ఆఇద్దరు నేతలు విముఖత వ్యక్తం చేయడంతో ధర్మపురి (ఎస్సీ) నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని భావించారు. చివరినిమిషంలో అక్కడా కాంగ్రెస్అభ్యర్థులకే అవకాశం కల్పించనున్నారని చెప్తున్నారు. అలాగే తెలంగాణ జనసమితి కూడా హుజూరాబాద్, కరీంనగర్, రామగుండం స్థానాలపై గురిపెట్టింది. ముక్కెర రాజు, నరహరి జగ్గారెడ్డి, గోపు ఐలయ్యకు టికెట్ ఇవ్వాలని అడిగారు. తర్వాత నేరుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరామే రామగుండం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు టీజేఎస్‌కు కేటాయించిన, ప్రకటించిన సీట్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్కటి కూడా లేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ, టీజేఎస్‌లు పోటీ నుంచి తప్పుకున్నట్లేనన్న చర్చ జరుగుతోంది. సీట్ల కేటాయింపులో మొత్తంగా కేటాయించిన మూడుస్థానాల్లో హుస్నాబాద్ నుంచి సీపీఐకే అవకాశం కల్పించినట్లు ఆపార్టీ నేత వెంకటరెడ్డి ప్రకటించగా.. ఆయన తరఫున ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం హుస్నాబాద్‌లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సైతం పోటీలో ఉంటామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే స్నేహపూర్వక పోటీ.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేందుకు సమాయత్తం అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ.. నేడోరేపో మలిజాబితా..? ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలకు ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో ఐదు స్థానాలపై సస్పెన్స్ పెట్టింది. తొలి జాబితాలో తమ పేర్లుంటాయని భావించిన హుజూరాబాద్ నుంచి టికెట్ ఆశించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీప బంధువు పాడి కౌశిక్‌రెడ్డి, కేకే.మహేందర్ రెడ్డి (సిరిసిల్ల), మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి (హుస్నాబాద్)కి నిరాశ మిగిలింది. కోరుట్ల, ధర్మపురి అభ్యర్థుల ప్రకటన విషయమై కూడా సస్పెన్స్ నెలకొంది. మంగళవారం కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య జరిగిన సంప్రదింపులు, చర్చల నేపథ్యంలో హుస్నాబాద్ సీపీఐకే కేటాయిస్తామని పేర్కొనగా.. ఇప్పుడు నాలుగు స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. సిరిసిల్లలో కేకే.మహేందర్ రెడ్డి పార్టీ కోసం గట్టిగా పనిచేస్తున్నారు. దాదాపుగా టికెట్ ఖాయమైందన్న భరోసాతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. చివరి నిమిషంలో ఆయన పేరు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. ఇక్కడినుంచి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం గట్టిగా పట్టుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధర్మపురిలో వరుసగా ఓటమి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్థానంలో డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, దరువు ఎల్లయ్యతోపాటు 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోరుట్ల నుంచి కొమొరెడ్డి రామ్‌లు తదితరులు గతంలో దరఖాస్తు చేసుకోగా.. టికెట్ కమిట్మెంట్పై కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు జువ్వాడి నర్సింగ్‌రావు పేరు దాదాపుగా ఖరారైందన్న ప్రచారం జరిగింది. ఆ టికెట్ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. మొత్తంగా నాలుగు స్థానాలపై ఇంకా ఉత్కంఠ నెలకొనగా, నేడో, రేపో ప్రకటించే మలి జాబితాతో తెరపడనుంది. -
‘రేపు కూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం’
-
‘రేపు కూటమి ఉమ్మడి ప్రణాళికను ప్రకటిస్తాం’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మహాకూటమి నేతలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీడీపీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్లు పాల్గొన్నారు. ఈ భేటీలో కూటమి ఉమ్మడి ప్రణాళిక, ఎలక్షన్ మేనిఫెస్టోలపై నేతలు చర్చించారు. సమావేశం అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కూటమిలో కలిసొచ్చే పార్టీలన్ని తమకు ప్రజా సమస్యలపై ముసాయిదా అందజేశాయని తెలిపారు. రేపు మరోసారి భాగస్వామ్య పార్టీలతో సమావేశమై చర్చించిన అనంతరం ఉమ్మడి ప్రణాళిక ముసాయిదాను విడుదల చేయనున్నట్టు వెల్లండించారు. కోదండరాం మాట్లాడుతూ.. భాగస్వామ్య పార్టీలన్ని ముసాయిదాను అంగీకరించాయని తెలిపారు. నిరంకుశ పాలనకు, సామాన్య ప్రజల ఎజెండాకు మధ్యనే ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం ఒక వైపు, తెలంగాణ ప్రజలంతా ఒక వైపు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. సామాన్యుల, ఉద్యమకారుల ఎజెండానే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. -
మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లు: ఉత్తమ్
హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భర జీవితం గడుపుతున్న భవన నిర్మాణ కార్మికుల డిమాండ్లను మహాకూటమి మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పాటుకాగానే పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దరిపల్లి చంద్రం అధ్యక్షతన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో బుధవారం జరిగిన పునాదుల గర్జన కార్యక్రమంలో ఉత్తమ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొని మాట్లాడారు. ప్రజల జీవితాలను మార్చే దమ్ము మహాకూటమికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే ఈఎస్ఐ వ్యవస్థను మరింత విస్తృతం చేసి ప్రతి భవన నిర్మాణ కార్మికునికి ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వీటితో పాటు కేజీటుపీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు సొంత ఇళ్లు నిర్మిస్తామన్నారు. సిద్దిపేట మహాకూటమి అభ్యర్థిగా దరిపల్లి చంద్రంను ప్రకటించారు. బీసీలకే ముఖ్యమంత్రి: తమ్మినేని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటీ అమలుపర్చడం లేదని ఇదో దద్దమ్మ ప్రభుత్వమని తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికులు కోరుకుంటే బీఎల్ఎఫ్ తరఫున రెండు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీలకు 60 సీట్లు ఇచ్చిన ఘనత బీఎల్ఎఫ్దేనన్నారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. దత్తాత్రేయ మాట్లాడుతూ..తాను కార్మిక శాఖమంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతగానో కృషి చేశానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఫండ్‌ను ప్రచారాలకు మాత్రమే వెచ్చిస్తూ వెల్ఫేర్‌ను మర్చిపోయిందన్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను అమలు చేయకపోతే ప్రభుత్వాల పునాదులు కదిలిస్తామన్నారు. కార్మిక శాఖ బోర్డు చైర్మన్‌గా కార్మికుడే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం కావాలో... ఈ కూటమి కావాలో తేల్చుకోవాలంటూ ప్రచారంలోకి దిగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు విరాహత్అలీ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు వీరేందర్‌గౌడ్, కాంగ్రెస్‌నేత రాగిడి లక్ష్మారెడ్డి, టీడీపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కందికంటి అశోక్‌కుమార్, బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాములు, తదితరులు పాల్గొన్నారు. -
పొత్తులపై టీటీడీపీ సీనియర్ నేతల్లో విభేదాలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్లో బుధవారం తెలంగాణ తెలుగుదేశం నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి టీటీడీపీ చీఫ్ ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. త్వరలో ప్రతిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న మహా కూటమితో పాటు చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వడంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంతో కలసి వెళ్లే విషయాన్ని కూడా పలువురు నేతలు ఈ భేటీలో ప్రస్తావించారు. పొత్తులు, సీట్లపై త్వరగా క్లారిటీ తీసుకుంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై ముందుకు వెలదామని రమణపై టీటీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. మరోవైపు మంగళవారం జరిగిన సమావేశంలో జగిత్యాల, వనపర్తి, నర్సంపేట టికెట్లు ఎట్టిపరిస్థితుల్లో టీడీపీకి ఇవ్వటం కుదరదని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో పలువురు టీడీపీ సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. గెలిచే సీట్లు వదులుకోవద్దు అని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ తమతో చెప్పారని, పైగా సిట్టింగ్ స్థానాలు టీడీపీకి ఎలా ఇస్తామని, ఇప్పటికే ఉప్పల్ టీడీపీకీ ఒప్పుకోవటంతో తమ నేత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారని ఉత్తమ్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో టికెట్ల కేటాయింపుపై చంద్రబాబునాయుడుతోనే డైరెక్ట్‌గా తేల్చుకుంటామని పలువురు టీడీపీ నేతలు అమరావతి బాటపడుతున్నారు. ఎల్ రమణను జగిత్యాల నుంచి కోరుట్ల, రావుల చంద్రశేఖర్ రెడ్డిని వనపర్తి నుంచి దేవరకద్ర, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని నర్సంపేట్ నుంచి పరకాల వెళ్లాలని కాంగ్రెస్‌పార్టీ సూచించినట్టు సమాచారం. కోరుట్ల వెళ్లేందుకు రమణ సిద్ధంగా ఉన్నా నియోజకవర్గం మారేందుకు రావుల, రేవూరిలు ససేమీరా అంటున్నారు. దేవరకద్ర టికెట్ తనకే కావాలని టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీటీడీ అత్యవసర సమావేశంలో సీనియర్ నేతలు రమణ వద్ద అసహనం వ్యక్తం చేసి అమరావతిలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, టీజేఎస్, టీడీపీ కలిసి మహా కూటమిగా ఏర్పడాలని కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబుపై బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగల ముఠాను ఏర్పాటు చేసి తెలంగాణకు పంపారని ఆరోపించారు. శనివారం ఆయన సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలిసి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చుపెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ నడుస్తోందని, దీనిపై గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. వారు స్పందించకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలే వెంటపడి తరిమేలా ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఏజేంట్లు కొంత మంది కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబు కుట్రలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు చేసిన ఆక్రమాలకు నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా సరిపోదన్నారు. ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబును టీడీపీ నుంచి తరిమేయాలన్నారు. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసుపెడితే తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాలని ఎందుకు అడగాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలు ఆపకపోతే ఆయనను తరిమికొట్టే పరిస్థితి వస్తుందని బాల్కసుమన్ హెచ్చరించారు. చంద్రబాబును ఏపీ ప్రజలు ఓటేసి ఎన్నుకున్నారని వారికి సేవ చేయాలని సూచించారు. అక్కడి ప్రజల సొమ్ముతోనే ఏపీ పోలీసులకు జీతాలు వస్తున్నాయని, వారిని రక్షించడానికే పనిచేయాలన్నారు. చదవండి: తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్! -
తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై దృష్టి సారించడమే దీనికి ప్రధాన కారణమని టీటీడీపీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో టీడీపీ పట్టున్న ప్రాంతాలు.. గత ఎన్నికల్లో టీడీపీ సాధించిన ఓటు బ్యాంకు.. నేతల వలసలు.. తదితర అంశాలన్నింటిపై సర్వే చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్‌ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఏపీ ఇంటలిజెన్స్ పొలిటికల్ విభాగంలో పని చేస్తున్న 60 మంది హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చి క్యాంపు ఏర్పాటు చేశారు. 4 రోజల క్రితం వచ్చిన వీరిని ముగ్గురు చొప్పున బృందాలుగా ఏర్పాటు చేసి సర్వే విధులు అప్పగించినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఏయే స్థానాలను గెలవచ్చు.. పొత్తుపై టీడీపీ ఓటర్ల స్పందన అంశాలపై కూడా త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ 20పైనే నజర్... ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ బృందాలు 20 అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టినట్లు టీటీడీపీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని కూకట్పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, ఉప్పల్, సనత్‌నగర్‌లో సర్వే నిర్వహిస్తున్నారు. అలాగే రూరల్ ప్రాంతాలైనా నిజామాబాద్‌లో ఓ అసెంబ్లీ, మెదక్‌లో నారాయణ్‌ఖేడ్, వరంగల్‌లో నర్సంపేట్, కరీంనగర్లో కోరుట్ల, ఖమ్మంలో సత్తుపల్లి, పాలేరు, ఖమ్మం, నల్గొండలో కోదాడ, మహబూబ్‌నగర్‌లో మక్తల్, వనపర్తి, దేవరకద్ర, ఆదిలాబాద్‌లో ఖానాపూర్ లేదా ఆసిఫాబాద్‌లో బృందాలు సర్వే చేస్తున్నట్లు తెలిసింది. పొత్తులో భాగంగా ఇదే స్థానాలను టీటీడీపీ కోరే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణలో వాళ్లెలా చేస్తారు? ఒక రాష్ట్రంలోని పరిస్థితులు, రాజకీయ పరమైన అంశాలపై పక్క రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేయడం వివాదాస్పదమయ్యేలా కనిపిస్తోంది. దీనిపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అంశంగా మారుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ సంస్థతో సర్వే చేయించుకుంటే అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రానికి చెందిన పోలీసులు సర్వే చేయడం నిబంధనలకు విరుద్ధమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చేయి కలుపుదాం
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయి క్లియరెన్స్ ఇచ్చారు. శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశాల్లో కాంగ్రెస్‌తో కలసి వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించిన బాబు.. ఆదివారం తన నివాసంలో జరిగిన సమావేశంలో పొత్తుపై మరింత స్పష్టతనిచ్చారు. ‘కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోండి. ఆ దిశగా చర్చలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. మీరు ముందుకెళ్లండి. నేనున్నాను..’అని టీటీడీపీ చీఫ్ ఎల్.రమణతో పాటు ఇతర ముఖ్య నేతలకు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలను కలుపుకొని పోయే విషయంలో చొరవ తీసుకుని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం రావడంతో ఎల్.రమణ కూడా వేగంగా పావులు కదిపారు. వెంటనే కాంగ్రెస్, సీపీఐ, జనసమితి నేతలకు ఫోన్లు చేసి కలసి వెళ్లడం కోసం మాట్లాడుకుందాం రమ్మని ఆహ్వానించడం గమనార్హం. కాగా పార్టీ సమావేశంలో భాగంగా ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన జాబితాకు కూడా బాబు ఆమోదం తెలిపారు. పార్టీ మేనిఫెస్టో తయారు చేసే బాధ్యతలను పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ టి.దేవేందర్‌గౌడ్‌కు అప్పగించారు. - ఎన్నికల సమన్వయ కమిటీ: ఎల్.రమణ, టి.దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు - మేనిఫెస్టో కమిటీ: టి.దేవేందర్‌గౌడ్ (చైర్మన్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి - ప్రచార కమిటీ: గరికపాటి మోహన్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌గౌడ్, రమావత్ లక్ష్మణ్‌నాయక్ టీడీపీ–సీపీఐ పొత్తు ఖరారు వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేయాలని తెలుగుదేశం, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిర్ణయించాయి. ఈ మేరకు ఆదివారం ఇరు పార్టీల నేతలు ఎన్టీఆర్ భవన్లో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ చేసి ఆహ్వానించడంతో సీపీఐ నేతలు భవన్‌కు వచ్చి చర్చలు జరిపారు. భేటీ అనంతరం కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. అందరితో మాట్లాడదాం: రమణ రమణతో పాటు పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, అమరనాథ్బాబు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పార్టీ నేత పల్లా వెంకటరెడ్డి ఎన్టీఆర్ భవన్లో సమావేశమయ్యారు. గంట పాటు జరిగిన చర్చలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఇరు పార్టీలు కలసి పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. తమతో పాటు కాంగ్రెస్, ఇతర భావసారూçప్య పార్టీలను కలుపుకుని పోయేలా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ చర్చించడానికి బదులు అన్ని పార్టీలను పొత్తుకు ఒప్పించాలని.. ఆ తర్వాత సీట్లు, సర్దుబాట్లపై చర్చించాలని అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. కేసీఆర్‌ను గద్దె దింపుతాం: రమణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపుతామని రమణ అన్నారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువల్లేవని విమర్శించారు. ఆయన కు సభలపై ఉన్న దృష్టి రైతులపై లేదన్నారు. రానున్న రోజుల్లో మహాకూటమి రాష్ట్రలో జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు, రేపు ఇతర పార్టీలతో కూడా చర్చిస్తామని.. కాంగ్రెస్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. గెలిచే స్థానాలే అడుగుతాం: చాడ కలసి వచ్చే అన్ని పార్టీలతో చర్చిస్తామని, మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్నామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. కేసీఆర్‌కు అధికారమే తప్ప రైతుల మీద ఆసక్తి లేదని విమర్శించారు. పోటీ చేయాల్సిన స్థానాలు ముఖ్యం కాదని, పోటీ చేసిన చోట గెలవాలని, చర్చల్లో గెలిచే స్థానాలే అడుగుతామని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. నేడు కాంగ్రెస్‌తో చర్చలు! సోమవారం ఉదయం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో టీడీపీ నేతలు సమావేశ మయ్యే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్, టీడీపీల మధ్య చర్చలు జరిగే అవకాశముంది. బంద్ నేపథ్యంలో ఒకవేళ సోమవారం చర్చలకు వీలు కాకపోతే మంగళవారం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
కూటమి ఏర్పాటు దిశగా టీడీపీ.. చాడకు రమణ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేతలు మరో సారి సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు తప్పదని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో మిగతా పార్టీలతో కూటమి కట్టేందుకు టీటీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పొత్తులపై చర్చలకు రావాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆహ్వానించారు. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. మంగళవారం జరిగే ఆల్‌పార్టీ సమావేశం తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కమిటీల ఏర్పాటు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. -
‘పొత్తు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా’?
సాక్షి, హైదరబాద్ : చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగు దేశం ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. రెండు గంటలపాటు టీటీడీపీ నేతలతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జరిపిన చర్చల్లో.. పొత్తులు ఉంటాయంటూ చంద్రబాబు నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. నిన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు వద్దంటూ ఎల్ రమణ చంద్రబాబుకు చెప్పారు. దీంతో రమణతో పాటు ఇతర నేతలను ఆయన మందలించారు. పొత్తులు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా అంటూ వారిని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవు.. అందుకు తగ్గట్టుగా సిద్దంగా ఉండాలని సూచించారు. ఇవాళ మీటింగ్‌లో సైతం కాంగ్రెస్‌తో పొత్తుపైనే ముఖ్యనేతలతో మరోసారి చంద్రబాబు చర్చించారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దనే నేతలు, పొత్తు కోరుకునే వారితో చర్చించారాయన. ఒక్క కాంగ్రెస్‌తోనే పొత్తు అంటే పార్టీ సిద్దాంతాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, జనసమితి ఇతర పార్టీలతో కూటమి కట్టేలా సమాలోచనలు చేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. రేపటిలోగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది. -
మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో బీసీ విద్యార్థులకు అన్యా యం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ కోటాలో సీటు సాధించిన బీసీ విద్యార్థులను రిజర్వ్డ్ స్థానాల్లో భర్తీ చేస్తున్నారని, దీంతో బీసీలకు సీట్లు తగ్గుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సోమవార ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఓపెన్ కోటాలో సీటు సాధిస్తే..కాలేజీ మార్పు చేసుకున్నప్పటికీ సదరు విద్యార్థి ఓపెన్ కేటగిరీలోనే ఉండాలన్నా రు. కానీ కేటాయింపులో అలా జరగడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీఎంను కోరారు. -
టీడీపీ కష్టాల్లో ఉంది.. ఓటుకు కోట్లు వల్లే ఈ దుస్థితి
-
‘ఉరితాడు వేసుకుని చంద్రబాబుకు సహకరించా’
సాక్షి, హైదరాబాద్ : సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు. ఉరితాడు వేసుకుని బాబుకు సహకరించా : తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలో టీడీపీ రెండు నాల్కల విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, నాయకులు సైతం తిట్టిపోసినా పట్టించుకోకుండా చంద్రబాబు వెంటే నడిచానని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఉద్యమానికి మద్దతు ఇవ్వనికారణంగా నన్ను చంపడానికి కొందరు నన్ను చంపాలనుకున్నారు. మా ఇంటిని రెక్కీ కూడా చేశారు. అయినాసరే నేను భయపడలేదు. నా జీవితాన్ని బలిచేసి, ఉరితాడు వేసుకుని మరీ చంద్రబాబుకు అండగానిలబడ్డాను. కానీ.. నా త్యాగాలకు విలువలేకుండా పోయిందిప్పుడు. అసమర్థులు, ద్రోహుల చేతికి చంద్రబాబు పార్టీని అప్పగించారు. ఆ నీతిమాలిన, బజారు మనుషుల పక్కనే నేనూ కూర్చోవాల్సి వచ్చింది. అయినాసరే, చంద్రబాబు నాయకత్వాన్నే సమర్థించాను. కానీ ఆయనేం చేశారు? నన్ను పిలవకుండా హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టారు. ఇది నన్ను దారుణంగా బాధించింది.. ఓటుకు కోట్లు కేసే కారణం : గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే, ఓటుకు కోట్లు కేసు తర్వాత అంతా తలకిందులైంది. డబ్బు సంచులతో పట్టుపడ్డ రేవంత్ రెడ్డిని ఆనాడే పార్టీ నుంచి బహిష్కరించేదుంటే పార్టీ బతికుండేది. అలా జరగకపోవడం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు దిక్కులేకుండా పోయింది. స్వయంగా చంద్రబాబు తిరిగితేగానీ తెలంగాణలో మేం బాగుపడం’’ అని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్తోనే టీడీపీ : ‘తెలంగాణలో పార్టీ బతకాలంటే పొత్తులు తప్పనిసరి. ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోము కాబట్టి టీఆర్ఎస్తోనే టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని, చాలా కాలం నుంచే తానీ ప్రతిపాదన చేస్తున్నానని ఆయన గుర్తుచేశారు. -
‘దేశం’ డీలా.. పార్టీకి లీడర్ లేడు.. కేడరూ లేదు..!
జిల్లాలో సుమారు రెండు దశాబ్దాల పాటు బలమైన రాజకీయ శక్తి. సర్పంచ్‌లు, ఎంపీపీలు మొదలుకుని ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఆ పార్టీ నేతలే రాజ్యమేలారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యూహంతో చావు దెబ్బ తగిలింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగైంది. ఇప్పుడా పార్టీకి లీడర్ లేడు.. కేడరూ లేదు.. మిగిలిందల్లా ఒకరిద్దరు సొంత బలం కలిగిన నేతలు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల నాటికి.. మిగిలిన ఆ ఒకరిద్దరూ పార్టీలో ఉంటారా..? వేరే దారి చూసుకుంటారా..? ఇదీ ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పార్టీ ఆవిర్భావం నుంచి సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా నిలిచింది. ప్రస్తుత సీఎం కేసీఆర్‌తో పాటు అనేక మందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు అనేక పదవులు దక్కించుకున్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహంతో అసెంబ్లీ, పార్లమెంటులో జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒక్కరికీ ప్రాతినిధ్యం దక్కలేదు. క్షేత్ర స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం మినహా ఎక్కడా టీడీపీ విజయం సాధించలేదు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో నలుగురు జెడ్పీటీసీ సభ్యులు, 102 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఊపందుకోవడంతో ప్రస్తుతం కేవలం పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ మాత్రమే పార్టీలో మిగిలారు. జహీరాబాద్, నారాయణఖేడ్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పార్టీలో కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో టీటీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బట్టి జగపతి, శశికళ యాదవరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. మిగిలింది ఒకరిద్దరు నేతలే! ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సొంత శక్తి కలిగిన ఒకరిద్దరు నేతలే మిగిలారు. దశాబ్దకాలంగా పార్టీ నుంచి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు సాగుతున్న నేపథ్యంలో.. సాధారణ ఎన్నికల నాటికి వీరిలో ఎవరు పార్టీలో ఉంటారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, అందోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు లేకపోవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గుండు భూపేశ్ వ్యవహరిస్తుండగా, మాజీ కౌన్సిలర్ దరిపల్లి చంద్రం వంటి ఒకరిద్దరు మాత్రమే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలేవీ నిర్వహించే పరిస్థితి లేదు. 2009 సాధారణ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రతాప్‌రెడ్డి భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగింది. ఇటీవల సుమారు నెల రోజుల పాటు జైలులో గడిపిన ప్రతాప్‌రెడ్డి విడుదల అనంతరం ఒకటి రెండు గ్రామాల్లో పర్యటించి.. ఆ తర్వాత స్తబ్దుగా ఉంటున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇల్లెందుల రమేశ్ మినహా.. పార్టీ పేరు చెప్పుకునే కార్యకర్తలు కూడా కనిపించడం లేదు. పార్టీ దాదాపు తుడిచి పెట్టుకుపోయిన పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తోంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ బట్టి జగపతి.. రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఏకే గంగాధర్‌రావు పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజవర్గంలో హత్నూర మండలం దేవులపల్లికి చెందిన రఘువీరారెడ్డి టీడీపీ నేతగా చెలామని అవుతున్నా.. పార్టీ కార్యకలాపాలేవీ జరగడం లేదు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ అవిర్భావం నుంచి టీడీపీ బలమైన శక్తిగా ఉన్నా.. వలసల మూలంగా బలహీన పడింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సపానదేవ్ టీఆర్ఎస్లో చేరగా, పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన శశికళ యాదవరెడ్డి.. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌లో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక జెడ్పీటీసీ సభ్యుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న శ్రీకాంత్‌గౌడ్ త్వరలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ నియమితులయ్యే అవకాశం ఉంది. శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు ఎడ్ల రమేశ్, మాణిక్యప్రభు వంటి ఒకరిద్దరు నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీడీపీ పూర్తి నిస్తేజంగా మారగా, జెడ్పీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, బందన్న గౌడ్ వంటి ఒకరిద్దరు నేతలు నామ్‌కే వాస్తేగా కొనసాగుతున్నారు. అందోలు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి నేత శ్రీశైలం ఇన్చార్జిగా కొనసాగుతున్నా పార్టీ కార్యకలాపాలేవీ సాగడం లేదు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరోత్తమ్ పల్లెపల్లెకూ టీడీపీ పేరిట పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గుండప్ప, దశరథరెడ్డి పార్టీలో ఉన్నా.. క్రియాశీల కార్యక్రమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన మదన్మోహన్ రావు పార్టీ పరంగా ఎక్కడా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తున్నా.. 2016లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన వలసలు పార్టీని పూర్తిగా బలహీన పరిచాయి. సిద్దిపేట జిల్లాలో అంతర్భాగంగా ఉన్న చేర్యాల, హుస్నాబాద్, బెజ్జంకి ప్రాంతాల్లోనూ టీడీపీ నామ మాత్ర ఉనికి కూడా కనిపించడం లేదు. -
పట్టాలెక్కేందుకు.. టీడీపీ ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వలసలతో చిక్కిశల్యమైన టీడీపీ మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేయి తిప్పుకునేందుకు ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అధ్యక్షులను, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ని నియమించింది. నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఎండీ యూసుఫ్, సూర్యాపేటకు పెద్దిరెడ్డి రాజా, యాదాద్రి భువనగిరికి బండ్రు శోభారాణిలను అధ్యక్షులుగా అధినాయకత్వం నియమించింది. నల్లగొండ అసెంబ్లీ ఇన్చార్జ్గా మాదగోని శ్రీనివాస్‌గౌడ్ పేరును ప్రకటించింది. తెలంగాణ టీడీపీ నుంచి కొన్నాళ్లుగా అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు జరిగాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్య నేతలంతా ఖాళీ అయ్యారు. ఫలితంగా పార్టీ సంస్థాగతంగా కోలుకోలేకుండా అయ్యింది. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయినా ఆశలు సజీవంగా నిలుపుకొని నిలబడింది. వరుస కట్టిన సీనియర్లు కొద్ది నెలలుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల తర్వాత ఒక్కో సీనియర్.. పార్టీని వదలడంతో కుదేలైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే సీనియర్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన బడుగుల లింగయ్య యాదవ్‌ల వలసలతో మొదలై.. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న బిల్యానాయక్ , గత ఎన్నికల్లో పార్టీనుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఉమామాధవరెడ్డి, సూర్యాపేటనుంచి పటేల్ రమేష్‌రెడ్డి తదితరులు పార్టీని వీడారు. మరోవైపు నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం రెండునెలల కిందటే పార్టీనుంచి టీఆర్ఎస్కు వెళ్లిపోయారు. ఈ వరుస పరిణామాల తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీ బతికి బట్టకట్టడం అసాధ్యమన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వ్యక్తమైంది. కానీ, ఈ పరిస్థితినుంచి బయటపడి 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి కోలుకునే దిశగా ఆ పార్టీ నాయకత్వం కాయకల్ప చికిత్స మొదలు పెట్టిందని, దీనిలో భాగంగానే మూడు జిల్లాలకు అధ్యక్షులను నియమించిందని, మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను ప్రకటించనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్ష పదవులకు పోటాపోటీ ! గ్రూపు గొడవలకు తావులేకుండా జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేయాలని భావించిన పార్టీ నాయకత్వం పలువిడతలుగా జిల్లా నాయకులతో చర్చలు జరిపింది. నల్లగొండ జిల్లా అధ్యక్షపదవి కోసం యూసుఫ్‌తోపాటు నల్లగొండ నేత మాదగోని శ్రీనివాస్‌గౌడ్, దేవరకొండ నుంచి వెంకట్‌రెడ్డి పోటీ పడ్డారు. సూర్యాపేట కోసం పెద్దిరెడ్డి రాజాతోపాటు కోదాడ ఇన్చార్జ్ బొల్లం మలయ్య యాదవ్ ప్రయత్నించారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి అధ్యక్ష పదవి కోసం బండ్రు శోభారాణితో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన అయిలయ్య పోటీ పడ్డారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలోని రెండు మండలాలే యాదాద్రి భువనగిరి జిల్లాలో కలవడంతో, మెజారిటీ శ్రేణులు ఆయన పేరును వ్యతిరేకించారని సమాచారం. అసెంబ్లీ నియోజకర్గ ఇన్చార్జులుగా ఉన్న వారికి అధ్యక్ష పదవులు ఇవ్వొద్దని సంస్థాగతంగా నిర్ణయించడంతో కోదాడ ఇన్చార్జ్గా ఉన్న బొల్లం మల్లయ్య యాదవ్‌ను పక్కన పెట్టారని తెలిసింది. నల్లగొండ ఇన్చార్జ్గా నియమిస్తున్నందున మాదగోని శ్రీనివాస్‌ను ఎంపిక చేసుకోలేదని సమాచారం. ఇక, మూడు జిల్లాల్లో సామాజిక సమీకరణ సమతూకం ఉండడానికే నల్లగొండ జిల్లాకు మైనారిటీ నేతను అధ్యక్షుడిగా ఎంచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. -
వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీచేస్తాం..
సారంగాపూర్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేకుండా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో ఆయన ఆదివారం విలేక రులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని బలహీనపరచ డానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్నాయని ఆరోపించారు. ఆయా పార్టీల్లోకి టీడీపీ నేతలను చేర్చుకోవడం ఇందులో భాగమేనని చెప్పారు. బీజేపీతో పొత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. నాయకుల కొనుగోళ్లకు టీఆర్ఎస్ తెరలేపిందని, ఉద్యమపార్టీ ముసుగులో లాభ పడిందని విమర్శించారు. తెలంగాణలో తెలుగుదేశంపార్టీ బలహీ నంగా ఉందన్న విషయం వాస్తవంకాదని, పార్టీని బలహీనపరిచి, తమ బలం పెంచుకోవడానికి ఎదుటి పార్టీలు పనిచేస్తున్నాయని రమణ విమర్శించారు. -
టీడీపీ మరో వికెట్ డౌన్ : రేవంత్ వెంటే సీతక్క
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ములుగు నియోజకవర్గ ఇన్చార్జి సీతక్క ఊహించిన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధులయ్యారు. పార్టీ పదవులు, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు అధ్యక్షడు చంద్రబాబు నాయుడుకు సీతక్క లేఖ రాశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఫ్యాక్స్‌లో లేఖను బాబుకు పంపారు. అనంతరం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేటి సాయంత్రం రాహుల్ సమక్షంలో : పలువురు టీడీపీ జిల్లా అధ్యక్షలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరతారు. మంగళవారం ఉదయం హుటాహుటిన బయలుదేరిన సీతక్క.. రేవంత్ బృందంతో కలుసుకునే అవకాశంఉంది. ఇంకొందరు ప్రముఖులు! : గిరిజన వర్గానికి చెందిన సీతక్క(ధనసరి అనసూయ) ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీడీపీకి ముఖ్యనాయకురాలిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో ఓడినా, పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తనతోపాటే ఎదిగిన ఎర్రబెల్లి లాంటి నేతలు సైతం గుడ్‌బై చెప్పి వెళ్లినా ఆమె మాత్రం నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు. అయితే, తెలంగాణలో టీడీపీని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబోతున్నారన్న వార్తల నడుమ ఆమె ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోక తప్పని పరిస్థితి. ఇంకొందరు ప్రముఖులు కూడా తమతమ దారులు వెతుక్కునే పనిలో ఉన్నట్లు తెలిసింది. జాబితో సీతక్క పేరు లేకున్నా..: రేవంత్ తిరుగుబావుటా అనంతరం అతని వెంట వెళ్లే నాయకుల జాబితాలో సీతక్క పేరు ప్రధానంగా వినిపించింది. కానీ రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చినట్లుగా పేర్కొంటున్న జాబితాలో సీతక్క పేరులేకపోవడం గమనార్హం. 2014లో ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసిన సీతక్క.. అజ్మీరా చందూలాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పర్యాటక మంత్రి చందూలాల్ కూడా ఒకప్పటి టీడీపీ నేతే! -
రేవంత్ రెడ్డి భారీ జాబితా ; టీడీపీకి చావుదెబ్బే!
సాక్షి, హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న రేవంత్ రెడ్డి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తెలుగుదేశం పార్టీని చావుదెబ్బకొట్టబోతున్నారా? భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నేటి(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి రేపు(మంగళవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి కీలక నేతలుగా ముద్రపడినవారిలో అధికులు రేవంత్ వెంట నడవబోతున్నట్లు తెలిసింది. వీరందరి కోసం ఇప్పటికే ఢిల్లీ కర్ణాటక భవన్లో గదులు బుక్ చేసినట్లు సమాచారం. వైరల్ జాబితా : రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్న నాయకులు వీరేనంటూ కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అయింది. లిస్ట్ ఏ, లిస్ట్ బి గా వర్గీకరించిన ఆ జాబితాలో నాయకుల పేర్లు, జిల్లా, ప్రస్తుతం టీడీపీలో వారి స్థానం, కులం, మతం తదితర వివరాలన్నీ పొందుపర్చి ఉన్నాయి. కాగా, ఆ జాబితాలోని వారిలో వేం నరేందర్ రెడ్డి ఒక్కరే బాహాటంగా రేవంత్‌కు మద్దతు పలికి, టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలినవారంతా రేపు నేరుగా పార్టీ మారబోతున్నట్లు సమాచారం. టీడీపీకి చావుదెబ్బే! : రేవంత్ వెంట వెళ్లబోయేవారిగా ప్రచారంలో ఉన్న జాబితాలో .. మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘం నేతల వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది పాపులర్ నేతలేకాక, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారే కావడం గమనార్హం. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరుతుండటం టీడీపీకి చావుదెబ్బే అన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన ముఖ్యనేతలు కూడా అతిత్వరలోనే ప్రత్యామ్నాయ వేదికలు చూసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చర్చనీయాంశమైన ‘రేవంత్ జాబితా’ ఇదే.. -
తెలంగాణ టీడీపీలో అలజడి..!
-
తెలంగాణ టీడీపీలో అలజడి..!
సాక్షి, విజయవాడ: రేవంత్‌రెడ్డి పార్టీని వీడటం.. తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు మెజారిటీ టీటీడీపీ నేతలు సిద్ధపడుతున్నారు. ఈ రాత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం కల్లా మెజారిటీ తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు మద్దతుగా రాజీనామాలు సమర్పించవచ్చునని వినిపిస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో ఆయనతోపాటు టీడీపీ నేతలు చాలామంది హస్తం గూటికి వెళ్లవచ్చునని వినిపిస్తోంది. ఈ దెబ్బకు తెలంగాణ టీడీపీ ఖాళీ కావడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో టీడీపీ ఖాళీ కాకుండా చూసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈ భేటీ అనంతరం టీ టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై.. దిశానిర్దేశం చేస్తారని అన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారని టీడీపీ నేత పెద్దిరెడ్డి తెలిపారు. ఈ భేటీలో రేవంత్ వ్యవహారంపై చర్చ జరగలేదని, ఆయన రాజీనామా చేయాలని ముందుగానే నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చారని అన్నారు. -
రేవంత్ ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయాలు తీసుకునే హక్కు తనకు ఉందని ఎల్ రమణ అంటున్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల ఖండించిన టీటీడీపీ చీఫ్ రమణ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గతంలో స్టార్ హోటళ్లలో నిర్వహించిన పార్టీ సమావేశాలకు రేవంత్ కూడా హాజరయ్యాడని.. అప్పుడు ఎవరు డబ్బులు పెట్టారని వచ్చాడంటూ ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ కబంధహస్తాల్లో ఇరుక్కుపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని, నిన్నటి సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. డబ్బు కోసం చీకటి ఒప్పందాలు చేసుకునే రకం తాను కాదని ఈ సందర్భంగా రమణ తెలిపారు. ‘‘ఆర్థికంగా ఉన్న కుటుంబం మాది. నాపై ఆరోపణలు చేసే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అందరికీ తెలుసు’’ అని రేవంత్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎర్రబెల్లిపై ఆరోపణలు చేసిన సమయంలో తన కూతురిపై రేవంత్ ప్రమాణం చేసి మరీ తర్వాత గప్ చుప్ అయిపోయాడన్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇప్పుడు రేవంత్ చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలనే తాము కోరుతున్నామని, అది జరిగేంత వరకు పార్టీ కార్యక్రమాలకు రేవంత్‌ను ఆహ్వనించమని రమణ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ పార్టీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారే ప్రభుత్వం తరపున పోరాటాన్ని కొనసాగిస్తారని చెప్పారు. తానెవరి దగ్గర రూపాయి తీసుకోలేదని.. తప్పు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, నేడు ఉదయం 11 గంటలకు లేక్‌వ్యూ గెస్ట్ హౌజ్‌లో చంద్రబాబుతో భేటీలో నిర్ణయం తీసుకుంటామని రమణ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు రేవంత్ రెడ్డి హాజరుకావటంతో.. ప్రత్యేకంగా బాబుతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
బయట పేచీ, లోపల లాలూచీ
డేట్లైన్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి. తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా, రామకృష్ణుడినే నంబర్ టూగా పరిగణించాలి. నిజానికి యనమల రామకృష్ణుడు లేకపోతే రాజకీయాల్లో చంద్రబాబునాయుడు లేరు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు శాసనసభ స్పీకర్‌గా ఉన్న యనమల కొంచెం భిన్నంగా వ్యవహరించి ఉంటే చంద్రబాబునాయుడి రాజకీయ చరిత్ర అక్కడితో ముగిసి ఉండేది. శాసనసభలో అంతకు ముందురోజు వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న రామారావును తామందరికీ రాజకీయ భిక్ష పెట్టారన్న విషయాన్ని కూడా మరచి కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతించకుండా యనమల ఆరోజు చంద్రబాబు అనుకూల వైఖరి తీసుకుని ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరిటాల సునీత, అదే తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవి భార్య. ప్రస్తుత మంత్రివర్గ సభ్యురాలు. పయ్యావుల కేశవ్ మాజీ శాసనసభ్యుడు. ప్రస్తుత శాసన మండలి సభ్యుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ‘బ్యాక్ రూమ్ మేనేజ్మెంట్’ అద్భుతంగా చేసినందుకు చంద్రబాబు చేత ప్రత్యేక సత్కారం అందుకున్న ముఖ్యుడు. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని, సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే ఆశ కూడా లేని తెలంగాణ రాష్ట్ర విభాగం కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు. పార్టీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన ఒక తప్పుడు వ్యూహంలో పావుగా మారి, జైలుకు వెళ్లి, తీరని నిందను మోస్తున్నవాడు. ఈ నలుగురి ప్రస్తావనే ఇప్పుడెందుకంటే, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆనాడేమైందీ ప్రశ్నించే గుణం? రేవంత్‌రెడ్డి పార్టీ మారబోతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని పలువురు ముఖ్య నేతలను, కార్యకర్తలను తీసుకుని కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్త. అందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. కాంగ్రెస్‌లో చేరితే తన వర్గం వారికి పది పదకొండు లోక్‌సభ స్థానాలు, ఓ 25 శాసనసభ స్థానాలు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పిలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వివరణ కోరారు. తెలుగుదేశంలో ఉంటూ నువ్వు రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తావు? అందుకు చంద్రబాబునాయుడి అనుమతి తీసుకున్నావా? అని ప్రశ్నిస్తే, మీకెవ్వరికీ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు విదేశాల నుంచి వచ్చాక ఆయనకే చెప్తాను అన్నీ అన్నారు రేవంత్‌రెడ్డి. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది నెగ్గకుండా చూడటానికి తెలుగుదేశం పక్షం సభ నుంచి గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్‌తో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారని చంద్రబాబును ఈ నాయకులు ప్రశ్నించలేదు. ఇంతెందుకు, 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను కట్టి కాంగ్రెస్ సహాయంతో కేంద్రంలో పార్టీని చేర్చినప్పుడు మనది కాంగ్రెస్ వ్యతిరేక పునాది మీద పుట్టిన పార్టీ అని మోత్కుపల్లి నర్సింహులు ఎందుకు గుర్తు చెయ్యలేదో మరి! మొన్నటికి మొన్న, వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో, నిన్న సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశామని తెలంగాణ టీడీపీ నాయకులు తమను తాము ప్రశ్నించుకుంటే బాగుండేది. అప్పుడు మాట్లాడని నాయకులు రేవంత్ నుంచి వచ్చిన సమాధానంతో సమావేశం నుంచి వాకౌట్ చేస్తే, రేవంత్ మాత్రం దర్జాగా ట్రస్ట్ భవన్‌లోనే కూర్చున్నారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ గాని, ఇంకెవరైనా గాని ఇక్కడ పార్టీ వ్యవహారాల మీద ఏమాత్రం పట్టు లేనివాళ్లని తేలిపోయింది. క్రమశిక్షణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఇది. ఆయన కుమారుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌బాబు మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేసి కూడా ఎవరినీ కట్టడి చెయ్యలేని స్థితిలో తిరిగి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. వీరిది పోరాటం, వారిది వ్యాపారం తాను సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పార్టీలో నాయకత్వానికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని తలెగరేసిన రేవంత్ పక్క రాష్ట్రంలోని మంత్రుల మీద, నాయకుల మీద కూడా విరుచుకు పడ్డారు. పార్టీ కోసం నేను జైలుకు వెళితే, తెలంగాణ లో ప్రభుత్వంతో కొట్లాడుతుంటే ఆంధ్ర మంత్రులు, నాయకులు తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించి వ్యాపారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్ ఒక్కడే బయటపడి వివరణ ఇచ్చారు తప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత నోరు మెదపలేదు. బహుశా అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు. అయినా అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రితో మాట్లాడటం ఈ రోజుల్లో ఏమంతపని! మాట్లాడే ఉంటారు. ఆయన ఏం చెప్పారో అందరూ అర్థం చేసుకోవచ్చు కూడా. అటు ఆంధ్ర మంత్రులూ నాయకులకయినా, ఇటు తెలంగాణ పార్టీ నేతలకయినా ఈ పరిస్థితిలో చంద్రబాబునాయుడు ఏం చెబుతారు? ఇంకొకరు ఎవరయినా అయితే పార్టీ నుంచి తక్షణం బహిష్కరించి ఉండే వాళ్లం కానీ, ఈయన రేవంత్‌రెడ్డి అయిపోయారు. కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఎవరూ తొందర పడకండి అనే చెప్పి ఉంటారు. నిజమే కదా! ఓటుకు కోట్లు కేసులో వ్యూహం రచించింది తానూ, అమలు చేస్తూ దొరికిపోయి జైలుకు వెళ్లింది రేవంత్ రెడ్డి కాబట్టి, ఆ కేసు ఇంకా నెత్తి మీద కత్తిలా వేలాడుతూనే ఉంది. ఎంత స్నేహహస్తం చాచుతున్నట్టు కనిపిస్తున్నా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అవసరమైతే దాన్ని మళ్లీ తన మీద ప్రయోగించడానికి వెనుకాడరన్న విషయం చంద్రబాబునాయుడుకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా ఇటూ అటూ తెలుగుదేశం వారంతా ‘వ్యూహాత్మక మౌనం’పాటించాల్సిందే, తప్పదు. ఇక యనమల రామకృష్ణుడి సంబంధీకులకు తెలంగాణలో వేల కోట్ల రూపాయలకాంట్రాక్టులు, పరిటాల సునీత కుమారుడికీ,పయ్యావుల కేశవ్ అల్లుడికీ వ్యాపార లైసెన్సుల గురించి రేవంత్ మాట్లాడితే; రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత కలసి వ్యాపారం చెయ్యడం కోసం కంపెనీ రిజిస్టర్ చేయడం గురించి కేశవ్ ప్రస్తావించారు. ఈ విషయానికి వస్తే ఇందులో ఎవరు పులుకడిగిన ముత్యాలు అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులూ; అక్కడివారు ఇక్కడ, ఇక్కడి వారు అక్కడ వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి కాంట్రాక్ట్‌లు, లైసెన్స్‌లు తెచ్చుకుంటూనే ఉన్నారు. వ్యాపారం చేయవద్దని ఎవరూ చెప్పరు. ఫలానా వర్గం వారే వ్యాపారాలు చెయ్యాలనీ ఎవరూ చెప్పరు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు వ్యాపారాలకు అర్హులు కాదు అనే చట్టం ఏమీలేదు. తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే హక్కు జీవించే హక్కు వంటి ఇతర హక్కుల వంటిదే. రాజ్యాంగం ప్రసాదించిన హక్కే. అయితే చిక్కంతా ఎవరు ఎటువంటి వ్యాపారాలు ఏ రకంగా చేస్తున్నారు అన్న విషయం దగ్గరనే. పయ్యావుల కేశవ్ చెప్పినట్టు తెలంగాణలో మద్యం వ్యాపారం చేసుకోవడానికి నిబంధనలను అనుసరించి ఆయన మేనల్లుడో, ఇంకొకరో ఆంధ్ర ప్రాంతానికో, రాయలసీమ ప్రాంతానికో చెందినవారు లైసెన్సులు తెచ్చుకుంటే ఆక్షేపించనక్కర లేదు. తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేసుకునే హక్కును ఎవరూ కాదనలేరు. నిజానికి దేశంలో ఈ చివర నుంచి, ఆ చివర దాకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు నిర్మించే కాంట్రాక్టర్లు కొంతమంది తెలుగువాళ్లేనన్న విషయం మరిచిపోవద్దు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు ఒక సందర్భంలో స్వయంగా తానే చెప్పారు, ఆంధ్రప్రాంతం వారితో తనకున్న వ్యాపార లావాదేవీలను గురించి. రాజకీయాలు, వ్యాపారం కలగాపులగం అయిపోయినందునే సమస్యంతా. ఉదాహరణకు రాజకీయ అవసరాలకారణంగానే అమాయకులయిన విద్యార్థులు చదువుల ఒత్తిడి తట్టుకోలేక అన్యాయంగా ప్రాణాలు తీసుకుంటుంటే ఏ చర్యా లేకుండా పోయింది, ఇక్కడయినా, అక్కడయినా. ముందు నుయ్యి వెనుక గొయ్యి ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక రెండు వైపులా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దడంలో ప్రదర్శించని సఖ్యత, వ్యాపారాలు పెంచుకోవడంలో ప్రదర్శిస్తేనే అభ్యంతరం. రాజకీయంగా ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకుంటూ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింప చేసుకోవడానికి అజ్ఞాత స్నేహాలు చేస్తేనే అభ్యంతరం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. తన రాజకీయ అవసరాల కోసం రేవంత్‌రెడ్డి కొన్ని వ్యవహారాలు మాత్రం బయట పెట్టి ఉండవచ్చు. బయటికి రానివి ఇంకెన్నో! ఏది ఏమైనా రేవంత్‌రెడ్డి వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీని అక్కడా ఇక్కడా మరింత అయోమయంలో పడేసిన మాట వాస్తవం. పార్టీ నుంచి బహిష్కరిస్తే ఓటుకు కోట్లు వ్యవహారం ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో, బుజ్జగించి పార్టీలోనే ఉంచుకుందామంటే టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి కచ్చితంగా అవలంబించాల్సిందే అన్న రేవంత్ షరతు మింగుడు పడదాయే. ముందునుయ్యి, వెనుక గొయ్యి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
సొంత నియోజకవర్గంలో రేవంత్‌కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే భారీ షాక్ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 700మంది కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పి మంత్రులిద్దరూ స్వాగతం పలికారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కొడంగల్ మండలం చిట్లపల్లి ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, శరణమ్మ, హనుమంతురెడ్డి, కొడంగల్ జెడ్పీటీసీ, టీడీపీ దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీడీపీకి చెందిన దౌల్తాబాద్ సర్పంచ్ పార్వతమ్మ, గుండెపల్లి సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, చంద్రకల్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ ఆశన్న, దౌల్తాబాద్ మండలం కో ఆప్షన్ మెంబర్ జాకీర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు(కోస్గి) చిన్నారెడ్డి, బిజ్జరాం టీడీపీ సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్య, బిజ్జారం గ్రామ పార్టీ అధ్యక్షుడు పటేల్ బస్వరాజు, దౌల్తాబాద్ మండలం అంతారం మాజీ ఉప సర్పంచ్ బసంత్ రెడ్డి, దౌల్తాబాద్ పీఏసీఎస్ డైరెక్టర్ రాజప్ప, దౌల్తాబాద్ మండలం గోకపస్లాబాద్ మాజీ ఎంపీటీసీ ఆనంతయ్య, దౌల్తాబాద్ మండల కేంద్రం నుంచి వార్డ్ మెంబర్లు నారాయణ, ఎల్లమ్మ, మల్కయ్య గౌడ్, శ్రీనివాస్, పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉన్నారు. -
రేవంత్ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది!
సాక్షి, హైదరాబాద్ : ఏళ్లుగా తెలుగుదేశం- భారతీయ జనతాపార్టీల మధ్య కొనసాగుతోన్న స్నేహం విచ్ఛిన్నం కావడానికి రేవంత్ రెడ్డి వైఖరే ప్రధాన కారణమని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. రేవంత్ కోసం తాను ఎంతో చేశానని, కష్టసమయంలో అండగా నిలిచానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో చిచ్టాచ్ చేసిన రమణ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు చెప్పకుండా ఢిల్లీకి ఎందుకెళ్లారు? : ‘‘రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైనప్పుడు అతనికి మద్దతుగా అన్ని పార్టీలనూ కూడగట్టింది నేనే. కష్టసమయాల్లో అతనికి అండగా నిలిచాను. అసలు రేవంత్ వైఖరి వల్లే టీడీపీకి బీజేపీ దూరమైంది. పార్టీ అధ్యక్షుడినైన నాతో చెప్పకుండా రేవంత్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఒకవేళ కోర్టు పనులే అయిఉంటే అందులో దాచడానికి ఏముంటుంది?’’ అని రమణ వాపోయారు. బాబు రాగానే చర్యలు : అటు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను, ఇటు పాలమూరులో ఎమ్మెల్యే డీకే అరుణను కలవడంపై రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాల్సిందేనని, అప్పటిదాకా ఆయనను పార్టీ సమావేశాలకు రానిచ్చేదిలేదని రమణ స్పష్టం చేశారు. క్రమశిక్షణను ధిక్కరిస్తే ఎవ్వరినైనా ఉపేక్షించబోమని, విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు తిరిగి రాగానే రేవంత్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి? : ఏపీ టీడీపీ మంత్రులు, నాయకులకు తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తూ, ఫ్యాక్టరీల ఏర్పాటులో సహకరిస్తోందంటూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైనా ఎల్.రమణ స్పందించారు. ‘‘అసలు ఏపీ టీడీపీ నేతలు తెలంగాణలో కాంట్రాక్టులు చేస్తే తప్పేంటి?’ అని ప్రశ్నించారు. కాగా, రేవంత్ నిష్క్రమణకు మూల కారణంగా భావిస్తోన్న ‘టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు’ అంశంపై రమణ ఆచితూచి స్పందించారు. పొత్తుల గురించి ఇప్పుడు అనవసరమని, ఎన్నికల సమయంలో ఆలోచిస్తామని అన్నారు. -
రేవంత్ వల్లే టీడీపీ-బీజేపీ దోస్తీ చెడింది!
-
ఊగిసలాట!
జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది. పార్టీ మారుతాడన్న విషయంలో మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పార్టీ కార్యకర్తలు, నాయకుల అంతరంగం ఏమిటి? సహచరులు ఏ వైపు చూస్తున్నారు? మనం ఎటు పయనించాలి అన్న తర్జనభర్జనలో ఉన్నారు. రేవంత్ పార్టీ మారుతారా? లేదా? మారితే.. జరిగే పరిణామాలు ఏమిటన్న విషయంలో స్పష్టత కరువైంది. అయితే నేడు కొడంగల్‌లో జరగనున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఏ విషయం ప్రకటిస్తారోనన్న ఆసక్తి జిల్లా అంతటా నెలకొంది. కొడంగల్: తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు టీడీపీ కార్యకర్తలు, నాయకులను అయోమయానికి గురి చేసింది. గడిచిన 14 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి.. తెలంగాణ ఉద్యమకాలంలో రెండోసారి ఊహించని పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కాలంలో జరిగిన ఆకస్మిక పరిణామాలు మీడియాలో వస్తున్న కథనాలు టీడీపీ నాయకులను ఆందోళకు గురి చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమ నాయకుడి పయనం ఎటువైపు ఉంటుందోనని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. విభజన ప్రభావం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాల విభజన కొడంగల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గాన్ని ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రెండు ముక్కలు చేయడం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొడంగల్ దౌల్తాబాద్, బొంరాస్‌పేట మూడు మండలాలను వికారాబాద్‌లో, కోస్గి, మద్దూరు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపారు. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు పట్టు కోల్పోయారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కోస్గి, మద్దూరు మండలాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిల ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్ రాజకీయ ప్రస్తానం మొదటిసారి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా గెలుపొందారు. పదవిలో ఉండగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రాదేశిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014లో రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిపై సుమారు 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పోటీ చేసిన నాలుగు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి లేకుండా విజయం వరించింది. రేవంత్‌తోనే రాజుగౌడ్.. రసవత్తరంగా తాండూరు రాజకీయాలు తాండూరుటౌన్ : టీ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వస్తున్న వార్తలతో తాండూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తక్షణమే తాండూరులో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలోనే కొనసాగుతూ రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న తాండూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాజుగౌడ్ సైతం అతడితోనే పయనం సాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు, సుమారు 30 మందితో ఉన్న తన అనుచరగణం లిస్టును తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్‌గాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఆ లిస్టులో ఉన్న వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రాధాన్యత ఇవ్వాలని అందులో ఉన్నట్లు తెలిసింది. తాండూరులో జరిగిన టీడీపీ పోరుబాట కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజుగౌడ్‌ను రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. అయితే రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చి జాబితాలో రాజుగౌడ్ పేరు సైతం ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే గనుక జరిగితే.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమైన రమేష్ మహరాజ్, ఆయన వర్గం దీనిని స్వాగతించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో రసవత్తర రాజకీయాలకు తెర లేవనున్నట్లు అవగతమవుతోంది. అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో లేదో కానీ తాండూరు అసెంబ్లీ స్థానంపై మాత్రం జనాల్లో చర్చ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఎవరు ఏ పార్టీలోకి వచ్చి ఏమి చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. -
ఊగిసలాట.. ఎటూ తేల్చుకోలేకపోతున్న తెలుగు తమ్ముళ్లు..
ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళనకు కారణమైంది. పార్టీ మారుతాడన్న విషయంలో మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. పార్టీ కార్యకర్తలు, నాయకుల అంతరంగం ఏమిటి? సహచరులు ఏ వైపు చూస్తున్నారు? మనం ఎటు పయనించాలి అన్న తర్జనభర్జనలో ఉన్నారు. రేవంత్ పార్టీ మారుతారా? లేదా? మారితే.. జరిగే పరిణామాలు ఏమిటన్న విషయంలో స్పష్టత కరువైంది. అయితే నేడు కొడంగల్‌లో జరగనున్న టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో రేవంత్ ఏ విషయం ప్రకటిస్తారోనన్న ఆసక్తి జిల్లా అంతటా నెలకొంది. – కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, నాయకులతో సమావేశం కానున్నారు. తనపై వస్తున్న వార్తలను కథనాలను కార్యకర్తలకు వివరించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈ ప్రకటన కోసం వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. సాక్షి, కొడంగల్ (వికారాబాద్ జిల్లా): తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలు టీడీపీ కార్యకర్తలు, నాయకులను అయోమయానికి గురి చేసింది. గడిచిన 14 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి.. తెలంగాణ ఉద్యమకాలంలో రెండోసారి ఊహించని పరిస్థితుల మధ్య రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇటీవల కాలంలో జరిగిన ఆకస్మిక పరిణామాలు మీడియాలో వస్తున్న కథనాలు టీడీపీ నాయకులను ఆందోళకు గురి చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు.. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరిగింది. దీంతో తమ నాయకుడి పయనం ఎటువైపు ఉంటుందోనని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. విభజన ప్రభావం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాల విభజన కొడంగల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నియోజకవర్గాన్ని ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా రెండు ముక్కలు చేయడం వల్ల రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొడంగల్ దౌల్తాబాద్, బొంరాస్‌పేట మూడు మండలాలను వికారాబాద్‌లో, కోస్గి, మద్దూరు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపారు. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు పట్టు కోల్పోయారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కోస్గి, మద్దూరు మండలాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిల ప్రభావం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రేవంత్ రాజకీయ ప్రస్తానం మొదటిసారి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా గెలుపొందారు. పదవిలో ఉండగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రాదేశిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉండగానే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 2014లో రెండోసారి టీడీపీ నుంచి పోటీ చేసి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిపై సుమారు 15 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రేవంత్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పోటీ చేసిన నాలుగు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి లేకుండా విజయం వరించింది. రేవంత్‌తోనే రాజుగౌడ్.. రసవత్తరంగా తాండూరు రాజకీయాలు తాండూరుటౌన్ : టీ టీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వస్తున్న వార్తలతో తాండూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారిన తక్షణమే తాండూరులో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలోనే కొనసాగుతూ రేవంత్‌రెడ్డి అనుచరుడిగా ఉన్న తాండూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రాజుగౌడ్ సైతం అతడితోనే పయనం సాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు, సుమారు 30 మందితో ఉన్న తన అనుచరగణం లిస్టును తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్‌గాంధీకి ఇచ్చినట్లు సమాచారం. ఆ లిస్టులో ఉన్న వారికి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రాధాన్యత ఇవ్వాలని అందులో ఉన్నట్లు తెలిసింది. తాండూరులో జరిగిన టీడీపీ పోరుబాట కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజుగౌడ్‌ను రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం విదితమే. అయితే రాహుల్ గాంధీకి రేవంత్ ఇచ్చి జాబితాలో రాజుగౌడ్ పేరు సైతం ఉన్నట్లు తాజా సమాచారం. ఇదే గనుక జరిగితే.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమైన రమేష్ మహరాజ్, ఆయన వర్గం దీనిని స్వాగతించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో రసవత్తర రాజకీయాలకు తెర లేవనున్నట్లు అవగతమవుతోంది. అసలు రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో లేదో కానీ తాండూరు అసెంబ్లీ స్థానంపై మాత్రం జనాల్లో చర్చ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. ఎవరు ఏ పార్టీలోకి వచ్చి ఏమి చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. -
ప్రమాదంలో టీటీడీపీ ఉనికి
త్రికాలమ్ పరిసరాల ప్రభావం మనిషిపైన తప్పనిసరిగా ఉంటుంది. పరిణామాలు మనిషి వైఖరిని మార్చివేస్తాయి. స్వాతంత్య్ర సమరం సాగిన సమయంలో సత్యం, స్వేచ్ఛ, సమానత్వం, త్యాగ భావన వంటి ఉన్నతమైన విలువలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 1960లలో వియత్నాం యుద్ధం, పౌరహక్కుల ఉద్యమాలు, జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతం ప్రపంచవ్యాప్తంగా యువతను కది లించాయి. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు ఆవిష్కృతమైన తర్వాత వ్యాపార సంస్కృతికి పెద్దపీట వేశాం. అప్పుడే హైటెక్ విప్లవం యువతీయువకులను అమెరికా బాట పట్టించింది. 2014లో మితవాద ధోరణులు ప్రబలిన ఫలి తంగా నరేంద్ర మోదీ బీజేపీకి అపూర్వమైన విజయం సాధించగలిగారు. నిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో మితిమీరిన మితవాద భావజాలానికి ప్రతీ కగా డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. కాలానికి అనుగుణంగా విలువలు మారతాయి. అందుకే మనిషిని కాలం రూపొందిస్తుంది (Man is the pro-duct of his times)) అంటారు. వార్తలలో వ్యక్తి వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వార్తలలో ఉన్న వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి కూడా సమకాలీన విలువలకూ, రాజకీయ సంస్కృతికీ ప్రతీక. మోదీ, ట్రంప్‌లను గెలిపించిన ధోరణులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)లు పాటిస్తున్న విలువలూ, అనుసరిస్తున్న విధానాలూ, ప్రదర్శిస్తున్న వైఖ రులూ రేవంత్‌రెడ్డి రాజకీయాన్ని నడిపిస్తున్నట్టు భావించవచ్చు. ఆర్ఎస్ఎస్ అభిమానిగా, బీజేపీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడిగా అంచలంచెలుగా ఎదిగిన రేవంత్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా ఎంఎల్‌సి ఎన్నికలలో గెలుపొందారు. ప్రస్తుతం కొడంగల్ శాసనసభ్యుడు (అందుకే రేవంత్ తాజా విన్యాసాల వెనుక చంద్రబాబు ఉన్నారా అంటూ ప్రజలు అనుమానిస్తున్నారు). టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా సన్నిహితుడు. భార్య, కొడుకు, కోడలు సమేతంగా రేవంత్‌రెడ్డి కుమార్తె పెళ్ళికి చంద్రబాబు హాజరైనారు. భువనేశ్వరి, బ్రాహ్మణి సాధారణంగా రాజకీయనేతల కుటుంబాలలో వివాహాలకు వెళ్ళరు. రేవంత్‌రెడ్డి మాత్రం మినహాయింపు. ‘ఓటుకు కోట్లు’ ఉదంతంలో కరెన్సీ నోట్లకట్టలతో కెమెరాకు చిక్కిన రేవంత్‌రెడ్డికి సంఘీభావం తెలపడంకోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రయత్నించిన సందర్భం అది. చంద్రబాబుకూ, ఆయన కుమారుడు లోకేశ్‌కూ అత్యంత సన్నిహితుడు కాగలిగిన నేర్పరి రేవంత్‌రెడ్డి. లక్ష్యం ఛేదించడం ఎట్లాగో తెలిసిన విలుకాడు. విజయంకోసం ఉపయోగించే మార్గం ఈ తరం నాయకులలో అత్యధికులకు అంత ప్రధానం కాదు. పాతతరం విలువలు పాటించేవారికి ప్రత్యేకమైన గుర్తింపు కానీ గౌరవం కానీ లేవు. వారిని చేతగాని వాజమ్మలుగా (సన్నాసులు) పరిగణిస్తున్నారు. ఇప్పటి రాజకీయాలలో మాటలకూ, చేతలకూ పొంతన ఉండాలన్న పట్టింపు లేదు. మాటలను తూటాలుగా పేల్చే ప్రావీణ్యం, తెగింపు ఉంటే చాలు. చేయని మంచి పనులు చేసేసినట్టూ, చేసిన తప్పులు చేయనట్టూ దబాయించే వెరపులేని మనస్తత్వం వీరి ప్రత్యేకత. గతం అంతా చీకటేననీ, తనతోనే వెలుగు వచ్చిందనీ నిస్సంకోచంగా చెప్పగలగాలి. ఎంతటివారినైనా ఎంతమాటైనా నిస్సంకోచంగా అనాలి. అటువంటివారినే గుండెబలం ఉన్న నాయకులుగా ప్రజలు పరిగణిస్తున్నారు. నేటి వాతావరణంలో వారే మేటి నేతలు. అటువంటి నేతలనే మీడియా ప్రేమిస్తుంది. ప్రశ్నించదు. ప్రమాదంలో టీటీడీపీ ఉనికి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. ఇది అనివార్యం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అనేక వైరుధ్యాల కారణంగా రెండు రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రజాదరణ పొందడం ప్రస్తుతానికి అసాధ్యం. 2014లో టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసినవారిలో 15 మంది విజయం సాధించగా 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయించవలసిందిగా ప్రోత్సహించిన చంద్రబాబుకు తెలంగాణ పరిణామాల పట్ల ఫిర్యాదు చేసే నైతికాధికారం లేదు. శ్రీనివాసయాదవ్ టీడీపీని వదిలి టీఆర్ఎస్లో చేరినప్పుడు పార్టీ ఫిరాయించడం ఎంతటి సిగ్గుమాలిన వ్యవహారమో, పార్టీని ఎట్లా వంచించి మరో పార్టీలోకి దూకుతున్నారో వివరిస్తూ నిప్పులు కక్కారు చంద్రబాబు. కపట రాజకీయాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. ఫిరాయింపుల నిరోధక చట్టం అంటూ ఒకటి రాజ్యాంగంలో ఉన్నదనే స్పృహ మోదీకి కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ లేదు. రాజీవ్‌గాంధీ, వాజపేయి రూపొందించిన చరిత్రాత్మకమైన చట్టాన్ని అందరూ కలసి తుంగలో తొక్కుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను బుట్టలో వేసుకున్న చంద్రబాబు రేవంత్‌రెడ్డిని చేర్చుకున్నందుకు కాంగ్రెస్‌ను తప్పు పట్టలేరు. అనేక కారణాల వల్ల ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని విమర్శించే స్థితిలో లేరు. ‘ఓటుకు కోట్లు’ కేసు అనంతరం సమీకరణాలు మారిపోయాయి. హైదరాబాద్ విడిచి హూటాహుటిన అమరావతికి తరలి వెళ్ళిన చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే సాహసం చేయడం లేదు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నాయకులనూ, కార్యకర్తలనూ కాజేస్తున్నది కేసీఆర్ అన్నది జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కేసీఆర్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగిపోతోంది. కేసీఆర్‌కు దీటుగా సమాధానం చెప్పగలిగిన నాయకులు ఏ పార్టీలోనూ లేరు. కొన్ని మాసాల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మూడు రోజు లపాటు నల్లగొండ జిల్లాలో మకాం పెట్టి టీఆర్ఎస్ను వచ్చే ఎన్నికలలో ఓడిం చేందుకు సన్నాహాలు చేస్తున్నామంటూ ప్రకటించిన తర్వాత అంగుళం కూడా ఆ పార్టీ ముందుకు కదలలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గట్టిగా, సహేతుకంగా, ప్రభావవంతంగా విమర్శించే నాయకుడు లేడు. కొత్తవారిని తమ పార్టీలో చేర్చుకొని తమలో ఇముడ్చుకునే అలవాటు బీజేపీ నాయకులకు లేదు. తమకు బలం లేని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీని సమకూర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కి కార్యకర్తల బలం ఉంది. ముప్పయ్ శాతం ఓట్లు పది లంగా ఉన్నాయి. కానీ పార్టీ నాయకులనూ, శ్రేణులనూ ఒకే తాటిపైన నడిపించే గట్టి నాయకుడు లేడు. నల్లగొండ జిల్లాలలోనే చాలామంది నాయకులు ఉన్నారు. వారిలోనే ఐక్యత లేదు. అరడజను మందికిపైగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఒకరి మాట ఒకరు వినరు. కేసీఆర్‌కు సమాధానం చెప్పగల సత్తా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని ప్రజలు భావించడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వీడకుండా ఉండేందుకు గులాంనబీ ఆజాద్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కష్టపడుతున్నారు. జానారెడ్డికి పరిపాలనా రంగంలో విశేషానుభవం ఉన్నది. కానీ వీరిలో ఎవ్వరినీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించడం లేదు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రేవంత్‌రెడ్డికి మంచి అవకాశం ప్రసాదించాయి. కేసీఆర్ మాట్లాడినంత స్ఫుటంగా, అంతే కరకుగా, అంతకంటే పదునుగా మాట్లాడే శక్తి తనకు ఉన్నదని రేవంత్ గత మూడున్నర సంవత్సరాలలో అనేక సందర్భాలలో నిరూపించుకున్నారు. తాను ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితుడనే అపరాధ భావన రేవంత్‌రెడ్డిలో ఎక్కడా కనిపించదు. టీఆర్ఎస్ శాసనసభ్యుడికి నగదు ఇస్తూ దొరికిపోయిన ఫలితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు రేవంత్ ముఖం దాచుకునే ప్రయత్నం చేయలేదు. మీసాలు మెలేసి తొడగొట్టి కేసీఆర్‌ను సవాల్ చేస్తూ మాట్లాడారు. అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్న వ్యక్తిని తమ పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ నాయకత్వం ఏ మాత్రం సంకోచం చూపించలేదు. ఎంఎల్ఏను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం అక్రమమనీ, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మధ్య తరగతి ప్రజలు భావించవచ్చు. కానీ రాజకీయ నాయకులు ఈ విషయం పట్టిం చుకోవడం లేదు. లేకపోతే రేవంత్‌ను రాహుల్‌గాంధీ కలుసుకోవడానికి అంగీకరించేవారు కాదు. రాబోయే ఎన్నికలలో రేవంత్ కాంగ్రెస్ ప్రచార సార«థిగా ఉండబోతున్నారనే వార్తలు వచ్చేవి కావు. తనతో పాటు కాంగ్రెస్‌లో ప్రవేశించే పాతికమంది నాయకులకు ఎన్నికలలో పార్టీ టెక్కెట్లు ఇవ్వాలంటూ వారి జాబితాను రాహుల్‌కి ఇచ్చారనే ప్రచారం అయ్యేది కాదు. రేవంత్ రాక పార్టీకీ, అతనికీ లాభమనీ, ఉభయతారకంగా ఉంటుందనీ కాంగ్రెస్ నాయకులు సంతోషంగా చెప్పుకునేవారు కాదు. లక్ష్యం నెరవేరేనా? రేవంత్‌రెడ్డి మంచి మాటకారి. వెలమలూ, కమ్మవారూ తెలంగాణలో ఏకం అవుతున్నారంటూ ‘వెల్కమ్’ గ్రూపుగా వారిని అభివర్ణించిన మొదటి వ్యక్తి రేవంత్. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మధ్య వైరుధ్యాలను ఎత్తి చూపించిన నాయకుడూ ఆయనే. టీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలోనే అత్యధిక స్థానాలు గెలుచుకున్నదనీ, దక్షిణ తెలంగాణ టీఆర్ఎస్ను తిరస్కరించిందనీ ఆయన విశ్లేషణ. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో ప్రజలు ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని తీర్మానం. రేవంత్ చేరితే గాంధీభవన్‌లో హడావిడి పెరుగుతుంది. కేసీఆర్‌పై విమర్శనాస్త్రాల పరంపర సంధిస్తారు. రాజకీయ ఉష్ణోగ్రత పెంచుతారు. రేవంత్ పొడ గిట్టని కేసీఆర్‌పైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ రేవంత్ లక్ష్యం నెరవేరుతుందా? ఆయన కోరిన టిక్కెట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తుందా? వారందరినీ గెలిపించుకొని తన గ్రూపుగా నిలబెట్టుకోగలరా? ఇది పగటి కల కాదుకదా! ప్రాంతీయ పార్టీలతో ఉండే సౌలభ్యం జాతీయ పార్టీలతో ఉండదు. టీడీపీలో చంద్రబాబు మాటకు తిరుగు ఉండదు. టీఆర్ఎస్లో కేసీఆర్ మాట సుగ్రీవాజ్ఞ. ప్రాంతీయ పార్టీ అధినేతకు నచ్చినవారికి ఎవ్వరూ అపకారం చేయలేరు. వారికి నచ్చనివారికి ఉపకారం చేయలేరు. కాంగ్రెస్ పరి స్థితి ఇందుకు భిన్నం. అది మహాసముద్రం వంటిది. పార్టీలో చేరిన తర్వాత రాహుల్‌గాంధీ దర్శనభాగ్యం దొరకడమే కష్టం కావచ్చు. తన వెంట వస్తారనుకుంటున్న నాయకులు నిజంగా రాకపోవచ్చు. వారితో హరీష్‌రావు కానీ ఇతరులు కానీ మాట్లాడి టీఆర్ఎస్లో చేరడానికి ఒప్పించవచ్చు. కాంగ్రెస్ టిక్కెట్టు కంటే టీఆర్ఎస్ టిక్కెట్టు కానీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీటీడీపీ టిక్కెట్టు కానీ ఎన్నికలలో గెలిపిస్తుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహరచనలో కేసీఆర్‌కు ఉన్నంత సామర్థ్యం, యుద్ధ కౌశలం రేవంత్‌కు ఉన్నట్టు ఇంతవరకూ ఎక్కడా వెల్లడి కాలేదు. ఆ స్థాయి నాయకుడిగా ఎదగలేదు. టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులలో అత్యధికులు టీఆర్ఎస్తో పొత్తు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌తో పోవాలని వాదిస్తున్నవారు తక్కువ మంది. టీటీడీపీ నేతలను తన వైపు తిప్పుకునే అవకాశం కేసీఆర్‌కు ఉంది. బీజేపీ విడిగా పోటీ చేయాలనీ, అన్నిచోట్లా వారి అభ్యర్థులు నిలబడాలనీ, వారికి డిపాజిట్లు రావడమే కాకుండా గణనీయమైన సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చుకోవాలనీ కేసీఆర్ కోరుకుంటారు. రేవంత్ వాగ్బాణాలతో గాయపడి ఆగ్రహించిన కేసీఆర్ ప్రతీకా రేచ్ఛతో ‘ఓట్లకు కోట్లు’ కేసును తిరిగి తెర వకుండా చూడాలంటూ చంద్రబాబు వేడు కుంటారు. ప్రస్తుత దృశ్యంలో కేసీఆర్ అనే కొండను రేవంత్‌రెడ్డి అనే పొట్టేలు ఢీకొనడం చూస్తున్నాం. బలాబలాలు తారుమారై భవిష్యత్తులో దృశ్యం మారుతుం దేమో బుల్లితెరపై చూడాలి. - కె. రామచంద్రమూర్తి -
రేవంత్‌రెడ్డికి టీటీడీపీ ఝలక్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ విధానాలపై అసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది. ‘ఆయనతో పాటు ఇంకొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారు’ అన్నది కేవలం ప్రచారమేనని, అలాంటి వార్తలు చూసి కింది స్థాయి నేతలెవ్వరూ గందరగోళానికి గురికావద్దని పిలుపునిచ్చింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఉమ్మడి ప్రకటన చేశారు. ఆధినాయకుడు చెప్పిందే వేదం : క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో తప్పిదాలకు పాల్పడే ఎంతటి నాయకుడినైనా సహించబోమని టీటీడీపీ చీఫ్ రమణ అన్నారు. ‘‘రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారని, తనతోపాటు పార్టీని వీడే నాయకుల జాబితా ఇచ్చారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. అసలు ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని టీడీపీ శ్రేణులే ప్రజలకు తెలియజెప్పాలి. అక్టోబర్ 8న పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యనాయకులంతా కట్టుబడి ఉండాలి’’ అని రమణ తెలిపారు. పొత్తులపై ఏమన్నారంటే.. : టీటీడీపీలో తాజా వివాదానికి అసలు కారణమైన పొత్తుల వ్యవహారంపై నేతలు ఆచితూచి స్పందించారు. 2019 ఎన్నికల్లో.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, టీడీపీతో భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారని రమణ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే దిశగా టీడీపీ ఏనాడూ ఆలోచన చేయలేదని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి అడుగుపెట్టిన నాటి నుంచే టీడీపీ దెబ్బతింటూ వచ్చిందని, సంచలనాత్మక ‘ఓటుకు కోట్లు’ కేసు బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డేనని నర్సింహులు ఆరోపించారు. టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు అతనే : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో బాధ్యుడు ‘ఎవరో’ కాదని, రేవంత్‌రెడ్డేనని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రేవంత్ అడుగుపెట్టిన నాటి నుంచి టీడీపీ బలహీన పడింది. ఎకాఎకి ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆలోచన. ఆ దూకుడు భరించలేకే ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. తన సొంత లబ్ధికోసం పార్టీని భ్రష్టుపట్టించేవాళ్లను చూస్తూ ఊరుకోబోం’’ అని నర్సింహులు వ్యాఖ్యానించారు. యనమల, పరిటాలను తిట్టే హక్కు ఎవడిచ్చాడు? : ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులతో ఆర్థిక సంబంధాలున్నాయంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి ఫైరయ్యారు. ‘యనమల, పరిటాలను తిట్టే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. యనమల దగ్గరి బంధువుకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు. పరిటాల సునీతకు బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సీఎం కేసీఆర్ సహకరించారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అడిగే రాహుల్‌ని కలిశాడా? : ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారన్న వార్తలపై మోత్కుపల్లి స్పందిస్తూ.. ‘మేం ఏది అడిగినా చంద్రబాబుతోనే మాట్లాడుతానని రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పిండు. ఏం, చంద్రబాబును అడిగే ఆయన రాహుల్ గాంధీని కలిసిండా? ఢిల్లీలో ఎవరెవరితోనో మాట్లాడి, ఇక్కడికొచ్చి మా పార్టీకే చెందిన ఏపీ మంత్రులపై విమర్శలు చేస్తడా? అందుకే, సమాధానం చెప్పమని గట్టిగా అడిగాం’’ అని మోత్కుపల్లి వివరించారు. టీఆర్ఎస్తో పొత్తు ఆలోచన ఎవరిది? : టీడీపీలో ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణమైన ‘టీఆర్ఎస్తో పొత్తు’ పైనా మోత్కుపల్లి స్పందించారు. ‘‘అసలు టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు పెత్తుకుంటుందని నేనేదో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొదట పొత్తు మాటెత్తింది నేను కాదు రేవంతే. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ- బీజేపీ అలయెన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కలిస్తే గిలిస్తే, టీఆర్ఎస్తో కలిసే అవకాశం ఉంటుందన్నాను. రేవంత్ తన లబ్ధికోసం ప్రార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు’’ అని నర్సింహులు అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
-
కార్తీక్ వ్యూహం.. లైన్ క్లియర్..!
మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్ కాంగ్రెస్ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచన వెనుక మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాలకు ఆయనే వ్యూహకర్తగా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి కథ..స్క్రీన్‌ప్లే ఇక్కడి నుంచే మొదలైనట్టు తెలుస్తోంది. కార్తీక్‌కు రేవంత్‌తో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా సన్నిహిత సంబంధాలుండడంతో కార్తీక్ నివాసం నుంచే రాజకీయ మంత్రాంగం నడిపినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌తో భేటీ వంటి కీలక అంశాలకు కూడా జిల్లాలోనే బీజం పడిందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా రాజకీయాల్లో డేరింగ్.. డైనమిక్... ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రేవంత్ కాంగ్రెస్‌లో చేరితే ఇటు వికారాబాద్ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న పాలమూరు జిల్లాలోనూ పూర్వవైభవం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఓటుకు నోటు కేసులో ఆయన జైలుకు వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్ ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడానికి కార్తీక్‌రెడ్డి ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ హోంమంత్రులు జానారెడ్డి, మాధవరెడ్డి తనయులు రఘువీర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి కూడా కార్తీక్‌కు ప్రాణస్నేహితులు. ఈ త్రయంతో రేవంత్‌కు సాన్నిహిత్యం ఉంది. వీరి ప్రోద్బలం కూడా రేవంత్ కాంగ్రెస్ గూటి వైపు చూసేందుకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న ఉమా మాధవరెడ్డి (సందీప్‌రెడ్డి తల్లి) కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పే అవకాశం లేకపోలేదు. తాండూరుపై ప్రభావం! రేవంత్ సైకిల్ దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ పక్కనే తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలోనూ రేవంత్‌కు కొంత మేర పట్టుంది. పరిగి నియోజకవర్గంలోనూ ఆయన అనుచరగణం ఉంది. ఇవే కాకుండా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం, కూకట్పల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ రేవంత్‌కు సొంత కేడర్ ఉంది. తాజా పరిణామాలు ఈ నియోజకవర్గాలపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం రేవంత్ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. -
టీడీపీకి భారీ షాక్ : కాంగ్రెస్ గూటికి రేవంత్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలిసింది. అధికార టీఆర్ఎస్తో టీటీడీపీ పొత్తు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. గడిచిన కొద్ది గంటలుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని, రెండు మూడు రోజుల్లోనే చేరికకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు కాంగ్రెస్‌కానీ, ఇటు రేవంత్‌గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. రాహుల్ గాంధీతో భేటీ! : ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్‌లోకి అధికారికంగా చేరతారని తెలుస్తోంది. ‘టీఆర్ఎస్తో పొత్తు’తో టీడీపీలో చిచ్చు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను కోల్పోయింది. అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయింపుల పర్వం మొదలైనప్పుడు, టీడీపీ పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు కోట్లు కుట్రను అమలుచేయడం, అదికాస్తా బట్టబయలు కావడం, ఆ తర్వాత మిగిలిన టీడీపీ నేతలంతా టీఆర్ఎస్లోకి చేరడం.. తదితర పరిణామాలు తెలిసినవే. అయితే మొదటి నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్‌రెడ్డి.. చివరినిమిషం దాకా అదేబాటను అట్టిపెట్టుకున్నారు. ఓటుకు నోట్లు కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఏ చంద్రబాబు కోసమైతే తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు రేవంత్ సిద్ధపడ్డరో.. అదే చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడం మిగుండు పడని విషయంలా మారింది. అందుకే రేవంత్ కాంగ్రెస్‌లోకి చేరి, టీఆర్ఎస్పై పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
చీలిక దిశగా టీటీడీపీ?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారం తెలంగాణ టీడీపీలో సంక్షోభానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొత్తు విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పార్టీలోని ఓ వర్గానికి మింగుడుపడటం లేదు. పొత్తు ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇతర నేతలు పార్టీని వీడి వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తు అనివార్యమన్న సంకేతాలు కొనసాగితే వీలైనంత త్వరగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించుకోవాలన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం మరుసటి రోజే రేవంత్‌రెడ్డి.. పొత్తును వ్యతిరేకిస్తున్న ఇతర నేతలతో సమావేశమైనట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పొత్తు ఉందన్న అనుమానాలు నిజమయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే ముందే భవిష్యత్ నిర్ణయించుకోవడం మంచిదని వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఒకరు ఈ భేటీలో పేర్కొన్నట్టు తెలిసింది. చంద్రబాబుతో మరోసారి సమావేశమయ్యాకే నిర్ణయం తీసుకుందామని మహబూబ్‌నగర్ జిల్లా సీనియర్ నేత ఒకరు సూచించినా ఇతరులు ఆయనతో ఏకీభవించలేదు. పొత్తు విషయంలో స్పష్టమైన వైఖరి బయటపెట్టలేదంటేనే పొత్తు ఉన్నట్లు లెక్క.. అలాంటప్పుడు మరోమారు సమావేశమైనా ప్రయోజనం ఏమిటన్నది వారి వాదన. కాంగ్రెస్‌లో చేరే అంశంపైనా చర్చ జరిగింది. అయితే ఇప్పుడే ఈ విషయంలో ఓ నిర్ణయానికి రావడం మంచిది కాదని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు సూచనల మేరకే.. తెలంగాణలో పార్టీ మనుగడ కొనసాగించాలంటే టీఆర్ఎస్తో పొత్తు అనివార్యమని తెలంగాణ టీడీపీలో ఓ వర్గం గట్టిగా కోరుతోంది. పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ఏవో కొన్ని సీట్లు కేటాయిస్తే పార్టీ మనుగడకు ఇబ్బంది ఉండదని, ఖమ్మం జిల్లాలాంటి చోట్ల పార్టీకి ఉన్న బలమైన పునాదులను కాపాడుకోవచ్చని ఆ వర్గం నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే ఓ వర్గం నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్నాయని, అందువల్ల పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రేవంత్ వర్గం చెబుతోంది. పొత్తులో భాగంగా ఖమ్మం లోక్‌సభ సీటుతోపాటు 15 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి టీడీపీకి సంకేతాలు అందినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి సీట్లు కేటాయించవచ్చని టీడీపీ నాయకత్వం, తద్వారా మరోసారి తాము క్రియాశీలకం అవుతామని టికెట్ ఆశిస్తున్న నేతలు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీనియర్ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లితోపాటు పలువురు నేతలు పొత్తు ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. ‘‘పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టీఆర్ఎస్తో పొత్తు ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే మేం పార్టీని వీడటం తప్ప మరో మార్గం లేదు’’అని నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. కాంగ్రెస్ నుంచి ఆఫర్ తమ పార్టీలో చేరాలంటూ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల రేవంత్ నివాసంలో జరిగిన ఫంక్షన్‌కు సదరు నేత హాజరయ్యారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ కలిస్తే బాగుంటుందని ఆ నేత రేవంత్‌కు సూచించినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఈ సీనియర్ నేత రేవంత్‌కు దగ్గరి బంధువు కూడా. అయితే ఈ విషయంలో తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృతి చేసుకుంటే గానీ ఓ నిర్ణయానికి రాలేనని రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఒకవేళ రేవంత్ టీడీపీని వీడాలనుకుంటే ఉమా మాధవరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ఆర్.ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఆయనతో నడిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
చంద్రబాబు ఇంటివైపు తలసాని..
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ మంత్రివర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటివైపుగా రావడంతో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పైగా ఆ సమయానికి చంద్రబాబు ఇంట్లోనే ఉండటం, తెలంగాణ టీడీపీ కీలక నాయకులతో సమావేశం కావడం, అప్పుడే తలసాని రావడంతో మంత్రిగారి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, ట్రాఫిక్ జామ్ కారణంగా షార్ట్ కట్ తీసుకుందామనే చంద్రబాబు ఇంటిమీదుగా వెళ్లానేగానీ, దీనిపై అనవసర ఊహాగానాలు వద్దంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. ఏపీ సీఎం చంద్రబాబుకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్ నంబర్ 65లో సొంత ఇల్లున్న విషయం అందరికీ తెలిసిందే. అదే స్థలంలో ఇటీవల కొత్త ఇంటిని నిర్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు.. అదే ఇంట్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. కవరేజి కోసం మీడియా కూడా అక్కడికి వెళ్లింది. అంతలోనే తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కాన్వాయ్ అటువైపుగా రావడంతో టీడీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. మీడియాను చూసి, కారు ఆపిన తలసాని.. ‘సార్ ఇంట్లోనే ఉన్నారా?’ అని ఆరా తీశారు. తాను అటువైపు ఎందుకు వచ్చానో వివరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లి మరోసారి ప్రెస్‌మీట్‌పెట్టి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఇంట్లో ఉన్నారని తెలియదు : ‘భారీ వర్షం కారణంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. చంద్రబాబు ఇల్లుండే రోడ్ నంబర్ 65 నుంచి రోడ్ నంబర్ 36కు షార్ట్ రూట్లో వెళ్లొచ్చు. అందుకే ఆ రూట్లో వచ్చా. అసలు చంద్రబాబు హైదరాబాద్‌లోనే, ఆ ఇంట్లోనే ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. తీరా అక్కడ మీడియాను చూశాక, కారు ఆపి మాట్లాడాను. షార్ట్ కట్ కాబట్టే వచ్చానని చెప్పాను. కానీ కొన్ని మీడియా సంస్థలు నేనేదో పొరపాటున వచ్చానని అన్నట్లు చెప్పాయి. ఈ హైదరాబాద్‌ల నాకు తెలియని గల్లీ ఉందా! పొరపాటుకాదు, షార్ట్ రూటని తెలిసే వచ్చాను. దీనిపై లేనిపోని ఊహాగానాలు వద్దు’’ అని తలసాని చెప్పుకొచ్చారు. -
టీటీడీపీ జిల్లా అధ్యక్షుల జాబితా ఖరారు
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతల భేటీ ముగిసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని 25 జిల్లాల అధ్యక్షుల పేర్లు ఖరారుకాగా ఆరు జిల్లాలను పెండింగ్‌లో పెట్టారని ఎల్.రమణ తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చంద్రబాబుతో తాము చర్చించామని వివరించారు. తెలంగాణ జిల్లాల టీడీపీ అధ్యక్షులు వీరే.. 01. నిర్మల్- వేలం శ్యాం సుందర్ 02. ఆదిలాబాద్- సోయం బాపూరావు 03. మంచిర్యాల- బోడ జనార్దన్ 04. ఆసిఫాబాద్- గుళ్లపల్లి ఆనంద్ 05. నిజామాబాద్- అరికెల నర్సారెడ్డి 06. కామారెడ్డి- సుభాష్ రెడ్డి 07. పెద్దపల్లి- విజయ రమణరావు 08. కరీంనగర్- కవ్వంపల్లి సత్యనారాయణ 09. జగిత్యాల- ఐలినేని సాగర్ రావు 10. సిరిసిల్ల- అన్నంనేని నర్సింగరావు 11. సంగారెడ్డి- శశి కళా యాదవ్ రెడ్డి 12. సిద్దిపేట- ఒంటేరు ప్రతాప్ రెడ్డి 13. వికారాబాద్- సుభాష్ యాదవ్ 14. రంగారెడ్డి- సామా రంగారెడ్డి 15. మేడ్చెల్- తోటకూర జంగయ్య యాదవ్ 16. వరంగల్ రూరల్- గన్నోజు శ్రీనివాసచారీ 17. వరంగల్ అర్బన్- ఈగ మల్లేశం 18. భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణ రావు 19. జనగాం- కొండా మధుసూదన్ రెడ్డి 20. సూర్యాపేట్- పటేల్ రమేష్ రెడ్డి 21. మెదక్- ఏ.కె. గంగాధరరావు 22. హైదరాబాద్- ఎంఎన్ శ్రీనివాస్ 23. యాదాద్రి- ఎలిమినేటి సందీప్ రెడ్డి 24. మహబూబాబాద్- చుక్కల విజయ్ చందర్ 25. నల్గొండ- బిల్యా నాయక్ -
‘ప్రగతిభవన్ పైరవీల భవన్‌గా మారింది’
జగిత్యాల: రాజధానిలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ పైరవీల భవన్‌గా మారిందని టీటీడీపీ నేత ఎల్ రమణ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి కొనసాగుతున్న పాలన అదుపు తప్పిందని విమర్శించారు. రైతులకు అండగా నిలుస్తామన్న సీఎం కేసీఆర్ పంటలకు మద్దతు ధర కల్పించలేకపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ మూడేళ్ల పాలనలో మూడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన భూ కుంభకోణాల సూత్రధారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ నేరస్తులను, భూకబ్జాదారులను వదిలేసి రైతులకు బేడీలు వేస్తోందని దుయ్యబట్టారు. -
టీఆర్ఎస్లోనే తెలంగాణ ద్రోహులు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నా యని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను మూడేళ్లలో నిద్రలేని రాత్రులెన్నో గడి పానన్నారు. మంగళవారం మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులని సీఎం కేసీఆర్ ఎవరిని తిట్టారో ఇప్పుడు వారంతా ఆయన పక్కనే ఉన్నారని, తెలంగాణ ద్రోహులతోనే టీఆర్ఎస్ నిండిపోయిందని విమర్శించారు. అక్కినేని అమల కుక్కలు పెంచడానికి కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చిన కేసీఆర్, అమరుల కుటుం బాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చినా ఏమీ అనొద్దా అని అన్నారు. -
వాహన రిజిస్ట్రేషన్‌లో TS స్థానంలో TG
- అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్, రాజముద్రను మార్చేస్తాం - పార్టీల స్వార్ధం కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది - ‘మీట్ ది ప్రెస్’లో టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాహన రిజిస్ట్రేషన్లలో ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ని ప్రవేశపెడతామని, రాజముద్రను సైతం మార్చేస్తామని ఆ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కేవలం పార్టీల మనుగడ, రాజకీయంగా స్వార్థం కోసం మాత్రమే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తెచ్చామని ఆయన అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’కు హాజరైన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పరిపాలన, టీడీపీ భవిష్యత్తు తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ స్వార్థం కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ విషయంలో నాకు(రేవంత్‌రెడ్డికి), కేసీఆర్‌కు తేడాలేదు. టీడీపీకి ఏమాత్రం అవకాశం వచ్చినా ముందుగా రాష్ట్ర అధికార గుర్తును తొలగిస్తాం. రాజముద్రలో అమరవీరుల స్తూపం ఉండేలా చూస్తాం. ఈ విషయమై ఇదివరకే నేను లేఖ రాశా. అలాగే, వాహన రిజిస్ట్రేషన నంబర్లపై ఉన్న టీఎస్ తీసేసి.. టీజీ తెస్తాం. తెలంగాణ ఏర్పాటై మూడేళ్లయినా అమరవీరుల స్థూపానికి కేసీఆర్ కొబ్బరి కాయ కొట్టలేదు. కనీసం అమరవీరుల కుటుంబాల కోసం బడ్జెట్ లో ఒక్క శాతం కూడా నిధులు పెట్టలేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడకముందు ఎన్నో రాజకీయాలు చేసిన పార్టీలు ఇప్పుడు మారాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ ప్రణాళికలు ప్రజలకు అనుకూలంగా లేవని విమర్శించారు. ఉమ్మడి రాష్టంలో తెలంగాణకు బద్ద శత్రువులని ఏ పార్టీలనైతే కేసీఆర్ విమర్శిచారో ఆ కాంగ్రెస్, తెలుగుదేశంలతోనే గతంలో పొత్తులుపెట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ సాధనలో కష్టపడ్డవాళ్లకు టీఆరెస్ బి ఫామ్‌లు ఇవ్వలేదని ఆరోపించారు. ‘ఇప్పుడు ధర్నా చౌక్ తీసేసిన కేసీఆర్ కుటుంబానికి.. అధికారం కోల్పోయిన తర్వాత మళ్లీ అలాంటి ధర్నా చౌక్ ఒకటి కావాలి అని వెదుకునే రోజు వస్తుంద’ని రేవంత్ ఎద్దేవాచేశారు. -
ఇది అప్రజాస్వామికం: టీడీపీ
సభలోకి రానివ్వకపోవడంపై నిరసన సాక్షి, హైదరాబాద్: కీలక అంశమైన ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి తమను అనుమతించకపోవడం అప్రజాస్వామికమని టీటీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో సస్పెండైన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను ఆదివారం శాసనసభ సమా వేశంలో పాల్గొనకుండా చేయడంపై వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి, తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో కలసి రోడ్డుపైకి వచ్చి, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపుతో బీసీలకు అన్యాయం జరగకుండా జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు రేవంత్‌రెడ్డితో పాటు సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి, రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్న సీఎం టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూములు, ఆస్తులను కొల్లగొడుతూ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిలువుదోపిడీ చేస్తున్నారని టీటీడీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కీలకమైన వారసత్వ భూములను మైహోమ్ రామేశ్వర్‌రావుకు అప్పగించడానికే వారసత్వ చారిత్రక కట్టడాల చట్టంలో సవరణలు తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సంపదను కేసీఆర్ తనకు కావాల్సినవారికి ఎలా దోచిపెడుతోంది ఆధారాలతో సహా ఇస్తానని, అన్ని మార్గాల్లో విచారణ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా వెల్లడించాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉందని అన్నారు. తెలంగాణ వారసత్వ సంపదను కొల్లగొడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఇలాగే వదిలేస్తే తెలంగాణను ఓ రోజు కళేబరంలా చూడాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు. -
‘కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: టీడీపీని దెబ్బతీసేందుక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుట్ర చేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల పార్టీ అయిన టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, ఉగాది పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు స్పూర్తితోనే తాము ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యకమంలో ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీనే లేకుండా చేయాలని చేస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. కొందరు నాయకులు పదవుల కోసం స్వార్థంతో పార్టీ మారారని, వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం మాట
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170 (3) అధికరణకు సవరణలు చేయాల్సిందేనని, మరో దారి లేదని కేంద్రం స్పష్టం చేసింది. అసెంబ్లీ స్థానాల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదనలొచ్చాయా అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 170 (3) అధికరణ ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల వివరాల తర్వాతే సీట్ల పెంపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 170 (3) అధికరణ సవరణతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమవుతుందని అటార్నీ జనరల్ కూడా న్యాయ శాఖకు ఇదే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంపై కేంద్ర హోంశాఖలో కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని వస్తున్న వార్తలపై వెంటనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చారు. పాత జిల్లాల ప్రకారమే పునర్విభజన చేపట్టండి: ఈసీని కోరిన టీటీడీపీ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను పాత జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ టీడీపీ నేతలు కోరారు. కొత్త జిల్లాల ప్రకారం పునర్విభజన చేస్తే దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ ఓంప్రకాశ్ రావత్‌తో భేటీ అయి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, పార్టీలని టీఆర్ఎస్లో విలీనం చేస్తూ స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని వివరించారు. రాష్ట్రంలో జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిందన్నారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి... పార్టీ ఫిరాయించిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినట్టు రమణ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఎం పార్టీలను టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని, ఈ విషయంలో పూర్తి అధికారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు. -
అది ప్రభుత్వ హత్యే: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో లంచం ఇవ్వనందుకు వైద్యమందక కృష్ణానాయక్ మృతి చెందాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణానాయక్ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కృష్ణానాయక్‌ను లంచం కోసం పొట్టనబెట్టుకున్న ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తీరు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పనితీరుకు నిదర్శనమని అన్నారు. కేవలం 150 రూపాయల కోసం నిండుప్రాణాన్ని బలితీసుకునే స్థాయిలో అవినీతి రాజ్యమేలుతుంటే తెలంగాణలో అవినీతి రహితపాలన సాగుతున్నదని ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రాణం ఖరీదు రూ. 150! ప్రభుత్వాస్పత్రుల్లో అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం పెరిగిపోయాయని ఎన్నిసార్లు చెప్పినా, పలు సంఘట నలు జరిగినా సీఎంకు, వైద్య ఆరోగ్యశాఖమంత్రి సి.లక్ష్మారెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఒక గిరిజనుడు బలైపోతే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయనే కనీస భయం కూడా ముఖ్యమంత్రికి, మంత్రికి లేదని, ఇలాంటి ఘటనలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయంతోనే శాసనసభ నుంచి తనను అన్యాయంగా సస్పెండ్ చేసిందన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరి హారం ఇవ్వాలని, నలుగురు పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్టించుకోకుంటే గిరిజనులను అవమానించినట్టేనన్నారు. మృతుడు కృష్ణానాయక్ కుటుంబానికి రూ. 50వేల ఆర్థికసాయాన్ని రేవంత్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రాపాలకుల కేసులే టీఆర్ఎస్ అస్త్రాలా?
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లో ఆంధ్రాపాలకులు పెట్టిన కేసులను జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ అస్త్రాలుగా వాడుకోవడం దేనికి సంకేతమని టీటీడీపీ నేత ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నిం చారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిర్బంధ, అణచివేత విధానాలతో సమైక్య రాష్ట్ర పాలకుల కంటే క్రూరంగా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. జేఏసీ ర్యాలీకి అనుమతినివ్వకపోవడం నియంతృత్వ పోకడలకు నిద ర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సమైక్య పాలకులు అక్రమంగా పెట్టిన కేసులను సాకుగా చూపిస్తూ నిరుద్యోగ యువకులను నేరస్తులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. -
అభివృద్ధి వ్యతిరేక ముఠాగా టీటీడీపీ: కర్నె
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ నాయకులు తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠాగా ఏర్పడ్డారని, ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండి పడ్డారు. గురువారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడటంలో రేవంత్‌రెడ్డి, ఆయన ముఠాకు అవార్డు ఇవ్వొచ్చన్నారు. అభివృద్ధి లో తెలంగాణ వెనుకబడి పోవాలని, ఏపీ అగ్రభాగాన నిలవాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నట్లు అనిపిస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై రాష్ట్రంలో ఏ గ్రామం లోనైనా చర్చకు తాము సిద్ధమన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీపై గజ్వేల్ ప్రజాపోరులో రేవంత్ పిచ్చి కూతలు కూయడం దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై రేవంత్ పేదల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. -
'టీడీపీకి ఇది గ్రేస్ పీరియడ్'
హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠా నాయకుడని ఆ పార్టీ నేతలు అబద్ధాలతో ఊరేగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఏపీ అగ్రభాగాన ఉండాలి, తెలంగాణ అట్టడుగున ఉండాలి అనేది టీటీడీపీ నేతల కుట్ర అన్నారు. టీటీడీపీ నేతల బహిరంగ చర్చ సవాలుకు మా సర్పంచులు చాలని ఎద్దేవ చేశారు. తెలంగాణా లో ఉన్న దాదాపు 15 వేల గ్రామాల్లో ఎక్కడైనా టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సర్పంచులు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితుల భూ పంపిణీ కోసం 9,663 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా.. టీడీపీ నేతల కళ్ళకు ఇవి కనబడడం లేదా అని ప్రశ్నించారు. రాళ్లు రప్పలు ఉన్న భూములను దళితులకు కేటాయించి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించినా ఘనత టీడీపీ, కాంగ్రెస్ పాలకులదే అని డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని.. 2 లక్షల 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని.. మోడల్ ఇళ్ళ నిర్మాణం ఎర్రవల్లి కే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. పని అయిపోయింది టీఆర్ఎస్ది కాదని.. టీడీపీయే ఇపుడు గ్రేస్ పీరియడ్ లో నడుస్తోందన్నారు. -
బీజేపీ చెలిమితో ఒరిగిందేమిటి?
⇒ కమలం పార్టీ తీరుపై టీటీడీపీలో అసంతృప్తి ⇒ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సాయం చేయడం లేదని కినుక ⇒ ఎన్నికల్లో బీజేపీ కోసం త్యాగాలు చేసినా లాభం ఏదని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో తమ పార్టీకి ఎలాంటి ప్రయో జనం లేదని టీటీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో గత ఎన్ని కల్లో పొత్తు సందర్భంగా ఎన్నో త్యాగాలు చేశామని, గెలిచే స్థానాలను కూడా పొత్తు లో భాగంగా బీజేపీకి ఇచ్చామని టీడీపీ నేతలు అంటున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ గెలుచుకున్న 5 స్థానాల్లో 4 సీట్లను టీడీపీ బలంతోనే గెలిచారని చెబుతు న్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో తెలంగాణలో పార్టీని బలోపే తం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశించామని టీటీడీపీ నేతలు చెబుతు న్నారు. టీడీపీ భాగస్వామిగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా తెలంగాణ టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో రాష్ట్రంలో టీడీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని, కనీసం శాసనసభలో కూడా సమన్వయం లేకపోతే పొత్తు ధర్మానికి అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నారు. శాసనసభలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన సందర్భంలోనూ, పలు అంశా లపై ప్రభుత్వాన్ని నిలదీసే సమయం లోనూ బీజేపీ సభ్యులు మద్దతుగా ఉండటం లేదని అంటున్నారు. తెలంగా ణలో ముస్లింల ఓట్లు నష్టపోయి బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, పొత్తు వల్ల బీజేపీకి హైదరాబాద్‌లోనే సీట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అయినా రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి అవసరమైన సహాయం బీజేపీ నుంచి అందడం లేదని ఆరోపిస్తున్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తున్నట్టేనా? టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిని ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిఫారసు చేసినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని అంటున్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవికోసం అంత ర్గతంగా జరగాల్సిన ప్రక్రియ కూడా పూర్త యినట్టుగా ఎప్పటికప్పుడు చెబుతున్నా, పదవిని మాత్ర ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు యూపీఏ ప్రభుత్వం నియమిం చిన గవర్నర్లే కొనసాగుతున్నారని, అయి నా నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వ డానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు. సీనియర్లకు అవకాశం ఇస్తే పార్టీలో ఉన్నవారికి ఏదో ఒకసారి పదవులు వస్తాయనే విశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు అన్ని విధాలా లాభపడుతున్నా, ఇక్కడ మాత్రం సాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీవల్ల తమకు కలుగుతున్న ప్రయోజనం ఏమిటో అర్థంకావడంలేదని టీడీపీ నేతలు అంటున్నారు. -
టీఆర్ఎస్తో పొత్తుకు టీ-దేశం సందేశం!
-
టీఆర్ఎస్తో పొత్తుకు టీ-దేశం సందేశం!
-
టీఆర్ఎస్తో పొత్తుకు టీ-దేశం సందేశం!
- అధికార పార్టీతో చెలిమికి ఉవ్విళ్లూరుతున్న తమ్ముళ్లు - తెలంగాణలో పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు - రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్లు - మంత్రి తుమ్మల నేతృత్వంలో సీఎం కేసీఆర్‌తో భేటీ - సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, ఏపీ మంత్రి, ఓ మీడియా బాస్ - రమణ సహా నేతలెవరినీ టీఆర్ఎస్లో చేర్చుకోవద్దని విన్నపం - ఈ భేటీ తర్వాత టీడీపీ నుంచి ఆగిపోయిన వలసలు - దూకుడు తగ్గించిన రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకోనుందా..? తెలంగాణలో ఉప్పు–నిప్పులా ఉన్న టీఆర్ఎస్, టీడీపీ ఒకదానికొకటి సహకరించుకోనున్నాయా? రాష్ట్రంలో ఉనికి కోల్పోయి, వలసలతో చిక్కి శల్యమైన టీ–టీడీపీ.. పార్టీని కాపాడుకునేందుకు రాజకీయ చదరంగంపై ఎత్తులు వేయడం మొదలు పెట్టిందా..? అత్యంత విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం మేరకు ఆ మొదటి ఎత్తు టీడీపీ నుంచే వచ్చింది! తమ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన అధికార టీఆర్ఎస్తో దోస్తీకి స్నేహహస్తం అందించే ప్రతిపాదన చేసింది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. టీడీపీ తొందరపడి ఈ ప్రతిపాదన చేయడానికి పార్టీ నుంచి వలసలు నిరోధించడానికేనన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన ముగ్గురు మంత్రులు, ఓ మీడియా బాస్ ఇటీవల తెలంగాణ సీఎంతో సమావేశమైనట్లు తెలిసింది. మంత్రి తుమ్మల నేతృత్వం తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సీఎంతో సమావేశానికి చొరవ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఈ మంత్రి.. వచ్చే ఎన్నికల్లో తన జిల్లాలో టీఆర్ఎస్ విజయానికి టీడీపీతో పొత్తు అవసరమని భావిస్తున్నారు. తనను నమ్మి పార్టీలోకి వచ్చిన ఎంపీ ఒకాయన మళ్లీ గెలువాలంటే టీడీపీ మద్దతు అవసరమని ఆ మంత్రి భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌తో ఓ విందు సమావేశానికి ఒప్పించారు. ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ నేత, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న రాయలసీమకు చెందిన ఓ ఏపీ మంత్రితోపాటు ఓ మీడియా బాస్ కూడా హాజరయ్యారు. గతంలో తమకు కేసీఆర్‌తో ఉన్న స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వారు పొత్తు ప్రతిపాదన తీసుకొచ్చారు. టీడీపీ ఉనికి కోల్పోతే ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ చెల్లాచెదురవుతుందని, దీంతో కాంగ్రెస్‌కు లాభం చేకూరే అవకాశం ఉందని వారు విశ్లేషించారు. విందు సమావేశంలో టీడీపీ ప్రతిపాదనపై చర్చించిన సీఎం కేసీఆర్ తన వైఖరిని మాత్రం బయటపెట్టలేదు. ఆ ప్రతిపాదనకు కారణమిదీ.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో.. టీడీపీ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. రమణ పార్టీని వీడితే జిల్లాల్లో అనేక మంది టీఆర్ఎస్లో చేరతారని, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన టీడీపీ.. వలసలను నిరోధించడానికి అగమేఘాల మీద ఈ ప్రతిపాదనకు రూపకల్పన చేసింది. పొరుగు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్టీని కాపాడుకోలేకపోయామన్న భావన ప్రజలకు రాకుండా ఉండేందుకు ఈ ప్రతిపాదనను వాడుకోవాలని నిర్ణయించారు. కనీసం పది శాతం ఓట్లున్న టీడీపీ ఉనికి కోల్పోతే టీఆర్ఎస్కు నష్టం వాటిల్లుతుందన్న తమ అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమేరకు పరిగణనలోకి తీసుకున్నారని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని వెళ్తే బాగుంటుందని విందు సమావేశంలో పాల్గొన్న ఓ నేత అభిప్రాయపడగా.. ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడాల్సి ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పట్నుంచే పొత్తు ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే టీడీపీ నుంచే ప్రతిపాదన వచ్చిన నేపథ్యలో ఆ పార్టీ నుంచి వలసలు లేకుండా చేయగలిగారు. కొత్తగా ఆ పార్టీ నుంచి ఎవ్వరినీ టీఆర్ఎస్లో చేర్చుకోలేదు. దాంతోపాటే అవకాశం ఉన్న అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుతో కలుస్తూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం నిప్పు–ఉప్పుగా ఉన్న వీరిద్దరూ కలిసిన ప్రతిసారి అప్యాయంగా పలుకరించుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేకు భారీగా డబ్బులు ఆఫర్ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కేసు అంగుళం కూడా ముందుకు కదలకుండా చేయగలిగారు. ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమా? గడచిన రెండున్నరేళ్లలో టీడీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి ఉన్న ఒక్క ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు టీఆర్ఎస్కు క్యూ కట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రస్తుతం ముగ్గురు మాత్రమే మిగిలారు. ఏకంగా 12 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనమయ్యారు. శాసన మండలిలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడు మండలిలో టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అయినా టీడీపీ స్నేహహస్తం అందించడానికి ఓటుకు కోట్లు కేసే ప్రధాన కారణమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ కేసు లేకుంటే ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడేవారు కాదని, పార్టీ అగ్రనాయకత్వం సలహా మేరకే వారు టీఆర్ఎస్లో చేరారని దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఆ సీనియర్ నేత విశ్లేషించారు. అయితే రానురానూ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను మచ్చిక చేసుకుని వలసలను అరికట్టడానికి ఈ విందు సమావేశం దోహదపడింది. ఎర్రబెల్లితోనూ రహస్య భేటీ కొద్దిరోజుల కిందటే ఏపీ మంత్రి నారాయణ అధికారిక నివాసంలో టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి రహస్యంగా భేటీ ఆయ్యారని సమాచారం. ఈ భేటీ వివరాలేవీ బయటకు రాకున్నా... అదే రోజు రాత్రి ఎల్.రమణ, ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయినా చేరికలకు సంబంధించి ఎలాంటి పరిణామం చోటు చేసుకోకపోవడం గమనార్హం. చాలా నెలలుగా రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తంగా టీడీపీ నేతల ప్రతిపాదనపై సుదీర్ఘంగానే సమావేశం జరిగిందంటున్నారు. టీఆర్ఎస్తో యుద్ధం చేస్తామని చెపుతూ వచ్చిన తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఈ మధ్య దూకుడు తగ్గించారు. టీఆర్ఎస్తో పొత్తు విషయం తన సన్నిహితులు ప్రస్తావించినప్పుడు అదంతా ఆషామాషీ కాదని ఆయన కొట్టిపారేశారు. -
ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసు?
► రేవంత్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ► పార్టీ మారినప్పుడు ఎన్టీఆర్‌కు మొక్కి వెళ్లావా?: రేవంత్ సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మధ్య అసెంబ్లీ లాబీల్లో మంగళ వారం ఆసక్తికరమైన సంవాదం జరిగింది. లాబీల్లో ఎదురైన సందర్భంగా ఎన్టీఆర్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి నీకేం తెలుసని రేవంత్‌రెడ్డిని గోపీనాథ్ ప్రశ్నించారు. వారి మధ్య సంవాదం ఇలా.. రేవంత్: ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు. కనీసం ఆయనను దగ్గర నుంచి కూడా చూడలేదు. గోపీ: పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొత్త చాంబర్లోకి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వెళ్లావు. అభిమానముంటే ఎన్టీఆర్ ఘాట్ నుంచి వెళ్లేవాడివి కదా. రేవంత్: టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచావు. పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరేముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి మొక్కి వెళ్లావా? గోపీ: నేను నేరుగా అసెంబ్లీకే వచ్చాను. రేవంత్: పెద్దమ్మ గుడి నుంచి బయలుదేరినా ఎన్టీఆర్ భవన్ కే వెళ్లాను. గోపీ: ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లే పార్టీ మారారు. నాకు 8 నెలలపాటు గన్ మన్లను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్టించుకోలేదు. రేవంత్: అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటు, టీటీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాడు. టీఆర్ఎస్లో చేరిన నువ్వు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఎట్లా, నియోజక వర్గంలోని ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఉన్న టీడీపీ దిమ్మెకు గులాబీ రంగు పూయించావు. గోపీ: స్థానిక నేతలు రంగు మారిస్తే నేను బాధ్యుడినా? రేవంత్: ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే ఆ దిమ్మెను వదిలేసి, మరొకటి కట్టుకోవచ్చుకదా. ఈ సంవాదంపై ఆసక్తితో లాబీల్లోని వారంతా గుంపుగా చేరుతుండటంతో ఇద్దరూ తమ వాదనను ఆపివేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రైతు రుణమాఫీపై బీజేపీ వాయిదా తీర్మానం
హైదరాబాద్: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై టీటీడీపీ, రైతు రుణమాఫీపై బీజేపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాయిదా తీర్మానాన్ని ఇవ్వలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక స్వల్పకాలిక చర్చ కింద నయీమ్ అంశంపై చర్చించనున్నారు. ఈ మేరకు ఎజెండా ఖరారైంది. నయీమ్ అతడి అనుచరుల నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. -
టీడీపీ సభ్యత్వానికి కొరవడిన ఆదరణ
- టీటీడీపీ నేతల్లో ఆందోళన - పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ సాగని సభ్యత్వ నమోదు - నియోజకవర్గ నేతలపై ఒత్తిడి పెంచుతున్న పార్టీ ముఖ్యులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదరణ కొరవడటంపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 15 లక్షల మందితో సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లక్ష్యంలో మూడోవంతు అరుునా సాధ్యం అవుతుందా! అని ఆ పార్టీ నేతలే అనుమానపడుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికోసం ఇప్పటికే ఆయా జిల్లాలకు టీడీపీ, అధ్యక్షులను కూడా ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుని, నేతలకు బాధ్య తలను అప్పగించారు. అరుునా రాష్ట్రస్థారుులో సభ్యత్వ నమోదు ఆశాజనకంగా లేకపోవడం టీడీపీ ముఖ్యులను కలవర పరుస్తోంది. హైదరాబాద్‌లోనూ కష్టమే.. జనాభా ప్రకారం రాష్ట్రంలో పెద్ద జిల్లా అరుున హైదరాబాద్‌లో లక్ష మంది సభ్యత్వాన్ని నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఇప్పటిదాకా 10 వేలను కూడా దాటలేదు. టీడీపీకి పట్టున్నదని భావిస్తున్న నియోజక వర్గాల్లోనూ సభ్యత్వ నమోదు ముందుకు కదలడం లేదు. సికింద్రాబాద్, సనత్‌నగర్ వంటి నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతు న్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించారుు. హైదరా బాద్‌లో 15 అసెంబ్లీ నియోజక వర్గాలకుగాను ఒకలక్ష సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటిదాకా 10వేల మంది కూడా నమోదు కాలేదు. ఇదే పరిస్థితి మిగిలిన జిల్లాల్లోనూ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, పాత రంగారెడ్డి జిల్లాలోనూ టీడీపీకి కొంత పట్టు ఉన్నట్టుగా చెబుతున్న ప్రాంతాల్లోనూ సభ్యత్వ నమోదు తీరు వారికి నిరాశను కలిగిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా వలసలతో టీడీపీ పూర్తిగా దెబ్బతిన్నదని, హైదరాబాద్‌లో లక్ష మంది సభ్యత్వం సాధ్యం కాదని ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సభ్యత్వ నమోదు తీరును పరిశీలిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భవిష్యత్ కార్యా చరణపై దృష్టి సారించారు. పార్టీబలంగా ఉన్న నియోజక వర్గాల్లోైనైనా సభ్యత్వం పెంచుకోవాలని నేతలకు వారు సూచనలు ఇస్తున్నారు. పార్టీ బలంగా ఉందని చెప్పు కోవడానికి సభ్యత్వాలను పెంచా ల్సిందిగా వారు ఒత్తిడిని పెంచు తున్నారని సమాచారం. -
రైతులకు ఏం ఒరగబెట్టారని పాదయాత్ర?
టీటీడీపీపై మండిపడ్డ ఎమ్మెల్సీ కర్నె సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల ఉసురు పోసుకు న్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. టీడీపీ గ్యాంగ్.. పచ్చని పంటపొలాలను నాశనం చేసే మిడతల దండు అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నదాతల ఉసురు పోసుకున్న టీడీపీ నీచపు చరిత్ర ప్రజలింకా మరిచిపోలేదని, ఏమాత్రం సిగ్గూశరం లేకుండా ఆ పార్టీ నేతలు రైతు పోరు యాత్ర పేరుతో పగటి వేషాలు వేస్తున్నారని విమర్శించారు. -
ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తారా?: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నకిలీ విత్తనాలవల్ల నష్టపోయిన రైతాం గాన్ని ఆదుకోవాలని, ఆ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలపై పీడీ చట్టం కింద కేసులు పెట్టాలని కోరినందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తోందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీనేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఎన్ని కంపెనీలపై కేసులు పెట్టారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ బంధువులకు చెందిన కావేరి కంపెనీ సహా 8 నకిలీ విత్తన కంపెనీలకు నోటీసులిచ్చిన అధికారిణిని సెలవుపై పంపి, కొత్త అధికారిని నియమించడం దుర్మార్గమన్నారు. మిషన్ భగీరథ కింద తాగునీరు అందించినందుకు ప్రజలవద్ద డబ్బులు వసూలు చేసేలా రుణ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. -
ప్రజల జీవితంతో కేసీఆర్ చెలగాటం: రమణ
హైదరాబాద్: జిల్లాలు, మండలాల విభజన పేరిట కేసీఆర్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న కపట నాటకం ఇదన్నారు. నల్లగొండ జిల్లా గట్టుప్పలను మండలంగా ప్రకటించాలంటూ ఆత్మహత్యాయత్నం చేసి, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏర్పుల యాదయ్యను ఎల్.రమణతో పాటు పలువురు టీడీపీ నాయకులు శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నూతన జిల్లాలు, మండలాల విభజన సహేతుకంగా లేదని.. టీడీపీ ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేసిందని రమణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకుల్లో నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే జిల్లాలు, మండలాల విభజనలో సామాన్య ప్రజలు బలిపశువులు అవుతున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. -
రేవంత్‌రెడ్డిపై ఆరోపణలెందుకు?: టీటీడీపీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బాధ్యతను రేవంత్‌రెడ్డి గుర్తుచేస్తే పొంగులేటి సుధాకర్‌రెడ్డి భుజాలెందుకు సర్దుకుంటున్నారని టీటీడీపీ ప్రశ్నించింది. కాంట్రాక్టర్లను రేవంత్‌రెడ్డి బెదిరిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. శనివారం ఆ పార్టీ నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు కోవర్ట్‌గా, కాంగ్రెస్‌లో ఉంటూ హరీశ్ చెప్పింది పొంగులేటి చేస్తున్నారని ఆరోపించారు.